
బీజేపీ నాయకురాలు, సినీ నటి కవిత (పాత చిత్రం)
సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ సినీరంగంపై చేసిన కామెంట్లకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకురాలు, సినీ నటి కవిత డిమాండ్ చేశారు. సినిమావాళ్లంటే టీడీపీకి అంతచులకనగా కనిపిస్తున్నారా? అని ప్రశ్నించారు.
టీడీపీలో ఉన్న సినీ ప్రముఖులు ఎందుకు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయలేదో వాళ్లను ముందు అడగమని రాజేంద్ర ప్రసాద్‌కు హితవు పలికారు. మరోసారి సినీ రంగంపై విమర్శలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆమె హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment