సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. రెండు స్థానాల కోసం ఇద్దరు అభ్యర్థులు(కాంగ్రెస్) నుంచి మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. ఇక, ఎవరూ నామినేషన్లు వేయకపోవడంతో బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్‌లు వేశారు. నామినేషన్ దాఖలుకు నేడు ఆఖరి రోజు కావడంతో కాంగ్రెస్ అభ్యర్థులు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్‌లు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇదిలా ఉండగా.. ప్రతిపక్షాల నుంచి ఎవరూ నామినేషన్ వేయలేదు. దీంతో, వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
మరోవైపు.. రేపు నామినేషన్ల పరిశీలన కొనసాగనుంది. ఈనెల 22వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉంది. అదే రోజున మధ్యాహ్నం మూడు గంటలకు అభ్యర్థుల ఎన్నికపై ప్రకటన వెలువడనుంది.
కాంగ్రెస్ అభ్యర్థుల బయోడేటా
1. పేరు : బల్మూరి వెంకట్/బల్మూరి వెంకట నర్సింగరావు
తండ్రి: మదన్‌మోహన్‌రావు
పుట్టిన తేదీ : నవంబర్ 2, 1992
విద్యార్హత: ఎంబీబీఎస్
పుట్టిన ఊరు: తారుపల్లి, కాల్వ శ్రీరాంపూర్, పెద్దపల్లి జిల్లా
కులం: ఓసీ (వెలమ)
2. పేరు: బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్
తండ్రి: బి.గంగాధర్ గౌడ్
పుట్టిన తేదీ: ఫిబ్రవరి 24, 1966
విద్యార్హత: బీకామ్
పుట్టిన ఊరు: రహత్‌నగర్, భీంగల్ మండలం, నిజామాబాద్ జిల్లా
కులం: బీసీ (గౌడ)
Comments
Please login to add a commentAdd a comment