Governor quota
-
TG: గవర్నర్‌కోటా ఎమ్మెల్సీల నియామకానికి సుప్రీం గ్రీన్‌సిగ్నల్
సాక్షి,న్యూఢిల్లీ: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు బుధవారం(ఆగస్టు14) స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు స్టే అమల్లో ఉంటుందని జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. తమ నియామకాన్ని పక్కన పెట్టి కొత్తగా ఎమ్మెల్సీలను గవర్నర్ కోటాలో ఎంపిక చేయడాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా స్టే విధించాలని పిటిషనర్లు కోరగా బెంచ్ నిరాకరించింది. కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే గవర్నర్, ప్రభుత్వ హక్కులు హరించినట్లు అవుతుందని వ్యాఖ్యానించింది. ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టడం ప్రభుత్వ విధి అని పేర్కొంది. అనంతరం పిటిషన్‌పై విచారణను ధర్మాసనం నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. టీజేఎస్ అధినేత కోదండరాం, జర్నలిస్టు అమిర్ అలీఖాన్ పేర్లను తెలంగాణ కేబినెట్ తాజాగా గవర్నర్‌కోటా ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ గవర్నర్‌కు సిఫారసు చేసిన విషయం తెలిసిందే. -
ఎమ్మెల్సీలపై మళ్లీ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్ర సత్యనారాయణలను నియమించాలంటూ రాష్ట్ర కేబినెట్ చేసిన సిఫార్సు లపై గవర్నర్ వ్యవహరించిన తీరు సరికాదని రాష్ట్ర హైకోర్టు పేర్కొంది. సదరు సిఫార్సులను తిరస్క రిస్తూ 2023 సెప్టెంబర్ 19న గవర్నర్ ఇచ్చిన ఆదేశా లను రద్దు చేసింది. దీంతోపాటు గవర్నర్ ఆదేశాల మేరకు కోదండరామ్, ఆమెర్ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ఈ ఏడాది జనవరి 27న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను కూడా రద్దు చేసింది. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని.. మరోసారి ఎమ్మెల్సీల పేర్లను కేబినెట్ లో ప్రతిపాదించి గవర్నర్‌కు పంపాలని స్పష్టం చేసింది. ఈ మేరకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక వివాదంపై దాఖలైన పిటిషన్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటిల ధర్మాసనం గురువారం కీలక తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171 (5) ప్రకారం.. కేబినెట్ సాయం, సలహా మేర కు గవర్నర్ వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొంది. కేబినెట్ సిఫార్సు చేసిన వ్యక్తుల అర్హత, అనర్హత అంశాలను పరిశీలించడానికి గవర్నర్‌కు అధికారం ఉంటుందని.. కావాలంటే అవసరమైన పత్రాలు, సమాచారం కోరవచ్చని తెలిపింది. కేబినెట్ సిఫార్సులను పునఃపరిశీలనకు పంపే అధికారం కూడా ఉంటుందని స్పష్టం చేసింది. వాస్తవానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం కోర్టుకు గవర్నర్ జవాబుదారీ కాదని.. గవర్నర్‌కు కోర్టులు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేవని పేర్కొంది. కానీ హైకోర్టుకు న్యాయసమీక్ష చేసే అధికారం ఉంటుందని వివరించింది. ‘గవర్నర్ కోటా’ పిటిషన్లపై వాదనలను పరిశీలించాక.. రాజ్యాంగంలోని నిబంధనలకు అనుగుణంగా తగిన చర్య తీసుకోవాలని భావించి తీర్పునిస్తున్నట్టు తెలిపింది. ఇక అప్పటి కేబినెట్ సిఫార్సులను అమలు చేయాలన్న పిటిషనర్ల డిమాండ్‌పై చర్చ అనవసరమని.. వారు గవర్నర్ తిరస్కరించడాన్ని మాత్రమే సవాలు చేశారని పేర్కొంది. ‘గవర్నర్ కోటా’వివాదం ఇదీ.. 2023 జూలై 31న భేటీ అయిన గత ప్రభుత్వ కేబినెట్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్ర సత్యనారాయణల పేర్లను గవర్నర్‌కు సిఫార్సు చేసింది. గవర్నర్ ఈ సిఫార్సులను తిరస్కరిస్తూ సెప్టెంబర్ 19న ఆదేశాలు జారీ చేశారు. దీంతో గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లు విచారణలో ఉండగానే.. కొత్త ప్రభుత్వ కేబినెట్ సిఫార్సు మేరకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, జర్నలిస్టు ఆమెర్ అలీఖాన్‌ల నియామకానికి గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ ఏడాది జనవరి 27న ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ నియామకాలను కూడా శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. రెండు అంశాలపైనా హైకోర్టు సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. కోదండరామ్, ఆమెర్ అలీఖాన్‌ను ప్రధాన పిటిషన్లో ఇంప్లీడ్ చేసింది. వారి ప్రమాణస్వీకారంపైనా స్టే ఇచ్చింది. తాజాగా తీర్పు వెలువరించింది. గవర్నర్ నిర్ణయం అభ్యంతరకరం! ‘‘దాసోజు శ్రవణ్ రాజకీయ నాయకుడన్న కారణంగా గవర్నర్ తిరస్కరించారు. తర్వాత నియామకమయ్యే వారు కూడా రాజకీయాలకు సంబంధం లేకుండా ఉండాలి. కానీ నియామకమైన వారు కూడా రాజకీయ నాయకులే. అందులో ఒకరు రాజకీయ పార్టీనే నడిపిస్తున్నారు’’ అని హైకోర్టులో దాసోజు శ్రవణ్ తరఫున సీనియర్ న్యాయవాది ఆదిత్యా సోంధీ వాదనలు వినిపించారు. ‘‘గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వ అర్హతలకు.. పిటిషనర్ల నామినేషన్ తిరస్కరణ కారణాలకు పొంతన లేదు. మంత్రివర్గ సిఫార్సులను తిరస్కరించే అధికారం గవర్నర్‌కు లేదు. దీనిపై సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. గవర్నర్‌కు అభ్యంతరం ఉంటే పునః పరిశీలన కోసం వెనక్కి పంపవచ్చు. గవర్నర్ తిరస్కరణ కారణంగా హక్కును కోల్పోయిన పిటిషనర్‌కు కోర్టును ఆశ్రయించే అర్హత ఉంటుంది. శ్రవణ్, సత్యనారాయణల పేర్లను నెలల తరబడి పరిశీలించిన గవర్నర్.. కోదండరామ్, ఆమెర్ అలీఖాన్‌ల పేర్లను మాత్రం కొత్త కేబినెట్ సిఫార్సు చేసిన వెంటనే ఆమోదించింది’’ అని వివరించారు. కుర్ర సత్యనారాయణ తరఫున సీనియర్ న్యాయవాది మయూర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘‘మంత్రి మండలి సిఫార్సులను గవర్నర్ వెనక్కి పంపడానికి, తిరస్కరించడానికి తేడా లేదని పేర్కొనడం సరికాదు. ప్రభుత్వం సిఫార్సు చేసిన అభ్యర్థులపై గవర్నర్‌గా సంతృప్తి చెందడం వేరు.. ఓ వ్యక్తిగా సంతృప్తి చెందడం వేరు. పిటిషనర్ల పేర్లను గవర్నర్ వ్యక్తిగతంగా తిరస్కరించినట్టు కనిపిస్తోంది’’ అని పేర్కొన్నారు. గవర్నర్.. రబ్బర్ స్టాంప్ కాదు.. ‘‘ఎవరికైనా రాజ్యాంగం అనేది సుప్రీం. దాన్ని ఎవరైనా అనుసరించాలి. భాషాపరమైన, సైన్స్ వంటి రంగాల్లో సేవలందించిన వారిని మంత్రి మండలి సిఫార్సు చేయాలి. అలా కాకుండా రాజకీయ విభాగాలకు చెందిన వారిని సిఫార్సు చేస్తే.. కారణాలను పేర్కొంటూ తిస్కరించే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. గవర్నర్ రబ్బర్ స్టాంప్ కాదు. గవర్నర్ తిరస్కరించిన తర్వాత వేరేవారి పేర్లు పంపడానికి ప్రభుత్వానికి అవకాశం ఉన్నా పంపలేదు. మంత్రి మండలి సిఫార్సులను వెనక్కి పంపిన గవర్నర్ చర్యలను అలహాబాద్, బాంబే హైకోర్టులు గతంలో సమర్థించాయి. కోదండరామ్, ఆమెర్ అలీఖాన్‌లను గవర్నర్ నేరుగా ఏమీ నియమించలేదు. మంత్రి మండలి సిఫార్సు చేసిన తర్వాత.. ఆయా రంగాల్లో వారు చేసిన సేవను పరిశీలించి ఆమోదముద్ర వేశారు’’ అని కోదండరామ్, అలీఖాన్‌ల తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ కోర్టుకు విన్నవించారు. ప్రభుత్వ సిఫార్సు మేరకే నియామకం.. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) వాదనలు వినిపిస్తూ.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఇద్దరి పేర్లను ఎమ్మెల్సీలుగా సూచిస్తూ జనవరి 24న ప్రభుత్వం సిఫార్సు చేసిందని, దాన్ని పరిశీలించాకే గవర్నర్ ఆమోదించారని వివరించారు. ఇదంతా చట్టప్రకారమే జరిగిందన్నారు. గతంలో ప్రభుత్వం చేసిన సిఫార్సులను పక్కకుపెట్టే అధికారం ఇప్పుడున్న సర్కార్‌కు ఉంటుందని స్పష్టం చేశారు. – గవర్నర్ కార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.అశోక్ ఆనంద్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. ‘‘గవర్నర్ నిర్ణయాలను కోర్టులు విచారించలేవు. రాజ్యాంగం గవర్నర్ విచక్షణాధికారాలకు పూర్తి రక్షణ కల్పించింది. గవర్నర్ విచక్షణ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మంత్రి మండలి సలహాపై.. మరొకటి సొంత విచక్షణాధికారం. ప్రజాప్రతినిధుల కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నుకునే అవకాశం ఎమ్మెల్యేలకు ఎలా ఉంటుందో.. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలను నియమించే విచక్షణాధికారాలు గవర్నర్‌కు ఉన్నాయి’’ అని వివరించారు. -
తెలంగాణ హైకోర్టు.. ఇద్దరు ఎమ్మెల్సీల నియామకం కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్ర గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. ఈ సందర్భంగా కోదండరామ్, అలీఖాన్‌ల నియామకాన్ని హైకోర్టు కొట్టివేసింది. వివరాల ప్రకారం.. తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామకంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ.. సిఫార్సుల తిరస్కరణలో గవర్నర్ తమిళిసై తీరును హైకోర్టు తప్పు పట్టింది. వీరి ఎన్నికను పున:పరిశీలించాలని గవర్నర్‌ను కోర్టు ఆదేశించింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల జాబితాను మరోసారి కేబినెట్ ముందు ఉంచి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఇదే సమయంలో ఇద్దరు ఎమ్మెల్సీలను నియమిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్ నియామకాలను కోర్టు కొట్టివేసింది. అలాగే, మంత్రి మండలి నిర్ణయాలకు గవర్నర్ కట్టుబడి ఉండాల్సిదేనని హైకోర్టు సూచించింది. ఇక, మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకాలను చేపట్టాలని కోర్టు తెలిపింది. ఈ సందర్భంలో ఆర్టికల్ 171 ప్రకారం కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ ఆపడానికి వీల్లేదని హైకోర్టు దృష్టికి పిటిషనర్ తరుపు న్యాయవాదులు తీసుకెళ్లారు. -
ప్రొ. కోదండరాం ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేకులు
హైదరాబాద్, సాక్షి: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. యథాతథ స్థితినే కొనసాగించాలని చెబుతూ.. కొత్త సభ్యులతో ప్రమాణం చేయించొద్దని మంగళవారం తన ఆదేశాల్లో పేర్కొంది. దీంతో తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీఖాన్‌ల ప్రమాణం చేయడానికి వీల్లేదు!. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీఖాన్. వీళ్ల నియామకాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తాము వేసిన పటిషన్ విచారణ తేలెంత వరకు పిటిషన్ విచారణ ఆపాలంటూ కోరారు వాళ్లు. అయితే కోర్టు వాళ్ల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా ప్రమాణం చేయించవద్దని చెబుతూ.. ఫిబ్రవరి 8వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది. కొద్ది నెలల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను ప్రకటించింది. గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ నామినేట్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ ఇద్దరి పేర్లను గవర్నర్ కు పంపారు. అయితే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వీరి పేర్లను ఆమోదించలేదు. ఇంతలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అయితే గవర్నర్ తమ పేరును ఆమోదించకపోవడంపై దాసోజు శ్రవణ్, సత్యనారాయణ రాష్ట్ర హైకోర్టుకు వెళ్లారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టికల్ 171 ప్రకారం తమను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిందని.. దాన్ని తిరస్కరించే హక్కు గవర్నర్ లేదని వారు పేర్కొన్నారు. వీరి పిటిషిన్ పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉంది. ఈలోపే కోదండరాం, అమీర్ అలీఖాన్‌లను కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటాకు ప్రతిపాదించగా.. అందుకు గవర్నర్ ఆమోదం తెలపడంతోనే రాజకీయ అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. -
ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరామ్
-
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ భర్తీపై తమిళిసై కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు తీసుకోరాదని నిర్ణయించారు. హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో రిట్ పిటిషన్లపై తీర్పు వచ్చే వరకు ఎమ్మెల్సీ భర్తీ నిలిపివేయాలని తమిళిసై నిర్ణయించినట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. -
బీఆర్ఎస్ స్ట్రాటజీ.. ఎమ్మెల్సీగా దాసోజు!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఇవాళ జరిగిన మంత్రిమండలి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా.. దాసోజు శ్రవణ్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేటీఆర్ సైతం ఆయన పేరును మీడియా ముందు ప్రస్తావించారు కూడా. దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ కానుండటంతో.. ఖైరతాబాద్ నేతల మధ్య పోటీ చల్లబడినట్లయ్యింది. సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు లైన్ క్లియర్ అయింది. దీంతో ఖైరతాబాద్ నుంచి దానం మళ్లీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నల్లగొండకు చెందిన దాసోజు శ్రవణ్ కుమార్.. వక్తగా, సబ్జెక్ట్‌పై గ్రిప్ ఉన్న మేధావిగా పేరుంది. ప్రజా రాజ్యం పార్టీ, టీ(బీ)ఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో పని చేసిన శ్రవణ్.. తిరిగి బీఆర్ఎస్లో చేరికతో ఇప్పుడు ఎమ్మెల్సీ అవకాశం అందిపుచ్చుకున్నారు. ప్రజారాజ్యం పార్టీలో వ్యవస్థాపక పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, అధికారిక ప్రతినిధిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడిగా, టీ(బీ)ఆర్ఎస్ తరపున అపెక్స్ స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ఆపై భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో జాతీయ అధికార ప్రతినిధిగా, ఏఐసిసి సభ్యుడిగా, టిపిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా, జనరల్ సెక్రటరీగా, మీడియా & కమ్యూనికేషన్స్ విభాగానికి ఇన్ఛార్జ్ గా, ముఖ్య అధికార ప్రతినిధిగా, ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (తెలంగాణ) అధ్యక్షుడిగా, 2018 ఎన్నికల ప్రచార కమిటీ కన్వీనర్ గా, 2019 మీడియా మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్ గా, ఏఐసిసి జాతీయ ఎన్నికల నియంత్రణ సభ్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి పొలిట్‌బ్యూరో సభ్యుడు, అధికారిక ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
గవర్నర్ కోటా చాన్స్ ఎవరికో..? 20 మంది ఆశావహులు.. ఆ ఇద్దరు ఎవరు?
సాక్షి, హైదరాబాద్: సుమారు నెలన్నరకు పైగా ఖా ళీగా ఉన్న రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి సంబంధించిన ప్రక్రియపై బీఆర్ఎస్ అధి నేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు కసరత్తు చేపట్టారు. అభ్యర్థులను ఖరారు చేసి ప్రతిపాదనలు పంపడంపై దృష్టి సారించారు. ఇద్దరి పేర్లను వారం రోజుల్లో నే గవర్నర్ ఆమోదానికి పంపే అవకాశ ముందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది మే 27న గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా పనిచేసిన ఫారూఖ్ హుస్సేన్, డి.రాజేశ్వర్ ఆరేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. వీరి స్థానంలో ఎవరినీ నామినేట్ చేయకపోవడంతో సుమారు నెలన్నర రోజులుగా ఈ రెండు పదవులు ఖాళీగా ఉన్నాయి. భారీ సంఖ్యలో ఆశావహులు మైనార్టీ వర్గానికి చెందిన ఫారూఖ్ హుస్సేన్, డి.రాజేశ్వర్ ఇద్దరూ తమకు మరోమారు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు క్రిస్టియన్ మై నారిటీ వర్గానికి చెందిన రాయిడిన్ రోచ్.. తనకు అవకాశం ఇవ్వాలని కోరుతూ పలు సంఘాలు చేసిన తీర్మానాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకె ళ్తున్నారు. వీరితో సుమారు 20 మంది నేతలు ఎమ్మె ల్సీ పదవులను ఆశిస్తుండగా పలువురి పేర్లు ముఖ్య మంత్రి పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, దాసోజు శ్రవణ్, పీ ఎల్ శ్రీనివాస్ తదితరుల పేర్లకు సంబంధించి వడ పోత జరుగుతున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నా యి. 40 మంది సభ్యులున్న శాసనమండలిలో ప్రస్తుతం గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలను మినహాయిస్తే ఇప్పట్లో ఇతర కోటాల్లో ఖాళీలు ఏర్పడే అవకాశం లేదు. సుమారు మూడొంతులకు పైగా మండలి సభ్యులు 2027 నుంచి 2029 మధ్యకాలంలో ఆరేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకోను న్నారు. వచ్చే ఏడాది ఒక్క ఖాళీ కూడా ఏర్పడే అవ కాశం లేకపోగా, 2025లో మాత్రం కేవలం ఇద్దరు ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్, టి.జీవన్‌రెడ్డి పదవీ విరమణ చేస్తారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు గట్టి పోటీ నెలకొందని, ఈ కారణంగానే సీఎం కేసీఆర్ వీటి భర్తీ విషయంలో నెలన్నర రోజులుగా తాత్సారం చేస్తున్నట్లు చెబుతున్నారు. త్వరలో మండలికి కూచుకుళ్ల గుడ్‌బై! బీఆర్ఎస్ నాయకత్వంపై కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి త్వరలో పార్టీని వీడేందుకు సిద్ధమవుతు న్నారు. కూచుకుళ్ల కుమారుడు నాగర్‌కర్నూల్ అసెంబ్లీ టికెట్‌ను ఆశిస్తుండటం, సిట్టింగ్ ఎమ్మె ల్యే మర్రి జనార్దన్‌రెడ్డితో విభేదాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. కూచుకుళ్ల కుమారుడు ఇప్పటికే రాహుల్ సమ క్షంలో కాంగ్రెస్‌లో చేరగా, ఈనెల 20న కొల్లా పూర్లో జరిగే ప్రియాంకాగాంధీ సభలో ఆయ న కూడా చేరనున్నారు. ప్రస్తుతం అమెరికా నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తిరిగి వచ్చిన తర్వాత ఆయనతో చర్చించి ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలని కూచుకుళ్ల భావిస్తున్నట్టు తెలిసింది. అదే జరిగితే ఎన్నికల కమిషన్ నిర్ణయం మేరకు ఈ ఏడాది చివర్లో కాని, వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ ఈ ఖాళీ భర్తీకి ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. -
శ్రీకాంత్‌చారి తల్లి శంకరమ్మకు ఎమ్మెల్సీ ఛాన్స్?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మలి దశ ఉద్యమ సమయంలో ప్రాణత్యాగంతో అమరుడయ్యాడు కాసోజు శ్రీకాంతాచారి. అయితే తాజాగా.. ఆయన తల్లి శంకరమ్మకు బీఆర్ఎస్ అధిష్టానం నుంచి పిలుపు అందినట్లు సమాచారం. హుస్సేన్ సాగర్ ఒడ్డున గురువారం జరగబోయే అమరవీరుల స్థూపం ఆవిష్కరణకు రావాలంటూ ఆమెకు ఆహ్వానం పంపించారు. ఇదిలా ఉంటే.. రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలనుకున్న శంకరమ్మ చాలాకాలంగా అసంతృప్తితో ఉన్నారు. అయితే.. గవర్నర్ కోటాలో శంకరమ్మకు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉందంటూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చర్చ నడుస్తోంది. ఈ తరుణంలోనే.. ఆమెకు అమరవీరుల స్థూపం ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానం అందడం విశేషం. నగరానికి వచ్చాక ఆమెతో ఇదే అంశంపై చర్చిస్తారని, లేకుంటే సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటన చేయొచ్చని తెలుస్తోంది. ఆహ్వానం నేపథ్యంలో ఇవాళ (బుధవారం) సొంత ఊరు మోత్కూరు మండలం పొడిచేడు నుంచి హైదరాబాద్‌కు రానున్నారు. గతంలో తనకు హుజూర్నగర్(సూర్యాపేట జిల్లా ) సీటు ఇవ్వాలంటూ డిమాండ్ చేసి.. దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది తెలిసిందే. ఆపై బీజేపీ నుంచి ఆమె పోటీ చేస్తారనే ప్రచారం తెర మీదకు వచ్చినా.. అది జరగలేదు. ఇదీ చదవండి: మనసున్న కేసీఆర్‌ను మూడోసారి సీఎం చేద్దాం! -
telangana: గవర్నర్ కోటా ఎమ్మెల్సీచాన్స్ ఎవరికి?
సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలో రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండటంతో.. కొత్తగా ఎవరికి చాన్స్ వస్తుందనే దానిపై బీఆర్ఎస్లో చర్చ మొదలైంది. ఈ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న డి.రాజేశ్వర్‌రావు, ఫారూఖ్ హుస్సేన్‌ల ఆరేళ్ల పదవీకాలం ఈ నెల 27న పూర్తవుతోంది. ఈ రెండు స్థానాలకు అభ్యర్థుల పేర్లను గురువారం జరిగే కేబినెట్ భేటీలో ఖరారు చేసే అవకాశముంది. పదవీకాలం పూర్తవుతున్న డి.రాజేశ్వర్‌రావు, ఫారూఖ్ హుస్సేన్ ఇద్దరూ మైనారిటీ వర్గాలకు చెందినవారే కావడంతో మరోమారు పదవులను ఆశిస్తున్నారు. క్రిస్టియన్ కోటాలో రాజేశ్వర్, ముస్లిం కోటాలో ఫారూఖ్ హుస్సేన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రాజేశ్వర్‌రావు కాంగ్రెస్ హయాంలో రెండుసార్లు, బీఆర్ఎస్ హయాంలో ఒకసారి.. ఫారూఖ్ కాంగ్రెస్, బీఆర్ఎస్ల నుంచి ఒక్కోసారి గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా పనిచేశారు. వారికి మళ్లీ అవకాశమిస్తారా? అన్న దానిపై చర్చ జరుగుతోంది. ప్రభుత్వం రెండేళ్ల క్రితం గవర్నర్ కోటాలో పాడి కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేసినా.. ఆయనపై క్రిమినల్ కేసులు ఉన్నాయనే కారణంతో గవర్నర్ తమిళిసై ఆమోదించకుండా పక్కనపెట్టారు. దీనితో ప్రభుత్వం ఆ స్థానంలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి పేరును ప్రతిపాదించగా గవర్నర్ ఓకే చేశారు. ఈ నేపథ్యంలో క్లీన్ ఇమేజీ ఉన్నవారిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది. ఇందులో టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి పేరు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర, టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా సేవలతోపాటు అంబేడ్కర్ భారీ విగ్రహం ఏర్పాటులో చేసిన కృషిని దృష్టిలో పెట్టుకుని చక్రపాణి వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. ఇక గౌడ వర్గానికి మండలిలో ప్రాతినిధ్యం లేనందున ఆ వర్గానికి చెందిన ప్రముఖుల పేర్లను.. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మైనారిటీ వర్గానికి చెందిన నేతల పేర్లనూ కేసీఆర్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. చదవండి: త్వరలో తెలంగాణకు అమిత్‌షా, జేపీ నడ్డా -
గవర్నర్ కోటాలో మండలికి మధుసూదనాచారి
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అసెంబ్లీ మాజీ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి అభ్యర్థిత్వానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదముద్ర వేశారు. గవర్నర్ కోటాలో మధుసూదనాచారి పేరును రాష్ట్ర మంత్రిమండలి ఈ నెల 16న సర్క్యులేషన్ పద్ధతిలో సిఫారసు చేసింది. ఈ కోటాలో ఎమ్మెల్సీగా పనిచేసిన ప్రొఫె సర్ శ్రీనివాస్ రెడ్డి పదవీ కాలం ఈ ఏడాది జూన్‌లో ముగిసింది. ఈ ఖాళీ భర్తీ చేసేందుకు ఆగస్టు 2న పాడి కౌశిక్‌రెడ్డి పేరును రాష్ట్ర కేబినెట్ ప్రతిపాదించింది. అయితే కౌశిక్‌రెడ్డిపై పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదై ఉండటంతో ఆ ప్రతిపాదనను గవర్నర్ వెనక్కి పంపారు. ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా కౌశిక్‌రెడ్డి నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో మధుసూదనాచారిని గవర్నర్ కోటాలో మండలికి పంపుతారనే ఊహాగానాలు వెలువడగా.. చివరకు అదే నిజమైంది. మధుసూదనాచారి పేరును గవర్నర్ కోటాలో ప్రతిపాదిస్తూ కేబినెట్ సమావేశంలో కాకుండా మంత్రులకు విడివిడిగా సంబంధిత పత్రాలు సర్క్యులేట్ చేశారు. అనంతరం మంత్రుల సంతకాలతో కూడిన సిఫారసును గవర్నర్‌కు సమర్పించారు. ఎమ్మెల్యే కోటాలోనే దక్కుతుందనుకున్నా.. విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గానికి మండలిలో ప్రాతినిథ్యం కల్పిస్తామని గతంలో ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మధుసూదనాచారికి ఎమ్మెల్యే కోటాలోనే అవకాశం దక్కుతుందని అంతా భావించారు. అయితే అభ్యర్థుల ఎంపికలో చివరి నిమిషంలో అనూహ్యంగా జరిగిన మార్పులు, చేర్పులతో ఆయనను గవర్నర్ కోటాలో మండలికి నామినేట్ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 22న ఆరుగురి ఎన్నిక ప్రకటన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఈ నెల 16న టీఆర్ఎస్ తరఫున నామినేషన్లు వేసిన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, తక్కల్లపల్లి రవీందర్రావు, బండా ప్రకాశ్ ముదిరాజ్, వెంకట్రామ్రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఈ నెల 17న జరిగిన నామినేషన్ల పరిశీలనలో ఆరుగురి అభ్యర్థిత్వం చెల్లుబాటు కాగా, స్వతంత్రులుగా నామినేషన్ వేసిన ఇద్దరి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ నెల 22తో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుండగా, ఇతరులెవరూ పోటీలో లేకపోవడంతో అదే రోజు ఈ ఆరుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఆ 12 టీఆర్ఎస్ ఖాతాలోకే..! స్థానిక సంస్థల కోటాలోని 12 ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఈ నెల 16 నుంచి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ఈ నెల 23 వరకు కొనసాగనుంది. స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్కు అత్యధిక మెజారిటీ ఉండటంతో ఈ 12 స్థానాలు కూ డా అధికార పార్టీ ఖాతాలోనే చేరే అవకాశముంది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కసర త్తు చేస్తుండగా ఈ నెల 22 లేదా 23 తేదీల్లో జాబితా ప్రక టించే అవకాశం ఉంది. వచ్చే నెల 10వ తేదీలోగా ఈ ప్రక్రి య ముగియనుంది. ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత శాస న మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక, మంత్రివర్గ వి స్తరణ వంటి అంశాలు తెరమీదకు వచ్చే అవకాశముంది. -
గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా కౌశిక్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పది రోజుల క్రితం టీఆర్ఎస్లో చేరిన హుజూరాబాద్ నియోజకవర్గ నేత పాడి కౌశిక్‌రెడ్డి గవర్నర్ కోటాలో శాసన మండలికి నామినేట్ అయ్యారు. ఈ మేరకు ఆదివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్ కౌశిక్‌రెడ్డి పేరును గవర్నర్ తమిళిసైకి సిఫారసు చేసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి పదవీకాలం పూర్తి కాగా, ఈ స్థానానికి కౌశిక్‌రెడ్డి పేరును సిఫారసు చేశారు. టీఆర్ఎస్లో చేరిక సందర్భంగా కౌశిక్‌రెడ్డిని హుజూరాబాద్‌కే పరిమితం చేయకుండా రాష్ట్రస్థాయి గుర్తింపును ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్‌గా ఆయనకు అవకాశం వస్తుందని భావించగా, ఏకంగా మండలికి నామినేట్ కావడం టీఆర్ఎస్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక లక్ష్యంగానే.. హుజూరాబాద్ ఉప ఎన్నిక లక్ష్యంగా పావులు కదుపుతున్న కేసీఆర్ ఇప్పటికే నియోజకవర్గానికి చెందిన బండా శ్రీనివాస్‌ను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా గత నెల 23న నియమించారు. కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి పార్టీ టికెట్ ఇచ్చే ఉద్దేశంతోనే కౌశిక్‌ను ఎమ్మెల్సీగా నామినేట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే టీటీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఎల్.రమణ లేదా టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌లో ఒకరు హుజూరాబాద్ అభ్యర్థిగా ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశముందని తెలుస్తోంది. -
ఏపీ: ప్రమాణ స్వీకారం చేసిన నలుగురు నూతన ఎమ్మెల్సీలు
సాక్షి, అమరావతి: గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన నలుగురు వైఎస్సార్సీపీ అభ్యర్థులు లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, మోషేన్‌రాజు, రమేష్ యాదవ్‌లు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో సోమవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది. ప్రొటెం చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం నూతన ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు శ్రీ రంగనాథరాజు, అనిల్ కుమార్ యాదవ్, తానేటి వనిత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు పాల్గొన్నారు. గవర్నర్ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఇటీవల ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీల నేపథ్యం: ► లేళ్ల అప్పిరెడ్డి: గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలేనికి చెందిన లేళ్ల అప్పిరెడ్డి సామాన్య రైతు కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. విద్యార్థి, యువజన, కార్మిక నేతగా ప్రజలకు దగ్గరయ్యారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కాలం నుంచి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం వైఎస్సార్సీపీలో చేరి వైస్ జగన్ అడుగుజాడల్లో అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, పార్టీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ► మోషేన్‌రాజు: పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మోషేన్‌రాజు.. వైఎస్ జగన్ పార్టీని ప్రకటించిన మరుక్షణమే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. టీడీపీ ప్రభుత్వ నిర్బంధకాండలోనూ వైఎస్ జగన్‌తో కలిసి ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ► తోట త్రిమూర్తులు: తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం సమీపంలోని వెంకటాయపాలెంకు చెందిన తోట త్రిమూర్తులు మండపేట అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ సమన్వయకర్తగా ఉన్నారు. కాపులకు తగిన ప్రాధాన్యత ఇచ్చేందుకు ఆయనకు ఎమ్మెల్సీ స్థానం ఇచ్చారు. ► రమేష్‌యాదవ్: కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన రాజగొల్ల రమేష్‌యాదవ్ ఉన్నత విద్యావంతుడు. విదేశీ విద్యా సంస్థలతో ఆయన మంచి సంబంధాలున్నాయి. ఆయన తండ్రి కూడా రాజకీయాల్లో కొనసాగారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ఏపీ రికార్డ్: ఒక్కరోజే 13 లక్షల మందికి వ్యాక్సినేషన్ -
6 ఎమ్మెల్సీలు ఖాళీ.. కడియంకు మళ్లీ ఛాన్స్ దక్కేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనమండలిలో ఒక గవర్నర్ కోటా స్థానంతో పాటు మరో ఆరు ఎమ్మెల్యే కోటా స్థానాలు ఈ ఏడాది జూన్‌లో ఖాళీ అవుతున్నాయి. ఓటమి భయం లేని... సురక్షిత స్థానాలైన వీటి ద్వారా శాసనమండలిలో అడుగుపెట్టాలని చాలామంది టీఆర్ఎస్ నేతలు ఆశిస్తున్నారు. మళ్లీ అవకాశాన్ని ఆశిస్తున్న సీనియర్లు, కొత్తగా మండలిలో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్న వారు కలిపితే ఈ జాబితా పెద్దగానే ఉంది. గవర్నర్ కోటాలో శాసనమండలిలో ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రొఫెసర్ మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పదవీ కాలపరిమితి ఈ ఏడాది జూన్ 16న ముగుస్తుంది. మరోవైపు ఎమ్మెల్యే కోటాలో ప్రాతినిథ్యం వహిస్తున్న మరో ఆరుగురు సభ్యులు కూడా ఈ జూన్ 3న పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటారు. శాసన మం డలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంక టేశ్వర్లు, మాజీ మంత్రి ఫరీదుద్దిన్, ఆకుల లలిత ఈ ఆరుగురు. జూన్‌లో పదవీ కాలం పూర్తి చేసుకుంటున్న ఎమ్మెల్సీలు అందరూ టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం. పదవీకాలం పూర్తి చేసుకుంటున్న వారు ప్రస్తుతం కీలక పదవుల్లో ఉండటం, పార్టీపరంగా కీలక నేతలు కావడంతో వీరిలో ఎంతమంది తిరిగి మండలిలో అడుగుపెట్టే అవకాశం దక్కుతుందనే చర్చ జరుగుతోంది. మరోవైపు దీర్ఘకాలంగా పార్టీలో పనిచేస్తున్న వారితో పాటు వివిధ సందర్భాల్లో టీఆర్ఎస్లో చేరిన నేతలు కూడా ఎమ్మెల్యే కోటాలో శాసనమండలిలో ప్రవేశించేందుకు ఆసక్తి చూపుతున్నారు. సంఖ్యాపరంగా శాసనసభలో టీఆర్ఎస్కు భారీ మెజారిటీ ఉండటంతో ఎమ్మెల్యే కోటా మండలి స్థానాలన్నీ తిరిగి టీఆర్ఎస్కే దక్కడం ఖాయం. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎమ్మెల్యే కోటాలో ఎవరికి అవకాశం ఇస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. కడియంకు మళ్లీ ఛాన్స్ ఉండేనా? గుత్తా సుఖేందర్‌రెడ్డి 2019 ఆగస్టులో శాసనమండలి సభ్యుడిగా ఎన్నిక కాగా, అదే ఏడాది సెప్టెంబర్‌లో మండలి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. మండలికి ఎన్నికైన తర్వాత రెండేళ్ల వ్యవధిలోనే పదవీ కాలం ముగుస్తుండటంతో గుత్తాకు మరోమారు అవకాశం ఇవ్వడంతో పాటు మండలి ఛైర్మన్‌గా కూడా కొనసాగించే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారు. టీఆర్ఎస్ రాష్ట్రంలో రెండో పర్యా యం అధికారంలోకి వచ్చినా మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి కేబినెట్లో చోటు దక్కలేదు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే కోటాలో మరోమారు కడియంకు ఎమ్మెల్సీ పదవి దక్కడంపై చివరి నిముషం వరకు సస్పెన్స్ కొనసాగే అవకాశం ఉంది. కడియంతో పాటు మండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వారే. కాబట్టి వీరిలో ఒక్కరికే తిరిగి అవకాశం దక్కుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది. మైనారీటీ కోటాలో మాజీ మంత్రి ఫరీదుద్దిన్కు మరోమారు అవకాశం దక్కే సూచనలున్నా ఆకుల లలిత భవితవ్యంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలంగాణ ఉద్యమకాలం నుంచి టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ బాధ్యతలు చూస్తున్నారు. వయోభారం కారణంగా శ్రీనివాస్‌రెడ్డికి మళ్లీ అవకాశం లేకపోవడంతో సీఎం కార్యాల య ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. గతంలోనే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని ఆశించినా చివరి నిముషంలో కవి, గాయకుడు గోరటి వెంకన్నకు అవకాశం లభించింది. టీఎన్జీఓ యూనియన్ మాజీ అధ్యక్షుడు, బ్రూ వరీస్ కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ దేవీప్రసాద్ కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. ఆశల పల్లకిలో ఆశావహులు పార్టీలో ఉద్యమకాలం నుంచి కొనసాగుతున్న నేతలతో పాటు వివిధ సందర్భాల్లో పార్టీలో చేరిన వారు ఎమ్మెల్యే కోటాలో త్వరలో ఖాళీ అయ్యే ఆరు ఎమ్మెల్సీ స్థానాలపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఓ వైపు జిల్లాలు, సామాజికవర్గాల వారీగా లెక్కలు వేసుకుంటూ.. మండలిలో అడుగుపెట్టేందుకు ఉన్న అవకాశాలను బేరీజు వేసుకుంటూ ప్రయత్నాలు సాగిస్తున్నారు. వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పాటు వివిధ సందర్భాల్లో అవకాశం దక్కని నేతలు త్వరలో జరిగే ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో తమకు అవకాశం ఇస్తారనే ధీమాతో ఉన్నారు. శాసనసభ మాజీ స్పీకర్ మధుసూధనాచారి, మాజీ ఎంపీలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, గుండు సుధారాణి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు, కరీంనగర్ మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, నాగార్జునసాగర్‌లో టికెట్ ఆశించిన ఎంసీ కోటిరెడ్డి, ఇటీవల హైదరాబాద్ పట్టభద్రుల స్థానం నుంచి టికెట్ ఆశించిన పీఎల్ శ్రీనివాస్ తదితరులు ఆశావహుల జాబితాలో ఉన్నారు. -
‘గవర్నర్ కోటా’ ఖరారు
సాక్షి, హైదరాబాద్ : శాసనమండలి గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో.. ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్య, వాసవి సేవాకేంద్రం ముఖ్య సలహాదారు, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ పేర్లను ఖరారు చేశారు. ఈ పేర్లను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదం కోసం పంపించారు. గవర్నర్ ఆమోదం తర్వాత ఈ ముగ్గురు శాసనమండలికి ఎంపికైనట్లు అధికారికంగా ప్రకటిస్తారు. ఖాళీగా ఉన్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల నుంచి నామినేట్ అయ్యేందుకు టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలతో పాటు పలువురు తటస్తులు కూడా తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే జిల్లాలు, సామాజిక సమీకరణాలతో పాటు త్వరలో జరిగే జీహెచ్ఎంసీ, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు.. మండలి పట్టభద్రుల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈ ముగ్గురి పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం. సామాజిక వర్గాల సమతూకం... దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన గోరటి వెంకన్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు. ప్రజాకవిగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలపాత్ర పోషించారు. నాలుగు నెలల క్రితం సీఎం కేసీఆర్‌తో గోరటి భేటీ అయ్యారు. గవర్నర్ కోటాలో శాసన మండలికి వెంకన్నను నామినేట్ చేస్తున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతుండగా, తాజాగా ఆయన పేరును మంత్రిమండలి ఖరారు చేసింది. అలాగే త్వరలో జరిగే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాజీ మంత్రి బస్వరాజు సారయ్య పేరు తెరమీదకు వచ్చింది. గతంలో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన సారయ్య.. కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. 2016లో టీఆర్ఎస్లో చేరిన సారయ్య రజక సామాజిక వర్గానికి చెందిన వారు. దీంతో బీసీల నుంచి ఆయన పేరువైపు కేసీఆర్ మొగ్గుచూపినట్లు తెలిసింది. ఇక మూడో ఎమ్మెల్సీ స్థానానికి వైశ్య సామాజిక వర్గానికి చెందిన బొగ్గారపు దయానంద్ పేరు అనూహ్యంగా తెరమీదకు రావడం టీఆర్ఎస్ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేసింది. టీడీపీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన దయానంద్ 2014లో టీఆర్ఎస్లో చేరారు. వాసవీ సేవా కేంద్రం, వాసవీ సహకార హౌజింగ్ సొసైటీ తదితరాల్లో కీలక పదవుల్లో ఉన్న దయానంద్‌కు గ్రేటర్ హైదరాబాద్ కోటాలో స్థానం దక్కినట్లు భావిస్తున్నారు. ఔత్సాహికుల ఆశలపై నీళ్లు... మండలిలో గవర్నర్ కోటా సభ్యుల సంఖ్య ఆరు కాగా, ప్రస్తుతం మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. గతంలో ఈ కోటాలో మండలికి ఎంపికైన రాములునాయక్ 2018లో కాంగ్రెస్‌లో చేరడంతో టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యారు. మండలి సభ్యుడిగా ఈయన పదవీకాలం ఈ ఏడాది మార్చితో ముగిసింది. మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పదవీ కాలం ఈ ఏడాది జూన్ 19న.. కర్నె ప్రభాకర్ పదవీ కాలం ఈ ఏడాది ఆగస్టు 18న ముగిసింది. వీరిద్దరూ మరోమారు మండలి సభ్యత్వాన్ని ఆశించారు. అయితే నాయిని ఇటీవల కరోనాతో మరణించగా, కర్నెకు అవకాశం దక్కలేదు. వీరితో పాటు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన కవి, గాయకుడు, సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఆశించారు. అలాగే దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కూతురు వాణిదేవీ పేరు కూడా కొంతకాలంగా వినిపించింది. నేడు పమ్రాణ స్వీకారం? గవర్నర్ కోటాలో మండలికి నామినేట్ అయిన ముగ్గురు సభ్యులు శనివారం ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. కేబినెట్ ప్రతిపాదనను ఆమోదిస్తూ గవర్నర్ గెజిట్ విడుదల చేసిన వెంటనే శాసనమండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధంగా ఉండాలని వెంకన్న, సారయ్య, దయానంద్‌లను ఆదేశించినట్లు సమాచారం. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు జీహెచ్ఎంసీలో కో–ఆప్షన్ సభ్యులుగా ఓటింగ్‌లో పాల్గొనే అవకాశముంది. ఒకట్రెండు రోజుల్లో గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందనే వార్తల నేపథ్యంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపిక ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, గోరటి వెంకన్న, సారయ్య, దయానంద్‌లు శుక్రవారం సాయంత్రం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలసి కృతజ్ఞతలు తెలిపారు. వారికి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. అనంతరం సారయ్య, దయానంద్‌లు మంత్రి కేటీఆర్‌ను కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. -
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఇద్దరి పేర్ల సిఫారసు
సాక్షి, అమరావతి: గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఇద్దరి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు, వైఎస్సార్ జిల్లా రాయచోటికి చెందిన జకియా ఖానమ్ పేర్లను ఖరారు చేయగా.. అవే పేర్లను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు సమర్పించింది. పండుల రవీంద్రబాబు ఎస్సీ వర్గానికి చెందిన వారు కాగా, జకియా ఖానమ్ ముస్లిం మైనారిటీ మహిళా నేత కావడం విశేషం. -
గవర్నర్ కోటాలో ఎస్సీ, ముస్లిం వర్గాలకు ఎమ్మెల్సీ పదవులు!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో గవర్నర్ కోటాలో భర్తీ చేసే సభ్యుల్లో ఖాళీగా ఉన్న రెండు స్థానాల్లో ఒకటి ఎస్సీ, మరొకటి ముస్లిం వర్గాలకు కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం త్వరలోనే ఈ మేరకు సిఫార్సు చేయనుందని వైఎస్సార్సీపీ వర్గాలు తెలిపాయి. ► ప్రస్తుతం మండలిలో మొత్తం నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకట రమణారావు రాజీనామా చేసిన కారణంగా శాసనసభ నుంచి ఎన్నికయ్యే రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. ► గవర్నర్ నామినేట్ చేసే కోటాలో కంతేటి సత్యనారాయణరాజు, రత్నాబాయి పదవీ కాలం ముగిసిన కారణంగా ఖాళీ అయిన రెండు స్థానాలు కొంత కాలంగా అలాగే ఉన్నాయి. ► వైఎస్ జగన్ ప్రభుత్వం మండలిని రద్దు చేయాలని నిర్ణయించినప్పటికీ పైస్థాయిలో జాప్యం కారణంగా అది ఇప్పటికీ మనుగడలో ఉంది. మండలి రద్దు విషయంలో ఎలాంటి రెండో ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఇప్పటికే శాసనసభలో మండలి రద్దుకు తీర్మానం చేసి పంపారు కూడా. అయితే మండలి మనుగడలో ఉన్నంత వరకైనా ఖాళీ స్థానాలను భర్తీ చేయాలన్న ఆలోచనతో సీఎం ఉన్నట్టు తెలుస్తోంది. ► అందువల్ల గవర్నర్ నామినేటెడ్ స్థానాల్లో ఒకటి ఎస్సీ వర్గానికి, మరో స్థానం ముస్లిం మైనారిటీ వర్గాలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి తాజాగా యోచిస్తున్నట్టు సమాచారం. ► బోస్, మోపిదేవి రాజీనామా వల్ల ఖాళీ అయిన వాటిలో ఒక స్థానం పదవీ కాలం కేవలం 9 నెలలే ఉంది. మరో ఎమ్మెల్సీ పదవీ కాలం రెండేళ్ల పాటు ఉంటుంది. 9 నెలలే గడువున్న ఎమ్మెల్సీకి ఉప ఎన్నిక జరిగే అవకాశం లేదు కనుక రెండేళ్ల పదవీ కాలం ఉన్న స్థానానికి కూడా అభ్యర్థిని త్వరలో సీఎం ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. -
ఫారూక్‌కే మళ్లీ చాన్స్..
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ విధేయతకు గుర్తింపు సిద్దిపేట జోన్ : సిద్దిపేటకు చెందిన ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్‌కు మరోసారి చాన్స్ లభించింది. టీఆర్ఎస్ అధిష్టానం పక్షాన ఎమ్మెల్సీ అభ్యర్థులను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రకటించిన విషయం విదితమే. ఈ జాబితాలో గవర్నర్ కోటాలో సిద్దిపేటకు చెందిన ఫారూక్ హుస్సేన్‌కు చోటు దక్కింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, స్థానిక మంత్రి హరీశ్‌రావుతో ఉన్న సాన్నిహిత్యం, గతేడాదిగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా పార్టీలో కొనసాగిన విధేయతకు సీఎం మరో గుర్తింపునిచ్చారు. ఎమ్మెల్సీ బెర్తు కోసం రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది ఆశించినప్పటికీ ఫారూక్ హుస్సేన్‌ను గవర్నర్ కోటా కింద అభ్యర్థిగా ప్రకటించడం విశేషం. సిద్దిపేట పట్టణానికి చెందిన ఫారూక్ హుస్సేన్ 30 సంవత్సరాల క్రితం మున్సిపల్ కౌన్సిలర్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌లో పనిచేసిన ఆయనకు దివంగత నేత వైఎస్ హయాంలో 2004–2007 వరకు మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్‌గా అవకాశం లభించింది. అనంతరం 2011లో గవర్నర్ కోటా కింద ఉమ్మడి రాష్ట్రంలో ఫారూక్ హుస్సేన్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భా వం చెందడం, అనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2016 ఏప్రిల్ 25న ఫారూక్ హుస్సేన్ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు సమక్షంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరారు. నాటినుంచి ఏడాదిగా సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ కార్యక్రమాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఆయన మంత్రి హరీశ్‌రావుతో కలిసి పని చేస్తూ పార్టీలో కొనసాగారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో సీఎం కలిసి తనకు తిరిగి రెండోసారి అవకాశాన్ని పరిశీలించాలని కోరినట్లు సమాచారం. మరి కొద్ది రోజుల్లో ఆయన పదవీకాలం ముగియనున్న సందర్భంగా రాష్ట్రంలోని ఎమ్మెల్సీల భర్తీకి ఆదివారం ఏడుగురి పేర్లతో కూడిన జాబితాను కేసీఆర్ ప్రకటించారు. అందులో గవర్నర్ కోటా కింద ఫారూక్ హుస్సేన్ అభ్యర్థిత్వాన్ని సీఎం ఖరారు చేయడం విశేషం. -
'ఆ నలుగురు' పేర్లు ఖరారు
-
'ఆ నలుగురు' పేర్లు ఖరారు చేసిన చంద్రబాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కోటాలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను టీడీపీ అధిష్టానం శనివారం ప్రకటించింది. కృష్ణా జిల్లాకు చెందిన టీడీ జనార్ధన్, నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు, నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీద రవిచంద్రయాదవ్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసినట్లు వెల్లడించింది. అయితే ఇప్పటి వరకు విజయవాడ మాజీ మేయర్, టీడీపీ ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని అధిష్టానం భావించింది. కానీ ఆఖరి నిముషంలో నలుగురి పేర్లలో అనురాధ పేరును తొలగించి.. బీద రవిచంద్ర పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఎమ్మెల్సీ పదవి కోసం పార్టీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడంలో బీద రవిచంద్రయాదవ్ చివరినిమిషంలో కృతార్థులయ్యారు. గవర్నర్ కోటాలో ఎన్నికైన ఈ నలుగురు ఆరెళ్ల పాటు ఎమ్మెల్సీ పదవిలో కొనసాగుతారు. -
జూపూడికి ఎమ్మెల్సీ
- స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ఎంపీ మాగుంట - జిల్లా పార్టీ అధ్యక్ష పదవిపై నేడు నిర్ణయం సాక్షి ప్రతినిధి, ఒంగోలు: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా జూపూడి ప్రభాకరరావు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పేర్లను తెలుగుదేశం పార్టీ ఖరారు చేసింది. జిల్లా నుంచి ఎమ్మెల్సీ కోసం కరణం బలరామకృష్ణమూర్తితో పాటు పలువురు పోటీపడినా సామాజిక సమీకరణాల పేరుతో జూపూడి ప్రభాకరరావు పేరును తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో ఖరారు చేసింది. ఎమ్మెల్సీగా ఉన్న పాలడుగు వెంకట్రావు మృతి చెందడంతో ఖాళీ అయిన స్థానంలో జూపూడి ప్రభాకర్ పేరు ఖారారు చేశారు. ఆయన గతంలో కూడా ఎమ్మెల్సీగా పనిచేసిన సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల్లో కొండపి నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి డోలా బాలవీరాంజనేయస్వామి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిపై చంద్రబాబునాయుడు ఎటూ తేల్చలేదు. బుధవారం జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో దీనిపై పెద్దగా చర్చ జరగలేదు. ఎమ్మెల్సీ ఎన్నికలపైనే సుదీర్ఘంగా చర్చించగా.. జిల్లా అధ్యక్ష పదవిపై ఐదు నిమిషాలు మాత్రమే చర్చ జరిగినట్లు సమాచారం. గురువారం మధ్యాహ్నం కూర్చుని దీనిపై నిర్ణయం తీసుకుందామని చంద్రబాబునాయుడు చెప్పినట్లు తెలిసింది. జిల్లా అధ్యక్ష పదవి కోసం ప్రస్తుత అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌తోపాటు మాజీ ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, దివి శివరామ్ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. దామచర్లకు చెక్ పెట్టేందుకు ప్రత్యర్థి వర్గం పావులు కదుపుతోంది. అయితే చంద్రబాబునాయుడు మాత్రం దామచర్ల జనార్దన్‌నే కొనసాగించాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
ఎమ్మెల్సీలు రెండు.. పోటీలో పలువురు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ కోటా కింద భర్తీ చేయాల్సిన రెండు ఎమ్మెల్సీ స్థానాల కోసం పలువురు పార్టీ నేతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్థానాల భర్తీపై ఆదివారం జరిగిన కేబినెట్ సమావేశంలో చర్చించినా.. పేర్లు మాత్రం ఖరారు చేయలేదు. ఇప్పటికే ఏ సభలో సభ్యుడు కాని నాయిని నర్సింహారెడ్డిని హోంమంత్రిగా సీఎం కేసీఆర్ తీసుకున్నారు. ఆయనకు రెండు సీట్లలో ఒకటి ఇవ్వాల్సి ఉంది. అయితే, మిగిలే స్థానం నుంచి పార్టీ సీనియర్ నేతలు కర్నె ప్రభాకర్, ఎర్రోళ్ల శ్రీనివాస్, బొంతు రామ్మోహన్, రాములునాయక్లో ఒకరికి వెంటనే అవకాశం ఇస్తానని కేసీఆర్ సన్నిహితల వద్ద వెల్లడించినట్లు తెలుస్తోంది. వీరితో పాటు మాజీ ఎమ్మెల్సీలు ఆర్. సత్యనారాయణ, నారదాసు లక్ష్మణ్‌రావులు కూడా పోటీ పడుతున్నారు. కాగా, ఇప్పుడు అవకాశం దక్కని వారికి వచ్చే ఏప్రిల్ నాటికి ఖాళీ అయ్యే 12 గ్రాడ్యుయేట్, స్థానిక సంస్థలు, ఉపాధ్యాయ మండలి ఎమ్మెల్సీ స్థానాల్లో అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.