గెలుపుపై చిన్నమ్మ ధీమా | Purandeswari confident over winning from rajampet | Sakshi
Sakshi News home page

గెలుపుపై చిన్నమ్మ ధీమా

Published Fri, May 2 2014 3:03 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

గెలుపుపై చిన్నమ్మ ధీమా - Sakshi

గెలుపుపై చిన్నమ్మ ధీమా

తిరుపతి : ఎన్టీఆర్ కుమార్తెగా ప్రజలు తనను ఆదరిస్తున్నారని రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి అన్నారు. శుక్రవారం ఆమె తిరుపతిలో విలేకర్లతో మాట్లాడుతూ బీజేపీ-టీడీపీ కార్యకర్తల మధ్య సమన్వయం లేదన్నారు. బాపట్ల, విశాఖ నియోజకవర్గాల్లో  చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని పురందేశ్వరి ధీమా వ్యక్తం చేశారు.

కాగా మదనపల్లి మోడీ సభలో చంద్రబాబు నాయుడు, పురందేశ్వరి ఒకే వేదికపై సభ ముగిసే వరకూ ఉన్నా వారిద్దరి మద్య మాటల్లేవు. నేతల ప్రసంగాల సమయంలో బాబు కూర్చొన్న చోటుకు దూరంగా ఉండేందుకు పురందేశ్వరి యత్నించారు. మరోవైపు బాబు ప్రసంగంలో తొలుత రాజంపేట అని సంబోధించారు. కానీ పురందేశ్వరి పేరును ఉచ్ఛరించలేదు. చివర్లో విధిలేని పరిస్థితుల్లో ఆమె పేరుని ప్రస్తావించి ఓట్లు వేయాలన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement