MLC post
-
భార్య టీడీపీ.. నేను వైఎస్సార్సీపీలోనే...
విజయనగరం: భార్య టీడీపీలో చేరితే తనను ఎమ్మెల్సీ పదవిలో నుంచి తొలగించడం అన్యాయమని ఇందుకూరి రఘరాజు అన్నారు. ఏ తప్పు చేయకున్నా శాసనమండలి చైర్మన్ తనను అన్యాయంగా పదవీచ్యుతుడిని చేశారని, దీనిపై న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు. విజయనగరంలోని ఓ హోటల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ముందు రోజు నాలుగో నోటీసు ఇచ్చి డిస్మిస్ చేశారని, గతంలో మూడు నోటీసులు వచ్చిన సందర్భంలో పార్టీ మీద వ్యతిరేకంగా మాట్లాడకూడదని ముందుగా స్పందించలేదన్నారు. షెడ్యూల్ 10 కింద డిస్మిస్ చేసినట్టు నోటీసులు ఇచ్చారని, పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం నేనేమీ పార్టీకి వ్యతిరేకంగా పని చేయలేదన్నారు. ఎస్.కోట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు చేసిన వ్యవహారాలు నచ్చక పోవడంతో పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. తను ఏ పార్టీలో చేరలేదని, ఏ పార్టీ కోసం పని చేయలేదన్నారు. భార్య ఇందుకూరి సుబ్బలక్ష్మి (సుధారాజు) టీడీపీలో చేరారని, టీడీపీ వాళ్లతో నేను టచ్‌లో ఉన్నానని కారణాలు చూపి సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. నోటీసులు జారీ చేసిన సమయంలో కొన్ని కారణాల వల్ల హాజరుకాలేక సమయం కోరినప్పటికీ తనకు అవకాశం ఇవ్వలేదన్నారు. తనకు పదవులు అంటే ఆసక్తి లేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తనను పిలిచి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని, ఇప్పటికీ తను వైఎస్సార్సీపీలోనే ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమి తనను బాధించిందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఎస్.కోట నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేశానని చెప్పారు. -
Vizianagaram: భార్యభర్తలకు ఎన్ని పదవులిచ్చినా అదేతీరు...
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఇచ్చిన మాట కోసం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి పెద్దలసభలో గౌరవంగా కూర్చోబెట్టారు... శృంగవరపుకోట ఎంపీపీ పదవి ఎస్సీలకు రిజర్వు అయినా వైస్ ఎంపీపీ పదవిని అతని భార్యకు ఇచ్చి వైఎస్సార్సీపీ శ్రేణు లు గౌరవం ఇచ్చాయి. కానీ ఆ దంపతుల తీరు మా త్రం మారలేదు. అధికారలాలన, పదవీ వ్యామో హం, ఆధిపత్యధోరణి వారిని అడ్డదారులు తొక్కేలా చేశాయి. పదవులిచ్చిన పార్టీకి నమ్మకద్రోహం చేయడానికి ఏమాత్రం వెనుకాడలేదు. ఇలాంటి పెత్తందారీ మనస్తత్వం ఉన్న ఎమ్మెల్సీ రఘురాజు భార్య సుబ్బలక్ష్మి అలియాస్ సుధారాజుని పెత్తందారుల పార్టీ టీడీపీ అక్కున చేర్చుకుంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఒకవైపు, గొంప కృష్ణ మరోవైపు ఉంటూ ఆజ్యం పోస్తున్న గ్రూపుల గోల మధ్య మరో కుంపటిని తీసుకొచ్చి నెత్తిన పెట్టారంటూ టీడీపీ శ్రేణులు లోలోన రగిలిపోతున్నారు. నిత్య అసమ్మతివాదిగా, శృంగవరపుకోట నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసే రాజు కుటుంబం వద్దంటూ గగ్గోలు పెడుతున్నారు. వారిని ఎలా పార్టీలోకి ఆహ్వానించారంటూ మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారిపై కస్సుబుస్సుమంటున్నారు. స్థాయికి మించి ఆధిపత్యం కోసం... వాస్తవానికి నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా, పార్టీ కార్యక్రమాలు చేయాలన్నా ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు తొలి నుంచి రఘురాజు కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. కానీ, అధికార పరిధిని మించి నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం రఘురాజు దంపతులు నిత్యం ఏదో ఒక అగ్గి రాజేస్తూనే వచ్చారు. వారి అనుయాయులతో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేయించారు. అసంబద్ధమైన ఆరోపణలతో ఆకాశరామన్న ఉత్తరాలు రాయించారనే విమర్శలు వారిపై వచ్చాయి. పార్టీలో గ్రూపు రాజకీయాలు సరికాదని పెద్దలు నచ్చజెప్పినా రాజు కుటుంబం వెనక్కు తగ్గలేదు. చివరకు కడుబండి వద్దంటూ డిమాండులు పెట్టారు. ఇది సరికాదని, మరోసారి పక్కాగా గెలిచేచోట అభ్యర్థి మార్పు ఉండదని పార్టీ అధిష్టానం రఘురాజుకు తేల్చి చెప్పింది. కానీ ఆ దంపతుల వైఖరిలో మార్పు రాలేదు. గత ఆర్నెళ్లుగా ఇద్దరూ పనిగట్టుకుని నియోజకవర్గంలో ఎమ్మెల్యే కడుబండికి వ్యతిరేకంగా వర్గాన్ని కూడగట్టే ప్రయత్నాలు చేశారు. వీళ్ల ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో పార్టీ మారిపోతామని చివరి అస్త్రం తీశారు. గత 15 రోజులుగా గ్రామాగ్రామానికి వెళ్లి ‘మేం పార్టీ మారుతున్నాం మాతో వచ్చేయండి. లేకుంటే మీకు ఇబ్బందులు తప్పవు’ అంటూ వైఎస్సార్సీపీ శ్రేణులతో బెదిరింపులకు కూడా దిగారు. ఫలితం లేకపోవడంతో తమతో ఎప్పుడూ కలిసొచ్చే కొంతమందితో రఘురాజు భార్య సుబ్బలక్ష్మి సోమవారం ఉండవల్లిలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పచ్చకండువా కప్పుకొని నిస్సిగ్గు రాజకీయాలకు తెరతీశారని వైఎస్సార్సీపీ కార్యకర్తలు భగ్గుమంటున్నారు. ఆది నుంచి ఆధిపత్య పోరే... శృంగవరపుకోటలో సీనియర్ నాయకుడు ఐవీఎన్ రాజు మరణం తర్వాత ఆయన పేరు చెప్పుకుని రఘురాజు రాజకీయాల్లోకి వచ్చారు. కానీ తొలి నుంచి ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా వారిపై ఆధిపత్యం కోసం పోరాటం చేయడం అలవాటు చేసుకున్నారు. తొలుత 2004లో కుంభా రవిబాబు ఎమ్మెల్యేగా గెలిచింది మొదలు అతనిపై తిరుగుబాటు జెండా ఎగురేశారు. అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఫలితంగా నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడింది. 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో ధర్మవరం గ్రామానికి చెందిన ఎ.కె.వి.జోగినాయుడును కాంగ్రెస్ అభ్యర్థిగా వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రకటించారు. కానీ సొంతపార్టీ అభ్యర్థిని ఓడించడానికి రఘురాజు ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. ఎంత నచ్చజెప్పినా వినకుండా బరిలో నిలిచి నాడు సొంత కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమయ్యారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్‌ను వదిలేసి బీజేపీలో చేరారు. తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల తరుణంలో వైఎస్సార్సీపీలోకి చేరారు. తీరా ఇక్కడ కూడా ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా పనిచేస్తూనే వచ్చారు. ఎన్ని పదవులిచ్చినా అదేతీరు... మండల స్థాయిలో ఉండే రఘురాజుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీగా చట్టసభలో స్థానం ఇచ్చింది. ఆయన వర్గీయులనే ఎంపీపీగా, జెడ్పీటీసీగా చేసింది. అతని భార్యకే శృంగవరపుకోట వైస్ ఎంపీపీ పదవినీ ఇచ్చింది. ఇంకా ఏదో ‘గౌరవం’ కావాలంటూ రఘురాజు దంపతులిద్దరూ డిమాండు చేస్తూనే వచ్చారు. ఇంత గౌరవం ఇచ్చిన తమ పార్టీకి వెన్నుపోటు పొడిచి, మరే గౌరవం ఆశించి సుబ్బలక్ష్మి టీడీపీలో చేరారని వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ‘కోళ్ల ’ తీరుపై టీడీపీలో ఆందోళన... మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తీరుపై టీడీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆధిపత్య ధోరణి ప్రదర్శించే రఘురాజు కుటుంబాన్ని పార్టీలో చేర్చుకోవద్దంటూ వ్యతిరేకించారు. కానీ వారి మాట పక్కనపెట్టి ఆమె రఘురాజు భార్య సుబ్బలక్ష్మిని, ఆయన అనుచరులను విజయవాడ తీసుకెళ్లి లోకేష్‌తో పార్టీ కండువాలు వేయించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ‘పదవి’ కోసం పాకులాట... ఒకే ఇంటిలో ఉంటారు... భార్య టీడీపీ, భర్త మాత్రం వైఎస్సార్సీపీ. పదవి కోసం ఇంతలా పాకులాడటం ఎక్కడా చూడలేదని శృంగవరపుకోట నియోజకవర్గ ప్రజలు విస్తుపోతున్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ఎంతో అభిమానంతో ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని వదిలేయడానికి మాత్రం రఘురాజుకు ఇష్టంలేదు. మరో నాలుగేళ్లూ పదవీకాలాన్ని అనుభవిస్తానని, కానీ ముందు మాత్రం తన భార్య టీడీపీలోకి వెళ్తుందని ఇటీవల ఆయన బహిరంగంగానే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ భర్తీపై తమిళిసై కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు తీసుకోరాదని నిర్ణయించారు. హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో రిట్ పిటిషన్లపై తీర్పు వచ్చే వరకు ఎమ్మెల్సీ భర్తీ నిలిపివేయాలని తమిళిసై నిర్ణయించినట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. -
ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనపై స్పందించిన అద్దంకి దయాకర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ప్రకటనపై అద్దంకి దయాకర్ స్పందించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తానని చెప్పారు. అవకాశం ఇవ్వకుండా ఆపినా కార్యకర్తగానే ఉంటానని అన్నారు. అభిమానులెవరూ కలత చెందాల్సిన అవసరం లేదని అన్నారు. పార్టీ భవిష్యత్తులో అవకాశం కల్పిస్తుందని పేర్కొన్నారు. అందరం కలిసి ప్రజాపాలన కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. కాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను తెలంగాణ కాంగ్రెస్ బుధవారం ప్రకటించించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షుడు, యువనేత బల్మూరి వెంకట నర్సింగరావు(బల్మూరి వెంకట్)తోపాటు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‌ను పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. తొలుత పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌కు, బల్మూరి వెంకట్‌కు ఎమ్మెల్సీ టికెట్ ఖరారు చేయగా.. అయితే అద్దంకికి పార్టీ అధిష్టానం ఝలక్ ఇచ్చింది. చివరి నిమిషంలో అద్దంకిని కాదని మహేష్ కుమార్ గౌడ్‌ను ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ప్రకటించింది. గురువారం ఉదయం 11 గంటలకు ఇద్దరు అభ్యర్ధులు నామినేషన్ వేయనున్నారు. ఈ నెల 29వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. చదవండి: తెలుగు రాష్ట్రాలకు ఐపీఎస్‌ల కేటాయింపు -
Congress: ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన.. అద్దంకి దయాకర్‌కు ఝలక్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షుడు, యువనేత బల్మూరి వెంకట నర్సింగరావు(బల్మూరి వెంకట్)తోపాటు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‌ను పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. అయితే అభ్యర్ధుల ప్రకటనలో కాంగ్రెస్ స్వల్ప మార్పులు చేసింది. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌కు కాంగ్రెస్ అధిష్టానం ఝలక్ ఇచ్చింది. తొలుత అద్దంకి దయాకర్‌కు, బల్మూరి వెంకట్‌కు ఎమ్మెల్సీ టికెట్ ఖరారు చేయగా.. చివరి నిమిషంలో సీనియర్లు చక్రం తిప్పడంతో అద్దంకిని కాదని మహేష్ కుమార్ గౌడ్‌కు ఎమ్మెల్సీ అవకాశం వరించింది. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయగా.. ఆ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 29వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. వీటికి సంబంధించి ఈనెల 18న నామినేషన్లకు చివరి తేదీ. ఈ క్రమంలో గురువారం ఉదయం 11 గంటలకు ఇద్దరు అభ్యర్ధులు నామినేషన్ వేయనున్నారు. చదవండి: అందుకే ఆగాం, లేకుంటేనా.. : హరీష్‌రావు ఇక 2021 ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన వెంకట్.. 2023 సార్వత్రిక ఎన్నికల్లో అధిష్టానం సూచన మేరకు టికెట్ రేసు నుంచి వైదొలగారు. సమీకరణల్లో భాగంగా అక్కడ హుజూరాబాద్ మండలం సింగాపురానికి చెందిన వొడితెల ప్రణవ్‌కు పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఇద్దరి పేర్లను ప్రకటించింది అధిష్టానం. -
ఆస్ట్రేలియాలో ఎమ్మెల్సీగా కందుకూరు యువకుడు
కందుకూరు: చిన్న వయసులోనే పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా యువకుడు విదేశీ చట్టసభలకు ప్రతినిధిగా ఎంపికయ్యాడు. తన సమాజ సేవతో మెప్పించి ఆస్ట్రేలియాలో యువత కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యాడు. నెల్లూరు జిల్లా తూర్పుకమ్మపాలేనికి చెందిన దివి రామకృష్ణ, ప్రత్యూషలు దంపతులు. రామకృష్ణ 12 ఏళ్ల క్రితమే ఉద్యోగ నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లి సిడ్నీలో స్థిరపడ్డాడు. ప్రస్తుతం అక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉంటూ పిల్లలను అక్కడే చదివించుకున్నారు. రామకృష్ణ పెద్ద కుమారుడైన తనూజ్‌చౌదరి (15) అక్కడి కాలేజీలో ప్రస్తుతం ప్లస్ వన్ (ఇంటర్) చదువుతున్నాడు. సమాజ సేవా కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొంటున్నాడు. అక్కడి చట్టాల ప్రకారం ఇలా సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొనే యువత చట్టసభల్లో ఎంపికయ్యేందుకు దరఖాస్తు చేసుకునే వీలు ఉంటుందని, ఈ క్రమంలో అన్ని అర్హతలను పరిశీలించిన తరువాత యువత కోటాలో తన కుమారుడిని ఎమ్మెల్సీగా అక్కడి ప్రభుత్వం ఎంపిక చేసిందని రామకృష్ణ చెప్పారు. ప్రస్తుతం తన కుమారుడు అక్కడి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటున్నాడని తెలిపారు. -
కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీపై గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆమె రాజ్‌భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. గవర్నర్‌గా రెండేళ్లు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రెండేళ్లు గవర్నర్‌గా పూర్తి చేసుకున్న ఈ విజయాన్ని ఇటీవల చనిపోయిన తన తల్లికి అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. ఆరు నెలలుగా లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తన విధులు సక్రమంగా నిర్వహిస్తున్నానని, ఇందుకు రాజ్ భవన్ సిబ్బంది సహకారం ఉందని తెలిపారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. గవర్నర్‌గా చేపట్టిన ప్రతి కార్యక్రమానికి మీడియా ఎంతగానో సహకరించిందని, అందుకే తాము ప్రజలకు మరింత చేరువ కాగలినట్లు వెల్లడించారు. కాగా హుజురాబాద్‌కు చెందిన పాడి కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సామాజిక సేవ చేసే వాళ్లకే ఎమ్మెల్సీ ఇవ్వాలని సూచించారు. కౌశిక్‌రెడ్డి విషయంలో ఆలోచించి నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై ఆలోచించాలని పేర్కొన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డికి గవర్నర్ కోటాలో శాసనమండలికి మంత్రివర్గం నామినేట్ చేసిన విషయం తెలిసిందే. చదవండి: Huzurabad: గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా కౌశిక్‌రెడ్డి -
పండుల రవీంద్రబాబుకు ఎమ్మెల్సీ
హామీ అంటేనే హాస్యాస్పదంగా మారిపోయిన రోజులివి...ఎన్నికల ముందు ఇతర పార్టీల నేతలను ఆకర్షించడానికి ఎన్నోచెబుతారు..అధికారంలోకి వస్తే అవన్నీ నీటిమీద రాతలేనంటూపెదవి విరిచేవారే అధికం. అది వారి తప్పుకాదు... గత పార్టీలన్నీ ఇచ్చిన మాటకు తిలోదకాలిస్తూ నమ్మినవారిని నట్టేట ముంచడంతోమాటపై నమ్మకం పోయింది. ఆ సమయంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు... అధికారంలోకి వచ్చిన తరువాత ఆచరణలో పెట్టిన తీరును చూసి ప్రతిపక్షాలకు కూడా ముచ్చెమటలు పడుతున్నాయి. మాటకు పట్టం కడుతున్న ఆయన తీరు పలువురి ప్రశంసలు అందుకుంటోంది. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: మాట ఇవ్వడమే కాదు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే మాటలు కాదు. అందునా ప్రస్తుత రాజకీయాల్లో మరీ కష్టం. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయడం ఆషామాషీ వ్యవహారం కానే కాదు. ఎన్నికల ముందున్న పరిస్థితులు వేరు, ఎన్నికలై అధికారంలోకి వచ్చాక పరిణామాలు అనేక మలుపులు తిరుగుతుంటాయి. రాజకీయాల్లో ఇవన్నీ సహజమనే ధోరణిలో ఇచ్చిన మాట గాలిలో కలిపేసే పార్టీలు, నాయకులే ఎక్కువగా ఉంటారు. మాట నిలుపుకోవడం ఏ రాజకీయ పార్టీలో అయినా చాలా అరుదనే చెప్పొచ్చు. ఇందుకు పూర్తి భిన్నమైన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నాడు ప్రతిపక్ష నాయకుడిగా, నేడు ముఖ్యమంత్రిగా ఉన్నా ఒకే మాట ఒకే బాట అని మరోసారి కార్యాచరణ ద్వారా చూపించారు. గవర్నర్ కోటాలో శాసనమండలికి భర్తీ చేయనున్న రెండు స్థానాల్లో ఒక స్థానానికి జిల్లా నుంచి ప్రాతినిధ్యం కల్పించారు. గవర్నర్‌కు సీఎం పంపించిన జాబితాలో మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబుకు అవకాశం కల్పించారు. కేవలం మాట కోసం తన తండ్రి మహానేత వైఎస్ çహఠాన్మరణం తరువాత పదవులను సైతం త్యాగం చేసి విశ్వసనీయ నేతగా నిలిచిన పిల్లి సుభాష్‌చంద్ర బోస్‌ను సీఎం జగన్ ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. నమ్మి వచ్చిన నాయకుడి గెలుపు, ఓటముల ప్రమేయం లేకుండా వరుసగా పదవులు కట్టబెట్టి మాట నిలబెట్టుకున్నారు. గత సార్వత్రిక ఎన్నికలలో మండపేట నుంచి పోటీచేసిన బోస్‌కు ఎమ్మెల్సీ ఇచ్చి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితోపాటు రెవెన్యూశాఖను కూడా ఇచ్చారు. మండలి రద్దుయ్యే నేపథ్యంలో పదవులకు రాజీనామా చేసిన బోస్‌కు అత్యున్నతమైన రాజ్యసభ (పెద్దల సభ)కు పంపించారు. ఆనాటి సభలో హామీ ఇలా నెరవేర్చి ఇప్పుడు ఎమ్మెల్సీ కోటా భర్తీలో కూడా అదే ఒరవడిని కొనసాగించారు. ప్రతిపక్షనేతగా జగన్మోహన్రెడ్డి ప్రజా సమస్యలు, ప్రధానంగా దళిత, బడుగు, బలహీనవర్గాలపై ఉన్న చిత్తశుద్ధి ఆకర్షితుడై గత సార్వత్రిక ఎన్నికల ముందు అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీని, తనను నమ్మి వచ్చి అంబాజీపేట మండల కేంద్రంలో జరిగిన ఎన్నికల సభలో వేలాదిమంది సమక్షంలో ఇచ్చిన మాటకు కట్టుబడి రవీంద్రబాబుకు మండలిలో ప్రాతినిధ్యాన్ని ఖాయం చేశారు. వైద్య వృత్తి నుంచి... దళిత సామాజికి వర్గానికి చెందిన రవీంద్రబాబు వైద్యుడిగా ఢిల్లీలో ఏడేళ్లు పనిచేశారు. అనంతరం ఐఆర్ఎస్ అధికారిగా ముంబై, కోలకతా, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో కస్ట్‌మ్స్, సెంట్రల్ ఎక్సైజ్ సర్వీసు టాక్సు కమిషనర్‌గా పనిచేసి 2014 సార్వత్రిక ఎన్నికల్లో అమలాపురం పార్లమెంటు స్థానం నుంచి గెలుపొందారు. ఆ తరువాత వైఎస్సార్సీపీలో చేరారు. రవీంద్రబాబు ఉన్నత విద్యావంతుడు కావడం, దళిత వర్గానికి చెందడం, అంబాజీపేట ఎన్నికల సభలో మాట ఇవ్వడంతో ఎమ్మెల్సీగా ఖరారు చేశారు. జిల్లా రాజకీయ చరిత్రలో తొలి సారి దళిత సామాజికవర్గానికి శాసన మండలి సభ్యత్వం ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కింది. ఈ ఎమ్మెల్సీ ద్వారా తమ సామాజికవర్గంపై సీఎంకు ఉన్న ఆదరణను చెప్పకనే చెబుతోందని ఆ సామాజివర్గం సంతోషం వ్యక్తం చేస్తోంది. కాగా రాష్ట్రంలో మాల కార్పొరేషన్ చైర్మన్‌ను మహిళా విభాగం ప్రతినిధి పెదపాటి అమ్మాజీకి కల్పించడం ద్వారా సీఎం జిల్లాపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. -
‘ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వండి’
సాక్షి, మోర్తాడ్(బాల్కొండ) : ఖాళీ అయిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న వారిలో హాసాకొత్తూర్‌కు చెందిన ముత్యాల లక్ష్మారెడ్డి అలియాస్ కొత్తూర్ లక్ష్మారెడ్డి ఉన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలకంగా కొనసాగుతున్న లక్ష్మారెడ్డి తనకు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. ఈ మేరకు ఆదివారం సీఎం కేసీఆర్‌ను అసెంబ్లీలో కలిసిన లక్ష్మారెడ్డి తన ప్రతిపాదనను సీఎం ముందు ఉంచారు. లక్ష్మారెడ్డి ప్రస్తుతం గాయత్రి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. హాసాకొత్తూర్‌కు చెందిన లక్ష్మారెడ్డికి, కేసీఆర్ రాజకీయాల్లోకి రాకముందు నుంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. టీఆర్ఎస్ను స్థాపించిన తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీలో జిల్లా, రాష్ట్ర స్థాయి పదవులను పొందారు. మొదట్లో బాల్కొండ ఎమ్మెల్యే టికెట్‌ను లక్ష్మారెడ్డి కోరారు. రాజకీయ సమీకరణాలతో ఆయనకు అవకాశం లభించలేదు. అయినా ఆయన పార్టీ కి సేవలు అందిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న లక్ష్మారెడ్డి సీఎంను కలిసి విన్నవించగా కేసీఆర్ నుంచి సానుకూలత వచ్చినట్లు తెలుస్తోంది. -
ఎమ్మెల్సీ పదవికి సోమిరెడ్డి రాజీనామా
సాక్షి, అమరావతి/నెల్లూరు: వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం ఆయన తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి సమర్పించారు. రానున్న ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు సోమిరెడ్డి తెలిపారు. గతంలో సర్వేపల్లి నుంచి పోటీ చేసిన ఆయన వరుసగా 2004, 2009, 2014 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఎమ్మెల్యేగా ఓడినప్పటికి సీనియారిటీ ఉన్న నేతగా ఎమ్మెల్సీ కోటాలో ఆయనను మంత్రి పదవి వరించింది. కాగా ఈ ఎన్నికల్లో సర్వేపల్లినుంచి పోటీ చేసి సోమిరెడ్డి గెలవగలరా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. -
కలలు .. కల్లలాయే..!
‘ముఖ్యమంత్రి మనకంటే ఎవరికి దగ్గర... ఒక ఎమ్మెల్సీ పోస్టు ఖాళీ అవుతోంది. ఆ సీటు మనదే. మీరంతా కొద్దిగా ఓపిక పట్టండి. నెల తిరక్కుండానే హోం మంత్రినై తిరిగొస్తా...’ అంటూ మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ నేత కలల్లో తేలిపోతూ తన అనుచరగణానికి అదే విషయం ఊదరగొట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన సదరు నేతను ఇప్పటికే ఓ నామినేటెడ్ పదవి వరించింది. అయినా ఆయన చట్టసభల్లో కాలుమోపాలని తెగ ప్రయత్నం చేస్తున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. శాసనమండలి సభ్యుడిగా ఉండి పాలేరు అసెంబ్లీ సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించడంతో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఒక ఖాళీ ఏర్పడింది. ఇక ఆ స్థానం తనదేనన్న ధీమాతో సదరు పాలమూరు నేత అయినవారికి, అనుచరులకు తనకు వరించ బోయే పదవుల గురించి చెప్పుకున్నారు. హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని రాజీనామా చేయిస్తారని, ఆయనను రాజ్యసభకు పంపుతారని రీజనింగూ ఇచ్చారు. ఎమ్మెల్సీగా ఎంపికకావడం, ఆ వెంటనే హోం శాఖ పగ్గాలు చేపట్టడం చకచకా జరిగిపోతాయని అనుచరులకు రంగుల సినిమా చూపించారు. కానీ, ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి మాజీ మంత్రి ఫరీదుద్దీన్ పేరును అధినాయకత్వం ప్రకటించింది. మరోవైపు రెండు రాజ్యసభ స్థానాలకూ అభ్యర్ధులను ప్రకటించగా అందులో నాయిని లేరు. మరి తమ నేత హోంమంత్రి అయ్యేదెట్టబ్బా అని తలలు బద్దలు కొట్టుకోవడం కార్యకర్తల వంతైంది. -
ఎమ్మెల్సీ పదవితో సంతృప్తి: ఫరీదుద్దీన్
జహీరాబాద్:ఎమ్మెల్సీ పదవికి టీఆర్ఎస్ అధిష్టానం తన పేరును ఖరారు చేయడంపై ఎం.డి.ఫరీదుద్దీన్ సంతోషం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ సీటు కోసం తానెలాంటి ప్రయత్నా లూ చేయలేదన్నారు. పార్టీకి తన సేవలను గుర్తించి అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. -
రెండు సీట్లున్న జిల్లాల్లో ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి స్థానిక సంస్థల కోటా ఎన్నికలపై ఉత్కంఠ మొదలైంది. గతంతో పోలిస్తే కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్సీ స్థానాల సంఖ్య పెరగడం ఈసారి ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా మార్పులతో కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రెండేసి ఎమ్మెల్సీ స్థానాలు ఏర్పడ్డాయి. తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో మొత్తం సీట్ల సంఖ్య 14కు చేరింది. హైదరాబాద్ పరిధిలోని రెండు సీట్ల నుంచి ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీల పదవీ కాలం ఇంకా ముగియలేదు. దీంతో మిగతా తొమ్మిది జిల్లాల్లో మొత్తం 12 మంది ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నగారా మోగింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపాలిటీ, నగర పంచాయతీ కౌన్సిలర్లు, కార్పొరేషన్ పరిధిలోని కార్పొరేటర్లకు ఓటు హక్కు ఉంటుంది. బ్యాలెట్ పద్ధతిన జరిగే ఈ ఓటింగ్‌లో పోటీలో ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో ఓటు వేసే విధానాన్ని అనుసరిస్తారు. మొత్తం ఓట్లలో సగం కంటే ఎక్కువ ప్రాధాన్య ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ఒక్కో జిల్లాకు ఒక్క సీటు ఉన్నప్పుడు ఈ విధానంలో సందేహాలేమీ ఉత్పన్నం కాలేదు. కానీ, రెండు స్థానాలున్న జిల్లాల్లో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు... నియోజకవర్గ పరిధిలోని ఓటర్లను రెండు సెగ్మెంట్లుగా విభజిస్తారా.. లేదా ప్రతి ఓటరు ఇద్దరు అభ్యర్థులను ఎన్నుకునే అవకాశం కల్పిస్తారా... అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ ఓటింగ్ విధానంపై ఈసీ అధికారులను కలసి సందేహాలు వెలిబుచ్చారు. రెండు స్థానాలున్న జిల్లాలోనూ ఎమ్మెల్సీల ఎన్నిక పాత పద్ధతిలోనే జరుగుతుందని ఈసీ వర్గాలు ధ్రువీకరించాయి. అక్కడి ఓటర్లందరికీ ఇద్దరు అభ్యర్థులను ఎంచుకునే అవకాశముంటుంది. రెండు సీట్లున్నప్పటికీ పోటీ చేసిన అభ్యర్థులందరి పేర్లతో ఒకే బ్యాలెట్ ఉంటుంది. ఆ జిల్లాలోని ఓటర్లు ప్రాధాన్యక్రమంలో తమ ఓటును నమోదు చేయాల్సి ఉంటుంది. వీరిలో అత్యధిక ప్రాధాన్యత ఓట్లు గెలుచుకున్న ఇద్దరు అభ్యర్థులు విజేతలుగా నిలుస్తారు. మొత్తం ఓట్లలో సగం కంటే ఎక్కువ ప్రాధాన్య ఓట్లు సాధించిన అభ్యర్థిని తొలి విజేతగా, తర్వాత సగం కంటే ఎక్కువ ప్రాధాన్య ఓట్లు పొందిన అభ్యర్థిని మరో విజేతగా ప్రకటిస్తారు. -
బీజేపీ తీరు పై టీ టీడీపీ నేతల అసంతృప్తి
-
టీడీపీలో రాజుకున్న విభేదాలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఎమ్మెల్సీ పదవి జిల్లాలో టీడీపీలో చిచ్చు రేపింది. నిన్నటి వరకు కలిసిమెలిసి ఉన్న నాయకులు మధ్య అగాథం ఏర్పడింది. మొన్న టి వరకు ఆ పదవి కోసం ఒకరే ప్రయత్నించగా ఇప్పుడా జాబితాలోకి రెండో వ్యక్తి వచ్చారు. అందులో ఒకరు జిల్లా ప్రధాన కార్య దర్శి ఐవీపీ రాజు కాగా, మరొకరు జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న నేతగా పరిగణించి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు కోరుతున్నారు. ఇప్పటికే అనుచరులు, సన్నిహితులతో అశోక్ బంగ్లాలో సమావేశం నిర్వహించి, తమ కోరి కను అశోక్ గజపతిరాజు దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా నేతలందరి మనోగతంగా ఆ సమయంలో చెప్పారు. కానీ, అశోక్ కాస్త చిరాకు పడ్డారు. ఉద్దేశమేంటో తెలియ దుగాని ఐవీపీకి మంచి చేద్దామనుకుంటున్నారా? చెడు చేద్దామనుకుంటున్నారా? అని కేడర్‌నుద్దేశించి కఠినంగా మాట్లాడారు. బయటకు సీరియస్‌గా స్పందించినా అశోక్ గజపతిరాజు తప్పనిసరిగా గుర్తిస్తారని, బంగ్లాను అంటిపెట్టుకుని ఉన్న ఐవీపీకి న్యాయం చేస్తారని ఆయన అనుచరులు ఆశతో ఉన్నారు. ఈ పరిణామాలన్నీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్‌కు రుచించనట్టు ఉంది. అంతవరకు పార్వతీపురం మున్సిపల్ చైర్మన్ పదవిపైనే దృష్టిపెట్టిన జగదీష్ మనసు మా ర్చుకున్నారు. తన రాజకీయ కెరీర్ అక్కడితో ముగిసిపోకుండా కొత్త ఎత్తుగడ వేశారు. మున్సిపల్‌చైర్మన్ పదవిని తన భార్య ప్రతిమాదేవికి కట్టబెట్టి, తనకీ ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని సరికొత్త పల్లవి ఎత్తారు. అంతటితో ఆగకుండా మద్దతు కూడగట్టుకుని, మనసులో మాటను నేరుగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చెవిలో వేశారు. అదే విషయాన్ని మీడియా వద్ద ప్రస్తావించారు. దీంతో ఐవీపీరాజు కంగుతిన్నారు. దీంతో అశోక్ బంగ్లాలో లుకలుకలు మొదలయ్యాయి. ఐవీపీకి ఉన్నతావకాశాలు దక్కకుండా తెరవెనుక కుట్ర జరగుతుందనే వాదన తెరపైకొచ్చింది. ఇదే విషయమై విసృ్తత చర్చ జరుగుతోంది. అకస్మాత్తుగా తెరపైకొచ్చిన జగదీష్‌కు మద్దతివ్వడం ద్వారా ఎమ్మెల్సీ పదవికి పోటీ పెట్టి ఐవీపీకి దెబ్బకొట్టాలని ఓ వర్గం వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తోందన్న వాదన విన్పిస్తోంది. మొత్తానికి బంగ్లా రాజకీయం రసవత్తరంగా మారింది.