![Road Accident In Tirupati District](/styles/webp/s3/article_images/2024/09/12/Roadaccident.jpg.webp?itok=V_Y28Qai)
సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లాలో ఓ కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. అధిక వేగంతో వెళ్తున్న లారీ అదుపుతప్పి కారు, బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతిచెందారు.
కాగా, తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం భాకరపేట ఘాట్ రోడ్డు కంటైనర్ లారీ అదుపు తప్పింది. ఈ క్రమంలో కారు, బైక్‌ను లారీ ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
![తిరుపతిలో ఘోర ప్రమాదం](https://www.sakshi.com/s3fs-public/inline-images/acc.jpg)
ఇది కూడా చదవండి: అనకాపల్లిలో బరితెగించిన టీడీపీ నాయకులు
Comments
Please login to add a commentAdd a comment