ఉయ్యూరు వద్ద ఆర్టీసీ బస్సు డీజిల్ ట్యాంకు లీకు | APSRTC bus diesel tank leaked in krishna district | Sakshi
Sakshi News home page

ఉయ్యూరు వద్ద ఆర్టీసీ బస్సు డీజిల్ ట్యాంకు లీకు

Published Sun, Nov 24 2013 7:53 AM | Last Updated on Fri, Sep 28 2018 3:27 PM

APSRTC bus diesel tank leaked in krishna district

రాష్ట్రంలో వరుస బస్సు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్న కాక మొన్న ఘోరంగా వోల్వో బస్సు ప్రమాదం జరగ్గా, అనంతపురంలోనూ వోల్వో బస్సు ప్రమాదం త్రుటిలో తప్పింది. అలాగే ఉయ్యూరు- మంటాడ బైపాస్ రోడ్డు వద్ద కూడా ఓ ఆర్టీసీ బస్సుకు త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది.

ప్యాసింజర్ బస్సు డీజిల్ ట్యాంకు లీకైంది. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన బస్సు డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేశారు. దీంతో వెంటనే బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులు కిందకి దిగిపోయారు. వాళ్లంతా సురక్షితంగా ఉన్నారు. లీకేజి విషయాన్ని డ్రైవర్ గుర్తించకపోయి ఉంటే మంటలు అంటుకుని పెద్ద ప్రమాదమే జరిగేదంటూ ప్రయాణికులు డ్రైవర్ సమయస్ఫూర్తిని ప్రశంసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement