![Governor Tamilisai Key Decision On Governor Quota MLC Post - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/17/governor-tamilisai.jpg.webp?itok=Oj2rD0b9)
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు తీసుకోరాదని నిర్ణయించారు. హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో రిట్ పిటిషన్లపై తీర్పు వచ్చే వరకు ఎమ్మెల్సీ భర్తీ నిలిపివేయాలని తమిళిసై నిర్ణయించినట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment