'ఆ నలుగురు' పేర్లు ఖరారు చేసిన చంద్రబాబు | TDP select four MLCs in governor quota | Sakshi
Sakshi News home page

'ఆ నలుగురు' పేర్లు ఖరారు చేసిన చంద్రబాబు

Published Sat, May 23 2015 10:29 AM | Last Updated on Fri, Aug 10 2018 7:56 PM

'ఆ నలుగురు' పేర్లు ఖరారు చేసిన చంద్రబాబు - Sakshi

'ఆ నలుగురు' పేర్లు ఖరారు చేసిన చంద్రబాబు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కోటాలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను టీడీపీ అధిష్టానం శనివారం ప్రకటించింది. కృష్ణా జిల్లాకు చెందిన టీడీ జనార్ధన్, నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు, నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీద రవిచంద్రయాదవ్ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసినట్లు వెల్లడించింది.

అయితే ఇప్పటి వరకు విజయవాడ మాజీ మేయర్, టీడీపీ ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని అధిష్టానం భావించింది. కానీ ఆఖరి నిముషంలో నలుగురి పేర్లలో అనురాధ పేరును తొలగించి.. బీద రవిచంద్ర పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఎమ్మెల్సీ పదవి కోసం పార్టీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడంలో బీద రవిచంద్రయాదవ్ చివరినిమిషంలో కృతార్థులయ్యారు. గవర్నర్ కోటాలో ఎన్నికైన ఈ నలుగురు ఆరెళ్ల పాటు ఎమ్మెల్సీ పదవిలో కొనసాగుతారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement