సాక్షి, అమరావతి/నెల్లూరు: వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం ఆయన తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి సమర్పించారు. రానున్న ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు సోమిరెడ్డి తెలిపారు. గతంలో సర్వేపల్లి నుంచి పోటీ చేసిన ఆయన వరుసగా 2004, 2009, 2014 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.
ఎమ్మెల్యేగా ఓడినప్పటికి సీనియారిటీ ఉన్న నేతగా ఎమ్మెల్సీ కోటాలో ఆయనను మంత్రి పదవి వరించింది. కాగా ఈ ఎన్నికల్లో సర్వేపల్లినుంచి పోటీ చేసి సోమిరెడ్డి గెలవగలరా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment