హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ కోటా కింద భర్తీ చేయాల్సిన రెండు ఎమ్మెల్సీ స్థానాల కోసం పలువురు పార్టీ నేతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్థానాల భర్తీపై ఆదివారం జరిగిన కేబినెట్ సమావేశంలో చర్చించినా.. పేర్లు మాత్రం ఖరారు చేయలేదు. ఇప్పటికే ఏ సభలో సభ్యుడు కాని నాయిని నర్సింహారెడ్డిని హోంమంత్రిగా సీఎం కేసీఆర్ తీసుకున్నారు. ఆయనకు రెండు సీట్లలో ఒకటి ఇవ్వాల్సి ఉంది.
అయితే, మిగిలే స్థానం నుంచి పార్టీ సీనియర్ నేతలు కర్నె ప్రభాకర్, ఎర్రోళ్ల శ్రీనివాస్, బొంతు రామ్మోహన్, రాములునాయక్‌లో ఒకరికి వెంటనే అవకాశం ఇస్తానని కేసీఆర్ సన్నిహితల వద్ద వెల్లడించినట్లు తెలుస్తోంది. వీరితో పాటు మాజీ ఎమ్మెల్సీలు ఆర్. సత్యనారాయణ, నారదాసు లక్ష్మణ్‌రావులు కూడా పోటీ పడుతున్నారు. కాగా, ఇప్పుడు అవకాశం దక్కని వారికి వచ్చే ఏప్రిల్ నాటికి ఖాళీ అయ్యే 12 గ్రాడ్యుయేట్, స్థానిక సంస్థలు, ఉపాధ్యాయ మండలి ఎమ్మెల్సీ స్థానాల్లో అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్సీలు రెండు.. పోటీలో పలువురు
Published Tue, Jun 10 2014 1:40 AM | Last Updated on Sat, Sep 2 2017 8:33 AM
Advertisement