మోదీకంటే చంద్రబాబే గొప్ప వ్యక్తి | cm chandrababu naidu greater than pm modi | Sakshi
Sakshi News home page

మోదీకంటే చంద్రబాబే గొప్ప వ్యక్తి

Published Wed, Aug 12 2015 4:08 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

మోదీకంటే చంద్రబాబే గొప్ప వ్యక్తి - Sakshi

మోదీకంటే చంద్రబాబే గొప్ప వ్యక్తి

విజయవాడ: ప్రధాని నరేంద్ర మోదీకన్నా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే గొప్ప వ్యక్తి అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. చంద్రబాబు ప్రతిష్ఠకు భంగం కలిగే ఏపని బీజేపీ చేసినా ఒక్క టీడీపీ కార్యకర్త కూడా సహించడని హెచ్చరించారు. బీజేపీ వల్ల తమ ముఖ్యమంత్రి ప్రతిష్ఠ మొత్తం దెబ్బతింటోందని ఆరోపించారు.

వైజాగ్, నరసాపురంలో బీజేపీ గెలవడానికి చంద్రబాబు చరిష్మానే కారణం అని చెప్పారు. హీరో శివాజీని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ నేత రఘువీరా, సీపీఐ రామకృష్ణ ప్రత్యేక హోదాపై డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఈ నెల 16న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి ప్రధాన మోదీని కలుస్తున్నారని, ప్రత్యేక హోదాపై చర్చిస్తారని తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement