'కేసీఆర్ ఏం చేసినా గవర్నర్ నోరు మెదపడం లేదు' | Somireddy Chandramohan Reddy takes on governor | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ ఏం చేసినా గవర్నర్ నోరు మెదపడం లేదు'

Published Sun, Jun 14 2015 1:01 PM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

'కేసీఆర్ ఏం చేసినా గవర్నర్ నోరు మెదపడం లేదు' - Sakshi

'కేసీఆర్ ఏం చేసినా గవర్నర్ నోరు మెదపడం లేదు'

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అనుసరిస్తున్న వైఖరిపై ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదివారం హైదరాబాద్లో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పట్ల నరసింహన్ వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం చేసినా గవర్నర్ నోరు మెదపడం లేదని విమర్శించారు. కేసీఆర్ సర్కార్ ఏడాది పాలనలో తీసుకున్న పది నిర్ణయాలపై కోర్టు అక్షంతలు వేసిందని ఆయన గుర్తు చేశారు. 

కేసీఆర్ నిర్ణయాలు కోర్టులకు తెలుస్తున్న నరసింహన్కు మాత్రం తెలియడం లేదన్నారు. ప్రజలకు న్యాయం చేయలేని గవర్నర్,  రాజ్భవన్ ఎందుకు అంటూ సోమిరెడ్డి ప్రశ్నించారు. గవర్నర్ ఉత్సవ విగ్రహాం కాదని సోమిరెడ్డి స్పష్టం చేశారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భాష అసహ్యించుకునేలా ఉందన్నారు. ప్రతి అంశాన్ని కేసీఆర్ సర్కార్ వివాదం చేస్తోందని తెలిపారు. కోర్టులు అక్షంతులు వేసిన కేసీఆర్ తీరు మాత్రం మారడం లేదని సోమిరెడ్డి చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement