టాలీవుడ్‌పై విమర్శలు గుప్పించిన తెలుగుదేశం నేతలపై నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా పోరాటానికి తెలుగు సినీపరిశ్రమ మద్దతు తెలపడంలేదని, బస్సుల్లో పడుకుని మరీ సీఎం చంద్రబాబు ఏపీని అభివృద్ధి చేస్తుంటే.. టాలీవుడ్ వాళ్లు మాత్రం డబ్బు మత్తులో జోగుతున్నారన్న టీడీపీ ఎమ్మెల్సీ బాబూరాజేంద్రప్రసాద్‌కు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చారు