Babu Rajendra Prasad
-
గెలవడం సంగతి తర్వాత.. ఆ ముగ్గుర్ని ఒకటి చేసేదెలా?
అక్కడ టీడీపీ టిక్కెట్ కోసం ముగ్గురు పోటీ పడుతున్నారట. గత ఎన్నికల్లో అక్కడ గెలిచింది వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి. అయితే టీడీపీలో ఒక మాజీ ఎమ్మెల్యే, మరో మాజీ ఎమ్మెల్సీ, ఓ మాజీ మంత్రి మనవడు టిక్కెట్ కోసం పడుతున్నారని టాక్. అభ్యర్థిని నేనే అంటూ ముగ్గురూ ప్రచారం చేసుకుంటున్నారట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏదో, దాని కథేంటో చూద్దాం.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి, ఆ తర్వాత జరిగిన పంచాయతీ, పరిషత్, మున్సిపల్.. వరుసగా అన్ని ఎన్నికల్లో తెలుగుదేశం ఓడింది. రోజురోజుకు ప్రజలకు దూరంగా, భారంగా మారిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు.. ఇప్పటికీ ఢంకా బజాయించడంలో మాత్రం తగ్గడం లేదు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామంటూ లేని బింకాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆయన బాగా నమ్మకం పెట్టుకున్న పాత కృష్ణా జిల్లాలోనే పరిస్థితి భిన్నంగా ఉంది. కృష్ణా జిల్లాలో పెనమలూరులో 2014లో టీడీపీ తరపున గెలిచిన బోడే ప్రసాద్ 2019లో ఓడిపోయారు. అయితే ఇప్పటికీ ఆయనే పెనమలూరు టీడీపీ ఇంఛార్జిగా కొనసాగుతున్నారు. పార్టీ నిర్వహించే అన్ని కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. చంద్రబాబు సపోర్ట్ నాకే ఉంది రాబోయే ఎన్నికల్లో పెనమలూరు నుంచి పోటీచేసేది నేనే అంటూ బోడే ఇప్పట్నుంచే ప్రచారం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు బోడే ప్రసాద్‌కు పోటీగా మరో ఇద్దరు లైన్లోకి వచ్చారట. మాజీ ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్ ఎప్పట్నుంచో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్నారు. గత నాలుగైదు ఎన్నికల నుంచి ప్రతిసారీ టిక్కెట్ కోసం చివరి వరకూ పోరాడటం.. భంగపడటం ఆయనకు అలవాటైంది. దేవినేని ఉమ మద్దతుతో ఈసారైనా టిక్కెట్ దక్కకపోతుందా అనే ఆశలో ఉన్నారాయన. చదవండి: (Galla Jayadev: ఎంపీ అన్న సంగతే మరిచిపోయారేమో..?) వీరిద్దరికీ పోటీగా చలసాని పండు మేనల్లుడు దేవినేని గౌతం కూడా 2024లో పెనమలూరులో పోటీచేసేది నేనే అని చెప్పుకుంటున్నాడు. లోకేష్ సపోర్ట్ తనకు ఉందని... టికెట్ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. చిన్నబాబు తనకే హామీ ఇచ్చాడని, ఈ సారి పోటీ చేయడం ఖాయమంటున్నాడు. ప్రస్తుతం పెనమలూరు నియోజకవర్గంలో ఈ ముగ్గురూ పార్టీ కార్యక్రమాలు వేర్వేరుగా నిర్వహస్తుండటంతో తమ్ముళ్లు అయోమయంలో ఉన్నారు. అసలే గెలుపుపై ఆశల్లేవు, ఆపై కుమ్ములాటలెందుకని ప్రశ్నిస్తున్నారు. పార్టీ అధిష్టానం పిలుపునిచ్చే ఏ కార్యక్రమంలోనూ ఈ ముగ్గురూ కలిసి పాల్గొనడం లేదట. మా రూటే సెపరేటంటూ విడివిడిగా కార్యక్రమాలు చేసుకుంటూ తమకే పార్టీ సపోర్ట్ ఉందని ప్రచారం చేసుకుంటున్నారట. ఈ ముగ్గురూ చాలదన్నట్లు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా చేసిన వడ్డే శోభనాద్రీశ్వర్రావు కుటుంబం నుంచి ఆయన మనవడు వడ్డే సాయి కూడా టికెట్ కోసం తెరవెనుక పావులు కదుపుతున్నట్లు తాజాగా ప్రచారం మొదలైంది. ప్రస్తుతం పెనమలూరు టీడీపీలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు పార్టీ అధినేతకు తలనొప్పిగా మారుతున్నాయట. అసలే అవకాశాలు అంతంతమాత్రంగా కనిపిస్తున్న పెనమలూరులో టిక్కెట్ కోసం ఇప్పట్నుంచే ట్రయాంగిల్ ఫైట్ మొదలవ్వడంతో చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోవడం లేదట. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని గాడిలో పెట్టడం ఎలా అని తలపట్టుకుంటున్నారట చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో గెలవడం సంగతి దేవుడెరుగు.. ముందు ఈ ముగ్గురినీ ఎన్నికల నాటికి ఒకే తాటిపైకి తేవడం ఎలా అని బాబోరు తెగ మదన పడిపోతున్నారట. చదవండి: (Daggubati Purandeswari: కాలం చెల్లినట్లేనా?.. బీజేపీ ఏదో ఆశిస్తే.. జరిగిందేదో!) -
అత్యధిక మెజారిటీతో గెలిచిన రాష్ట్రపతి ఎవరో తెలుసా?
దేశానికి 15వ రాష్ట్రపతిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగుస్తుంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నిర్వహించింది. 21న ఓట్ల లెక్కింపు జరిగింది. ద్రౌపది ముర్ము తన ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన రాష్ట్రపతి ఎన్నికలపై విహంగ వీక్షణం.. స్వతంత్ర భారత తొలి రాష్ట్రపతిగా డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ సేవలు అందించారు. రెండు పర్యాయాలు రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక వ్యక్తి ఆయనే కావడం విశేషం. అంతేకాదు అత్యధిక మెజారిటీతో గెలిచిన రికార్డు కూడా ఆయన పేరిటే ఉంది. కాగా, 1950 జనవరి 26న రాజేంద్రప్రసాద్‌ను రాష్ట్రపతిగా ఎన్నికైనట్టు రాజ్యాంగం ధ్రువీకరించింది. కేంద్ర ఎన్నికల సంఘం 1952లో తొలిసారిగా నిర్వహించిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. స్వతంత్ర భారత మొట్ట మొదటి ఉప రాష్ట్రపతిగా పనిచేసిన ప్రముఖ తత్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్.. 1962లో రెండో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. జాకిర్ హుస్సేన్ 1967లో మూడవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. దురదృష్టవశాత్తు పదవీలో ఉండగానే 1969, మే 3న ఆయన కన్నుమూశారు. జాకిర్ హుస్సేన్ మరణంతో 1969లో జరిగిన ఎన్నికల్లో వరాహగిరి వేంకటగిరి నాలుగో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రెండో ప్రాధాన్య ఓట్లతో గెలిచిన తొలి రాష్ట్రపతిగా ఆయన చరిత్ర కెక్కారు. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్.. భారత ఐదో రాష్ట్రపతిగా పనిచేశారు. పదవిలో ఉండగానే 1977, ఫిబ్రవరి 11న మరణించారు. ఏకగ్రీవంగా రాష్ట్రపతి పదవిని దక్కించుకున్న ఘనత నీలం సంజీవరెడ్డికి దక్కింది. 1977 నాటి ఎన్నికల్లో పోటీలో ఉన్న 37 మందిలో సంజీవరెడ్డి నామినేషన్ మినహా మరెవరిదీ చెల్లకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జ్ఞానీ జైల్ సింగ్ 1982లో దేశానికి 7వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. దేశ ప్రథమ పౌరుడిగా ఎన్నికైన ఏకైక సిక్కుగా ఆయన ఖ్యాతికెక్కారు. ఆర్. వెంకట్రామన్ దేశానికి 8వ రాష్ట్రపతిగా సేవలు అందించారు. ఆయన హయాంలోనే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల శకం ఆరంభమైంది. శంకర్‌దయాళ్ శర్మ 1992లో దేశానికి 9వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఆయన ఉపరాష్ట్రపతిగానూ సేవలు అందించారు. దేశానికి తొలి దళిత రాష్ట్రపతి కేఆర్ నారాయణన్. కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన మొదటి ప్రెసిడెంట్‌గా గుర్తింపు పొందారు. ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు. 1998 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి పదవిలో ఉండి ఓటు వేసిన మొదటి రాష్ట్రపతిగా ఖ్యాతికెక్కారు. భారతదేశపు మిస్సైల్ మ్యాన్‌గా పేరుగాంచిన ఏపీజే అబ్దుల్ కలాం దేశానికి 11వ రాష్ట్రపతిగా విశేష సేవలు అందించారు. ప్రజల రాష్ట్రపతిగా మెలిగిన ఆయన రాష్ట్రపతి కార్యాలయాన్ని సామాన్యులకు చేరువ చేశారు. రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించిన తొలి మహిళ ప్రతిభా పాటిల్. అంతకుముందు ఆమె రాజస్థాన్ గవర్నర్‌గా పనిచేశారు. రాష్ట్రపతి పనిచేసిన కాలంలో ఆమె పలు రకాల విమర్శలు ఎదుర్కొన్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ప్రణబ్ ముఖర్జీ దేశానికి 13వ రాష్ట్రపతిగా 2012లో ఎన్నికయ్యారు. దేశ అత్యున్నత పురస్కారం పొందిన ఆరుగురు రాష్ట్రపతుల్లో ఆయన ఒకరు. ప్రణబ్ హయాంలోనే రాష్ట్రపతి భవన్ ట్విటర్ ఖాతా ప్రారంభమైంది. దేశానికి రెండో దళిత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. అంతకుముందు బిహార్ రాష్ట్రానికి గవర్నర్‌గా ఆయన పనిచేశారు. ఈ ఏడాది జూలై 24తో రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. (క్లిక్: భారత పౌరసత్వం వదులుకుంటున్న ప్రవాసులు!) -
లక్ష్యం ఒక్కటే దారులు వేరు!
నెహ్రూ స్వతంత్ర భారత తొలి ప్రధాని. రాజేంద్ర ప్రసాద్ తొలి రాష్ట్రపతి. ఇద్దరు పని చేస్తున్నది ఒకే లక్ష్యంతోనే అయినా ఇద్దరి భావాలు, సిద్దాంతాలు వేరుగా ఉండేవి. నెహ్రూ ఆధునికం అయితే రాజేంద్ర ప్రసాద్ సంప్రదాయం. అయితే ఈ మాటల్ని మనం ఉన్నవి ఉన్నట్లుగా కాకుండా వారిలోని వైరుధ్యానికి ఓ తేలికపాటి పోలికగా మాత్రమే తీసుకోవాలి. అర్ధరాత్రి కొట్టగానే కదా దేశానికి స్వాతంత్య్రం వచ్చింది.. 1947 ఆగస్టు 15న! భారత్ సంకెళ్లు తెగిపోయాయి. ఇప్పుడిక భారత్ తనేమిటో ప్రపంచ దేశాలకు చూపించుకోవాలి. స్వాతంత్య్రం సంపాదించుకుని, స్వాతంత్య్రంతో ఏమీ చేయకపోతే ఎలా! వలస పాలకులు భారత ప్రజా గర్జనకు పక్షుల్లా ఎగిరిపోయాక, భారత్ స్వేచ్ఛా విహంగమై నెహ్రూ, రాజేంద్రల భుజాలపై వాలింది. దేశ భవిష్యత్తును ఇక నిర్మించవలసింది, నిర్ణయించవలసిందీ ప్రధానంగా వాళ్లిద్దరే. ధ్వనించని మెత్తటి చిరు నవ్వులా ఉండేవారు డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్. గాంధీజీ ఆదర్శాల నుంచి తెచ్చుకున్న గుణం అది. నెహ్రూకు తోడ్పాటుగా ఉండేందుకు ఆ స్వభావం ఆయనకెంతో తోడ్పడింది. నెహ్రూతో విభేదించేవారు. అయితే ఆ విభేదం.. ఐక్యతతోనే! ఇది సాధ్యమేనా? సాధ్యం చేసుకున్నారు కనుకనే నెహ్రూ, రాజేంద్ర గొప్ప నాయకులుగా, పాలనకు నమ్మకమైన స్తంభాలుగా నిలబడ్డారు. అభిప్రాయ భేదాలు సాధారణంగా ప్రధాని చెప్పినదానికి రాష్ట్రపతి కాదనేదేమీ ఉండదు. రాష్ట్రపతి కాదనరు కదా అని ఆయన అభిప్రాయం తీసుకోకుండా ప్రధానీ ఏమీ చెయ్యరు. నెహ్రూ, రాజేంద్ర కూడా సఖ్యతగానే ఉన్నారు. అయితే స్వీయ విశ్వాసాలు, సిద్ధాంతాల దగ్గరికి వచ్చేటప్పటికి వారికి అభిప్రాయ భేదాలు వచ్చేవి. దేశం అభివృద్ధి చెందడానికి శాస్త్ర, సాంకేతిక నైపుణ్యాలు అవసరం అని నెహ్రూ బలంగా నమ్మేవారు. ప్రార్థనా స్థలాలకంటే పరిశ్రమలు, పాఠశాలలు ముఖ్యం అనేవారు. రాజేంద్ర ప్రసాద్ అందుకు భిన్నమైన నమ్మకాలను కలిగి ఉండేవారు. దేశ పురోభివృద్ధికి పరిశ్రమలు, శాస్త్ర పరిజ్ఞానాలు అవసరమే అయినా.. సంస్కృతీ సంప్రదాయాలను, మత విశ్వాసాలను విస్మరించడానికి లేదని రాజేంద్ర ప్రసాద్ భావించేవారు. ఈ రెండు దారులు వేటికవి సాగుతున్నంత వరకు వాళ్లిద్దరి మధ్య ఘర్షణ తలెత్తలేదు. ఓ సందర్భంలో మాత్రం ఆ రెండు దారులు ఒకదాన్ని ఒకటి దాటవలసి వచ్చింది! ఆ సందర్భం.. సోమనాథ ఆలయ ప్రారంభోత్సవం! ఆలయ పునరుద్ధరణ గుజరాత్‌లోని సోమనాథ ఆలయం క్రీ.శ. 1వ శతాబ్దం నాటిది. కాలక్రమంలో ఆలయం శిథిలమైపోగా, ఆ శిథిలాలపైనే క్రీ.శ.649 లో రెండో ఆలయాన్ని నిర్మించారు. క్రీ.శ.722లో అరబ్బులు సింధు ప్రాంతంలో బలపడ్డాక జరిగిన దాడులలో ఆలయం ధ్వంసమయింది. చాళుక్యులు వచ్చాక ఆలయ పునరుద్ధరణ జరిగింది. 1026లో మహమ్మద్ ఘజనీ దండయాత్రలో సోమనాథ ఆలయం మళ్లీ దెబ్బతినింది. 1114లో హిందూ రాజులు ఆలయాన్ని పునరుద్ధరించారు. తర్వాత 1299లో అల్లా ఉద్దీన్ ఖిల్జీ ఆలయంపై పడి శివలింగాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. 1331లో జునాఘడ్ రాకుమారుడు తిరిగి అక్కడ లింగ ప్రతిష్ఠ చేశాడు. 1459లో మహమ్మద్ బేగ్దా ఆ శివలింగాన్ని తొలగించి, ఆలయాన్ని మసీదుగా మార్చేశాడు. 1783లో ఇండోర్ మహారాణి అహల్యాబాయి మసీదు స్థానంలో తిరిగి సోమనాథ ఆలయాన్ని పునర్నిర్మించారు. శత్రువుల బారిన పడకుండా లింగప్రతిష్ఠను భూగర్భంలో జరిపించారు. కాలగమనంలో ఆలయం శిథిలమవుతూ వచ్చింది. నెహ్రూ వెళ్లొద్దన్నారు! దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1951లో ఈ ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాల ప్రారంభోత్స వానికి అధ్యక్షత వహించవలసిందిగా అందిన ఆహ్వానాన్ని రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్వీకరించారు. అది తెలిసి నెహ్రూ పరోక్షంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. భారత సమాజంలో ప్రార్థనా స్థలాల ప్రాముఖ్యంపై నెహ్రూ–రాజేంద్రల మధ్య భిన్నమైన వాదనలు బహిరంగంగానే వినిపిస్తూ ఉన్న సమయం అది. అలాంటి కార్యక్రమానికి రాష్ట్రపతి వెళ్లకూడదని నెహ్రూ అభిప్రాయం. వెళ్లడమే సరైనదని రాజేంద్ర వాదన. ‘ఏమైనా ఈ సమయంలో ఇలాంటి మత పరమైన అభివృద్ధికి దేశాధినేతలను ప్రాధాన్యం ఇవ్వడం తగదు. దానికింకా ఎంతో సమయం ఉంది. సరే ఎలాగూ అధ్యక్షతకు అంగీకరించారు కనుక అలాగే కానివ్వండి’ అని నెహ్రూ ఆ తర్వాత రాజేంద్రతో అన్నట్లు ‘పిలిగ్రిమేజ్ టు ఫ్రీడమ్’ పుస్తకంలో రచయిత కె.ఎం. మున్షీ రాశారు. (చదవండి: శతమానం భారతి: నవ భారతం) -
ఏకాభిప్రాయ సారథి: రాజేంద్ర ప్రసాద్ (1884–1963)
ఉత్తర బిహార్‌లోని ఒక కుగ్రామం నుంచి వచ్చిన రాజేంద్ర ప్రసాద్ మహాత్మా గాంధీకి అకుంఠితమైన అనుచరుడిగా పేరు పొందారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌కి, చక్రవర్తి రాజగోపాలాచారికి సన్నిహితంగా మెలిగారు. ఆ ముగ్గురినీ కలిపి తక్కినవారు కాంగ్రెస్‌లోని మితవాద పక్షంగా వ్యవహరించేవారు. జవహర్లాల్ నెహ్రూ, నేతాజీ సుభాస్ చంద్రబోస్‌లు అనుసరించిన వామపక్ష అనుకూల రాజకీయాలను ఈ ముగ్గురూ వ్యతిరేకించేవారు. చాలా విషయాలలో రెండు వర్గాల విభేదాలు చరిత్ర ప్రసిద్ధి పొందాయి. ఉదాహరణకు, మంత్రి అయిన సర్దార్ పటేల్ అంత్యక్రియలకు రాష్ట్రపతి హాజరు కావడం సముచితం కాదని నెహ్ర ఇచ్చిన సలహాను తోసిరాజని, రాష్ట్రపతి హోదాలో ఆయన 1950లో పటేల్ అంత్యక్రియలకు హాజరయ్యారు. ఇక రాజ్యాంగ నిర్ణాయక సభ అధ్యక్షుడిగా రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ నిర్ణాయక సభలో మెజారిటీ అభిప్రాయం సరిపోదనీ, ఏకాభిప్రాయం తప్పనిసరి అనీ ప్రారంభంలోనే సూత్రీకరించారు. దీంతో మెజారిటీ వాదులు మైనారిటీల ఆక్షేపణలను అర్థం చేసుకుని, సర్దుబాట్ల ద్వారా వారిని కూడా కలుపుకుని పోవలసిన పరిస్థితి అభివృద్ధి చెందింది. ఏకాభిప్రాయాన్ని సాధించే వరకు నిర్ణయాన్ని నిలిపేయాల్సిన అవసరం ఏర్పడింది. దీని వల్ల రాజ్యాంగాన్ని ఖరారు చేయడానికి మూడేళ్లకు పైగా ఆలస్యమైపోయింది. ఎట్టకేలకు 1950 నాటికి భారతీయులకు రాజ్యాంగం లభించింది. అది భారతీయులందరూ గర్వించదగిన స్థాయిలో ఉందంటే, ఆ ఖ్యాతి రాజేంద్ర ప్రసాద్‌కు దక్కవలసిందే. రెండు పర్యాయాలు భారత రాష్ట్రపతిగా వ్యవహరించిన రాజేంద్ర ప్రసాద్, తన హయాంలో రాష్ట్రపతి వ్యవస్థ ప్రత్యామ్నాయ అధికార కేంద్రంగా అభివృద్థి చెందకుండా సకల జాగ్రత్తలూ వహించారు. అయితే జాగృతమైన, అప్రమత్తమైన వ్యవస్థగా రాష్ట్రపతి పదవీ బాధ్యతల్ని నిర్వర్తించారు. ఆర్భాటానికి తావివ్వని మృదు స్వభావిగా, నిరాడంబరునిగానే ప్రసాద్ తన జీవితమంతా గడిపారు. – సలీల్ మిశ్రా, ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో చరిత్ర అధ్యాపకులు -
కీలక పాత్ర పోషించిన డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్
దేశంలోనే అత్యున్నత పదవిని పొందిన తొలి వ్యక్తి మన దేశ తొలి రాష్ట్రపతి, భారత రత్న డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. అంతేకాదు ఆయన ఒక గొప్ప గురువుగా, న్యాయవాదిగా, మంచి రచయితగా, స్వాతంత్ర్య సమరయోధుడుగా ఇలా ఎన్నో సేవలను అందించారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బహుముఖ వ్యక్తిత్వం గలవారు. బిహార్ శివాన్ జిల్లాలోని జెర్దాయ్ గ్రామంలో ఆయన 1884 డిసెంబరు 3న జన్మించారు. బాల్యం నుంచే రాజేంద్ర ప్రసాద్ చురుగ్గా ఉండేవారు. బిహార్‌లో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పనిచేసిన ఆయన ఆ తర్వాత అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయ పట్టా పొందారు. కొన్నాళ్లు బిహార్, ఒడిశా హైకోర్టులలో పనిచేశారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు. మహాత్మా గాంధీచే బాగా ప్రభావితమైన రాజేంద్ర ప్రసాద్ 1931 నాటి 'ఉప్పు సత్యాగ్రహం' 1942లో జరిగిన 'క్విట్ ఇండియా ఉద్యమం' లో చురుగ్గా పాల్గొన్నారు. అనేకమంది ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులతో పాటు ఆయన కూడా జైలు జీవితం గడిపారు. 1946 సెప్టెంబరు 2న జవాహర్ లాల్ నెహ్రూ కేబినెట్లో రాజేంద్ర ప్రసాద్ ఆహార, వ్యవసాయ శాఖకు మంత్రిగా పని చేశారు. జీపీ కృపాలానీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజీనామా చేసిన తరువాత 1947 నవంబరు 17న కాంగ్రెస్ అధ్యక్షునిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించారు. 1950 నుండి 1962 వరకు ఆయన భారత రాష్ట్రపతిగా పని చేశారు. ఆయనకు 1962లో అత్యున్నత పౌర పురస్కారం భరత రత్నను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. -
దేశ తొలి రాష్ట్రపతికి సీఎం జగన్ నివాళి
సాక్షి, అమరావతి : భారతదేశ తొలి రాష్ట్రపతి భారతరత్న డా. బాబూ రాజేంద్ర ప్రసాద్ 135వ జయంతి సందర్భంగా ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసిన సీఎం గుర్తుచేశారు. దేశ నిర్మాణంలో రాజేంద్ర ప్రసాద్ ప్రముఖ పాత్రను పోషించారని అభిప్రాయపడ్డారు. నేటి తరం ఆయన సేవలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని, స్వాతంత్య్ర పోరాటంలో ఆయన చూపిన తెగువ స్పూర్తిదాయకమైందని స్మరించుకున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మంగళవారం ఓ ప్రకటన వెలువడింది. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ‘విభిన్న సామర్థ్యం గల సోదరులు, సోదరీమణులు అభివృద్ధి చెందడానికి సహకరిస్తాం. అన్ని రంగాల్లో సమాన హక్కులు, అవకాశాలతో అనుకూలమైన వాతావరణాన్ని నిర్మించడం ద్వారా మంచి ఫలితాల వైపు వారి దృష్టిని ఆకర్షించవచ్చు. వారిలోని ఆత్మ సైర్థ్యం మనకు ఎంతో ప్రేరణ’ అని ఓ ప్రకటన ద్వారా తెలిపారు. -
ఆయన భారతదేశానికి ప్రతీక
• ధ్రువతారలు ఏప్రిల్ 10, 1917. చంపారన్ రైతు నాయకుడు రాజ్‌కుమార్ శుక్లా ఒక వ్యక్తిని తీసుకుని తమ కేసును వాదిస్తున్న న్యాయవాది ఇంటికి వెళ్లారు. నీలిమందు పంటనే పండించాలంటూ ఆంగ్ల ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘిస్తూ బిహార్‌లోని ఆ ప్రాంత రైతాంగం ఉద్యమిస్తున్నది. పట్నాలో ఉన్న న్యాయవాది ఇంటికి శుక్లా తీసుకువెళ్లిన ఆ నల్లటి వ్యక్తి రైతు ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. చూడ్డానికి రైతులాగే ఉన్నారు. తీరా న్యాయవాది పొరుగూరు వెళ్లారు. మహారాష్ట్ర నుంచి మూడో తరగతి పెట్టెలో ప్రయాణించి బిహార్ వచ్చిన ఆ నల్లటి వ్యక్తి తమ బావి వద్ద స్నానం చేయడానికి న్యాయవాది నౌకర్లు అంగీకరించలేదు. పాయఖానాలు ఉపయోగించడానికి కూడా అనుమతించలేదు. శుక్లా, ఆ నల్లటి వ్యక్తి, వీరి వెంటే ఉన్న రైతు బృందం మరొకరి ఇంటికి వెళ్లిపోయారు. ఆ నల్లటి వ్యక్తి మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ. అప్పటికే దైవంతో సమానంగా ఆరాధిస్తున్న గాంధీజీ తన ఇంటిని సందర్శించినప్పుడు పొరుగూరు వెళ్లిన ఆ న్యాయవాది బాబూ రాజేంద్రప్రసాద్. బాబూ రాజేంద్రప్రసాద్ (డిసెంబర్ 3, 1884–ఫిబ్రవరి 28, 1963) స్వతంత్ర భారత తొలి రాష్ట్రపతి (1950–1962). స్వాతంత్య్రోద్యమంలో గాంధీజీతో ఏ విషయంలోను విభేదించకుండా ఉన్న అనుచరుడు బహుశా రాజేంద్రప్రసాద్ (రాజేన్‌బాబు) కావచ్చు. స్వరాజ్య సమరయోధులలో ప్రముఖులంతా గాంధీజీతో ఏదో ఒక అంశంలో విభేదించినవారేనన్నది చారిత్రక సత్యం. అందుకు రాజేంద్రప్రసాద్ రాసిన ‘గాంధీజీ పాదాల వద్ద’ అన్న పుస్తకమే నిదర్శనం. మనసా వాచా గాంధీజీ సిద్ధాంతాన్ని పాటించిన నాయకుడు రాజెన్‌బాబు. ఆయన మేధస్సు, ఆదర్శవంతమైన జీవితం ఎందరినో ప్రభావితులను చేశాయి. వారిలో రాహుల్ సాంకృత్యాయన్ కూడా ఒకరు. రాజెన్‌బాబు బిహార్‌లోని జెరదాయి అనే చోట పుట్టారు. సంపన్న కుటుంబం వారిది. తండ్రి మహదేవ సాహే, తల్లి కమలేశ్వరీదేవి. ఈమెకు రాజెన్‌బాబు ఆఖరి సంతానం. ఆయన చిన్నతనంలోనే కన్నుమూశారు. దీనితో పెద్దక్క పెంపకంలో పెరిగారు. ఆనాటికి వారి స్వగ్రామంలో పాఠశాల లేదు. ఒక ముస్లిం మత గురువును నియమించి పర్షియన్, హిందీ, అర్థమేటిక్ ఇంటి దగ్గరే తండ్రి చెప్పించారు. సాహే కూడా మంచి పండితుడు. ప్రాథమిక విద్య పూర్తయిన తరువాత చాప్రా జిల్లా పాఠశాలలో చేరారు. కలకత్తా విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్ష రాసి ప్రథమ స్థానంలో నిలిచారు. దీనితో నెలకి రూ. 30 విద్యార్థి వేతనం కూడా లభించేది. 1902లో కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో చేరారు. 1904లో ఎఫ్ఏలో ఉత్తీర్ణులయ్యారు. 1905లో ప్రథమ శ్రేణితో పట్టభద్రుడయ్యారు. రాజేన్‌బాబు సైన్స్ విద్యార్థి. అప్పటి ఆయన గురువులు జగదీశ్చంద్ర బోస్, ప్రఫుల్లచంద్ర రాయ్. పరీక్షలలో రాజేన్‌బాబు ఇచ్చిన జవాబు పత్రాన్ని చూసి ఒక పరీక్షకుడు ఇచ్చిన కితాబు ఇది, ‘పరీక్షకుని కంటే పరీక్ష రాసిన విద్యార్థే మెరుగ్గా ఉన్నారు.’ అప్పుడే బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం మొదలయింది. రాజేన్‌బాబు, ఆయన సోదరుడు ఈడెన్ హిందూ విద్యార్థి వసతిగృహంలో ఉండేవారు. అక్కడ ఒక విద్యార్థి విదేశీ వస్తు దహనం నిర్వహించాడు. ఆ రోజున తన వద్ద వెతికితే ఒక్క విదేశీ వస్తువు కూడా రాజేన్‌కు దొరకలేదు. అది ఆ కుటుంబానికి ఉన్న నిబద్ధత. తరువాత అక్కడే ఎంఏ అర్థశాస్త్రం చదువుకున్నారు. గోఖలే స్థాపించిన సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ, డాన్ సొసైటీ ఆఫ్ ఇండియా (దీనిని ఆంగ్లేయులకు విశ్వవిద్యాలయాల మీద అసాధారణ అధికారాలు కట్టబెట్టే 1902 చట్టానికి వ్యతిరేకంగా సతీశ్‌చంద్ర ముఖర్జీ స్థాపించిన ఉద్యమ సంస్థ)లలో కూడా ఆయన పనిచేశారు. డాన్ సొసైటీలో రవీంద్రనాథ్ టాగోర్, అరవింద్ ఘోష్, రాజా సుబోద్ చంద్రమల్లిక్, రాయ్‌చౌదరి వంటివారు సభ్యులుగా ఉండేవారు. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీలో చేరవలసిందని స్వయంగా గోఖలే ఆయనను కోరారు. నిజానికి రాజేన్‌బాబు నాయకత్వ జీవితానికి ప్రెసిడెన్సీ కళాశాలలోనే బీజాలు పడినాయి. అక్కడ విద్యార్థి సంఘానికి ఆయన కార్యదర్శిగా ఎంపికయ్యారు. 1906లో న్యాయశాస్త్రం మీద దృష్టి పెట్టినప్పుడు బెంగాల్ విభజన వ్యతిరేకరోద్యమం మొదలైంది. కలకత్తా సిటీ కాలేజీలో అర్థశాస్త్ర ఆచార్యునిగా పనిచేస్తూనే ఆయన నాటి రిప్పన్ కాలేజీలో న్యాయశాస్త్రం చదివారు. 1911లో ఆయన కలకత్తా హైకోర్టులో న్యాయవాదిగా నమోదైన తరువాత విభజన నిర్ణయం వెనక్కి వెళ్లింది. అంటే బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమానికి ఆయన ప్రత్యక్షసాక్షి. అదే ఆయన రాజకీయ వ్యక్తిత్వం మీద గట్టి ప్రభావమే కనిపించింది. 1915లో న్యాయశాస్త్రంలోనే పోస్టుగ్రాడ్యుయేషన్ చేశారు. 1916లో న్యాయవాద వృత్తిని స్వీకరించారు. 1937లో అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలోనే పరిశోధన పూర్తి చేశారు. ఉద్యమం, చదువు రాజేన్‌బాబు జీవితంలో రెండుకళ్లలా కనిపిస్తాయి. బెంగాల్ విభజన వేడి మొదలయ్యాక 1906లో కలకత్తాలో భారత జాతీయ కాంగ్రెస్ సభలు జరిగాయి. ఆ సభలలో ఆయన స్వచ్ఛంద సేవకుడు. మళ్లీ 1911లో కలకత్తాలోనే వార్షిక సమావేశాలు జరినప్పుడు లాంఛనంగా ఆ సంస్థలో సభ్యులయ్యారు. 1916 నాటి లక్నో కాంగ్రెస్ సమావేశాలలో గాంధీజీతో తొలిసారి సమావేశమయ్యారు. అప్పుడే చంపారన్ రైతుల ఉద్యమం కోసం గాంధీజీ ముందుకొచ్చారు. 1920 నాటి సహాయ నిరాకరణ ఉద్యమ తీర్మానం ఆమోదించిన తరువాత రాజేన్‌బాబు అటు ఆచార్య పదవిని, ఇటు న్యాయవాద వృత్తిని విడిచిపెట్టి గాంధీ వెంట ఉండిపోయారు. అప్పటికే ఆ రెండు వృత్తులతో ఆయన విశేషంగా ఆర్జిస్తున్నారు. గాంథీజీ ప్రవచించిన స్వదేశీ విద్య నినాదాన్ని తన కుటుంబంలో అమలు చేశారు. తన కుమారుడు మృత్యుంజయ ప్రసాద్‌ను బిహార్ విద్యాపీఠంలో చేర్పించారు. రెండు పర్యాయాలు రాజేన్‌బాబు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎంపికయ్యారు. మొదటిసారి 1934 నాటి బొంబాయి కాంగ్రెస్‌కు అధ్యక్షుడు ఆయనే. 1939లో నేతాజీ బోస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తరువాత ఆ పదవిని అలంకరించినవారు రాజేన్‌బాబు. చివరిసారి క్విట్ ఇండియా ఉద్యమంలో అరెస్టయిన రాజేన్‌బాబు 1945లో విడుదలయ్యారు. 1946 లో నెహ్రూ నాయకత్వంలో పన్నెండు మందితో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో ఆయన ఆహార, వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సంవత్సరం డిసెంబర్ 11న ఆయనకు మరొక ప్రతిష్ఠాత్మక బాధ్యతను భారతదేశం అప్పగించింది. అదే– స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగం నిర్మించడానికి ఏర్పడిన రాజ్యాంగ పరిషత్‌కు అధ్యక్ష పదవి. ఆపై భారత తొలి రాష్ట్రపతి పదవి. తొలి భారత రాష్ట్రపతి ఎంపిక వివాదం కాకుండా ఆ కాలమే జాగ్రత్త పడిందని అనిపిస్తుంది. భారత ఆఖరి వైస్రాయ్ భారతీయుడైన రాజాజీ. ఆయనను రాష్ట్రపతిని చేయాలన్నది ప్రథమ ప్రధాని నెహ్రూ అభిప్రాయం. కానీ రాజాజీ క్విట్ ఇండియా ఉద్యమంలో జాతీయ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఆ పరిణామం చాలామంది ఎంపీలకు గుర్తుంది. దీనితో బాబూ రాజేంద్రప్రసాద్ వైపు మొగ్గారు. ఆయన సర్దార్ అభ్యర్థి అన్న పేరుంది. కాబట్టి మెజార్టీ అభిప్రాయాన్ని అనుసరించి నెహ్రూ కూడా రాజేన్‌బాబు అభ్యర్థిత్వానికి అంగీకరించారు. కానీ వారిద్దరి మధ్య తరువాత ఒక అవాంఛనీయమైన వాతావరణమే కొనసాగింది. జనవరి 26,1950న రాజేన్‌బాబును రాష్ట్రపతిగా ఎన్నికైనట్టు రాజ్యాంగం ధ్రువీకరించింది. ఆ జనవరి 26 శుభదినం కాదని రాజేన్‌బాబు విశ్వాసం. కానీ నెహ్రూ దేశాన్ని నడపవలసింది జ్యోతిష్కులు కాదని కరాఖండిగానే చెప్పేశారు. కానీ దురదృష్టవశాత్తు 25వ తేదీ రాత్రి రాజేన్‌బాబు సోదరి భగవతీదేవి కన్నుమూశారు. రాష్ట్రపతిగా ప్రమాణం చేసిన తరువాత ఆయన చేసిన తొలి కార్యక్రమం సోదరికి అంత్యక్రియలు. సోమనాథ్ దేవాలయం అంశం మరొకటి. జునాగఢ్ సంస్థానం భారత్‌లో విలీనమైన తరువాత సోమనాథ్ దేవాలయం జీర్ణోద్ధరణ చేపట్టాలని కేంద్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. కొన్ని నెలలలోనే ఆ పని పూర్తయింది. ఈ పని కోసం ఏర్పాటు చేసిన ఆధికారిక సంఘానికి అధ్యక్షుడు కెఎం మున్షీ. ఆ సమయంలో లింగ ప్రతిష్ఠాపన కూడా చేయాలని ఆలోచించారు. ఇందుకు రాజేన్‌బాబును ముఖ్య అతిథిగా పిలవాలని మున్షీ ఆకాంక్ష. కానీ ఉన్నత రాజ్యాంగ పదవులలో ఉన్నవారు మత ఉత్సవాలకు వెళ్లరాదన్నది నెహ్రూ నిశ్చితాభిప్రాయం. అయినా మున్షీ ఆహ్వానించడం, నెహ్రూ అభిప్రాయాన్ని పట్టించుకోకుండా రాజేన్‌బాబు హాజరు కావడం జరిగిపోయాయి. రాజేన్‌బాబు నిర్ణయాన్ని సోషలిస్టులు, కమ్యూనిస్టులు విమర్శించారు కూడా. అలాగే హిందూ కోడ్ బిల్లును తీసుకురావడానికి రాజేన్‌బాబు వ్యతిరేకి. అయినా నెహ్రూ ఆ బిల్లును రూపొందించారు. అది రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్లింది. ఈ బిల్లును ఆమోదించిన పార్లమెంట్ ప్రజలు నేరుగా ఎన్నుకున్నది కానందున, ఆ సభ ఆమోదించిన బిల్లు మీద తాను సంతకం చేయబోనని రాజేన్‌బాబు ప్రకటించారు. నెహ్రూ దీని మీద రాష్ట్రపతి కంటే పార్లమెంటే సమున్నతమైనది లేఖ రాశారు. ఇలా విభేదాలు ఇంకా ఎన్నో! 1955లో నెహ్రూ సోవియెట్ రష్యా పర్యటన చరిత్రాత్మకమైనది. ఆయనకు ఘన స్వాగతం లభించింది. తరువాత ఆయనను భారతరత్న పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ సందర్భంలో రాజేన్‌బాబు, ‘జవాహర్ అంటేనే వాస్తవంగా భారతరత్నమే. ఇక ఆయనను లాంఛనంగా భారతరత్న ఎందకు చేయకూడదు?’ అని శ్లాఘించారు. అయినా ఇద్దరి మధ్య విభేదాలు ఆగలేదు. రాజేన్‌బాబు పదవీ కాలం పూర్తయిన తరువాత రెండో దఫా అవకాశం ఇవ్వడానికి నెహ్రూ సుముఖంగా లేరు. అప్పుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరును ముందుకు తీసుకువచ్చారాయన. మళ్లీ మెజారిటీ నిర్ణయాన్ని గౌరవించి రెండో దఫా కూడా రాజేన్‌బాబు రాష్ట్రపతి కావడానికి నెహ్రూ అంగీకరించారు. ఆయన హయాంలోనే మొదటిసారి సామాన్యులు రాష్ట్రపతి భవన్‌లోకి వెళే అవకాశం లభించింది. అందులోని ప్రఖ్యాతి వహించిన మొగల్ గార్డెన్స్‌ను చూసేందుకు రాజేన్‌బాబు అనుమతి మంజూరు చేశారు. నిజమే ఆయన విశ్వాసాలు ఆయనకు ఉన్నాయి. వాస్తవానికి ఆయన జీవితం మొగల్ గార్డెన్‌లోని పూల సమాహారమంతా వైవిధ్యమైనది. గాంధీజీని జనవరి 30, 1948న నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. కానీ చాలామంది తెలియని ఒక చారిత్రక రహస్యాన్ని రాజేన్‌బాబు తాను రాష్ట్రపతి అయిన తరువాత వెల్లడించారు. ఆనాటి సంఘటనలో ఒక వంటవాడు నిజాయితీగా వ్యవహరించి జరిగిన విష ప్రయోగం గురించి వెల్లడించి ఉండకపోతే భారత చరిత్ర వేరే విధంగా ఉండేది. 1917లోనే ఇది జరిగింది. దీనికి ప్రత్యక్షసాక్షి రాజేన్‌బాబు. చంపారన్ కె స్వతంత్ర సేనాని అనే పుస్తకంలో ఈ ఘటనను నమోదు చేశారు. చంపారన్ సత్యాగ్రహం కోసం ఆ సంవత్సరం ఏప్రిల్‌లో గాంధీజీ అక్కడకు వెళ్లారు. 15వ తేదీన మోతీహరి రైల్వే స్టేషన్ దగ్గర వేలాది మంది ఎదురు చూస్తున్నారు. అందులో కొందరు విద్యార్థులు కూడా ఉన్నారు. వారందరి ఉద్దేశం ఒకటే. తాము తెచ్చిన గుర్రపు బగ్గీలో గాంధీజీని తీసుకువెళ్లాలి. ఆ బండిని గుర్రాలు కాకుండా తాము లాగాలి. అలాగే తీసుకువెళ్లారు. గాంధీకి ఇంతటి ప్రాచుర్యం రావడం, చంపారన్ రైతుల ఉద్యమంలో కలగ చేసుకోవడం ఆంగ్లేయులకు సహజంగానే కన్నెర్రగా ఉంది. ఆ సమయంలోనే ఎడ్విన్ అనే ఆంగ్లేయుడు గాంధీజీని ఒక రాత్రి విందుకు పిలిచాడు. అతడు ఒక నీలిమందు ఎస్టేట్ మేనేజర్. అతడి దగ్గర వంటవాడిగా పనిచేస్తున్న వ్యక్తి బాతక్ మెయిన్. గ్లాసుడు పాలలో అతడి చేత విషం కలిపించాడు. ఇదంతా ఏమీ ఎదిరించకుండానే మెయిన్ చేశాడు. కానీ గాంధీకి విషం కలిపిన ఆ పాలగ్లాసు అందిస్తూ విషయం చెప్పేశాడు. గాంధీజీ విష ప్రయోగం నుంచి బయటపడ్డాడు. తరువాత మెయిన్ నరకం చూశాడు. ఏదో కేసులో ఇరికించి అతడిని ఎడ్విన్ కారాగారం పాల్జేశాడు. స్వగ్రామంలోని అతడి ఇంటిని శ్మశానం కోసం ఇచ్చేశారు. దీనికి సాక్షి రాజేన్‌బాబు. రాజేన్‌బాబు దేశాధ్యక్షుడైన తరువాత చంపారన్ వెళ్లారు. ఒక వ్యక్తి పోలీసు వలయాన్ని తప్పించుకుని తన వద్దకు రావాలని ప్రయత్నిస్తున్న సంగతి రాజేన్‌బాబు గమనించారు. ఆ వచ్చిన వ్యక్తి మెయిన్ అని గుర్తు పట్టి రాజేన్‌బాబు స్వయంగా అతడి దగ్గరకు వెళ్లి ఆలింగనం చేసుకుని, తన వెంటే వేదిక మీదకు తీసుకువెళ్లారు. పక్కనే ఉన్న ఆసనంలో కూర్చోపెట్టారు. అప్పుడు గాంధీజీపై జరిగిన విష ప్రయోగం, మెయిన్ సాహసాల గురించి చెప్పారు. మెయిన్ కోల్పోయినదంతా తిరిగి పొందడానికి వీలుగా 24 ఎకరాలు ఇవ్వమని కలెక్టర్‌ను ఆదేశించారు రాజేన్‌బాబు (ఆ కలెక్టర్ ఆ ఆదేశాన్ని అమలు చేయలేదు. ప్రతిభా పాటిల్ వచ్చిన తరువాత ఆమె కూడా కలగేచేసుకుని తొలి రాష్ట్రపతి ఆదేశాలను గౌరవించాలని చూశారు. ఇప్పటికీ సాధ్యం కాలేదు). బాబూ రాజేంద్రప్రసాద్ భారతదేశ మహోద్యమానికి సాక్షి. మారుతున్న కాలంతో పాటు మారిన మనిషి. స్వతహాగా మానవతావాది. 1914లో వరదలు వచ్చి బెంగాల్, బిహార్ అతలాకుతలమైనప్పుడు కోర్టుకు వెళ్లడం మానేసి కొన్ని లక్షల రూపాయలు వసూలు చేసి బాధితులకు ఇచ్చారాయన. ఒక భూస్వామిక కుటుంబం నుంచి వచ్చి జీవితపు చరమాంకంలో ఆ హోదాను పూర్తిగా మరచిపోయిన కర్మయోగి రాజేన్‌బాబు. గాంధీజీని ఆనాడు ఆయన ఇంటి నౌకర్లు లోపలికి అనుమతించకపోవడానికి కారణం ఆయనను కింది కులాల నుంచి వచ్చిన వ్యక్తి అని భావించడమే. తరువాత సాటి మనిషిని అలాంటి పరిస్థితిలోకి నెట్టివేయడం ఎంత ఘోరమో ఆయన గుర్తించారని అనిపిస్తుంది. అంటరానితనం నిర్మూలన కోసం పనిచేశారు. తన నివాసాన్ని తనే శుభ్రం చేసుకునేవారు. తన వంట తనే చేసుకునేవారు. పాత్రలు శుభ్రం చేసుకునేవారు. ఇదంతా గాంధీ ప్రభావమే. 1962లో రాజేన్‌బాబు సతీమణి రాజవంశీదేవి కన్నుమూశారు. తరువాత ఆయన ఆరోగ్యం క్షీణించింది. నెహ్రూ గురించి రాజేన్‌బాబు అభిప్రాయం 1950లోనే మారడం మొదలయింది. 1962 నాటి చైనా యుద్ధం తరువాత నెహ్రూ అభిప్రాయాలు, దృష్టికోణం మొత్తం మారాయి. అందులో రాజేన్‌బాబు మీద ఆయనకు ఉన్న అభిప్రాయం కూడా మారింది. నిజానికి చైనా దురాక్రమణ తొలి రాష్ట్రపతిని, తొలి ప్రధానిని కూడా కలచివేసింది. రాజేన్‌బాబు కన్నుమూసినప్పుడు నెహ్రూ అన్నమాటే అందుకు నిదర్శనం, ‘ఆయన భారతదేశానికి ప్రతీక. రాజేన్‌బాబు కన్నుల ద్వారా మనం సత్యాన్ని దర్శించవచ్చు.’ - డా. గోపరాజు నారాయణరావు -
నలుగురు ఎంపీలది ఫిరాయింపే
సాక్షి, అమరావతి: నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడం ఫిరాయింపేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు తెలిపారు. తాజా రాజకీయ పరిణామాలపై ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో శనివారం ఆయన అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యసభలో మెజారిటీ కోసమే బీజేపీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని విమర్శిం చారు. ప్రజావేదికలో చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తిగత సామగ్రిని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బయట పెట్టడం సరికాదన్నారు. ప్రతిపక్ష నేతగా ఉండవల్లిలోని ప్రజావేదికను వాడుకునేందుకు తనకు కేటాయించాలని చంద్రబాబు లేఖ రాశారని, దీనిపై సమాధానం ఇవ్వకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం కక్ష సాధింపేనని విమర్శించారు. ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ నలుగురు ఎంపీల విలీనం అనైతికం, అప్రజాస్వామికమేనన్నారు. దీనిపై న్యాయ పోరాటానికి సంబంధించిన అంశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. నీతివంతమైన పాలన అందిస్తామని చెప్పిన బీజేపీ.. టీడీపీ ఎంపీలను చేర్చుకోవడం తప్పేనని మాజీ మంత్రి దేవినేని ఉమా తప్పుబట్టారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమలు చేసిన రుణమాఫీ మిగిలిన విడతలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం విడుదల చేయాలని యనమల పేర్కొన్నారు. ప్రభుత్వం తన ప్రాధాన్యతలు నెరవేరుస్తూనే గత ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను కొనసాగించాలన్నారు. ఇదిలా ఉండగా బీజేపీలోకి వెళతారని ప్రచారం జరగుతుండడంతో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును ఈ సమావేశానికి ప్రత్యేకంగా పిలిచారు. కొందరు నేతలు పార్టీ మా ర్పు గురించి అడగ్గా ఆయన సరైన సమాధానం ఇవ్వలేదని సమాచారం. చంద్రబాబుతో మాట్లాడాలని, టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడాలని చెప్పినా తాను వ్యక్తిగతంగా మాట్లాడతానని చెప్పి వెళ్లిపోయినట్లు తెలిసింది. మీడియాతో కూడా మాట్లాడకుండా వెళ్లిపోవ డం చర్చనీయాంశమైంది. సమావేశంలో ఎమ్మెల్యేలు మద్దాలి గిరి, ఎమ్మెల్సీలు, వీవీవీ చౌదరి, బాబూ రాజేంద్రప్రసాద్, అశోక్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు పెందుర్తి వెంకటేశ్, శ్రావణ్‌కుమార్‌లు పాల్గొన్నారు. చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ ఇదిలా ఉండగా తాజా రాజకీయ పరిణామాలపై విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజావేదికను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం సరికాదని ప్రచారం చేయాలని, దీనిపై నేతలందరూ మీడియా సమావేశాలు పెట్టాలని ఆయన సూచించినట్లు తెలిసింది. ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఓవర్ యాక్షన్ ఉండవల్లిలోని కృష్ణా నది కరకట్ట దిగువన ఉన్న ప్రజావేదిక వద్ద టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ కాసేపు ఓవర్ యాక్షన్ చేశారు. కలెక్టర్ల సమావేశం నిమిత్తం ప్రజావేదికలో ఏర్పాట్లు చేస్తుండగా అక్కడకు వచ్చిన రాజేంద్రప్రసాద్.. చంద్రబాబు సామాన్లు, టీడీపీ కార్యాలయం నమూనాను ఎవరు బయట పెట్టారని అధికారులను ప్రశ్నించారు. తమ అనుమతి లేకుండా వస్తువులు ఎలా బయటపెడతారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. తాము నిబంధనల ప్రకారమే విధులు నిర్వహిస్తున్నామని అధికారులు సమాధానం చెప్పారు. గతంలో కలెక్టర్ల సమావేశం ప్రజావేదికలో జరిగేదని, ఇప్పుడు కూడా అలానే ఏర్పాటు చేస్తున్నామని అధికారులు చెప్పుకొచ్చారు. అనంతరం రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశం పెడితే ఇబ్బందవుతుందని తెలిపారు. ఇక్కడ రోడ్లు, స్థలం ఇరుకుగా ఉంటాయన్నారు. చంద్రబాబు కట్టిన ప్రజావేదికలోనే కలెక్టర్ల సమావేశం పెట్టలా.. వేరే చోట పెట్టుకోకూడదా అని ప్రశ్నించారు. ఒకప్పుడు ప్రజావేదిక జర్నలిస్ట్‌లకు షెల్టర్‌గా ఉండేదని చెప్పగానే, విలేకరులు ఆయన మాటలకు అడ్డుపడుతూ.. తమని ఎన్నడూ ప్రజా వేదికలోకి రానివ్వలేదన్నారు. -
ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఓవర్ యాక్షన్..
-
ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఓవర్ యాక్షన్..
సాక్షి, అమరావతి : ప్రజా వేదిక వద్ద టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ కాసేపు ఓవర్ యాక్షన్ చేశారు. కలెక్టర్ల సమావేశం నిమిత్తం ప్రజా వేదికలో ఏర్పాట్లు చేస్తుండగా శనివారం అక్కడకు వచ్చిన రాజేంద్రప్రసాద్ చంద్రబాబు సామాన్లు, టీడీపీ కార్యాలయం నమూనాను ఎవరు బైటపెట్టారని అధికారులను ప్రశ్నించారు. తమ అనుమతి లేకుండా వస్తువులు ఎలా బయటపెడతారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగాడు. అయితే తాము నిబంధనల ప్రకారమే విధులు నిర్వహిస్తున్నామని అధికారులు సమాధానం చెప్పారు. గతంలో కలెక్టర్ల సమావేశం ప్రజా వేదికలో జరిగేదని.. ఇప్పుడు కూడా అలానే ఏర్పాటు చేస్తున్నామని అధికారులు చెప్పుకొచ్చారు. అనంతరం రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశం పెడితే ఇబ్బందవుతుందని తెలిపారు. ఇక్కడ రోడ్లు, స్థలం ఇరుకుగా ఉంటయన్నారు. చంద్రబాబు కట్టిన ప్రజా వేదికలోనే కలెక్టర్ల సమావేశం పెట్టలా.. వేరే చోట పెట్టుకోకూడదా అని ప్రశ్నించారు. ఒకప్పుడు ప్రజా వేదిక జర్నలిస్ట్‌లకు షెల్టర్‌గా ఉండేదన్నారు రాజేంద్రప్రసాద్. అయితే విలేకరులు ఆయన మాటలకు అడ్డుపడుతూ.. తమని ఎన్నడూ ప్రజా వేదికలోకి రానివ్వలేదన్నారు. మీడియా ప్రతినిధుల సమాధానంతో కంగుతిన్న రాజేంద్రప్రసాద్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
మానవ కంప్యూటర్
సాక్షి, కడప : కడప జిల్లాకు చెందిన లక్కోజు సంజీవరాయశర్మ గొప్ప గణిత మేధావిగా పేరు గాంచారు. దేశ, విదేశీయుల చేత ప్రశంసలు అందుకున్నారు. ఆయన ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామానికి చెందినవారు. 1907 నవంబర్ 28న జన్మించారు. పుట్టుకతోనే చూపులేదు. అంధుడు పుట్టాడని పెంచడం కష్టమని.. గొంతు పిసికి దిబ్బలో పూడ్చేయాలని మంత్రసాని సలహా ఇచ్చింది. మరికొందరు మహిళలు పురిటి బిడ్డ నోట్లో వడ్ల గింజలు వేశారు. అయినా ఆ పసివాడు చావలేదు సరికదా.. చక్కగా ఆరోగ్యంగా ఎదిగాడు. ప్రపంచం ఈర్ష్యపడే స్థాయికి పేరుగాంచారు. ఆ రోజులలో బ్రెయిలీ లిపి లేకపోవడంతో సంజీవరాయ శర్మ చదువుకునేందుకు వీలు కాలేదు. అక్క బడికి వెళ్లి వచ్చాక ఇంటి వద్ద పాఠాలను గట్టిగా చదువుతుంటే విని గుర్తు పెట్టుకునేవాడు. అలా ఆయనకు మామూలు పాఠాలతోపాటు గణితం బాగా వచ్చింది. అందులో అపార జ్ఞానం సాధించారు. అతని బాల్య దశలోనే తండ్రి చనిపోయారు. తల్లే పెంచింది. పల్లెల్లో రైతులకు ధాన్యం ధర, భూమి కొలతలు తదితర అంశాలను సంజీవరాయశర్మ క్షణాల్లో చెప్పేవారు. రైతులు ఈ సాయానికి గానూ ఆయనకు అంతో.. ఇంతో డబ్బు ఇచ్చేవారు. ఆ వయసులోనే వయొలిన్ పట్ల ఆకర్షితుడై వాయించడం నేర్చుకున్నారు. తర్వాత వయొలిన్ వాయించడం జీవితంలో ఒక భాగమైంది. గణితంలో ప్రజ్ఞ సాహిత్యంలో కవులు అవధానాలు చేయడం తెలిసిందే. అంటే 8 మంది వరుసగా ప్రశ్నలు వేస్తుంటే ఆయా అంశాలకు వెంట వెంటనే పద్యాల రూపంలో జవాబు చెప్పాలి. అలాగే గణితంలో కూడా అవధానం ఉంది. లక్కోజు సంజీవరాయ శర్మ గణితంలో అవధానాలు చేయడంలో దిట్టగా మారారు. పుట్టిన తేదీ, సంవత్సరం, ప్రదేశం, సమయం చెప్పగానే ఆయన దానికి సంబంధించిన తిధి, వార, నక్షత్ర, యోగ, కరణాలు చెప్పేసేవారు. దాంతోపాటు క్లుప్తంగా జాతకాన్ని కూడా తెలిపేవారు. అలా ఆయన దేశమంతటా మొత్తం 6 వేల గణిత అవధానాలు చేశారు. వేలాది మంది కూర్చున్న సభలో నిమిషానికి 20, 30 కష్టమైన లెక్కలకు అడిగిన వెంటనే సమాధానాలు చెప్పేవారు. ప్రశ్న అడగ్గానే వయొలిన్‌ను కొద్దిగా పలికించి వెంటనే సమాధానం చెప్పేవారు. ఈ విద్య ఎలా నేర్చుకున్నావు అని అడిగితే దైవ దత్తంగా వచ్చిందని బదులిచ్చేవారు. ప్రపంచంలోనే గణితం విషయంలో బెంగళూరుకు చెందిన శకుంతలాదేవి కంప్యూటర్ను ఓడించిందంటారు. అలాంటి శకుంతలాదేవినే ఓడించిన గొప్ప వ్యక్తి లక్కోజు సంజీవరాయశర్మ. ఎంత పెద్ద లెక్క అడిగినా కూడా క్షణాల్లో బదులిచ్చేవారు. గౌరవ పురస్కారాలు గణితంలో లక్కోజు గొప్పతనం తెలిసి.. దేశమంతటా ఎందరో గొప్పవాళ్లు ఆయన అవధానాలకు వెళ్లేవారు. మరికొందరు పెద్దలు ప్రత్యేకంగా అవధానం చేయించి విని ఆశ్చర్యపోయేవారు. 1959లో నాటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ ఢిల్లీలో లక్కోజుతో గణిత అవధానాన్ని ఏర్పాటు చేయించి, తిలకించారు. ఆ కార్యక్రమానికి పండిట్ జవహర్లాల్ నెహ్రూ కూడా హాజరయ్యారు. శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ 1996లో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. తొలిసారిగా 1928లో గణిత అవధానం చేశారు. 1995 వరకు దేశమంతటా 6 వేల ప్రదర్శనలు ఇచ్చారు. 1928 నవంబర్ 15న నంద్యాలలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో ప్రధాన ఆకర్షణగా నిలిచి వందలాది లెక్కలకు బదులిచ్చారు. 19 ఏళ్ల వయసులోనే వివాహమైంది. అప్పట్లో ఆయన సతీమణి వయసు 9 ఏళ్లు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. 1994 జనవరి 5న ఆమె శ్రీకాళహస్తిలో ఉండగా మరణించారు. సంజీవరాయశర్మ హైదరాబాద్‌లోని కుమారుడి వద్దకు చేరుకున్నారు. 1997 డిసెంబర్ 2న కన్నుమూశారు. ప్రపంచం మొత్తాన్ని తన అద్భుతమైన గణిత విద్యతో ఆకట్టుకున్న గొప్ప వ్యక్తి ఇంత వరకు ఈ భూమిపై మరొకరు పుట్టలేదని.. ప్రపంచంలోని గణిత మేధావులంతా ఎంతో ప్రశంసించారు. -
సినిమాల్లో బ్రహ్మానందంలా ఆయన తీరు
-
సినిమాల్లో బ్రహ్మానందంలా ఆయన తీరు
సాక్షి, అమరావతి : వైఎస్ జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిలపై ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌తో నీచ వ్యాఖ్యలు చేయించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాజాగా తన వ్యూహాన్ని మార్చినట్టు కనిపిస్తోంది. వైఎస్ జగన్‌పై విజయమ్మ, షర్మిలే దాడి చేయించారంటూ రాజేంద్రప్రసాద్ చేసిన అత్యంత దిగజారుడు వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో చంద్రబాబు ఆత్మరక్షణలో పడ్డారు. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ.. టీడీపీ నేత జూపూడి ప్రభాకర్‌రావు మీడియా ముందుకు వచ్చారు. ఇంత తీవ్రమైన వ్యవహారం నడుస్తున్నప్పుడు జోక్‌లు చేయడం సరికాదని రాజేంద్రప్రసాద్‌కు జూపూడి హితవు పలికారు. ఎమ్మెల్సీ మాట్లాడిన తీరు సినిమాల్లో బ్రహ్మానందం కామెడి చేసినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. రాజేంద్రప్రసాద్ వ్యవహరించిన తీరు మొత్తం వ్యవహారాన్ని తప్పదోవ పట్టించేదిగా ఉందని విమర్శలు గుప్పించారు. బాధ్యతగల పదవిలో ఉన్న రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేయాలనీ, ఎమ్మెల్సీ అనుచిత వ్యాఖ్యలపై ఏం చర్యలు తీసుకోవాలో పార్టీ నిర్ణయిస్తుందని జూపుడి చెప్పుకొచ్చారు. అయితే, రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో చంద్రబాబే జూపూడితో మాట్లాడించారని, రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని జూపూడితో చెప్పించి.. ఈ వ్యాఖ్యల నుంచి దూరం జరిగేందుకు చంద్రబాబు ప్రయత్నించారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. -
రాజేంద్రప్రసాద్‌కు కవిత వార్నింగ్
సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ సినీరంగంపై చేసిన కామెంట్లకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకురాలు, సినీ నటి కవిత డిమాండ్ చేశారు. సినిమావాళ్లంటే టీడీపీకి అంతచులకనగా కనిపిస్తున్నారా? అని ప్రశ్నించారు. టీడీపీలో ఉన్న సినీ ప్రముఖులు ఎందుకు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయలేదో వాళ్లను ముందు అడగమని రాజేంద్ర ప్రసాద్‌కు హితవు పలికారు. మరోసారి సినీ రంగంపై విమర్శలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆమె హెచ్చరించారు. -
టీడీపీలో ‘సినిమా’ పంచాయితీ
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీలో సినిమా పంచాయితీ తారాస్థాయికి చేరింది. రెండు రోజుల క్రితం ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ సినీ పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ వ్యవహారాన్ని నటుడు, ఎంపీ మురళీ మోహన్ వద్ద పలువురు టాలీవుడ్ ప్రముఖులు ప్రస్తావించారు. దీంతో రాజేంద్రప్రసాద్‌పై ముఖ్యమంత్రికి ఆయన ఫిర్యాదు చేశారు. గురువారం జరిగిన టెలీకాన్ఫరెన్స్ పాల్గొన్న ఆయన, రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సినిమా పరిశ్రమ నుంచి మెజార్టీ నటులు, సాంకేతిక సిబ్బంది టీడీపీలోనే ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు. రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు తనతో పాటు ఇండస్ట్రీలోని చాలామందిని బాధపెట్టాయని ఈ సందర్భంగా మురళీమోహన్ అభిప్రాయపడ్డారు. అయితే రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యల సారాంశం పూర్తిగా తెలియదన్న చంద్రబాబు.. ఎవరిపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడం టీడీపీ విధానం కాదని వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఒక వేళ ఎవరైనా అలా ప్రవర్తించినా తప్పక చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి అన్నట్టు సమాచారం. మరోవైపు రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలను పార్టీలోని మెజార్టీ ఎమ్మెల్యేలు సమర్థిస్తున్నారు. ప్రముఖులుగా ఉన్నవారు ఏపీ ప్రత్యేక హోదా పోరాటంలో పాల్గొంటే బాగుంటుందని ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. అయితే తాజా పరిణామాలపై రాజేంద్రప్రసాద్ ఎలా స్పందిస్తారో చూడాలి. అసలేం జరిగింది? ప్రత్యేక హోదా పోరాటంపై తెలుగు సినిమా పరిశ్రమకు ఏ మాయరోగం వచ్చింది? చేవ తగ్గిపోయిందా? రూ.వందల కోట్ల కనక వర్షం మత్తులోంచి బయటకు రాలేకపోతున్నారా? అంటూ ఎమ్మెల్సీ వై.రాజేంద్రప్రసాద్ రెండు రోజుల క్రితం తీవ్రంగా విమర్శించారు. తెలుగు డైరెక్టర్లు హీరోయిన్ల అందాలను వర్ణించడానికే పనికొస్తారు తప్ప.. వారికి సామాజిక స్పృహ, బాధ్యత లేవని దుయ్యబట్టారు. తెలుగు సినిమా కళాకారులు హైదరాబాద్‌లో బానిస బతుకులు బతుకుతున్నారన్నారు. ప్రత్యేక హోదాకు మద్దతు పలికితే తెలంగాణ ప్రజలు హైదరాబాద్ నుంచి తన్ని తరిమేస్తారని, ఆస్తులు లాక్కుంటారని భయపడుతున్నారా? అని ప్రశ్నించారు. తమిళనాడులో జల్లికట్టు కోసం సినీపరిశ్రమంతా ఒక్కతాటిపైకి వచ్చి ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తే ఇక్కడి కళాకారులు మాత్రం ఏసీ గదుల్లో కులుకుతున్నారంటూ ఆరోపించారు. అవార్డులు రాకపోతే లొల్లి చేసే వీరు రాష్ట్రానికి నిధులు రావడం లేదన్న విషయం చెవులకు ఎక్కడం లేదా? మీ కళ్లకు కనపడటం లేదా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా తెలుగు సినిమా పరిశ్రమ హోదా ఉద్యమంలో పాల్గొనాలని లేకపోతే 5 కోట్ల మంది ఆంధ్రులు తెలుగు సినిమా కళాకారులను వెలివేయడానికి వెనుకాడరంటూ హెచ్చరించారు. దర్శక, నిర్మాతల ఫైర్ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై పలువురు దర్శక, నిర్మాతలు మండిపడ్డారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడో చెప్పారు కానీ అప్పటి నుంచీ మౌనంగా ఉన్న చంద్రబాబు నాయుడికి ఇప్పుడెందుకు గుర్తుకొచ్చిందని సూటిగా అడిగారు. తాము ఏసీల్లో కులుకుతున్నామా..? టీడీపీ నాయకులే లంచాలు తిని ఏసీల్లో కులుకుతున్నారని ధ్వజమెత్తారు. ఆడవాళ్ల అందాలతో సినిమా తీసేవాళ్లు టీడీపీలోనే ఉన్నారని, వారెందుకు హోదా కోసం పోరాడరు అని ప్రశ్నించారు. -
తెలుగు దేశం Vs తెలుగు సినిమా
-
టీడీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై పోసాని బహిరంగ సవాల్
-
తెలుగు సినిమా వాళ్లకి అంత సీన్ లేదు
సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా పోరాటంపై తెలుగు సినిమా పరిశ్రమకు ఏ మాయరోగం వచ్చింది? చేవ తగ్గిపోయిందా? రూ.వందల కోట్ల కనక వర్షం మత్తులోంచి బయటకు రాలేకపోతున్నారా? అంటూ ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ వై.రాజేంద్రప్రసాద్ తీవ్రంగా విమర్శించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ తెలుగు హీరోలకు అంత సీన్ లేదని, వారు హాలీవుడ్ స్థాయి నటులు కారని, అంతా ఏజ్ బార్ అయిపోయిన ముసలివాళ్లే ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. తెలుగు డైరెక్టర్లు హీరోయిన్ల అందాలను వర్ణించడానికే పనికొస్తారు తప్ప.. వారికి సామాజిక స్పృహ, బాధ్యత లేవని దుయ్యబట్టారు. తెలుగు సినిమా కళాకారులు హైదరాబాద్‌లో బానిస బతుకులు బతుకుతున్నారన్నారు. ప్రత్యేక హోదాకు మద్దతు పలికితే తెలంగాణ ప్రజలు హైదరాబాద్ నుంచి తన్ని తరిమేస్తారని, ఆస్తులు లాక్కుంటారని భయపడుతున్నారా? అని ప్రశ్నించారు. తమిళనాడులో జల్లికట్టు కోసం సినీపరిశ్రమంతా ఒక్కతాటిపైకి వచ్చి ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తే ఇక్కడి కళాకారులు మాత్రం ఏసీ గదుల్లో కులుకుతున్నారంటూ ఆరోపించారు. అవార్డులు రాకపోతే లొల్లి చేసే వీరు రాష్ట్రానికి నిధులు రావడం లేదన్న విషయం చెవులకు ఎక్కడం లేదా? మీ కళ్లకు కనపడటం లేదా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా తెలుగు సినిమా పరిశ్రమ హోదా ఉద్యమంలో పాల్గొనాలని లేకపోతే 5 కోట్ల మంది ఆంధ్రులు తెలుగు సినిమా కళాకారులను వెలివేయడానికి వెనుకాడరంటూ హెచ్చరించారు. -
టాలీవుడ్ పరిశ్రమపై టీడీపీ ఎమ్మెల్సీ తీవ్ర వ్యాఖ్యలు
-
‘రాజేంద్రప్రసాద్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి’
సాక్షి, విజయవాడ : బీజేపీకి అంత సీన్ లేదంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. ఈ వ్యాఖ్యలను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్రంగా తప్పుబట్టారు. సోము వీర్రాజు మంగళవారం ఇక్కడ గుజరాత్ ఎన్నికల ఫలితాలపై మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికైనా రాజేంద్రప్రసాద్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిదని ఆయన హితవు పలికారు. సోము వీర్రాజు మాట్లాడుతూ...‘కాంగ్రెస్ సహకారంతోనే నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా చంద్రబాబు ఒకరిని ప్రధానమంత్రిని చేశారు. టీడీపీతో పొత్తు లేనప్పుడే మాకు 18 శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీతో కలిసి వెళ్లడం వలన 2004 ఎన్నికల్లో ఓడిపోయాం. ఇలాంటి నిర్ణయం చరిత్ర తప్పిదం. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2009లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయింది. బీజేపీతో పొత్తు పెట్టుకుని చరిత్రాత్మక తప్పు చేశామని చంద్రబాబు గతంలో చెప్పారు. 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోమని ఉదయం చెప్పి... సాయంత్రానికి చల్లబడ్డారు. కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి మేము ఎక్కువ స్థానాల్లో గెలిసేవాళ్లమని, అయితే టీడీపీ వాళ్లు డబ్బులు ఖర్చు పెట్టి గెలిచారు. కాకినాడకు స్మార్ట్ సిటీ, పోర్ట్ ఇచ్చాం. కాకినాడలో చెప్పుకోవడానికి టీడీపీకి ఏమీలేదు. ప్రతిసారి మిత్రపక్షం చేతిలో మోసపోతున్నాం. కనీపం పార్టీ కార్యకర్తలకు కూడా ఇళ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు ఇప్పించుకోలేకపోతున్నాం. బీజేపీ ఎదుగుతుంటే అడ్డుకొనేందుకు కుట్ర చేస్తున్నారు. లేకుంటే ప్రత్యేక హోదా అంశాన్ని తెరమీదకు తెస్తున్నారు. ప్యాకేజీకి చంద్రబాబు ఒప్పుకున్నారు. ప్యాకేజీ ద్వారా వచ్చేది 3వేల కోట్లు మాత్రమే. పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగించింది బీజేపీనే. పోలవరంపై చిత్తశుద్ధి ఉంటే 1995 నుంచి 2004 వరకూ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎందుకు శంకుస్థాపన చేయలేకపోయారు. మరి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎందుకు పోలవరం ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. బీజేపీతో పొత్తు వద్దనుకుంటే చంద్రబాబు చెప్పాలి. టీడీపీ నేతలు వాళ్ల పరిధిని మించి మాట్లాడుతున్నారు.’ అని మండిపడ్డారు. బీజేపీకి అంత సీన్ లేదు... కాగా వచ్చే ఎన్నికల నాటికి తాము (బీజేపీ) హీరోలుగా మారతాం. ఏపీలో బీజేపీ బలపడుతుందన్న సోము వీర్రాజు వ్యాఖ్యలపై టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ స్పందిస్తూ.. సోము వీర్రాజు ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని, ఏపీలో బీజేపీ బలోపేతం అవుతుందని కలలు కంటున్నారని అన్నారు. ‘మా దయ వల్లే ఏపీలో బీజేపీకి నాలుగు సీట్లు వచ్చాయి. మా దయ లేకుంటే బీజేపీకి ఆ సీట్లు కూడా వచ్చేవి కావు. బీజేపీ నేతలు కలలు కనడం మానుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి అంత సీన్ లేదు. మా దయాదాక్షిణ్యాల వల్లే మనుగడ సాగిస్తున్నారు.’ అని వ్యాఖ్యలు చేశారు. -
1950లో ఏం జరిగింది?!
స్వతంత్ర భారతానికి ఎందరో ప్రధానులు వచ్చారు.. ఒక్క నరేంద్ర మోదీకే ఎందుకంత ప్రత్యేకత? మోదీ జన్మించిన 1950 సంవత్సరం ఏం జరిగింది? మోదీని ప్రభావితం చేసిన అంశాలేంటి? కరుడుగట్టిన హిందుత్వ వాదిలా మోదీ ఎందుకు మారారు? తెలుసుకోవాలంటే ఈ ప్రత్యేక కథనాన్ని చదవాల్సిందే. సెప్టెంబర్ 17.. స్వేచ్ఛావాయువులు పీల్చుకునే స్వతంత్ర భారతంలో జన్మించిన తొలి ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం. ఆయన పుట్టిన రోజున సహజంగానే బీజేపీ శ్రేణులు అట్టహాసంగా నిర్వహిస్తాయి. అందులోనూ ప్రధాని మోదీ తన పుట్టిన రోజున స్వచ్ఛ దివస్‌గా నిర్వహించాలని పిలుపునివ్వడంతో సాధారణ కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి వరకూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మించిన 1950 చారిత్రక విశేషాలను ఒక్కసారి పరిశీలిస్తే... దేశానికి 1947లో స్వతంత్రం వచ్చినా.. 1950 వరకూ బ్రిటన్ అధికారిక వైస్రాయి పాలనలో ఉంది. అప్పటి బ్రిటన్ రాజు జార్జి VI దేశానికి వైశ్రాయ్‌గా వ్యవహరించారు. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ 1950, జనవరి 26న ఆమోదించింది. రాజ్యాంగం అమల్లోకి రావడంతో వైస్రాయి పాలన, రాచరిక అనువంశిక పాలన ముగిసింది. 1950లోనే భారత దేశం సర్వసత్తాక, సామ్యవాద, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. రిపబ్లిక్ ఇండియాకు తొలి రాష్ట్రపతిగా బాబూ రాజేంద్రప్రసాద్ 1950 జనవరి 26న ప్రమాణ స్వీకారం చేశారు. నిజం చెప్పాలంటే.. భారతదేశం గణతంత్ర, ప్రజాస్వామ్య దేశంగా ఆ రోజే ఆవిర్భవించించింది. అప్పటివరకూ భారత దేశానికి గవర్నర్ జనరల్‌గా వ్యవహరించిన చక్రవర్తి రాజగోపాలచారి రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్లో బాబూ రాజేంద్రప్రసాద్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. రాజేంద్రప్రసాద్ ప్రమాణ స్వీకారం తరువాత సైనికులు 31 సార్లు గాల్లోకి కాల్పులు జరిపారు. భారతదేశంగా గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించడానికి ఒక్క రోజు ముందు స్వతంత్ర ఎన్నికల వ్యవస్థ (ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా) పురుడుపోసుకుంది. రాజ్యాంగం ప్రకారం దేశంలోని పౌరులందరికీ.. సార్వజనీన ఓటు హక్కును ప్రసాదించింది. అప్పుడే స్వతంత్రం పొందిన భారత్ - నేపాల్ తొలిసారిగా మిత్రదేశాలుగా ఉండేందుకు అంగీకారానికి వచ్చాయి. పూర్వకాలం నుంచి ఉన్న మత, రాజకీయ, సాంస్కృతిక సారూపత్యలను కాపాడుకుంటూ..ఒకరికొకరు సహాయం చేసుకునేందుకు ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి. 1950లోనే ఇరు దేశాలు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు, పరిశ్రమలు, రైల్వేలు, వ్యవసాయాభివృద్ధికి జీవం పోసిన ప్రణాళికా సంఘం 1950లోనే ఆవిర్భవించింది. పంచవర్ష ప్రణాళికల పేరుతో దేశాభివృద్ధికి ప్రాణాళికా సంఘం దిశానిర్దేశం చేసింది. ప్లానింగ్ కమిషన్ మొత్తం 12 పంచవర్ష ప్రణాళికలు రూపొందించింది. దేశ విభజన తరువాత మొదటిసారి పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ ఆలీఖాన్, భారత ప్రధాని పండిట్ నెహ్రూ ఢిల్లీ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఆయా దేశాలకు వెళ్లాలనుకునేవారిని స్వేచ్ఛగా, వారి ఆస్తులతో సహా పంపాలని నిర్ణయించారు. అయితే పాకిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చే వారిని నిర్దాక్షిణ్యంగా హత్య చేయడంతోపాటు.. లక్షలాదిమంది మహిళలపై అత్యాచారాలు చేశారు. 1950 వరకూ బ్రిటన్ ఆధీనంలో ఉన్న అండమాన్ నికోబార్ దీవులు, బర్మా (నేటి మయన్మార్)లను భారత్‌లో విలీనం చేసింది. అదే ఏడాది స్వాతంత్ర దినోత్సవం నాడు.. అసోం, టిబెట్‌లో అతిపెద్ద భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 8.6గా నమోదైంది. ఈ ఘటనలో 3 వేల మంది ప్రజలు మరణించి ఉంటారని అంచనా. సెప్టెంబర్ 17న నరేంద్ర దామోదర్ దాస్ మోదీ.. ప్రస్తుత గుజరాత్ (నాటి బొంబాయి స్టేట్)లో జన్మించారు. -
వీర్రాజు మాటలకు బీజేపీ అనుమతి వుందా?
-
హక్కుల కోసం ఐక్య ఉద్యమాలు
తిరుపతి, న్యూస్‌లైన్ : సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల హక్కుల కోసం ఐక్య ఉద్యమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఆదివారం తిరుపతిలో ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలను బాబూ రాజేంద్రప్రసాద్ ప్రారంభించి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ గత కాంగ్రెస్ పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమై పోయిందన్నారు. సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారన్నారు. రాజ్యాంగంలోని 73, 74 అధికరణల సవరణల ప్రకారం సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు ఇవ్వాల్సిన నిధులు, విధులు, అధికారాలను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 జి, 11వ షెడ్యూల్లో పేర్కొన్న 29 విభాగాలపై అధికారాలను దాఖలు పరచి స్థానిక స్వపరిపాలన, స్వయం పోషకత్వాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టతకు, హక్కుల సాధనకు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పార్టీలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయాలని కొత్తగా ఏర్పడిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను డిమాండ్ చేస్తున్నామన్నారు. సమావేశంలో వివిధ జిల్లాలకు చెందిన చాంబర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీ.అరవిందనాథరెడ్డి, బిర్రు ప్రతాప్‌రెడ్డి, సీహెచ్ సత్యనారాయణరెడ్డి, కాట్రగడ్డ రఘు, టంకాల బాబ్జీ, వీరంకి గురుమూర్తి, సుమతి, చింతాల సోమన్న, జగ్గాల రవి, పడాల వెంకట్రామారెడ్డి, సింగంశెట్టి సుబ్బరామయ్య తదితరులు పాల్గొన్నారు. -
చరిత్రకు సాక్ష్యం - దేవరంపాడు
ఒంగోలు రూరల్ న్యూస్‌లైన్: నిష్కళంక రాజకీయ నాయకుడు బాబు రాజేంద్రప్రసాద్ కాలుమోపిన ప్రాంతమిది. ఉప్పు సత్యాగ్రహ ఉద్యమానికి నిలువెత్తు సాక్ష్యం ఈ గ్రామం. అటువంటి ఈ దేవరంపాడును పర్యాటక కేంద్రంగా మార్చివేస్తామని ప్రతి ఏటా ప్రజా ప్రతినిధులు హామీపై హామీలు గుప్పిస్తారు. తరువాత తూతూ మంత్రంగా కొన్ని కార్యక్రమాలు చేసి చేతులు దులుపుకుంటారు. దీంతో ఎన్నో యేళ్లుగా పర్యాటకకేంద్రం ఏర్పాటు కలగానే మిగిలింది. అంధ్రకేసరి ప్రకాశం పంతులు దండి సత్యాగ్రహంలో భాగంగా గాంధీజీ పిపులునందుకొని ఒంగోలు మండలం దేవరంపాడు గ్రామ శివారు గుండ్లకమ్మ నది ఒడ్డున ఉద్యమం చేపట్టారు. ఫలితంగా బ్రిటీష్ ప్రభుత్వం దిగివచ్చింది. దానికి గుర్తుగా దేవరంపాడులో 1935 నవంబర్ 21న అప్పటి ఏఐసీసీ అధ్యక్షుడు బాబు రాజేంద్రప్రసాద్ విజయ స్థూపం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రకాశం పంతులుకు గాంధీ రాసిన అభినందన లేఖ దేవరంపాడు గ్రంథాలయంలో భద్రపరిచారు. ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన తరువాత ప్రకాశంపంతులు దేవరంపాడు విడిది ఏర్పాటు చేసుకొని నివశించారు. ఇక్కడి రాజుల కుటుంబాలు వారు ఆయనకు మామిడి తోటలు రాసిచ్చాశారు. ఆంధ్రకేసరి చివరి మజిలీలో ఎక్కువ సమయం తన కిష్టమైన విజయస్థూపం దగ్గరే గడిపేవారు. ఈ సందర్భంగా దివంగత దేవాదాయశాఖ మంత్రి దామచర్ల ఆంజనేయులు ఈ ప్రాంతాన్ని చారిత్రాత్మక ప్రదేశంగా గుర్తించుకొనేలా చేస్తామన్నారు. కలెక్టర్లు క్రిష్ణబాబు, ఉదయలక్ష్మి అక్రమణలపాలైన విజయస్థూపం భూములను స్వాధీనం చేసుకుంటామని హామీ ఇచ్చారు. తరువాత వచ్చిన కలెక్టర్ కరికాల వళవన్ భూములు కొలతవేసి ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేశారు. ఇటువంటి కంటి తుడుపు చర్యలే తప్ప చారిత్రక ప్రదేశంగా గుర్తింపునిచ్చే గట్టి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జిల్లా ప్రజల కలను తీర్చాల్సిన అవసరం ఉంది. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం ఆత్మీయబంధంగా ఉన్న విజయ స్థూపం ప్రాంతంను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి.