
ఢిల్లీ, సాక్షి: కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వితండవాదాన్ని మానుకోవాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. కంచ గచ్చిబౌలి భూములపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
ఈ తరుణంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం 100 ఎకరాల్లో చెట్లను పునరుద్ధరించాలి. చీఫ్ సెక్రటరీకి తెలియకుండా సీఎం రేవంత్ రెడ్డి చెట్ల నరికివేతకు ఆదేశాలు ఇచ్చారు. కొంపలు మునిగిపోతున్నట్లుగా ఫ్లడ్‌లైట్లు పెట్టి మరి చెట్లు నరికారు.
పర్యావరణ విషయంలో నాపై పోలీసులు కేసులు పెడతానంటే..రెడీ. హైదరాబాదులో ఒక్క చెట్టు కొట్టాలన్న వాల్టా చట్టం కింద అనుమతి తప్పనిసరి. ప్రభుత్వాలు నడిపేందుకు భూములు అమ్మితే భవిష్యత్తు తరాలు క్షమించవు’ అని వ్యాఖ్యానించారు.