Kasoju Srikantha chary
-
శ్రీకాంత్‌చారి తల్లి శంకరమ్మకు ఎమ్మెల్సీ ఛాన్స్?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మలి దశ ఉద్యమ సమయంలో ప్రాణత్యాగంతో అమరుడయ్యాడు కాసోజు శ్రీకాంతాచారి. అయితే తాజాగా.. ఆయన తల్లి శంకరమ్మకు బీఆర్ఎస్ అధిష్టానం నుంచి పిలుపు అందినట్లు సమాచారం. హుస్సేన్ సాగర్ ఒడ్డున గురువారం జరగబోయే అమరవీరుల స్థూపం ఆవిష్కరణకు రావాలంటూ ఆమెకు ఆహ్వానం పంపించారు. ఇదిలా ఉంటే.. రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలనుకున్న శంకరమ్మ చాలాకాలంగా అసంతృప్తితో ఉన్నారు. అయితే.. గవర్నర్ కోటాలో శంకరమ్మకు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉందంటూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చర్చ నడుస్తోంది. ఈ తరుణంలోనే.. ఆమెకు అమరవీరుల స్థూపం ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానం అందడం విశేషం. నగరానికి వచ్చాక ఆమెతో ఇదే అంశంపై చర్చిస్తారని, లేకుంటే సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటన చేయొచ్చని తెలుస్తోంది. ఆహ్వానం నేపథ్యంలో ఇవాళ (బుధవారం) సొంత ఊరు మోత్కూరు మండలం పొడిచేడు నుంచి హైదరాబాద్‌కు రానున్నారు. గతంలో తనకు హుజూర్నగర్(సూర్యాపేట జిల్లా ) సీటు ఇవ్వాలంటూ డిమాండ్ చేసి.. దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది తెలిసిందే. ఆపై బీజేపీ నుంచి ఆమె పోటీ చేస్తారనే ప్రచారం తెర మీదకు వచ్చినా.. అది జరగలేదు. ఇదీ చదవండి: మనసున్న కేసీఆర్‌ను మూడోసారి సీఎం చేద్దాం! -
కేఏ పాల్‌పై ఆగ్రహం.. ‘నా భర్తను మభ్యపెట్టి పార్టీలో చేర్చుకున్నారు’
మన్సూరాబాద్(హైదరాబాద్): ‘నా భర్త కాసోజు వెంకటాచారిని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మభ్యపెట్టి తన పార్టీలో చేర్చుకున్నారు’అని తెలంగాణ మలిదశ ఉద్యమ తొలిఅమరుడు కాసోజు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఆరోపించారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ చౌరస్తాలో ఉన్న శ్రీకాంతా చారి విగ్రహం వద్ద ఆదివారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో కుటుంబసభ్యులు వీరాచారి, లలితతో కలసి మాట్లాడారు. బీజేపీ నుంచి రాజ్యసభ సీటు ఇప్పిస్తానని, తమ కుటుంబంపై కేఏ పాల్ 15 రోజులుగా ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ అమరువీరుల కుటుంబాలవారు తమ పార్టీలో చేరాలని ఖమ్మంకు చెందిన భద్ర అనే వ్యక్తితో రాయబారం చేసి ఒత్తిడి పెంచారని అన్నారు. గత 3 రోజులుగా తన భర్తను కేఏ పాల్ బంధించారని, సెల్‌ఫోన్ లాక్కున్నారని, ఏ హాని జరిగినా కేఏపాల్ బాధ్యత వహించాలని అన్నారు. ‘నా భర్తను విడిపించడానికి వెళ్తే నీ భర్త నీతో ఉండటానికి ఇష్టపడటంలేదనే లెటర్‌ను ఇచ్చి నన్ను తిప్పి పంపారు’అని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబం జోలికి వస్తే ఖబడ్డార్, చిచ్చు పెడుతున్న కేఎపాల్ కాళ్లు విరగ్గొడతానని శంకరమ్మ హెచ్చరించారు. -
టికెట్ ఇవ్వకుంటే ఆత్మాహుతి: శంకరమ్మ
అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: పాలకుర్తి అసెంబ్లీ నుండి టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకుంటే ఆత్మాహుతి చేసుకుంటానని అమరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ హెచ్చరించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఆయన నివాసంలోనే శంకరమ్మ బుధవారం కలిశారు. వరంగల్ జిల్లా పాలకుర్తి శాసనసభ స్థానం నుండి పార్టీ టికెట్‌ను ఇవ్వాలని కోరారు. అమరవీరుల కుటుంబాలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. పాలకుర్తి టికెట్ ఇవ్వడం సాధ్యం కాదని, భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ టికెట్‌ను ఇస్తానని కేసీఆర్ హామీనిచ్చారు. ఎమ్మెల్యే టికెట్నే ఇవ్వాలని, ఎమ్మెల్సీ వద్దని శంకరమ్మ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ టికెట్‌ను ఇవ్వకుంటే శ్రీకాంతాచారి ఆత్మాహుతి చేసుకున్న ఎల్బీ నగర్ చౌరస్తాలోనే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానన్నారు. 3 రోజుల సమయం ఇవ్వాలని, ఆలోచించి చెబుతానని కేసీఆర్ కోరినట్టుగా శంకరమ్మ విలేకరులకు వివరించారు.