లారీ బీభత్సం : తప్పిన ప్రాణాపాయం | 2 injured in lorry accident at vuyyuru | Sakshi
Sakshi News home page

లారీ బీభత్సం : తప్పిన ప్రాణాపాయం

Published Wed, Nov 23 2016 1:05 PM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM

2 injured in lorry accident at vuyyuru

ఉయ్యూరు: కృష్ణాజిల్లా ఉయ్యూరులో లారీ బీభత్సం సృష్టించింది. ఉయ్యూరు నుంచి విజయవాడకు వెళ్తున్న లారీ పెదఓగిరాల సెంటర్‌లో ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొంది. దీంతో ఆటో పూర్తిగా లారీ కిందకు వెళ్లిపోయింది. అతివేగం కారణంగా లారీ కూడా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఓ ఇంటి లోకి దూసుకెళ్లింది. అయితే అదృష్టవశాత్తు ఆటోలో ప్రయాణికులెవరూ లేదు. ఇంటి పరిసరాలలో కూడా ఎవరూ లేకపోవడం వల్ల భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో లారీ, ఆటో డ్రైవర్లు మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రద్దీగా ఉండే ఈ రోడ్డులో ప్రమాదం జరగడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. జేసీబీ సాయంతో ఆటోను, లారీని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement