గాంధీలో గవర్నర్‌కు శస్త్రచికిత్స
సికింద్రాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చేరారు. కాలికి ఆనె(కార్న్)తో రావడంతో వారం రోజుల క్రితం ఆయన సాధారణ రోగిలా వచ్చి గాంధీలో వైద్యులను సంప్రదించారు.
వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించి చిన్నపాటి శస్త్రచికిత్స చేసి ఆనెను తొలగించాలని సూచించారు. దీంతో ఆయన సోమవారం గాంధీకి వచ్చి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. గవర్నర్‌ను సాయంత్రం డిశ్చార్జ్ చేస్తామని గాంధీ వైద్యులు తెలిపారు.