సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ప్రకటనపై అద్దంకి దయాకర్ స్పందించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తానని చెప్పారు. అవకాశం ఇవ్వకుండా ఆపినా కార్యకర్తగానే ఉంటానని అన్నారు. అభిమానులెవరూ కలత చెందాల్సిన అవసరం లేదని అన్నారు. పార్టీ భవిష్యత్తులో అవకాశం కల్పిస్తుందని పేర్కొన్నారు. అందరం కలిసి ప్రజాపాలన కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.
కాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను తెలంగాణ కాంగ్రెస్ బుధవారం ప్రకటించించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎన్‌ఎస్‌యూఐ జాతీయ అధ్యక్షుడు, యువనేత బల్మూరి వెంకట నర్సింగరావు(బల్మూరి వెంకట్)తోపాటు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‌ను పార్టీ అధిష్టానం ఖరారు చేసింది.
తొలుత పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌కు, బల్మూరి వెంకట్‌కు ఎమ్మెల్సీ టికెట్ ఖరారు చేయగా.. అయితే అద్దంకికి పార్టీ అధిష్టానం ఝలక్ ఇచ్చింది. చివరి నిమిషంలో అద్దంకిని కాదని మహేష్ కుమార్ గౌడ్‌ను ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ప్రకటించింది. గురువారం ఉదయం 11 గంటలకు ఇద్దరు అభ్యర్ధులు నామినేషన్ వేయనున్నారు. ఈ నెల 29వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.
చదవండి: తెలుగు రాష్ట్రాలకు ఐపీఎస్‌ల కేటాయింపు
Comments
Please login to add a commentAdd a comment