Balmuri Venkat
-
గాంధీ ఆసుపత్రి వద్ద ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కు చేదు అనుభవం
-
కిషన్‌రెడ్డికి నీట్ సెగ
సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఎన్టీఏను రద్దు చేయాలని నినాదాలు చేస్తూ విద్యార్థి సంఘాల నేతలు కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించారు.వివరాల ప్రకారం.. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని తాగింది. తాజాగా ఎన్ఎస్యూఐ నాయకులు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సహా మరికొందరు కాంగ్రెస్ కార్యకర్తలు శనివారం ఉదయం కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, అవకతవకలపై ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కేంద్రం తీరుకు వ్యతిరేకంగా, కిషన్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం, పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అంబర్పేట్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. -
‘కపటనీతికి మారుపేరు కాంగ్రెస్!’.. కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ కపటనీతికి మారుపేరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అన్ని వర్గాల ప్రజలకు.. ముఖ్యంగా యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. కానీ తమ 120 రోజుల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులతో సహా అందరికీ ద్రోహం చేయడం ప్రారంభించిందని మండిపడ్డారు. ‘ప్రియాంక గాంధీ వంటి కాంగ్రెస్ అగ్రనాయకులు అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు రూ. 4,000 నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక.. అసలు అటువంటి హామీ ఏమివ్వలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట మార్చారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అన్ని వార్తాపత్రికల మొదటి పేజీలో తమ జాబ్ క్యాలెండర్ గురించి ప్రకటనలు ఇచ్చింది. వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలో భర్తీ చేసిన 30 వేల ఉద్యోగాలకు కేవలం నియామక పత్రాలను ఇచ్చి ఆ ఉద్యోగాలను నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకుంటోంది కాంగ్రెస్. అన్ని పోటీ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ తాము ఇచ్చిన హామీపై నిస్సిగ్గుగా యూ టర్న్ తీసుకుంటూ.. కాంగ్రెస్ ప్రభుత్వం టెట్ పరీక్ష ఫీజును రూ. 400 నుండి రూ. 2000లకు (2 పేపర్లకు) పెంచింది. బల్మూరి వెంకట్ వంటి కాంగ్రెస్ నాయకులను ఎన్నో కోర్టు కేసులు వేసి.. అనేక పోటీ పరీక్షలు రద్దవ్వడానికి కారణమయ్యారు. నిరుద్యోగుల ఉసురు పోసుకుని, ప్రతిఫలంగా వెంకట్ ఎమ్మెల్సీ పదవిని అందుకున్నాడు. కానీ.. ప్రభుత్వ ఉద్యోగ ఆశావహులను మాత్రం దిక్కుతోచని స్థితిలో వదిలేసింది కాంగ్రెస్. కాంగ్రెస్ అసలు రంగు ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. తమని నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగ యువత గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చింది’ అని ‘ఎక్స్’వేదికగా మండిపడ్డారు. కపటనీతికి మారుపేరు కాంగ్రెస్! అన్ని వర్గాల ప్రజలకు.. ముఖ్యంగా యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ తమ 120 రోజుల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులతో సహా అందరికీ ద్రోహం చేయడం ప్రారంభించింది. 👉 ప్రియాంక గాంధీ వంటి కాంగ్రెస్… — KTR (@KTRBRS) April 19, 2024 -
TS: కాంగ్రెస్ ఎప్పటికీ మారదా.. ఇంతకీ ఏం జరిగింది?
కాంగ్రెస్ అనేది ఓ విచిత్రమైన పార్టీ. ఆ పార్టీలో ఎప్పుడేం జరుగుతుందో..? పార్టీలోకి ఎవరు వస్తారో? ఎవరు బయటకు వెళ్లిపోతారో ఎవ్వరూ చెప్పలేరు. ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపిక కూడా గందరగోళంగానే ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నా అంతే.. అధికారం వచ్చినా అంతే.. తాజాగా తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక కూడా అలాగే జరిగింది. నేతల మనోభావాలను ఎవరూ పట్టించుకోరు. కాంగ్రెస్ ఎప్పటికీ మారదా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ టీ.కాంగ్రెస్‌లో ఏం జరిగింది? తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే అభ్యర్ధుల ఎంపికలో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నామినేషన్ల గడువు ముగిసే రోజు వరకు ఎన్నో ట్విస్టులు, మరెన్నో మలుపులు అన్నట్లుగా ఆసక్తికరంగా సాగింది. రెండు ఎమ్మెల్సీలకు అద్దంకి దయాకర్, మహేష్ కుమార్ గౌడ్లకు అవకాశం కల్పించాలని మొదట అనుకున్నారు. కాని రాత్రికి రాత్రే కాంగ్రెస్ విద్యార్థి విభాగం NSUI అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేరు తెరమీదకు వచ్చింది. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు యువతకు అవకాశం కల్పించాల్సిందే అని తేల్చిచెప్పడంతో బల్మూరికి టికెట్ కన్ఫ్మామ్ అయ్యింది. దీంతో అద్దంకి దయాకర్.. మహేష్ గౌడ్‌లలో ఒకరిని తప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతో తర్జన భర్జనల అనంతరం మొదట మహేష్ గౌడ్‌ను తప్పించాలనుకున్నారు. కానీ బీసీలు ఇప్పటికే బీజేపీ వైపు మళ్ళుతున్న నేపధ్యంలో బీసీ నేత అయిన మహేష్గౌడ్ను తప్పిస్తే.. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెష్కి నష్టం తప్పదనే అభిప్రాయానికి వచ్చిన కాంగ్రెస్ నాయకత్వం అద్దంకి దయాకర్‌ను తప్పించడానికి నిర్ణయించింది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో కొందరికి ఆఖరి నిమిషంలో ఛాన్స్ చేజారిపోవడాన్ని అర్దం చేసుకొవచ్చు. కాని అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియనే సరిగా జరగలేదనే అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. అభ్యర్ధుల ఎంపికను చివరి నిమిషం వరకు తేల్చకుండా ఎందుకు నాన్చాల్సి వచ్చింది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన జోష్ కాంగ్రెస్ లో ఇంకా కొనసాగుతోంది. అలాంటప్పుడు టికెట్లు ఆశించిన నేతలతో పార్టీ పెద్దలు చర్చించి.. అవకాశం దక్కని నేతలను బుజ్జగిస్తే సరిపోయేది. అసెంబ్లీ ఎన్నికల్లో అదే చేసారు. టికెట్లు దక్కని నేతల రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు. దీంతో అసెంబ్లీ టికెట్ల కేటాయింపు సజావుగా జరిగి కాంగ్రెస్ పార్టీ చేతికి అధికారం అందింది. కాని ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో.. అభ్యర్ధులను చివరి నిమిషంలో మార్చడం వల్ల ఎంతో గందగోళం తలెత్తింది. వివిధ కారణాల వల్ల అద్దంకి దయాకర్ కి అవకాశం కల్పించలేని పరిస్తితి వస్తే.. కనీసం ఆయనకు పరిస్తితి వివరించి భరోసా ఇస్తే బాగుండేదనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది. పార్టీ పెద్దలు ఆయనతో మాట్లాడి ఒప్పించి.. నామినేషన్ పర్వంలో ఆయన్ను భాగస్వామిని చేస్తే బాగుండేదని నేతలు భావిస్తున్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అద్దంకి ప్రకటించిన తర్వాత కూడా కాంగ్రెస్ పెద్దలు ఆ పని చేయకపోవడం అద్దంకి అభిమానుల్ని బాధిస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పెద్దల తీరు మారకపోతే ఎలా అని పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అందరిని కలుపుకుని పోయేలా పార్టీ పెద్దలు వ్యవహరించాలని కోరుతున్నారు. -
ఎమ్మెల్సీలుగా మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ఏకగ్రీవం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌కు ఉపసంహరణ గడువు నేటితో(మంగళవారం) ముగిసింది. రెండు ఎమ్మెల్సీ స్ధానాలకు రెండు నామినేషన్లు మాత్రమే రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. ఎన్నికలు లేకుండానే కాంగ్రెస్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యాలయం ప్రకటించింది. కాసేపట్లో అసెంబ్లీ కార్యాలయంలో రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి ఎమ్మెల్సీ సర్టిఫికెట్లను మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ అందుకోనున్నారు. మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ఏకగ్రీవంగా ఎమ్మెల్సీలు కావడం సంతోషంగా ఉందన్నారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. మహేష్ కుమార్ గౌడ్ ఎలాంటి పదవి ఆశించకుండా పార్టీ గెలుపుకోసం కృషి చేశాడని గుర్తు చేశారు. బల్మూరి వెంకట్ చేసిన ఉద్యమాలను పార్టీ గుర్తించిందని అన్నారు. పని చేసిన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ పార్టీలో గౌరవం ఉంటుందని తెలిపారు. తన సేవలు గుర్తించి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో నిజాయితీగా పనిచేస్తే పదవులు వస్తాయని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం కోసం శాసన మండలిలో తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. అతి చిన్న వయసులో ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికీ దన్యవాదాలు తెలిపారు బల్మూరి వెంకట్. 9 సంవత్సరాలు తనతో పాటు ప్రతి ఉద్యమంలో పాల్గొన్న ఎన్ఎస్యూఐ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పారు. విద్యార్థి, నిరుద్యోగులకు ప్రభుత్వానికి మధ్య సంధానకర్తగా ఉంటానని అన్నారు. చదవండి: మంత్రి పొన్నంకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ -
ఎమ్మెల్సీలుగా బల్మూరి వెంకట్, మహేశ్ గౌడ్ నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా బల్మూరి వెంకట్, మహేశ్ కుమార్ గౌడ్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఈనెల 11న వెలువడింది. నామినేషన్ల స్వీకరణకు గురువారం చివరి రోజు కాగా కాంగ్రెస్ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను అసెంబ్లీ రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. నామినేషన్ దాఖలు కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజర య్యారు. వీరితో పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు గిడుగు రుద్రరాజు, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎన్నిక ఏకగ్రీవమే రెండు స్థానాలకు ఇద్దరు అభ్యర్థులు మాత్రమే నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అయితే ఈ నెల 19న నామినేషన్ల పరిశీలన, 22న ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత ఫలితాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. 119 ఎమ్మెల్యేలు కలిగిన తెలంగాణ అసెంబ్లీలో సీపీఐతో కలుపుకుని కాంగ్రెస్‌కు 65 మంది సభ్యుల సంఖ్యాబలం ఉంది. మరోవైపు 39 మంది ఎమ్మెల్యేలు కలిగిన బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నిక పక్రియకు దూరంగా ఉంది. దీంతో కాంగ్రెస్ తరపున ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో ఎమ్మెల్సీలుగా బల్మూరు వెంకట్, మహేశ్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశముంది. నామినేషన్ల అనంతరం మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు లభిస్తుందనేందుకు ఈ ఇద్దరు నాయకులను శాసన మండలికి పంపడమే ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. -
MLC: నామినేషన్ వేయని ప్రతిపక్షాలు.. ఇద్దరి ఎన్నిక ఏకగ్రీవం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. రెండు స్థానాల కోసం ఇద్దరు అభ్యర్థులు(కాంగ్రెస్) నుంచి మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. ఇక, ఎవరూ నామినేషన్లు వేయకపోవడంతో బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నామినేషన్ దాఖలుకు నేడు ఆఖరి రోజు కావడంతో కాంగ్రెస్ అభ్యర్థులు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్లు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇదిలా ఉండగా.. ప్రతిపక్షాల నుంచి ఎవరూ నామినేషన్ వేయలేదు. దీంతో, వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మరోవైపు.. రేపు నామినేషన్ల పరిశీలన కొనసాగనుంది. ఈనెల 22వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉంది. అదే రోజున మధ్యాహ్నం మూడు గంటలకు అభ్యర్థుల ఎన్నికపై ప్రకటన వెలువడనుంది. కాంగ్రెస్ అభ్యర్థుల బయోడేటా 1. పేరు : బల్మూరి వెంకట్/బల్మూరి వెంకట నర్సింగరావు తండ్రి: మదన్మోహన్రావు పుట్టిన తేదీ : నవంబర్ 2, 1992 విద్యార్హత: ఎంబీబీఎస్ పుట్టిన ఊరు: తారుపల్లి, కాల్వ శ్రీరాంపూర్, పెద్దపల్లి జిల్లా కులం: ఓసీ (వెలమ) 2. పేరు: బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ తండ్రి: బి.గంగాధర్ గౌడ్ పుట్టిన తేదీ: ఫిబ్రవరి 24, 1966 విద్యార్హత: బీకామ్ పుట్టిన ఊరు: రహత్‌నగర్, భీంగల్ మండలం, నిజామాబాద్ జిల్లా కులం: బీసీ (గౌడ) -
అతిచిన్న వయస్సులో ఎమ్యెల్సీ అవుతుండడం చాలా సంతోషం: బల్మూరి
-
Congress: ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన.. అద్దంకి దయాకర్‌కు ఝలక్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షుడు, యువనేత బల్మూరి వెంకట నర్సింగరావు(బల్మూరి వెంకట్)తోపాటు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‌ను పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. అయితే అభ్యర్ధుల ప్రకటనలో కాంగ్రెస్ స్వల్ప మార్పులు చేసింది. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌కు కాంగ్రెస్ అధిష్టానం ఝలక్ ఇచ్చింది. తొలుత అద్దంకి దయాకర్‌కు, బల్మూరి వెంకట్‌కు ఎమ్మెల్సీ టికెట్ ఖరారు చేయగా.. చివరి నిమిషంలో సీనియర్లు చక్రం తిప్పడంతో అద్దంకిని కాదని మహేష్ కుమార్ గౌడ్‌కు ఎమ్మెల్సీ అవకాశం వరించింది. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయగా.. ఆ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 29వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. వీటికి సంబంధించి ఈనెల 18న నామినేషన్లకు చివరి తేదీ. ఈ క్రమంలో గురువారం ఉదయం 11 గంటలకు ఇద్దరు అభ్యర్ధులు నామినేషన్ వేయనున్నారు. చదవండి: అందుకే ఆగాం, లేకుంటేనా.. : హరీష్‌రావు ఇక 2021 ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన వెంకట్.. 2023 సార్వత్రిక ఎన్నికల్లో అధిష్టానం సూచన మేరకు టికెట్ రేసు నుంచి వైదొలగారు. సమీకరణల్లో భాగంగా అక్కడ హుజూరాబాద్ మండలం సింగాపురానికి చెందిన వొడితెల ప్రణవ్‌కు పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఇద్దరి పేర్లను ప్రకటించింది అధిష్టానం. -
‘గురునానక్’ వద్ద పహారా
ఇబ్రహీంపట్నం: గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద శుక్రవారం పోలీసులు పహారా కాస్తున్నారు. యూనివర్సిటీ పేరుతో మోసం చేశారని గురువారం కళాశాల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి నేతలు ఆందోళన చేయడం..ఉద్రిక్త పరిస్థితులు నెలకొని లాఠీచార్జి వరకు వెళ్లడం, అరెస్టులు చేయడం తెలిసిందే.ఈ నేపథ్యంలో మళ్లీ ఏమైన ఆందోళన కా ర్యక్రమాలు చోటు చేసుకుంటాయోనన్న ఉద్దేశంతో పోలీసు బలగాలను మోహరించారు.మరోవైపు యాజమాన్యం బౌన్సర్లను పెట్టుకోవడం గమనార్హం. అండగా ఉంటాం ఇబ్రహీంపట్నం: యూనివర్సిటీ పేరుతో మోసానికి గురైన విద్యార్థులు, పేరెంట్స్‌కు అండగా ఉంటామని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ అన్నారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ కళాశాల వద్ద గురువారం జరిగిన ఆందోళనలో అరైస్టె బెయిల్‌పై విడుదలైన ఆయన స్థానిక డాగ్ బంగ్లా వద్ద మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యూనివర్సిటీ పేరుతో విద్యార్థులను కళాశాలలో చేర్చుకొని తీరా అనుమతి రాలేదంటూ మోసం చేసిన యాజమాన్యాన్ని 60 రోజులుగా ప్రశ్నిస్తున్నా, పోలీసులకు ఫిర్యాదులు చేసిన పట్టించుకోలేదన్నారు. మంత్రులు కేటీఆర్, సబితారెడ్డి విద్యార్థుల భవిష్యత్తుపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఇబ్రహీంపట్నం: యూనివర్సిటీ పేరుతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాన్ని అరెస్టు చేయాల ని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం గురునానక్ కళాశాలను సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తప్పు చేసిన యాజమాన్యాన్ని వదలిపెట్టి కన్నబిడ్డల భవిష్యత్తు కోసం ఆందోళనకు దిగిన తల్లిదండ్రులపై వారికి మద్దతుగా వచ్చిన ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌తోపాటు పలువురిపై లాఠీలు ఝుళిపించి అరెస్టులు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. వారం రోజుల్లో విద్యార్థులకు న్యాయం చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈసీ శేఖర్‌గౌడ్, మంఖాల దాసు, ఆకుల ఆనంద్‌కుమార్, రవీందర్‌రెడ్డి, తాళ్లపల్లి కృష్ణ, సుబ్బురి పాండు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ నేతల అరెస్టుల పర్వం
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో విధ్వంసం, పోలీసు కాల్పుల్లో ఒకరు మృతి చెందిన నేపథ్యంలో శనివారమంతా కాంగ్రెస్ నేతల అరెస్టుల పర్వం కొనసాగింది. శనివారం ఉదయం టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డిని పోలీసులు తొలుత అదుపులోనికి తీసుకున్నారు. సికింద్రాబాద్ పోలీసు కాల్పుల్లో చనిపోయిన రాకేశ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వరంగల్ బయలుదేరిన ఆయన్ను ఘట్కేసర్లో పోలీసులు అడ్డుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గంలో తనను అరెస్టు చేయడమేంటని, వరంగల్ ఎందుకు వెళ్లకూడదో చెప్పాలని పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. పలువురు నేతలు ఘట్కేసర్కు చేరుకుని రేవంత్‌కు సంఘీభావం ప్రకటించారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను నగరంలోని పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని గోల్కొండ పీఎస్‌కు తరలించారు. దీంతో వెంకట్‌ను విడుదల చేయాలంటూ పీఎస్‌కు వెళ్లిన జగ్గారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని వరంగల్‌లో రాకేశ్ అంత్యక్రియలు పూర్తయ్యాక వదిలివేస్తామని చెప్పారు. సికింద్రాబాద్ ఘటనలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించేందుకు వెళుతున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, యూత్ కాంగ్రెస్ నేతలు అనిల్‌కుమార్ యాదవ్, శివసేనారెడ్డిలను కూడా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. కాగా, రేవంత్‌రెడ్డి శనివారం సాయంత్రం ఘట్కేసర్ పీఎస్ నుంచి నేరుగా గాంధీ ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. గోల్కొండ పీఎస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నందునే ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌పై పోలీసులు ఫోకస్ చేశారని మండిపడ్డారు.అరెస్టులు కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాదని, కేసుల సంఖ్య పెరిగే కొద్దీ కేడర్ ఇంకా ఉత్సాహంగా పనిచేస్తుందని జగ్గారెడ్డి చెప్పారు. చావులపై టీఆర్ఎస్ రాజకీయం: రేవంత్ ఘట్కేసర్: చావులను కూడా టీఆర్ఎస్ రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని రేవంత్ మండిపడ్డారు. రాకేశ్‌ను టీఆర్ఎస్ చంపిందని, బీజేపీ చంపించిందని ఆయన ఆరోపించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన నిరసనలో మృతి చెందిన రాకేశ్ కుంటుంబ సభ్యులను పరామర్శించడానికి వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం డబ్బీర్పేటకు బయలుదేరిన రేవంత్‌రెడ్డిని ఘట్‌కేసర ఓఆర్ఆర్ టోల్‌ప్లాజా వద్ద పోలీసులు అరెస్ట్ చేసి ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం విడుదలైన అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఎంపీగా తన నియోజకవర్గంలో తిరిగే హక్కులేదా అని ప్రశ్నించారు. 70 ఏళ్లుగా ఆర్మీ జవాన్ల నియామకాలు నిబంధనల మేరకు జరిగాయని, మోదీకి పోయేకాలం రావడంతో కేవలం నాలుగు ఏళ్లు సైన్యంలో పనిచేసే అవకాశం కల్పించారని అన్నారు. నాలుగేళ్ల అనంతరం ఆర్మీ శిక్షణ పొందిన యువతకు ఎక్కడా ఉద్యోగం లభించకపోతే నక్సలైట్లలో కలవాలా అన్ని ప్రశ్నించారు. రాకేశ్ శవయాత్రను టీఆర్ఎస్ పార్టీ జెండాలతో ర్యాలీగా నిర్వహించవచ్చు కాని టీపీసీసీ అధ్యక్షుడిగా తాను వెళతానంటే అడ్డంకులు çసృష్టిస్తారా అని ప్రశ్నించారు. కాగా, రేవంత్‌రెడ్డిని కలవడానికి ఘట్కేసర్ పోలీసుస్టేషన్‌కు వచ్చిన మాజీ ఎమ్మెల్యే, వరంగల్ వె‹స్ట్ నియోజవర్గ ఇన్చార్జి కొండా సురేఖను పోలీసులు అడ్డుకున్నారు. రేవంత్‌రెడ్డి ఉన్న గదిలోకి వెళ్లకుండా డోర్ మూసివేశారు. డోర్ తీయని పక్షంలో తన దగ్గర ఉన్న సర్జికల్ బ్లేడుతో చేయి కోసుకుంటానని ఆమె బెదిరించింది. మహిళాపోలీసులు అక్కడి నుంచి ఆమెను దూరంగా తీసుకుపోయే ప్రయత్నం చేశారు. -
చదువు చెప్పే గురువులేరి?
నిర్మల్/బాసర: ‘మాకు పురుగులతో కూడిన అన్నం పెట్టినా తింటాం..కానీ..చదువు చెప్పేందుకు అధ్యాపకులు లేకపోతే ఎలా? ఓ వైపు విద్యార్థుల సంఖ్యను పెంచిన ప్రభుత్వం.. అదే లెక్కన అధ్యాపకుల సంఖ్యను ఎందుకు పెంచడం లేదు? మా వర్సిటీకి రెగ్యులర్ వీసీ.. అది కూడా క్యాంపస్‌లోనే ఉండాల్సిన అవసరం లేదా? ప్రఖ్యాత క్యాంపస్‌లతో వర్సిటీని ఎప్పుడు అనుసంధానిస్తారు? ఇలాంటివి.. ఎన్నో సమస్యలున్నాయ్. వీటిపై మంత్రులు, ఇన్చార్జి వీసీ, కలెక్టర్లతో సహా అధికార, ప్రతిపక్ష నేతలందరినీ కలిశాం. ఇప్పటివరకు ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. తొమ్మిది వేల మంది వరకు ఉండే వర్సిటీ ఎవరికీ పట్టడం లేదు. అందుకే ఆందోళన చేపట్టాం..’అని నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వెల్లడించారు. మూకుమ్మడి నిరసన మంగళవారం ఉదయం విద్యార్థులంతా ఒక్కసారిగా నిరసనకు దిగారు. క్యాంపస్‌లోని పరిపాలన భవనం ఎదుట ఎండలో బైఠాయించి, రోజంతా ఆందోళన కొనసాగించారు. తొమ్మిది వేలమంది ఉండే వర్సిటీలో వేలమంది విద్యార్థులు ఆందోళనకు దిగడంతో ప్రాంగణమంతా వారి నినాదాలతో మార్మోగింది. అయితే విద్యార్థులను బయటకు రాకుండా.. వారి గోడును బయట ఉన్న తల్లి దండ్రులు, ప్రతిపక్ష పార్టీల నేతలు, మీడియాకు వినిపించనివ్వకుండా పోలీసులు మోహరించారు. ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ నిలిపివేశారు. దీంతో ఆర్జీయూకేటీలో ఏం జరుగుతోందో తెలియకుండా పోయింది. ఎట్టకేలకు కొంతమంది విద్యార్థులు ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్, సీఎంవోకు తమ గోడును, డిమాండ్లను తెలియజేశారు. అయినా ప్రభుత్వం ఇంతవరకు దీనిపై స్పందించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రవీణ్‌కుమార్ మద్దతు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారనే విషయం తెలియగానే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ట్విట్టర్లో స్పందించారు. సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న విద్యార్థుల పక్షాన నిలుస్తామన్నారు. నిర్మల్ జిల్లాకు చెందిన బీఎస్పీ నాయకులు వర్సిటీలోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. నేడూ కొనసాగనున్న ఆందోళన! గత కొన్నేళ్లుగా వర్సిటీలోకి మీడియాను అనుమతించడం లేదు. దీంతో వర్సిటీలో సమస్యలు, విద్యార్థుల పరిస్థితి, అవినీతి అక్రమాలూ.. ఏవీ బయటకు తెలియడం లేదు. వర్సిటీ ఇన్చార్జి వీసీగా రాహుల్ బొజ్జా ఉన్నా.. ఇన్నేళ్లలో కేవలం ఒక్కసారి అది కూడా సగం పూట మాత్రమే వర్సిటీకి వచ్చి వెళ్లారని విద్యార్థులు తెలిపారు. రాత్రి ఏడున్నర సమయంలో ఆందోళన విరమించిన విద్యార్థులు బుధవారం నిరసన కార్యక్రమం కొనసాగిస్తామని తెలిపారు. గోడదూకి వెళ్లిన బల్మూరి ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పోలీసుల కళ్లుగప్పి క్యాంపస్‌లోకి వెళ్లారు. వర్సిటీ వరకు సాధారణ యువకుడిలా బైక్‌పై వచ్చి, రెండోగేట్ వద్ద గోడ ఎక్కి లోపలికి దూకారు. విద్యార్థుల వద్దకు వెంకట్ చేరుకున్న విషయం తెలియగానే పోలీసులు వెళ్లి అరెస్టు చేసి, ముధోల్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. విద్యార్థుల డిమాండ్లివే.. ళీ సీఎం కేసీఆర్ వర్సిటీని సందర్శించాలి. ళీ రెగ్యులర్ వీసీని నియమించాలి. ఆయన క్యాం పస్‌లోనే ఉండాలి. ళీ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అధ్యాపకుల సంఖ్యను పెంచాలి. ళీ ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ ఆధారిత విద్యను అందించాలి. ళీ ఇతర వర్సిటీలు, సంస్థలతో వర్సిటీని అనుసంధానం చేయాలి. ళీ తరగతి, హాస్టల్ గదులకు మరమ్మతులు చేయాలి. ళీ ల్యాప్‌టాప్‌లు, యూనిఫామ్, మంచాలు, బెడ్లు అందించాలి. ళీ మెస్‌ల మెయింటెనెన్స్ మెరుగ్గా ఉండేలా చూడాలి. ళీ పీడీ, పీఈటీలను నియమించి క్రీడలనూ ప్రోత్సహించాలి. -
బల్మూరి వెంకట్ అరెస్టు
జమ్మికుంట/హుజూరాబాద్: మూగజీవాలను దొంగిలించి, రెండు వర్గాల మధ్య వైషమ్యాలు పెంచారన్న ఆరోపణలపై ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను కరీంనగర్ జిల్లా జమ్మి కుంట పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం కరీంనగర్ అదనపు డీసీపీ శ్రీనివాస్ జమ్మికుంట స్టేషన్ లో విలేకరులకు ఈ వివరాలు వెల్లడించారు. గురు వారం సీఎం కేసీఆర్ జన్మదినాన్ని అభాసుపాలు చేశారని జమ్మికుంట అర్బన్ టీఆర్ఎస్ పార్టీ అధ్య క్షుడు టంగుటూరి రాజ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకట్, మరో 10 మంది కలసి ఒక గాడిదను దొంగతనంగా కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీకి తరలించి దానికి కేసీఆర్ చిత్రపటాన్ని తగిలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం దాని కాలితో కేక్ కోయించి బలవంతం గా గాడిదకు తినిపించారని ఆరోపించారు. సీఎంను అవమానించడంతోపాటు కాంగ్రెస్–టీఆర్ఎస్ పార్టీల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యవహరించిన బల్మూరి వెంకట్‌పై చర్యలు తీసుకోవాలని గురువారం రాత్రి జమ్మికుంట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అర్ధరాత్రి దాటాక వెంకట్‌ను హుజూరాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్దకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంకట్‌తోపాటు గుర్తుతెలియని పది మందిపై కేసు నమోదు చేశామని, వెంకట్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని డీసీపీ తెలిపారు. అరెస్టులతో మా పోరాటం ఆపలేరు..: కాంగ్రెస్ నేతలను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేస్తోందని, ఇలాంటి చర్యలతో తమ పోరాటం ఆగ దని బల్మూరి వెంకట్ అన్నారు. శుక్రవారం ఆయనను పోలీసులు కోర్టులో హాజరుపరచగా.. బెయిల్ మంజూరు చేసింది. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రజల బాధలు ప్రభుత్వానికి అర్థం కావడానికి నిరసన తెలిపితే, తాను గాడిదను చోరీ చేశానని తప్పుడు కేసు బనాయించారని తెలిపారు. నిరుద్యోగంపై పోరాడితే అరెస్టా?: రేవంత్ సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ సమస్యలపై పోరాటం చేస్తున్న ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను ఎలాంటి నోటీసులు లేకుండా అర్థరాత్రి అరెస్టు చేయడం దుర్మార్గమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ హక్కులను కాలరాస్తూ పోలీసులు కాంగ్రెస్ నాయకులపై దౌర్జన్యంగా వ్యహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేసి వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
Huzurabad Bypoll: ఈవీఎం గల్లంతవలేదు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ ఉపఎన్నికకు సంబంధించి ఈవీఎం గల్లంతవలేదని రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో రవీందర్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం రాత్రి ఓ ఈవీఎంను అక్రమంగా తరలించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం కావడం, ఈవీఎంలు భద్రపరిచిన ఎస్ఆర్ ఆర్ కళాశాల వద్ద వీవీప్యాట్ యంత్రాన్ని బస్సు నుంచి కారులోకి మారుస్తున్న వీడియో వైరల్ అయిన నేపథ్యంలో ఈ అంశంపై ఆయన వివరణ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన వీడియో తప్పుడు అర్థం వచ్చేలా ప్రచారం జరిగిందన్నారు. వాస్తవానికి అది ఈవీఎం కాదని, వీవీప్యాట్ యంత్రమని పేర్కొన్నారు. పోలింగ్ స్టేషన్–200లో మాక్ పోలిం గ్ సమయంలో ఒక వీవీ ప్యాట్ యంత్రం పనిచేయలేదని, అందుకే రిజర్వ్‌లో ఉన్న మరో యంత్రాన్ని వినియోగించామని తెలిపారు. మొరాయించిన యంత్రాన్ని బస్సులో బందోబస్తు మధ్య కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాలకు తరలించామన్నారు. అయితే అప్పటికే అక్కడ 150 బస్సులు పార్కు చే యడంతో స్థలాభావం వల్ల కాలేజీ ఆవరణకు ముం దే ఆ బస్సును నిలిపివేశారని తెలిపారు. సెక్టోరియ ల్ అధికారి సూచనల మేరకు ఆయన డ్రైవర్ వీవీప్యాట్ యంత్రాన్ని బస్సులోంచి కారులోకి మార్చా రని రవీందర్‌రెడ్డి వివరించారు. దీన్ని గుర్తుతెలి యని వ్యక్తులు వీడియో తీసి సామాజిక మాధ్యమా ల్లో తప్పుగా ప్రచారం చేశారన్నారు. అయినప్పటికీ దీనిపై విచారణ జరుపుతున్నామని, ఒకవేళ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జమ్మికుంటలో ఈవీఎంలు తరలిస్తున్న బస్సు విషయంలోనూ వదం తులు వచ్చాయని విలేకరులు ప్రశ్నించగా బస్సు టైరు పంక్చర్ అయితే దాన్ని మార్చారే తప్ప ఈవీఎంలను మార్చలేదని రవీందర్‌రెడ్డి వివరించారు. రికార్డు స్థాయిలో పోలింగ్.. 135 కేసులు నమోదు.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో 86.64% పోలింగ్ నమోదైందని ఆర్డీవో రవీందర్‌రెడ్డి ప్రకటించారు. మొత్తం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద 135 కేసులు నమోదయ్యాయన్నారు. ఈ కేసుల్లో నిందితులంతా విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టంచేశారు. అయితే ఇందులో రాజకీయ నాయకులు, ఓటర్లు ఎందరో చెప్పేందుకు మాత్రం ఆయన నిరాకరించారు. ఎస్ఆర్ఆర్ కాలేజీ వద్ద విపక్షాల ధర్నా.. ఎస్ఆర్ఆర్ కాలేజీ వద్ద భద్రపరిచిన ఈవీఎంలను అధికారులు మార్చారని ఆరోపిస్తూ శనివారం రాత్రి కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ అనుచరులతో కలసి కాలేజీ లోపలకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఏసీపీ తులా శ్రీనివాసరావు.. బల్మూరి వెంకట్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈవీఎంను కారులో ఎలా తరలిస్తారంటూ వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఏసీపీ తుల శ్రీనివాసరావుతో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఈవీఎంల తరలింపులో అక్రమాలు జరిగాయని, ఓడిపోతామన్న భయంతోనే అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ బీజేపీ నేత, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ ఆధ్వర్వంలో బీజేపీ కార్యకర్తలు ఎస్ఆర్ఆర్ కాలేజీ ఎదుట బైఠాయించారు. ఇదే విషయమై ఆదివారం కూడా నిరసనలు కొనసాగాయి. నియోజకవర్గంలోని జమ్మికుంట, వీణవంక మండలాలు, కరీంనగర్ పట్టణంలోనూ బీజేపీ జిల్లా నాయకులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. -
Huzurabad Bypoll: ఓటెత్తిన హుజూరాబాద్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠను, ఆసక్తిని రేకెత్తించిన హుజూరాబాద్ ఉపఎన్నిక అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఓటు వేసేందుకు ప్రజలు పోటెత్తడంతో రికార్డు స్థాయిలో 86.33% పోలింగ్ నమోదైంది. 2018 ఎన్నికల్లో 82.19% పోలింగ్ నమోదు కావడం గమనార్హం. అధికార టీఆర్ఎస్ సహా అన్ని పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈటల రాజేందర్ (బీజేపీ), గెల్లు శ్రీనివాస్‌యాదవ్ (టీఆర్ఎస్), బల్మూరి వెంకట్ (కాంగ్రెస్)లు ప్రధాన పార్టీల తరఫున బరిలో నిలిచిన విషయం తెలిసిందే. గతంలో పలుమార్లు టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి వరుస విజయాలు సాధించిన ఈటల, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈసారి బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగడంతో ఈ ఉప ఎన్నికకు ప్రాధాన్యత చేకూరింది. 12 గంటల పోలింగ్ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న ఓటర్లు భారీ సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నానికే 45% దాటిన పోలింగ్ నియోజకవర్గంలోని ఇల్లందకుంట, జమ్మికుంట, వీణవంక, హుజూరాబాద్, కమలాపూర్‌లలో ఉదయం 7 గంటలకే ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు చేరుకోవడం ప్రారంభమైంది. జమ్మికుంట మున్సిపాలిటీ, హుజూరాబాద్ మున్సిపాలిటీలో ఉదయం 9 తరువాత పోలింగ్ ఊపందుకుంది. ఉదయం 7 నుంచి 9 గంటల సమయంలో 10.61 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం పూట వృద్ధులు, వికలాంగులు ఎక్కువగా ఓట్లు వేసేందుకు వచ్చారు. పోలింగ్ సమయం రాత్రి 7 గంటల వరకు ఉన్నా.. మధ్యాహ్నం లోగానే ఓటు వేసేందుకు స్థానికులు ఆసక్తి చూపించారు. మధ్యాహ్నం ఒంటిగంటకే పోలింగ్ 45 శాతం దాటడం అధికారులను ఆశ్చర్యపరిచింది. రైతులు, ఇతర వ్యవసాయ పనులు, ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునేవారు, ఇతర ప్రాంతాల్లో సెటిలైనవారు మాత్రం సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల సమయంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటలకే చీకటి పడినా.. అధికారులు ముందస్తుగా చేపట్టిన చర్యల కారణంగా అంతా ఇబ్బందుల్లేకుండా ఓట్లేశారు. చివరి గంటలో కరోనా పాజిటివ్ రోగులు ఓటేసేందుకు అనుమతించారు. సాయంత్రానికి 76.26 శాతానికి చేరుకున్న పోలింగ్ పర్సంటేజీ, చివరగా పోలింగ్ ముగిసేసరికి గతంలో ఎన్నడూ లేనివిధంగా 86.33 శాతానికి చేరింది. మూడంచెల భద్రతలో ఈవీఎంలు గతంలో పోలింగ్ సాయంత్రం 5 గంటలకే ముగిసేది. కానీ కరోనా నిబంధనలతో రెండు గంటలు అదనంగా సమయం ఇచ్చారు. అయినా మండలాల్లోని చాలా ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటలకే పోలింగ్ ముగిసింది. అలాంటి కేంద్రాల్లో 7 గంటల తరువాత ఈవీఎంలను సీజ్ చేసి కరీంనగర్‌కు తరలించారు. ఇల్లందకుంట, జమ్మికుంట, వీణవంక వంటి కొన్ని పోలింగ్స్టేషన్లలో ఓటర్లు సాయంత్రం కూడా బారులు తీరారు. రాత్రి ఏడు గంటల లోపు క్యూలో ఉన్నవారిని అధికారులు ఓటు వేసేందుకు అనుమతించారు. ఈవీఎంలన్నీ కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కళాశాలకు తరలించి కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. నవంబర్ 2వ తేదీన కౌంటింగ్ జరగనుంది. అదేరోజు అభ్యర్థుల భవితవ్యంపై ప్రజా తీర్పు వెలువడనుంది. భారీ బందోబస్తు నియోజకవర్గంలో మొత్తం 305 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అందులో 172 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు, 73 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఇందుకు అనుగుణంగా దాదాపు 1,800 మంది (90 కంపెనీలు) కేంద్ర బలగాలు, 2,000 మందికి పైగా స్థానిక పోలీసులు కలిపి మొత్తం సుమారు 4,000 మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడక్కడా చిన్నచిన్న గొడవలు నియోజకవర్గంలో పలుచోట్ల చిన్నచిన్న ఘటనలు చోటు చేసుకున్నాయి. ఉదయం టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్‌రెడ్డి వీణవంక పోలింగ్ కేంద్రంలో పర్యటించిన సమయంలో బీజేపీ నేతలు ఘర్షణకు దిగారు. మరోవైపు నియోజకవర్గంలోని ఐదు మండలాలు, రెండు మున్సిపాలిటీల్లో ఓటర్లకు డబ్బుల పంపిణీపై బీజేపీ, టీఆర్ఎస్ నేతలు పరస్పరం ఆరోపణలకు దిగారు. మరికొన్ని చోట్ల రెండుపార్టీల నేతలు బాహాబాహీకి దిగారు. ► జమ్మికుంట పట్టణంలోని ఎంప్లాయిస్ కాలనీలో అధికార పార్టీ వారు డబ్బులు పంచుతున్నారని బీజెపీ నేతలు ధర్నాకు దిగారు. ► జమ్మికుంట మండలంలోని శాయంపేట గ్రామంలో అధికార పార్టీ తరఫున ఓ మీడియా ప్రతినిధి డబ్బులు పంచుతుండగా స్థానికులు పట్టుకున్నారు. ► హుజూరాబాద్‌లోని రెండు వార్డుల్లో డబ్బులు పంపిణీ చేసిన ఓ పార్టీకి చెందిన స్థానికేతర నేతలను స్థానికులు అడ్డుకోవడం గొడవకు దారితీసింది. ► ఇల్లందకుంట మండలం సిరిసేడు, శ్రీరాములుపల్లిలో డబ్బులు పంచుతున్నారంటూ గొడవలు జరిగాయి. ► తమ డబ్బులు ఇవ్వలేదంటూ వీణవంక మండలం గంగారం, ఇల్లందకుంట మండలం టేకుర్తి గ్రామాల్లో ఓటర్లు నిరసన వ్యక్తం చేశారు. ► మధ్యాహ్నం వరకు స్థానికులు, ఆ తరువాత ఇతర ప్రాంతాల్లో నివసించేవారు అధికంగా పోలింగ్‌లో పాల్గొన్నారు. ఇదే సమయంలో తమకు అనుకూలంగా ఉండే వర్గాలన్నీ అకస్మాత్తుగా మరో పార్టీకి ఓటేశాయనే ప్రచారం ప్రధాన పార్టీల్లో జరిగింది. దీంతో ఎవరి ఓట్లు ఏ పార్టీకి పడ్డాయో తెలియని అయోమయం నెలకొంది. ఎగ్జిట్ పోల్ సర్వేలు దాదాపు ప్రతి పోలింగ్‌స్టేషన్ వద్ద పలు సంస్థలు ఎగ్జిట్ పోల్ సర్వేలు నిర్వహించాయి. ఓటర్ల నాడిని తెలుసుకునే ప్రయత్నం చేశాయి. కానీ చాలామంది తీర్పును వెల్లడించేందుకు నిరాకరించారు. దీంతో ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపారు అన్న విషయంలో అన్ని పార్లీల్లోనూ ఉత్కంఠ నెలకొంది. మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం, రాజకీయ పార్టీలు ఊపిరి పీల్చుకున్నాయి. -
మోదీ, కేసీఆర్ పాలనకు బుద్ధి చెప్పండి: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని నరేంద్ర మోదీ, రాష్ట్రంలోని కేసీఆర్‌ల అప్రజాస్వామిక పాలనకు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు బుద్ధిచెప్పాలని మాజీమంత్రి పొన్నాల లక్ష్మ య్య పిలుపునిచ్చారు. త్వరలో జరగబోయే ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడేళ్ల పాలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారని, దేశంలోని రైతాంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెట్టిన ఘనత బీజేపీకే దక్కుతుందని ఆయన అన్నారు. ఇలాంటి ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తోన్న బీజేపీ ప్రభుత్వానికి లోపాయికారీగా కేసీఆర్ మద్దతునిస్తున్నారని, అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్లకు బుద్ధి చెప్పేందుకు హుజూరాబాద్ ఉప ఎన్నికలను సద్వినియోగం చేసుకోవాలని పొన్నాల కోరారు. -
టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే: బల్మూరి
కమలాపూర్: టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండూ ఒక్కటేనని, వారి వ్యక్తిగత లాభాల కోసం ఎన్నికలు తీసు కొచ్చాయని హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట నర్సింగరావు ఆరోపించారు. శనివారం హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను విద్యార్థులు, యువకుల కోసం చేసిన పోరాటం చూసి కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశం ఇచ్చిందన్నారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని గళమెత్తి వినిపించడానికి, ఇక్కడున్న 36 వేలమంది నిరుద్యోగులు, ఫీజు రీయింబర్స్మెంట్ రాక చదువు ఆపేసిన 20 వేల మంది విద్యార్థుల ప్రతినిధిగా పార్టీ తనను అభ్యర్థిగా ఎంపిక చేసిందన్నారు. -
Huzurabad Bypoll: 61 మంది.. 92 నామినేషన్లు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో కీలకమైన నామినేషన్ల పర్వం ముగిసింది. శుక్రవారం చివరిరోజున భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఈటల రాజేందర్, ఈటల జమున (బీజేపీ), గెల్లు శ్రీనివాస్ యాదవ్ (టీఆర్ఎస్), బల్మూరి వెంకట్ (కాంగ్రెస్) మరోసారి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా పోలీసులు హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు మొత్తం 61 మంది అభ్యర్థులు 92 నామినేషన్లు దాఖలు చేసినట్టు అధికారులు ప్రకటించారు. ఇందులో బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు మినహా మిగతా వారంతా గుర్తింపు లేని పార్టీలు, స్వతంత్రు లే కావడం గమనార్హం. కొనసాగిన ఫీల్డ్ అసిస్టెంట్ల నిరసన..! పెద్ద సంఖ్యలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు శుక్రవారం ఉదయం 10 గంటలకే ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. సీఎం కేసీఆర్‌కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు పలుమార్లు సూచించారు. నామినేషన్ వేయాలనుకుంటే ఆఫీసు లోపలికి వెళ్లాలని, అంతేతప్ప నిబంధనలను ఉల్లంఘించొద్దని కోరారు. అయినా ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళన కొనసాగించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్, మంత్రి హరీశ్‌రావు వచ్చిన సమయంలో.. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ డౌన్‌డౌన్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ప్రభుత్వం తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారి వాహనాలకు అడ్డుగా వెళ్లారు. పోలీసులు కలగజేసుకుని ఫీల్డ్ అసిస్టెంట్లను పక్కకు తప్పించారు. బరిలో 12 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు హుజూరాబాద్ ఉప ఎన్నికలో 12 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు బరిలో ఉన్నారని ఫీల్డ్ అసిస్టెంట్ల జేఏసీ చైర్మన్ శ్యామలయ్య తెలిపారు. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ నుంచి తప్పుకోబోరని చెప్పారు. జిల్లాల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్లు అంతా వచ్చి ప్రచారం చేస్తారని వెల్లడించారు. ఈసారీ గెలుపు ఈటలదే..: జమున మరోసారి నామినేషన్ వేసిన ఈటల రాజేందర్ భార్య జమున మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికలో విజయం రాజేందర్‌దేనని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులని, ఇంతకాలం తమను ఆదరించారని, ఇప్పుడూ గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. నియోజకవర్గంలో ఈటల రాజేందర్ చేసిన అభివృద్ధి పనులే ఆయన్ను గెలిపిస్తాయన్నారు. నామినేషన్ దాఖలు చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్. చిత్రంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్ తాను ప్రతిసారీ ఈటలకు డమ్మీగా నామినేషన్ వేస్తుంటానని, ఈసారీ అలాగే వేశానని చెప్పారు. కాగా.. ఈటల రాజేందర్ సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు మరోసారి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన వెంట కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు ఉన్నారు. నిరుద్యోగుల గళమవుతా: బల్మూరి వెంకట్ తనకు హుజూరాబాద్ నుంచి పోటీ చేసే అవకాశమిచ్చిన రాహుల్, సోనియాగాంధీలకు కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ కృతజ్ఞతలు తెలిపారు. సీనియర్ నేతలు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, కవ్వంపల్లి సత్యనారాయణలతో కలిసి నామినేషన్ వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగుల తరఫున తాను పోరాడుతున్నానని.. విద్యార్థులు–నిరు ద్యోగుల గళంగా నిలుస్తానని వెంకట్ చెప్పారు. రైతుల ఉసురు తీసే బీజేపీకి ఎందుకు ఓటేయాలి: హరీశ్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, పాడి కౌశిక్‌రెడ్డిలతో హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయానికి వచ్చిన మంత్రి హరీశ్‌రావు.. నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈటల రాజేందర్ వ్యక్తిగత స్వార్థంతోనే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారని హరీశ్ ఆరోపించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 70 శాతం వ్యవసాయాధారిత కుటుంబాలే అని.. రైతుల సంక్షేమం ఏమాత్రం పట్టని బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. నామినేషన్ దాఖలు చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్. చిత్రంలో మంత్రి హరీశ్‌రావు, కౌశిక్‌రెడ్డి రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయ, ఆసరా పింఛన్లు, ఎరువులు, విత్తనాలు, మార్కెటింగ్ సదుపాయాలు, కాళేశ్వరం ప్రాజెక్టు వంటి ఎన్నో చేపట్టామన్నారు. ‘‘బీజేపీకి రైతులు ఎందుకు ఓటేయాలో ఒక్క కారణమైనా చెప్పగలరా? యూపీలో రైతులను నడిరోడ్డుపై వాహనాలతో తొక్కించినందుకు వేయాలా? రైతులను లాఠీలతో చితకబాదినందుకు వేయాలా? రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చినందుకు వేయా లా? ప్రభుత్వ రంగం సంస్థలను కార్పొరేట్లకు అమ్ముకుంటున్నందుకు వేయాలా? బీసీ, ఎస్సీ–ఎస్టీల రిజర్వేషన్ల ఎత్తివేతకు కుట్ర పన్నుతున్నందుకా?’’అని హరీశ్ ప్రశ్నించారు. వంట గ్యాస్ ధర రూ.1,000కి చేరిందని.. పెట్రోల్, డీజిల్ ధరల ను అడ్డగోలుగా పెంచేశారని మండిపడ్డారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. -
ఈటల, వెంకట్ తరఫున నామినేషన్లు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ యాదగిరిగుట్ట: హుజూరాబాద్ బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఈటల రాజేందర్, బల్మూరి వెంకట్ల తరఫున గురువారం నామినేషన్లు దాఖలయ్యాయి. వెంకట్ తరఫున హుజూరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొల్లూరి కిరణ్‌కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఆ పత్రాల్లో తనతో పాటు తల్లి ఆస్తుల వివరాలు కూడా వెంకట్ పేర్కొన్నారు. ఇటీవల కాంగ్రెస్ నిర్వహించిన విద్యార్థి–నిరుద్యోగ జంగ్ సందర్భంగా వెంకట్ గాయపడిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో కలిసి వెంకట్ స్వయంగా నామినేషన్ వేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇలావుండగా వెంకట్ గురువారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. యాదాద్రీశుడి ఆశీస్సులతో హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయ ఢంకా మోగిస్తామని ఆయన ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. ఈటల తరఫున నామినేషన్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ పత్రాలను ఆయన సోదరుడు ఈటల భద్రయ్య దాఖలు చేశారు. ఈటల జమున నామినేషన్‌ను కంకణాల సుదర్శన్‌రెడ్డి దాఖలు చేశారు. కాగా శుక్రవారం ఈటల స్వయంగా మరోసారి నామినేషన్ దాఖలు చేయనున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు గురువారం ఒక్కరోజే అత్యధికంగా 11 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో మొత్తం నామినేషన్ల సంఖ్య 24కు చేరింది. -
హుజురాబాద్ ఉపఎన్నిక: సమరభేరిలో సకుటుంబం..
సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ ఉపపోరు క్రమంగా ఊపందుకుంటోంది. తొలుత గెల్లు శ్రీనివాస్ యాదవ్ (టీఆర్ఎస్), తరువాత బల్మూరి వెంకట్ (కాంగ్రెస్), తాజాగా ఈటల రాజేందర్ (బీజేపీ) ప్రధాన పార్టీల అభ్యర్థులుగా ఉపపోరు బరిలో దిగారు. ప్రధానపార్టీల నుంచి అభ్యర్థుల ఎంపిక ఖరారైంది. ఈలోపే అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పెట్టారు. మరికొందరు ఏకంగా అమలు చేసేస్తున్నారు. ఈ ముగ్గురు కూడా తమ ఇంటి మద్దతుతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వారి భార్యలు, తల్లులు మద్దతుగా ప్రచారంలోకి రానున్నారు. ఈటల రాజేందర్ రాజీనామా నుంచి ఇప్పటి దాకా ఆయన సతీమణి ఈటల జమున ఆయన వెంటే ఉన్నారు. ఒకదశలో ఈటలకు మోకాలి నొప్పి తీవ్రమైన సమయంలో ఆయనకు వీలుకాని పక్షంలో తానే రంగంలోకి దిగాలనుకున్నారు. చదవండి: హుజురాబాద్ ఉపఎన్నిక: రెండో డోసు సర్టిఫికెట్ ఉంటేనే రండి! ఈలోపు రాజేందర్ కోలుకోవడంతో ఆయనకు మద్దతుగా జమున ప్రచారం ప్రారంభించారు. గెల్లు శ్రీనివాస్‌యాదవ్ అభ్యర్థిత్వం ఆగస్టులోనే ఖరారైంది. కొన్నిరోజులుగా ఆయన భార్య గెల్లు శ్వేత కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. తన భర్తను గెలిపించాలని ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఇక అందరి కంటే ఆఖరుగా కాంగ్రెస్ ప్రకటించిన బల్మూరి వెంకట్ తల్లి బల్మూరి పద్మ కూడా ప్రచారబరిలోకి త్వరలోనే రానున్నారు. ఉప ఎన్నిక సమరభేరికి వెళ్లే కుమారునికి ఓ తల్లి, తమ భర్తలకు భార్యలు వీరతిలకం దిద్దారు. ఎన్నికల ప్రచార పోరులోనూ భాగస్వాములవుతూ మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ముందుకు సాగుతున్నారు. చదవండి: హుజూరాబాద్ ఉప ఎన్నిక: ఉత్సాహవంతులకు ఊహించని దెబ్బ గెల్లు ఉద్యమం కొనసాగుతుంది 20 ఏళ్లుగా నా భర్త విద్యార్థి నాయకుడిగా తెలంగాణ కోసం పోరాడాడు. ఏనాడూ ఏ పదవీ ఆశించలేదు. పేదింటి ఉద్యమకారుడు, నిజాయితీగా పనిచేయడమే తెలుసు. అందుకే.. సీఎం ఇక్కడ పోటీ చేసే అవకాశం కల్పించారు. గతంలో రాష్ట్ర సాధన కోసం పోరాడిన నా భర్త, భవిష్యత్తులో కేసీఆర్ అండదండలతో నియోజకవర్గ అభివృద్ధికి అదే సంకల్పంతో పోరాటం చేస్తాడు. – గెల్లు శ్వేత యాదవ్ హుజూరాబాద్ ప్రజలు చైతన్యవంతులు హుజూరాబాద్ ప్రజలు చాలా చైతన్యవంతులు. డబ్బుకు అమ్ముడు పోయేవారు కాదు. దళిత కాలనీలలో రూ.10 లక్షలు కాదు ఉద్యోగం కావాలని అడుగుతున్నారు. ట్రాక్టర్లు, కార్లు ఇస్తే చదువుకున్న వాళ్లు వాటికి డ్రైవర్లుగా పనిచేయాలా అని నిలదీస్తున్నారు. హుజూరాబాద్‌కు వస్తున్న ప్రతీ పథకం ఈటల రాజేందర్ రాజీనామా వల్లనే. తమ్ముడు తమ్ముడు అని కేసీఆర్ తడిగుడ్డతో గొంతుకోశారు. అందుకే.. రాజేందర్‌ను గెలిపించాలి. – ఈటల జమునప్రభుత్వ వైఖరిని ఎండగడతా ఈనెల 8వ తేదీ నుంచి నేను ప్రచారంలో పాల్గొంటా. రాష్ట్రంలో ఉద్యోగాలు రాకుండా బాధ పడుతున్న అయోమయంలో పడేసింది. ప్రభుత్వ వైఖరిని ప్రతీ తల్లికి తండ్రికి తెలిసేలా అందరినీ ఏకం చేస్తూ ప్రచారంలో ముందుకు వెళతాం. నా బిడ్డ విజయానికి నా వంతుగా కృషి చేస్తా. – బల్మూరి పద్మ