gurunanak engineering college
-
‘గురునానక్’ వద్ద పహారా
ఇబ్రహీంపట్నం: గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద శుక్రవారం పోలీసులు పహారా కాస్తున్నారు. యూనివర్సిటీ పేరుతో మోసం చేశారని గురువారం కళాశాల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి నేతలు ఆందోళన చేయడం..ఉద్రిక్త పరిస్థితులు నెలకొని లాఠీచార్జి వరకు వెళ్లడం, అరెస్టులు చేయడం తెలిసిందే.ఈ నేపథ్యంలో మళ్లీ ఏమైన ఆందోళన కా ర్యక్రమాలు చోటు చేసుకుంటాయోనన్న ఉద్దేశంతో పోలీసు బలగాలను మోహరించారు.మరోవైపు యాజమాన్యం బౌన్సర్లను పెట్టుకోవడం గమనార్హం. అండగా ఉంటాం ఇబ్రహీంపట్నం: యూనివర్సిటీ పేరుతో మోసానికి గురైన విద్యార్థులు, పేరెంట్స్‌కు అండగా ఉంటామని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ అన్నారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ కళాశాల వద్ద గురువారం జరిగిన ఆందోళనలో అరైస్టె బెయిల్‌పై విడుదలైన ఆయన స్థానిక డాగ్ బంగ్లా వద్ద మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యూనివర్సిటీ పేరుతో విద్యార్థులను కళాశాలలో చేర్చుకొని తీరా అనుమతి రాలేదంటూ మోసం చేసిన యాజమాన్యాన్ని 60 రోజులుగా ప్రశ్నిస్తున్నా, పోలీసులకు ఫిర్యాదులు చేసిన పట్టించుకోలేదన్నారు. మంత్రులు కేటీఆర్, సబితారెడ్డి విద్యార్థుల భవిష్యత్తుపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఇబ్రహీంపట్నం: యూనివర్సిటీ పేరుతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాన్ని అరెస్టు చేయాల ని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం గురునానక్ కళాశాలను సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తప్పు చేసిన యాజమాన్యాన్ని వదలిపెట్టి కన్నబిడ్డల భవిష్యత్తు కోసం ఆందోళనకు దిగిన తల్లిదండ్రులపై వారికి మద్దతుగా వచ్చిన ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌తోపాటు పలువురిపై లాఠీలు ఝుళిపించి అరెస్టులు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. వారం రోజుల్లో విద్యార్థులకు న్యాయం చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈసీ శేఖర్‌గౌడ్, మంఖాల దాసు, ఆకుల ఆనంద్‌కుమార్, రవీందర్‌రెడ్డి, తాళ్లపల్లి కృష్ణ, సుబ్బురి పాండు పాల్గొన్నారు. -
గురునానక్ ఇంజినీరింగ్ కళాశాల వద్ద బీజేవైఎం ధర్నా
-
గురునానక్ కాలేజీలో విద్యార్ధి ఆత్మహత్యా యత్నం
-
Sakshi Premier League 2022: రెండో రోజు నాలుగు మ్యాచ్‌లు.. విజేతలు వీరే
ఇబ్రహీంపట్నం/హైదరాబాద్: రెండోరోజు సాక్షి ప్రీమియర్ లీగ్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఆదివారం మొత్తం నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. ఔత్సాహిక క్రికెటర్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ‘సాక్షి మీడియా గ్రూప్’ ఆధ్వర్యంలో లీగ్ మ్యాచ్‌లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. శేరిగూడలోని శ్రీఇందు కాలేజీ వేదికగా కొనసాగుతున్న మ్యాచ్‌లకు ఆదివారం ఆయా విద్యాసంస్థల చైర్మన్ ఆర్. వెంకట్రావ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లోని క్రీడానైపుణ్యాన్ని వెలికితీసేందుకు సాక్షి మీడియా చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. ఈ అవకాశాన్ని యువత అందిపుచ్చుకొని ప్రతిభను చాటాలన్నారు. సాక్షి ప్రీమియర్ లీగ్‌కు రీఫ్రెష్మెంట్ డ్యూక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సుధాకర్ పీవీసీ సంస్థలు తెలంగాణ రీజియన్ స్పాన్సర్స్‌గా వ్యవహరిస్తున్నాయి. రెండోరోజు నాలుగు మ్యాచ్‌లు రెండోరోజు నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. మొదటి మ్యాచ్‌లో దిల్సుఖ్నగర్ అవంతి పీజీ కళాశాల, ఘట్కేసర్ వీబీఐటీ జట్లు పోటీపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అవంతి కళాశాల జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 67 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన వీబీఐటీ జట్టు 9 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసి విజయం సాధించింది. రెండో మ్యాచ్ శేరిగూడ శ్రీఇందు ఇన్స్టిట్యూట్, ఘట్కేసర్ శ్రీనిధి కళాశాల జట్లు పోటీ పడ్డాయి. శ్రీఇందు విద్యాసంస్థల చైర్మన్ వెంకట్రావ్ టాస్ వేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీఇందు జట్టు 10 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 85 పరుగులు సాధించింది. అనంతరం శ్రీనిధి కళాశాల జట్టు 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 42 పరుగులు మాత్రమే చేసింది. శ్రీఇందు జట్టులో శివ అత్యుత్తమంగా బ్యాటింగ్ చేసి 22 బాల్స్‌కు 41 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. శ్రీఇందు ఇన్స్టిట్యూట్ జట్టును విద్యాసంస్థల చైర్మన్ వెంకట్రావ్ అభినందించారు. మూడో మ్యాచ్‌లో హైదరాబాద్ ఓయూ జట్టు, ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల జట్టు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఓయూ జట్టు 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గురునానక్ జట్టు 7 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 56 పరుగులు సాధించి విజేతగా నిలిచింది. నాలుగో మ్యాచ్‌లో అల్వాల్ లయోలా డిగ్రీ కళాశాలతో సికింద్రాబాద్ వెస్లీ డిగ్రీ కళాశాల పోటీపడ్డాయి. టాస్ గెలిచిన లయోలా జట్టు వెస్లీ జట్టుకు బ్యాటింగ్ అప్పగించింది. 10 ఓవర్లల్లో 8 వికెట్ల నష్టానికి వెస్లీ జట్టు 50 పరుగులు చేసింది. అనంతరం లయోలా జట్టు 8.2 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు సాధించి విజయాన్ని దక్కించుకుంది. -
గురునానక్ విద్యాసంస్థలపై ఐటీ దాడులు
ఇబ్రహీంపట్నం: గురునానక్ విద్యాసంస్థలపై ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించి సోదాలు చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో ఉన్న గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్‌లోని కార్యాలయాల్లో గుట్టుచప్పుడు కాకుండా మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం ఉదయం వరకు సోదాలను చేశారు. ఐటీ దాడులు జరుగుతున్నట్లు సమాచారం రావడంతో మీడియా ప్రతినిధులు క్యాం పస్‌లోకి వెళ్లేందుకు కళాశాల సిబ్బంది, అధికారులు నిరాకరించారు. ఇబ్రహీంపట్నం లోని కళాశాలనే కాకుండా హైదరాబాద్ చైతన్యపురిలోని డెంటల్ కళాశాలపై ఏకకాలంలో దాడులు చేసినట్లు సమాచారం. అక్రమంగా డబ్బులు కూడబెట్టినట్లు సమా చారం రావడంతో అధికారులు ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. సుమారు 8 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కళాశాలలోని రికార్డులను అధికారులు పరిశీలించగా పలు లొసుగులున్నట్లు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. దీనిపై వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు మీడియా ప్రతినిధులు యత్నించినా యాజమాన్యం మాట్లాడేందుకు ముందుకు రాలేదు. గురునానక్ ఎడ్యు కేషన్ సొసైటీ పేరుతో విద్యాసంస్థలను నడిపిస్తూ.. దీని ద్వారా వచ్చిన డబ్బులను రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మళ్లించి అక్రమంగా డబ్బులను కూడబెట్టుకున్నట్లు సమాచారం అందడంతో ఐటీ అధికారులు దాడులు జరుపుతున్నట్లు తెలుస్తుంది. -
కంటిలోకి దూసుకొచ్చిన రాకెట్
సాక్షి, హైదరాబాద్: అందరితోపాటే దీపావళి వేడుకల్లో పాల్గొంటున్న ఆ విద్యార్థినిపైకి ఒక్కసారిగా రాకెట్ దూసుకొచ్చింది. కనుగుడ్డుకు తగలడంతో తీవ్రంగా గాయపడింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం సమీపంలోని గురునానక్ ఇంజనీరింగ్ విద్యా సంస్థ క్యాంపస్‌లో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. శంషాబాద్ మండలం చౌదరిగూడ గ్రామానికి చెందిన ఎం. స్వప్న కళాశాల క్యాంపస్‌లో ఉంటూ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. దీపావళి సందర్భంగా హాస్టల్లోని విద్యార్థులు బాణాసంచా కాలుస్తూ ఆనం దంగా క్యాంపస్ ఆవరణలో గడుపుతున్నారు. అనుకోకుండా ఓ రాకెట్ విద్యార్థినుల వైపు దూసుకొచ్చి స్వప్న కుడి కంటికి తాకింది. కనుగుడ్డుకు తగలడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. వెంటనే స్పందించిన కళాశాల సిబ్బంది స్వప్నను స్థానికంగా ప్రథమ చికిత్స చేయించి.. నగరంలోని సరోజినీదేవి ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని కంటికి ఆపరేషన్ చేసిన వైద్యులు చూపుపై హామీ ఇవ్వలేమని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే కావాలనే రాకెట్ విద్యార్థినుల వైపు కాల్చారని కొందరు అనుమానిస్తున్నారు. మరోవైపు యాజమాన్య నిర్లక్ష్యమే దీనికి కారణమని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సుమారు 700 మంది విద్యార్థులు దీపావళి వేడుకల్లో పాల్గొంటున్నప్పుడు సరైన చర్యలు తీసుకోలేదని విద్యార్థి సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. కనీసం బాణాసంచా కాల్చేటప్పుడైనా జాగ్రత్తలు పాటించలేదని అంటున్నారు. ఇదిలా ఉండగా దీపావళి వేడుకల్లో పాల్గొన్న తనవైపు రాకెట్ దూసుకొచ్చిందని, నేరుగా కన్నును తాకిందని స్వప్న పేర్కొంది. ఒక్కసారిగా కంటి నుంచి రక్తం దారలా కారి ఏమీ కనిపించలేదని వివరించింది. పండుగ వాతావరణం నెలకొల్పేందుకే.. కుటుంబ సభ్యులకు దూరంగా హాస్టల్లో వుంటూ చదువుకుంటున్న విద్యా ర్థులకు దీపావళి పండుగ వాతావరణం కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వ హించాం. ఇందులో భాగంగానే బాణా సంచా కాల్చేందుకు అనుమతిచ్చాం. దుర దృష్టవశాత్తు ఈ ఘటన చోటుచేసుకుంది. స్వప్నను వెంటనే అస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నాం. – రాజేశ్ గోవిందన్, హాస్టల్స్ చీఫ్ వార్డెన్ -
అన్నయ్య ఆర్టీఐ దరఖాస్తు పెట్టాడని...
హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యార్థిని సోదరుడు సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద దరఖాస్తు చేశాడనే అక్కసుతో ఆమెపై కాలేజీ యాజమాన్యం కక్ష గట్టిన ఘటన హైదరాబాద్ లో చేసుకుంది. స్వతంత్ర రెడ్డి అనే విద్యార్థిని గురునానక్ ఇంజినీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ చదువుతోంది. వచ్చే నెలలో ఆమె ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు ఆమెకు కాలేజీ యాజమాన్యం అనుమతి నిరాకరించింది. హాల్ టిక్కెట్ ఇవ్వకుండా వేధించసాగింది. ఫీజుల వివరాలు తెలపాలంటూ ఆమె అన్నయ్య అవినాష్ రెడ్డి కొద్దినెలల క్రితం ఆర్టీఐ దరఖాస్తు పెట్టాడు. కాలేజీ యాజమాన్యం అక్రమంగా ఫీజులు వసూలు చేస్తుందంటూ మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో అతడి సోదరిపై కాలేజీ కక్ష సాధింపు చర్యలకు దిగింది. దీంతో అతడు జేఎన్టీయూను ఆశ్రయించాడు. స్వతంత్ర రెడ్డికి హాల్ టిక్కెట్ ఇవ్వాలని గురునానక్ కాలేజీని ఆదేశించామని రిజిస్ట్రార్ రమణరావు తెలిపారు. -
గురునానక్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం..
ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం ర్యాగింగ్ జరిగిందంటూ పుకార్లు వెలువడ్డాయి. వివరాల్లోకి వెళ్తే... ఢిల్లీకి చెందిన జోసుల శ్రీకాంత్(19) అనే యువకుడు గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కళాశాల వసతి గృహంలో ఉంటున్న అతడు.. శుక్రవారం ఉదయం నుంచి తన గది నుంచి బయటకురాలేదు. అన్నపానీయాలు సైతం తీసుకోకపోవడంతో బాగా నీరసించి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఈ విషయాన్ని తోటి విద్యార్థులు కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లగా వారు శ్రీకాంత్‌ను ఇబ్రహీంపట్నంలోని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. కాగా శ్రీకాంత్ అపస్మార స్థితికి గల కారణాలపై పలు పుకార్లు వచ్చాయి. కళాశాల యాజమాన్యమే శ్రీకాంత్‌ను కొట్టి నిర్బంధించిందని, సీనియర్లు ర్యాగింగ్ చేశారని వదంతులు వెలువడ్డాయి. అయితే తన సోదరి అనారోగ్యంతో మృతి చెందడం, ఆమె అంత్యక్రియలకు హాజరు కాలేకపోవడంతో ఆవేదనకు గురై హాస్టల్గదిలోనే ఉండిపోయానని శ్రీకాంత్ పోలీసులకు, మీడియాకు తెలిపాడు.