‘గురునానక్‌’ వద్ద పహారా | - | Sakshi
Sakshi News home page

‘గురునానక్‌’ వద్ద పహారా

Published Sat, Jun 24 2023 7:00 AM | Last Updated on Sat, Jun 24 2023 1:45 PM

గురునానక్‌ కళాశాల వద్ద రక్షణగా ఉన్న పోలీసులు   - Sakshi

గురునానక్‌ కళాశాల వద్ద రక్షణగా ఉన్న పోలీసులు

ఇబ్రహీంపట్నం: గురునానక్‌ ఇంజనీరింగ్‌ కళాశాల వద్ద శుక్రవారం పోలీసులు పహారా కాస్తున్నారు. యూనివర్సిటీ పేరుతో మోసం చేశారని గురువారం కళాశాల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి నేతలు ఆందోళన చేయడం..ఉద్రిక్త పరిస్థితులు నెలకొని లాఠీచార్జి వరకు వెళ్లడం, అరెస్టులు చేయడం తెలిసిందే.ఈ నేపథ్యంలో మళ్లీ ఏమైన ఆందోళన కా ర్యక్రమాలు చోటు చేసుకుంటాయోనన్న ఉద్దేశంతో పోలీసు బలగాలను మోహరించారు.మరోవైపు యాజమాన్యం బౌన్సర్లను పెట్టుకోవడం గమనార్హం.

అండగా ఉంటాం
ఇబ్రహీంపట్నం:
యూనివర్సిటీ పేరుతో మోసానికి గురైన విద్యార్థులు, పేరెంట్స్‌కు అండగా ఉంటామని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ అన్నారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్‌ కళాశాల వద్ద గురువారం జరిగిన ఆందోళనలో అరైస్టె బెయిల్‌పై విడుదలైన ఆయన స్థానిక డాగ్‌ బంగ్లా వద్ద మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డితో కలిసి శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యూనివర్సిటీ పేరుతో విద్యార్థులను కళాశాలలో చేర్చుకొని తీరా అనుమతి రాలేదంటూ మోసం చేసిన యాజమాన్యాన్ని 60 రోజులుగా ప్రశ్నిస్తున్నా, పోలీసులకు ఫిర్యాదులు చేసిన పట్టించుకోలేదన్నారు. మంత్రులు కేటీఆర్‌, సబితారెడ్డి విద్యార్థుల భవిష్యత్తుపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామన్నారు.

విద్యార్థుల జీవితాలతో చెలగాటం
ఇబ్రహీంపట్నం:
యూనివర్సిటీ పేరుతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న గురునానక్‌ ఇంజనీరింగ్‌ కళాశాల యాజమాన్యాన్ని అరెస్టు చేయాల ని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం గురునానక్‌ కళాశాలను సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తప్పు చేసిన యాజమాన్యాన్ని వదలిపెట్టి కన్నబిడ్డల భవిష్యత్తు కోసం ఆందోళనకు దిగిన తల్లిదండ్రులపై వారికి మద్దతుగా వచ్చిన ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌తోపాటు పలువురిపై లాఠీలు ఝుళిపించి అరెస్టులు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. వారం రోజుల్లో విద్యార్థులకు న్యాయం చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఈసీ శేఖర్‌గౌడ్‌, మంఖాల దాసు, ఆకుల ఆనంద్‌కుమార్‌, రవీందర్‌రెడ్డి, తాళ్లపల్లి కృష్ణ, సుబ్బురి పాండు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement