టీడీపీ ఎమ్మెల్సీ వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్య | man suicide in vuyyuru in krishna district | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్సీ వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్య

Published Sat, May 7 2016 3:37 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

టీడీపీ ఎమ్మెల్సీ వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్య - Sakshi

టీడీపీ ఎమ్మెల్సీ వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్య

విజయవాడ : టీడీపీ ఎమ్మెల్సీ యలమంచిలి బాబు రాజేంద్రప్రసాద్ వేధింపుల వల్లే వై.వెంకటరమణ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని అతడి బంధువులు ఆరోపించారు. శనివారం కృష్ణాజిల్లా ఉయ్యూరులో ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్పై చర్యలు తీసుకోవాలంటూ వారు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సంబంధం లేని విషయంలో రాజేంద్రప్రసాద్ గత మూడు రోజులుగా వెంకటరమణను వేధింపులకు గురి చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా వారు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి... వారిని శాంతింప చేసేందుకు ప్రయత్నస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement