
సాక్షి, విజయనగరం : రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విడదీసిన కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని ఆంధ్రప్రదేశ్‌కు రానివ్వమం అని చెప్పిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటుందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మహిళా మోర్చా నేత దగ్గుబాటి పురందేశ్వరి ప్రశ్నించారు. టీడీపీకి అసలు సిద్ధాంతాలే లేవని దుయ్యబట్టారు.
మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... గడిచిన నాలుగున్నర ఏళ్లుగా విదేశీ శక్తులు దేశంపై దాడి చేయకుండా బీజేపీ కాపాడుతుందని పురందేశ్వరి వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పాలన అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దింపాలనే ఉద్దేశంతో.. భావసారూప్యం లేని పార్టీలన్నీ కూటమిగా ఏర్పడ్డాయని ఆమె విమర్శించారు. ప్రత్యేక ప్యాకేజీ మంచి ప్యాకేజీ అంటూ చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు ప్లేటు ఫిరాయించారని మండిపడ్డారు. ఆయన విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, ఈ విషయాన్ని కాగ్ చెప్పిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment