
సాక్షి,న్యూఢిల్లీ: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు బుధవారం(ఆగస్టు14) స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు స్టే అమల్లో ఉంటుందని జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.
తమ నియామకాన్ని పక్కన పెట్టి కొత్తగా ఎమ్మెల్సీలను గవర్నర్ కోటాలో ఎంపిక చేయడాన్ని సవాలు చేస్తూ బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా స్టే విధించాలని పిటిషనర్లు కోరగా బెంచ్ నిరాకరించింది.
కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే గవర్నర్, ప్రభుత్వ హక్కులు హరించినట్లు అవుతుందని వ్యాఖ్యానించింది. ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టడం ప్రభుత్వ విధి అని పేర్కొంది. అనంతరం పిటిషన్‌పై విచారణను ధర్మాసనం నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. టీజేఎస్ అధినేత కోదండరాం, జర్నలిస్టు అమిర్ అలీఖాన్ పేర్లను తెలంగాణ కేబినెట్ తాజాగా గవర్నర్‌కోటా ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ గవర్నర్‌కు సిఫారసు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment