
'బాబు ఛరిష్మాను దెబ్బ తీస్తున్న బీజేపీ'
విజయవాడ : భారతదేశంలో ఏ నాయకుడికీ లేని ఛరిష్మా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. ఆదివారం విజయవాడలో బుద్ధా వెంకన్న విలేకర్లతో మాట్లాడుతూ... అలాంటి నేత ఛరిష్మాకు దెబ్బతగిలేలా బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి లాంటి అవినీతిపరులను బీజేపీ చేర్చుకుందని విమర్శించారు. బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకోవాలని బుద్ధా వెంకన్న ఈ సందర్భంగా స్పష్టం చేశారు.