bapu ghat
-
బాపూఘాట్ అభివృద్ధికి.. 222.27 ఎకరాలు ఇవ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో బాపూఘాట్ అభివృద్ధి కోసం ఆ ప్రాంతంలో ఉన్న 222.27 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ మంగళవారం సాయంత్రం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ను కలిశారు. మహాత్మాగాంధీ చితాభస్మాన్ని కలిపిన ఈసా, మూసీ నదుల సంగమ స్థలంలో ఏర్పాటు చేయనున్న బాపూఘాట్‌ను ప్రపంచ స్థాయిలో గాంధీ తాతి్వకతను చాటే కేంద్రంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. బాపూఘాట్ వద్ద గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, మెడిటేషన్ విలేజ్, చేనేత ప్రచార కేంద్రం, ప్రజావినోద స్థలాలు, ల్యాండ్ స్కేప్ ఘాట్లు, శాంతి విగ్రహం (స్టాట్యూ ఆఫ్ పీస్), మ్యూజియంలతో గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టనున్నామని కేంద్ర మంత్రికి తెలిపారు. ఇందుకోసం రక్షణ శాఖ భూమిని బదిలీ చేయాలని కోరారు. కొత్త విమానాశ్రయాలకు అనుమతివ్వండి తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి, ప్రజలకు రవాణా వసతులను మెరుగుపర్చడంలో భాగంగా కొత్త విమానాశ్రయాలకు అనుమతి ఇవ్వాలని పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడుకు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిశారు. తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్‌లో విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన ఎన్వోసీని రాష్ట్ర ప్రభుత్వం జీఎంఆర్ నుంచి పొందిందని వివరించారు. 253 ఎకరాల భూసేకరణకు అవసరమైన రూ.205 కోట్లను భారత విమానయాన సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసిందని..ఈ మేరకు విమానాశ్రయ పనులకు, విమానాలు నడిపేందుకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. ఇక కొత్తగూడెం జిల్లా పాల్వంచ, పెద్దపల్లి జిల్లా అంతర్గాం, ఆదిలాబాద్‌లలోనూ విమానాశ్రయాలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రులతో భేటీల్లో సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, ఆర్.రఘురామిరెడ్డి, కడియం కావ్య తదితరులు ఉన్నారు. -
బాపు ఘాట్ వద్ద ప్రధాని మోదీ నివాళులు
-
మూసీకి శాపంగా మారుతున్న మార్గాలివే..
సాక్షి, సిటీబ్యూరో: ఓ వైపు మూసీ సుందరీకరణ పేరిట కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తుండగా.. మరోవైపు మూసీ పరిధిలోని కొన్ని ఏరియాల్లో విపరీతంగా కాలుష్యం పెరుగుతోంది. ముఖ్యంగా మూసీనదికి బాపూఘాట్–ప్రతాప సింగారం (45 కి.మీ) మార్గం శాపంగా మారింది. సిటీలోకి బాపూఘాట్ వద్ద ప్రవేశిస్తున్న మూసీలో కాలుష్య మోతాదు పెరిగినట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి తాజా నివేదికలో వెల్లడించింది. ఈ రూట్లో గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న మురుగునీటితో మూసీ జలాల్లో కరిగిన ఆక్సిజన్ మోతాదు అనూహ్యంగా తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. వివిధ రకాల జలచరాలు, వృక్ష జాతులు, జంతువుల మనుగడకు అవసరమైన కరిగిన ఆక్సిజన్ శాతం (డీఓ) లీటరు నీటిలో 4 మిల్లీ గ్రాములుగా ఉండాలి. కానీ నగరంలో పలు చోట్ల 0.3 శాతంగా నమోదవడం గమనార్హం. ఇక బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీవోడీ) లీటర్ నీటిలో 3 ఎంజీలను మించకూడదు. కానీ పలు చోట్ల 10 ఎంజీలకు పైగా నమోదైంది. సిటీలో మూసీ కాలుష్యం ఇలా.. మహానగరం పరిధిలో నిత్యం విడుదలవుతోన్న 1400 మిలియన్ లీటర్ల మురుగు జలాల్లో జలమండలి కేవలం 700 మిలియన్ లీటర్ల వ్యర్థజలాలను మాత్రమే శుద్ధి చేస్తోంది. మరో 700 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాలు ఎలాంటి శుద్ధి ప్రక్రియ లేకుండానే మూసీలో కలుస్తున్నాయి. బల్క్ డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియెట్ కంపెనీల నుంచి వెలువడుతోన్న ప్రమాదకర పారిశ్రామిక, రసాయన వ్యర్థాలను శుద్ధి కేంద్రాలకు తరలించకుండా ట్యాంకర్ల ద్వారా మూసీలోకి డంప్ చేస్తున్నారు. బాపూఘాట్, మూసారాంబాగ్ వంతెన, నాగోల్, ఉప్పల్ నల్ల చెరువు, ఫీర్జాదిగూడా, ప్రతాపసింగారం వద్ద మూసీ జలాల్లో కరిగిన ఆక్సిజన్ మోతాదు తాజాగా 0.3 మిల్లీగ్రాములుగా నమోదైంది. క సిటీ పరిధి దాటిన తరవాత..రుద్రవెల్లి వంతెన, వలిగొండ, కాసానిగూడా వద్ద కరిగిన ఆక్సిజన్ మోతాదు 5.6 పాయింట్లుగా నమోదవడం విశేషం. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ బాపూఘాట్ వద్ద 10, మూసారాంబాగ్ వద్ద 16, నాగోల్ వద్ద 15, ఉప్పల్ నల్ల చెరువు వద్ద 16, ఫీర్జాదిగూడ వద్ద 15, ప్రతాప సింగారం వద్ద 10 మిల్లీ గ్రాములుగా నమోదైంది. నగర పరిధి దాటిన తరవాత బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ రుద్రవెల్లి వంతెన వద్ద 5, వలిగొండ వద్ద 4.5, కాసానిగూడా వద్ద 4 యూనిట్లుగా నమోదవడం విశేషం. మొత్తంగా నగరంలో బాపూఘాట్–ప్రతాపసింగారం మార్గంలో మూసీ జలాల్లో కరిగిన ఆక్సిజన్ మోతాదు తగ్గి, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనూహ్యంగా పెరిగినట్లు పీసీబీ తాజా నివేదికలో స్పష్టమైంది. మూసీకి ఆవల మాత్రం పరిస్థితిలో మార్పు వచ్చింది. మూసీ నదిని కాలుష్యం కోరల నుంచి రక్షించాలంటే రెండోదశ ప్రక్షాళన పథకాన్ని తక్షణం పూర్తిచేయాలి. పలు చోట్ల ఎస్టీపీలను నిర్మించి మూసీలోకి చేరుతున్న వ్యర్థజలాలను శుద్ధిచేయాలి. ఎస్టీపీలు నిర్మించాల్సిన ప్రాంతాలివే.. అంబర్పేట్(142ఎంఎల్డి), నాగోల్(140ఎంఎల్డి), నల్లచెరువు(80ఎంఎల్డి), హైదర్షాకోట్(30), అత్తాపూర్(70ఎంఎల్డి), మీరాలం(6ఎంఎల్డి), ఫతేనగర్ (30ఎంఎల్డి), ఐడీపీఎల్ టౌన్షిప్ (59ఎంఎల్డి),నాగారం(29ఎంఎల్డి), కుంట్లూర్–హయత్‌నగర్ (24 ఎంఎల్డి) రీసైక్లింగ్ యూనిట్లు: ఫతేనగర్,ఐడీపీఎల్ టౌన్షిప్,నాగారం కాప్రా చదవండి: ‘మూసీ’ చుట్టూ అందరి ప్రదక్షిణం -
మహాత్మునికి మోదీ నివాళి
సాక్షి, న్యూఢిల్లీ : జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. గాంధీ 151వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో నివాళులర్పించారు. అలాగే మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌శాస్త్రి జయంతి సందర్భంగానూ విజయ్‌ఘాట్ వద్ద ప్రధాని నివాళి అర్పించి.. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తుచేశారు. మరోవైపు గాంధీ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు గాంధీకి నివాళి అర్పిస్తున్నారు. దేశ వ్యాప్తంగానూ మహాత్ముని జయంతి వేడుకలు ఘనంగా జరుతున్నాయి. -
జాతిపితకు మహా నివాళి
లంగర్‌హౌస్: మహాత్మా గాంధీ 150వ జయంతి సంద్భంగా బుధవారం లంగర్‌హౌస్ త్రివేణి సంగమంలోని బాపూ సమాధి వద్ద గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్‌లు నివాళులు అర్పించారు. అనంతరం బాపూధ్యాన మందిరానికి వెళ్లి అక్కడ నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. అలాగే బాపూఘాట్‌లోని గాం«దీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అరి్పంచారు. నివాళులర్పించిన వారిలో మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, చేమకూర మల్లారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, దానం నాగేందర్, బాల్క సుమన్, వివేక్, అరికెపుడి గాం«దీ, ఎమ్మెల్సీలు ప్రభాకర్, మల్లే‹Ù, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, తీగల క్రిష్ణారెడ్డి ఉన్నారు. -
గొడవ ఆపడానికి వెళ్లిన పోలీసులపై దాడి
సాక్షి, హైదరాబాద్: లంగర్‌హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. బాపు ఘాట్ వద్ద ఇరు వర్గాల మధ్య గొడవ జరగుతుండగా.. ఇద్దరు పోలీసులు ఆపడానికి వెళ్లారు. అయితే అక్కడున్నవారు పోలీసులపై రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో లంగర్‌హౌస్ పీఎస్‌కు చెందిన హోంగార్డ్ ఆమేర్‌కు, నార్సింగి పీఎస్‌కు చెందిన కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. దీంతో వీరిని ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
బాపూ ఘాట్ వద్ద సీఎం కేసీఆర్ నివాళి
-
బాపూ ఘాట్ వద్ద నివాళులర్పించిన సీఎం, గవర్నర్
లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్ వద్ద భారత జాతిపిత మహాత్మా గాంధీజీకి తెలంగాణ సీఎం కేసీఆర్, ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాపూజీ గొప్పతనాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, మంత్రి మహేందర్, బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కూడా పాల్గొన్నారు. -
బాపూఘాట్లో గాంధీజీకి నేతల ఘన నివాళి
మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితోపాటు పలువురు నేతలు జాతిపితకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు జరిగాయి. ఘాట్‌లోని గాంధీ విగ్రహానికి నేతలు పూలమాలలు వేశారు. కార్యక్రమంలో మంత్రులు వట్టి వసంతకుమార్, దానం నాగేందర్, పితాని సత్యనారాయణ, ముఖేష్‌గౌడ్, కాసు కృష్ణారెడ్డి, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, జాతీయ రైల్వేబోర్డు సభ్యుడు జి.నరేందర్ యాదవ్, నగర పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ, ఇంకా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రాజకీయ నేతలు పాల్గొన్నారు. అసెంబ్లీ, గాంధీభవన్‌లలోనూ: గాంధీ జయంతిని పురస్కరించుకుని బుధవారం అసెంబ్లీ ఆవరణలోని బాపూ విగ్రహానికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, స్పీకర్ నాదెండ్ల మనోహర్‌లు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు. గాంధీభవన్‌లో మహాత్ముని విగ్రహానికి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పూలమాల వేసి నివాళి ఘటించారు. కార్యక్రమంలో ఎంపీ నంది ఎల్లయ్య, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పార్టీ ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధరం పాల్గొన్నారు. -
ఆధిపత్య వాదాన్ని వదలాలి: కోదండరాం
హైదరాబాద్: పార్లమెంట్లో తెలంగాణ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని బాపుఘాట్ వద్ద తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ఆధ్వర్యంలో మౌనదీక్ష చేపట్టారు. కార్యక్రమంలో తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంతో పాటు ఉద్యోగ సంఘ నేతలు శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తదితరులు పాల్గొన్నారు. బాపుఘాట్ వద్ద నివాళులర్పించిన నేతలు ఆ తర్వాత మౌనదీక్షలో పాల్గొన్నారు. సీమాంధ్ర ఆధిపత్యాన్నే తామంతా వ్యతిరేకిస్తున్నామని కోదండరాం అన్నారు. ఆధిపత్య వాదాన్ని వదిలి తెలంగాణ ఆకాంక్షను గుర్తించాలని ఆయన కోరారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ తప్ప మరే ప్రతిపాదననూ అంగీకరించేది లేదని కోదండరాం అంతకుముందు అన్నారు. హైదరాబాద్‌పై పేచీ పెట్టాలనుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణను అడ్డుకోవడానికి, హైదరాబాద్‌ను వివాదాస్పదం చేయడానికి ఆంధ్రా పాలకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఆ కుట్రలను తిప్పికొడతామన్నారు. -
ముఖ్యమంత్రిని టీఆర్ఎస్ అడ్డుకునే యత్నం
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి తెలంగాణావాదులు షాక్ ఇచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా బుధవారం ఉదయం లంగర్ హౌస్‌లోని బాపూ ఘాట్‌లో నివాళలర్పించడానికి విచ్చేసిన ముఖ్యమంత్రి ఎదుట తెలంగాణ ఆందోళనకారులు నిరసన తెలిపారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. మరోవైపు అసెంబ్లీలోని సచివాలయంలో గాంధీ విగ్రహానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, స్పీకర్ నాదెండ్ల మనోహర్, గవర్నర్ నరసింహన్ అంజలి ఘటించారు. ఇక గాంధీ భవన్లో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ...జాతిపితకు నివాళులు అర్పించారు. బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ కూడా గాంధీజీకి నివాళులు అర్పించి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.