ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం ర్యాగింగ్ జరిగిందంటూ పుకార్లు వెలువడ్డాయి.
వివరాల్లోకి వెళ్తే... ఢిల్లీకి చెందిన జోసుల శ్రీకాంత్(19) అనే యువకుడు గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కళాశాల వసతి గృహంలో ఉంటున్న అతడు.. శుక్రవారం ఉదయం నుంచి తన గది నుంచి బయటకురాలేదు. అన్నపానీయాలు సైతం తీసుకోకపోవడంతో బాగా నీరసించి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఈ విషయాన్ని తోటి విద్యార్థులు కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లగా వారు శ్రీకాంత్‌ను ఇబ్రహీంపట్నంలోని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు.
కాగా శ్రీకాంత్ అపస్మార స్థితికి గల కారణాలపై పలు పుకార్లు వచ్చాయి. కళాశాల యాజమాన్యమే శ్రీకాంత్‌ను కొట్టి నిర్బంధించిందని, సీనియర్లు ర్యాగింగ్ చేశారని వదంతులు వెలువడ్డాయి. అయితే తన సోదరి అనారోగ్యంతో మృతి చెందడం, ఆమె అంత్యక్రియలకు హాజరు కాలేకపోవడంతో ఆవేదనకు గురై హాస్టల్‌గదిలోనే ఉండిపోయానని శ్రీకాంత్ పోలీసులకు, మీడియాకు తెలిపాడు.
గురునానక్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం..
Published Fri, Apr 3 2015 8:12 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement