టీడీపీ శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు
సాక్షి, అమరావతి: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుతమైన ఎలక్షనీరింగ్ చేసిందని, వారి ఎన్నికల వ్యూహం ప్రత్యర్థులకు అంతుబట్టని విధంగా బీజేపీకి ఫలితాలను తెచ్చిపెట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబు విశ్లేషించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో సమష్టి కృషి, క్షేత్రస్థాయి నుంచి శ్రేణులను సమీకరించుకోవడంతో పాటు టెక్నాలజీని బాగా వినియోగించుకోవడంతో వారికీ విజయం సాధ్యమైందన్నారు. రాష్ట్రంలో మనం కూడా ఆ రకమైన మార్గంలో మరింత బలోపేతం కావలసిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
వెలగపూడిలోని తాత్కాలిక అసెంబ్లీ కమిటీ హాల్లో మంగళవారం తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. శాసనసభలో సభ్యుల పనితీరును పరిగణనలోకి తీసుకొని ప్రతి రోజూ అయిదుగురికి అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా,చైనా అకాడమీ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ అండ్ డిజైన్ షెన్‌జెన్ (సీఏయూపీడీఎస్‌జెడ్) బృందంతో చంద్రబాబు చర్చలు జరిపారు.
మోదీ మోడల్‌ను అనుకరిద్దాం
Published Wed, Mar 15 2017 1:46 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement