Narsimhan
-
గవర్నర్‌కు వైఎస్ జగన్ ఫిర్యాదు
హైదరాబాద్ : ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా ఓట్ల తొలగింపు, అవకతవకలపై ఆయన ఈ సందర్భంగా గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే పోలీస్ అధికారుల నియామకాల్లోనూ అధికార దుర్వినియోగంపై వైఎస్ జగన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వైఎస్ జగన్‌తో పాటు గవర్నర్‌ను కలిసినవారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. కాగా ఎన్నికలు సజావుగా జరగాలంటే డీజీపీ ఠాకుర్, ఇంటెలిజెన్స్ ఐజీ వెంకటేశ్వరరావు, డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌రావును వెంటనే బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈసీ) సునీల్ అరోరాను ఢిల్లీలో వైఎస్ జగన్ కోరిన విషయం తెలిసిందే. -
వంద దేశాల్లో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐ) కీలకపాత్ర పోషించారని, ఉద్యమ భావజాల వ్యాప్తికోసం వివిధ దేశాలలో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖలు ఏర్పాటు చేసి, స్వరాష్ట్ర సాధనకు కృషి చేశారని ఎంపీ కె.కవిత అన్నారు. ప్రస్తుతం 33 దేశాల్లో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖలు ఉన్నాయని, రానున్న రోజుల్లో వంద దేశాల్లో శాఖలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. టీఆర్ఎస్ లండన్ ఎన్ఆర్ఐ సంఘం ఎనిమిదో వార్షికోత్సవ సమావేశం తెలంగాణ భవన్లో శనివారం జరిగింది. ఈ సభలో కవిత ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ‘ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్ఫూర్తితో, సూచనలతో తెలంగాణకోసం విదేశాల్లో వివిధ పేర్లతో ఎన్ఆర్ఐలు సంఘా లు పెట్టి పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయం లో ఎన్ఆర్ఐలు కూడా అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. అవమానాలు ఎదుర్కొన్నా రాష్ట్రం సాధిం చాం. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. తెలంగాణ బిడ్డల అండతో రెండోసారి కూడా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అనేక కార్యక్రమాల్లో దేశానికి ఆదర్శం గా నిలుస్తోంది. మన పారిశ్రామిక విధానం చూసి అమెరికాలోనూ ఇంతమంచి విధానం లేదని అక్కడి వారు అంటున్నారు. గల్ఫ్‌లాంటి దేశాల్లో తెలంగాణ ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నాం. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఎన్ఆర్ఐ విధానాన్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ విధానాన్ని ప్రకటిస్తారు. మీరందరూ గర్వపడేలా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ ఇక్కడ పార్టీకి, అక్కడ మన వారికి వారధిలా ఉండాలి. మనమంతా కలిసి పనిచేస్తే దేశానికి, ప్రపంచానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తది’ అన్నారు. ఎమ్మెల్సీ ఎం.శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ నేతలు కూర్మాచలం అనిల్, దూసరి అశోక్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. గవర్నర్‌ను కలిసిన కవిత.. కవిత శనివారం తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహ న్ను రాజ్‌భవన్‌లో కలిశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 19, 20 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ యువనాయకత్వ సదస్సు ఆహ్వాన పత్రికను గవర్నర్‌కు అందజేశారు. -
గాంధీలో గవర్నర్‌కు శస్త్రచికిత్స
సికింద్రాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చేరారు. కాలికి ఆనె(కార్న్)తో రావడంతో వారం రోజుల క్రితం ఆయన సాధారణ రోగిలా వచ్చి గాంధీలో వైద్యులను సంప్రదించారు. వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించి చిన్నపాటి శస్త్రచికిత్స చేసి ఆనెను తొలగించాలని సూచించారు. దీంతో ఆయన సోమవారం గాంధీకి వచ్చి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. గవర్నర్‌ను సాయంత్రం డిశ్చార్జ్ చేస్తామని గాంధీ వైద్యులు తెలిపారు. -
రెండోరోజూ ‘గాంధీ’కి గవర్నర్
- వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు - రక్త నమూనాలు సేకరణ హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వరుసగా రెండో రోజూ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి వచ్చారు. కుడికాలి మడమకు ఆనె(కార్న్)తో బాధపడుతున్న ఆయన బుధవారం సాధారణ రోగిలో గాంధీ ఆస్పత్రికి వచ్చిన విషయం తెలిసిందే. వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించి చిన్నపాటి శస్త్రచికిత్స చేసి ఆనెను తొలగించాలని సూచించారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు గాంధీ ఆస్పత్రికి వచ్చిన గవర్నర్‌ను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్‌కుమార్, వైద్యనిపుణులు సాదరంగా ఆహ్వానించి ప్రధాన భవనం నాల్గవ అంతస్థులోని సెంట్రల్ లెబోరేటరీకి తీసుకువెళ్లారు. శస్త్రచికిత్సకు ముందు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు. రక్త నమూనాలు సేకరించారు. ఈసీజీ, 2డీ ఎకో తదితర వైద్యపరీక్షలు చేశారు. అర్ధగంట తర్వాత గవర్నర్ నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లిపోయారు. అనంతరం డాక్టర్ శ్రవణ్‌కుమార్, డిప్యూటీ నర్సింహారావు నేత, ఆర్ఎంవో 1 జయకృష్ణ మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ కాలి మడమ ఆనె (కార్న్)ను తొలగించేందుకు శస్త్రచికిత్స అవసరమని, ఆపరేషన్‌కు ముందు ఫిట్నెస్ కోసం చేయాల్సిన వివిధ రకాల వైద్యపరీక్షలు నిర్వహించామని చెప్పారు. శాంపిల్స్ సేకరించి లెబోరేటరీలో నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని అన్నారు. నిర్ధారణ పరీక్షల నివేదికలు అందిన తర్వాత గవర్నర్‌తో చర్చించి ఎప్పుడు శస్త్రచికిత్స చేయాలనేది నిర్ణయిస్తామని తెలిపారు. నేను ఫిట్‌గానే ఉన్నా.... అన్నిరకాల వైద్యపరీక్షల అనంతరం మీరు ఫిట్‌గానే ఉన్నారు, ఎటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు లేవని వైద్యులు తెలిపారు. ‘నేను ఫిట్‌గానే ఉన్నానని నాకు తెలుసు, మీ పరికరాలు, యంత్రాలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకునేందుకే వచ్చా’అంటూ గవర్నర్ చమత్కరించారు. -
గాంధీ ఆస్పత్రిలో గవర్నర్‌కు చికిత్స!
హైదరాబాద్: ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ బుధవారం సాధారణ పౌరుడిలా గాంధీ ఆస్పత్రిని సందర్శించి చికిత్స చేయించుకున్నారు. తన కుడి పాదంపై అయిన కాయను గురించి గాంధీ వైద్యుల సలహా తీసుకున్నారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ శ్రావణ్‌కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ నరసింహారావు నేత, చీఫ్ అడ్మినిస్ట్రేటర్ జయకృష్ణ తదితరులు గవర్నర్ వెంట ఉన్నారు. గవర్నర్ పాదాన్ని పరిశీలించిన ప్లాస్టిక్ సర్జరీ హెచ్‌వోడీ సుభోద్, జనరల్ సర్జన్ వీఎన్ రెడ్డి.. గాంధీ ఆస్పత్రిలో చిన్నపాటి శస్త్రచికిత్స చేయించుకోవాలని సలహా ఇచ్చారు. ఈ సందర్భంగా గాంధీ ఆస్పత్రిలోని పరిశుభ్రతపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపర్చాలని, రోగులకు మరింతగా వైద్యం అందించేలా మెరుగుపడాలని సూచించారు. ఈ సందర్భంగా రోగుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆస్పత్రిలో మరో ఎమ్మారై యూనిట్‌ను ఏర్పాటుచేయాల్సిన అవసరముందని గాంధీ వైద్యులు కోరగా.. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి సలహా ఇస్తానని గవర్నర్ హామీ ఇచ్చారు. -
నేడు తిరుపతిలో ప్రముఖుల పర్యటన
చిత్తూరు: చిత్తూరు జిల్లా తిరుపతిలో గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రి ఎం. వెంకయ్య నాయుడు పర్యటించనున్నారు. వీరు సోమవారం జరగనున్న ఎస్వీయూ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. తర్వాత కేంద్రమంత్రి జిల్లాలో నిర్వహించనున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. -
'కేసీఆర్ ఏం చేసినా గవర్నర్ నోరు మెదపడం లేదు'
-
'కేసీఆర్ ఏం చేసినా గవర్నర్ నోరు మెదపడం లేదు'
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అనుసరిస్తున్న వైఖరిపై ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పట్ల నరసింహన్ వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం చేసినా గవర్నర్ నోరు మెదపడం లేదని విమర్శించారు. కేసీఆర్ సర్కార్ ఏడాది పాలనలో తీసుకున్న పది నిర్ణయాలపై కోర్టు అక్షంతలు వేసిందని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ నిర్ణయాలు కోర్టులకు తెలుస్తున్న నరసింహన్‌కు మాత్రం తెలియడం లేదన్నారు. ప్రజలకు న్యాయం చేయలేని గవర్నర్, రాజ్‌భవన్ ఎందుకు అంటూ సోమిరెడ్డి ప్రశ్నించారు. గవర్నర్ ఉత్సవ విగ్రహాం కాదని సోమిరెడ్డి స్పష్టం చేశారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భాష అసహ్యించుకునేలా ఉందన్నారు. ప్రతి అంశాన్ని కేసీఆర్ సర్కార్ వివాదం చేస్తోందని తెలిపారు. కోర్టులు అక్షంతులు వేసిన కేసీఆర్ తీరు మాత్రం మారడం లేదని సోమిరెడ్డి చెప్పారు. -
వివాదానికి విరామం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల మధ్య ఏర్పడిన జల జగడం ఎట్టకేలకు సద్దుమణిగింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి కాలువకు నీటి విడుదల విషయం పై నెలకొన్న వివాదం నేపథ్యంలో రెండు రోజులుగా ఉత్కంఠగా ఎదురుచూసిన రైతులు, అధికారులు ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు సఫలమై నీటి విడుదలకు అనుకూలంగా నిర్ణయం వెలువడటంతో హర్షం వ్యక్తం చేశారు. మాచర్లటౌన్/ విజయపురిసౌత్ : విజయపురిసౌత్‌లోని మోటెల్ కాంప్లెక్స్‌లో నీటి విడుదలకు సంబంధించి శనివారం జరిగిన చర్చలు సఫలీకృతం అయిన అనంతరం అధికారులు విలేకరులతో మాట్లాడారు. విడుదలైన నీరు సద్వినియోగం అయ్యేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నామని వివరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీధర్, కుడికాలువ చీఫ్ ఇంజనీర్ వీర్రాజులు మాట్లాడుతూ రాష్ట్ర రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు నీటి విడుదలపై తెలంగాణ ప్రభుత్వంతో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ చర్చలు జరిపినట్లు తెలిపారు. నీటి విడుదలకు ప్రభుత్వాలు అంగీకరించటం ఆనందకరమన్నారు. సాగర్ కుడికాలువ పరిధిలోని పంట పొలాలు ఎండిపోకుండా కాపాడేందుకు విడుదల చేసే నీటిని రైతులు సద్వినియోగం చేసుకునేవిధంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. రైతుల ప్రయోజనాల కోసం తాము చేపట్టే చర్యలను గమనించి పొదుపుగా నీటిని ఉపయోగించుకొని ఆరుతడి పంటలకే పరిమితం కావాలన్నారు. ఎక్కడా వరి సాగు చేపట్టవద్దని, ప్రస్తుతం ఉన్న పంటలను కాపాడుకునేందుకు ప్రయత్నించుకోవాలని సూచించారు. గుంటూరు జిల్లాలోని ఆరుతడి పంటలకు, ప్రకాశం జిల్లాలోని వరి పంటలకు నీటిని అందించేందుకు రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్ శాఖల అధికారులతో సంయుక్తంగా కమిటీలు వేసి, నీటి వినియోగంపై పర్యవేక్షిస్తూ రైతులకు న్యాయం చేస్తామన్నారు. అంతకు ముందు జాయింట్ కలెక్టర్ శ్రీధర్, సీఈ వీర్రాజు, ఎస్ఈ కృష్ణారావు, ఈఈ జబ్బార్, గురజాల ఆర్డీవో మురళీ, ఇతర డివిజన్ల ఆర్డీవోలతో కలసి మూడు శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి ప్రభుత్వం నీటి విడుదలపై తీసుకున్న నిర్ణయం గురించి వివరించారు. పటిష్ట బందోబస్తు ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య జల వివాదం నేపథ్యంలో జిల్లా రెవెన్యూ, పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. శనివారం ఉదయానికి జేసీ శ్రీధర్, ఐజీ సంజీవ్‌ల పర్యవేక్షణలో ఉదయం నుంచి ప్రాజెక్టు కుడి భాగంలో ప్రధాన గేటు వద్ద టెంటు వేసి ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూశారు. జిల్లా రూరల్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ, ఉన్నతాధికారి వివేక్‌కుమార్, డీఎస్పీలు నాగేశ్వరరావు, సుధాకర్‌తో పాటు పలువురు తరలివచ్చారు. వీరితో పాటు సీఐ, ఎస్ఐలు, 300 మందికి పైగా పోలీసు సిబ్బంది వేచి ఉన్నారు. గుంటూరు, నరసరావుపేట, గురజాల ఆర్డీవోలతో పాటు పది మంది తహశీల్దార్లతో పాటు వంద మంది రెవెన్యూ సిబ్బంది తరలివచ్చారు. ప్రాజెక్టుపై ఉన్న ఎస్పీఎఫ్ డ్యామ్ సెక్యూరిటీ అధికారులు నీటి విడుదలకు సాగర్ ప్రాజెక్టుపై వెళ్లే ఇంజనీర్లను అడ్డగించటంతో ఉద్రిక్తత నెలకొంది. ఆ సమయంలో ఆంధ్రా పోలీసులు డ్యామ్ సెక్యూరిటీ అధికారులతో మరోసారి వాగ్వాదానికి దిగారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము వ్యవహరిస్తున్నామని, సమర్ధించుకునేవిధంగా డ్యామ్ సెక్యూరిటీ అధికారులు సమాధానమిచ్చారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసు జిల్లా ఉన్నతాధికారులు మాచర్ల నుంచి సాగర్, విజయపురిసౌత్‌కు వెళ్లే రహదారిలో వివిధ ప్రాంతాలకు చెందిన సీఐల ఆధ్వర్యంలో పికెటింగ్ ఏర్పాటు చేసి తనిఖీలు జరిపారు. -
రేపట్నుంచి ‘ఏపీ అకాడమీ ఆఫ్ సెన్సైస్’ స్వర్ణోత్సవాలు
ముఖ్యఅతిథిగా గవర్నర్ నరసింహన్ ఐఐసీటీ, సీసీఎంబీల్లో 3 రోజులపాటు వేడుకలు సాక్షి, హైదరాబాద్: ఏపీ సైన్స్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ స్వర్ణోత్సవాలను గురువారం నుంచి మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నట్లు అకాడమీ అధ్యక్షుడు, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) డెరైక్టర్ డాక్టర్ సీహెచ్ మోహన్‌రావు తెలిపారు. గవర్నర్ నరసింహన్ ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరవుతారు. 1963లో ఏర్పాటైన అకాడమీ సైన్స్ ప్రచారం కోసం పలు కార్యక్రమాలు చేపట్టిందని మంగళవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులకు తెలిపారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, సీసీఎంబీల్లో నిర్వహించే ఉత్సవాల సందర్భంగా సంస్థ వ్యవస్థాపక సభ్యులను సత్కరించనున్నారు. దేశం గర్వించదగ్గ 8 మంది శాస్త్రవేత్తలకు జీవిత కాల సాఫల్య పురస్కారాలు అందజేస్తామని చెప్పారు. విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 200 మంది విద్యార్థులు స్వయంగా కొన్ని పరిశోధనలు చేయడంతోపాటు శాస్త్రవేత్తలతో ముచ్చటించేలా ఈ కార్యక్రమాన్ని రూపొదించామన్నారు. 50 ఏళ్లలో ఏపీలో జరిగిన శాస్త్రాభివృద్ధిని సుప్రసిద్ధ శాస్త్రవేత్తలు వివరిస్తారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు సైన్స్ అకాడ మీ వేర్వేరుగా ఏర్పాటు కానుందని తెలి పారు. కార్యక్రమంలో ఐఐసీటీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్.బి.ఎన్.ప్రసాద్, జాతీయ పౌష్టికాహార సంస్థ(ఎన్ఐఎన్) మాజీ డెరైక్టర్ డాక్టర్ శశికిరణ్, ఐఐసీటీ శాస్త్రవేత్త మధుసూదనరావు తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. -
బాపూఘాట్లో గాంధీజీకి నేతల ఘన నివాళి
మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితోపాటు పలువురు నేతలు జాతిపితకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు జరిగాయి. ఘాట్‌లోని గాంధీ విగ్రహానికి నేతలు పూలమాలలు వేశారు. కార్యక్రమంలో మంత్రులు వట్టి వసంతకుమార్, దానం నాగేందర్, పితాని సత్యనారాయణ, ముఖేష్‌గౌడ్, కాసు కృష్ణారెడ్డి, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, జాతీయ రైల్వేబోర్డు సభ్యుడు జి.నరేందర్ యాదవ్, నగర పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ, ఇంకా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రాజకీయ నేతలు పాల్గొన్నారు. అసెంబ్లీ, గాంధీభవన్‌లలోనూ: గాంధీ జయంతిని పురస్కరించుకుని బుధవారం అసెంబ్లీ ఆవరణలోని బాపూ విగ్రహానికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, స్పీకర్ నాదెండ్ల మనోహర్‌లు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు. గాంధీభవన్‌లో మహాత్ముని విగ్రహానికి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పూలమాల వేసి నివాళి ఘటించారు. కార్యక్రమంలో ఎంపీ నంది ఎల్లయ్య, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పార్టీ ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధరం పాల్గొన్నారు.