
సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఎన్టీఏను రద్దు చేయాలని నినాదాలు చేస్తూ విద్యార్థి సంఘాల నేతలు కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించారు.

వివరాల ప్రకారం.. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని తాగింది. తాజాగా ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సహా మరికొందరు కాంగ్రెస్ కార్యకర్తలు శనివారం ఉదయం కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, అవకతవకలపై ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కేంద్రం తీరుకు వ్యతిరేకంగా, కిషన్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం, పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అంబర్‌పేట్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment