దీక్షపేరుతో మోదీపై ద్వేషం | Tdp Mla Balakrishna He's Taking On Pm Modi Mother | Sakshi
Sakshi News home page

దీక్షపేరుతో మోదీపై ద్వేషం

Published Sat, Apr 21 2018 11:39 AM | Last Updated on Thu, Mar 28 2019 8:40 PM

Tdp Mla Balakrishna He's Taking On Pm Modi Mother - Sakshi

విలేకరులతో మాట్లాడుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనాథరెడ్డి తదితరులు

పులివెందుల టౌన్‌ : చంద్రబాబు చేపట్టిన అధర్మదీక్ష సందర్భంగా సినీ హీరో బాలకృష్ణ ప్రధాని మోదీ గురించి వాడిన పదజాలం పట్ల బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనాథరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు దీక్ష చేస్తున్నారని అనడానికంటే మోదీపై ద్వేషాన్ని వెళ్లగక్కడానికే ఈ దీక్షను చేస్తున్నట్లు స్పష్టమవుతోందన్నారు. రాష్ట్రానికి దగాచేసింది చంద్రబాబేకానీ మోదీ కాదన్నారు. ఏపీకి అన్యాయం చేసిన చంద్రబాబును ప్రజలు తరిమికొట్టే కాలం దగ్గరలోనే ఉందన్నారు. సరిగా తెలుగు మాట్లాడటం చేతకాని బాలకృష్ణ మోదీని తెలుగు నేర్చుకోవాలని సలహా ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రధాని మోదీపై నోరు పారేసుకున్న బాలకృష్ణకు ప్రజలు బుద్ధిచెప్పేరోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు శశిభూషన్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు బండి ప్రదీప్‌రెడ్డి, నాయకులు శ్రీరాములు, భానుప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement