బాపూఘాట్‌లో గాంధీజీకి నేతల ఘన నివాళి
Published Thu, Oct 3 2013 2:51 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితోపాటు పలువురు నేతలు జాతిపితకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు జరిగాయి. ఘాట్‌లోని గాంధీ విగ్రహానికి నేతలు పూలమాలలు వేశారు. కార్యక్రమంలో మంత్రులు వట్టి వసంతకుమార్, దానం నాగేందర్, పితాని సత్యనారాయణ, ముఖేష్‌గౌడ్, కాసు కృష్ణారెడ్డి, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, జాతీయ రైల్వేబోర్డు సభ్యుడు జి.నరేందర్ యాదవ్, నగర పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ, ఇంకా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రాజకీయ నేతలు పాల్గొన్నారు.
అసెంబ్లీ, గాంధీభవన్‌లలోనూ: గాంధీ జయంతిని పురస్కరించుకుని బుధవారం అసెంబ్లీ ఆవరణలోని బాపూ విగ్రహానికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, స్పీకర్ నాదెండ్ల మనోహర్‌లు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు. గాంధీభవన్లో మహాత్ముని విగ్రహానికి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పూలమాల వేసి నివాళి ఘటించారు. కార్యక్రమంలో ఎంపీ నంది ఎల్లయ్య, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పార్టీ ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధరం పాల్గొన్నారు.
Advertisement
Advertisement