
అనకాపల్లి, సాక్షి: రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ నాయకులుపై దాడులు ఆగటం లేదు. వైఎస్సార్‌సీపీ నేతలే లక్ష్యంగా టీడీపీ నాయకులు దాడులకు తెగపడుతున్నారు. తాజాగా అనకాపల్లి జిల్లాలో మరోసారి టీడీపీ నాయకులు బరితెగించారు. బుధవారం అర్ధ రాత్రి వైఎస్సార్‌సీపీ నాయకులుపై పచ్చ నాయకులు దాడి చేశారు. దేవరపల్లి మండలంలో కరెంట్ కట్ చేసి.. మహిళలపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు.

రోజు రోజుకీ కూటమి నాయకులు అరాచకాలు పెరిగిపోతున్నాయని బాధితులు రోదిస్తున్నారు. అర్ధ రాత్రి ముషిడిపల్లి కోళ్ల ఫారంపై కూడా టీడీపీ నాయకులు దాడి చేసి పరారైరయ్యారు. టీడీపీ నాయకులు, మాజీ సర్పంచ్ సోమిరెడ్డితో పాటు అతని అనుచరులు తమపై దాడి చేశారని బాధితురాలు రామలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment