Vuyyuru
-
ఫుల్లుగా గంజాయి కొట్టి ఆస్పత్రిపై టీడీపీ రౌడీల దాడి,
-
మరోసారి పోలీసుల అదుపులో ఉయ్యూరు లోకేష్
సాక్షి, కృష్ణాజిల్లా: గన్నవరం ఎయిర్‌పోర్టులో ఉయ్యూరు లోకేష్ బాబును మరోసారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల క్రితం ఎయిర్‌పోర్టులో ఉయ్యూరు లోకేష్ అనుమానాస్పదంగా తిరిగిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ పర్యటన ఎయిర్ పోర్ట్‌కు వస్తున్న సమయంలో ఆందోళన చేసేందుకు లోకేష్ ప్లాన్ చేయగా, తనిఖీల్లో భాగంగా సరైన టికెట్ లేకపోవడం, సరైన సమాధానం లేకపోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం 41ఏ నోటిస్ ఇచ్చిన శనివారం పంపించారు.తిరిగి ఆదివారం మరోసారి ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం ఎయిర్ పోర్టుకు లోకేష్ వచ్చాడు. ఎయిర్ పోర్ట్ అధికారుల తనిఖీల్లో లోకేష్ నుంచి శాటిలైట్ ఫోన్ బయటపడింది. దీంతో ఎయిర్‌పోర్టు అధికారులు గన్నవరం పోలీసులకు సమాచారం ఇవ్వగా, లోకేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా లోకేష్ శాటిలైట్ ఫోన్ వినియోగిస్తున్నాడు. తుళ్ళూరు మండలం వెంకటాయపాలెంకు చెందిన లోకేష్.. గతంలో అమెరికాలో డాక్టర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. లోకేష్‌ను గన్నవరం పోలీసులు విచారిస్తున్నారు.లోకేష్ గురించి షాకింగ్ నిజాలు..గన్నవరం ఎయిర్‌పోర్టులో అరెస్టయిన ఎన్ఆర్ఐ డాక్టర్ ఉయ్యూరు లోకేష్ గురించి విస్తుపోయే నిజాలను బయటపెట్టారు ప్రముఖ వైద్య నిపుణులు వాసుదేవరెడ్డి నలిపిరెడ్డి. తప్పుడు ఆరోపణలు, ఫిర్యాదులు చేయడం.. కోర్టు చేత చివాట్లు తినడం.. టీడీపీ సానుభూతిపరుడైన ఇతగాడి చరిత్ర.. రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలపై ఆధారాలు లేకుండా వేసిన తప్పుడు కేసులను వాషింగ్టన్ డీసీ కోర్టు కొట్టివేయడంతో పాటు లోకేష్‌కు ఫైన్ కూడా వేసిందని వాసుదేవారెడ్డి తెలిపారు. వైద్య వృత్తిలో నిర్లక్ష్యం కారణంగా గతంలో న్యూయార్క్, వర్జీనియా వంటి కొన్ని రాష్ట్రాలు.. లోకేష్ మెడికల్ లైసెన్స్ కూడా రద్దు చేశాయి.. లోకేష్ గురించి షాక్ అయ్యే నిజాలను పూర్తి వీడియోలో చూడొచ్చు. -
ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్లలో శిడిబండి వేడుక (ఫొటోలు)
-
భారీ కానుక ఇస్తామంటూ నిలువెత్తు నయవంచన
సాక్షి ప్రతినిధి, గుంటూరు: కానుకలంటూ ఆశ పెట్టి రప్పించిన అక్క చెల్లెమ్మల్లకు వెన్నుపోటు పొడిచారు.. రూ.300 నాసిరకం వస్తువులను రూ.వేల విలువైనవంటూ ఊరించారు.. చివరకు అవి కూడా ఇవ్వకుండా ఐదు గంటల పాటు నిర్బంధించారు.. ఆ మోసాన్ని భరించలేక కుప్పకూలిన మహిళల చావుకు చంద్రబాబు కారకుడయ్యారు! ప్రచార వ్యామోహం.. పేదల ప్రాణాలంటే లెక్కలేనితనం.. నిలువెత్తు నిర్లక్ష్యానికి మూడు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. గుంటూరులో ఆదివారం టీడీపీ నిర్వహించిన చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమం ఆద్యంతం ఆ పార్టీ కనుసన్నల్లోనే జరిగింది. సభ నిర్వహణకు పోలీస్‌శాఖకు దరఖాస్తు చేసుకోవటం నుంచి సంబంధిత చలాన్ల చెల్లింపు వరకు ఏర్పాట్లన్నీ టీడీపీ నేతలే స్వయంగా పర్యవేక్షించారు. ఉయ్యూరు ఫౌండేషన్ పేరుతో తెరచాటున వ్యవహారాలు నడిపించారు. చంద్రన్న కానుక పంపిణీలో పాల్గొనాలంటూ పది రోజులు ముందు నుంచే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. నిత్యం సభా ప్రాంగణాన్ని సందర్శిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ పిలుపునిచ్చారు. రెండు రోజుల ముందు ఇంటింటికి తిరిగి మహిళలకు కూపన్లు ఇవ్వడంతో పాటు ఆధార్ జిరాక్స్‌లు తీసుకున్నారు. రూ.మూడు వేల విలువైన కానుకలు అందచేస్తున్నామంటూ ఊరించారు. చివరకు తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయిన మరుక్షణమే అది ఓ ప్రైవేట్ కార్యక్రమమని, స్వచ్చంద సంస్థను ప్రోత్సహించేందుకు వెళ్లానని, తమ పార్టీకి దాంతో సంబంధం లేదంటూ స్వరం మార్చి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తన నిజ స్వరూపాన్ని మరోసారి చాటుకున్నారు. తాను స్వయంగా పాల్గొన్న కార్యక్రమంలో ముగ్గురు పేద మహిళలు మృత్యువాత పడితే కనీసం పరామర్శించేందుకు కూడా ఆయనకు మనసు రాలేదు. కందుకూరులో బాధితుల వద్దకు వెంటనే వెళ్లిన ఆయన గుంటూరులో మాత్రం చనిపోయింది పేద మహిళలు కావడంతోనే మొహం చాటేసి హైదరాబాద్ వెళ్లిపోయినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటన అనంతరం రాత్రి నుంచి పరారీలో ఉన్న ఉయ్యూరు ఫౌండేషన్ ఎండీ శ్రీనివాస్‌ను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ‘సంక్రాంతి కానుక’ ప్రస్తావన లేకుండా సభకు అనుమతి కోరుతూ టీడీపీ నేత శ్రావణ్‌కుమార్ రాసిన లేఖ దరఖాస్తులో కానరాని ‘‘కానుకలు’’ గుంటూరు ఓల్డ్ వికాస్ క్యాంపస్‌లో మాజీ సీఎం చంద్రబాబు పాల్గొన్న సభకు అనుమతుల కోసం టీడీపీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్ స్వయంగా గుంటూరు సౌత్ డీఎస్పీకి దరఖాస్తు చేసుకున్నారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకూ పది వేల మందితో సభ నిర్వహించుకుంటామని అందులో పేర్కొన్నారు. అయితే అందులో ఎక్కడా చంద్రన్న సంక్రాంతి కానుకలు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొనలేదు. అది కేవలం చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమం అయితే అన్నగారి జనతా వస్త్రాలు – చంద్రన్న సంక్రాంతి కానుక అని ఎందుకు పేరు పెట్టారు? సభ నిర్వహణ అనుమతుల కోసం టీడీపీ తరపున పోలీస్ శాఖకు ఎలా దరఖాస్తు చేశారు? పార్టీ కార్యక్రమంగా ఎందుకు మార్చారు? స్వచ్ఛంద సంస్థ కార్యక్రమానికి టీడీపీ నాయకులు జన సమీకరణ ఎందుకు చేశారని బాధితులు నిలదీస్తున్నారు. రాజకీయ పార్టీకి కొమ్ము కాసే ట్రస్టుల గుర్తింపును రద్దు చేయడంతోపాటు నిధుల సేకరణపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల సూచనలు బేఖాతర్.. ఇది పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమం కావడంతో అధికారులు పరిశీలించి పలు సూచనలు చేశారు. క్యాంపస్‌కు ఎంట్రన్స్, ఎగ్జిట్ ఒకే గేటు ఉండటంతో మూడు చోట్ల ప్రహరీ పగలగొట్టించి ద్వారాలు ఏర్పాటు చేయించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు బ్యారికేడ్లు ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తారు. వ్యక్తిగత కార్యక్రమానికి నిర్వాహకులే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. పోలీసులు వాటిని పరిశీలించి పలు సూచనలు చేసినా నిర్వాహకులు పట్టించుకోలేదు. మధ్నాహ్నం ఒంటి గంట నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల మహిళలను కానుకలు పంపిణీ చేస్తామంటూ వాహనాల్లో మీటింగ్ ప్రదేశానికి తరలించారు. రాగానే వాటిని అందచేస్తే తొక్కిసలాటకు అవకాశం ఉండేది కాదు. కానుకలు ఇస్తే మహిళలు వెళ్లిపోతారనే భయంతో చంద్రబాబు సభ ముగిసేవరకు సాయంత్రం ఆరు గంటల దాకా బలవంతంగా కూర్చోబెట్టారు. చంద్రబాబు సభ జరుగుతున్న సమయంలో పరిస్థితిని గమనించిన పోలీసులు వెంటనే కిట్ల పంపిణీ ప్రారంభించాలని వేదికపై ఉన్న నాయకులను ఫోన్లో కోరారు. ఓ ట్రాఫిక్ సీఐ వేదికమీదకు వెళ్లి మరీ పరిస్థితిని వివరించినా ఆలకించలేదు. బ్యారికేడ్లు సరిగా లేకపోవడంతో తొక్కిసలాటలో ఒరిగిపోయాయి. పోలీసులు సకాలంలో స్పందించి కానుకల పంపిణీని నిలిపివేసి తొక్కిసలాటలో చిక్కుకున్నవారిని కాపాడటంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. లేదంటే పదుల సంఖ్యలో మరణాలు ఉండేవని బాధితులు చెబుతున్నారు. 237 మందితో బందోబస్తు.. నూతన సంవత్సర వేడుకలతోపాటు మంగళగిరి, తెనాలిలో వైకుంఠద్వార దర్శనం బందోబస్తుకి పెద్ద సంఖ్యలో పోలీసులను సమకూర్చాల్సి వచ్చినా చంద్రబాబు సభకు ముగ్గురు డీఎస్పీల నేతృత్వంలో 207 మంది సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో పరిస్థితి గమనించి మరో 30 మంది సిబ్బందిని అదనంగా రప్పించారు. వీరంతా ఉండబట్టే పరిస్థితి వెంటనే అదుపులోకి వచ్చింది. ముందు జాగ్రత్తగా పోలీసులు రెండు అంబులెన్స్‌లను కూడా సిద్ధం చేశారు. ప్రైవేట్ కార్యక్రమం అయినప్పటికీ బాధ్యతగా వ్యవహరించారు. ప్రైవేట్ కార్యక్రమాల్లో బందోబస్తు కోసం పోలీసుశాఖకు యూజర్ చార్జీలను చెల్లించాలి. టీడీపీ నాయకులు ఆ పని చేయకపోగా పోలీసులపైనే ఆరోపణలు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీస పశ్చాత్తాపం కరువు చంద్రబాబు అరగంటకు పైగా మాట్లాడి నలుగురికి చంద్రన్న కానుక కిట్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన వెళ్లిపోయిన నిమిషాల వ్యవధిలోనే తొక్కిసలాట చోటుచేసుకుంది. ఆ సమయానికి చంద్రబాబు కాన్వాయ్ మంగళగిరి కూడా చేరుకోలేదు. కొందరు నేతలు ఈ విషాదం గురించి ఆయనకు సమాచారం ఇవ్వడంతో మీరే చూసుకోవాలని స్పష్టం చేసి విమానాశ్రయానికి వెళ్లిపోయినట్లు తెలిసింది. రాత్రి 7.02కి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న అయన 7.59 నిముషాలకు ఇండిగో విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. తాను పాల్గొన్న కార్యక్రమంలో ముగ్గురు మహిళలు చనిపోవడంతోపాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారనే విషయం తెలిసి కూడా కనీస మానవత్వం, పశ్చాత్తాపం లేకుండా చంద్రబాబు వెళ్లిపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. బాధిత కుటుంబాలను జీజీహెచ్‌లో స్థానిక నేతలు మినహా అధినాయకత్వం పరామర్శించిన పాపాన పోలేదు. పోలీసుల అదుపులో నిందితుడు గుంటూరు ఘటనలో తల్లిని కోల్పోయిన ఏటీ అగ్రహారం 4వ లైనుకు చెందిన గోపిదేశి నాగరాజు ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీసులు ఉయ్యూరు ఫౌండేషన్ ఎండీ శ్రీనివాసరావుపై 304 క్లాజ్ 2, 34 ఐపీసీ, సీఆర్పీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆదివారం రాత్రి నుంచి పరారీలో ఉన్న నిందితుడిని ఫోన్ సిగ్నల్స్, నెట్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తించారు. మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టిన సీసీఎస్ పోలీసులు సోమవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాబు కీలుబొమ్మ ‘ఉయ్యూరు’ తమకు అత్యంత సన్నిహితుడైన ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాస్ ద్వారా సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమాన్ని చంద్రబాబు, లోకేశ్ నిర్వహించారు. ఈ కార్యక్రమ నిర్వాహకుడిగా తెరపైకి తెచ్చిన ఉయ్యూరు శ్రీనివాస్ టీడీపీలో క్రియాశీల నేత. పార్టీ జెండా మోసిన నేతలను పక్కనబెట్టి విదేశాల నుంచి డబ్బు సూట్‌కేసులతో దిగే ఎన్నారైలను ఎన్నికల బరిలోకి దించాలని భావిస్తున్న చంద్రబాబు కొంతకాలంగా ఉయ్యూరు శ్రీనివాస్‌ను ప్రోత్సహిస్తున్నారు. గుంటూరు వెస్ట్, పొన్నూరు నియోజకవర్గాల్లో టికెట్ ఆశ చూపిస్తూ ఆయన ద్వారా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే కొత్త సంవత్సరం సందర్భంగా చంద్రబాబుకు మీడియాలో ప్రచారం కల్పించేందుకు గుంటూరులో తాజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సీఎం జగన్‌పై విద్వేషపూరిత పోస్టులు టీడీపీ తరపున సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఉయ్యూరు శ్రీనివాస్.. సీఎం జగన్, మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలపై విద్వేషపూరిత పోస్టులు పెడుతుంటాడు. లోకేశ్ ఆధ్వర్యంలో నడిచే టీడీపీ సోషల్ మీడియా విభాగం సూచనల మేరకు వర్గ విభేదాలు రెచ్చగొట్టేలా, ఘర్షణలను ప్రేరేపించేలా వ్యవహరిస్తుంటాడు. -
గుంటూరు తొక్కిసలాట ఘటనలో ఉయ్యూరు శ్రీనివాస్ అరెస్ట్
-
గుంటూరు తొక్కిసలాట ఘటన: ఉయ్యూరు శ్రీనివాస్ అరెస్ట్
సాక్షి, గుంటూరు: విజయవాడ ఏలూరు రోడ్లో ఉయ్యూరు శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే ఆయనపై కేసు నమోదు చేశారు. ఏ-1గా ఉన్న శ్రీనివాస్‌పై నల్లపాడు పీఎస్‌లో సెక్షన్లు 304, 174 కింద కేసులు నమోదయ్యాయి. ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వాహకుడు శ్రీనివాసరావుపై కూడా కేసు నమోదు చేశారు. కాగా, ఇటీవల నెల్లూరు జిల్లాలోని కందుకూరు ఘటన విషాదం మరువక ముందే మరో దారుణం జరిగింది. ఆదివారం గుంటూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట కారణంగా ముగ్గురు మహిళలు మృతిచెందారు. చంద్రన్న కానుకులు ఇస్తామంటూ టీడీపీ నేతల ప్రచారం కారణంగా సభకు పెద్ద ఎత్తున మహిళలను, వృద్ధులను టీడీపీ నేతలు తరలించారు. ఈ క్రమంలో కొందరికి మాత్రమే కానుకలు ఇచ్చి మిగతా వారిని అక్కడి నుంచి వెళ్లిపోమన్నారు టీడీపీ నేతలు. దీంతో, తమకు కూడా కానుకలు ఇవ్వాలని మహిళలు దూసుకొచ్చారు. జనం ఒక్కసారిగా దూసుకురావడంతో తోపులాట, తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఒక మహిళ ఘటనా స్థలంలో మృతి చెందగా. మరో ఇద్దరు ఆస్పత్రిలో మృతిచెందారు. చదవండి: పేద మహిళలంటే చంద్రబాబుకు చులకన.. వాసిరెడ్డి పద్మ ఫైర్ ఈ క్రమంలో సభ నిర్వాహకులు, చంద్రబాబుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, నాలుగు రోజుల క్రితమే జరిగిన కందుకూరులో చంద్రబాబు రోడ్ షో కారణంగా ఎనిమిది మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే న్యూ ఇయర్లో మొదటిరోజే ఇలా మరో దారుణం జరిగింది. దీంతో, చంద్రబాబు తీరుపై ప్రజలు మండిపడితున్నారు. -
పోలీసుల ఓవర్ యాక్షన్.. వ్యభిచార గృహంలో పేక ముక్కలు ఆడిస్తూ
సాక్షి, కృష్ణాజిల్లా : ఉయ్యూరు పోలీసుల ఓవర్ యాక్షన్ చూపించారు. ఆకునూరులో వ్యభిచారం నడుపుతున్నట్టు సమాచారం రావడంతో ఉయ్యూరు రూరల్ పోలీసులు పోలీసులు తనిఖీలు చేపట్టారు. పోలీసుల దాడిలో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళతో పాటు ఒక విటుడిని, ముగ్గురు యువతుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో వ్యభిచార గృహంలో దర్జాగా కూర్చోని చేత్తో పేక ముక్కలు ఆడిస్తూ యువతులను పోలీసులు బెదిరించారు. దుస్తులు మార్చుకొని వస్తారా, లేక ఇలానే కొట్టుకుంటూ తీసుకెళ్లలా అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉయ్యూరు పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే బెదిరింపులకు పాల్పడటంపై మండిపడుతున్నారు. నిందితులు, నేరస్థుల విషయంలోనూ బాధ్యతగా మెలగాల్సిన పోలీసులు ఇలా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. చదవండి: ఏపీఏటీ సిబ్బందిని మరోచోటుకు పంపడమేంటి? -
బాలికలతో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన
సాక్షి, కృష్ణా: విద్యార్థినులకు తండ్రి స్థానంలో ఉండి విద్యాబుద్ధులు నేర్పి సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడే లెక్క తప్పాడు. పాఠాలు బోధించే నెపంతో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఉయ్యూరు మండలం పెద ఓగిరాల జెడ్పీ పాఠశాలలో సాయిబాబు గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉయ్యూరులో నివాసం ఉంటారు. 9, 10 తరగతులకు గణితం బోధిస్తారు. పాఠాలు బోధించే క్రమంలో విద్యార్థినులతో ప్రేమగా ఉన్నట్లు నటిస్తూ తాకరాని ప్రదేశాల్లో చేతులు వేస్తున్నారు. రోజూ ఇలాగే ప్రవర్తిస్తుండటంతో భరించలేక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. సోమవారం సాయంత్రం పాఠశాలకు చేరుకున్న తల్లిదండ్రులు హెచ్ఎం సుధారాణికి ఫిర్యాదు చేసి ఘటనపై నిలదీశారు. హెచ్ఎం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ క్రమంలో ఉపాధ్యాయుడు ఉడాయించటంతో దీనిపై తల్లిదండ్రులు ఉయ్యూరు రూరల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనపై మంగళవారం కేసు నమోదు చేసిన పోలీసులు సదరు ఉపాధ్యాయుడుపై అసభ్యకర ప్రవర్తన, పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. హెచ్ఎం పైనా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ఆందోళన చేశారు. ఎంఈఓ కనకమహాలక్ష్మి, రూరల్ ఎస్ఐ రమేష్ పాఠశాలకు వచ్చి విచారణ చేపట్టారు. సమగ్ర విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఎంఈఓ కనకమహాలక్ష్మి తెలిపారు. ఉపాధ్యాయుడు సాయి బాబును సస్పెండ్ చేస్తూ డీఈఓ తాహెరా సుల్తానా మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. -
వైభవం... వీరమ్మతల్లి తిరునాళ్ల సంబరం
-
పాతకక్షలు.. ఆస్పత్రిలో హత్య!
ఉయ్యూరు(పెనమలూరు): ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కృష్ణాజిల్లా ఉయ్యూరులో మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే... కొండపల్లికి చెందిన మొగిలి ప్రభాకర్‌రావు (42) కంటికి శస్త్రచికిత్స చేయించుకునేందుకు సోమవారం ఉయ్యూరులోని రోటరీ నేత్ర వైద్యశాలకు వచ్చారు. మంగళవారం ప్రభాకర్‌రావుకు శస్త్ర చికిత్స చేసి వార్డుకు తరలించారు. ప్రభాకర్‌రావు వార్డులో విశ్రాంతి తీసుకుంటుండగా అతని భార్య పార్వతి, తల్లి సామ్రాజ్యం మందులు తేవడానికి బయటకు వెళ్లారు. ఆ సమయంలో ఓ వ్యక్తి ఆస్పత్రి వార్డులోకి ప్రవేశించి విశ్రాంతి తీసుకుంటున్న ప్రభాకర్‌రావు శరీరంపై పలుచోట్ల కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. అనంతరం పారిపోయే ప్రయత్నం చేయగా వార్డులో ఉన్న రోగులు, వారి బంధువులు అప్రమత్తమై నిందితుడిని పట్టుకున్నారు. సీఐ నాగప్రసాద్, ఎస్ఐ షబ్బీర్ అహ్మద్ ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర గాయాలపాలైన ప్రభాకర్‌రావును వైద్యం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి 108లో తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. హత్యకు పాతకక్షలే కారణమని, నిందితుడు కూడా హతుడి స్వగ్రామానికి చెందిన రమేష్ అని పోలీసులు భావిస్తున్నారు. -
టీవీఎస్ షోరూం డీలర్ ఇంట్లో చోరీ
సాక్షి, కృష్ణా: జిల్లాలో భారీ చోరీ జరిగింది. ఉయ్యూరు పట్టణంలోని టీవీఎస్ షోరూం డీలర్ నివాసంలో గుర్తు తెలియని దుండగులు మంగళవారం దొంగతనానికి పాల్పడ్డారు. నేడు ఉదయం దుకాణం తెరవడానికి వచ్చిన వ్యక్తి చోరీ జరిగినట్లుగా గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. విజయవాడ అడ్మిన్ డీసీపీ హరికృష్ణ, ఈస్ట్ జోన్ ఏసీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా షాపు యజమాని శబరిమల వెళ్లాడని, ఈ విషయం తెలిసిన వాళ్లే పక్కాగా దొంగతనానికి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
భిక్షమేయని పాపానికి యాచకుడి రాక్షసత్వం
సాక్షి, ఉయ్యూరు (కృష్ణా): భిక్షమేయని పాపానికి ఓ యాచకుడు అతి కిరాతకంగా వ్యవహరించి ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చిన ఘటన ఉయ్యూరు పట్టణంలో సంచలనమైంది. టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉయ్యూరులోని కూనపరెడ్డినగర్కు చెందిన చిలకా కొండబాబు (50), అతని భార్యతో కలిసి బస్టాండ్ ఆవరణలోని రైతు బజారులో పండ్లు అమ్ముకుని జీవనం సాగిస్తాడు. అదే రైతు బజారు, బస్టాండ్ ప్రాంతంలో పట్టణ శివారు నాగన్నగూడెంకు చెందిన గుంజా అశోక్‌బాబు యాచన చేస్తూ జీవనం సాగిస్తాడు. భోజన సమయంలో మంగళవారం మధ్యాహ్నం భార్యను బండి వద్ద ఉంచి కొండబాబు భోజనం చేసి కొద్ది సేపు విశ్రాంతి తీసుకునేందుకు బస్టాండ్‌లోని ఫ్యాను కిందకు వెళ్లి నేలపై సేద తీరుతున్నాడు. రైతు బజారులో యాచన చేస్తూ అదే క్రమంలో బస్టాండ్‌లోకి వెళ్లి కొండబాబును ఓ ఐదో, పదో ఇవ్వమని అడిగాడు. ఇరువురూ అక్కడే కొంత కాలంగా పరిచయస్థులు కావడంతో నా దగ్గర లేవు, ఎక్కడైనా వెళ్లి తీసుకో.. అని కొండబాబు బదులిచ్చాడు. బస్టాండ్‌లో ప్రయాణికుల వద్దకు వెళ్లినా ఎవ్వరూ ఇవ్వకపోవడంతో తిరిగి మళ్లీ కొండబాబు దగ్గరకే వచ్చి బిచ్చమడిగాడు. దీంతో కొండబాబు ‘ఏవయ్యా, నా దగ్గర లేవన్నానా, అడుక్కోకపోతే పని చేసుకోవచ్చు కదా, నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నావ్’’ అని అనడంతో ఇరువురి మధ్య వాదోపవాదాలు పెరిగాయి. దీంతో కోపోద్రిక్తుడైన అశోక్‌బాబు ఒక్కసారిగా కొండబాబు మెడ పట్టుకుని ఉరిమి చేతులతో దాడి చేసి బలంగా బాదడంతో నోటి నుంచి రక్తం కక్కుకుని అక్కడికక్కడే క్షతగాత్రుడు కన్నుమూశాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ గురుప్రకాష్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. చోద్యం చూస్తూ.. పట్టపగలు తమ కళ్ల ముందే అకారణంగా ఓ వ్యక్తి మరొకరిపై దాడి చేసి కొట్టి చంపుతుంటే చుట్టుపక్కల ఉన్నవాళ్లు ఏమీ పట్టనట్లు వ్యవహరించడం చర్చనీయాంశమైంది. బస్టాండ్‌లో జనం ముందే కొట్టి చంపుతుంటే కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయకపోగా చోద్యం చూడటంపై పోలీసులు నివ్వెరపోయారు. -
ఎమ్మెల్యే కల్పనకు చేదు అనుభవం..
ఉయ్యూరు (పెనమలూరు) : కలాసమాలపల్లిలో చోటు చేసుకున్న ఘర్షణ ఉయ్యూరులో ఉద్రిక్తతకు దారి తీసింది. బాధితులను పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనపై మహిళలతో పాటు ఆ గ్రామస్తులు ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. బాధితులకు న్యాయం కోసం పేదల పక్షాన వైఎస్సార్ సీపీ పామర్రు నియోజకవర్గ ఇన్చార్జి రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. దీంతో ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వివరాలిలా ఉన్నాయి. తోట్లవల్లూరు మండలంలోని కలాసమాలపల్లిలో సొసైటీ భూముల వివాదంపై దళితుల్లోని ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు రెండు వర్గాలుగా చీలి బుధవారం తెల్లవారుజామున కర్రలతో దాడులకు తెగబడ్డారు. క్షతగాత్రులను పోలీసులు ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇరువర్గాలకు చెందిన క్షతగాత్రులు ఒకేచోట ఉండటంతో పెద్ద ఎత్తున జనం చేరుకుని వాదోపవాదాలకు దిగారు. దీంతో కొంత మందిని పోలీసులు విజయవాడ తరలించారు. ఈ క్రమంలో బాధితులను పరామర్శించేందుకు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కైలే అనీల్‌కుమార్ ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం చేసి శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే కల్పనకు చేదు అనుభవం.. బాధితులను పరామర్శించేందుకు ఆస్పత్రికి వచ్చిన ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనకు ఆ గ్రామస్తుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. మీకు న్యాయం చేస్తానంటూ ఎమ్మెల్యే మహిళలతో అంటుండగానే నీ న్యాయం మాకక్కర్లేదు.. ఇక్కడి నుంచి వెళ్లిపో.. అంటూ రెండు చేతులూ జోడించి నిరసన తెలిపారు. కులం పేరుతో దూషించిన టీడీపీ నాయకుడు మురళీని వెనకేసుకొచ్చి తమను అణగతొక్కాలని చూశారంటూ ఎమ్మెల్యేను నిందించారు. న్యాయం చేయాలని పోలీసులను ఆదేశించానని ఎమ్మెల్యే చెప్పి వెళ్లిపోయారు. రోడ్డుపై రాస్తారోకో.. తోట్లవల్లూరు మండలం టీడీపీ రైతు విభాగం అధ్యక్షుడు నెక్కలపూడి మురళి ఆస్పత్రిలో ఓవరాక్షన్ దళితుల ఆగ్రహావేశానికి కారణమైంది. తమను కించపరిచేలా మురళి వ్యాఖ్యలు చేశాడంటూ దళితులు ఆందోళనకు ఉపక్రమించారు. ఎమ్మెల్యే కల్పనను, టీడీపీ శ్రేణులను నిలదీసి మురళిపై కేసు నమోదు చేయాలని పట్టుబట్టారు. ఆస్పత్రి ఎదురుగా రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. దళితులకు అండగా వైఎస్సార్ సీపీ నేత అనీల్‌కుమార్ ఆందోళనలో పాల్గొన్నారు. ఈస్ట్ ఏసీపీ విజయభాస్కర్, సీఐ సత్యానందం ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అనీల్‌కుమార్ మాట్లాడుతూ పల్లె వాతావరణాన్ని టీడీపీ పూర్తిగా కలుషితం చేస్తోందని ఆరోపించారు. కులాల మధ్య ఎమ్మెల్యే కల్పన చిచ్చుపెట్టి రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించాల్సిన బాధ్యతను ఎమ్మెల్యే విస్మరించడంతో కలాసమాలపల్లిలో మాలలు భౌతిక దాడులకు దిగారన్నారు. కేసులు లేకుండా అన్యాయం జరిగిన వారికి న్యాయం చేయాలనేదే తన ఉద్దేశ్యమన్నారు. ఆందోళనలో వైఎస్సార్ సీపీ తోట్లవల్లూరు, పామర్రు మండలాల అధ్యక్షులు జొన్నల మోహన్‌రెడ్డి, కాకర్ల వెంకటేశ్వరరావు, నాయకులు మారపాక మహేష్, యార్లగడ్డ శివయ్య, మర్రెడి శేషిరెడ్డి, ఇంతియాజ్ బాషా పాల్గొన్నారు. -
ఉయ్యూరులో మరో కాల్నాగు
ఉయ్యూరు : కాల్ మనీ బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కాల్ నాగుల దందాలకు రెక్కాడితే కానీ డొక్కాడని పేదలు బలైపోయి రక్షణ కోరుతూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అప్పు తీర్చాక కూడా ఖాళీ నోట్లు, చెక్కులు, డాక్యుమెంట్లు ఇవ్వకుండా వేరే వ్యక్తుల పేరుతో లక్షల్లో బాకీ ఉన్నారంటూ కేసులు వేయడంతో దళిత, మైనార్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన బాధితులు ఉయ్యూరులో పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగి ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని వేడుకున్నారు. టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన.. పట్టణంలోని రాజేంద్రనగర్, దళితవాడకు చెందిన దాదాపు 90 మంది బాధితులు కాల్‌మనీలో చిక్కుకున్నారు. అల్లిబిల్లి చిన అప్పలనాయుడు అధిక వడ్డీలు వసూలు చేసి తమను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసి కోర్టులో కేసులు వేసి ఉన్న ఇళ్లను కూడా లాక్కుంటున్నాడని గంటా జోజెమ్మ, ఓరుగంటి జాష్వా, కన్నెబోయిన వీరమ్మ, నాగమల్లి వెంకటపద్మ, మహ్మద్ హసీనా, బుద్దుల మేరిమ్మ, ఉల్లి జోగేశ్వరరావు, జుజ్జవరపు తిరుమలరావు, అసిలేటి నాగరాజ్యం, కన్నెబోయిన నాగరాజు విజయవాడ నగర పోలీసులకు దళిత దండు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రాచేటి రూతుమ్మ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఆ వడ్డీ వ్యాపారి ఆగడాలు పెచ్చుమీరడంతో బాధితులందరూ ఆదివారం దళిత దండు ఆధ్వర్యంలో ఉయ్యూరు టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలియజేశారు. పోలీసులకు ఫిర్యాదు అందించి న్యాయం చేయాలని వేడుకున్నారు. నూటికి రూ.10 వడ్డీ.. తాము తీసుకున్న అప్పుకు నూటికి రూ.10 చొప్పున వడ్డీ వసూలు చేసి ఇంకా పీడించుకుని బెదిరిస్తున్నాడని బాధితులు మీడియా ఎదుట ఆవేదన వెల్లిబుచ్చారు. అప్పు మొత్తం వడ్డీతో సహా చెల్లించినా ఖాళీ నోట్లు, చెక్కులు, ఇతర పత్రాలు ఇవ్వకుండా వేరే వ్యక్తుల పేరుతో కేసులు వేసి ఉన్న ఇళ్లను కూడా లాక్కునేందుకు సిద్ధమవుతున్నాడని ఆవేదన చెందారు. అల్లిబిల్లి చిన్నాను గట్టిగా నిలదీస్తే చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడన్నారు. పోలీసులంతా తన చేతుల్లోనే ఉన్నారంటూ, మీకు దిక్కెవరంటూ ఎదురు దాడికి దిగబట్టే తాము రోడ్డెక్కాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యారు. లక్షకు రూ.4 లక్షలు కట్టా.. నాలుగేళ్ల క్రితం అల్లిబిల్లి చినఅప్పలనాయుడు దగ్గర రూ.లక్ష అప్పు తీసుకున్నా. ఇప్పటి వరకు అసలుతో కలిపి రూ.4 లక్షలు చెల్లించా. మొత్తం రూ.10 వడ్డీనే. అప్పు ఇచ్చేటప్పుడు రెండు ఖాళీ నోట్లు, రెండు ఖాళీ చెక్కులు, మా ఇంటి బీ–ఫార్మ్ పట్టా, రూ.100 స్టాంప్ పేపర్‌ను తీసుకున్నాడు. మొత్తం అప్పు కట్టాక పత్రాలు అడిగా. ఇంకా రూ.1.50 లక్షలు కడితేనే ఇస్తానన్నాడు. అదేమిటని ప్రశ్నిస్తే రూ.8 లక్షలకు కోర్టులో కేసు వేసి అరెస్టు వారెంట్ పంపాడు. ఈ అన్యాయంపై పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదు. ఇల్లు లాక్కుంటానని బెదిరిస్తున్నాడు. న్యాయం జరగకపోతే భార్యా, పిల్లలతో కలిసి ఆత్మహత్యే శరణ్యం.– నాగుమల్లి వినయ్‌కుమార్ రూ.65 వేలకు రూ.9.50 లక్షలు.. మేము రూ.65 వేలు అప్పు తీసుకున్నాం. మొదట నెలకు నూటికి రూ.10 వడ్డీ అన్నాడు. కాలం గడిచాక వారానికి నూటికి రూ.10 వడ్డీ చొప్పున వసూలు చేశాడు. గట్టిగా మాట్లాడితే ఖాళీ నోట్లు, చెక్కులు, పత్రాలు చూపి బెదిరిస్తున్నాడు. బాధను ఓర్చుకుంటూ రెక్కలు ముక్కలు చేసి కష్టపడి వడ్డీతో కలిపి రూ.65 వేలకు రూ.2.76 లక్షలు కట్టా. ఇంటికి వెళ్లి మా కాగితాలు అడిగా. మా ఆయనకు యాక్సిడెంట్ అయ్యింది, వచ్చాక ఇస్తామని చిన్నా భార్య చెప్పింది. ఇంకా రూ.20 వేలు కడితే సరిపోద్దన్నారు. తీరా డబ్బులు తీసుకెళ్తే మొత్తం రూ.9.50 లక్షలు బాకీ ఉందన్నారు. ఒక్కసారిగా కుప్పకూలిపోయా. షాక్‌ను తట్టుకోకపోవడంతో నన్ను ఆస్పత్రిలో కూడా పెట్టారు. భర్త లేడనే కనికరం కూడా లేకుండా రూ.9.50 లక్షలకు నోటీస్ ఇచ్చాడు. ఇక మాకు చావే కనిపిస్తుంది.– మహ్మద్ హసీనా చట్ట ప్రకారం చర్య తీసుకోవచ్చు.. అధిక వడ్డీ బారిన పడిన వారిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. బాధితుడు ఎక్కువ వడ్డీకి తీసుకుని బెదిరింపులకు గురై భయంతో నష్టపోయిన అంశాన్ని పోలీసులు పరిగణనలోకి తీసుకోవచ్చు. గతంలో పోలీసులే కాల్‌మనీ కేసులు నమోదు చేశారు. అధిక వడ్డీ విషయంలో ఐపీసీ 384 నుంచి 389 వరకు ఫిర్యాదును బట్టి కేసులు నమోదు చేసి విచారించే రైట్ పోలీసులకు ఉంది. బాధితుడిని భయపెట్టో, బెదిరించో దౌర్జన్యంగా ఆస్తులు లాక్కున్నప్పుడు ఆ మేరకు ఫిర్యాదు ఇస్తే పోలీసులు ఆ కోణంలో విచారించాల్సిన అవసరం ఉంది. ఆ వ్యాపారి ఇంటికి వెళ్లి అన్ని పత్రాలు స్వాధీనం చేసుకుని పరిశీలించి చర్యలు తీసుకోవాలి. గతంలో కమిషనరేట్ పరిధిలో ప్రత్యేకంగా సెల్ పెట్టి కాల్‌మనీ కేసులు నమోదు చేశారు. ఇప్పుడు కూడా అలా చేసి బాధితులను రక్షించాలి.– టీ చంటిబాబు, న్యాయవాది -
420 దీక్షలో అంతా పెయిడ్ ఆర్టిస్టులే..
-
హోదాను ఖూనీ చేసి మళ్లీ నాటకాలా?: వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: హోదాను ఖూనీ చేసిన చంద్రబాబు నాయుడు.. ఇంకా నాటకాలు ఆడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం సాయంత్రం కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చేరుకున్న వైఎస్ జగన్.. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిచారు. నాలుగేళ్ల పాలనలో అన్నీ వర్గాల ప్రజలను దగా చేసిన చంద్రబాబు.. హోదా విషయంలో చేసిన మోసం మరిచిపోలేనిదని జగన్ పేర్కొన్నారు. ‘పురాణాల్లో రావణాసురుడు, బకాసురులు ఉంటే.. ఉయ్యూరులో మాత్రం ఇసకాసరులు ఉన్నారని రైతులు చెబుతున్నారు. లక్షల టన్నుల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అవినీతిని చంద్రబాబు దగ్గరుండి మరీ ప్రొత్సహిస్తున్నారు. కలెక్టర్ల దగ్గరి నుంచి చినబాబు.. చినబాబు నుంచి పెదబాబు... ఇలా అందరికీ వాటాలు దక్కుతున్నాయి. పేదప్రజల మీద అవినీతి చేసే ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. వైఎస్సాఆర్ ఇచ్చిన ఇళ్ల స్థలాలను బలవంతంగా లాక్కుంటున్నారని ప్రజలు వాపోతున్నారు. రూ. 3 లక్షల విలువ చేసే ఫ్లాట్లను.. రూ. 6లక్షలకు ప్రభుత్వం అమ్ముకుంటోంది. లంచాలు తీసుకునేది చంద్రబాబు.. డబ్బులు కట్టాల్సింది పేదవాడా?’ అని వైఎస్ జగన్ ఆక్షేపించారు. రైతన్నల ఆవేదన... యూపీలో చెరుకు టన్నుకు రూ. 3500 చెల్లిస్తున్నారు. కానీ, ఏపీలో రూ.2750 మాత్రమే ఇస్తున్నారు. మినుములు కనీసం రూ. 4 వేలకు కూడా కొనే నాథుడు లేడు. పసుపుకు క్వింటాల్‌కు రూ. 16 వేలు పలికేది. ఇప్పుడు రూ. 5రూ. కూడా పలకటం లేదు. ఏ ఒక్క పంటకు కూడా గిట్టు బాటు రావటం లేదని రైతులు వాపోతున్నారు. వైఎస్సార్ హయాంలో అన్ని పంటలకు గిట్టుబాటు ధర లభించేంది. కానీ, ఈ టీడీపీ ప్రభుత్వం ఎరువుల ధరలను పెంచి రైతుల నడ్డి విరుస్తోంది. రుణాలన్నీ మాఫీ అయిపోయానని ఎల్లో మీడియాలో వార్తలు రాయించుకుంటున్నారు. చంద్రబాబు పాలనలో మహిళలు కన్నీరు పెడుతున్నారు. నాలుగేళ్లుగా కనబడని ప్రజలు ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు గుర్తుకొస్తున్నారు. ఎల్లో మీడియాకు అవి కనపడవు... చంద్రబాబు ముఖం చూసి రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంట. 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయంట. మరి అలాంటి పరిస్థితులు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? దారుణమైన అబద్ధాలు.. మోసాలు. విదేశీ ప్రయాణాల కోసం ప్రైవేట్ జెట్ విమానాలు.. కోట్ల ఖర్చులు. పెద్ద పెద్ద కంపెనీలు వచ్చేస్తున్నాయంటూ ఎల్లో మీడియాలో కథనాలు ఇప్పిస్తారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం విదేశాలకు వెళ్తున్నా అంటారు. కానీ, అది నల్లధనం దాచుకోడానికి. విజయవాడలో గవర్నర్-చంద్రబాబు గంట 40 నిమిషాలు మాట్లాడారు. కేంద్రంతో మీరేం పోరాడతారని గవర్నర్.. చంద్రబాబుతో చెప్పినట్లు ఆ ఎల్లో మీడియాలో కథనాలు వచ్చాయి. మరి అదే గవర్నర్ దగ్గరికి సుజనా చౌదరిని చంద్రబాబు పంపించటం ఎల్లో మీడియాకు కనపడలేదా? ఐబీ చీఫ్ విజయవాడ వెళ్లి మరీ చంద్రబాబును కలుస్తారు. మరి ఆ వార్తను ఎల్లో మీడియా ఎందుకు గోప్యంగా ఉంచింది?.. 420 దీక్షలో అంతా పెయిడ్ ఆర్టిస్టులే.. ‘ఓ సిపాయి తుపాకీ చంకన పెట్టకుని యుద్ధానికి పోతాడు. యుద్ధం ఉధృతంగా సాగుతున్న సమయంలో శత్రువుకు ఆ సిపాయి తుపాకీ పేల్చటానికి ట్రిగ్గర్ నొక్కుతాడు. బుల్లెటు బయటకు రాలేదు. కారణం.. ఆ బుల్లెట్ నకిలీది కాబట్టి. టీడీపీ ఎంపీలతో చంద్రబాబు చేయించిన డ్రామా కూడా నకిలీదే. పార్లమెంట్ సమావేశాల చివరి రోజున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మొత్తంగా రాజీనామా చేసి ఆమరణ దీక్షకు కూర్చున్నారు. కానీ, టీడీపీ ఎంపీలతో చంద్రబాబు రాజీనామా చేయించి ఉంటే కేంద్రం ఖచ్ఛితంగా దిగొచ్చేది. చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు మళ్లీ డ్రామాలు. ఆయన పుట్టిన రోజున 420 దీక్షకు దిగారు. దీక్షలో ఎన్టీఆర్ డూప్ చంద్రబాబుకు ఆశీర్వాదం ఇచ్చాడు. దీక్షలో అంతా పెయిడ్ ఆర్టిస్టులే. రూ. 30 కోట్ల ప్రజాధనాన్ని ఒక్క పూట దీక్ష కోసం చంద్రబాబు నాశనం చేశాడు. మోసంలో నీకు భాగం లేదా?.. హోదా విషయంలో బీజేపీ మోసం చేసిందని ఈ నెల 30న తిరుపతిలో సమావేశం పెడతారంట. మరి ఆ మోసంలో చంద్రబాబు భాగస్వామ్యం కాదా? అని జగన్ నిలదీశారు. హోదా రాకుండా చేసిన వ్యక్తే.. ఇప్పుడు మళ్లీ నాటకాలు ఆడుతున్నారు. మూలవిరాట్ మోదీ కాళ్లు దొరకలేదు. కాబట్టి ఉత్సవవిగ్రహం గవర్నర్ కాళ్లు గట్టిగా పట్టుకుంటున్నారు. ఓవైపు బీజేపీతో కటీఫ్ అంటూనే... మరోవైపు మహారాష్ట్ర బీజేపీ నేత భార్యను టీటీడీ మెంబర్‌ను చేశారు. నాలుగు సంవత్సరాలుగా ఆయన ఆడుతున్న డ్రామాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రజలు గమనిస్తున్నారు. కాళ్లు పట్టుకోవడం.. కాకా పట్టడమంటే ఇది కాదా బాబూ?. హోదా కోసం పోరాటం అంటూ ఫోజులే తప్ప ఫలితం లేదు. ఢిల్లీకి పోతారు. ప్రత్యేక హోదా కోసం అని బిల్డప్ ఇచ్చారు. ఇక్కడ ఎల్లో మీడియా చంద్రబాబు చక్రం తిప్పుతున్నారంటూ విపరీతంగా చూపించాయి. కానీ, ఆయన మాత్రం ఏపీ భవన్లో రాత్రిపూట అమర్‌సింగ్‌ను కలుస్తారు. అగ్రిగోల్డ్ ఆస్తుల కోసం బ్రోకరిజం చేస్తారు. ఎల్లో మీడియల్లో అవేం రావు. చేఏసింది వాళ్ల మనుషులు కాబ్టటే. (నమాజ్ జరుగుతుండటంతో జగన్ కాసేపు ప్రసంగం ఆపేశారు) ... టీడీపీ పెద్దలు అగ్రిగోల్డ్ ఆస్తులను యథేచ్ఛగా కాజేశారు. చంద్రబాబు పాలన మొత్తం అబద్ధాలు, అవినీతి మయం. ఎన్నికలు వస్తుండటంతో ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టేందుకు అన్నిరకాలుగా యత్నిస్తున్నారు. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకోండి. ఓటు మాత్రం మనస్సాక్షి చెప్పిన విధంగానే వేయండి. మోసాలు, అబద్ధాలు చేసే వారిని బంగాళాఖాతంలో కలిపేయండి. రాజకీయ నాయకుడు ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే.. రాజీనామా చేసి ఇంటికి పోయే వ్యవస్థ రావాలి. అప్పుడే రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది. పిల్లల చదువుల కోసం... ప్రతీ ఒక్కరి ముఖంలో చిరునవ్వు చూడాలని నవరత్నాలు ప్రకటించాం. అందులో ఈ రోజు పేద పిల్లల చదువుల కోసం ప్రజా ప్రభుత్వం ఏం చేయబోతుందో చెప్పుకుందాం. తల్లిదండ్రులు పిల్లల్ని పెద్ద చదువులు చదివించుకోలేని పరిస్థితి నెలకొంది. ఇంజనీరింగో, మెడిసినో చదవాలంటే లక్షల ఫీజు కట్టాలి. చంద్రబాబు రూ.30 వేలిచ్చి సరిపెడుతున్నారు. అదే మన ప్రభుత్వం వస్తే పిల్లల చదువులకు అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. విద్యార్థులు హాస్టళ్లలో ఉండటానికి వీలుగా మెస్‌చార్జి కింద ఏటా రూ.20 వేలు చెల్లిస్తాం. అప్పులబారినపడి ఏ తల్లిదండ్రీ పిల్లల్ని స్కూలుకు పంపించని పరిస్థితి రావద్దు. అందుకే పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లికి నెల నెలా రూ.15 వేలు అందిస్తాం. అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా మీ పిల్లల్ని చదవిస్తా’ అని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. నవరత్నాలను మరింత మెరుగ్గా అమలు చేసేందుకు సలహాలు, సూచనలు ఇవ్వండని ఆయన ప్రజలను కోరారు. దివంగత నేత వైఎస్సార్ కలలు గన్న గొప్ప రాజ్యాన్ని తీసుకొస్తానని చెబుతూ ప్రజల ఆశీర్వాదం కోరుతూ వైఎస్ జగన్ ముందుకు కదిలారు. -
ప్రజాసంకల్పయాత్ర 147వ రోజు షెడ్యూల్
సాక్షి, ఉయ్యూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 147వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్ ఖరారు అయింది. శనివారం ఉదయం ఆయన గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం నందమూరు క్రాస్ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడ నుంచి రాజుపేట, కాటూరు, కడవకల్లు చేరుకుంటారు. భోజన విరామం అనంతరం వైఎస్ జగన్ ఉయ్యూరు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. -
లారీ బీభత్సం : తప్పిన ప్రాణాపాయం
ఉయ్యూరు: కృష్ణాజిల్లా ఉయ్యూరులో లారీ బీభత్సం సృష్టించింది. ఉయ్యూరు నుంచి విజయవాడకు వెళ్తున్న లారీ పెదఓగిరాల సెంటర్లో ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొంది. దీంతో ఆటో పూర్తిగా లారీ కిందకు వెళ్లిపోయింది. అతివేగం కారణంగా లారీ కూడా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఓ ఇంటి లోకి దూసుకెళ్లింది. అయితే అదృష్టవశాత్తు ఆటోలో ప్రయాణికులెవరూ లేదు. ఇంటి పరిసరాలలో కూడా ఎవరూ లేకపోవడం వల్ల భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో లారీ, ఆటో డ్రైవర్లు మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రద్దీగా ఉండే ఈ రోడ్డులో ప్రమాదం జరగడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. జేసీబీ సాయంతో ఆటోను, లారీని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. -
ఘనంగా కేసీపీ వజ్రోత్సవ వేడుకలు
ఉయ్యూరు : కేసీపీ సేవలు నిరుపమానమని అమరరాజ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ డాక్టర్ జీ రామచంద్రనాయుడు అన్నారు. స్థానిక కేసీపీ కర్మాగార ఆవరణలో బుధవారం వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామచంద్రనాయుడు మాట్లాడుతూ కార్మిక, కర్షక, యాజమాన్యం ఐక్యతతో ముందుకు నడుస్తూ 75 ఏళ్లు కర్మాగారాన్ని ప్రజా ఆమోద్య యోగ్యంతో నడపడం దేశ చరిత్రలోనే గుర్తుంచుకోదగ్గ విషయమన్నారు. ఏబీఎన్ ఎండీ వి. రాధాకృష్ణ మాట్లాడుతూ లాభాపేక్షతో కాకుండా సామాజిక స్ఫూర్తితో యాజమాన్యం పనిచేయడం ఆదర్శనీయమన్నారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న కులజాడ్యం పోవాలని కోరారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ కే లక్ష్మీనారాయణ మాట్లాడుతూ చెరుకు రైతుల సంక్షేమం, మద్దతు ధర విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనా ధోరణి మారాల్సి ఉందన్నారు. కేసీపీ ఎండీ ఇర్మ్‌గార్డ్ వెలగపూడి, చైర్మన్ వినోద్ ఆర్ సేథీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిరణ్‌రావు, సీవోవో జీ వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ సంస్థ ప్రగతి, రైతు సంక్షేమం, సామాజిక అభివృద్ధి అంశాలను వివరించారు. ఉత్తమ రైతులు, కార్మికులు, ఉద్యోగులను సన్మానించి బంగారు, వెండి పతకాలను అందించారు. రిటైర్డ్ ఉద్యోగ కార్మికులను సత్కరించి నగదు ప్రోత్సాహకాలు అందించారు. విద్యార్థులు, పలువురు పేదలకు ఆర్ధిక సాయం చేశారు. ముందుగా రోటరీ కంటి ఆస్పత్రి, వృద్ధాశ్రమాన్ని అతిథులు సందర్శించి పండ్లు అందజేశారు. ఆకట్టుకున్న ఎగ్జిబిషన్.. వజ్రోత్సవాల సందర్భంగా కర్మాగార ఆవరణలో ఏర్పాటు చేసిన వ్యవసాయ ఎగ్జిబిషన్ విశేషంగా ఆకట్టుకుంది. చెరుకు వంగడాలతోపాటు వ్యవసాయ యంత్రాలు, పశువులు, గొర్రెలు, కోళ్లను రైతులు ఆసక్తిగా తిలకించి సమాచారం తెలుసుకున్నారు. పుంగనూరు జాతి ఎడ్లు, ఆవులు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ రకాల జాతి కోళ్లు ఆకట్టుకున్నాయి. ఆదర్శప్రాయుడు మారుతీరావు ఉయ్యూరు : కేసీపీ కర్మాగారంలో సాంకేతిక మార్పులను తీసుకువచ్చి నాణ్యతకు పెద్దపీట వేసి కార్మిక, కర్షక సంక్షేమానికి కృషిచేసిన మహనీయులు మారుతీరావు ఆదర్శప్రాయులని అవధాని మాడుగుల నాగఫణిశర్మ కొనియాడారు. స్థానిక కేసీపీ కర్మాగారంలో స్వర్గీయ వెలగపూడి మారుతీరావు 84వ జయంతి, నాణ్యతా దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. మారుతీరావు విగ్రహానికి నాగఫణిశర్మ, యాజమాన్యం పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. నాణ్యతా దినోత్సవ సభలో ఉత్తమ కార్మికులకు బంగారు, వెండి పతకాలను అందించి సత్కరించారు. పూర్ణాహుతి హోమం కార్యక్రమంలో పాల్గొని విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కేసీపీ ఎండీ ఇర్మ్‌గార్డ్ వెలగపూడి, చైర్మన్ వినోద్ ఆర్ సేథీ, ఇడీ కిరణ్‌రావు, సీవోవో జీ వెంకటేశ్వరరావు, జీఎంలు వీవీ పున్నారావు (కేన్), సీకే వసంతరావు (ఫైనాన్స్), శ్రీహరిబాబు (ప్రాసెస్), సీతారామారావు (ఇంజనీరింగ్), కే కృష్ణ (అడ్వైజర్), హెచ్ఆర్ మేనేజర్ దాస్, తదితరులు పాల్గొన్నారు. -
పెట్టుబడిదారులకు రాష్ట్రం తాకట్టు
కాటూరు (ఉయ్యూరు) : ప్రజాపక్షాన పోరాటం సాగిస్తున్నామన్న అక్కస్సుతోనే వైఎస్ జగన్మోహన్రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మావోయిస్టులతో పోల్చిన చంద్రబాబు ఓ నీచ మనస్కుడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. గడపగడపకూ వైఎస్సార్ ముగిసిన సందర్భంగా శనివారం రాత్రి బహిరంగ సభ నిర్వహించారు. బహిరంగ సభకు పార్టీ ఉయ్యూరు పట్టణ అధ్యక్షుడు జంపాన కొండలరావు అధ్యక్షత వహించారు. పార్థసారథి మాట్లాడుతూ, చంద్రబాబుకు మించిన మోసగాడు, మావోయిస్టు ఈ దేశంలో ఎవ్వరూ ఉండరన్నారు. పెట్టుబడిదారులకు అమ్ముడుపోతూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెడుతుంటే అడ్డుకోవడం ఎలా తప్పవుతుందని ప్రశ్నించారు. ప్రతిపక్షంగా ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత తమ పార్టీదని చెప్పారు. కులాల మధ్య చిచ్చు.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో కులాల మధ్య చిచ్చురాజేసి రాజకీయ లబ్ధిపొందాలనే దుర్మార్గ రాజకీయాలకు చంద్రబాబు అండ్ పార్టీ తెరతీసిందని మండిపడ్డారు. కాపు జాబ్ మేళా అంటూ కులం పేరుతో జాబ్ మేళా నిర్వహించి ఆ వర్గాన్ని దగా చేసే కుట్రకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాపులకు, ఇతర కులాలకు మధ్య గొడవ పెట్టే పనిలో ప్రభుత్వం ఉందన్నారు. బీసీలకు నష్టం జరగకుండా రిజర్వేషన్ ఇవ్వటంలో తమకెలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు నిద్రపోతున్నారా ? ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌లకు రైతు సమస్యలు పట్టకపోవడం బాధాకరమని సారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీపీ యాజమాన్యం రైతులకు చెందాల్సిన కొనుగోలు పన్నును వాడుకుంటుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సీఎంపై ఒత్తిడి తెచ్చి జీవో జారీ చేయించి రైతులకు కొనుగోలు పన్ను టన్నుకు రూ.60 ఇప్పించాలని డిమాండ్ చేశారు. మంత్రి దేవినేని ఉమ, సీఎం చంద్రబాబుకు రాజధానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృత్తివెన్ను, కోడూరు, నాగాయలంక మండలాల్లో తాగునీటి సమస్య కనిపించడంలేదా అని ప్రశ్నించారు. జెడ్పీ ఫ్లోర్ లీడర్ తాతినేని పద్మావతి మాట్లాడుతూ, ప్రజాధనాన్ని చినబాబు లోకేష్, కొందరు ఎమ్మెల్యేలు అడ్డగోలుగా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. సభలో తుమ్మల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్, ఎంపీపీ తుమ్మూరు గంగారత్నం, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు రాజులపాటి రామచంద్రరావు, వంగవీటి శ్రీనివాసప్రసాద్, మండల అధ్యక్షుడు దాసే రవి, ప్రధాన కార్యదర్శి గారపాటి నాని, సర్పంచులు పల్లపోతు శ్రీనివాసరావు, ఉండ్రాసి దీపిక, ఎంపీటీసీ సభ్యురాలు వీరమ్మ, పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి మహ్మద్ ఖాన్ ప్రసంగించారు. -
సాఫ్ట్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక పూర్తి
ఉయ్యూరు : సాఫ్ట్‌బాల్ బాలబాలికల జిల్లా జట్ల ఎంపిక పూర్తయిందని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.పురుషోత్తమ్ తెలిపారు. స్థానిక ఏజీఅండ్‌ఎస్‌జీ సిద్ధార్థ కళాశాల క్రీడా మైదానంలో 2016–17 సంవత్సరానికి ఎస్జీఎఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్ సాఫ్ట్‌బాల్ జట్ల ఎంపిక శనివారం నిర్వహించారు. అండర్ 14, 17 విభాగాల్లో జట్ల వివరాలను పురుషోత్తమ్ వెల్లడించారు. అండర్ 14లో.. బాలుర విభాగంలో : జి.గోపీకృష్ణ, కె.హేమంత్, ఎ.మణికంఠ, ఎం.శశికుమార్, ఎస్.వంశీ, బి.రమేష్, సీహెచ్ వీరనారాయణ, కె.సురేంద్రబాబు, బి.నాగవరప్రసాద్, జె.భరత్, ఎస్.మహేష్, డి.అశ్విత్, జీఆర్‌వీ సుభాష్, బి.జాష్వ, పి.గోపి, బి.సాల్మన్ విక్టర్, స్టాండ్‌బైగా డి.యశ్వంత్ కుమార్, కె.భాస్కర్ ఎంపికయ్యారు. బాలికల విభాగంలో : కె.పల్లవి, డి.గౌతమి, ఎస్.మానస, ఆర్.నాగలక్ష్మి, కె.పవత్రి, కె.కనకదుర్గ, ఎన్.సారిక, కె.సింధుజ, టి.నాగలక్ష్మి, కె.సింధు, ఎస్.పూర్ణిమ, జి.షీభారాణి, కె.లక్ష్మి, వి.శివపార్వతి, ఎస్.శ్రీచైతన్య, వి.నందిని, ఎస్.లిఖిత, జి.రమ్య, కె.పావనిని ఎంపిక చేశారు. అండర్ 17లో.. బాలుర విభాగంలో : కేవీవీ నాగమల్లేశ్వరరావు, కేవీవీఎన్వై ప్రసాద్, డీఎన్టీ గణేష్, పి.ప్రవీణ్‌బాబు, టి.రవితేజ, టి.లక్ష్మణ్‌రాజు, కె.సురేష్, జి.నందకుమార్, వి.శ్రీనివాసరావు, డి.ఆకాష్, పి.మహేష్, ఎన్.హరికృష్ణ, ఎస్.వినయ్, ఎ.శివరామకృష్ణ, జె.రవితేజ, పూర్ణగణేష్, స్టాండ్‌బైగా బి.లక్ష్మీనరసింహ, ఎస్.రాహుల్, వి.రవికుమార్ స్థానం సాధించారు. బాలికల విభాగంలో : కె.మనీషా, యు.శిరీషా, ఎన్.సాహితీ, కె.నళిని, ఎన్.నందిని, సీహెచ్ మానస, పి.మాధురిశ్రీ, పి.పద్మప్రణిత, బి.కోమలి, టి.ప్రత్యూష, టి.రాజేశ్వరి, ఆర్.కళ్యాణి, ఎల్.నాగమాధురి, వి.నవ్య, ఎస్.దేవిశ్రీ, టి.జయశ్రీ, స్టాండ్‌బైగా సీహెచ్ లావణ్య, టి.కనకదుర్గ, పి.సునీత ఎంపికయ్యారు. -
టీడీపీ ఎమ్మెల్సీ వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్య
విజయవాడ : టీడీపీ ఎమ్మెల్సీ యలమంచిలి బాబు రాజేంద్రప్రసాద్ వేధింపుల వల్లే వై.వెంకటరమణ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని అతడి బంధువులు ఆరోపించారు. శనివారం కృష్ణాజిల్లా ఉయ్యూరులో ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలంటూ వారు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సంబంధం లేని విషయంలో రాజేంద్రప్రసాద్ గత మూడు రోజులుగా వెంకటరమణను వేధింపులకు గురి చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా వారు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి... వారిని శాంతింప చేసేందుకు ప్రయత్నస్తున్నారు. -
ఏసీబీకి చిక్కిన మునిసిపల్ మేనేజర్
ఉయ్యూరు:స్థానిక మున్సిపల్ మేనేజర్ పి. రాధాకృష్ణ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. రూ. 8 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఏసీబీ డీఎస్పీ వి. గోపాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం మున్సిపాలిటీలో ఏసీబీ అధికారులు మంగళవారం దాడి చేశారు. పారిశుధ్య కార్మికుడు బొత్స ఏసు ఫిర్యాదు మేరకు దాడి చేయడంతో రాధాకృష్ణ లంచం తీసుకుంటూ చిక్కాడు. 2001 నుంచి ఏసు పారిశుధ్య కార్మికుడుగా పనిచేస్తున్నాడు. డెప్యుటేషన్‌పై పర్మినెంట్ ఉద్యోగి అయిన ఏసు మేస్త్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. మేస్త్రి పోస్టు ఖాళీగా ఉండటంతో తనకు ఇవ్వాల్సిందిగా దరఖాస్తు చేసుకున్నాడు. ఆరు నెలలుగా ఫైలు కదలడంలేదు. దీంతో లంచం ఇస్తేనే ఫైలుపై సంతకం చేస్తామని చెబుతున్నారని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించిన ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ, సీఐలు బి. శ్రీనివాస్, కె. వెంకటేశ్వర్లు, ఎస్.ఎస్.వి. నాగరాజు సిబ్బందితో కార్యాలయంపై దాడిచేశారు. ఏసు రూ. 8 వేలు మేనేజర్‌కు ఇస్తుండగా పట్టుకున్నారు. రాధాకృష్ణ చేతులకు రంగు అంటుకోవడం, ఫ్యాంట్ వెనుక జేబులోడబ్బు దొరకడంతో అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. లంచం కోసం పీడించారు మా అమ్మ చనిపోవడంతో 2001లో ఉద్యోగంలో చేరా. కొన్నేళ్లుగా డెప్యుటేషన్‌పై మేస్త్రి బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. సూపర్వైజర్ పోస్టు ఖాళీ అవడంతో దరఖాస్తు చేసుకున్నా. అందుకు సంబంధించి జీవో కాపీకూడా ఇచ్చా. లంచం ఇస్తేగాని సంతకం పెట్టనన్నారు. దీంతో ఏసీబీని ఆశ్రయించా. - బొత్స ఏసు, పారిశుధ్య కార్మికుడు చెయ్యి తడిపితేనే సంతకం మున్సిపాలిటీలో అవినీతి కంపుకొడుతోంది. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకూ అధికారులు, సిబ్బంది ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి మరీ వసూళ్ల దందాకు పాల్పడుతున్నారు. చేయి తడపందే ఫైలుపై సంతకం పడటంలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏసీబీ అధికారులు కార్యాలయంపై దాడిచేసి అవినీతి అధికారి భరతం పట్టడంతో మున్సిపాలిటీలో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. మున్సిపాలిటీలో అస్థవ్యస్థ పాలన, అవనీతిపై ‘సాక్షి’ అనేక కథనాలు ప్రచురించింది. మూడు రోజులుగా వరుస కథనాలు ప్రచురించి ప్రజల పక్షాన పోరాడుతోంది. ఈ కథనాలు అధికారుల్లో కదలిక తెచ్చాయి. ప్రతిపనికీ ఓ రేటు మునిసిపాలిటీలో ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించినట్లు సమాచారం. అలా చెల్లించకుంటే నెలలు గడిచినా పని జరగదు. జనన,మరణ ధ్రువీకరణ పత్రానికి రూ. 500 నుంచి రూ. 5 వేలు (వ్యక్తి అవసరాన్నిబట్తి), కొత్త ఇంటిపన్నుకు రూ. 5 వేల నుంచి 7 వేలు, నూతన భవన నిర్మాణ అనుమతులకు రూ. 50 వేల నుంచి రూ. లక్ష, లేఅవుట్‌కు ఎకరానికి రూ. 2 లక్షలు, అనుమతి లేకుండా శ్లాబ్ వేసుకునేందుకు రూ. 25 నుంచి 50 వేలు, వ్యాపార లెసైన్స్‌కు రూ. 2 వేలు, అభివృద్ధి పనులకు కాంట్రాక్టర్ల నుంచి పర్సంటేజిల రూపంలో అధికారి స్థాయిని బట్టి శాతాన్ని వసూలు చేస్తున్నారు. వరుస కథనాలు ... మున్సిపాలిటీలో అస్తవ్యస్థ పాలన, విధాన పరమైన లోపాలు, అవనీతిపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురిస్తూ ప్రజా పక్షాన పోరాడుతూ అధికార యంత్రాంగాన్ని మేల్కొలిపింది. ఈ నెల 18న ‘ఆరని వివాదాల కుంపటి’ 19న వివిదాస్పద ‘పన్ను పో(నో) టు’!, 20న సామాజిక స్థలాలు అన్యాక్రాంతం శీర్షికన కథనాలు ప్రచురించింది. దీంతో మన్సిపల్ శాఖ డెరైక్టర్ వాణీ మోహన్, ప్రిన్సిపల్ సెక్రటరీ గిరిధర్‌లు ఆరా తీశారు. ఈ కథనాలను సామాజిక కార్యకర్తలు అధికారులకు అందించి ఫిర్యాదులు చేశారు. -
ఉయ్యూరు వద్ద ఆర్టీసీ బస్సు డీజిల్ ట్యాంకు లీకు
రాష్ట్రంలో వరుస బస్సు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్న కాక మొన్న ఘోరంగా వోల్వో బస్సు ప్రమాదం జరగ్గా, అనంతపురంలోనూ వోల్వో బస్సు ప్రమాదం త్రుటిలో తప్పింది. అలాగే ఉయ్యూరు- మంటాడ బైపాస్ రోడ్డు వద్ద కూడా ఓ ఆర్టీసీ బస్సుకు త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ప్యాసింజర్ బస్సు డీజిల్ ట్యాంకు లీకైంది. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన బస్సు డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేశారు. దీంతో వెంటనే బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులు కిందకి దిగిపోయారు. వాళ్లంతా సురక్షితంగా ఉన్నారు. లీకేజి విషయాన్ని డ్రైవర్ గుర్తించకపోయి ఉంటే మంటలు అంటుకుని పెద్ద ప్రమాదమే జరిగేదంటూ ప్రయాణికులు డ్రైవర్ సమయస్ఫూర్తిని ప్రశంసించారు.