Andhra Pradesh Agriculture Budget Highlights | 2018 - Somireddy Chandra Mohan Reddy
Sakshi News home page

Published Thu, Mar 8 2018 2:22 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

minister somireddy presents agriculture budget in assembly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి గురువారం రాష్ట్ర అసెంబ్లీ వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ. 19,070 కోట్లతో ఆయన వ్యవసాయ చిట్టాపద్దును సభ ముందు ఉంచారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని తెలిపారు. వ్యవసాయ బడ్జెట్‌లోని విశేషాలు ఇవి..

  • రూ.19.070 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌
  • 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం 
  • రెవిన్యూ వ్యయం రూ.18,602 కోట్లు
  • పెట్టుబడి వ్యయం రూ.468.38 కోట్లు
  • వ్యవసాయ అనుబంధ రంగాలకు 4.730 ​కోట్లు
  • మొక్కజొన్న ఉత్పత్తి లో దేశంలో ఏపీ రెండో స్థానం
  • వరి ఉత్పత్తిలో దేశంలో మూడో స్థానంలో ఏపీ
  • రసాయన ఎరువుల వాడకంలో దేశంలో ఆరో స్థానం
  • రైతులకు 100శాతం రాయితీతో సూక్ష్మపోషకాల పంపీణి
  • నాణ్యమైన విత్తనాల సరఫరా కోసం ఆధార్‌ అనుసంధానం
  • రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు అగ్రిటెక్ ఏర్పాటు
  • బత్తాయి ఉత్పతిలో ద్వితియ స్థానం
  • సూక్ష్మపోషకాల సవరణకు రూ.60కోట్లు
  • అర్హులైన ప్రతిరైతుకు రుణమాఫీ
  • రుణమాఫీ కోసం​ 4,100 కోట్లు
  • వేరుశనగ విత్తనాలకు 90 శాతం రాయితీ
  • విత్తన రాయితీలు రూ.220కోట్లు
  • పట్టు పరిశ్రమకు  రూ.175 కోట్లు
  • మత్స్యశాఖకు రూ.386 కోట్లు
  • కరువు నివారణకు  రూ. 1042 కోట్లు
  • వ్యవసాయ మార్కెటింగ్‌ టెక్నాలజీకి రూ. 35 కోట్లు
  • ఎరువు కొరత నివారణకు రూ.45 కోట్లు
  • పశుసంవర్థనశాఖకు రూ.1225 కోట్లు
  • మెగా సీడ్‌పార్క్‌కు రూ.100 కోట్లు
  • పావలా వడ్డి రుణాలకు రూ.5 కోట్లు
  • చంద్రన్న రైతు క్షేత్రాకు రూ.15 కోట్లు
  • ప్రధాన  ఫసల్‌ బీమా  యోజన రూ.485 కోట్లు
  • రైతులకు వడ్డీలేని రుణాలకు రూ.172 కోట్లు
  • వ్యవసాయ యాంత్రికరణకు రూ.258 కోట్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement