ముఖ్యఅతిథిగా గవర్నర్ నరసింహన్
ఐఐసీటీ, సీసీఎంబీల్లో 3 రోజులపాటు వేడుకలు
సాక్షి, హైదరాబాద్: ఏపీ సైన్స్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ స్వర్ణోత్సవాలను గురువారం నుంచి మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నట్లు అకాడమీ అధ్యక్షుడు, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) డెరైక్టర్ డాక్టర్ సీహెచ్ మోహన్‌రావు తెలిపారు. గవర్నర్ నరసింహన్ ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరవుతారు. 1963లో ఏర్పాటైన అకాడమీ సైన్స్ ప్రచారం కోసం పలు కార్యక్రమాలు చేపట్టిందని మంగళవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులకు తెలిపారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, సీసీఎంబీల్లో నిర్వహించే ఉత్సవాల సందర్భంగా సంస్థ వ్యవస్థాపక సభ్యులను సత్కరించనున్నారు.
దేశం గర్వించదగ్గ 8 మంది శాస్త్రవేత్తలకు జీవిత కాల సాఫల్య పురస్కారాలు అందజేస్తామని చెప్పారు. విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 200 మంది విద్యార్థులు స్వయంగా కొన్ని పరిశోధనలు చేయడంతోపాటు శాస్త్రవేత్తలతో ముచ్చటించేలా ఈ కార్యక్రమాన్ని రూపొదించామన్నారు. 50 ఏళ్లలో ఏపీలో జరిగిన శాస్త్రాభివృద్ధిని సుప్రసిద్ధ శాస్త్రవేత్తలు వివరిస్తారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు సైన్స్ అకాడ మీ వేర్వేరుగా ఏర్పాటు కానుందని తెలి పారు. కార్యక్రమంలో ఐఐసీటీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్.బి.ఎన్.ప్రసాద్, జాతీయ పౌష్టికాహార సంస్థ(ఎన్‌ఐఎన్) మాజీ డెరైక్టర్ డాక్టర్ శశికిరణ్, ఐఐసీటీ శాస్త్రవేత్త మధుసూదనరావు తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
రేపట్నుంచి ‘ఏపీ అకాడమీ ఆఫ్ సెన్సైస్’ స్వర్ణోత్సవాలు
Published Wed, Nov 12 2014 1:07 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM
Advertisement