
రాజకీయాల్లో పతివ్రతలు ఎవరున్నారు ?
విజయవాడ: ఓటుకు నోటు వ్యవహారంపై టీడీపీ నాయకుడు జూపూడి ప్రభాకరరావు ఆదివారం విజయవాడలో విలేకర్లతో మాట్లాడుతూ... పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెడితే తప్పేంటని ప్రశ్నించారు.
రాజకీయాల్లో పతివ్రతలు ఎవరున్నారని అడిగారు. డబ్బు ఇవ్వకుండా ఎవరైనా ఎన్నికల్లో గెలిచారా ? అంటూ జూపూడి వితండవాదం చేశారు. అయితే ఎన్నికల్లో ఓటర్లును డబ్బుతో ప్రలోభపెట్టడాన్ని సమర్థిస్తారా ? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు జూపూడి నీళ్లునమిలారు.