అచ్చెన్నాయుడికి మరో అవమానం!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడికి మరో అవమానం ఎదురైంది. ఇప్పటివరకు శాసనమండలిలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆయనకు ఈసారి అవకాశం కల్పించలేదు. అచ్చెన్నాయుడు స్థానంలో చింతకాయల అయ్యన్నపాత్రుడికి అవకాశం ఇచ్చారు. శాసనమండలిలో అయ్యన్నపాత్రుడు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
అచ్చెన్నాయుడిపై చంద్రబాబు అసంతృప్తిగా ఉండడం వల్లే మార్పు జరిగిందని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. అయితే పార్టీలోని లోపాలను బహిరంగంగా ఎత్తిచూపుతున్న అయ్యన్నపాత్రుడికి అవకాశం ఇవ్వడం పట్ల తెలుగు తమ్ముళ్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. శాసనసభలో ప్రత్తిపాటి పుల్లారావు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడతారు.