సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎన్‌ఎస్‌యూఐ జాతీయ అధ్యక్షుడు, యువనేత బల్మూరి వెంకట నర్సింగరావు(బల్మూరి వెంకట్)తోపాటు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‌ను పార్టీ అధిష్టానం ఖరారు చేసింది.
అయితే అభ్యర్ధుల ప్రకటనలో కాంగ్రెస్ స్వల్ప మార్పులు చేసింది. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌కు కాంగ్రెస్ అధిష్టానం ఝలక్ ఇచ్చింది. తొలుత అద్దంకి దయాకర్‌కు, బల్మూరి వెంకట్‌కు ఎమ్మెల్సీ టికెట్ ఖరారు చేయగా.. చివరి నిమిషంలో సీనియర్లు చక్రం తిప్పడంతో అద్దంకిని కాదని మహేష్ కుమార్ గౌడ్‌కు ఎమ్మెల్సీ అవకాశం వరించింది.
కాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయగా.. ఆ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 29వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. వీటికి సంబంధించి ఈనెల 18న నామినేషన్లకు చివరి తేదీ. ఈ క్రమంలో గురువారం ఉదయం 11 గంటలకు ఇద్దరు అభ్యర్ధులు నామినేషన్ వేయనున్నారు.
చదవండి: అందుకే ఆగాం, లేకుంటేనా.. : హరీష్‌రావు
ఇక 2021 ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన వెంకట్.. 2023 సార్వత్రిక ఎన్నికల్లో అధిష్టానం సూచన మేరకు టికెట్ రేసు నుంచి వైదొలగారు. సమీకరణల్లో భాగంగా అక్కడ హుజూరాబాద్ మండలం సింగాపురానికి చెందిన వొడితెల ప్రణవ్‌కు పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఇద్దరి పేర్లను ప్రకటించింది అధిష్టానం.
Comments
Please login to add a commentAdd a comment