Ghandhi Jayanti
-
ఇద్దరూ మహాత్ములే! ఆఖరికి ఆ ఇద్దరి..
మోహన్ దాస్ కరంచంద్ గాంధీ మహాత్ముడుగా విశ్వ ప్రసిద్ధుడయ్యారు. లాల్ బహుదూర్ శాస్త్రి కూడా మహాత్ముడే. ఇద్దరు గొప్పవాళ్ళు పుట్టినతేదీ ఒకటే కావడం ఆశ్చర్యకరం, పరమానందకరం. ఇద్దరూ అక్టోబర్ 2వ తేదీనాడు జన్మించారు. భారతనేతగా గాంధీ, భారతదేశ రెండవ ప్రధానమంత్రిగా లాల్ బహుదూర్ శాస్త్రి చరిత్రకు చెప్పలేనంత గౌరవాన్ని తెచ్చిపెట్టిన ఆధునిక నాయకులు. ఇద్దరి ముగింపు విషాదాంతమైంది. గాంధీ తుపాకీ కాల్పులకు గురియై మరణించారు.లాల్ బహుదూర్ మరణం అనుమానాస్పదం. హత్యకు గురిఅయ్యారనే భావనే ఎక్కువమందిలో ఉంది. లాల్ బహుదూర్ శాస్త్రి చాలా గొప్పవాడైనా, గాంధీ-నెహ్రూ ప్రాభవం మధ్య చరిత్రలో, లోకంలో రావాల్సినంత పేరు రాలేదని చరిత్రకారుల అభిప్రాయం. గాంధీ భారతీయ ఆత్మ. ఆత్మాభిమానం రూపం దాల్చుకుంటే అది లాల్ బహుదూర్. ఇంత ఆదర్శవంతమైన లాల్ బహుదూర్ శాస్త్రి.. జవహర్ లాల్ నెహ్రూకు, గాంధీకి ప్రియ శిష్యుడు. మహాత్మాగాంధీ జీవితం ఒక ప్రయోగశాల. కేవలం భారతదేశానికే కాదు, ఎల్ల ప్రపంచనాయకులకు స్ఫూర్తిప్రదాతగా నిలిచిన మహానాయకుడు గాంధీ. సత్యాగ్రహం,అహింస అనేవి గాంధీ నిర్మించిన రెండు గొప్ప సిద్ధాంతాలు. ధర్మాగ్రహంతో,న్యాయాగ్రహంతో సత్యాగ్రహంతో అహింసా మార్గంలో నడిచి,భారతదేశానికి బ్రిటిష్ శృంఖలాల నుంచి విముక్తి కలిగించి, స్వేచ్ఛను ప్రసాదించాడు. భగవద్గీతను ఆశ్రయించాడు. కర్మసిద్ధాంతాన్ని ఆచరించాడు, న్యాయపోరాటంలో గాంధీ జాతికి జయాన్ని కానుకగా ప్రసాదించాడు.భారతదేశ చరిత్రలో ఆధునిక కాలంలో,స్వాతంత్ర్యం పొందిన అనంతరం భారత్ కు తొలి విజయాన్ని అందించినవాడు లాల్ బహుదూర్ శాస్త్రి. 1965లో ఇండో-పాకిస్తాన్ యుద్ధం సమయంలో దేశాన్ని నడిపించి, గెలిపించిన ధీరుడు లాల్ బహుదూర్ శాస్త్రి. 20వ శతాబ్దంలో ప్రపంచమానవాళిని ప్రభావితం చేసినవారిలో మహాత్మాగాంధీదే అగ్రస్థానం.సత్యాగ్రహం, సహాయనిరాకరణ గాంధీ ఎంచుకున్న శక్తిమంతమైన ఆయుధాలు.వీటి విలువను ప్రపంచదేశాలు అర్ధం చేసుకోడానికి చాలా కాలం పట్టింది.ఇప్పటికీ చాలా దేశాలకు అసలు అర్ధమే అవ్వలేదు.హిందూ-ముస్లింల మత సామరస్యానికి చాలా ప్రయత్నించాడు. కానీ ఆ అంశమే అతన్ని బలితీసుకుంది. టాల్ స్టాయ్ ను గాంధీ గురువుగా భావించాడు.సామ్రాజ్యవాదం, హింసా విధానాలపై వ్యతిరేకత వీరిద్దరినీ మానసికంగా కలిపింది. గాంధీ జీవితం మొత్తం సత్యశోధనకు అంకితం చేశారు. తను చేసిన తప్పులను తెలుసుకోవడం,వాటి నుంచి నేర్చుకోవడం మార్గంగా సాగారు. అందుకే గాంధీ ఆత్మకథకు 'సత్యశోధన' అని పేరు పెట్టుకున్నారు. సత్యంతో చేసిన ప్రయోగాలే అతని జీవితం. మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా వంటి స్వాతంత్ర్య యోధులకు స్ఫూర్తిగా నిలిచినవాడు మహాత్మాగాంధీ.ఇటువంటి వ్యక్తి నిజంగా మన మధ్యనే జీవించాడంటే? తర్వాత తరాలవారు నమ్మలేరని ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ చేసిన వ్యాఖ్య అజరామరం. జీసస్ నాకు సందేశం ఇచ్చాడు, గాంధీ దాన్ని ఆచరించాడని మరో మహానేత మార్టిన్ లూథర్ కింగ్ అన్నాడు.నా జీవితమే సందేశం,అని గాంధీయే అన్నాడు. ఇంతటి గాంధీ స్ఫూర్తితో ముందుకు సాగి దేశభక్తి,నిజాయితీ, ప్రయోగాలు,పవిత్రత,సత్యం, ఆత్మాభిమానం ఉఛ్వాసనిశ్వాసలుగా జీవించినవాడు లాల్ బహుదూర్ శాస్త్రి. కేంద్రమంత్రిగా, ప్రధానమంత్రిగా ఉన్నంతకాలం ఎన్నో నూత్న ప్రయోగాలు ఆవిష్కరించాడు. జవానులను, రైతులను సమానంగా భావించాడు. ఒకరు యుద్ధక్షేత్రంలో ఉంటారు. ఇంకొకరు వ్యవసాయ క్షేత్రంలో ఉంటారు.జై జవాన్-జై కిసాన్ నినాదం తీసుకువచ్చినవాడు లాల్ బహుదూర్ శాస్త్రి. వ్యవసాయ విప్లవానికి (గ్రీన్ రెవల్యూషన్) కు బాటలు వేసింది కూడా ఈయనే. పంటకు ఎంత విలువ ఇచ్చాడో, పాడికి కూడా అంతే విలువ ఇచ్చాడు.శ్వేతవిప్లవం ఈయన తెచ్చిందే.సోవియట్ యూనియన్, శ్రీలంకతో ఒప్పందాలు కుదుర్చుకొని బంధాలను గట్టి పరచి, విదేశీ విధానంలోనూ తన ముద్ర వేసుకున్నాడు.నెహ్రు క్యాబినెట్ లో మొట్టమొదటి రైల్వే మంత్రి లాల్ బహుదూర్ శాస్త్రి. దేశంలో జరిగిన ఒక రైల్వే ప్రమాదానికి నైతిక బాధ్యత వహించి తన మంత్రి పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు.అన్నేళ్లు కేంద్ర మంత్రి, ప్రధానమంత్రిగా పనిచేసిన ఆయనకు చివరకు సొంత ఇల్లు కూడా లేదు.కుటుంబ సభ్యుల ఒత్తిడితో అప్పుచేసి కారు కొనుక్కున్నారు.ఒక్కమాటలో చెప్పాలంటే? మహాత్మాగాంధీ , జవహర్ లాల్ నెహ్రు విధానాలకు లాల్ బహుదూర్ శాస్త్రి ఆత్మీయమైన అసలు సిసలు వారసుడు.ఆర్ధిక విధానాలలో నెహ్రును కూడా దాటి ముందుకు వెళ్లారు.మరో గాంధీ పుట్టడు, మరో లాల్ బహుదూర్ శాస్త్రి పుట్టడు.వీరి సిద్ధాంతాలు, ఆచరించిన మార్గాలు ప్రస్తుత కాలంలో ఆచరించడానికి కష్టమైనా,ఏదో ఒక రోజు వీరిని తప్పక అనుసరించాల్సిన పరిస్థితులు వస్తాయి. ఈ మహానేతలు సర్వకాలీనులు. వీరి సిద్ధాంతులు ఎప్పటికీ అవసరంగానే నిలుస్తాయి. -మాశర్మ సీనియర్ జర్నలిస్ట్ (చదవండి: గాంధీ కలలు కన్న స్వరాజ్యం ఇదేనా! మళ్లీ ఆయన..) -
ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండా ఆవిష్కరణ.. ఎక్కడంటే..
మహాత్మాగాంధీ 152 వ జయంతి సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఖద్దర్ జాతీయ పతాకాన్ని లడఖ్‌లోని లెహ్ టౌన్లో ఆవిష్కరించారు. కాగా లడఖ్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఆర్కే బథుర్ శనివారం ఉదయం ఈ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి ఆర్మీ ఛీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవనె కూడా హాజరయ్యారు. 225 అడుగుల పొడవు, 150 అడుగుల వెడల్పు కొలతతో ఖద్దర్ జాతీయ పతాకాన్ని రూపొందించారు. దాదాపుగా వెయ్యి కిలోల బరువున్న ఈ త్రివర్ణ పతాకాన్ని ఇండియన్ ఆర్మీకి చెందిన 57 మంది ఇంజనీర్ సైనిక దళం తయారుచేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. కొండపై ప్రదర్శనకు ఉంచిన జెండా, కొండ మీదుగా వెళ్తున్న హెలికాప్టర్లు ఈ వీడియోలో కనిపిస్తాయి. ‘గాంధీజయంతి సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఖాదీ జాతీయ పతాకాన్ని లడఖ్‌లో ఆవిష్కరించడం దేశానికే గర్వకారణం. బాపు జ్ఞాపకార్థానికి, హస్తకళలను ప్రోత్సహించడానికి, దేశ గౌరవానికి ఇదే నా వందనం. జై హింద్. జై భారత్!’ అని ట్విటర్ పోస్టులో పంచుకున్నారు. చదవండి: ఇవి తింటే బట్టతల ఖాయం..! గుడ్డు తెల్లసొన, చేప, చక్కెర.. It is a moment of great pride for 🇮🇳 that on Gandhi ji's Jayanti, the world's largest Khadi Tiranga is unveiled in Leh, Ladakh. I salute this gesture which commemorates Bapu's memory, promotes Indian artisans and also honours the nation. Jai Hind, Jai Bharat! pic.twitter.com/cUQTmnujE9 — Mansukh Mandaviya (@mansukhmandviya) October 2, 2021 -
బాపూజీ బాటలో.. సమైక్య స్ఫూర్తితో..
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ గాంధీ జయంతి సందర్భంగా బుధవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో శాంతియుత నిరసనలు తెలిపారు. మహాత్మగాంధీ విగ్రహానికి వినతిపత్రాలు సమర్పించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వేడుకున్నారు. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అన్న గాంధీ బోధనలను అనుసరిస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మరికొంత మంది నోటికి నల్లరిబ్బన్లు కట్టుకొని మౌన ప్రదర్శన చేశారు. సమైక్యాంధ్ర సాధన కోసం చేపట్టిన నిరవధిక సమ్మె 64వ రోజుకు చేరుకొంది. సాధారణ ప్రజలతోపాటు ఉద్యోగులు వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. జాతీయ నాయకుల వేషధారణలతో చేపట్టిన నిరసనలు ప్రజలను ఆకట్టుకున్నాయి. రక్తదాన శిబిరం.. మౌన ప్రదర్శనలు: జిల్లా కేంద్రమైన ఒంగోలులో వినూత్న రీతిలో నిరసనలు తెలిపారు. జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు. 55 మంది రక్తదానం చేశారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నగరంలో శాంతి ర్యాలీ చేశారు. రెవెన్యూ కాన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నగరంలో నిరసనకారులు మూతికి నల్లరిబ్బన్లు కట్టుకుని మౌన ప్రదర్శన నిర్వహించారు. పంచాయతీరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులు చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అనే రీతిలో ప్రదర్శన నిర్వహించారు. జిల్లా పంచాయతీ విభాగం అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. హయ్యర్ బస్సు అడ్డగింత: అద్దంకి నియోజకవర్గంలో సమైక్యాంధ్ర నిరసనల జోరు కొనసాగింది. సమైక్యాం ధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం 45వ రోజుకు చేరుకున్నాయి. వాసవీ వనితా క్లబ్ ఆధ్వర్యంలో 30 మంది మహిళలు రిలే దీక్షలకు దిగారు. ఉద్యోగులు, ఆర్టీసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఆ సమయంలో నరసరావుపేట నుంచి అద్దంకి డిపోకు హయ్యర్ బస్సు రావడంతో దానిని అడ్డుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ నిరవధిక సమ్మెకు దిగితే బస్సును ఎలా నడుపుతారంటూ నిలదీశారు. మరోమారు తిరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బల్లికురవలో సమైక్యాంధ్ర సాధనకు పాదయాత్ర నిర్వహించారు. టెన్నిస్ క్రీడాకారుల దీక్షలు: గిద్దలూరులో సమైక్య నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. గిద్దలూరు టెన్నిస్ క్లబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 12 మంది టెన్నిస్ క్రీడాకారులు రిలే దీక్షలు చేపట్టారు. కందుకూరులో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కనిగిరిలో సమైక్యాంధ్ర పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో దళితులు రిలే దీక్షలు చేపట్టారు. దళిత క్రిష్టియన్ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర సాధనలో భాగంగా రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఆటో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. కొండపి, మర్రిపూడి ప్రాంతాల్లో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. దర్శిలో ఉద్యోగస్తులు భారీ ప్రదర్శన నిర్వహించారు. మాజీ శాసనసభ్యుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ర్యాలీలో పాల్గొని సంఘీభావం ప్రకటిం చారు. మార్కాపురంలో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహిం చారు. అంగన్వాడీలు రాష్ట్రం సమైక్యంగా ఉండాలం టూ ముగ్గులు వేశారు. ఆర్టీసీ కార్మికులు గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పిం చారు. యర్రగొండపాలెంలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. -
మహాత్ముని మార్గమే ఆదర్శం
మహాత్మాగాంధీ అనుసరించిన మార్గమే తమకు ఆదర్శమని వైఎస్సార్సీ ఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా బుధవారం ఆయన స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో మహాత్ముని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీరోడ్డులోని గాంధీ విగ్రహాన్ని పూలమాలలతో అలంకరించారు. అనంతరం బాలినేని మీడియాతో మాట్లాడుతూ మహాత్ముడు శాంతి, అహింసే ఆయుధాలుగా బ్రిటీష్‌వారితో పోరాడి స్వాతంత్య్రం తీసుకువచ్చారన్నారు. అవే ఆయుధాలుగా సమైక్యాంధ్రను సాధించేందుకు తమ పార్టీ కూడా దృష్టి సారించిందని చెప్పారు. సమైక్యాంధ్రను సాధించేందుకు కృషిచేస్తున్న ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా బాలినేని ధన్యవాదాలు ప్రకటించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు 13 జిల్లాల్లో వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకులంతా నిరాహార దీక్షల్లో కూర్చుంటున్నారని, వారికి సంఘీభావంగా మరికొంత మంది కూడా దీక్షల్లో పాల్గొంటున్నారన్నారు. రాష్ట్రం సమైక్యంగా లేకపోతే ప్రజలు పడే పాట్లు దృష్టిలో ఉంచుకునే తమ పార్టీ పోరాటం చేస్తోందని, అన్ని వర్గాల ప్రజలు వైఎస్సార్సీపీ చేస్తున్న సమైక్యాంధ్ర పోరాటానికి సంఘీభావం ప్రకటించేందుకు, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కదిలిరావాలని పిలుపునిచ్చారు. బాలినేని వెంట వైఎస్సార్సీపీ నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్, అద్దంకి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాచిన చెంచుగరటయ్య, వివిధ విభాగాల కన్వీనర్లు వేమూరి సూర్యనారాయణ, కేవీ రమణారెడ్డి, కఠారి శంకర్, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ పోకల అనూరాధ, యువజన విభాగం జిల్లా అధికార ప్రతినిధి చిన్నపురెడ్డి అశోక్‌రెడ్డి, నగర అధికార ప్రతినిధి రొండా అంజిరెడ్డి, సింగరాజు వెంకట్రావు, నెరుసుల రాము, ముదివర్తి బాబూరావు, బొప్పరాజు కొండలు, యరజర్ల రమేష్, ఒంగోలు మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ రాయపాటి అంకయ్య, ఉలిచి వైఎస్సార్ సీపీ నాయకులు మండువ సుబ్బారావు, లంకపోతు అంజిరెడ్డి, మీరావలి, కృష్ణారెడ్డి, గోవర్థన్, గంగాడ సుజాత, పురిణి ప్రభావతి, జయంతి, సుబ్బులు, బడుగు ఇందిర, రాయని వెంకట్రావు, వల్లెపు మురళి, లక్ష్మి, వర్థు శేషయ్య, బేతంపూడి రాజేశ్వరి, లంకపోతు అంజిరెడ్డి, ఆళ్ల రవీంద్రారెడ్డి, తోటపల్లి సోమశేఖర్ పాల్గొన్నారు. -
బాపూఘాట్లో గాంధీజీకి నేతల ఘన నివాళి
మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితోపాటు పలువురు నేతలు జాతిపితకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు జరిగాయి. ఘాట్‌లోని గాంధీ విగ్రహానికి నేతలు పూలమాలలు వేశారు. కార్యక్రమంలో మంత్రులు వట్టి వసంతకుమార్, దానం నాగేందర్, పితాని సత్యనారాయణ, ముఖేష్‌గౌడ్, కాసు కృష్ణారెడ్డి, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, జాతీయ రైల్వేబోర్డు సభ్యుడు జి.నరేందర్ యాదవ్, నగర పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ, ఇంకా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రాజకీయ నేతలు పాల్గొన్నారు. అసెంబ్లీ, గాంధీభవన్‌లలోనూ: గాంధీ జయంతిని పురస్కరించుకుని బుధవారం అసెంబ్లీ ఆవరణలోని బాపూ విగ్రహానికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, స్పీకర్ నాదెండ్ల మనోహర్‌లు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు. గాంధీభవన్‌లో మహాత్ముని విగ్రహానికి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పూలమాల వేసి నివాళి ఘటించారు. కార్యక్రమంలో ఎంపీ నంది ఎల్లయ్య, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పార్టీ ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధరం పాల్గొన్నారు.