budha venkanna
-
‘కాల్‌మనీ వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించేవాళ్లు బీసీలు కాదు’
బెజవాడలో తెలుగుదేశం బజారున పడింది. పార్టీ ముఖ్యనేతలు రోడ్డున పడి టికెట్ల కోసం విమర్శలకు దిగుతున్నారు. చంద్రబాబు పెంచి పోషించిన ముఠాలే ఈ వైపరీత్యాలకు కారణమవుతున్నాయి. ప్రస్తుతం పార్టీలో చంద్రబాబు ఒక వర్గం, లోకేష్ మరో వర్గం నడుపుతున్నారు. టికెట్ల విషయంలో చంద్రబాబుదే తుది నిర్ణయం అని చెప్పినా.. నాయకులంతా లోకేష్ చుట్టే తిరుగుతున్నారు. ఈ పరిస్థితే.. పార్టీలో చిక్కులు తెచ్చి పెడుతోంది. విజయవాడ: మరోసారి సైకిల్ పార్టీ పంచాయతీ రోడ్డెక్కింది. సొంతపార్టీ నేతలను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. టీడీపీ నుంచి విజయవాడ ఎంపీ టికెట్‌ను ఆశిస్తున్న బుద్ధా వెంకన్నను టార్గెట్ చేస్తూ ఎంపీ కేశినేని నాని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బుద్ధా వెంకన్న విజయవాడ ఎంపీ టికెట్ ఈసారి తనదేనని ధీమాలో ఉన్న సమయంలో ఎంపీ కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు చేయడం సొంతపార్టీలో అగ్గికి ఆజ్యం పోసినట్లయ్యింది. ఎంపీ టికెట్ బీసీలకు ఇవ్వాలన్న డిమాండ్‌ను ఆహ్వానిస్తున్నా ‘విజయవాడ ఎంపీ టికెట్ బీసీలకు ఇవ్వాలన్న డిమాండ్‌ను నేను ఆహ్వానిస్తున్నా. కాల్‌మనీ వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించేవాళ్లు బీసీలు కాదు. నీతి, నిజాయితీ, మచ్చలేని వ్యక్తులే అసలైన బీసీలు. కాల్‌మనీ, సెక్స్ రాకెట్, గూండాగిరి చేసేవాళ్లు బీసీల కిందరారు. భూకబ్జాలు చేసేవాళ్లు, జనాలను హింసించిన వాళ్లు బీసీలు కాదు. పార్టీకోసం కష్టపడిన నిఖార్సైన బీసీలు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి టిక్కెట్లిస్తే సంతోషిస్తా. నిరుపేదలైనా కాళ్లకు దండం పెడతాం’ అంటూ కేశినేని నాని వ్యాఖ్యానించారు. విజయవాడ టీడీపీ ఎంపీ సీటుపై ముసలం విజయవాడ ఎంపీ టికెట్‌ను బీసీలకు ఇవ్వాలనే డిమాండ్‌ను బీసీ సంఘాలు తెరపైకి తీసుకొచ్చాయి. ఇక్కడ ఏ పార్టీ పోటీ నుంచి ఆభ్యర్థి అయినా బీసీ నేతే ఉండాలని ఆయా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. టీడీపీ నుంచి విజయవాడ ఎంపీ టికెట్‌ను బుద్ధా వెంకన్న ఆశిస్తున్న సందర్భంలో ఇలా కేశినేని నాని.. వ్యాఖ్యానించడం ఆ పార్టీలో గ్రూప్ రాజకీయాల తీవ్రతకు అద్దం పడుతోంది. తన సీటుకే ఎసరు పెడుతుండటంతో కేశినేని నాని ఘాటైన వ్యాఖ్యలను చేయడం ఇప్పుడు టీడీపీలో కలకలం రేపుతోంది. బీసీలకు టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ ఆహ్వానిస్తున్నా అంటూనే సదరు అభ్యర్థి బాధ్యత తానే తీసుకుంటానని కూడా కేశినేని నాని వ్యాఖ్యానించడంతో బుద్ధా వెంకన్న చేస్తున్న ప్రయత్నాలకు ఆదిలోనే గండికొట్టాలనేది కేశినేని ప్లాన్‌లో భాగమేనా? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. -
అన్వేషణ ప్రారంభించిన టీడీపీ
సాక్షి, విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈసారి పోటీకి తెలుగు తమ్ముళ్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఎలాగైనా అన్ని స్థానాలలో అభ్యర్థులను పోటీకి దించాలని అర్బన్, జిల్లా నాయకులపై పార్టీ అధిష్టానం బాధ్యత మోపింది. గత సార్వత్రిక ఎన్నికలలో దారుణ ఫలితాలను చవిచూసినందున ఎన్నికల బరిలోకి దిగేందుకు ముఖ్యులు కూడా ముందుకు వచ్చే సాహసం చేయలేకపోతున్నారని ఆ పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలి.. నగరంలో కార్పొరేటర్‌గా ఎన్నికల బరిలోకి దిగాలని ఆశించే అభ్యర్థులంతా ఒకటి రెండు రోజుల్లో దరఖాస్తులు చేసుకోవాలని సోమవారం జరిగిన అర్బన్ పార్టీ సమావేశంలో అధ్యక్షుడు బుద్దా వెంకన్న సూచించారు. దరఖాస్తుల్లో అంగబలం, ఆర్థికబలం ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తా మని చెబుతున్నారు. అయితే తమకు ప్రాబల్యం ఉన్న వార్డులలో తప్ప అనేక వార్డులలో అ భ్యర్థులు ఈసారి ఎన్నికల బరిలోకి దిగక పో వచ్చని అర్బన్ పార్టీలోకి కీలక నేత ఒకరు తెలిపారు. వారిపైనే ఆర్థిక భారం.. దీర్ఘకాలంగా పార్టీలో పనిచేస్తున్న, ఆర్థికంగా బలమైన నేతల్ని, మాజీ కార్పొరేటర్లని బలవంతంగానైనా రంగంలోకి దింపాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. మరోకవైపు తమకు పరిస్థితులు సానుకూలంగా లేవంటూ అనేక మంది సిట్టింగ్‌లు మోహం చాటేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేయర్, జెడ్పీ చైర్మన్ సీటు ఆశించే అభ్యర్థులపైనే మిగిలిన అభ్యర్థుల ఆర్థిక అవసరాలతో పాటు ఇతర బాధ్యతలను మోపాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆదివారం జరిగిన జిల్లా పార్టీ సమావేశం, సోమవారం జరిగిన అర్బన్ పార్టీ సమావేశంలోనూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా నగరంలో మేయర్ అభ్యర్థిగా ఆర్థికంగా స్థితిమంతురాలైన వారి పేరు సూచించమని మాజీ మంత్రి దేవినేని ఉమాను కొంతమంది అర్బన్ నేతలు కోరారు. దీంతో మాజీ కార్పొరేటర్, తనకు బంధువు అయిన ఒక మహిళను మేయర్ రేస్‌లోకి దింపితే ఆ కుటుంబం పార్టీని ఆదుకునేటట్టు చూస్తానని ఆయన హామీ ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తూర్పు నియోజకవర్గంలోని 12వ వార్డులో జెడ్పీ మాజీ చైర్మన్ గద్దె అనూరా«ధ కార్పొరేటర్‌గా ఎన్నికల బరిలో దిగుతున్నారని పార్టీ ముఖ్య నాయకుడొకరు చెప్పారు. -
‘మతం ముసుగులో పవన్ రాజకీయాలు’
సాక్షి, విజయవాడ: మతాలు గురించి మాట్లాడే హక్కు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఉందా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రశ్నించారు. సోమవారం తాడేపల్లిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భక్తి, మతంతో రాజకీయాలు చేయాలని పవన్ కల్యాణ్ చూస్తున్నారని ఆయన విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 40 దేవాలయాలను కూలదోస్తే పవన్ కల్యాణ్, బీజేపీ ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. కాగా దుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజులు జరిగితే పవన్ కల్యాణ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. పుష్కరాల సమయంలో చంద్రబాబు ప్రచార పిచ్చికి 30 మంది చనిపోతే పవన్ ఎందుకు నోరు మెదపలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు పవన్ కల్యాణ్ కంటికి కనిపించటం లేదా అని ప్రశ్నించారు. సీఎం జగన్ ఒక మతానికో, కులానికో చెందిన వారు కాదని.. పిచ్చోడిలా పవన్ ప్రవర్తిస్తే ప్రజలు ఒప్పుకోరని ఆయన ధ్వజమెత్తారు. హిందుమతం ముసుగులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. గతంలో క్రిస్టియన్ మతం గురించి పవన్ కల్యాణ్ గొప్పగా మాట్లాడిన వీడియోను ఈ సందర్భంగా ఆయన ప్రదర్శించారు. పవన్ కల్యాణ్‌కు ప్రజలు రెండు చోట్ల బుద్ది చేప్పినా ఆయన తీరు మారలేదని మండిపడ్డారు. చంద్రబాబు చేతిలో పవన్ కీలుబొమ్మలా మారాడని, పవన్ ఓ అజ్ఞానిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. 100 మంది చంద్రబాబులు వచ్చిన సీఎం జగన్‌ను ఏమి చేయలేరని అన్నారు. సీఎం జగన్, పార్లమెంటు సభ్యులు విజయసాయి రెడ్డిల గురించి మాట్లాడే అర్హత బుద్దా వెంకన్నకు లేదన్నారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు షిఫ్ట్‌ల వారిగా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని తెలిపారు. బీజేపీలో ఉండి టీడీపీ మాటలు మాట్లాడుతున్న సుజనా చౌదరి వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. అలాగే చంద్రబాబుకు, పవన్‌కు ఇసుక, ఇంగ్లీష్, రాజధాని తప్ప మాట్లాడానికి ఏమి కనిపించడం లేదని ఎమ్మెల్యే విష్ణు ఎద్దేవా చేశారు. -
టీడీపీ ఎమ్మెల్సీతో లగడపాటి భేటీ
-
సరికొత్త నాటకానికి తెరలేపిన లగడపాటి
సాక్షి, అమరావతి : రేపు చంద్రగిరిలో రీపోలింగ్ జరుగనున్న నేపథ్యంలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరో సరికొత్త నాటకానికి తెరలేపారు. తెలుగుదేశం పార్టీకి లబ్ది చేకూర్చేందుకు నిబంధనలు సైతం తుంగలో తొక్కారు. ఎన్నికల్లో ఫలితాలు టీడీపీకే అనుకూలం అంటూ నిబంధనలకు విరుద్ధంగా సర్వే వివరాలు బయటపెట్టారు. కాగా సర్వే వివరాలు వెల్లడించడానికి ముందు రాజగోపాల్ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నతో భేటీ అయ్యారు. మీడియా సమావేశం కంటే ముందే బుద్ధా వెంకన్నతో అరగంట పాటు ఆయన భేటీ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో లగడపాటి రాజగోపాల్ మీడియా సమావేశంలో ఏం మాట్లాడుతారనే విషయంపై విశ్లేషకులు ముందే ఒక అభిప్రాయానికి వచ్చారు. ఊహించినట్టుగానే పచ్చ పార్టీ భజన చేయడానికి మాత్రమే ఆయన విలేకరుల ముందుకు వచ్చినట్టు ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : టీడీపీ ఎమ్మెల్సీతో లగడపాటి భేటీ ఇక అమెరికా నుంచి హుటాహుటిన వచ్చి లగడపాటి ఈ విధంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం వెనుక దురుద్దేశం ఉందన్న విషయం స్పష్టమవుతోందని పలువురు విమర్శిస్తున్నారు. రీపోలింగ్‌లో టీడీపీకి లబ్ది చేకూర్చేలా వ్యవహరించడం వెనుక ఆ పార్టీ నేతల హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. కాగా గతేడాది చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తన సర్వే అంచనాలు తప్పడంతో లగడపాటి రాజగోపాల్ తీవ్ర విమర్శలపాలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అధికారం చేపట్టిన టీఆర్ఎస్ దారుణంగా ఓడిపోతుందని, టీడీపీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని వెల్లడించిన ఆయన సర్వే పూర్తి వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చింది. దీంతో రాజగోపాల్ సర్వే విశ్వసనీయతపై ప్రజల్లో అనుమానాలు నెలకొన్నాయి. -
బుద్ధా వెంకన్నకు షాకిచ్చిన.. ఆయన సోదరుడు
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో అధికార టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా మరోనేత టీడీపీకి షాకిచ్చారు. ప్రభుత్వం విప్, టీడీపీ నేత బుద్ధా వెంకన్న సోదరుడు బుద్ధా నాగేశ్వరరావు వైఎస్ జగన్ సమక్షంలో మంగళవారం వైఎస్సార్సీపీలో చేరారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్రలో ఉన్న జగన్‌ను కలిసి పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌తోనే బీసీలకు న్యాయం జరుగుతుందని అన్నారు. బుద్ధా వెంకన్న ఏనాడూ బీసీల కోసం పోరాడలేదని, ఇంకా చాలమంది బీసీ నేతలు వైఎస్సార్సీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దివంగత వైఎస్సార్ హయాంలోనే బీసీలకు ఎంతో మేలు జరిగిందని ఆయన గుర్తుచేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటుచేస్తామని జగన్ హామీ ఇచ్చారని, బీసీలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యత కల్పిస్తారని అన్నారు. -
పోటాపోటీ సమావేశాలు..
పటమట (విజయవాడ తూర్పు) : విజయవాడ నగరపాలక సంస్థలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రజా ప్రతినిధుల మధ్య తలెత్తిన వివాదం ఇప్పుడు ముదిరి పాకాన పడుతోంది. నగరంలోని మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కమిషనర్‌తో నిర్వహించిన సమావేశం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తాజాగా ఎమ్మెల్యేలకు దీటుగా మేయర్ శ్రీధర్ వీఎంసీలోని తన చాంబర్లో సోమవారం నగరాభివృద్ధిపై ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, కార్పొరేటర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కమిషనర్‌పై సీరియస్.. ఇటీవల బీపీఎస్ (బిల్డింగ్ ప్లీనరైజేషన్ స్కీం) ద్వారా నగరపాలక సంస్థకు కోట్లాది రూపాయల ఆదాయం వచ్చింది. ఇది తెలుసుకున్న ఎమ్మెల్యేలు వాటిలో ఒక్కో నియోజకవర్గానికి రూ.3 కోట్లు కేటాయించాలంటూ వచ్చిన ప్రతిపాదనపై మేయర్ సీరియస్ అయ్యారు. కమిషనర్‌పై ఆయన భగ్గుమన్నారు. నగరపాలక సంస్థకు చెందిన సొమ్మును ఎమ్మెల్యేలకు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. కావాలంటే రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి కేటాయింపులు చేసుకోవాలని సూచించారు. బీపీఎస్ ఆదాయం విభజన.. కాగా, బీపీఎస్ ద్వారా వచ్చిన సొమ్మును మేయర్ విభజించారు. కాంట్రాక్టర్లకు ఇప్పటి వరకు పలు పనులకు సంబంధించి చెల్లింపులు పూర్తిస్థాయిలో జరగలేదు. దీంతో వారు సమ్మెకు కూడా దిగారు. ఈ నేపథ్యంలో తక్షణమే సమస్యను కొంత వరకు పరిష్కరించేందుకు బీపీఎస్ ఆదాయం నుంచి రూ.20 కోట్లు కేటాయించి వారికి చెల్లింపులు చేయాలని కమిషనర్‌ను మేయర్ ఆదేశించారు. అలాగే అసంపూర్తిగా ఉన్న కార్పొరేషన్ నూతన భవనానికి రూ.10 కోట్లు కేటాయించి పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక కార్పొరేటర్లకు వారి అర్జీల ద్వారా వచ్చిన పనులు చేపట్టేందుకు రూ.10 కోట్లు కేటాయించాలని, మిగిలిన సొమ్మును జేఎన్యూఆర్ఎం పనులకు చెల్లించేలా చర్యలు చేపట్టాలని కమిషనర్‌ను మేయర్ ఆదేశించారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ హరిబాబు, కార్పొరేటర్లు జాస్తి సాంబశివరావు, చెన్నుపాటి గాంధీ, ముప్పా వెంకటేశ్వరరావు, ఉమ్మడిశెట్టి బహదూర్, వీరమాచనేని లలిత, కో–ఆప్షన్ సభ్యురాలు చెన్నుపాటి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. -
ఇక టార్గెట్ కమిషనరే?
సాక్షి,అమరావతిబ్యూరో: ‘ఇక ఎన్నికలు ఏడాదిలో ఉన్నాయి.. ఇంతవరకు నానా తిప్పలు పడి ఎంతో కొంత పోగేసుకున్నాం.. మళ్లీ ఎన్నికలప్పుడు ఖర్చు పెట్టాలంటే మరికొంత పోగేయ్యాలి.. కమిషనర్ మాత్రం చెప్పిన పనులు చేయటం లేదు.. మంత్రి నారాయణ మాటకే ఆయన విలువనిస్తున్నాడు..ఎవరు చెప్పినా లైట్‌గా తీసుకుంటున్నాడు. ఆయన్ను మార్చకుంటే నగరపాలక సంస్థ మన గుప్పిట్లోకి రాదు.. సంపాదన ఉండదు.. పార్లమెంట్ ఇన్చార్జిగా చినబాబు ఉన్నాడు..ఆయన హవా ఉండాలంటే మనం చెప్పిన పనులకు చేవులూపాల్సిన వారైతేనే కరక్టు వెంటనే కమిషనర్‌ను మార్చేయండి.’ ఇదీ విజయవాడ నగరంలో పాలకపక్షంలోని ఓ వర్గం ప్రభుత్వ పెద్దల వద్ద తెస్తున్న ఒత్తిడి. ఇప్పటికే నగర పాలకసంస్థలో జరుగుతున్న పరిణామాలు, మేయర్ వ్యవహారంతోపాటు కమిషనర్ బదిలీ విషయంపై పార్టీ నగర అధ్యక్షుడు బుద్ధా వెంకన్న వద్ద పలువురు కార్పొరేటర్లతోపాటు పార్టీ కీలక నేతలు అంతర్గత చర్చలు జరిపారు. మేయర్ వ్యవహారం సమసిపోయిన తరువాత కమిషనర్ బదిలీపై తీవ్ర ఒత్తిడి పెంచేలా నిర్ణయించారు. ఇప్పటికే నారా లోకేష్ వద్ద కమిషనర్ వ్యవహారంపై పంచాయితీ పెట్టడంతో ఆయన కమిషనర్ బదిలీపై హామీ ఇచ్చినట్లు సమాచారం. అసలేం జరుగుతుందంటే.. నగర పాలక సంస్థ కమిషనర్‌గా జె.నివాస్ బాధ్యతలు చేపట్టిన నుంచి పాలకపక్ష కార్పొరేటర్ల అక్రమ దందా గురించి లోతుగా అధ్యయ నం చేశాడు. పేదల సొమ్ము పిండుకోవటమే కాకుండా బినామీల ద్వారా నగర పాలక సంస్థ ఆరగించడం, ప్రతి పనికి రేటు బట్టి వసూళ్లు చేయడం, కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు తీసుకోవడం.. అభివృద్ధి పనులను అడ్డుకోవడం లాంటి పనులు చేస్తున్న వైనం గుర్తించారు. వీరిని ప్రోత్సహిస్తే అవినీతి మరకలు అంటే అవకాశం ఉందని భావించిన కమిషనర్ పాలకపక్ష సభ్యులను లైట్‌గా తీసుకున్నాడు. వారు సూచించిన పనులను పక్కన పెడుతున్నాడు. డివిజన్లలో స్వ యంగా పర్యటిస్తూ పలు కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నాడు. అక్రమ ఆదాయం తగ్గిపోవడంతో పాలకపక్ష కార్పొరేటర్లకు ఆగ్రహం తెప్పిం చింది. కమిషనర్ వ్యవహారంపై ఇప్పటికే సీఎం చంద్రబాబు వద్దే పంచాయితీ పెట్టిన సంఘటనలు ఉన్నాయి. కానీ మంత్రి నారాయణ అండదండలు కమిషనర్‌కు ఉండడంతో పాలకపక్ష సభ్యుల ఫిర్యాదును కూడా లైట్‌గా తీసుకున్నారు. తెరపైకి రంజిత్‌బాషా నగర పాలక సంస్థ కమిషనర్‌గా మంత్రి నారా లోకేష్ ఓఎస్డీగా పనిచేసే పి.రంజిత్ బాషాను పేరు తెరపైకి తెచ్చారు. డిప్యూటీ కలెక్టర్‌గా హోదాలో ఉన్న ఆయన రెండు రోజుల కిందటే ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. దీంతో ఆయన్ను నగరపాలక సంస్థ కమిషనర్‌గా నియమించే అవకాశాలు ఉన్నా యి. చినబాబు ఓఎస్డీగా పనిచేసే రంజీత్బాషాకు ఆయనతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఆయన్ను పంపించి తమ పనులు చక్కదిద్దుకోవా లనే ఆలోచనలో ఉన్నారు. మంత్రి నారాయణ హవా విజయవాడ పార్లమెంట్ ఇన్చార్జిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నగరపాలక సంస్థపై పెద్దగా దృష్టి సారించలేదు. మంత్రి నారాయణ కనుసన్నల్లోనే కమిషనర్ల నియామకం జరుగుతుంది. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువు ఉండడంతో ప్రస్తుత కార్పొరేటర్ల అక్రమ సంపాదనకు అడ్డుపడుతున్న కమిషనర్‌కు పంపించి వేయాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతుంది. మంత్రి నారాయణ హవా పెరిగితే నగరంలో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పరపతి తగ్గే అవకాశం ఉందని ఆయన అనుచరవర్గం భావిస్తుంది. నగర పాలక సంస్థలో జరిగే పరిణామాలు పార్టీకి నష్టం కల్గిస్తున్నాయని వెంటనే చక్కదిద్దాలంటూ చినబాబు వద్ద పంచాయితీ పెట్టారు. రాబోయే సాధారణ ఎన్నికల్లో కూడా విజయవాడ నగర పాలక సంస్థ కీలకమవుతుందని వెంటనే రంగంలోకి దింపి కార్పొరేటర్లుకు లబ్ధి చేకూరే నిర్ణయం తీసుకోవాలని ఆయన దృష్టిలో పెట్టారు. వారి వాదనకు ఏకీభవించిన చినబాబు త్వరలోనే మీ కోరిక తీరుస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. -
మోదీకంటే చంద్రబాబే గొప్ప వ్యక్తి
విజయవాడ: ప్రధాని నరేంద్ర మోదీకన్నా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే గొప్ప వ్యక్తి అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. చంద్రబాబు ప్రతిష్ఠకు భంగం కలిగే ఏపని బీజేపీ చేసినా ఒక్క టీడీపీ కార్యకర్త కూడా సహించడని హెచ్చరించారు. బీజేపీ వల్ల తమ ముఖ్యమంత్రి ప్రతిష్ఠ మొత్తం దెబ్బతింటోందని ఆరోపించారు. వైజాగ్, నరసాపురంలో బీజేపీ గెలవడానికి చంద్రబాబు చరిష్మానే కారణం అని చెప్పారు. హీరో శివాజీని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ నేత రఘువీరా, సీపీఐ రామకృష్ణ ప్రత్యేక హోదాపై డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఈ నెల 16న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి ప్రధాన మోదీని కలుస్తున్నారని, ప్రత్యేక హోదాపై చర్చిస్తారని తెలియజేశారు.