మహాత్మాగాంధీ అనుసరించిన మార్గమే తమకు ఆదర్శమని వైఎస్సార్‌సీ ఎల్‌పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా బుధవారం ఆయన స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో మహాత్ముని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీరోడ్డులోని గాంధీ విగ్రహాన్ని పూలమాలలతో అలంకరించారు. అనంతరం బాలినేని మీడియాతో మాట్లాడుతూ మహాత్ముడు శాంతి, అహింసే ఆయుధాలుగా బ్రిటీష్‌వారితో పోరాడి స్వాతంత్య్రం తీసుకువచ్చారన్నారు. అవే ఆయుధాలుగా సమైక్యాంధ్రను సాధించేందుకు తమ పార్టీ కూడా దృష్టి సారించిందని చెప్పారు.
సమైక్యాంధ్రను సాధించేందుకు కృషిచేస్తున్న ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా బాలినేని ధన్యవాదాలు ప్రకటించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు 13 జిల్లాల్లో వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకులంతా నిరాహార దీక్షల్లో కూర్చుంటున్నారని, వారికి సంఘీభావంగా మరికొంత మంది కూడా దీక్షల్లో పాల్గొంటున్నారన్నారు. రాష్ట్రం సమైక్యంగా లేకపోతే ప్రజలు పడే పాట్లు దృష్టిలో ఉంచుకునే తమ పార్టీ పోరాటం చేస్తోందని, అన్ని వర్గాల ప్రజలు వైఎస్సార్‌సీపీ చేస్తున్న సమైక్యాంధ్ర పోరాటానికి సంఘీభావం ప్రకటించేందుకు, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కదిలిరావాలని పిలుపునిచ్చారు.
బాలినేని వెంట వైఎస్సార్‌సీపీ నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్, అద్దంకి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాచిన చెంచుగరటయ్య, వివిధ విభాగాల కన్వీనర్లు వేమూరి సూర్యనారాయణ, కేవీ రమణారెడ్డి, కఠారి శంకర్, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ పోకల అనూరాధ, యువజన విభాగం జిల్లా అధికార ప్రతినిధి చిన్నపురెడ్డి అశోక్‌రెడ్డి, నగర అధికార ప్రతినిధి రొండా అంజిరెడ్డి, సింగరాజు వెంకట్రావు, నెరుసుల రాము, ముదివర్తి బాబూరావు, బొప్పరాజు కొండలు, యరజర్ల రమేష్, ఒంగోలు మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ రాయపాటి అంకయ్య, ఉలిచి వైఎస్సార్ సీపీ నాయకులు మండువ సుబ్బారావు, లంకపోతు అంజిరెడ్డి, మీరావలి, కృష్ణారెడ్డి, గోవర్థన్, గంగాడ సుజాత, పురిణి ప్రభావతి, జయంతి, సుబ్బులు, బడుగు ఇందిర, రాయని వెంకట్రావు, వల్లెపు మురళి, లక్ష్మి, వర్థు శేషయ్య, బేతంపూడి రాజేశ్వరి, లంకపోతు అంజిరెడ్డి, ఆళ్ల రవీంద్రారెడ్డి, తోటపల్లి సోమశేఖర్ పాల్గొన్నారు.
మహాత్ముని మార్గమే ఆదర్శం
Published Thu, Oct 3 2013 3:23 AM | Last Updated on Fri, Sep 1 2017 11:17 PM
Advertisement