
కమలాపూర్: టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు రెండూ ఒక్కటేనని, వారి వ్యక్తిగత లాభాల కోసం ఎన్నికలు తీసు కొచ్చాయని హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట నర్సింగరావు ఆరోపించారు. శనివారం హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను విద్యార్థులు, యువకుల కోసం చేసిన పోరాటం చూసి కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశం ఇచ్చిందన్నారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని గళమెత్తి వినిపించడానికి, ఇక్కడున్న 36 వేలమంది నిరుద్యోగులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక చదువు ఆపేసిన 20 వేల మంది విద్యార్థుల ప్రతినిధిగా పార్టీ తనను అభ్యర్థిగా ఎంపిక చేసిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment