Minister Somireddy Chandramohana Reddy
-
ఎమ్మెల్సీ పదవికి సోమిరెడ్డి రాజీనామా
సాక్షి, అమరావతి/నెల్లూరు: వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం ఆయన తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి సమర్పించారు. రానున్న ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు సోమిరెడ్డి తెలిపారు. గతంలో సర్వేపల్లి నుంచి పోటీ చేసిన ఆయన వరుసగా 2004, 2009, 2014 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఎమ్మెల్యేగా ఓడినప్పటికి సీనియారిటీ ఉన్న నేతగా ఎమ్మెల్సీ కోటాలో ఆయనను మంత్రి పదవి వరించింది. కాగా ఈ ఎన్నికల్లో సర్వేపల్లినుంచి పోటీ చేసి సోమిరెడ్డి గెలవగలరా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. -
సోమిరెడ్డి, ఆదాల మధ్య రాజకీయ సయోధ్య కుదిరిందా?
జిల్లాలో ఎన్నికల ‘రాజీ’కీయం మొదలైంది. ఎన్నికల వేడి ప్రారంభం కావడంతో అధికార పార్టీలో పరస్పరం కలహించుకునే ఇద్దరు నేతలు భేటీ కావటం, తర్వాత ఒకే కార్యక్రమంలో పాల్గొనడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బాహ్యంగా ఎడముఖం.. పెడముఖంగా ఉన్న మాజీ మంత్రి ఆదాల, మంత్రి సోమిరెడ్డి అంతర్గతంగా ఉప్పు..నిప్పులా ఉండే వీరు ఒక్కసారిగా ఏకమై ఏకాంతంగా చర్చలు జరపడం ఆ పార్టీ నేతలే ఇంకా తేరుకోలేకున్నారు. సోమిరెడ్డి, ఆదాల మధ్య రాజకీయ సయోధ్య కుదిరిందా? లేక ఎన్నికల ప్రయోజనాల కోసమే ఇదంతా చేస్తున్నారా? అనే చర్చ కూడా జరుగుతోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో అధికార పార్టీలో మంత్రి సోమిరెడ్డికి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి మధ్య కొనేళ్లుగా వార్ నడుస్తుంది. జిల్లాలో ఇద్దరి మధ్య మొదలైన పంచాయితీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వరకు వెళ్లింది. తాజాగా కూడా గత నెలలో మంత్రి సోమిరెడ్డిపై ఆదాల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు నేతలు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సర్వేపల్లి నియోజకవర్గానికి ప్రస్తుతం ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. రానున్న ఎన్నికల్లో కూడా సర్వేపల్లి నుంచి మళ్లీ మంత్రి పోటీ చేయడానికి కసరత్తు చేస్తున్నారు. అయితే పార్టీలో మాత్రం అంతర్గంతగా సోమిరెడ్డి నియోజకవర్గం మారతారనే ప్రచారం సాగుతోంది. సర్వేపల్లి నియోజకవర్గంలోని నేలటూరులో శుక్రవారం పునరావాస కాలనీకి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. దీనికి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అతిథిగా హాజరయ్యారు. శుక్రవారం ఉదయం సోమిరెడ్డి నగరంలోని ఆదాల ప్రభాకర్‌రెడ్డి నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. ఇద్దరు కొద్ది సేపు ఏకాంతంగా మాట్లాడుకున్నాక మంత్రితో కలిసి ఆదాల కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. వాస్తవానికి ఇద్దరు నేతలు ఇప్పటి వరకు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్న పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఎలాంటి ముందస్తు చర్చలు లేకుండా భేటీ కావడంతో ఏం జరుగుతుందనే చర్చ సర్వతా సాగుతుంది. గత నెలలో కూడా మాజీ మంత్రి ఆదాల మంత్రి సోమిరెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెండు.. మూడు సార్లు నేరుగా సీఎంకు మంత్రి సోమిరెడ్డి తీరుపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సోమిరెడ్డి వర్గంలోని కొందరు నేతలు ఆదాల పార్టీ మారతారనే ప్రచారం బలంగా చేశారు. దీంతో ఇద్దరి మధ్య గతం నుంచే ఉన్న విభేదాలు మరింత తారా స్థాయికి చేరటంతో ఎవరికి వారుగా గ్రూపు రాజకీయాలు సాగిస్తున్నారు. పార్టీలో అభ్యర్థుల ఖరారు ప్రక్రియ మొదలైంది. దీంతో మొదటి జాబితాలోనే స్థానం సంపాదించటానికి అధికార పార్టీ నేతలు కష్టాలు పడుతున్నాయి. దీనికి తోడు జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. జిల్లాలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో సర్వేపల్లిలో ఆదాలకు కొంత వర్గం ఉంది. సహజంగానే ఆదాల మంత్రి సోమిరెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించే క్రమంలో ఆయన వర్గం కూడా పార్టీలో ఉన్నప్పటికి సోమిరెడ్డికి దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో గొడవలు ఎందుకనే ధోరణిలో నేతలు అడుగులు వేస్తున్నారు. అయితే అరగంట సేపు భేటీ అయినా పూర్తిస్థాయిలో చర్చ జరగలేదని సమాచారం. మళ్లీ కొద్ది రోజుల్లో భేటీ కావాలని నేతలు నిర్ణయించినట్లు సమాచారం. -
వైఎస్సార్ జిల్లాలో అధిక లోటు వర్షపాతం
సాక్షి కడప: రాష్ట్రంలో దుర్బిక్ష పరిస్థితులు నెలకొని కరువు తాండవిస్తోందని, ముఖ్యంగా వైఎస్సార్ జిల్లాలో అత్యధిక లోటు వర్షపాతం నమోదైందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కడపలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన జెడ్పీ సమావేశానికి ఇన్చార్జి మంత్రి హోదాలో హాజరైన సోమిరెడ్డి మాట్లాడుతూ కరువును ఎదుర్కొనేందుకు అన్ని విధాల సన్నద్ధమైనట్లు తెలియజేశారు. కరువు నేపథ్యంలో రైతుల రుణాలు రీషెడ్యూల్ చేస్తున్నట్లు చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టు విషయమై టీడీపీ నేతలకు, వైఎస్సార్సీపీ నేతల మధ్య వాగ్వాదం జరుగుతున్న సమయంలో కల్పించుకున్న మంత్రి సోమిరెడ్డి వైఎస్సార్ హయాంలోనే ప్రాజెక్టులకు సంబంధించి నిర్మాణాలు జరిగాయన్నది కాదనలేమన్నారు. ఎన్టీఆర్ తెలుగుగంగ నిర్మాణానికి పూనుకున్నారని... అయితే వైఎస్సార్ ప్రాజెక్టులకు సంబంధించిన పనులన్నీ చేస్తూ వచ్చారన్నారు. ఉచితంగా పశుగ్రాసం: మంత్రి ఆది జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కరువుపై చర్చ చేపట్టాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, డీసీఎంఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్దన్‌రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జెడ్పీటీసీలు పట్టుబట్టడంతో చర్చించారు. వైఎస్సార్సీపీ నేతలు ఉచితంగా పశుగ్రాసం పంపిణీ చేయాలని డిమాండ్ చేయడంతోపాటు ఫ్లకార్డులను ప్రదర్శించారు. మంత్రి ఆది స్పందించి ఉచితంగానే పశుగ్రాసం పంపిణీకి చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. కాగా, జెడ్పీలో సభ ప్రొటోకాల్ రగడతో మొదలైంది. టీడీపీకి చెందిన ఆప్కో చైర్మన్ సభలో కూర్చోవడాన్ని నిరసిస్తూ ప్రొటోకాల్ ఉల్లంఘనపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, రవీంద్రనాథ్‌రెడ్డి వేదికపై కూర్చున్నారు. ఈలోపే మంత్రులు రావడం, వేదికపై సీట్లు లేకపోవడంతో మంత్రులకు, ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. -
బస్సుల్లో సీఎంను ఎవరెవరు కలిశారు..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : బస్సులో ఏం జరిగింది.. బస్సుల్లో సీఎంను ఎవరెవరు కలిశారు.. ఏం మాట్లాడారు.. సభా ప్రాంగణానికి వచ్చిన సీఎం బస్సు దిగకుండా బస్సులోనే 15 నిమిషాలు ఎందుకు గడిపారనేది ప్రస్తుతం అధికార పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నేతలు ఊహించి నట్లే సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాలో పార్టీ పరిస్థితిపై నేతల వద్ద ఆరా తీశారు. జిల్లాలో ఏం జరుగుతుందని మొదలుపెట్టి అన్ని అంశాలపై మాట్లాడినట్లు సమాచారం. ఇప్పటికే జిల్లాలో కొందరు నేతల మధ్య తీవ్ర స్థాయిలో ఆధిపత్య పోరు సాగుతున్న క్రమంలో మళ్లీ సీఎం పర్యటన జరగటం అది కూడా సీఎం కొందరితో మాట్లాడటం రకరకాల చర్చకు దారి తీసింది. శనివారం సాయంత్రం 4.30 గంటలకు పోలీసు పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడుకు మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక బస్సుల్లో సీఎం సభాస్థలికి బయలుదేరారు. ఈ క్రమంలో సీఎంతో పాటు కడప నుంచి మంత్రి సోమిరెడ్డి వచ్చారు. బస్సులో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో పాటు మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, నగర మేయర్ అబ్దుల్ అజీజ్ ఉన్నారు. ఈ క్రమంలో బస్సులో జిల్లా అధికార పార్టీ రాజకీయాలపై చర్చ సాగింది. ప్రధానంగా జిల్లాలో నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి ఎలా ఉందని ఆరా తీశారు. అలాగే సీఎం పర్యటన సందర్భంగా ముస్తాబు చేసిన రోడ్డను చూసి బాగా అభివృద్ధి చేశారని కితాబు ఇచ్చారు. ఈ క్రమంలో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి జోక్యం చేసుకుని పార్టీ అభ్యర్థుల్ని ముందుగా ప్రకటిస్తే అందరు పనిచేసుకుంటారని, లేదంటే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని చెప్పారు. ఇక ఆత్మకూరు రాజకీయాలపైనా చర్చ సాగింది. పార్టీ నేతల తీరుపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పార్టీ వీడకముందే ఆత్మకూరులో మంత్రి సోమిరెడ్డి కన్నబాబుతో హడావుడి చేయిస్తున్నారని, ఇది పార్టీకి కొంత ఇబ్బంది అని చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే కన్నబాబు హడావుడిగా సమావేశాలు పెట్టి నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలకు తెరతీసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నగరం మొదలుకొని కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితిని సీఎంకు వివరించినట్లు సమాచారం. మరో వైపు సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం బస్సులోనే 15 నిమిషాలు ఉన్నారు. తొలుత మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీఎంతో మాట్లాడి వేదిక పైకి వచ్చిన వెంటనే మరో మంత్రి నారాయణ బస్సులోకి వెళ్లి బాబుతో మంతనాలు నిర్వహించారు. ఈ క్రమంలో నగరంలో పార్టీ పరిస్థితిపై చర్చకు వచ్చినట్లు సమాచారం. మొత్తం మీద జిల్లా రాజకీయాల విశ్లేషణ బస్సులోనే సాగటం గమనార్హం. -
ఎవరా రమణ దీక్షితులు? బొక్కలో వేసి నాలుగు తగిలిస్తే..
సాక్షి, అమరావతి: ‘ఎవరా రమణ దీక్షితులు.. బొక్కలో వేసి నాలుగు తగిలిస్తే నిజాలు బయటకు వస్తాయి’ అంటూ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులుపై పరుష వ్యాఖ్యలు చేశారు. ఆగ్రహంతో ఊగిపోతూ బెదిరింపులకు దిగారు. నాశనమైపోతారంటూ శాపనార్థాలు పెట్టారు. విజయవాడలోని కానూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద శనివారం మంత్రి సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వివాదంపై స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేంకటేశ్వర స్వామి గురించి ఆడుకుంటున్నారా మీరు? నీచమైన భాష వాడతారా, ఏమనుకుంటున్నారు మీరు? వేంకటేశ్వర స్వామిని పావుగా చేయాలని చూస్తే అనుభవిస్తారు మీరు. చెత్త భాష, నీచమైన భాష వాడుతున్నారు. బీజేపీ వాళ్లు అధికారం కోసం, రాజకీయం కోసం వేంకటేశ్వర స్వామిని వాడుకుంటారా? ఎవరీ రమణ దీక్షితులు.. దేవుడ్ని బజారుకెక్కించాలని చూస్తారా? నాశనమైపోతారు.. బాబుగారి గురించి ఏం మాట్లాడతారు మీరు? అంత భయం లేకుండా పోతుందా మీకు? అంటూ సోమిరెడ్డి చిందులు తొక్కారు. ఎవరతను రమణ దీక్షితులు.. బొక్కలో వేసి నాలుగు తగిలిస్తే నిజం బయటకు వస్తుంది. అతను ఏమేం తప్పులు చేశాడో, వేంకటేశ్వరస్వామి దగ్గరుండి ఏంచేశాడో మొత్తం బయటకు వస్తుంది. రమణ దీక్షితులు.. హద్దులు మీరి మాట్లాడుతున్నారు.. అనుభవిస్తారు మీరు.. ఎన్నో రోజులు అవసరం లేదు. పత్రికల్లో, చానళ్లలో మీరన్న మాటల గురించి వార్తలు చదవాలా? ఈ రోజు మీరు చేసే దానికి తప్పక అనుభవిస్తారు మీరంటూ పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. నరేంద్ర మోదీ, అమిత్‌షాల నియంతల పాలనకు కర్ణాటక వేదికగా మారిందని, రాహుల్ గాంధీతో చంద్రబాబు వేదిక పంచుకుంటే తప్పేంటని మీడియాను ప్రశ్నించారు. -
ఏపీ వ్యవసాయ బడ్జెట్ విశేషాలు
సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి గురువారం రాష్ట్ర అసెంబ్లీ వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ. 19,070 కోట్లతో ఆయన వ్యవసాయ చిట్టాపద్దును సభ ముందు ఉంచారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని తెలిపారు. వ్యవసాయ బడ్జెట్లోని విశేషాలు ఇవి.. రూ.19.070 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం రెవిన్యూ వ్యయం రూ.18,602 కోట్లు పెట్టుబడి వ్యయం రూ.468.38 కోట్లు వ్యవసాయ అనుబంధ రంగాలకు 4.730 కోట్లు మొక్కజొన్న ఉత్పత్తి లో దేశంలో ఏపీ రెండో స్థానం వరి ఉత్పత్తిలో దేశంలో మూడో స్థానంలో ఏపీ రసాయన ఎరువుల వాడకంలో దేశంలో ఆరో స్థానం రైతులకు 100శాతం రాయితీతో సూక్ష్మపోషకాల పంపీణి నాణ్యమైన విత్తనాల సరఫరా కోసం ఆధార్ అనుసంధానం రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు అగ్రిటెక్ ఏర్పాటు బత్తాయి ఉత్పతిలో ద్వితియ స్థానం సూక్ష్మపోషకాల సవరణకు రూ.60కోట్లు అర్హులైన ప్రతిరైతుకు రుణమాఫీ రుణమాఫీ కోసం 4,100 కోట్లు వేరుశనగ విత్తనాలకు 90 శాతం రాయితీ విత్తన రాయితీలు రూ.220కోట్లు పట్టు పరిశ్రమకు రూ.175 కోట్లు మత్స్యశాఖకు రూ.386 కోట్లు కరువు నివారణకు రూ. 1042 కోట్లు వ్యవసాయ మార్కెటింగ్ టెక్నాలజీకి రూ. 35 కోట్లు ఎరువు కొరత నివారణకు రూ.45 కోట్లు పశుసంవర్థనశాఖకు రూ.1225 కోట్లు మెగా సీడ్‌పార్క్‌కు రూ.100 కోట్లు పావలా వడ్డి రుణాలకు రూ.5 కోట్లు చంద్రన్న రైతు క్షేత్రాకు రూ.15 కోట్లు ప్రధాన ఫసల్ బీమా యోజన రూ.485 కోట్లు రైతులకు వడ్డీలేని రుణాలకు రూ.172 కోట్లు వ్యవసాయ యాంత్రికరణకు రూ.258 కోట్లు -
అధికారపార్టీ పలాయనం
పేదవాడికి ఇళ్లు నిర్మించి ఇచ్చే పేరుతో ప్రభుత్వం వారిని అప్పుల పాల్జేస్తోందని, బ్యాంకు కంతులు, లబ్ధిదారుని వాటా చెల్లించడానికి తెచ్చే అప్పులకు వడ్డీలు చెల్లించలేక చివరకు జైలు పాలయ్యే పరిస్థితి తెచ్చిపెట్టారని ప్రొద్దుటూరు శాసనసభ్యుడు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పేదవాడు అప్పు చేయ కుండా ఇల్లు నిర్మించి ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. ఈ అంశంపై చర్చను పక్క దారి పట్టించేలా మంత్రులు సోమిరెడ్డి, ఆదినారాయణరెడ్డి వ్యవహరించిన తీరును నిరసిస్తూ ఆయన నేల మీద కూర్చున్నారు. రాచమల్లుకు మద్దుతుగా వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు స్వరం కలపడంతో మంత్రులు సమాధానం చెప్పలేక అజెండా ప్రారంభం కాకుండానే మంగళవారం జెడ్పీ సమావేశాన్ని ముగించి వెళ్లిపోయారు. కడప : గృహ నిర్మాణ పథకంపై జెడ్పీ సమావేశం దద్దరిల్లింది. పేదలను ఇబ్బందులకు గురిచేసే విధంగా ఉన్న పథకంపై వాడీవేడి చర్చ జరిగింది. సరైన సమాధానం చెప్పలేక అధికారపార్టీ పలాయనం చిత్తగించింది. చర్చను పక్కదారి పట్టించింది. జెడ్పీ చైర్మన్ గూడూరు రవి అధ్యక్షతన మంగళవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ముందుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి ప్రతిజ్ఞ చేశారు. సమావేశం ప్రారంభం కాగానే ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి పట్టణ గృహ నిర్మాణ పథకం మీద మాట్లాడారు. పట్టణాల్లోని పేదలకు 3 సెంట్లలో ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి ఇప్పుడేమో ముక్కాల్ సెంటు, సెంటు, సెంటు కంటే కొంచె ఎక్కువ స్థలంలో ఇళ్లు నిర్మిస్తామని ప్రభుత్వం చెబుతోందని మంత్రులను నిలదీశారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.3.65 లక్షలు ఇస్తే ఈ ఇల్లు తనఖా పెట్టుకుని బ్యాంకు 9 శాతం వడ్డీతో రూ.3లక్షల లోను ఇస్తుందని, దీన్ని 30ఏళ్లు కంతులు కట్టాలన్నారు. రిక్షా తొక్కే వాళ్లు, కూలి పనిచేసుకునే వాళ్లు లబ్ధిదారుని వాటా కింద మొదట రూ.లక్ష కట్టాలని, తర్వాత 30ఏళ్లు లోను, కంతులు కలిపి నెలకు రూ.7వేలు చెల్లించాలన్నారు. ఇందంతా పేదవాడు చేసుకోగలడా అని మంత్రులను ప్రశ్నించారు. కంతులు సక్రమంగా కట్టకపోతే బ్యాంకు వాళ్లు ఇల్లు జప్తు చేసి జైలుకు పంపించరా? అని రాచమల్లు ప్రశ్నించారు. ప్రజల కోసం ప్రశ్నిస్తా.. జిల్లా ఇన్చార్జ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కల్పించుకుని ఇది అర్బన్‌కు సంబంధించిన విషయమని ఇక్కడ చర్చించకూడదన్నారు. ఏదైనా ఉంటే మీరు అసెంబ్లీకి రండి అక్కడ చర్చిద్దాం అన్నారు. జెడ్పీ సమావేశంలో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన సమస్యలను మాత్రమే చర్చించాలన్నారు. దీనిపై ఎమ్మెల్యే రాచమల్లు స్పందిస్తూ గతంలో ఇదే సభలో సమైక్యాంధ్ర కోసం పలు తీర్మానాలు చేశారని ఇప్పుడు ఎందుకు చేయకూడదన్నారు. ఇదేమైన వేరే రాష్ట్రం సమస్యా? లేక నా వ్యక్తిగత సమస్య అని ఆయన ప్రశ్నించారు. ప్రజల సమస్యల గురించి ఎక్కడైనా ప్రశ్నిస్తానని స్పష్టం చేశారు. ఈ దశలో మంత్రి ఆదినారాయణరెడ్డి, పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ ఎం.లింగారెడ్డి కల్పించుకుని జెడ్పీలో ఈ అంశం మీద చర్చించకూడదని ఎదురుదాడికి దిగారు. జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయనీ, జెడ్పీ సమావేశం అజెండాలో ఈ అంశం లేదని అభ్యంతరం చెప్పారు. ఒక దశలో రాచమల్లు, మంత్రి ఆది పరస్పరం విమర్శలు చేసుకున్నారు. లింగారెడ్డి కల్పించుకుని 300చదరపు అడుగుల లోపు ఇల్లు నిర్మించుకుంటే బ్యాంకు లోను తీసుకోవాల్సిన పనిలేదని చెప్పారు. ఈ సందర్భంలో లింగారెడ్డి, రాచమల్లు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ‘ చూడు మామ నువ్వు ప్రొద్దుటూరులో ఉన్నావ్. మల్లా టిక్కెట్ అడుగుతనావ్. ఇట్ల మాట్లాడితే ప్రజలు నీకు ఓటేయరు’’ అని రాచమల్లు పరోక్షంగా హెచ్చరించారు. కాంట్రాక్టర్ల కోసమే.. ప్రభుత్వం అర్బన్ హౌసింగ్‌లో మంజూరు చేసే ఇళ్ల నిర్మాణాలు కాంట్రాక్టర్ల కోసం తప్ప లబ్ధిదారుల కోసం కాదని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి విమర్శించారు. ఇది కేవలం టీడీపీ నాయకులకు లబ్ధి చేకూర్చేందుకు తప్ప మరొకటి కాదన్నారు. విషజ్వరాలతో చనిపోతున్నారు జిల్లావ్యాప్తంగా అనేకమంది విషజర్వాలతో చనిపోతున్నా పట్టించుకునే వారే లేరని ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి విమర్శించారు. ఒక్క పొద్దుటూరులోనే పదుల సంఖ్యలో చనిపోయారన్నారు. ప్రజలకు సేవచేయలేని పదవులు, మంత్రి పదవులు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఒక్క పూరిగుడిసె లేకుండా చేశారు వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ఒక్క పూరిగుడిసె లేకుండా ప్రతి పేదవాడికి పక్కాఇల్లు నిర్మించి ఇచ్చారని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంతరెడ్డి అన్నారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలో పచ్చ చొక్కాలు తొడుకున్న ఎంతోమంది నాయకులు భవంతులు నిర్మించుకున్నారన్నారు. ఇప్పుడేమో ఈ ప్రభుత్వం పేదల ఇళ్లను బ్యాంకులో తనఖా పెట్టుకుని లోను మంజూరు చేస్తోందని దుయ్యబట్టారు. సమస్యలపై చర్చించండి.. సభలో ఎవరు కూడా వ్యక్తిగత విమర్శలు చేసుకోరాదని, కేవలం జిల్లాలో ప్రజల సమస్యలను మాత్రమే మాట్లాడాలని జెడ్పీ చైర్మన్ గూడూరు రవి పదే పదే సభ్యులకు విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత విమర్శలకు దిగితే సహించేది లేదని ఏపార్టీ సభ్యులనైనా పోలీసులతో బయటకు పంపుతామని, అంతేకాకుండా మైక్ కూడా కట్ చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్యే జయరాములు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, కలెక్టర్ బాబురావునాయుడు, జేసీ శ్వేత, జెడ్పీ సీఈఓ ఆనంద్ సమావేశంలో పాల్గొన్నారు. మంత్రిని నిలదీసిన సభ్యులు వైఎస్ హయాంలో పులివెందులలో, రాష్ట్రంలో 4లక్షల ఇల్లు కనిపించకుండా పోయాయని మంత్రి సోమిరెడ్డి ఆరోపణలు చేశారు. దీంతో ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పి. రవీంద్రనాథరెడ్డి, ఎస్.రఘురామిరెడ్డి, జి. శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డితో పాటు పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వైఎస్ హయాంలో అక్రమాలు జరిగి ఉంటే మూడేళ్లుగా మీరు అధికారంలో ఉండి ఎందుకు విచారణ చేయించలేకపోయారని నిలదీశారు. ఈ దశలో సభలో తీవ్రస్థాయిలో గందరగోళం నెలకొనడంతో చైర్మన్ రవి సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. తర్వాత సభ ప్రారంభమయ్యాక పేదలకు భారం లేకుండా ఇల్లు నిర్మించి ఇవ్వాలని తీర్మానం చేయాలని చైర్మన్ రవి ప్రతిపాదించారు. ఇందుకు మంత్రి సోమిరెడ్డి అంగీకరించలేదు. ఈ దశలో ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతుండగా, జెడ్పీటీసీ సభ్యుడు పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడ్డుతగిలారు. ‘నువ్వు రాజకీయ వ్యభిచారివి నువ్వెందుకు మాట్లాడతావ్ కూర్చో’’ అని రాచమల్లు నిప్పులు చెరిగారు. దీంతో సభలో గందరగోళం రేగింది. 2015, 2016, 2017లో ఒక్క ఇల్లు కట్టకుండా 2018లో ఓట్ల కోసం ఇల్లు కట్టిస్తారా? అని మంత్రులను నిలదీశారు. వైఎస్సార్ గురించి ఆరోపణలు, విమర్శలు చేసే అర్హత ఎవరికీ లేదని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అభ్యంతరం చెప్పారు. ఈ దశలో ఎమ్మెల్సీ బీటెక్ రవి రాజకీయ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వాగ్వాదం, తోపులాటలు చోటుచేసుకోవడంతో చైర్మన్ రవి సభను నిరవధికంగా వాయిదా వేశారు. దీంతో అజెండాలోని అంశాలు ప్రారంభం కాకుండానే సమావేశం ముగిసింది. -
టీడీపీలో పదవుల ముసలం
వలస నేతలకే పెద్దపీట ►కీలక పార్టీ పదవులు వలస నేతలతో భర్తీ ►అసంతృప్తితో రగులుతున్న తెలుగు తమ్ముళ్లు ►పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు ►ఖరారైనా ప్రకటించని కార్యవర్గాలు నెల్లూరు: అధికార పార్టీలో పదవుల ముసలం మొదలైంది. పార్టీ కీలక పదవులన్నీ వలస నేతలతో భర్తీ చేయటానికి కసరత్తు సాగించటం వివాదాస్పదమైంది. పార్టీ జిల్లా అధ్యక్ష పదవి మినహా అన్ని పదవులకు ఇప్పటి వరకు వలస నేతలకే కట్టబెట్టేలా అమాత్యులు వ్యవహరిస్తున్నారు. దీంతో మొదటి నుంచి పార్టీని నమ్ముకుని పనిచేసిన పార్టీ శ్రేణులు అమాత్యుల తీరుతో రగలిపోతున్నారు. కొందరు నేతలైతే పదవుల పందేరంపై అధిష్టానికి ఫిర్యాదులు కూడా చేసినా పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. మంత్రి నారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డితో కలిసి చర్చించి జాబితాను సిద్ధం చేశారు. అయితే పదవులను తమ వెంట తిరుగుతున్న వలసనేతలు, అనుచరులకు కట్టబెట్టేందుకు రెడీ అయ్యారు. పదవుల పందేరంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డిని పూర్తిగా పక్కన పెట్టినట్లు తెలిసింది. ఆయన అనుచరులను పదవులకు దూరంగా ఉంచారు. మంత్రి నారాయణ, బీద, ఆదాల నిర్ణయం మేరకు వలసవాదులు, అనుచరులకు పెద్దపీట వేశారని తెలిసింది. పార్టీ అధిష్టానం కూడా పదవుల జాబితాకు ఆమోద ముద్ర వేయటానికి రంగం సిద్ధం చేసింది. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా బీద రవిచంద్ర, ప్రధాన కార్యదర్శిగా చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డిని పార్టీ ప్రకటించింది. దీంతో నగర కమిటీలు, అనుబంధ విభాగాల పదవులకు సంబంధించి మే నెలలో జరిగిన మహానాడులో సంస్థాగత ఎన్నికల ప్రకియ కూడా నిర్వహించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి అమర్నా«థ్‌రెడ్డి, జిల్లా మంత్రులు పి.నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు హాజరై కమిటీల కూర్పులో కీలకపాత్ర పోషించారు. సోమిరెడ్డి కేవలం సమావేశానికే పరిమితమయ్యారని ఆయన అనుచరులు చెబుతున్నారు. పార్టీలో పనిచేసేవారిని గుర్తించటం, సీనియార్టీ, సామాజిక ప్రాధాన్యం ఇలాంటి అంశాలను పట్టించుకోకుండా కేవలం అర్థ బలానికే ప్రాధాన్యం ఇచ్చి నేతలను ఎంపిక చేయటం వివాదాస్పదంగా మారింది. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక రకాలుగా ఇబ్బందిపడిన వారందరినీ మంత్రులు విస్మరించటంపై శ్రేణుల్లో అసంతృప్తి రగులుతోంది. మహానాడులోనూ కొందరు కార్యకర్తలు దీనిపై నేరుగా ఇన్చార్జి మంత్రికే ఫిర్యాదులు చేసినా మార్పు శూన్యం. క్యాడర్ సెగతో ఇబ్బందులే.. తాజాగా మంత్రులు సిద్ధం చేసిన జాబితాను ప్రకటించకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. పదవుల పందేరం తర్వాత అసంతృప్తి పెరిగితే పార్టీ బజారున పడుతుందనేది ముఖ్య నేతల ఆందోళన. దీంతో ముందు అడుగు వేయటానికి వెనకాడుతున్న పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే మరోవైపు మాత్రం దాదాపు ఆ ముగ్గురు ఖరారు చేసిన వారికే ప్రాధాన్యం దక్కేలా కూడా మంత్రాంగం నిర్వహించారు. ఆయా పదవులకు పోటీలో ఉన్న వారిని తప్పుకోవాలని ఇప్పటికే సూచిం చినట్లు సమాచారం. ప్రస్తుతం నగర అధ్యక్షుడిగా నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఉన్నారు. మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరగా నగర అధ్యక్ష పదవిని కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆనం జయకుమార్‌రెడ్డికి ఇవ్వాలని ఆదాల వర్గం డిమాండ్ చేస్తుండగా, ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డికి ఇవ్వాలని మంత్రి నారాయణ వర్గం పట్టుబడుతోంది. మరోపక్క కమ్మ సామాజిక వర్గం నుంచి పమిడి రవికుమార్ చౌదరి ప్రయత్నిస్తున్నారు. దీంతో నగర అ«ధ్యక్ష పదవి పెండింగ్‌లో పడింది. ఇక కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆనం రంగమయూర్‌రెడ్డికి జిల్లా తెలుగు యువత పదవి ఇవ్వటానికి కసరత్తు చేయగా ఈ పదవి కోసం బాలకృష్ణ చౌదరి, వంశీకృష్ణారెడ్డి పోటీపడుతున్నారు. వైఎస్సార్సీపీ నుం చి వచ్చిన జెడ్పీటీసీ సభ్యురాలు ముప్పాళ్ల విజేతకు జిల్లా తెలుగు మహిళ అధ్యక్ష పదవిని ప్రతిపాదించారు. ఈమె పేరును జెడ్పీ ఫ్లోర్ లీడర్ వేనాటి రామచంద్రారెడ్డి వ్యతిరేకిస్తున్నారు. నగర మహిళ పదవిని పొడమేకల శాంతికి, నగర తెలుగు యువతను వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన తాళ్లూరి అవినాష్‌కు ఇవ్వనున్నారు. తెలుగునాడు టీచర్స్ అధ్యక్ష పదవి కాంగ్రెస్ నుంచి వచ్చిన మై«థిలి మనోహర్‌రెడ్డికి దక్కే అవకాశాలు ఉండగా, ప్రస్తుత అధ్యక్షుడు సాంబ శివరావు తననే కొనసాగించాలని కోరుతున్నట్లు సమాచారం. ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులుగా ఆదాల అనుచరు డు సునీల్‌కుమార్‌ను మళ్లీ కొనసాగించాలని నిర్ణయిం చారు. ఈ పదవిని ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయ్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే వలసవాదులు ఖాజావలికి నుడా డైరెక్టర్, చాట్ల నరసింహారావుకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, నిర్మలకు మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవులు లభించాయి. మొత్తం మీద వలస నేతలే కీలకంగా మారి పదవులను డిమాండ్ చేస్తుండటం గమనార్హం.