సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మలి దశ ఉద్యమ సమయంలో ప్రాణత్యాగంతో అమరుడయ్యాడు కాసోజు శ్రీకాంతాచారి. అయితే తాజాగా.. ఆయన తల్లి శంకరమ్మకు బీఆర్‌ఎస్ అధిష్టానం నుంచి పిలుపు అందినట్లు సమాచారం. హుస్సేన్ సాగర్ ఒడ్డున గురువారం జరగబోయే అమరవీరుల స్థూపం ఆవిష్కరణకు రావాలంటూ ఆమెకు ఆహ్వానం పంపించారు.
ఇదిలా ఉంటే.. రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలనుకున్న శంకరమ్మ చాలాకాలంగా అసంతృప్తితో ఉన్నారు. అయితే.. గవర్నర్ కోటాలో శంకరమ్మకు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉందంటూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చర్చ నడుస్తోంది. ఈ తరుణంలోనే.. ఆమెకు అమరవీరుల స్థూపం ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానం అందడం విశేషం. నగరానికి వచ్చాక ఆమెతో ఇదే అంశంపై చర్చిస్తారని, లేకుంటే సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటన చేయొచ్చని తెలుస్తోంది.
ఆహ్వానం నేపథ్యంలో ఇవాళ (బుధవారం) సొంత ఊరు మోత్కూరు మండలం పొడిచేడు నుంచి హైదరాబాద్‌కు రానున్నారు. గతంలో తనకు హుజూర్‌నగర్(సూర్యాపేట జిల్లా ) సీటు ఇవ్వాలంటూ డిమాండ్ చేసి.. దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది తెలిసిందే. ఆపై బీజేపీ నుంచి ఆమె పోటీ చేస్తారనే ప్రచారం తెర మీదకు వచ్చినా.. అది జరగలేదు.
ఇదీ చదవండి: మనసున్న కేసీఆర్‌ను మూడోసారి సీఎం చేద్దాం!
Comments
Please login to add a commentAdd a comment