Supreme court of India
-
అతి జాప్యంతో అదృశ్యమైన న్యాయం!
ఇటీవల ఒక న్యాయ, చట్ట సంబంధమైన వార్తల వెబ్ సైట్లో ఒక ఆశ్చర్యకరమైన వార్తా కథనం కనబడింది. సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ల ధర్మాసనం ముందు, తన కక్షిదారు చనిపోయాడనీ, ఆ కేసులో నిందితులుగా ఉన్న ఇరవై ఆరు మందీ చనిపోయారనీ ఒక న్యాయవాది చెప్పారు. అవి ప్రతీకార హత్యలేమీ కావు, సహజ మరణాలు. ఈ దేశంలో సామాజిక వ్యవస్థ గురించీ, న్యాయవ్యవస్థ గురించీ ఎన్నో పాఠాలు చెప్పగల నేరమూ–శిక్షా కథ ఇది.బిహార్ లోని అర్వాల్ జిల్లా లక్ష్మణ్ పూర్ బాతే అనే గ్రామంలో 1997 డిసెంబర్ 1న నరసంహారం జరిగింది. రాజధాని పట్నాకు తొంభై కి.మీ. దూరంలో సోన్ నదీ తీరగ్రామం లక్ష్మణ్ పూర్ బాతే. అప్పుడు ఆ ప్రాంతంలో ఎన్నో అరాచకాలకూ, హత్యాకాండలకూ పాల్పడిన రణ వీర్ సేన అనే అగ్రవర్ణాల సేన ఆ గ్రామంలోని దళితుల ఇళ్ల మీద దాడి చేసి చిన్నారి పిల్లలు, స్త్రీలతో సహా 58 మందిని ఊచకోత కోసింది. హతులలో ఒక ఏడాది పసిపాప, ఒక గర్భిణి కూడా ఉన్నారు. నదికి అవతలి ఒడ్డు నుంచి రాత్రి పదకొండు గంటలకు పడవలలో వచ్చి దళిత వాడలో ఇళ్ల తలుపులు విరగ్గొట్టి, లోపలికి చొరబడి, పడుకున్నవాళ్లను పడుకున్నట్టే కాల్చి చంపారు. మూడు గంటల పాటు జరిగిన మారణకాండలో యువతుల మీద అత్యాచారాలు చేసి చంపేశారు. తర్వాత అక్కడికి వెళ్లిన పోలీసులకు అత్యాచారానికి గురైన ఐదుగురు బాలికల నగ్న మృతదేహాలు కనిపించాయి. ఈ నరసంహారం సాగించి, తిరిగి అదే పడవలలో నది దాటిన హంతకులు సాక్ష్యాధారాలు లేకుండా చేయడానికి తమను నది దాటించిన ఇద్దరు పడవవాళ్ల గొంతులు కోసి చంపేశారు.అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ‘దేశానికి సిగ్గు చేటు’ అని అభివర్ణించిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనానికి దారి తీసింది. ఈ మారణకాండ కారణాలు, పూర్వరంగం ఏమైనప్పటికీ, తర్వాత జరిగిన న్యాయ విచారణా ప్రక్రియ ఆశ్చర్యకరమైన మలుపులు తిరిగింది. జహానాబాద్ జిల్లా సెషన్స్ కోర్టులో జరగవలసిన ఈ విచారణను పట్నా హైకోర్టు ఆదేశాల మేరకు 1999 అక్టో బర్లో పట్నాకు బదిలీ చేశారు. తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత 2008 డిసెంబర్లో 46 మంది రణవీర్ సేన కార్యకర్తల మీద నేరారోపణలు నమోద య్యాయి. రెండు సంవత్సరాల తర్వాత 2010 ఏప్రిల్ 7న పట్నా అదనపు జిల్లా సెషన్స్ జడ్జి విజయ్ ప్రకాష్ మిశ్రా నిందితులలో 16 మందికి మరణశిక్ష, 10 మందికి యావ జ్జీవ కారాగార శిక్ష విధించారు. ఈ హత్యాకాండ ‘పౌర సమాజం మీద మచ్చ’ అనీ, ‘పాశవికత్వంలో అరుదైన వాటిలోకెల్లా అరుదైనది’ అనీ తీర్పులో రాశారు. శిక్షితులు అప్పీలుకు వెళ్లగా పట్నా హైకోర్టు జస్టిస్ వీఎన్ సిన్హా, జస్టిస్ ఏకే లాల్ ద్విసభ్య ‘ధర్మాసనం’ 2013 అక్టోబర్ 9న ‘సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా’ శిక్షలన్నిటినీ కొట్టివేసింది. ఇంత అన్యాయమైన హైకోర్టు తీర్పు వార్త ప్రధాన స్రవంతి పత్రికలకు పట్టనే లేదు. యాభై ఎనిమిది మందిని హత్య చేసి, కింది కోర్టులో నేరం రుజువై తీవ్రమైన శిక్షలు కూడా పడిన నేరస్థులను, అలా సాక్ష్యాధారాలు లేవంటూ వదిలివేసిన దుర్మార్గమైన వార్త కన్నా ఆ రోజే క్రికెట్ నుంచి విరమించుకుంటున్నానని సచిన్ టెండూల్కర్ చేసిన ప్రకటన పెద్ద వార్త అయింది! హైకోర్టు తీర్పును బిహార్ ప్రభుత్వమూ, బిహార్‌లోని రాజకీయ పార్టీలన్నీ తప్పు పట్టాయి. ఈ తీర్పును ఎంత మాత్రమూ అంగీకరించడానికి వీలు లేదని, తీర్పును సమీక్షించమని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని బిహార్ రాజకీయ పార్టీలు కోరాయి.పట్నా హైకోర్టు తీర్పును సమీక్షించి, కొట్టివేయాలని, మారణకాండ దోషులకు కఠిన శిక్షలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం 2013 డిసెంబర్లో సుప్రీంకోర్టును అభ్యర్థించింది. 2014 జనవరి 13న సుప్రీంకోర్టు కేసు నమోదు చేసుకుని నోటీసులు పంపింది. నాలుగు సంవత్సరాల తర్వాత 2018, 2019లలో కాస్త విచారణ జరిగి, కేసు మౌలిక దస్తావేజులు, అదనపు పత్రాలు పంపమని కింది కోర్టులను ఆదేశించడంలోనే సమయం గడిచిపోయింది. 2023 ఒక్క సంవత్సరంలోనే ఎటువంటి వాదనలు, విచా రణ జరగకుండా ఆరుసార్లు వాయిదాలు పడ్డాయి. ఈ మధ్యలో కొందరు నిందితులు మరణించారని న్యాయ వాదులు సుప్రీంకోర్టు దృష్టికి తెస్తూనే ఉన్నారు. 2025 జనవరి 1 నాటికి ఇరవై ఆరు మందిలో ఐదుగురు మర ణించారని నమోదయింది. పన్నెండేళ్లుగా వాయిదాలు పడుతూ నత్తనడకలతో సాగుతూ సాగుతూ వచ్చిన ఆ కేసులో 2025 ఏప్రిల్ 3న ఒక నిందితుడి తరఫున వాది స్తున్న న్యాయవాది ‘ఇరవై ఆరు మంది నిందితులూ మరణించారని ధర్మాసనానికి తెలియజేస్తున్నాం’ అన్నారు. వాస్తవ స్థితి ఏమిటో చెప్పాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన ధర్మాసనం కేసును మళ్లీ వాయిదా వేసింది. ఆలస్యం చేయడమంటే న్యాయాన్ని నిరాకరించినట్టే అనే నానుడిని నిజం చేస్తూ మన న్యాయవ్యవస్థ సాచివేత ద్వారా న్యాయాన్ని నిరాకరిస్తున్న తీరు ఇది! ఇప్పుడు నడుస్తున్న మందకొడి వేగంతోనే నేర విచారణలు సాగుతూ పోతే దేశంలో ఆ నాటికి న్యాయస్థానాలలో పెండింగ్‌లో ఉన్న కేసులన్నీ పూర్తి కావడానికి 324 సంవ త్సరాలు పడుతుందని 2018లో నీతి ఆయోగ్ ఒక వ్యూహ పత్రంలో నిర్ధారించింది. ఆ నాటికి దేశం మొత్తం మీద పెండింగ్‌లో ఉన్న కేసులు రెండు కోట్ల తొంబై లక్షలు కాగా, 2025 జనవరి నాటికి ఆ సంఖ్య ఐదు కోట్ల ఇరవై లక్షలకు చేరింది. నీతి ఆయోగ్ అంచనా ప్రకారమే చూస్తే, ప్రస్తుత పెండింగ్ కేసులు పూర్తి కావడానికి 580 సంవ త్సరాలు పడుతుంది!! అప్పటికి వాదులూ ఉండరు, ప్రతి వాదులూ ఉండరు. అటు, ఇటు వాదించే న్యాయ వాదులూ ఉండరు! న్యాయం ఉంటుందా?ఎన్. వేణుగోపాల్ సీనియర్ జర్నలిస్ట్ -
సెక్షన్ 3 ప్రకారం కృష్ణాజలాల పంపిణీతో ఏపీకి తీరని నష్టం
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్రాష్ట్ర నదీజలాల చట్టం–1956లోని సెక్షన్ 3 ప్రకారం కృష్ణాజలాల పునఃపంపిణీ కోసం కేంద్రం జారీచేసిన నూతన మార్గదర్శకాల వల్ల ఏపీకి తీరని నష్టం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. గతంలోని కేటాయింపులు కాకుండా ఇప్పుడు మళ్లీ కేటాయింపులను మొదటి నుంచి పరిశీలించేలా విధివిధానాలను ఖరారు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతుందని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్‌సింగ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం దృష్టికి ఏపీ ప్రభుత్వం తీసుకెళ్లింది.కృష్ణాజలాల పంపిణీకి సంబంధించి ట్రైబ్యునల్‌కు కేంద్రం జారీచేసిన సెక్షన్ 3ను రద్దుచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. నదీజలాల కేటాయింపు విషయంలో గతేడాది తీసుకున్న కేంద్ర నిర్ణయం ఆమోదయోగ్యం కాదని, నదీజల వివాద చట్టం ప్రకారం బ్రిజేష్ ట్రైబ్యునల్‌కు ఇలా అదనపు అంశాలు పరిశీలించే అధికారం లేదని ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, జైదీప్ గుప్తా వాదనలు వినిపించారు.గతంలో కృష్ణానది జలాల పంపిణీలో భాగంగా ఏపీకి 811 టీఎంసీలు కేటాయించగా.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించారని తెలిపారు. అయితే ఈ కేటాయింపులను మళ్లీ మొదటి నుంచి పరిశీలించేలా విధివిధానాలు ఖరారు చేయడం వల్ల ఏపీకి తీవ్ర అన్యాయం జరిగే అవకాశముందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం కోర్టు సమయం ముగియడంతో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తదుపరి వాదనలు గురువారం లేదా మరోరోజు వింటామని ధర్మాసనం తెలిపింది. -
పోలీసులు, మేజిస్ట్రేట్లు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు, మేజిస్ట్రేట్లు సుప్రీంకోర్టు ఆదేశాలు, మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ సోషల్ మీడియా యాక్టివిస్ట్ మునగాల హరీశ్వర్‌రెడ్డి మంగళవారం హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్, రిజిష్ట్రార్ (జ్యుడీషియల్)కు ఫిర్యాదు చేశారు. వీరిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేర చర్యలు తీసుకోవాలని కోరారు. హరీశ్వర్‌రెడ్డి తరఫున ఆయన న్యాయవాదులు కాసా జగన్మోహన్రెడ్డి, కె.జానకిరామిరెడ్డి, యర్రంరెడ్డి నాగిరెడ్డి, శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి, పొన్నపురెడ్డి శశివర్థన్‌రెడ్డి, పాపుడిప్పు శశిధర్‌రెడ్డి తదితరులు ఫిర్యాదు కాపీని రిజిష్ట్రార్ జనరల్, రిజిష్ట్రార్ (జ్యుడీషియల్)కు అందజేశారు.పోలీస్ అధికారులు, అలాగే మేజిస్ట్రేట్లు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ధిక్కరించి, ఏడేళ్లలోపు శిక్ష పడే నేరాలలోనూ నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపుతున్నారని హరీశ్వర్‌రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై కూడా తిరుపతి తూర్పు పోలీసులు పలు సెక్షన్ల కింద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని, ఈ సెక్షన్లన్నీ ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడేవేనన్నారు. అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా పోలీసులు తనను అరెస్ట్ చేశారని తెలిపారు. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, మేజిస్ట్రేట్ తగిన కారణాలను వెల్లడించకుండా యాంత్రికంగా తనను రిమాండ్‌కు పంపారని హరీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కనీస స్థాయిలో కూడా పరిగణనలోకి తీసుకోలేదన్నారు.తమ ఆదేశాల అమలును హైకోర్టులు పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు చెప్పిందితాను కేంద్ర కారాగారంలో ఉన్నప్పుడు ఇలాంటి కేసులు ఎన్నో జరిగినట్లు తెలిసిందని హరీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. సుప్రీం ఆదేశాలు, మార్గదర్శకాలకు విరుద్ధంగా పోలీసులు పలువురిని అరెస్ట్ చేసినట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. తమ మార్గదర్శకాల అమలును దేశంలోని అన్నీ హైకోర్టులు పర్యవేక్షించాలని, వాటిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని సంతేందర్ కుమార్ అన్టిల్ వర్సెస్ సీబీఐ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు.ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని హైకోర్టు సైతం చెప్పింది..ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సైతం బొల్లినేని రాజగోపాల్ నాయుడు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఇదే విషయాన్ని స్పష్టంగా పేర్కొందన్నారు. ‘సీఆర్పీసీ సెక్షన్ 167 ప్రకారం రిమాండ్ ఉత్తర్వులు జారీ చేసే ముందు మేజిస్ట్రేట్లు తమ సంతృప్తిని రికార్డ్ చేయాలి. వాస్తవాల విషయంలో నిష్పాక్షికంగా ఆలోచించి, కారణాలతో కూడిన ఉత్తర్వు ఇవ్వాలి. దీనికి విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా తీవ్రంగా పరిగణిస్తాం. మేజిస్ట్రేట్లు లోపభూయిష్టమైన రిమాండ్ ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని నిందితులు కానీ, వారి తరఫున ఇతరులు గానీ హైకోర్టు దృష్టికి తీసుకొస్తే ఆ మేజిస్ట్రేట్లపై శాఖపరమైన చర్యలు తీసుకుంటాం’ అని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఆదేశాలను ఉల్లంఘించిన విచారణాధికారులు, మేజిస్ట్రేట్ల వివరాలను కేసుల వివరాలతో సహా ఈ ఫిర్యాదుకు జత చేస్తున్నానని, వాటిని పరిశీలించి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన రిజిస్ట్రీ దీనిని ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచుతామని హరీశ్వర్‌రెడ్డి న్యాయవాదులకు చెప్పినట్లు తెలిసింది. మొత్తం 149 కేసులకు సంబంధించిన వివరాలను, ఆయా మేజిస్ట్రేట్ కోర్టుల వివరాలను హరీశ్వర్‌రెడ్డి తన ఫిర్యాదుతో జత చేశారు. -
ఉపరాష్ట్రపతి ధన్ ఖడ్ వ్యాఖ్యలకు కపిల్ సిబాల్ కౌంటర్!
న్యూఢిల్లీ: పార్లమెంటే సుప్రీం అంటూ ఉప రాష్ట్రపతి, రాజ్య సభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఎంపీ కపిల్ సిబాల్ పరోక్షంగా కౌంటరిచ్చారు. ఇక్కడ పార్లమెంట్ సుప్రిమా.. లేక కార్యనిర్వాహక శాఖ సుప్రిమా అనేది ప్రశ్నే కాదని, కేవలం రాజ్యాంగం మాత్రమే ఇక్కడ సుప్రీం అంటూ సిబాల్ తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా కపిల్ సిబాల్ స్పందించారు. భారతదేశంలో చట్టాన్ని ఎలా అర్ధం చేసుకుంటందనే దానికి కపిల్ సిబాల్ వివరణ ఇచ్చారు. ‘ పార్లమెంట్, కార్యనిర్వహాక శాఖ సుప్రీం కాదు.. రాజ్యాంగమే మన దేశంలో సుప్రీం. ఇప్పటివరకూ దేశం చట్టాన్ని ఇలానే అర్ధం చేసుకుంది’ అని స్సష్టం చేశారు.The law :Neither Parliament Nor the Executive is supreme The Constitution is supreme The provisions of the Constitution are interpreted by the Supreme CourtThat’s how this country has understood the law so far !— Kapil Sibal (@KapilSibal) April 22, 2025కాగా, రాజ్యాంగపరమైన అంశాల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులే ‘అల్టిమేట్ మాస్టర్స్’ అని జగదీప్ ధన్‌ఖడ్ వ్యాఖ్యానించారు. . రాష్ట్ర గవర్నర్ పంపిన బిల్లులకు రాష్ట్రపతి నిర్ణీత గడువులోపు సమ్మతి తెలపాలని సుప్రీంకోర్టు గడువు విధించడంపై ధన్‌ఖడ్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన ధన్ ఖడ్.. మంగళవారం ఢిల్లీ యూనివర్సిటీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు‘‘ఎన్నికైన ప్రజాప్రతినిధులు జవాబుదారీతనంగా ఉండాలి. అది ఎమర్జెన్సీ విధించిన ప్రధాని అయినా సరే!. ప్రజలకు రక్షణ కల్పించేందుకే ప్రజాస్వామ్యం. రాజ్యాంగపరమైన అంశాల్లో ప్రజాప్రతినిధులే అల్టిమేట్ మాస్టర్స్. పార్లమెంట్ కంటే అత్యుత్తమమైనది ఉందని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. కాబట్టి పార్లమెంటే సుప్రీం అని పేర్కొన్నారు. -
పార్లమెంటే సుప్రీం.. ఉప రాష్ట్రపతి నోట మళ్లీ అదే తరహా వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి, రాజ్య సభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్(jagdeep dhankhar) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగపరమైన అంశాల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులే ‘అల్టిమేట్ మాస్టర్స్’ అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర గవర్నర్ పంపిన బిల్లులకు రాష్ట్రపతి నిర్ణీత గడువులోపు సమ్మతి తెలపాలని సుప్రీంకోర్టు గడువు విధించడంపై ధన్‌ఖడ్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో.. మంగళవారం ఢిల్లీ యూనివర్సిటీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎన్నికైన ప్రజాప్రతినిధులు జవాబుదారీతనంగా ఉండాలి. అది ఎమర్జెన్సీ విధించిన ప్రధాని అయినా సరే!. ప్రజలకు రక్షణ కల్పించేందుకే ప్రజాస్వామ్యం. రాజ్యాంగపరమైన అంశాల్లో ప్రజాప్రతినిధులే అల్టిమేట్ మాస్టర్స్. పార్లమెంట్ కంటే అత్యుత్తమమైనది ఉందని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. కాబట్టి పార్లమెంటే సుప్రీం’’ అని అన్నారాయన. ఈ సందర్భంగా మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ సమయం గురించి కూడా ధన్‌ఖడ్ ప్రస్తావించారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిందని ధన్‌ఖడ్ వ్యాఖ్యానించారు. ఇంతకు ముందు తాను చేసిన వ్యాఖ్యలపై వచ్చిన విమర్శలపై స్పందిస్తూ.. రాజ్యాంగ కార్యకర్తగా తాను మాట్లాడే ప్రతి మాట అత్యున్నత జాతీయ ప్రయోజనాలకు మార్గనిర్దేశం చేయబడుతుందని అన్నారు. అంతకు ముందు.. ‘‘రాష్ట్రపతికి గడువు నిర్దేశించేలా న్యాయవ్యవస్థ వ్యవహరించడం తగదు. ప్రజాస్వామ్యశక్తులపై అణుక్షిపణిని సుప్రీంకోర్టు ప్రయోగించరాదు. ఇప్పుడు.. శాసనాలు చేయగలిగే జడ్జీలు మనకు ఉన్నారు! కార్యనిర్వాహక విధులూ వారే నిర్వర్తించేస్తారు. సూపర్ పార్లమెంటులా వ్యవహరిస్తారు. వారికి మాత్రం ఎలాంటి జవాబుదారీతనం ఉండదు. ఎందుకంటే దేశ చట్టాలు వారికి వర్తించవు’’ అని ఢిల్లీ హైకోర్టు జడ్జి నోట్ల కట్టల వ్యవహారాన్ని సుప్రీం కోర్టు రాష్ట్రపతికి బిల్లుల విషయంలో గడువు విధించడానికి ముడిపెడుతూ ధన్‌ఖడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఓ సీనియర్ న్యాయవాది, పైగా ఉప రాష్ట్రపతి హోదాలో ఉండి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ప్రతిపేక్షాలు సహా మేధో వర్గం తీవ్రంగా తప్పుబట్టింది.మరోవైపు.. బీజేపీ నేతలు సహా ధన్‌ఖడ్ చేసిన వ్యాఖ్యలపై పరోక్షంగా సుప్రీం కోర్టు(supreme court) స్పందించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తాము కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామనే ఆరోపణలు ఎదుర్కొంటున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వాలా? అని బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. -
ఇప్పటికే అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాం
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థపై ఉపరాష్ట్రపతి సహా పలువురు బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. ప్రస్తుతం తాము కార్య నిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామనే ఆరోపణలు ఎదుర్కొంటున్నామంటూ సోమవారం వ్యాఖ్యానించింది.ముర్షిదాబాద్ అల్లర్ల కేసు నేపథ్యంతో.. పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన(Bengal President Rule) విధించాలని కోరుతూ విష్ణు శంకర్ జైన్ అనే న్యాయవాది సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలో జస్టిస్ గవాయ్ పిటిషన్‌ను పరిశీలిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘మేం ఇప్పటికే కార్య నిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాం. ఇలాంటి తరుణంలో.. బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని, సైన్యాన్ని మోహరింపజేయాలని మాండమస్ రిట్ ప్రకారం రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వాలా?’’ అని పిటిషనర్ లాయర్‌ను ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో పిటిషనర్ కోరిన ఆదేశాలు జారీ చేయడానికి బెంచ్ నిరాకరించింది. ఇదిలా ఉంటే.. రాష్ట్రాలు రూపొందించే బిల్లుల విషయంలో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరును సుప్రీం కోర్టు తప్పుబడుతూ సంచలన తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో గవర్నర్, రాష్ట్రపతికి సైతం కాలపరిమితి విధించింది. ఈ వ్యవహారంలో రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక అధికారాలు పని చేయబోవని.. ఒకవేళ ఆ కాలపరిమితిని ఉల్లంఘిస్తే కోర్టులను ఆశ్రయించొచ్చని రాష్ట్రాలకు సూచించింది. అదే సమయంలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లనూ విచారిస్తూ.. స్టే ఆదేశాలు జారీ చేసింది కూడా. అయితే ఈ రెండు పరిణామాలపై బీజేపీ నేతలు కొందరు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సుప్రీం కోర్టుపై చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. ఒకవేళ సుప్రీంకోర్టు చట్టాలు చేస్తే గనుక.. పార్లమెంట్ భవనాన్ని మూసివేయాలి’’ అని ఎంపీ వ్యాఖ్యానించారు. మరో బీజేపీ నేత దినేశ్ శర్మ సైతం సుప్రీం కోర్టుపై విమర్శలు గుప్పించారు. ఆఖరికి ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ఖడ్ కూడా సుప్రీం కోర్టు తీర్పును తప్పుబట్టారు. ‘రాష్ట్రపతికి గడువు నిర్దేశించేలా న్యాయవ్యవస్థ వ్యవహరించడం తగదు. అది ప్రజాస్వామ్యశక్తులపై అణుక్షిపణిని ప్రయోగించడమే అవుతుంది. ఇప్పుడు.. శాసనాలు చేయగలిగే జడ్జీలు మనకు ఉన్నారు! కార్యనిర్వాహక విధులూ వారే నిర్వర్తించేస్తారు. సూపర్ పార్లమెంటులా వ్యవహరిస్తారు. వారికి మాత్రం ఎలాంటి జవాబుదారీతనం ఉండదు. ఎందుకంటే దేశ చట్టాలు వారికి వర్తించవు’’ అని అన్నారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి నోట్ల కట్టల వ్యవహారంపై స్పందిస్తూ దన్ఖడ్ ఈ వ్యాఖ్యలు చేశారు.ఇక బీజేపీ నేతల వ్యాఖ్యలను వ్యతిగతం అని పేర్కొంటూ అధిష్టానం దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. అయినప్పటికీ ప్రతిపక్షాలు ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి.ప్రస్తుతం సీజేఐగా ఉన్న సంజీవ్ ఖన్నా పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఆ స్థానంలో బీఆర్ గవాయ్(BR Gavai) బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కీలకమైన వక్ఫ్ పిటిషన్లపై ఈయనే విచారణ జరపబోతున్నారు. ఈ క్రమంలో.. ఆయన కార్య నిర్వాహక వ్యవస్థపై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 8-12 తేదీల మధ్య షంషేర్‌గంజ్, సూటి, ధులియాన్, జంగిపూర్ ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. ముగ్గురు మరణించగా.. వందల మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన 73 పిటిషన్లనువిచారించే క్రమంలోనూ ఈ అల్లర్లను సీజేఐ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ప్రస్తావించింది. మే 5వ తేదీన ఈ పిటిషన్లపై విచారణ జరగనుంది. -
బీజేపీ వివరణ రాజకీయ వంచన
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, ప్రధాన న్యాయమూర్తి లక్ష్యంగా పలు వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీలు నిశికాంత్ దూబే, దినేశ్ శర్మలపై ఆ పార్టీ చర్యలెందుకు తీసుకోలేదని కాంగ్రెస్ ప్రశ్నించింది. వారి విమర్శలు వ్యక్తిగతమని చెబుతూ దూరంగా ఉండేందుకు ప్రయత్నించడం రాజకీయ వంచనగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ వ్యాఖ్యానించారు. ‘ఆ ఎంపీలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు, కనీసం షోకాజ్ నోటీసులు ఎందుకివ్వలేదు?’ అని నిలదీశారు. తరచూ వివిధ వర్గాలు, వ్యక్తులు, సంస్థలే లక్ష్యంగా విద్వేష, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న నిశికాంత్ దూబే, దినేశ్ శర్మలకు పార్టీతో సంబంధం లేదంటూ దూరంగా ఉండటం కేవలం నష్ట నివారణ చర్య మాత్రమేనన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానానికి వ్యతిరేకంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మౌనంగా ఉండటం తగదని పేర్కొన్నారు. ఒక వేళ ఉపరాష్ట్రపతి అభిప్రాయాలతో పార్టీ ఏకీభవిస్తోందా? అని జేపీ నడ్డాను ప్రశ్నించారు. భారత రాజ్యాంగంపై ఇలా పదే పదే జరుగుతున్న దాడులపై ప్రధాని మౌనంగా ఉండటమంటే వారికి పరోక్షంగా మద్దతు ఇవ్వడమేనని జైరామ్ రమేశ్ అన్నారు. ఇదంతా బీజేపీ రాజకీయ వంచన అని ఆయన అభివర్ణించారు. జార్ఖండ్‌కు చెందిన ఎంపీ నిశికాంత్ దూబే పశ్చిమబెంగాల్లో ఇటీవల జరిగిన అల్లర్లు, వక్ఫ్ చట్టంపై చేసిన వ్యాఖ్యలు ధిక్కారం కిందికే వస్తాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. ‘ఇది కోర్టు ధిక్కారానికి, రాజ్యాంగ ఉల్లంఘనకు సంబంధించిన స్పష్టమైన కేసు. తేలిగ్గా తీసుకోలేం. భారత ప్రధాన న్యాయమూర్తిపై ఈ ఎంపీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. న్యాయవ్యవస్థను బెదిరించడానికి ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. ఇది న్యాయవ్యవస్థపై జరిగిన ప్రత్యక్ష దాడి. స్పీకర్, సుప్రీంకోర్టు ఆ ఎంపీపై చర్య తీసుకోవాలి’ అని వేణుగోపాల్ డిమాండ్ చేశారు. ఎంపీ దూబే శనివారం సుప్రీంకోర్టుపై విమర్శలు చేయడం తెల్సిందే. సుప్రీంకోర్టే చట్టాలు చేస్తుంటే పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలను మూసివేసుకోవాల్సిందేనన్నారు. దేశంలో సివిల్ వార్లకు సీజేఐ కారణమని నిందించారు. అదేవిధంగా, రాష్ట్రపతి తన వద్దకు వచ్చిన బిల్లులపై 90 రోజుల్లోగా స్పష్టత ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రస్తావించిన యూపీ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ ఇటీవల.. పార్లమెంట్‌ను, రాష్ట్రపతిని ఎవరూ ఆదేశించలేరంటూ వ్యాఖ్యానించారు. అయితే, వీరి వ్యాఖ్యలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని శనివారం బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్పష్టం చేశారు. ‘న్యాయవ్యవస్థ, భారత ప్రధాన న్యాయమూర్తిపై ఎంపీలు నిశికాంత్ దూబే, దినేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఇవి వారి వ్యక్తిగతం. పార్టీ వీటితో ఏకీభవించదు. ఇలాంటి వ్యాఖ్యలకు ఎప్పుడూ మద్దతివ్వదు. పూర్తిగా తిరస్కరిస్తుంది’ అని నడ్డా తన ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొన్నారు. -
ప్రభుత్వ ప్రాయోజిత మత పక్షపాతం
కొత్త వక్ఫ్ చట్టాన్ని ముస్లింలు మాత్రమే వ్యతిరేకిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఒక తప్పుడు సంకే తాన్ని ఇస్తున్నాయి. ముస్లిం ధర్మాదాయ దేవాదాయ వ్యవహారాలను వక్ఫ్అంటారు. 1995 నాటి వక్ఫ్ చట్టం ఇప్పటి వరకు అమలులో వుంది. ఇప్పుడు దీన్ని ‘యునైటెడ్ వక్ఫ్ మేనే జ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియెన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్–2025 (యూడబ్ల్యూఎమ్ఈఈడీఏ)గా మార్చారు. వక్ఫ్ సవరణ బిల్లు ఏప్రిల్ 3న లోక్‌సభలో 288 – 232 ఓట్ల తేడాతో గెలిచింది. రాజ్యసభలో ఏప్రిల్ 4న 128 – 95 ఓట్ల తేడాతో గెలిచింది. ఆ వెంటనే రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడిపోయింది. ఇక్కడ ఒక విశేషం ఉంది. 543 మంది సభ్యు లున్న లోక్ సభలో ముస్లింలు 24 మంది మాత్రమే. 232 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు.అంటే 208 మంది ముస్లిమే తర సభ్యులు ముస్లింల పక్షాన నిలిచారు. అలాగే 245 మంది సభ్యులున్న రాజ్య సభలో ముస్లింలు 15గురు మాత్రమే. 95 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. అంటే 80 మంది ముస్లిమేతర సభ్యులు ముస్లింల పక్షాన నిలిచారు. రెండు సభల్లోనూ కలిపి ముస్లింల సంఖ్య 39 మాత్రమే. వాళ్ల పక్షాన నిలిచిన ముస్లిమేతరులు 288 మంది. కొత్త చట్టం రాజ్యాంగ ఆదర్శాలకు, హామీలకు విరుద్ధంగా ఉందనీ, దాన్ని పునఃసమీక్షించాలని కొన్ని సంఘాలు, కొన్ని రాజకీయపార్టీలు సుప్రీంకోర్టులో 70కు పైగా పిటీషన్లు వేశాయి. ఈ విషయంలోనూ ముస్లింల సంఖ్య చాలా తక్కువ. ముస్లిమేతరుల సంఖ్య చాలా ఎక్కువ. మన దేశంలో వర్ధిల్లుతున్న మతసామరస్యానికి ఇది తాజా ఉదాహరణ. దీనికి విరుద్ధంగా బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త చట్టానికి మద్దతు ప్రకటించాయి. ఒక బిల్లు ఉభయ సభల్లో మెజారిటీ సాధించి రాష్ట్రపతి ఆమోద ముద్రపడి చట్టంగా మారాక కూడ సుప్రీం కోర్టుకు చేరడం విశేషం. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఏప్రిల్ 16న ఈ పిటిషన్లపై విచారణ ప్రారంభించింది. కొత్త చట్టంలో వివాదాంశాలు అనేకం ఉన్నాయి. ఇందులో నాలుగు అంశాలు మరింత తీవ్రమైనవి. వక్ఫ్ బోర్డులో, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో కొత్తగా ముస్లిమేతరులను అనుమతించడం తీవ్రమైన వివాదంగా మారింది. వక్ఫ్ భూముల్లో ‘వక్ఫ్ బై యూజర్’ సౌలభ్యాన్ని తొలగించి అది వక్ఫ్‌గా కొనసాగాలంటే రిజిస్ట్రేషన్ దస్తావేజులు చూపాలనడం ఇంకో వివాదాంశం. వక్ఫ్ ఆస్తి అవునో కాదో తేల్చడానికి జిల్లా కలెక్టర్లకు విశేషాధికారాలు కల్పించడం, కనీసం ఐదేళ్ళుగా ఇస్లామిక్ ధార్మిక ఆచరణను కొనసాగిస్తున్నవారు మాత్రమే వక్ఫ్ దానం చేయడానికి అర్హులు అనడం కూడా వివాదంగా మారింది. వక్ఫ్ భూములకు దస్తావేజులు చూపడం అసాధ్యమైన విషయం. 19వ శతాబ్దం ఆరంభం వరకు మన దేశంలో అసలు దస్తావేజులు, రిజిస్ట్రేషన్ల సంప్రదాయమే లేదు. లార్డ్ కార్న్ వాలిస్ 1793లో తొలిసారిగా శాశ్వత భూమిపన్ను విధానాన్ని తెచ్చాడు. అది కూడా ఇప్పటి బెంగాల్, బిహార్, ఒడిశాప్రాంతంలో మాత్రమే. ఆ తరువాత థామస్ మన్రో మద్రాసు, బొంబాయి ప్రెసిడెన్సీల్లో రైత్వారీ విధానాలను తెచ్చాడు. భారత దేశంలో 8వ శతాబ్దం నాటికే ఇస్లాం ప్రవేశించింది. ఇస్లాం ప్రవేశించిన వెయ్యేళ్ళ తరువాత మనకు దస్తావేజులు, రిజిస్ట్రేషన్ విధానాలు వచ్చాయి. అత్యున్నత న్యాయస్థానపు ధర్మాసనం సరిగ్గా ఈ అంశాన్నే పట్టించుకుంది. ‘మనం చరిత్రను తిరగరాయలేం’ అని భారత ప్రధాన న్యాయమూర్తి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు గుర్తుచేశారు. వక్ఫ్ వ్యవహారాల్లో పారదర్శకతను ప్రదర్శించడమేగాక, రెండు మత సమూహాల సహవాసాన్ని కొత్త చట్టం ప్రోత్సహిస్తుందని, ముస్లింల గుత్తాధిపత్యాన్ని తొలగిస్తున్నదని సొలిసిటర్ జనరల్ ధర్మాసనానికి వివరించే ప్రయత్నం చేశారు. ఇలా రెండు మతసమూహాల కలయిక ఒక ఆదర్శం అని కేంద్ర ప్రభుత్వం నిజంగానే నమ్ముతోందా? నమ్మితే హిందూ ధర్మాదాయ కమిటీల్లోనూ హిందూయేతరులకు స్థానం కల్పించాలిగా? సరిగ్గా ఈ ప్రశ్ననే భారత ప్రధాన న్యాయమూర్తి వేశారు. తాము స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేవరకు వక్ఫ్ భూములు వేటినీ డీ–నోటిఫై చేయరాదని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.కేంద్ర ప్రభుత్వ వాదనను వినిపించడానికి ఒక వారం రోజులు గడువు ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ ధర్మాసనాన్ని కోరారు. ఇందులో ఒక కిటుకు ఉంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖన్నా మరో మూడు వారాల్లో, మే 13న పదవీ విరమణ చేయనున్నారు. ఎలాగోలా ఈ సమయాన్ని సాగదీస్తే అనుకూ లమైన తీర్పు తెచ్చుకోవచ్చు అనేది కేంద్ర ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది.- వ్యాసకర్త సమాజ విశ్లేషకులు ‘ 90107 57776'- డానీ -
‘సుప్రీంకోర్టు నిర్దేశిస్తుందా?.. ఇక మేము పార్లమెంట్‌ను మూసేస్తాం’
రాంచీ: వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పటికే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సంచలన వ్యాఖ్యలు చేయగా, ఇప్పుడు ఆ జాబితాలో జార్ఖండ్ రాష్ట్ర బీజేపీ ఎంపీ నిక్షికాంత్ దుబే చేరిపోయారు. సుప్రీం తీర్పు ‘అరాచకం’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ.. ఇక తాము పార్లమెంట్ ను, అసెంబ్లీలను కూడా మూసేస్తాం అంటూ సెటైర్లు వేశారు. ప్రధానంగా రాష్ట్రపతికి మూడు నెలల టైమ్ లైన్ విధించడాన్ని ఆక్షేపించారు సదరు ఎంపీ.నియామక అధికారికి మీరు ఎలా దిశానిర్దేశం చేస్తారు?, రాష్ట్రపతి అనేవారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను నియమిస్తారు. పార్లమెంట్ అనేది ఈ దేశంలో చట్టాలు తయారు చేస్తుంది. అప్పుడు మీరు పార్లమెంట్ ను ఎలా డిక్టేట్ చేస్తారు. మీరు కొత్త చట్టాన్ని ఎలా రూపొందించారు. ఏ చట్టంలో రాష్ట్రపతి మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఉంది? అంటే మీరు ఈ దేశాన్ని అరాచకం వైపు తీసుకెళ్లాలనుకుంటున్నారా?’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై పార్లమెంట్ లో సమగ్ర చర్చ జరగాల్సిందేనని దూబే పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు న్యాయవ్యవస్థ పరిమితులపై ప్రశ్నలను లెవనెత్తింది’ అంటూ వ్యాఖ్యానించారు.ఇటీవల ఉపరాష్ట్రపతి ధన్ ఖడ్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతిని ఆదేశించే అధికారం న్యాయ వ్యవస్థకు లేదని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు సూపర్ పార్లమెంట్‌గా వ్యవహరించవద్దని. ప్రజాస్వామ్య వ్యవస్థలపై సుప్రీంకోర్టు అణు క్షిపణి ప్రయోగించాలనుకోవడం సమంజసం కాదన్నారు. పరిశీలన కోసం రాష్ట్ర గవర్నర్లు పంపించిన బిల్లులపై నిర్ణయం తీసుకొనే విషయంలో రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడం పట్ల జగదీప్ ధన్‌ఖడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.ఇది నిజంగా ఆందోళనకరమని అన్నారు. ఇలాంటి పరిణామం కోసం మనం ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేదన్నారు.ఇవీ చదవండి:వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పు చేయొద్దు: సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులురాష్ట్రపతిని కోర్టులు ఆదేశించలేవు‘మీరు పనులు చేయకపోతే.. న్యాయ వ్యవస్థ చూస్తూ కూర్చోవాలా?’ -
మీరు కొత్త చట్టం కనిపెట్టారు.. హైకోర్టుపై సుప్రీంకోర్టు సీరియస్
న్యూఢిల్లీ: శిక్షా కాలం సగం ముగిశాక శిక్ష రద్దుపై నిర్ణయం తీసుకుంటామంటూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఓ వ్యక్తి పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను పెండింగ్‌లో పెట్టడంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఎటువంటి ప్రాతిపదిక లేని కొట్ట చట్టాన్ని హైకోర్టు కనిపెట్టడం మాకు ఆశ్చర్యం కలిగించింది’ అని వ్యాఖ్యానించిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల ధర్మాసనం పిటిషనర్‌కు బెయిల్ మంజూరు చేసింది.అయితే, భారీ సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉన్నందున తీర్పును సవాల్ చేస్తూ వేసే అప్పీల్‌పై సమీప భవిష్యత్తులో వాదనలు వినే అవకాశాలు లేవు కాబట్టి బెయిల్ ఇవ్వవచ్చని ఈనెల 17న వెలువరించిన తీర్పులో స్పష్టం చేసింది. చట్టాలను యథాతథంగా అమలు చేయాలని, బెయిల్ కోసం పిటిషనర్లు తమ దాకా వచ్చేలా చేయరాదని పేర్కొంది.కాగా, హైకోర్టు ఏం చెప్పిందంటే.. ‘తన వద్ద పట్టుబడిన నకిలీ నోట్ల గురించి పిటిషనర్ ఎటువంటి వివరణ ఇవ్వలేదు. అందుకే, శిక్ష నిలిపివేత, బెయిల్ మంజూరుకు తగు ప్రాతిపదిక లేదు. మొదటి దరఖాస్తును తిరస్కరించిన రెండు నెలల లోపలే బెయిల్ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకున్నాడు. అందుకే, సగం శిక్షా కాలం పూర్తయ్యాక మరోసారి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు’ అని పేర్కొంది. సాధారణ చట్ట ఉల్లంఘనలకు సంబంధించిన కేసుల్లో నిందితులకు బెయిల్ తిరస్కరించ వద్దని గతంలో ట్రయల్ కోర్టును, హైకోర్టులను కూడా సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టం చేసిందని ధర్మాసనం గుర్తు చేసింది. -
‘మీరు పనులు చేయకపోతే.. న్యాయ వ్యవస్థ చూస్తూ కూర్చోవాలా?’
న్యూఢిల్లీ: రాష్ట్రపతిని ఆదేశించే అధికారం న్యాయ వ్యవస్థకు లేదని , సుప్రీంకోర్టు సూపర్ పార్లమెంట్‌గా వ్యవహరించవద్దని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ, సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ కౌంటరిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిర్దేశించబడిన పనులను ఆయా శాఖలు సరిగా చేయకపోతే న్యాయవ్యవస్థ జోక్యం అనేది కచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ రోజు(శుక్రవారం) ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన కపిల్ సిబాల్.. ‘కార్యనిర్వాహక శాఖ తన పని తాను చేయకపోతే జోక్యం చేసుకునే హక్కు న్యాయవ్యవస్థకు ఉంది. అది ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థకు కల్పించబడిన స్వతంత్ర హక్కు.కార్యనిర్వాహక శాఖ దాని పని అది చేయకపోతే అప్పుడు న్యాయవ్యవస్థ కచ్చితంగా జోక్యం చేసుకుంటుంది. అది కోర్టులకు కల్పించబడ్డ ప్రాథమిక హక్కు. ఈ దేశంలోని ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ అనేది స్వతంత్రంగా పని చేస్తుంది’ అని పేర్కొన్నారు. ‘ఉప రాష్ట్రపతి వ్యాఖ్యలు నన్ను దిగ్భ్రాంతికి, ఆశ్చర్యానికి గురి చేశాయి. ప్రస్తుత రోజుల్లో దేశంలో ఎవరైనా దేనిపైనైనా నమ్మకం ఉంచుతున్నారంటే అది న్యాయవ్యవస్థే. మన దేశంలో రాష్ట్రపతికి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. నామమాత్రంగానే వ్యవహరిస్తారు. కేవలం క్యాబినెట్ సలహాలతోనే రాష్ట్రపతి ముందుకు వెళతారు. అంతేకానీ ఇక్కడ రాష్ట్రపతికి ఎటువంటి వ్యక్తిగత అధికారాలు లేవు’ అని కపిల్ సిబాల్ స్పష్టం చేశారు.జగదీప్ ధన్‌ఖడ్ ఏమన్నారంటే..రాష్ట్రపతిని ఆదేశించే అధికారం న్యాయ వ్యవస్థకు లేదని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు సూపర్ పార్లమెంట్‌గా వ్యవహరించవద్దని. ప్రజాస్వామ్య వ్యవస్థలపై సుప్రీంకోర్టు అణు క్షిపణి ప్రయోగించాలనుకోవడం సమంజసం కాదన్నారు. పరిశీలన కోసం రాష్ట్ర గవర్నర్లు పంపించిన బిల్లులపై నిర్ణయం తీసుకొనే విషయంలో రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడం పట్ల జగదీప్ ధన్‌ఖడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇది నిజంగా ఆందోళనకరమని అన్నారు. ఇలాంటి పరిణామం కోసం మనం ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేదన్నారు. సుప్రీంకోర్టుకు అలాంటి ఆదేశాలిచ్చే అధికారం ఎక్కడిదని ఆక్షేపించారు. గురువారం రాజ్యసభలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థ చేయాల్సిన పనులను న్యాయ వ్యవస్థ చేయాలనుకోవడం ఏమిటని ప్రశ్నించారు. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఈ దేశంలో ఏం జరుగుతోంది? అని నిలదీశారు. -
రాష్ట్రపతిని కోర్టులు ఆదేశించలేవు
న్యూఢిల్లీ: రాష్ట్రపతిని ఆదేశించే అధికారం న్యాయ వ్యవస్థకు లేదని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తేల్చిచెప్పారు. సుప్రీంకోర్టు సూపర్ పార్లమెంట్‌గా వ్యవహరించవద్దని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై సుప్రీంకోర్టు అణు క్షిపణి ప్రయోగించాలనుకోవడం సమంజసం కాదని చెప్పారు. పరిశీలన కోసం రాష్ట్ర గవర్నర్లు పంపించిన బిల్లులపై నిర్ణయం తీసుకొనే విషయంలో రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడం పట్ల జగదీప్ ధన్‌ఖడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇది నిజంగా ఆందోళనకరమని అన్నారు. ఇలాంటి పరిణామం కోసం మనం ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేదన్నారు. సుప్రీంకోర్టుకు అలాంటి ఆదేశాలిచ్చే అధికారం ఎక్కడిదని ఆక్షేపించారు. గురువారం రాజ్యసభలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థ చేయాల్సిన పనులను న్యాయ వ్యవస్థ చేయాలనుకోవడం ఏమిటని ప్రశ్నించారు. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఈ దేశంలో ఏం జరుగుతోంది? అని నిలదీశారు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని తాను ఏనాడూ ఊహించలేదన్నారు. సుప్రీంకోర్టు సూపర్ పార్లమెంట్‌గా వ్యవహరిస్తూ ఏకంగా రాష్ట్రపతికే ఆదేశాలు జారీ చేయడం సరైంది కాదన్నారు. మన ప్రజాస్వామ్య వ్యవస్థ సుప్రీంకోర్టుకు అలాంటి అధికారాలు ఇవ్వలేదని ఉద్ఘాటించారు. న్యాయ వ్యవస్థకు చట్టాలు వర్తించడం లేదని, అందుకే పారదర్శకత కనిపించడం లేదని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ హద్దులు దాటుతోందని విమర్శించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టుకు ఇచ్చిన ప్లీనరీ అధికారాలు.. నిత్యం ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రయోగించడానికి న్యూక్లియర్ మిస్సైల్‌గా మారాయని వ్యాఖ్యానించారు.నోట్లకట్టల ఘటనలో ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు? ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో మార్చి 14న నోట్ల కట్టలు దొరికిన ఘటనపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని జగదీప్ ధన్‌ఖడ్ ప్రశ్నించారు. న్యాయమూర్తులు విచారణకు అతీతమా? అని ప్రశ్నించారు. వారికి అలాంటి వెసులుబాటు ఉందా? అని అడిగారు. సాధారణ పౌరుల ఇంట్లో నగదు దొరికి ఉంటే దర్యాప్తు ఎలక్ట్రానిక్ రాకెట్ వేగంతో జరిగేదని చెప్పారు. యశ్వంత్ వర్మ విషయంలో దర్యాప్తు కనీసం ఎడ్లబండి వేగంతోనూ జరగడం లేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రత అనేది దర్యాప్తు నుంచి రక్షణ పొందడం కాకూడదని తెలిపారు. -
‘సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం’
హైదరాబాద్: కేంద్రం సవరణ చేసిన వక్ఫ్ బోర్డు బిల్లుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ప్రభుత్వ సలహా దారు షబ్బీర్ అలీ సంతోషం వ్యక్తం చేశారు. రాజ్యాంగం మీద ముస్లింలకు నమ్మకం ఉందని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ‘వక్ఫ్ బోర్డ్ పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. కేంద్రం సవరణ చేసిన వక్ఫ్ బోర్డ్ బిల్లును మేము సుప్రీంకోర్టులో చాలెంజ్ చేశాం. మా తరఫున కపిల్ సిబాల్ వాదించారు. కేవలం ఒక మతానికి మాత్రమే చట్టం ఎలా చేస్తారు?. వక్ఫ్ భూములు గవర్నమెంట్ ఇచ్చిన భూములు కావు...దాతలు ఇచ్చిన భూములు పేద ముస్లింలకు చెందాలని ఇచ్చారు. వక్ఫ్ బోర్డు లో మహిళలు ఉన్నారుతెలంగాణలో,ఏపీలో మహిళలు కూడా ఉన్నారు. అన్ని మతాల దేవాలయాల భూములు కబ్జా చేస్తున్నారు. అన్నిటికీ చట్టం తీసుకొని రావాలి.... అప్పుడు స్వాగతిస్తం. వేరే వేరే మతాల వారిని బోర్డులో నియమించడం వల్ల గొడవలు జరుగుతాయి’ అని షబ్బీర్ అలీ పేర్కొన్నారు.కాగా, వక్ఫ్ సవరణ చట్టం 2025పై దేశసర్వోన్నత న్యాయస్థానం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వక్ఫ్‌పై సమాధానం ఇచ్చేందుకు కేంద్రం వారం గడువు కోరగా.. న్యాయస్థానం అందుకు అంగీకరించింది. వక్ఫ్ ఆస్తులు, నియామకాలపై సుప్రీంకోర్టు స్టేటస్ కో విధిస్తూ తదుపరి విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది.వక్ఫ్ (సవరణ) చట్టం 2025ను సవాల్ చేస్తూ 73 పిటిషన్లు నమోదు కాగా.. గురువారం వరుసగా రెండో రోజూ సుప్రీం కోర్టు వాదనలు వింది. కొన్ని అంశాలతో ప్రాథమిక సమాధానం ఇవ్వడానికి కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వారం గడువు కోరారు. తదుపరి విచారణ వరకు వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయబోమని తెలిపారు. -
సుప్రీం కోర్టు తీర్పు.. ఉపరాష్ట్రపతి హాట్ కామెంట్స్
న్యూఢిల్లీ: శాసనసభలు ఆమోదించిన బిల్లులను ఆమోదించడం లేదంటే తిప్పి పంపే విషయంలో గవర్నర్‌తో పాటు రాష్ట్రపతికీ ఇటీవల సుప్రీం కోర్టు గడువు విధించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. న్యాయస్థానాలు రాష్ట్రపతిని నిర్దేశించే పరిస్థితి ఉండకూడదంటూ వ్యాఖ్యలు చేశారాయన. రాజ్యసభ ఇంటర్న్స్ 6వ బ్యాచ్‌ను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. న్యాయస్థానాలు రాష్ట్రపతిని నిర్దేశించే పరిస్థితి ఉండకూడదన్నారు. అదే జరిగితే రాజ్యాంగంలోకి ఆర్టికల్ 142 కింద సుప్రీం కోర్టు తనకున్న ప్రత్యేక అధికారాలను.. ప్రజాస్వామ్య శక్తులపై ఒక అణ్వాయుధాన్నే ప్రయోగించినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. సుప్రీం కోర్టు నిర్దిష్ట సందర్భాల్లో ఈ అధికారాన్ని విస్తృతంగా ఉపయోగించడం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రభావం పడుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారాయన.తమిళనాడు పెండింగ్ బిల్లుల వ్యవహారంపై జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ నేతృత్వంలోని ధర్మాసనం సంచలన తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. తమిళనాడు శాసనసభ ఆమోదించిన పది బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్ ఎన్ రవికుమార్ తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమన్న సర్వోన్నత న్యాయస్థానం.. ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సివస్తే అందుకు గవర్నర్ తీసుకోదగిన అత్యధిక గడువు ఒక నెల మాత్రమేనని తన తీర్పులో స్పష్టం చేసింది. ఈ తీర్పు వెలువడిన తర్వాత తమిళనాడు ప్రభుత్వం 10 పెండింగ్ బిల్లుల్ని చట్టాలుగా ప్రకటించింది.అయితే అటుపై రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లులను ఉద్దేశించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలే చేసింది. గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. గవర్నర్ పంపిన బిల్లులను రాష్ట్రపతి ఎటూ తేల్చకపోతే అప్పుడు రాష్ట్రాలు నేరుగా తమను ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు చెప్పడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ తీర్పుపై కేంద్రం ప్రభుత్వం సమీక్షకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇదే వేదిక నుంచి.. ఢిల్లీ హైకోర్టు జడ్జి బంగ్లాలో నోట్ల కట్టలు బయటపడిన వ్యవహారంపైనా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ స్పందించారు. ఘటన జరిగి నెలరోజులు గడుస్తున్నా.. ఎఫ్ఐఆర్ లేకపోవడం, దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడం, జడ్జిలకు కలిగే ఉపశమనం గురించీ ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. -
వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పు చేయొద్దు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, సాక్షి: వక్ఫ్ సవరణ చట్టం 2025పై దేశసర్వోన్నత న్యాయస్థానం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వక్ఫ్‌పై సమాధానం ఇచ్చేందుకు కేంద్రం వారం గడువు కోరగా.. న్యాయస్థానం అందుకు అంగీకరించింది. వక్ఫ్ ఆస్తులు, నియామకాలపై సుప్రీంకోర్టు స్టేటస్ కో విధిస్తూ తదుపరి విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది. వక్ఫ్ (సవరణ) చట్టం 2025ను సవాల్ చేస్తూ 73 పిటిషన్లు నమోదు కాగా.. గురువారం వరుసగా రెండో రోజూ సుప్రీం కోర్టు వాదనలు వింది. కొన్ని అంశాలతో ప్రాథమిక సమాధానం ఇవ్వడానికి కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వారం గడువు కోరారు. తదుపరి విచారణ వరకు వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయబోమని తెలిపారు. ఈ క్రమంలో.. వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పు చేయొద్దని సీజేఐ నేతృత్వంలోని బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ‘‘వక్ఫ్ బోర్డులో నూతన నియామకాలు చేయొద్దు. వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించొద్దు. వక్ఫ్, వక్ఫ్ బై యూజర్ ఆస్తులను డీ నోటిఫై చేయొద్దు వక్ఫ్ ఆస్తులు, నియామకాలపై స్టేటస్ కో విధిస్తున్నాం. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలకు వారం రోజుల్లో సవివర రిప్లై దాఖలు చేయాలి. మరో ఐదు రోజుల్లో రిజైన్డర్ దాఖలు చేయాలి’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కె.వి.విశ్వనాథన్‌ల త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. గత విచారణలో(బుధవారం).. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వక్ఫ్ సవరణ చట్టం మత స్వేచ్ఛ హక్కుకు భంగం కలిగిస్తుందిఇది రాజ్యాంగ విరుద్ధమైన చట్టంవక్ఫ్ అంటే ఇస్లాం కు అంకితమైందికేంద్రప్రభుత్వం తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలుజేపిసీ ద్వారా సంపూర్ణంగా అన్ని వర్గాలతో చర్చలు జరిపామువక్ఫ్ అనేది కేవలం చారిటీకి సంబంధించినది మాత్రమేహిందూ ధార్మిక సంస్థలను కూడా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయిహిందూయేతర అధికారులు హిందూ ధార్మిక సంస్థలను నిర్వహిస్తున్నారువక్ఫ్ భై యూజర్ ద్వారానే అనేక మసీదులను ఏర్పాటు చేశారురిజిస్టర్ చేసుకోవడంలో మసీదులకున్న అభ్యంతరం ఏమిటి సుప్రీంకోర్టు సీజేఐ వ్యాఖ్యలుసుదీర్ఘకాలంగా ముస్లిం కార్యక్రమాలకు వాడుతున్న (వక్ఫ్ బై యూజర్) ఆస్తులను డినోటిఫై చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయివక్ఫ్ బై యూజర్ ఆస్తులను రిజిస్టర్ చేయడం కష్టం..అయితే ఇది దుర్వినియోగమైందిఅయితే నిజంగా ముస్లిం ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న ఆస్తులు కూడా ఉన్నాయిహిందువుల ఆస్తులను హిందువులే నిర్వహిస్తున్నారు కదాపార్లమెంటుకు చట్టాలు చేసే అధికారం లేదా ?హిందువుల కోసం కూడా పార్లమెంట్ చట్టాలు చేస్తుంది కదాఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ భూమి లోనే ఉందని అంటున్నారు చారిత్రక , పురావస్తు ఆస్తులను వక్ఫ్ గా ప్రకటించడానికి వీలు లేదువక్ఫ్ పిటిషన్లపై విచారణ వేళ.. హైలైట్స్‌అంతకు ముందు.. వక్ఫ్ పిటిషన్ల విచారణను లైవ్ టెలికాస్ట్ కోరుతూ సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్ లేఖ రాసింది. బుధవారం విచారణ టైంలో కిక్కిరిసిపోయిన కోర్టు హాల్లో కనీసం నిలబడటానికి కూడా స్థలం సరిపోలేదని, ఊపిరి ఆడక ఇద్దరు లాయర్లు స్పృహ కోల్పోయారని లేఖలో ప్రస్తావించింది.సుప్రీంకోర్టు మార్గదర్శకాలపై ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ హర్షంహైదరాబాద్: వక్ఫ్ (సవరణ) బిల్లుపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలపై ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ హర్షం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు వైఖరి దేశవ్యాప్తంగా ముస్లింలకు ఊరట కలిగించిందన్నారు. న్యాయ వ్యవస్థపై విశ్వాసం మరింత బలోపేతం చేసిందన్నారు. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంలో జరిగిన పరిణామాలను స్వాగతిస్తున్నామన్నారు. 👉అధికారంలోకి రాగానే వక్ఫ్ చట్టాన్ని అడ్డుకుంటాం. బీహార్‌ను వక్ఫ్ అల్లర్లతో మరో బెంగాల్(ముర్షిదాబాద్)గా మార్చాలని వాళ్లు(కేంద్రంలోని బీజేపీ) అనుకుంటున్నారు. ఆర్జేడీ నాయకత్వంలో అది అయ్యే పని కాదు అని తేజస్వి యాదవ్ అన్నారు. 👉వక్ఫ్ చట్టం దేశ ప్రజల మధ్య ఐక్యతను క్రమంగా తుడిచిపెట్టేందుకేనని కేంద్రంలోని ఎన్డీయే సర్కారు వక్ఫ్ సవరణ చట్టం తెచ్చిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆరోపించారు. ఇది ఫెడరలిజాన్ని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 26ను ఉల్లంఘించడమేనని అన్నారాయన. రాజ్యాంగ విరుద్ధమైన ఈ చర్య ద్వారా.. ఆరెస్సెస్, బీజేపీలు వక్ఫ్ చట్టం ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నాయని విమర్శించారు. ఇండియా కూటమి.. కలిసి పోరాడుదాంరాజ్యాంగ విరుద్ధమైన వక్ఫ్ సవరణ చట్టం అడ్డుకునేందుకు ప్రతిపక్ష కూటమి ఇండియా కలిసి రావాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పిలుపు ఇచ్చారు. సొంత దేశంలో ముస్లింలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వం.. సౌదీ అరేబియా, దుబాయ్ లాంటి పశ్చిమ ఆసియా దేశాల నుంచి ఆతిథ్యం మాత్రం స్వీకరిస్తున్నారని మండిపడ్డారు. ఏకతాటిపైకి వచ్చి వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి పార్టీలు పోరాడాలని ఆమె అంటున్నారు. -
సీఈసీ, ఈసీల నియామకంపై మే14న సుప్రీం విచారణ
న్యూఢిల్లీ: 2023 చట్టం ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ), ఎన్నికల కమిషనర్లు(ఈసీల) నియామకాలను చేపట్టడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై మే 14వ తేదీన విచారించనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఈ అంశంపై సత్వరం విచారణ చేపట్టాలంటూ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన వినతి మేరకు బుధవారం జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 19న సుప్రీంకోర్టు ప్రకటించిన విధంగా వాస్తవానికి ఈ పిటిషన్లపై బుధవారమే విచారణ చేపట్టాల్సి ఉంది. అయితే, భూ సేకరణకు సంబంధించిన కీలకమైన అంశాలున్నందున వాయిదా వేయాల్సి వచ్చిందని ధర్మాసనం తెలిపింది. మే 14వ తేదీన తప్పక విచారిస్తామంది. -
వాటిని వక్ఫ్ ఆస్తులుగా భావిస్తాం: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదమైన వక్ఫ్(సవరణ) చట్టం,2025ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ తొలిరోజే సర్వోన్నత న్యాయస్థానం పిటిషనర్లకు కాస్తంత ఊరట కల్గించేలా వ్యాఖ్యానించింది. సుదీర్ఘకాలంగా ముస్లిం మత, దాతృత్వ కార్యక్రమాలతో సంబంధముండి వక్ఫ్ అ«దీనంలో ఉన్న ఆస్తులను(వక్ఫ్ బై యూజర్) ఇకమీదటా వక్ఫ్ ఆస్తులుగానే పరిగణించాలని భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమా ర్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. ఆ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలని యోచిస్తున్నట్లు ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఆ దిశగా ఉత్తర్వులు, ఆదేశాలు ఇవ్వడానికంటే ముందు ఈ పిటిషన్లపై పూర్తిగా విచారణ చేపట్టాలని ప్రభుత్వం కోరింది. ‘‘ ఆస్తులు ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా వక్ఫ్ అ«దీనంలో ఉన్నాయా? రిజిస్ట్రర్ డాక్యుమెంట్లతో వక్ఫ్ కు దఖలుపడ్డాయా? అనేది తేలకుండానే ‘వక్ఫ్ బై యూజర్’ అనే నిబంధనను తొలగించలేం. ఎక్స్–అఫీషియో సభ్యులు మినహా వక్ఫ్ బోర్డులు, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లలో అందరూ ముస్లింలే సభ్యులుగా ఉండాలి’’ అని ధర్మాసనం స్పష్టంచేసింది. వక్ఫ్(సవరణ)చట్టం చట్టబద్ధతను సవాల్‌చేస్తూ దాఖలైన డజన్లకొద్దీ పిటిషన్లను బుధవారం విచారించడం మొదలెట్టాక తొలుత వీటిని హైకోర్టుకు బదలాయించాలని సుప్రీంకోర్టు భావించింది. అయితే ఈ ఆలోచనపై పిటిషన్ల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, కపిల్ సిబల్, హుజేఫా అహ్మదీ, వైఎస్సార్సీపీ తరఫున వాదించిన ఎస్.నిరంజన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావంచూపగల ఈ కేసులను సుప్రీంకోర్టులోనే విచారించాలని కపిల్ సిబల్ గట్టిగా వాదించారు. తర్వాత కోర్టు కేసును గురువారం మధ్యాహ్నానికి వాయిదావేసింది. ఆనాటి ఆస్తులకు పత్రాలుంటాయా? వక్ఫ్ ఆస్తిగా నమోదుచేయాలంటే వాటి డాక్యుమెంట్లు కచి్చతంగా సమర్పించాలంటూ చట్టంలోని సెక్షన్ 2ఏలో పేర్కొనడంపై సీజేఐ జస్టిస్ ఖన్నా అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘‘ ఢిల్లీలోని జామా మసీదునే ఉదాహరణగా తీసుకుందాం. వందల ఏళ్లుగా వాళ్ల అ«దీనంలో ఉన్న ఇలాంటి పాత ఆస్తులకు రిజిస్టర్ చేయాలంటే ఇప్పుడు డాక్యుమెంట్లు తీసుకురమ్మంటే ఎలా?. అలాంటి ఆస్తులకు డాక్యుమెంట్లు వాళ్ల దగ్గర ఉంటాయా? ’’ అని సీజేఐ.. కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించారు. గతాన్ని మీరు మార్చలేరు అని కేంద్రానుద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘ వక్ఫ్ ఆస్తుల్లో కొన్ని దురి్వనియోగం అయిన మాట వాస్తవమే. అంతమాత్రాన దాన్ని సాకుగా చూపి ‘వక్ఫ్ బై యూజ్’ నిబంధనను తొలగిస్తామంటే కొత్త సమస్యలొస్తాయి. వక్ఫ్ బై యూజర్‌ను కోర్టులు గతంలోనే ధృవీకరించాయి. కోర్టు తీర్పులు, ఉత్తర్వులు, నిర్ణయాలను ప్రభుత్వాలు నిర్ణయించకూడదు. మీరు కేవలం ప్రాతిపదికను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి’’ అని కేంద్రాన్ని ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. వక్ఫ్ చట్టం తమకొద్దని చాలా మంది ముస్లింలు చెబుతున్నారని తుషార్ మెహతా చెప్పగా కోర్టు కలుగజేసుకుని ‘‘ అయితే మీరు హిందూ దాతృత్వ ట్రస్టుల్లోనూ ముస్లింలను సభ్యులుగా చేరుస్తామని చెప్పదల్చుకున్నారా?’’ అని సూటి ప్రశ్న వేసింది. ‘‘ వక్ఫ్ చట్టంపై ఇప్పటికే సంయుక్త పార్లమెంటరీ కమిటీ 38 సార్లు సమావేశమైంది. ఏకంగా 98.2 లక్షల మెమోరండంలను కమిటీ పరిశీలించింది. తర్వాతే పార్లమెంట్ ఉభయసభల్లో బిల్లు ఆమోదం పొందింది’’ అని మెహతా చెప్పుకొచ్చారు. దీంతో సీజేఐ స్పందించారు. ‘‘ ఇక్కడ రెండు విషయాలు తేలాలి. ఈ కేసులన్నింటినీ హైకోర్టుకు బదలాయించాలా? లేదంటే అసలు మీరు సుప్రీంకోర్టు ద్వారా ఏం ఆశిస్తున్నారు? ఏం వాదించాలనుకుంటున్నారు? అంటూ కేంద్రంంతోపాటు పిటిషనర్లకు నోటీసులు ఇచ్చారు. వాటికి సమాధానం చెప్పాలని ఆదేశించారు. ‘‘ చట్టంపై ఆందోళనల్లో హింస చోటుచేసుకోవడం ఆందోళనకరం. ఓవైపు ఈ అంశం కోర్టుల పరిధిలో పరిశీలనలో ఉండగా మరోవైపు ఆందోళనలు,హింస చెలరేగడం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది’’ అని అన్నారు. వెంటనే తుషార్ మెహతా కలుగజేసుకుని ‘‘ఇలా ఆందోళనలు చేయడం ద్వారా వ్యవస్థపై వాళ్లు తీవ్రమైన ఒత్తిడిని తేద్దామని చూస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ ఎవరు ఎవరిపై ఒత్తిడి తెస్తున్నారు? మాకైతే అర్థంకావట్లేదు’’ అని సిబల్ బదులిచ్చారు. ‘‘ సానుకూల అంశాలపైనా చర్చిద్దాం’’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. ఏ ప్రాతిపదికన ముస్లింగా నిర్ధారిస్తారు? పిటిషనర్ల తరఫున కపిల్ సిబల్ వాదించారు. ‘‘ నేను ముస్లింనా కాదా అనే విషయాన్ని ఏ రకంగా కేంద్రం నిర్ధారిస్తుంది?. ఇతను వక్ఫ్‌కు ఆస్తిని, ఇతరత్రాలను దానంగా ఇవ్వడానికి అర్హుడు అని కేంద్రం ఎలా నిర్ధారించుకుంటుంది?. గత ఐదేళ్లుగా ఇస్లాంను ఆచరిస్తున్న వాళ్లే దానం ఇవ్వాలని చెప్పే హక్కు కేంద్రానికి ఎక్కడిది?’’ అని కోర్టులో సిబల్ వాదించారు. దశాబ్దాలుగా ఆచరణలో ఉన్న ‘వక్ఫ్ బై యూజర్’ను ఏకపక్షంగా తొలగించకూడదని లాయర్ హుజేఫా అహ్మదీ కోరారు. వైఎస్సార్సీపీ, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్, జమియత్ ఉలేమా–ఇ–హింద్ అధ్యక్షుడు అర్షద్ మదానీ, సమస్థ కేరళ జమియతుల్ ఉలేమా, అంజుమ్ ఖదారీ, తయ్యబ్ ఖాన్ సల్మానీ, మొహమ్మద్ షఫీ, మొహమ్మద్ ఫజుల్‌రహీమ్, ఆర్జేడీ ఎంపీ మనోజ్‌కుమార్ ఝా, డీఎంకే, కాంగ్రెస్ ఎంపీలు ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ, మొహమ్మద్ జావేద్, తదితరులు మొత్తంగా 72 పిటిషన్లను వక్ఫ్ చట్టాన్ని సవాల్‌చేస్తూ దాఖలు చేశారు. ఈ అంశంలో సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీచేయకుండా ముందస్తుగా కేంద్రం ఏప్రిల్ 8వ తేదీన కెవియట్ పిటిషన్ దాఖలుచేసింది. దీంతో పటిషన్ల విచారణ మొదలుకాకుండానే సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి తాత్కాలిక ఉత్తర్వులురాకుండా అడ్డుకోగలిగింది.కేంద్రానికి సుప్రీంకోర్టు సంధించిన కీలక ప్రశ్నలు ⇒ ముస్లిమేతరులూ వక్ఫ్ బోర్డుల్లో ఉండేందుకు కొత్త చట్టం అనుమతిస్తోంది. మరి హిందూ ఆలయాల నిర్వహణ బాధ్యతలు చూసే ట్రస్టుల్లో ముస్లింలను సభ్యులుగా కేంద్రప్రభుత్వం అనుమతిస్తుందా? ⇒ బ్రిటిషర్లు రానంతవరకు భారత్‌లో భూములకు రిజి్రస్టేషనే లేదు. కొన్ని మసీదులను 14వ, 15వ శతాబ్దంలో నిర్మించారు. వాటికి సేల్‌డీడ్ లాంటివి తేవడం అసాధ్యం. శతాబ్దాలుగా వక్ఫ్ ఆస్తులుగా కొనసాగుతున్న మసీదులు, ఇతర ఆస్తుల హక్కుల పత్రాలు, డాక్యుమెంట్లను ముస్లింలు ఇప్పుడెలా తీసుకురాగలరు? ⇒ విచారణ, దర్యాప్తు పూర్తిచేసి అధీకృత అధికారి నిర్ధారించనంతవరకు సంబంధిత ఆస్తి వక్ఫ్‌ది కాదు అని ప్రభుత్వం చెబుతోంది. అలా నిర్ధారణ సాధ్యంకాని ఆస్తులన్నీ ప్రభుత్వానికి చెందుతాయా? ⇒ వక్ఫ్(సవరణ)చట్టం,2025 అమల్లోకి రాకముందు వరకు వక్ఫ్ బై యూజర్ నిబంధన అమల్లో ఉంది. ఇప్పుడు అది మనుగడలో లేదంటారా? ⇒ గతంలో కొన్ని ఆస్తులు వక్ఫ్ ఆస్తులేనని కోర్టు తీర్పులే స్పష్టంచేస్తున్నాయి. కొత్త చట్టంలోని సెక్షన్ 2ఏతో ప్రభుత్వం ఆ తీర్పులను చెల్లనివిగా మారుస్తోందా? -
‘కంచ’లోనే లోపలేస్తాం!
సాక్షి, న్యూఢిల్లీ: ‘అభివృద్ధి పేరుతో మూడు రోజుల్లోనే వందల బుల్డోజర్లను ఉపయోగించి 100 ఎకరాల్లో చెట్లను తొలగించారు. చెట్ల నరికివేతను ఏ రకంగానూ సమర్ధించుకోవాలని చూడొద్దు. చెట్ల నరికివేతకు అసలు అనుమతులు తీసుకున్నారా లేదా? ఈ ప్రశ్నకు మాకు సూటిగా సమాధానం చెప్పండి. ఒకవేళ అనుమతులు తీసుకోకపోయి ఉంటే మాత్రం అందుకు బాధ్యులైన అధికారులందరినీ జైలుకు పంపుతాం. వారి కోసం అదే ప్రాంతంలో తాత్కాలిక జైలు నిర్మించి మరీ ఊచలు లెక్కబెట్టిస్తాం’అంటూ కంచ గచ్చిబౌలి భూముల కేసులో రాష్ట్ర ప్రభుత్వంపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జార్జ్ అగస్టీన్ మసీలతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో 1996లో తామిచ్చిన తీర్పునకు విరుద్ధంగా ప్రవర్తించిన అధికారులే బాధ్యులవుతారనే విషయాన్ని మర్చిపోవద్దని హెచ్చరించింది. వంద ఎకరాల్లో అటవీ సంరక్షణ కోసం చట్టప్రకారం తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని ఆదేశించింది. తాము చేపట్టబోయే తీవ్ర చర్యల నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, ఇతర కార్యదర్శులను కాపాడాలనుకుంటే 100 ఎకరాల్లో పర్యావరణాన్ని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని తేల్చిచెప్పింది. పునరుద్ధరణకు సంబంధించిన ప్రణాళికతోనే మా ముందుకు రావాలని స్పష్టం చేసింది. కంచ గచ్చిబౌలి వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. సుమారు అరగంటపాటు సాగిన వాదనల అనంతరం కేసు విచారణను మే 15కు వాయిదా వేసింది. అప్పటివరకు స్టేటస్ కో కొనసాగుతుందని తెలిపింది. చెట్ల తొలగింపుపై తమ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పర్యటించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (సీఈసీ) సమర్పించిన నివేదికపై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేందుకు 4 వారాల గడువు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ, మేనక గురుస్వామి, ‘బీ ద ఛేంజ్ వెల్ఫేర్ సొసైటీ’పిటిషన్ తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు, పి.మోహిత్‌రావు, మరో పిటిషన్ తరఫున ఎస్.నిరంజన్‌రెడ్డి, కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. అభివృద్ధి చేసేందుకే.. అంతకుముందు అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు ప్రారంభిస్తూ అన్ని అనుమతులతోనే ఆ భూముల్లో చెట్లను (పొదలు) తొలగించామన్నారు. చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకున్నారా అని ఈ సందర్భంగా ధర్మాసనం ఎదురు ప్రశ్నించింది. తెలంగాణలో వాటర్ అండ్ ట్రీ (వాల్టా) యాక్ట్ ఉందంటూ అమికస్ క్యూరీ పరమేశ్వర్ జోక్యం చేసుకొని ధర్మాసనానికి వివరించగా ఈ చట్టం కింద అనుమతులు తీసుకోకుంటే అందరిపై చర్యలు తీసుకుంటామని ధర్మాసనం బదులిచ్చింది. ఆ భూములను రూ. 10 వేల కోట్లకు తనఖాపెట్టి ప్రభుత్వం అప్పు తెచ్చుకుందని అమికస్ క్యూరీ పేర్కొనగా ఆయన వ్యాఖ్యలను ధర్మాసనం తోసిపుచ్చింది. ‘ఆ భూములను మార్టిగేజ్ చేశారా లేదా అమ్ముకున్నారా అనేది మాకు అనవసరం. అక్కడ చెట్ల నరికివేతకు అనుమతి తీసుకున్నారా? లేదా అనేది మాత్రమే మాకు సూటిగా జవాబు చెప్పండి’అంటూ సింఘ్వీని ప్రశ్నించింది. ఆ ప్రాంతంలో కొన్ని షెడ్యూల్డ్ జంతువులు ఉన్నాయని.. అక్కడ పనులు జరిగేటప్పుడు ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదని ‘బీ ద ఛేంజ్ వెల్ఫేర్ సొసైటీ ’తరుఫు సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు, మోహిత్‌రావులు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో జేసీబీలు ఉన్నాయని చెప్పారు. హెచ్సీయూకు 25 వేల ఎకరాల భూమి ఉందని.. అందులో 400 ఎకరాల భూవివాదం 2004 నుంచి కొనసాగుతోందని సింఘ్వీ ధర్మాసనానికి వివరించారు. దీనికి సంబంధించి కోర్టు తీర్పులు, 20 ఏళ్లలో ఆ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి ఎంతో జరిగిందన్నారు. ఈ స్థలంలో ప్రభుత్వ నిర్ణయంతో ఎంతో మందికి జీవనోపాధి, ఉద్యోగాలు కల్పించబోతున్నట్లు చెప్పారు. సీఎస్ ఒక మహిళ అని, ఆమె నెల రోజుల్లో రిటైరవనున్నారని సింఘ్వీ ధర్మాసనానికి వివరించారు. జేసీబీలు వచ్చిన విషయం సీఎస్‌కు తెలియదా? ఈ సందర్భంగా ధర్మాసనం మళ్లీ స్పందిస్తూ ‘మేం పదేపదే చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకున్నారా లేదా అని అడుగుతున్నాం. ఈ ప్రశ్నకు మాకు సూటిగా మీ సమాధానం కావాలి’అంటూ వ్యాఖ్యానించింది. ‘సీఎస్ నెల రోజుల్లో రిటైరవుతున్నారంటే ఎలా సింఘ్వీజీ? ఆ ప్రాంతంలో జేసీబీలు వచ్చిన విషయం సీఎస్‌కు తెలియదా? రాష్ట్రంలో జరుగుతున్న విషయాలకు సీఎస్ బాధ్యత వహించాలి కదా?’అంటూ జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. ‘అడవి అనే పదానికి నిర్వచనం ఇస్తూ 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా చెట్ల నరికివేత జరిగి ఉంటే మాత్రం మేం ఊపేక్షించం. చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకోవాలనే విషయం కూడా ప్రభుత్వానికి తెలియదా? అంటూ ధర్మాసనం నిలదీసింది. మహానగరాల్లో అటవీభూముల్లో కాపాడుకోకపోతే ఎలా? ‘చార్ధామ్ యాత్ర కోసం రోడ్డు నిర్మాణానికి చెట్లు తొలగిస్తామంటేనే మేం అనుమతించలేదు. మహారాష్ట్రలో సచివాలయ నిర్మాణం కోసం పర్యావరణానికి నష్టం కలిగించిన కేసు రెండు దశబ్దాలుగా సుప్రీంకోర్టులోనే పెండింగ్‌లో ఉందనే విషయాన్ని మర్చిపోవద్దు. ముంబై, చెన్నై, హైదరాబాద్ లాంటి మహానగరాల్లోని అటవీ భూముల్ని కూడా కాపాడుకోలేకపోతే ఎలా? అంటూ ప్రశ్నలు సంధించింది. మంత్రులు ఏది చెబితే అధికారులు అది చేసేస్తున్నారంటూ అమికస్ క్యూరీ పరమేశ్వర్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లగా ‘పర్యావరణానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లను జైళ్లకు పంపించాల్సి వస్తుంది జాగ్రత్త. చెట్లను కొట్టేసిన దగ్గరే తాత్కాలిక జైలు నిర్మిస్తాం. సంబంధిత అధికారులను అదే జైలులో 6 నెలలపాటు ఊచలు లెక్కబెట్టిస్తాం’అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ వంద ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారు? చెట్లు కొట్టేసిన ప్రాంతంలో పర్యావరణ పునరుద్ధరణ కోసం తీసుకున్న చర్యలేంటి? ఆ భూముల్లో వన్యప్రాణుల్ని ఎలా రక్షిస్తారు? అక్కడి నష్టాన్ని ఎలా పూడుస్తారు?’అంటూ సింఘ్వీపై ధర్మాసనం ప్రశ్నలవర్షం కురిపించింది. విధ్వంసం చేస్తే ప్రేక్షక పాత్ర పోషించాలా? ఆ ప్రాంతంలో ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు సిద్ధపడిందని.. ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నందునే ఆ ప్రాంతమంతా దట్టమైన పొదలతో అడవిలా తయారైందని సింఘ్వీ వాదించారు. ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేసి ఎందరో నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించనుందని ధర్మాసనానికి చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ‘అభివృద్ధి, ఉద్యోగాల కల్పన పేరుతో మీరు పర్యావరణాన్ని విధ్వంసం చేస్తుంటే మేం ప్రేక్షకపాత్ర పోషించాలా?. మీకు మీరే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఏమిటి? మూడు రోజుల్లో 100 ఎకరాలు ధ్వంసం చేశారంటే ఎన్ని బుల్డోజర్లు అక్కడ ఉన్నట్లు? మీరు సృష్టించిన రణరంగానికి అక్కడి జంతువులు ప్రాణభయంతో పరుగులు తీయగా వాటిని కుక్కలు కరిచాయి. ఆ వీడియోలను చూసి చలించిపోయాం’అని పేర్కొంది. అయితే ఆ భూముల్లో జంతువులు లేవని.. కావాలనే కొందరు నకిలీ వీడియోలు సర్క్యులేట్ చేశారని సింఘ్వీ బుదులివ్వగా ధర్మాసనం ఆక్షేపించింది. అక్కడ జంతువులు పరుగులు తీసిన వీడియోలను తాము చూసి చలించిపోయమని తెలిపింది. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని సింఘ్వీ ధర్మాసనానికి బదులిచ్చారు. దీనిపై తదుపరి విచారణను ధర్మాసనం మే 15కు వాయిదా వేసింది. -
కంచ గచ్చిబౌలి భూములపై సర్కారు వితండవాదం తగదు
ఢిల్లీ, సాక్షి: కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వితండవాదాన్ని మానుకోవాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. కంచ గచ్చిబౌలి భూములపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఈ తరుణంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం 100 ఎకరాల్లో చెట్లను పునరుద్ధరించాలి. చీఫ్ సెక్రటరీకి తెలియకుండా సీఎం రేవంత్ రెడ్డి చెట్ల నరికివేతకు ఆదేశాలు ఇచ్చారు. కొంపలు మునిగిపోతున్నట్లుగా ఫ్లడ్‌లైట్లు పెట్టి మరి చెట్లు నరికారు. పర్యావరణ విషయంలో నాపై పోలీసులు కేసులు పెడతానంటే..రెడీ. హైదరాబాదులో ఒక్క చెట్టు కొట్టాలన్న వాల్టా చట్టం కింద అనుమతి తప్పనిసరి. ప్రభుత్వాలు నడిపేందుకు భూములు అమ్మితే భవిష్యత్తు తరాలు క్షమించవు’ అని వ్యాఖ్యానించారు. -
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బీఆర్ గవాయ్.. కొలీజియం సిఫార్సు
ఢిల్లీ: సుప్రీంకోర్టు (Supreme Court) తదుపరి చీఫ్ జస్టిస్‌గా భూషణ్ రామకృష్ణ గవాయ్ (justice Bhushan Ramkrishna Gavai) బాధ్యతలు చేపట్టనున్నారు. మే13న కానున్న ప్రస్తుత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా రిటైర్ కానున్నారు. తదుపరి సీజేఐగా జస్జిస్ గవాయ్ పేరును కొలీజియం సిఫార్సు చేసింది. అనంతరం, కొలీజియం తన ప్రతిపాదనను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసింది. కొలీజియం సిఫార్సుకు అనుగుణంగా కేంద్రం జస్టిస్ గవాయిని తదుపరి సీజేఐగా ((Chief Justice of India) నియమించింది. దీంతో సీజేఐ సంజీవ్ ఖన్నా పదవీ విరమణ అనంతరం సుప్రీం తదుపరి సీజేఐ జస్జిస్ గవాయ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆరు నెలల పాటు సుప్రీం సీజేఐగా జస్జిస్ గవాయ్కేంద్రం నిర్ణయంతో జస్టిస్ గవాయ్ సుమారు ఆరు నెలలు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. ఆయన నవంబరులో పదవీవిరమణ చేయనున్నారు. 2007లో భారత అత్యున్నత న్యాయస్థాన పదవిని చేపట్టిన జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత, ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే రెండో దళితుడు జస్టిస్ గవాయ్.జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రస్థానంమహారాష్ట్రలోని అమరావతికి చెందిన జస్టిస్ గవాయ్ 1985లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. ప్రముఖ న్యాయవాది, మహారాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి రాజా భోన్సాలేతో కలిసి పనిచేశారు. 1987 నుండి 1990 వరకు ముంబై హైకోర్టులో స్వతంత్ర న్యాయవాదిగా పని చేశారు.1992లో నాగ్‌పూర్ బెంచ్‌లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. 2000లో ప్రభుత్వ న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించారు. 2003లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ నియమితులయ్యారు. 2005లో శాశ్వత న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు. 2019లో సుప్రీంకోర్టుకు ప్రమోట్ అయ్యారు. త్వరలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బీఆర్ గవాయ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. -
గచ్చిబౌలి భూములు.. తెలంగాణ సర్కార్‌కు సుప్రీంకోర్టు హెచ్చరిక
సాక్షి, ఢిల్లీ: కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా అక్కడ చెట్ల నరికివేతపై జస్టిస్ గవాయి, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. చెట్ల నరికివేతపై సమర్థించుకోవద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే, వంద ఎకరాలను ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పండి అని ప్రశ్నించింది. తదుపరి విచారణ మే 15కు వాయిదా వేసింది. కంచె గచ్చిబౌలి భూముల అంశంపై దాఖలైన పిటిషన్లపై జస్టిస్ గవాయి, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ధర్మాసనం.. చెట్ల నరికివేతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. దీన్ని సమర్ధించుకోవద్దంటూ చురకలు అంటించింది. వాటిని ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పండి.. లేదంటే అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. చెట్ల నరికివేతకు అనుమతి తీసుకున్నారా?.. సూటిగా జవాబు చెప్పండి. వంద ఎకరాలను ఎలా పునరుద్ధరణ చేస్తారు?. పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీలేదు. వీడియోలు చూసి మేము ఆందోళనకు లోనయ్యాం. అభివృద్ధి, పర్యావరణానికి మధ్య సమతుల్యం అవసరం. ఇష్టం వచ్చినట్టు పర్యావరణాన్ని ధ్వంసం చేస్తామంటే ఊరుకోం. వాటిని ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పండి.. లేదంటే చెరువు దగ్గరే తాత్కాలిక జైలుపెట్టి అధికారులను అక్కడే ఉంచుతాం. షెల్టర్ కోసం జంతువులు పరుగులు తీస్తే.. వాటిని వీధి కుక్కలు తరిమాయి. 1996లో మేము ఇచ్చిన తీర్పుకు భిన్నంగా అధికారులు సొంత మినహాయింపులు ఇస్తే వారే బాధ్యులు అవుతారు. ప్రైవేట్ ఫారెస్టులో సైతం చెట్లు నరికితే సీరియస్‌గా పరిగణిస్తాం. భూముల తాకట్టు అంశాలతో మాకు సంబంధం లేదు. కేవలం నరికిన చెట్లను ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పాలి. డజన్ల కొద్ది బుల్డోజర్లతో అడవిలో వంద ఎకరాలు తొలగించారు. మీరు అభివృద్ధి చేసుకోవాలనుకుంటే తగిన అనుమతులు తీసుకోవాలి. సిటీలో గ్రీన్ లంగ్ స్పేస్ ఉండాలి. వన్యప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని ప్రశ్నించింది. చివరగా.. పర్యావరణ, వన్యప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెబుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అప్పటివరకు యథాతథ స్థితి కొనసాగించాలని తెలిపింది. తదుపరి విచారణ మే 15కు వాయిదా వేసింది. అనంతరం.. రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపిస్తూ.. అన్ని పనులు ఆపి వేశాం. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం. ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేశారు. మినహాయింపులకు లోబడే మేము కొన్ని చెట్లు తొలగించాం అని చెప్పుకొచ్చారు.అమికస్ క్యూరీ వాదనలు వినిపిస్తూ.. సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకుని.. అన్నింటికీ మినహాయింపులు ఇచ్చుకున్నారు. ఇది సుప్రీం తీర్పునకు విరుద్ధం. ఈ భూములు తాకట్టుపెట్టి ప్రభుత్వం అప్పులు తెచ్చుకుంది అని అన్నారు. అంతకుముందే, ఈ కేసులో ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం. కంచ గచ్చిబౌలి భూములు అటవీ భూములు కావు. 20 ఏళ్లుగా ఖాళీగా ఉండటం వల్ల పొదలు పెరిగాయి. అటవీ రెవెన్యూ రికార్డులలో వీటిని అడవులుగా పేర్కొనలేదు. ఆ భూములకు ఎలాంటి కంచె లేదు. కంచె ఏర్పాటు చేసేందుకు మేము ప్రయత్నం చేశాం. ఈ భూముల్లో ఎలాంటి జంతువులు లేవు. కంచె లేని కారణంగా హెచ్‌సీయూ భూములలోని పక్షులు ఇక్కడికి వచ్చాయని పేర్కొంది. -
కంచె లేకపోవడం వల్లే.. కంచ గచ్చిబౌలి భూములపై తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్
న్యూఢిల్లీ, సాక్షి: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు(Supreme Court)లో ఇవాళ విచారణ జరగనుంది. ఈ భూముల్లో జరుగుతున్న అన్ని కార్యాకలాపాలపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్‌తో కూడిన ధర్మాసనం ఇంతకుముందు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 16లోపు(ఇవాళ) అఫిడవిట్ సమర్పించాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, అటు ఎంపవర్డ్ కమిటీని ఆదేశించింది. ఆ ఆదేశాలకు అనుగుణంగానే.. తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) సుప్రీం కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ‘‘కంచ గచ్చిబౌలి భూములు అటవీ భూములు కావు. 20 ఏళ్లుగా ఖాళీగా ఉండటం వల్ల పొదలు పెరిగాయి. అటవీ రెవెన్యూ రికార్డులలో వీటిని అడవులుగా పేర్కొనలేదు. ఆ భూములకు ఎలాంటి కంచె లేదు. కంచె ఏర్పాటు చేసేందుకు మేము ప్రయత్నం చేశాం. ఈ భూముల్లో ఎలాంటి జంతువులు లేవు. కంచె లేని కారణంగానే హెచ్‌సీయూ భూముల్లోని పక్షులు ఇక్కడికి వచ్చాయి’’ అని కౌంటర్లో పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం. మరోవైపు.. సుప్రీం కోర్టు ఆదేశాలనుసారం క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించిన కేంద్ర సాధికార కమిటీ(సీఈసీ) నివేదికను ఇవాళ కోర్టుకు సమర్పించనుంది. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై విచారణ నేపథ్యంలో రాష్ట్ర సీఎస్ శాంతికుమారి( CS Shanti Kumari), తెలంగాణ పీసీసీఎఫ్ డోబ్రియాల్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలుచేసిన అఫిడవిట్, సీఈసీ దాఖలుచేసిన నివేదికను పరిశీలించిన తర్వాత ధర్మాసనం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.‘‘అంత అత్యవసరంగా చెట్లను నరకాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?. సీఎస్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఏం చేస్తున్నారు?. పర్యావరణ విధ్వంసంపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఇలా ఎలా చేస్తారు?. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా?. ఇది చాలా తీవ్రమైన విషయం. అవసరమైతే సీఎస్‌పై తీవ్ర చర్యలు తీసుకుంటాం’’ అంటూ తదుపరి ఆదేశాలిచ్చేదాకా అన్ని పనులు నిలిపివేయాలని ఆదేశించింది. ఒకవేళ ఉల్లంఘనలు గనుక జరిగితే సీఎస్‌దే బాధ్యత’’గత వాదనల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై సీరియస్ అయిన జస్టిస్ గవాయ్ -
వక్ఫ్ పిటిషన్లపై ‘సుప్రీం’ కీలక విచారణ.. హైలైట్స్
సాక్షి, న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన 73 పిటిషన్లను(Waqf Petitions) సుప్రీంకోర్టులో ఇవాళ (ఏప్రిల్ 16న) విచారణ జరపనుంది. కేంద్రం కేవియెట్ పిటిషన్ వేయడంతో ఇరువైపులా వాదనలను చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్‌కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. కొత్త చట్టంలోని పలు సెక్షన్లు రాజ్యాంగానికి విరుద్ధమని, జాతీయ సమగ్రతకు భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొంటూ ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు పలు సంస్థలు, ఎన్జీవోలు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లను ఉమ్మడిగా ఇవాళ మధ్యాహ్నాం సీజేఐ బెంచ్ విచారణ జరపనుంది. వక్ఫ్ సవరణ చట్టం(Waqf Amendment Law) రాజ్యాంగ విరుద్ధమని, ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా చట్టం రూపొందించారని, ఈ చట్టంతో ముస్లిం మత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని, వక్ఫ్ బోర్డులలో ముస్లిమేతరులను చేర్చడం రాజ్యాంగ విరుద్ధమేనని వైఎస్సార్సీపీ సైతం తన పిటిషన్లో పేర్కొంది.👉ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్(బిహార్)తో పాటు జేడీయూ, ఆప్, డీఎంకే, సీపీఐ, వైఎస్సార్‌షీపీ.. ఇలా ప్రధాన పార్టీలతో పాటు జమైత్ ఉలేమా హింద్, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా పిటిషన్లు వేశాయి. వక్ఫ్‌సవరణ చట్టం బిల్లు నిబంధనలు ముస్లిం సమాజ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉన్నాయని, ముస్లింల హక్కులను హరించే కుట్రగా అభివర్ణిస్తున్నాయి. ; ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. 👉బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు చట్టానికి మద్ధతుగా సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాయి. ఆ చట్టాన్ని సర్వోన్నత న్యాయస్థానం కొట్టేయబోదన్న ధీమాతో ఉంది.👉ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంలో మంగళవారం మరో పిటిషన్ దాఖలైంది. ఈ చట్టంలోని కొన్ని సెక్షన్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సీనియర్ న్యాయవాది విష్ణు శంకర్ జైన్ వేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపడతామని వెల్లడించింది. అయితే అది ఇవాళ విచారించబోయే పిటిషన్లతోనా? లేదంటే ప్రత్యేకంగానా? అనేదానిపై ఈ మధ్యాహ్నాం స్పష్టత రానుంది.👉పిటిషన్లలో కొన్ని.. వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, దీనిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మరికొన్ని.. దీనిని అమలు చేయకుండా కేంద్రాన్ని ఆదేశించాలని కోరాయి. 👉పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. ఈ నెల మొదట్లో సుదీర్ఘ చర్చల అనంతరం ఇటు లోక్‌సభలో, అటు రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు ఆమోదం లభించింది. 👉అయితే.. చట్టసభల పరిధిని తాము దాటబోమని ఇంతకు ముందే సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయినప్పటికీ రాజ్యాంగానికి సంబంధించిన అంశాల్లో చివరి తీర్పు ఇచ్చే అధికారం మాత్రం ఉంటుందని తెలిపింది. ఈ క్రమంలో.. వక్ఫ్ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కుల్లో సమానత్వ హక్కు, మతాచారాలను అనుసరించేలాంటి హక్కులు ప్రభావితం అయ్యాయని పిటిషనర్లు వాదిస్తున్నారు. అందుకే సుప్రీం కోర్టు ఈ పిటిషన్లపై వాదనలు వినేందుకు సిద్ధమైంది. 👉ఈ సవరణలు వక్ఫ్ బోర్డుల నిర్వహణలో పారదర్శకత తీసుకురావడానికి, వెనుకబడిన ముస్లింలను బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయని కేంద్రం అంటోంది. మత స్వేచ్ఛను హరిస్తాయనే విమర్శలను తప్పుబడుతోంది. ముస్లింలను తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయంటోంది. వక్ఫ్ బోర్డుల్లో అవినీతిని తగ్గించి, వ్యవస్థను పారదర్శకంగా చేయడానికే ఈ బిల్లును తెచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. -
ఈసీ తీరు పూర్తిగా.. అనుమానాస్పదం
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై పలు పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు మండిపడ్డాయి. ఎన్నికల నిర్వహణలో పారదర్శకతకు సంస్థ పూర్తిగా తిలోదకాలిస్తోందంటూ ధ్వజమెత్తాయి. ‘‘ఓటింగ్‌కు సంబంధించి పౌరులందరికీ తెలియాల్సిన గణాంకాలను అడిగినా బయటపెట్టడం లేదు. ఎన్నికల ప్రక్రియలో భారీ అవకతవకలు జరుగుతున్నాయన్న అనుమానాలు ఈసీ తీరుతో నానాటికీ బలపడుతున్నాయి’’ అంటూ దుయ్యబట్టాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల శాతానికి సంబంధించిన పూర్తి గణాంకాలను బయట పెట్టాల్సిందిగా అవి చిరకాలంగా డిమాండ్ చేస్తుండటం తెలిసిందే. ఈ విషయమై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్)తో పాటు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా తదితరులు సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు కూడా దాఖలు చేశారు. 2019 ఎన్నికల్లో నమోదైన మొత్తం ఓట్లకు సంబంధించి 17సీ పార్ట్–1 తాలూకు ప్రతులన్నింటినీ వెల్లడించేలా ఈసీని ఆదేశించాలని కోరారు. దీనిపై తొలుత ఈసీని సంప్రదించాల్సిందిగా గత నెల కోర్టు వారికి సూచించింది. దాంతో ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ ఆహ్వానం ఆ మేరకు మంగళవారం సమావేశం జరిగింది. ఏడీఆర్ ప్రతినిధులతో పాటు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్, మొయిత్రా తదితరులు భేటీలో పాల్గొన్నారు. తమ డిమాండ్లను మరోసారి ఈసీ ప్రతినిధుల ముందుంచారు. అనంతరం వారంతా మీడియాతో మాట్లాడారు. ఈసీ తీరుపై పెదవి విరిచారు. తమ డిమాండ్లకు ఎలాంటి సానుకూల స్పందనా రాలేదంటూ ఆక్షేపించారు.సీఈసీ, ఈసీ ఎక్కడ: భూషణ్సీఈసీ గానీ, ఎన్నికల కమిషనర్లు గానీ భేటీలో పాల్గొనకపోవడాన్ని ప్రతినిధులు తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ఏదో అత్యున్నత న్యాయస్థానం సూచించింది గనుక తప్పలేదన్నట్టుగా వ్యవహరించారు. భేటీకి కేవలం ఈసీ ప్రతినిధులను పంపి సరిపెట్టారు. సంస్థ విశ్వసనీయతకు సంబంధించిన అతి కీలకమైన సమస్య విషయంలో వారి చిత్తశుద్ధి ఏపాటిదో దీన్నిబట్టే తేలిపోతోంది. అయినా సుప్రీంకోర్టుపై గౌరవంతో మా అనుమానాలన్నింటినీ ఈసీ ప్రతినిధుల ముందుంచాం. 2019 లోక్‌సభ ఎన్నికల ఓటింగ్ శాతానికి సంబంధించిన డేటాలో చాలా అవకతవకలున్నట్టు వారి దృష్టికి తీసుకెళ్లాం. వాటిపై సమాధానాలు కోరాం. ఫాం 17(సీ), 20 వంటివాటిని వెబ్సైట్లో అందరికీ అందుబాటులో ఉంచాల్సిందిగా సూచించాం. ఇది ఈసీ విశ్వసనీయతకే పెనుసవాలు అన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరాం. కానీ వారినుంచి సానుకూల స్పందనే లేదు’’ అంటూ ప్రశాంత్ భూషణ్ పెదవి విరిచారు. దీనిపై తమ తదుపరి వాదనలను ఇక సుప్రీంకోర్టు ముందే ఉంచుతామని స్పష్టం చేశారు. ఓటింగ్ సంబంధిత డేటాను ఎన్నికల ఏజెంట్లకు అందించడంలో లేని అభ్యంతరం వెబ్సైట్లో అప్లోడ్ చేయడానికి ఎందుకని ఆయన ప్రశ్నించారు. ‘‘ఓటింగ్ విషయంలో తప్పిదాలు, అవకతవకలు జరుగుతున్నాయని, ఈవీఎంల టాంపరింగ్ జరుగుతోందని దేశవ్యాప్తంగా ఇప్పటికే చాలా అనుమానాలున్నాయి. అవి వాస్తవమేనంటూ దేశ విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు గళమెత్తుతున్నారు. ఈసీ ప్రవర్తన ఆ అనుమానాలకు మరింతగా బలం చేకూరుస్తోంది’’ అంటూ భూషణ్ దుయ్యబట్టారు.2024లోనూ అవకతవకలు: మొయిత్రా2019లోనే గాక 2024 లోక్‌సభ ఎన్నికల విషయంలో కూడా ఓటింగ్‌కు సంబంధించి భారీ అవకతవకలు జరిగాయని మొయిత్రా ఆరోపించారు. ‘‘గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ చాలా నియోజకవర్గాల్లో ఈవీఎంలలో నమోదైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు పొంతనే లేదు. సాయంత్రం దాకా ఉన్న పోలింగ్ శాతాలు రాత్రికల్లా అనూహ్యంగా భారీగా పెరిగిపోయాయి. చాలాచోట్ల ఈ పెరుగుదల ఏకంగా 20 శాతం దాకా ఉంది’’ అని గుర్తు చేశారు. ఫలితంగా ప్రస్తుతం ఈసీ విశ్వసనీయత ఎన్నడూ లేనంతగా అడుగంటిందని విమర్శించారు. ముఖ్యంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఈసీ పూర్తిగా అప్రతిష్టపాలైందన్నారు. ‘‘మేం కోరుతున్నది రహస్య వివరాలేమీ కాదు. దేశప్రజలందరికీ వాటిని తెలుసుకునే హక్కుంది. అంతేకాదు, వాటిని తెలుసుకుని తీరాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది’’ అని ఆమె స్పష్టం చేశారు. -
సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ముస్లిం జేఏసీ
సాక్షి, అమరావతి: వక్ఫ్ సవరణ చట్టం అమలుకాకుండా చూడాలంటూ ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) సుప్రీం కోర్టును ఆశ్రయించింది. వక్ఫ్ సవరణ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాని కోరుతూ ఇప్పటికే వైఎస్సార్సీపీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాజకీయ పార్టీలు, ముస్లిం సంస్థలు ఇప్పటి వరకు సుప్రీం కోర్టులో 13 వ్యాజ్యాలు వేయడం గమనార్హం. వక్ఫ్ సవరణ చట్టం అమలుతో తీవ్ర అభద్రతాభావానికి లోనవుతున్న ముస్లింలు ఓవైపు మసీదుల్లో సమావేశాలను నిర్వహిస్తునే మరోవైపు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. కేంద్రం వక్ఫ్ చట్టాన్ని సవరించి ఏకీకృత వక్ఫ్ నిర్వహణ, సాధికారత, సమర్థత, అభివృద్ధి చట్టం–2025ను అమలులోకి తేవడంపై దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాలు, వారికి మద్దతుగా లౌకిక వాదులు, రాజకీయ పార్టీలు సైతం న్యాయపోరాటానికి దిగాయి. తమకు అండగా నిలిచిన వైఎస్సార్సీపీకి ముస్లింలు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పార్లమెంట్లో బిల్లును వ్యతిరేకించిన వైఎస్సార్సీపీ, వక్ఫ్ సవరణ చట్టం అమలును అడ్డుకోవాలంటూ సుప్రీంను ఆశ్రయించడాన్ని అభినందిస్తున్నారు. ఈ విషయంలో తొలి నుంచి టీడీపీ రెండు నాల్కల ధోరణి తేటతెల్లమైందని, ఇంకా ఆ పార్టీ సమర్థించుకోవడం సరికాదని మండిపడుతున్నారు.మత స్వేచ్ఛ,మానవ హక్కులపై దాడి ఏకపక్షంగా వక్ఫ్ సవరణ చట్టం అమలులోకి తేవడం మత స్వేచ్ఛ, మానవ హక్కులు, రాజ్యాంగంపై మూకుమ్మడి దాడి. సవరణల సాకుతో స్వయం ప్రతిపత్తి కలిగిన వక్్పబోర్డ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారు. 44 సవరణలు అంటూ ఏకంగా 119 సవరణలు చేసి వక్ఫ్ పూర్తి స్వభావాన్ని దెబ్బతీశారు. రాజ్యాంగం ప్రసాదించిన ప్రా«థమిక హక్కులకు భంగం కలుగుతున్నందునే న్యాయం కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించాం. ఇతర మతాలకు వర్తించని నిబంధనలు ముస్లింలకు మాత్రమే పెట్టి మత స్వేచ్ఛను దెబ్బతీయడం దారుణం. కొత్త చట్టం ప్రకారం వక్ఫ్ ఆస్తులు, ఖబర్‌స్థాన్‌లు, మసీదులు, దర్గాలు, అషూర్ఖానాలు, మదరసాలు సైతం ప్రమాదంలో పడతాయి. సవరణ బిల్లును ఆపే అవకాశం ఉన్నా, అడ్డగోలుగా మద్దతిచ్చిన సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముస్లిం ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతారు. – షేక్ మునీర్ అహ్మద్, ఏపీ ముస్లిం జేఏసీ కన్వినర్వక్ఫ్ సవరణచట్టం రాజ్యాంగ విరుద్ధం వక్ఫ్ సవరణ చట్టం–2025 రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాపాడేలా మాజీ సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తుంటే.. సీఎం చంద్రబాబు మాత్రం ఊసరవెల్లి మాదిరి రంగులు మార్చే రాజకీయ నాయకుడని మరోసారి తేటతెల్లమైంది. ఆయన ఇంకా ముస్లిం సమాజాన్ని మభ్య పెట్టే ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, మతపరమైన హక్కులకు సంబంధించి గతంలో సుప్రీం కోర్టు జారీ చేసిన పలు ఆదేశాలకు పూర్తి విరుద్ధంగా కొత్త వక్ఫ్ సవరణ చట్టం రూపొందింది. – షేక్ గౌస్ లాజమ్, ఏపీ స్టేట్ హజ్ కమిటీ మాజీ చైర్మన్చంద్రబాబువి కల్లబొల్లి మాటలు ముస్లింలపై ఈగవాలనివ్వబోమని ఎన్నికల్లో కల్లబొల్లి కబుర్లు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు చేస్తున్న మోసపూరిత రాజకీయాలను ముస్లింజాతి ఎప్పటికీ క్షమించదు. ఇప్పటికైనా టీడీపీ వైఖరిని ముస్లిం సమాజం గుర్తించాలి. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాపాడేందుకు వైఎస్సార్సీపీ పాటుపడింది. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీం కోర్టును ఆశ్రయించడం గొప్ప విషయం. ఇందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. – షేక్ నాగుల్ మీరా, ఏపీ ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు టీడీపీలోని ముస్లింలు ఆలోచించుకోవాలి వక్ఫ్ బిల్లు విషయంలో డబుల్ గేమ్ ఆడిన చంద్రబాబు ఇంకా ముస్లిం సమాజాన్ని మభ్య పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకుని టీడీపీలోని మైనార్టీ నేతలతో వైఎస్సార్సీపీపై బురద చల్లించే ప్రయత్నం చేస్తున్నారు. బాబు అవకాశవాద రాజకీయంపై టీడీపీలోని ముస్లింలు తగిన నిర్ణయం తీసుకోవాలి. ఇచ్చిన మాటకు కట్టుబడ్డ మాజీ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. – కాగజ్ ఘర్ రిజ్వాన్, అనంతపురం జిల్లా వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్ -
వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో కీలక విచారణ
ఢిల్లీ: వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిసి పిటిషన్ పై రేపు(బధవారం) సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. వైఎస్సార్సీపీ దాఖలు చేసిన పిటిషన్ ఐటం నెంబర్ 86గా సుప్రీంకోర్టులో లిస్ట్ అయ్యింది. వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమన్న వైఎస్సార్సీపీ.. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది.ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా చట్టం రూపొందించారని, ఈ చట్టంతో ముస్లింల మత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని పిటిషన్ లో పేర్కొంది. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను చేర్చడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్ లో స్పష్టం చేసింది. ఇదిలా ఉంచితే, వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 10 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కె వి విశ్వనాథన్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. -
రోడ్డు ప్రమాదాలపై ఏఐ నిఘా
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఏటా లక్షల మందిని బలితీసుకుంటున్న రోడ్డు ప్రమాదాలను నిరోధించడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. రోడ్డు భద్రతపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యంత ప్రమాదకర ట్రాఫిక్ ఉల్లంఘనలపై కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో పనిచేసే సీసీ కెమెరాలను వినియోగించేలా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ను రూపొందించాలని ఆదేశించింది. తొలిదశలో ఆ నాలుగు రకాలపై... కేంద్ర రోడ్డు రవాణా ఉపరితల మంత్రిత్వ శాఖ తొలిదశలో నాలుగు రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలపై దృష్టి సారించింది. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం, సీట్ బెల్ట్ ధరించకుండా వాహనాలు నడపడం, వన్ వే, రాంగ్ రూట్లలో దూసుకురావడం, సెల్‌ఫోన్ డ్రైవింగ్‌ను కట్టడి చేయడానికి ప్రాధాన్యం ఇస్తోంది. ఈ ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించడానికి ఏఐతో కూడిన సీసీ కెమెరాలను వినియోగించాలని చెప్పింది. హైరిస్క్ ఏరియాలు గుర్తించి, ఏర్పాటు తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే హైరిస్క్ ప్రాంతాల్లో అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించింది. బ్లాక్ స్పాట్స్‌గా పిలిచే ఆ ప్రాంతాల గుర్తింపు కోసం సైతం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ వేలు, రాష్ట్ర రహదారుల్లో ఒక కిలోమీటర్ పరిధిలో మూడేళ్లలో మూడు కంటే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగితే అది హైరిస్క్ కారిడార్ కిందికు వస్తుంది. పట్టణ, నగరాల్లోని రహదారుల్లో 100 మీటర్ల పరిధిలో మూడేళ్లలో రెండు ప్రమాదాలు జరిగినా, ఇతర ప్రధాన రహదారులు, జిల్లా రోడ్లపై 500 మీటర్ల పరిధిలో మూడేళ్ల వ్యవధిలో రెండు యాక్సిడెంట్లు జరిగినా, విద్యాసంస్థలు ఉన్న ప్రాంతాల్లో 100 మీటర్ల పరిధిలో మూడేళ్లలో రెండు ప్రమాదాలు జరిగినా వాటిని హైరిస్క్ జాబితాలో చేర్చాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ ప్రాంతాల్లో కచి్చతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. నామమాత్రంగా కాకుండా... హైదరాబాద్‌తోపాటు ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో సీసీ కెమెరాల వినియోగం విస్తృతమైంది. కానీ వాటిలో అత్యధికం నామమాత్రంగానే ఉంటున్నాయి. ఏదైనా ఉదంతం జరిగినప్పుడో లేదా పోలీసు కేసుల దర్యాప్తులో అవసరమైనప్పుడో మాత్రమే వాటిలోని లోపాలు బయటపడుతున్నాయి. కావాల్సిన కోణంలో వీడియోలు రికార్డు కాకపోవడమో లేదా రికార్డు అయినప్పటికీ విశ్లేషణకు అవసరమైన స్పష్టత లోపించడం పరిపాటిగా మారింది. చాలాచోట్ల కనీసం 50 శాతం సీసీ కెమెరాలు కూడా పనిచేయట్లేదు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న కేంద్రం ఏఐ ఆధారిత సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రమాణాలు నిర్దేశించింది. ఆయా కెమెరాలు ఎల్లవేళలా వీడియోలు రికార్డు చేసేలా, ఏదైనా వాహనం గంటకు 200 కి.మీ. వేగంతో దూసుకెళ్లినా స్పష్టంగా ఆయా చిత్రాలను నమోదు చేసే సామర్థ్యం కలిగి ఉండాలని స్పష్టం చేసింది. అంతా ఆటోమేటిక్‌గా పనిచేసేలా... ఏఐ ఆధారిత సీసీ కెమెరాలతోపాటు వాటి సర్వర్లలో మరికొన్ని హంగులు కూడా ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. హైరిస్క్ ఏరియాలపై నిత్యం నిఘా ఉంచేలా సాంకేతిక పరిజ్ఞానం సీసీ కెమెరాల్లో పొందుపరచాలని సూచించింది. తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులను గుర్తించి ఈ–చలాన్లు జారీ చేయడంతోపాటు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దాన్ని గుర్తించి సంబంధిత విభాగాలను అప్రమత్తం చేస్తూ సందేశం పంపాలని పేర్కొంది. ఆయా కారిడార్లలో ఉల్లంఘనల తీరుతెన్నుల్ని సాంకేతికంగా అధ్యయనం చేయాలని చెప్పింది. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేసిన లేదా వాటిని సస్పెండ్ చేసిన వాహనదారుల వివరాలు కలిగి ఉండటంతోపాటు బీమా వివరాలు సర్వర్‌లో నిక్షిప్తమై ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. 2014 తర్వాత ఈ దిశగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొన్ని చర్యలు చేపట్టారు. ఐటీఎంఎస్, హెచ్–ట్రిమ్స్ తదితర పేర్లతో కొన్ని ప్రాజెక్టులు చేపట్టారు. వాటిలో సీసీ కెమెరాల ఏర్పాటు వరకు సమర్థంగా పూర్తయినప్పటికీ సాంకేతిక పరిజ్ఞానం నిక్షిప్తం చేయడం మాత్రం పూర్తిస్థాయిలో జరగలేదు. దీంతో మూడు కమిషనరేట్లలోని సీసీ కెమెరాలు ఆశించిన ఫలితాలు ఇవ్వట్లేదు. చిరునామా, ఫోన్ నంబర్లు మారితే.. కేంద్ర మార్గదర్శకాల్లో మరో కీలకాంశమూ ఉంది. ఓ ట్రాఫిక్ ఉల్లంఘనకు సంబంధించి జారీ చేసే ఈ–చలాన్ వాహనదారుడికి చేరాల్సిన అవసరం ఉంది. ఆర్టీఏ రికార్డుల్లో ఉన్న వాహనం రిజిస్ట్రేషన్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులతో అనుసంధానించిన చిరునామా, ఫోన్ నంబర్లే దీనికి ఆధారం. అయితే చాలా మంది వాహనచోదకులు ప్రస్తుతం నివసిస్తున్న చిరునామా, వినియోగిస్తున్న సెల్‌ఫోన్ నంబర్‌కు రికార్డుల్లో ఉన్న వాటికి సంబంధం ఉండట్లేదు. ఈ కారణంగానే సగానికి సగం ఈ–చలాన్లు వాహనదారులకు చేరట్లేదు. ఈ నేపథ్యంలో ఆయా వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేసుకునేలా వారికి అవకాశం ఇవ్వాలని సూచించింది. అలాగే ట్రాఫిక్ సిబ్బంది సైతం తనిఖీలప్పుడు వాహనదారుల చిరునామా, ఫోన్ నంబర్ల మార్పును పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. -
సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్ కౌంటర్ దాఖలు
ఢిల్లీ: కంచ గచ్చిబౌలి భూముల వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ భూముల వివాదంపై 16వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరుగనున్న నేపథ్యంలో ముందుగానే తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. కంచ గచ్చిబౌలి భూములు అటవీ భూములు కావని తెలంగాణ సర్కార్ అంటోంది. దీనిని అనుసరించే కౌంటర్ దాఖలు చేసింది. 20 ఏళ్లుగా ఖాళీగా ఉండటం వల్ల అక్కడ పొదలు పెరిగాయని, అటవీ రెవెన్యూ రికార్డుల్లో వాటిని అటవీ భూములుగా పేర్కొనలేదనేది తెలంగాణ ప్రభుత్వ వాదన. ఆ భూములకు ఎలాంటి కంచలేదని, కంచె ఏర్పాటు చేసేందుకు తాము ప్రయత్నం చేశామని, ఈ భూముల్లో ఎలాంటి జంతువులు లేవని కౌంటర్ లో తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఎల్లుండి(బుధవారం, ఏప్రిల్ 16వ తేదీ) సుప్రీంకోర్టులో విచారణకు లోపే కౌంటర్ దాఖలు చేయాల్సి ఉండటంతో న్యాయనిపుణులతో సుదీర్ఘ చర్చల తర్వాత ఓ క్లారిటీకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఈ భూముల అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇప్పటికే తెలంగాణ సర్కారుకు గట్టిగానే మొట్టికాయలు వేసింది. గత విచారణ సందర్భంగా భూముల్ని తదుపరి విచారణ వరకూ కొట్టివేయొద్దని, కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. చెట్లు నరికివేతపై తీవ్రంగా స్పందించింది. కంచ గచ్చిబౌలిలో చెట్లను తొలగించి అభివృద్ధి కార్యకలాపాను హడావుడి చేపట్టాల్సిన అవసరం ఏంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ మదింపు ధృవీకరణ నివేదిక తీసుకుందా, దీనికి సంబంధించి అవసరమైన అనుమతులు పొందారా, స్థానిక చట్టాలను అమలు చేశారా అంటూ పలు ప్రశ్నలను సంధించింది. -
దత్తత డీడ్ చెల్లదు.. కుమార్తెలే వారసులు
న్యూఢిల్లీ: ఆస్తి వివాదం కేసులో దత్తత డీడ్ చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తండ్రి ఆస్తిలో ఇద్దరు కూతుళ్ల న్యాయబద్ధ వారసత్వ హక్కును నిరాకరించేందుకే పథకం ప్రకారమే ఈ డీడ్‌ను చూపుతున్నారంటూ వ్యాఖ్యానించింది. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన భువనేశ్వర్ సింగ్‌కు ఇద్దరు కూతుళ్లు శివ కుమారీ దేవి, హర్మునియా. 1967లో భువనేశ్వర్ సింగ్ అశోక్ కుమార్ అనే బాలుణ్ని దత్తత తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన పత్రం, ఫొటో కూడా ఉన్నాయి. అయితే, చట్ట ప్రకారం దత్తతకు సమ్మతి తెలుపుతూ దంపతుల సంతకాలు దత్తత పత్రంపై తప్పనిసరి. అయితే, దత్తత స్వీకార పత్రంపై కేవలం భువనేశ్వర్ సింగ్ సంతకం మాత్రమే ఉండటం, దత్తత స్వీకారం కార్యక్రమంలో ఆయన మాత్రమే కనిపించడం వంటి అంశాలను ఎత్తి చూపిన అలహాబాద్ హైకోర్టు ఈ మొత్తం వ్యవహారం చెల్లదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో కుమార్తెలే వారసులంటూ 2024 డిసెంబర్లో తీర్పు వెలువరించింది. అశోక్ కుమార్ దీనిపై సుప్రీంను ఆశ్రయించారు. జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ కోటీశ్వర్ సింగ్‌ల ధర్మాసనం ఇటీవల వాదనలు వింది. అలహాబాద్ హైకోర్టు తీర్పును సమర్థించింది. కుమార్తెలకు వారసత్వ హక్కును నిరాకరించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటివి జరుగుతుంటాయంది. దత్తత స్వీకార పత్రం చెల్లదని స్పష్టం చేసింది. భువనేశ్వర్ సింగ్ ఆస్తికి ఆయన కుమార్తెలే అసలైన వారసులని, అశోక్ కుమార్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. -
భారతీయ కుటుంబ వ్యవస్థలో అనూహ్య మార్పులు
బెంగళూరు: భారత సమాజంలో కుటుంబ వ్యవస్థ అనూహ్య మార్పులకు లోనవుతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న అన్నారు. విడాకుల సంఖ్య కొంతకాలంగా క్రమంగా పెరిగిపోతోందంటూ ఆందోళన వెలిబుచ్చారు. ‘‘రెండు దశాబ్దాలుగా 25–29 ఏళ్ల మధ్య వయసున్న యువతుల్లో అవివాహితుల సంఖ్య పెరుగుతోంది. మొత్తంగా అమ్మాయిల్లో సగటు వివాహ వయసు కూడా పెరుగుతోంది’’ అని నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ సమాచారాన్ని ఉటంకించారు. సుప్రీంకోర్టులో ఫ్యామిలీ కోర్టుల కమిటీకి చైర్పర్సన్ అయిన ఆమె ‘కుటుంబం: భారతీయ సమాజానికి పునాది’ పేరిట బెంగళూరులో జరిగిన దక్షిణాది ప్రాంతీయ సదస్సులో మాట్లాడారు. ‘పట్టణీకరణ, మహిళల్లో పెరిగిన ఆర్థిక స్వేచ్ఛ, అందరికీ విద్య అందుబాటులో రావడం వంటి కారణాలతో కుటుంబాల్లో మార్పులొస్తున్నాయి. విద్య, సాధికారతతో మహిళలు సాధించిన సామాజిక, ఆర్థిక స్వాతం్రత్యాన్ని సానుకూల దృక్పథంతోనే చూడాలి. వారు తమ కుటుంబానికి గాక దేశానికీ ఎనలేని సేవ చేస్తున్నారు’’ అని ఆమె అన్నారు. 40 శాతం పెళ్లిళ్లు విచ్చిన్నం కుటుంబ తగాదాల కేసులు పెరిగిపోతుండటం పట్ల జస్టిస్ నాగరత్న ఆవేనద వెలిబుచ్చారు. అందుకు మహిళలే కారణమన్న వాదనను ఆమె తోసిపుచ్చారు. సమాజ ధోరణి మారకపోవడం వంటివే అందుకు ప్రధానంగా కారణమని అభిప్రాయపడ్డారు. ‘‘సామాజిక, ఆర్థిక పరిస్థితులకు తగ్గట్లు మారనప్పుడే వైవాహిక వివాదాలు తలెత్తుతాయి. గత పదేళ్లుగా జరిగిన పెళ్లిళ్లలో 40 శాతం దాకా విచ్చిన్నమయ్యాయి. ఇంతగా కుటుంబ కలహాల కేసులు వచ్చిపడుతుండటం ఫ్యామిలీ కోర్టులకు తలకు మించిన భారం అవుతోంది. బ్రేక్‌ఫాస్ట్ సరిగా చేయలేదనో, ఫంక్షన్‌కు త్వరగా ముస్తాబు కాలేదనో కూడా కోర్టు దాకా వస్తున్నారు.ఇలాంటి గొడవల వల్ల అంతిమంగా అందరికంటే ఎక్కువగా నష్టపోయేది పిల్లలే. కుటుంబ వివాదాలకు ఫ్యామిలీ కోర్టుల కంటే కౌన్సిలింగ్, మధ్యవర్తిత్వం ఉత్తమం. ఇరుపక్షాలూ సంయమనంతో ప్రయత్నిస్తే సమస్య పరిష్కారమవుతుంది. ముందు భార్యాభర్తలు పరస్పరం అర్థం చేసుకుని గౌరవించుకోవాలి. భాగస్వామి అవసరాలను అర్థం చేసుకోవాలి. సమస్యను అవతలి వ్యక్తి దృక్కోణం నుంచి చూడాలి. ‘‘భార్య ఏమీ ఆశించకుండా ఇంటిల్లిపాది పనులూ ఒంటిచేత్తో చక్కబెడుతుందని భర్త గుర్తుంచుకోవాలి. ఆమెకు తగిన విలువ ఇస్తే పిల్లలూ మంచి వాతావరణంలో పెరుగుతారు’’ అంటూ హితవు పలికారు. -
రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం లేకుండానే చట్టాలుగా ఆ 10 బిల్లులు
చెన్నై/న్యూఢిల్లీ: తమిళనాడు ప్రభుత్వానికి, గవర్నర్ ఆర్.ఎన్.రవికి మధ్య వివాదానికే గాక అంతిమంగా సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పుకు కారణమైన 10 బిల్లులు ఎట్టకేలకు చట్టంగా మారాయి. ఆ క్రమంలో మరో సంచలనానికి కారణమయ్యాయి. దేశ చరిత్రలోనే తొలిసారిగా గవర్నర్ గానీ, రాష్ట్రపతి గానీ ఆమోదించకుండానే చట్టంగా మారిన బిల్లులుగా చరిత్ర సృష్టించాయి! ఇది భారత శాసననిర్మాణ చరిత్రలోనే కనీవిని ఎరుగని సంఘటనగా నిలిచిపోనుంది. ఆ 10 బిల్లులను అసెంబ్లీ రెండోసారి ఆమోదించి పంపినా గవర్నర్ ఆమోదముద్ర వేయకుండా రాష్ట్రపతి పరిశీలనకు పంపడం, అది చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చడం తెలిసిందే. వాటికి గవర్నర్ ఆమోదం లభించినట్టుగానే పరిగణిస్తున్నట్టు పేర్కొంటూ ఆర్టికల్ 142 కింద తనకు సంక్రమించిన విశేషాధికారాల ద్వారా ఏప్రిల్ 8న తీర్పు వెలువరించింది. దాంతో గవర్నర్ గానీ, రాష్ట్రపతి గానీ లాంఛనంగా ఆమోదించకుండానే సదరు 10 బిల్లులకు స్టాలిన్ సర్కారు చట్టబద్ధత కల్పించగలిగింది. తీర్పు పూర్తి ప్రతి శుక్రవారం రాత్రి అందుబాటులోకి రాగానే ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగానే వాటికి చట్టరూపం కల్పిస్తున్నట్టు అందులో స్పష్టంగా పేర్కొంది. వీటిలో తమిళనాడు వర్సిటీలు, ఫిషరీస్ వర్సిటీ, వైస్ చాన్స్లర్ల బిల్లులు తదితరాలున్నాయి. దీన్ని చరిత్రాత్మక ఘటనగా డీఎంకే అభివర్ణించగా చరిత్ర సృష్టించడం తమ పార్టీ నైజమంటూ సీఎం స్టాలిన్ ఎక్స్‌లో పోస్టు చేశారు. రాజకీయాలకు అతీతంగా ఉండాలి రాష్ట్రస్థాయిలో ఒక బిల్లు చట్టంగా రూపొందాలంటే ముందుగా అసెంబ్లీ, తర్వాత గవర్నర్ ఆమోదం పొందాలి. గవర్నర్ దాన్ని ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టవచ్చు. రాష్ట్రపతి పరిశీలనకు పంపవచ్చు. లేదంటే అసెంబ్లీ పునఃపరిశీలన నిమిత్తం తిప్పి పంపవచ్చు. అసెంబ్లీ రెండోసారి ఆమోదించి పంపితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మినహా గవర్నర్ విధిగా అనుమతి తెలిపాల్సిందే. అలాగాక రెండోసారి అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లులను తమిళనాడు గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపడాన్ని స్టాలిన్ సర్కారు 2023లో సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దీనిపై కోర్టు గత మంగళవారం తీర్పు వెలువరించింది. గవర్నర్ చర్య రాజ్యాంగవిరుద్ధమని, ఆర్టికల్ 200కు ఉల్లంఘనేనని స్పష్టం చేసింది. గవర్నర్ పునఃపరిశీలనకు వచ్చిన 2023 నవంబర్ 18వ తేదీనే బిల్లులకు ఆమోదం లభించినట్టే పరిగణిస్తున్నట్టు పేర్కొంది. అంతేగాక, ‘‘ఇకపై గవర్నర్లు తమ వద్దకొచ్చే బిల్లులపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలి. అదే బిల్లు రెండోసారి వస్తే నెలలోపు ఆమోదం తెలిపి తీరాలి’’ అని గడువు విధిస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. తద్వారా గవర్నర్ వ్యవస్థను తక్కువ చేయడం తమ ఉద్దేశం కాదని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘ఆ స్థానానికి ఉండే అత్యున్నత గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత గవర్నర్లపై ఉంటుంది. ప్రథమ పౌరునిగా రాష్ట్ర ప్రయోజనాలే పరమావధి అని ప్రమాణం చేశాక రాజకీయ మొగ్గుదలలు తదితరాలకు అతీతంగా, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా మెలగాలి. అలాగాక ప్రజలకు ప్రతిరూపమైన అసెంబ్లీ నిర్ణయాలకు విరుద్ధంగా నడుచుకోవడమంటే చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించడమే’’ అని స్పష్టం చేసింది. -
రాష్ట్రపతికీ మూడు నెలలే
న్యూఢిల్లీ: గవర్నర్ల నుంచి ఆమోదం నిమిత్తం రాష్ట్రపతి వద్దకు వచ్చే బిల్లుల విషయమై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వాటిపై రాష్ట్రపతి మూడు నెలల లోపు నిర్ణయం తీసుకోవాల్సిందేనని పేర్కొంది. తమిళనాడు గవర్నర్‌కు సంబంధించిన కేసుపై ఇటీవల వెలువరించిన తీర్పులో ఈ మేరకు స్పష్టం చేసింది. రాష్ట్రపతికి సర్వోన్నత న్యాయస్థానం ఇలా గడువు నిర్దేశించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. మూణ్నెల్లు దాటినా సరైన కారణాలు చూపకుండా బిల్లులపై రాష్ట్రపతి ఏ నిర్ణయమూ తీసుకోని పక్షంలో సంబంధిత రా ష్ట్రాలు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు, ‘‘బిల్లుల విషయంలో 201 ఆర్టికల్ కింద రాష్ట్రపతి తీసుకునే నిర్ణయాలు న్యాయసమీక్షకు అతీతమేమీ కాదు. వాటిని కోర్టులు సమీక్షించవచ్చు’’అని కూడా పేర్కొనడం విశేషం! బిల్లులపై నిర్ణయం విషయంలో గవర్నర్లకు స్పష్టమైన గడువు నిర్దేశిస్తూ న్యాయమూర్తులు జస్టిస్ జె.బి.పార్థీవాలా, జస్టిస్ ఎం.మహదేవన్ ధర్మాసనం ఏప్రిల్ 8న చరిత్రాత్మక తీర్పు వెలువరించడం తెలిసిందే. ‘‘అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లుపై గవర్నర్ మూడు నెలల్లోపు నిర్ణ యం తీసుకోవాలి. రెండోసారీ పంపితే నెలలోపు వి« దిగా ఆమోదించాల్సిందే తప్ప రాష్ట్రపతికి పంపడం చట్టవిరుద్ధం’’అని స్పష్టం చేసింది. అలా ఈ విషయమై గవర్నర్‌కు తొలిసారిగా గడువు విధించింది. బిల్లుల విషయమై మూడు నెలల గడువును రాష్ట్రపతికి కూడా వర్తింపజేయడం విశేషం. ఆ తీర్పు తాలూకు 415 పేజీల పూర్తి ప్రతిని సుప్రీంకోర్టు శుక్రవారం వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడాలి ఆర్టికల్ 201 ప్రకారం గవర్నర్ తన వద్దకు పంపిన బిల్లును రాష్ట్రపతి ఆమోదించవచ్చు, లేదా పెండింగ్‌లో పెట్టవచ్చు. అది ఎంతకాలమన్న విషయమై అందులో రాజ్యాంగం గడువూ నిర్దేశించలేదు. అంతమాత్రాన బిల్లులపై నిరవధికంగా ఏ నిర్ణయమూ తీసుకోకుండా ఉండేందుకు రాష్ట్రపతికి ‘పాకెట్ వీటో’అధికారాలేమీ ఉండబోవని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘రాష్ట్రపతి తన వద్దకొచి్చన బిల్లుపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే (షల్ డిక్లేర్) అని ఆర్టికల్ 201లో స్పష్టంగా పేర్కొన్నారు. దానికి ఆమోదం తెలపడమో, పెండింగ్‌లో పెట్టడమో ఏదో ఒకటి తప్పనిసరన్నదే దాని ఉద్దేశం. అంతే తప్ప రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను అదే రాజ్యాంగం తాలూకు స్ఫూర్తికి విరుద్ధంగా ఉపయోగించవచ్చని కాదు. అదీగాక ఏ అధికారన్నైనా వాడుకునే విషయంలోనైనా సముచిత కాలావధి తప్పనిసరి. చట్టపరంగా కూడా అదే సరైనది. ఈ సాధారణ న్యాయసూత్రానికి 201 ఆర్టికల్ కింద రాష్ట్రపతికి సంక్రమించిన అధికారాలు కూడా అతీతం కాదు’’అని పేర్కొంది. ‘‘ఏదైనా బిల్లుపై రాష్ట్రపతి నిర్ణయం మూడు నెలలకు మించి ఆలస్యమయ్యే పక్షంలో అందుకు తగిన కారణాలను విధిగా నమోదు చేసి సంబంధిత రాష్ట్రానికి తెలియపరచాలి. రాష్ట్రాలు కూడా వాటికి సరైన వివరణలు, సమాధానాలివ్వడం ద్వారా ఈ విషయంలో పూర్తిగా సహకరించాలి’’అని స్పష్టం చేసింది.కోర్టుల పాత్ర పోషించొద్దు చట్టసభలు రూపొందించే బిల్లుల రాజ్యాంగబద్ధత విషయంలో కూడా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఆ కారణంగా బిల్లులను పెండింగ్‌లో పెట్టే పక్షంలో వాటి రాజ్యాంగబద్ధతను తేల్చాల్సింది సుప్రీంకోర్టు మాత్రమే. కనుక ఆర్టికల్ 143 ప్రకారం ఈ అంశాన్ని విధిగా సుప్రీంకోర్టుకు నివేదించాల్సి ఉంటుంది’’అని స్పష్టం చేసింది. అంతే తప్ప వాటిపై ప్రభుత్వాలే నిర్ణయాలు తీసుకుని కోర్టుల పాత్ర పోషించడానికి వీల్లేదని పేర్కొంది. ‘‘ఫక్తు న్యాయపరమైన అంశాలివి. ఇలాంటి వాటిలో కార్యనిర్వాహక విభాగం వేలు పెట్టడానికి వీల్లేదని చెప్పడానికి మేం ఎంతమాత్రమూ సంశయించడం లేదు. ఎందుకంటే బిల్లుల రాజ్యాంగబద్ధతపై లోతుగా పరిశీలన జరిపి తగిన చర్యలను సిఫార్సు చేసే అధికారం కేవలం రాజ్యాంగ ధర్మాసనాలది మాత్రమే’’అని వివరించింది. -
సుప్రీంకోర్టు తీర్పు సబబే
సాక్షి, అమరావతి: శాసనసభ ఆమోదించిన బిల్లులపై తమ నిర్ణయం వెలువరించే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు కాల పరిమితిని ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును న్యాయ నిపుణులు స్వాగతిస్తున్నారు. రాష్ట్రపతికి, గవర్నర్లకు కాలపరిమితి విధించడం తప్పేమీ కాదని స్పష్టంచేస్తున్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిందేనని, ఇందుకు రాష్ట్రపతి, గవర్నర్లు అతీతులు కాదంటున్నారు. బిల్లుల విషయంలో గవర్నర్లు చేస్తున్న అసాధారణ, రాజకీయ జాప్యం వల్ల ప్రజాస్వామ్య మనుగడ ప్రమాదంలో పడకుండా సుప్రీంకోర్టు తీర్పు రక్షిస్తుందని పేర్కొంటున్నారు. ఇది చారిత్రక తీర్పుగా అభివర్ణిస్తున్నారు.ప్రజా తీర్పును గవర్నర్లు అడ్డుకోలేరుచట్టసభలు ఆమోదించిన బిల్లుల విషయంలో నెల రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని గవర్నర్లను, మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతిని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిగా సమర్థిస్తున్నా. చట్టసభల నిర్ణయాల్లో ప్రజల ప్రయోజనాలే ప్రతిబింబిస్తుంటాయి. చట్టసభలు తీసుకునే నిర్ణయాలను రాష్ట్రపతి చేత నామినేట్ అయ్యే ఓ గవర్నర్ తన ఇష్టానుసారం అడ్డుకోవడం సబబు కాదు. ఇది రాజ్యాంగ విరుద్ధం. సుప్రీంకోర్టు తీర్పు చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. – సీవీ నాగార్జునరెడ్డి, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిఇది సరైన తీర్పేసుప్రీంకోర్టు సరైన తీర్పే ఇచ్చింది. గవర్నర్లు రాజ్యాంగబద్ధంగా నడుచుకోకపోవడం, ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నచోట ఆ ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడం చేస్తున్నారు. ఇటీవల గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలను రాజకీయంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. పరిధులు దాటుతున్నారు. రాజ్యాంగ విలువలకు, సంప్రదాయాలకు తిలోదకాలిస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలను పట్టించుకోవడం లేదు. గవర్నర్ల తీరుతో సుప్రీంకోర్టు విధిలేని పరిస్థితుల్లో ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా తాజా తీర్పునిచ్చింది. – సీవీ మోహన్‌రెడ్డి, సీనియర్ న్యాయవాదిన్యాయ సమీక్ష తప్పేమీ కాదుచట్టసభల ఆమోదం పొందిన బిల్లుల విషయంలో నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్రపతికి నిర్దిష్ట గడువు విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేక కోణంలో చూడాల్సిన అవసరం లేదు. రాజ్యాంగానికి లోబడే సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది. తన వద్దకు వచ్చే బిల్లుల విషయంలో నిర్ణయానికి సంబంధించి రాష్ట్రపతికి ఇప్పటివరకు నిర్దిష్ట గడువు అంటూ లేదు. గడువు లేదన్న నెపంతో ఏళ్ల తరబడి ఆ బిల్లులను అలా పెండింగ్‌లో పెట్టుకుంటామంటే ఎలా? ప్రజల ఆకాంక్షలు ఏం కావాలి? శాసనసభ చేసిన బిల్లులు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే అందులో రాష్ట్రపతి, గవర్నర్లు జోక్యం చేసుకోవచ్చు. అలాగే ఆ బిల్లులు ఏకపక్షంగా, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటే కోర్టులు జోక్యం చేసుకుంటాయి. గవర్నర్ల తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నప్పుడు, వారి నిర్ణయాలు రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కోర్టులు న్యాయ సమీక్ష చేయడం తప్పేమీ లేదు. సుప్రీంకోర్టు అదే చేసింది.– చిత్తరవు నాగేశ్వరరావు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది -
గాడి తప్పిన గవర్నర్లకు పెద్ద గుణపాఠం
సుప్రీంకోర్టు తమిళనాడు గవర్నర్‌కు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు గాడి తప్పిన గవర్నర్లకు పెద్ద గుణపాఠం. రాజ్యాంగ నిపుణులైన న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, ఆర్. మహ దేవన్లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం తమిళనాడు ప్రభుత్వం తమ గవర్నర్ బాధ్యతా రాహిత్యంపై దాఖలు చేసిన పిటిషనన్‌పై చిర కాలం నిలిచిపోయే తీర్పు ఇచ్చింది. తమిళనాడు శాసనసభ ఆమోదించిన పది బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవి ఏ నిర్ణయమూ తీసుకోకుండా తన దగ్గరే ఉంచుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court) తలుపు తట్టింది. బిల్లులను తొక్కిపట్టడం రాజ్యాంగ నేరం అని దూషించకపోయినా, అది రాజ్యాంగ పరమైన నైతిక చర్య కాదని పెద్ద పదాలు వాడుతూ తమిళనాడు గవర్నర్ రవిపై ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. ఒక్క తమిళనాడు గవర్నర్ (Tamil Nadu Governor) మాత్రమే కాదు. కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒక్కటేమిటి... చాలా రాష్ట్రాల గవర్నర్లు రాజ్యాంగాన్ని అనేకసార్లు అతిక్రమించారు. కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా గవర్నర్ల రాజ్యాంగ అతిక్రమణ మాత్రం కొనసాగుతూనే ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200... ‘వీలైనంత తొందరగా’ (యాజ్ సూన్ యాజ్ పాజిబుల్) తన దగ్గరకు వచ్చిన శాసనసభ (Assembly) ఆమోదించిన బిల్లులపై సంతకం పెట్టాలని పేర్కొంటోంది. కానీ తమిళ నాడు గవర్నర్ రవి తన దగ్గరకు వచ్చిన బిల్లులపై నెలల తరబడి అసలు ఏ నిర్ణయమూ తీసుకోకుండా తొక్కిపట్టారు. ప్రతిదానికీ కాలపరిమితనేది ఒకటి ఉంటుంది. రాజ్యాంగంలో అక్షరబద్ధం కాలేదనే వంకతో ఇష్టమొచ్చినంత కాలం బిల్లులకు ఆమోదం తెలపకపోతే పాలన ఎలా జరుగుతుంది?ఆర్టికల్ 200 ప్రకారం పనిచేయాల్సిన బాధ్యత గవర్నర్లపై ఉంది. ఒక బిల్లుపై సమ్మతిని ఆపాలన్నా, లేదా అభ్యంతరాలు ఉండి రాష్ట్రపతికి నివేదించాలన్నా నెల రోజుల్లోగా గవర్నర్లు ఏదో ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంటుందనే కనీస విజ్ఞత ఉండదా? పది బిల్లులను ఏ నిర్ణయం తీసుకోకుండా ఎలా ఆపుతారు? అందుకే ఈ తీర్పులో ‘బిల్లుపై తమ అభ్యంతరాలను తెలియచేస్తూ గవర్నర్లు 3 నెలల్లోగా అసెంబ్లీకి వాపసు చేయాల్సి ఉంటుంది. బిల్లుపై తన అభ్యంతరాలను రాష్ట్రపతికి తెలియచేయాలనుకుంటే గరిష్ఠంగా మూడు నెలల్లో ఆ పని చేయాల్సిఉంటుంది. అసెంబ్లీలో రెండోసారి ఆమోదం పొంది వచ్చిన బిల్లుకు నెల రోజుల్లోగా గవర్నర్లు తమ సమ్మతిని తెలియచేయాల్సి ఉంటుంది.గవర్నర్లు సత్వరంగా చర్యలు తీసుకోవాలని రాజ్యాంగం ఆశిస్తున్నది. నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేయడం ప్రజాస్వామ్య పాలన స్ఫూర్తిని ఉల్లంఘించడమే’ అని స్పష్టంగా చెప్పవలసి వచ్చింది. రాజ్యాంగ పరంగా అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి చర్యల కారణంగా ఏర్పడిన సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు ఈ మార్గదర్శకాలు అవసరమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు మిగతా గవర్నర్లకూ మార్గదర్శకాలు అవుతాయి. బిల్లులపై సమ్మతి తెలియజేయకుండా శాశ్వతంగా పెండింగ్‌లో ఉంచే అధికారం గవర్నర్లకు లేదని ఉన్నత న్యాయస్థానం మరీ మరీ చెప్పింది. గవర్నర్లకు మూడు అవకాశాలు మాత్రమే ఉంటాయని, ఒకటి బిల్లుకు సమ్మతి తెలియచేయడం, రెండు అభ్యంతరాలతో అసెంబ్లీకి బిల్లును తిప్పి పంపడం, మూడు రాష్ట్రపతికి నివేదించడమని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా వివరించింది.వాటిలో ముఖ్యమైన మార్గదర్శకం ఇది: ‘ఏదైనా బిల్లును పునఃపరిశీలనకు పంపాక అసెంబ్లీ మళ్లీ దాన్ని ఆమోదించి రెండవసారి గవర్నర్‌కు పంపించిన పక్షంలో అటువంటి బిల్లును గవర్నర్ రాష్ట్రపతికి నివేదించడానికి వీల్లేదు. అలా చేయడం చట్టవిరుద్ధం. ఒకవేళ రాష్ట్రపతికి నివేదించదలిస్తే నెలరోజుల్లోగా దానిపై గవర్నర్ నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రపతికి నివేదించాల్సిన అవసరం లేదని భావించిన పక్షంలో మూడు నెలల్లోగా బిల్లులపై గవర్నర్ నిర్ణయం తీసుకోవాలి’.చదవండి: కాలంతో కాలు కదిపితేనే.. కాంగ్రెస్‌కు మళ్లీ పాత రోజులుజవహర్లాల్ నెహ్రూ (Jawaharlal Nehru) కాలంలోనే కాదు, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రధానుల కాలంలోనూ దారుణంగా గవర్నర్లు ప్రజాస్వామ్యంతో ఆట లాడుకున్నారు. గతంలో కర్ణాటక, బిహార్, ఆంధ్రప్రదేశ్, కేరళల్లో గవర్నర్లు హద్దులు మీరారు. ఎన్టీఆర్ (NTR) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నర్ రామ్‌లాల్ ఆయన ప్రభుత్వాన్ని చట్టవిరుద్ధంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇదే దారిలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలున్న కాలంలోనూ గవర్నర్లు వ్యవహరించారు, వ్యవహరిస్తున్నారు. ఆ మధ్య కాలంలో పశ్చిమబెంగాల్ గవర్నర్ వ్యవహారశైలి కూడా వార్తలకెక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు గవర్నర్ వ్యవహారంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చాలా సరైన తీర్పు ఇచ్చిందనే భావించాలి.- మాడభూషి శ్రీధర్ మహేంద్ర యూనివర్సిటీ ‘స్కూల్ ఆఫ్ లా’ ప్రొఫెసర్ -
మూడు నెలల్లో తేల్చేయాల్సిందే.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లులను ఉద్దేశించి దేశసర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రాలు రూపొందించే బిల్లుల నిలుపుదల విషయంలో గవర్నర్లకు, రాష్ట్రాలకు రాజ్యాంగ బద్ధమైన ప్రత్యేక అధికారాలేవీ ఉండబోవని స్పష్టం చేసింది. ఈ క్రమంలో గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.ఇంతకు ముందు గవర్నర్ల విషయంలోనూ ఇలాంటి గడువును నిర్దేశించిన సుప్రీం కోర్టు.. ఇప్పుడు రాష్ట్రపతి విషయంలోనూ ఈ తరహా సూచన చేయడం తెలిసిందే. తమిళనాడు శాసనసభ ఆమోదించిన పది బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవికుమార్ తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సివస్తే అందుకు గవర్నర్ తీసుకోదగిన అత్యధిక గడువు ఒక నెల మాత్రమేనని సంచలనాత్మక తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో..ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లులను మూడు నెలలకు మించి ఉంచకూడదని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మహదేవన్ నేతృత్వంలోని తాజాగా బెంచ్ స్పష్టం చేసింది. ఒకవేళ జాప్యం జరిగితే గనుక సరైన రాష్ట్రపతి భవన్ ఆ కారణాలను రాష్ట్రాలకు వివరించాల్సి ఉంటుందని తెలిపింది. ఒకవేళ నిర్ణీత సమయంలోపూ రాష్ట్రపతి నుంచి సరైన స్పందన లేకుంటే మాండమస్ రిట్ పిటిషన్ దాఖలు చేయొచ్చని రాష్ట్రాలకు సుప్రీం కోర్టు సూచించింది.అంతకు ముందు గవర్నర్ విషయంలోనూ కాల నిర్దేశాన్ని పాటించని పక్షంలో ఆయన చర్యపై కోర్టులు న్యాయసమీక్ష జరపవచ్చని వెల్లడించింది. మంత్రి మండలి సలహా సూచనల మేరకు తప్పనిసరిగా పనిచేయడం తప్ప గవర్నర్‌కు విచక్షణాధికారాలేవీ లేవని, రాజ్యాంగంలోని 200వ అధికరణం కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేస్తోందని తెలిపింది. రెండోసారి సమర్పించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వు చేసి ఉంచే అధికారం గవర్నర్‌కు లేదంది. ఇక.. తాజాగా ఆర్టికల్ 201 రాష్ట్రపతి విషయంలోనూ ఇదే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఒకవేళ బిల్లు గనుక రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే.. రాష్ట్రపతి ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీం కోర్టును సంప్రదించడానికి అవకాశం ఉందని స్పష్టం చేసింది. -
ప్రజల హక్కుల గురించీ ఆలోచించాలి
న్యూఢిల్లీ: ప్రజలకుండే ప్రాథమిక హక్కుల గురించి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆలోచించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. నాగరిక్ అపూర్తి నిగమ్(ఎన్ఏఎన్) కుంభకోణం కేసును ఛత్తీస్‌గఢ్ నుంచి ఢిల్లీకి బదిలీ చేయాలంటూ ఈడీ వేసిన ఫిర్యాదుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్ ఎలా వేస్తారంటూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల ధర్మాసనం ఈడీ తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజును ప్రశ్నించింది. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులకు భంగం వాటిల్లితే వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించి రక్షణ కోరేందుకు ఆర్టికల్ 32 వీలు కల్పిస్తుంది. ఇదే విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించగా అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు..ఈడీకి కూడా ప్రాథమిక హక్కులుంటాయంటూ బదులిచ్చారు. అలాగైతే, వ్యక్తులకు కూడా ప్రాథమిక హక్కులుంటాయనే విషయం ఈడీ ఆలోచించాలి కదా..అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషన్ ఉపసంహరించుకునే అనుమతి కోరడంతో ధర్మాసనం సమ్మతించింది. ఈడీ తన హక్కుల కోసం మరో కోర్టుకు వెళ్లొచ్చని సూచించింది. కుంభకోణం ఆరోపణలున్న మాజీ ఐఏఎస్ అనిల్ టుటేజా ముందస్తు బెయిల్‌ను దుర్వినియోగం చేస్తున్నారని ఈడీ గతంలో ఆరోపణలు చేసింది. అంతేకాదు, ఈ కేసులో ఆరోపణలున్న ఉన్నత స్థాయి వ్యక్తులు కొందరు ఛత్తీస్‌గఢ్ హైకోర్టులోని ఒక జడ్జీతో టచ్‌లో ఉంటూ న్యాయపరమైన వెసులుబాట్లు పొందారని కూడా పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేసును ఢిల్లీకి బదిలీ చేయాలని, ముందస్తు బెయిల్‌ను కూడా రద్దు చేయాలని కోరింది. -
‘వక్ఫ్’ పిటిషన్లపై 16న సుప్రీం విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: వక్ఫ్(సవరణ)చట్టం–2025 చట్టబద్ధతను సవాల్ చేస్తూ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సహా దాఖలు చేసిన 10 వరకు పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ నెల 16న విచారణ చేపట్టనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం వాదనలు వింటుందని సుప్రీంకోర్టు వెబ్సైట్ పేర్కొంది. ధర్మాసనంలో జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథ్ ఉంటారు. ఒవైసీతోపాటు ఆప్ నేత అమానతుల్లా ఖాన్, అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ అర్షద్ మదానీ, సమస్త కేరళ జమియతుల్ ఉలెమా, అంజుమ్ కదారి, తయ్యబ్ ఖాన్ సల్మానీ, మహ్మద్ షఫీ, మహ్మద్ ఫజలుర్రహీమ్, ఆర్జేడీ నేత మనోజ్ కుమార్ ఝా పిటిషన్లు వేశారు. ఈ చట్టంపై ఎలాంటి ఆదేశాలు జారీ చేసినా ముందుగా తమ వాదనను వినాలంటూ ఈ నెల 8న కేంద్రం సుప్రీంకోర్టులో కెవియెట్ దాఖలు చేయడం తెల్సిందే. పార్లమెంట్ ఆమోదం అనంతరం రాష్ట్రపతి ముర్ము సంతకం చేయడంతో వక్ఫ్(సవరణ) చట్టం–2025ను గురువారం నోటిఫై చేసింది. తీవ్ర వ్యతిరేకత నడుమ పార్లమెంట్ ఆమోదం పొందిన ఈ చట్టంతో తమిళనాడులోని 50 లక్షల మందితోపాటు దేశంలో ఉన్న 20 కోట్ల మంది ముస్లింల హక్కులకు భంగం వాటిల్లనుందని పిటిషనర్లలో ఒకటైన డీఎంకే అంటోంది. ఈ చట్టంలోని అంశాలు ఏకపక్షంగా, ప్రాథమిక హక్కులకు భంగకరంగా ఉన్నాయని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (ఏఐఎంపీఎల్బీ) అంటోంది. -
కంచకు చేరని కథ
ప్రకృతి నడుమ ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అలజడి రేగింది. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలపై వివాదం రేగింది. విద్యార్థులందరూ ఏకమై ఉద్యమం చేపట్టారు. విద్యార్థి సంఘాలు, విపక్షాలు వీరికి మద్దతు పలకడంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. చివరికి సుప్రీం కోర్టుకు చేరింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు కేంద్ర సాధికార కమిటీ హెచ్‌సీయూలో వివాదాస్పద భూముల పరిశీలనకు వచ్చిన నేపథ్యంలో అసలు గతంలో ఏం జరిగింది? ఈ వివాదమెందుకు వచ్చింది? విద్యార్థుల నిరసనలకు కారణమేంటి? ప్రభుత్వం వాదనేంటి? వర్సిటీ వర్గాల కౌంటరేంటి? ఈ మొత్తం వ్యవహారంపై ‘సాక్షి ఇన్‌డెప్త్’ స్టోరీ మీకోసం.. గతంలో ఏం జరిగిందితెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన తొలి దశ ఉద్యమం, ఆ తర్వాత జై ఆంధ్ర ఉద్యమాల నేపథ్యంలో 1970వ దశకం ప్రారంభంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలని అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1974లో హెచ్‌సీయూను ఏర్పాటు చేశారు. తొలుత నాంపల్లి స్టేషన్ రోడ్డులోని సరోజినీ నాయుడు ఇల్లు ‘గోల్డెన్ థ్రెషోల్డ్’లో ఇది ప్రారంభమైంది. ప్రస్తుత రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని కంచ గచ్చిబౌలి గ్రామం సర్వే నంబర్ 25లో ఉన్న 2,324 ఎకరాలను కేటాయించిన తర్వాత అక్కడ పెద్ద క్యాంపస్ ఏర్పడింది. అప్పట్లోనే ఆ భూమి చుట్టూ ప్రహరీ గోడను కూడా కట్టారు. అప్పట్నుంచీ ఆ భూములన్నీ వర్సిటీ ఆధ్వర్యంలోనే ఉన్నా.. అధికారికంగా యూనివర్సిటీ పేరిట మాత్రం భూముల బదలాయింపు జరగలేదు. అంటే అధికారికంగా యూనివర్సిటీ పేరిట ఒక్క ఎకరా కూడా లేదన్నమాట. అయితే ఉమ్మడి ఏపీలో 2012 నవంబర్ 20వ తేదీనే అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఈ భూముల బదలాయింపునకు సంబంధించిన ప్రతిపాదనలు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయానికి వెళ్లాయి. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు తాజాగా వెలుగులోకి వచ్చాయి. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ ప్రతిపాదనలు పరిష్కారానికి నోచుకోకపోవడం గమనార్హం. నాడు చంద్రబాబు చేసిన నిర్వాకం ఏమిటి? హెచ్సీయూకు కేటాయించిన భూముల్లోని ఈ 400 ఎకరాలూ వివాదాస్పదం కావడానికి ఆద్యుడు 2004లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి నైతికంగా వీల్లేకపోయినా.. క్రీడలకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసమంటూ పెద్దగా ఊరూ పేరూ లేని ఐఎంజీ భారత అనే సంస్థకు మొత్తం 850 ఎకరాలను చంద్రబాబు కేటాయించారు.అందులో 400 ఎకరాలు హెచ్‌సీయూ కింద ఉన్న కంచ గచ్చిబౌలి సర్వే నంబర్ 25 లోనివి కాగా, మరో 450 ఎకరాలను మామిడిపల్లిలో కేటాయించారు. అవగాహన ఒప్పందాలు, కేటాయింపు ఉత్తర్వులు, రిజిస్ట్రేషన్ కూడా ఆగమేఘాల మీద చేసేశారు. 2004 ఫిబ్రవరి 10వ తేదీన ఆ భూమి ఐఎంజీ పేరిట రిజిస్ట్రేషన్ అయ్యింది.వాస్తవానికి ఆ సమయంలో మొత్తం 534.28 ఎకరాలను వర్సిటీ నుంచి తీసుకున్న బాబు.. 400 ఎకరాలు ఐఎంజీ భారత్‌కు, 134.28 ఎకరాలు ఏపీఎన్జీవోలకు కేటాయించారు. ఐఎంజీ భారత్ పేరుతో బిల్లీరావు అనే వ్యక్తికి చంద్రబాబు ప్రభుత్వం చేసిన ఈ భూ పందేరాన్ని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. వైఎస్సార్ ఏం చేశారు? వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2006లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తెచ్చి మరీ ఆ భూములను వెనక్కు తీసుకుంది. దీనిపై ఐఎంజీ సంస్థ హైకోర్టుకు వెళ్లింది. 24781/2006 నంబర్‌తో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల పాలనలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, కేసీఆర్ హయాంలోని తెలంగాణ రాష్ట్రంలోనూ కలిపి 18 ఏళ్ల పాటు విచారణ నడిచింది. తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల తర్వాత ఆ భూమి రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతుందంటూ 2024 మార్చి 7న ఈ కేసులో హైకోర్టు తీర్పునిచ్చిoది. దీన్ని ఐఎంజీ సంస్థ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) 9266/2024 దాఖలు చేసింది. ఈ కేసు కూడా రెండు నెలల్లోనే ముగిసింది. ఆ భూములు రాష్ట్ర ప్రభుత్వానివేనంటూ 2024 మే 3వ తేదీన సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చిoది. దీంతో ఆ 400 ఎకరాలు తెలంగాణ ప్రభుత్వానికి దఖలు పడ్డాయి. ఈ భూములను తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టీజీఐఐసీ)కు బదలాయించేందుకు గత ఏడాది జూన్ 6వ తేదీన పరిశ్రమల శాఖ సిఫారసు చేసింది. ఇందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు 2024 జూలై 1న పంచనామా నిర్వహించి 400 ఎకరాలను టీజీఐఐసీకి అప్పగించారు. ఇప్పుడు ఆ భూములను పరిశ్రమలకు కేటాయించేందుకు వీలుగా చెట్లు, రాళ్లు చదును చేసే పనిలో టీజీఐఐసీ పడింది. ఇదే వివాదానికి దారితీసింది. ప్రభుత్వం ఏమంటోంది?ఈ భూమి హెచ్‌సీయూది కాదని, మొత్తం 400 ఎకరాల్లో అంగుళం కూడా వర్సిటీ పరిధిలోనికి రాదనేది రాష్ట్ర ప్రభుత్వం వాదన. ‘సర్వే నంబర్ 25లో ఉన్న భూమి కంచ పోరంబోకు. చట్టప్రకారం అటవీ భూమి కూడా కాదు. ఈ 400 ఎకరాలను తీసుకున్నందుకు ప్రత్యామ్నాయంగా గోపన్‌పల్లి గ్రామంలోని సర్వే నంబర్ 36లో 191–36 ఎకరాలు, 37లో 205–20 ఎకరాలు కలిపి మొత్తం 397 ఎకరాలు వర్సిటీకి కేటాయించారు. ఈ 397 ఎకరాలను తీసుకోవడం ద్వారా ఆ 400 ఎకరాల భూమిపై వర్సిటీ హక్కులు వదులుకుంది. వర్సిటీ పరిధిలోని భూముల నుంచి ఈ 400 ఎకరాలను వేరు చేసేందుకు గాను 2017 జనవరి 2న రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీ చేసింది. అయితే ఈ మెమోను సవాల్ చేస్తూ వర్సిటీ దాఖలు చేసిన రిట్ పిటిషన్ (816/2021)ను హైకోర్టు కొట్టివేసింది. తర్వాత ఈ భూములను డీమార్క్ చేసేందుకు 2024లోనే యూనివర్సిటీ వర్గాల అంగీకారంతోనే సర్వే కూడా నిర్వహించి సరిహద్దులను గుర్తించాం. 2010– 2020ల్లో గూగుల్ మ్యాప్ ద్వారా 400 ఎకరాలు పరిశీలిస్తే అంతా బంజరు భూమి. రాళ్లతో కూడి ఉంది. ఎలాంటి పచ్చదనం లేదు. 2006–2024 వరకు నిర్లక్ష్యంగా ఆ భూములను వదిలేయడంతో చెట్లు, పొదలు మాత్రమే పెరిగాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు చుట్టుపక్కల ఉన్న ఈ భూముల్లో ఐటీతో పాటు ఇతర రంగాల అభివృద్ధికి మంచి అవకాశం ఉంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయి. రూ.50 వేల కోట్ల వరకు పెట్టుబడులతో పాటు 5 లక్షల మందికి ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయి. ఈ భూముల్లో అభివృద్ధి జరగడం ద్వారా హైదరాబాద్ లంగ్‌స్పేస్ దెబ్బతింటుందనేది వాస్తవం కాదు. ఈ భూమి చుట్టూ 5 కిలోమీటర్ల వ్యాసార్థంలో పెద్ద పెద్ద లంగ్‌స్పేస్‌లు అభివృద్ధి అయ్యాయి. 274 ఎకరాల విస్తీర్ణంలో కేవీబీఆర్ బొటానికల్ గార్డెన్ ఈ భూమికి 2 ఏరియల్ కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అలాగే ఈ భూమిలోని రాతి అమరికలను ప్రభుత్వం ధ్వంసం చేయదు. అక్కడ ఉన్న చెరువును కూడా కాపాడుతుంది..’ అని ప్రభుత్వం చెబుతోంది. వర్సిటీ వర్గాలు ఏమంటున్నాయి?యూనివర్సిటీ వర్గాలు మాత్రం భిన్నమైన వాదనలు విన్పిస్తున్నాయి. ఈ భూమి ఎవరిదన్న అంశం జోలికి వెళ్లకుండా.. ‘యూనివర్సిటీకి ఒకసారి కేటాయించిన భూములను రాష్ట్రపతి నియమించే ఆరుగురు సభ్యులతో కూడిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం మేరకు మాత్రమే ఎవరికైనా కేటాయించాల్సి ఉంటుంది. ఆ భూమిలో ప్రభుత్వం చెపుతున్నట్టు 2024లో ఎలాంటి సర్వే జరగలేదు. యూనివర్సిటీ భూముల నుంచి ఆ 400 ఎకరాలను వేరు చేయలేదు. ఈ భూమి భౌగోళిక స్థితిపై ప్రాథమిక పరిశీలన మాత్రమే జరిగింది. 400 ఎకరాలను వేరు చేసేందుకు వర్సిటీ అంగీకరించలేదు. అసలు ఆ భూములను వేరుచేస్తామనే సమాచారమే మాకు ప్రభుత్వం నుంచి అందలేదు. యూనివర్సిటీ ఏర్పాటై 50 ఏళ్లు గడుస్తున్న స్వర్ణోత్సవ సమయాన మాకు ఇచ్చిన భూములను పూర్తిస్థాయిలో అధికారికంగా బదలాయించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం. ఈ ప్రాంత పర్యావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని కాపాడాలని కోరుతున్నాం..’ అని చెబుతోంది. అయి తే యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఆ భూములు సెంట్రల్ వర్సిటీవేనని ఘంటాపథంగా చెబుతున్నాయి. గతంలో భూములను ఎవరికి ఇచ్చారు?ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి యూనివర్సిటీకి భూముల బదలాయింపు జరగకపోవడంతో రెవెన్యూ రికార్డుల్లో ఎక్కడా యూనివర్సిటీ పేరు కనిపించడం లేదని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ఈ భూములపై యూనివర్సిటీకి శాశ్వత, స్పష్టతతో కూడిన హక్కులు లేకపోవడంతోనే రాష్ట్ర ప్రభుత్వాలు భూములను పందేరం చేశాయి. జవహర్ నవోదయ, ఏపీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఈబీ, రంగారెడ్డి హెడ్‌క్వార్టర్స్, మున్సిపల్, ఎమ్మార్వో ఆఫీసులు, టెలీకాం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ, హాకీ స్టేడియం, మిలటరీ గేమ్స్, షూటింగ్ రేంజ్, ఐఎంజీ భారత్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ... ఇలా ఇప్పటివరకు 1105.37 ఎకరాలను అనేక సంస్థలకు కట్టబెట్టాయి. ఇందులో ఎక్కువసార్లు చంద్రబాబు ప్రభుత్వంలోనే ఇతర సంస్థలకు భూములు అప్పజెప్పారని రికార్డులు చెబుతున్నాయి. ఈ భూములు వర్సిటీ పేరిట లేకపోవడంతో సదరు సంస్థలకు భూముల బదలాయింపు ప్రభుత్వాలకు సులువుగా మారింది. యూనివర్సిటీ నుంచి అనుమతి తీసుకున్నట్టు సంతకాలు పెట్టించుకోవడం, పంచుల చేత దస్తూరి చేయించుకోవడంతోనే వర్సిటీకి కేటాయించిన భూములను ఇతర సంస్థలకు పందేరం చేసేశారు. పేరుకే కేటాయింపా? ఇప్పటివరకు హక్కు లేదా? సెంట్రల్ వర్సిటీకి 2,324 ఎకరాలు కేటాయిస్తున్నట్టు ఉత్తర్వులు ఇచ్చారు కానీ ఆ భూములను యూనివర్సిటీ పేరిట ప్రభుత్వాలు ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేయలేదు. కేవలం అప్పట్లో వచ్చిన ఉత్తర్వుల ఆధారంగా సర్వే చేసి చుట్టూ ప్రహరీగోడను నిర్మించారు. అయితే ఎన్ని ఎకరాల వ్యాసార్థంలో గోడ నిర్మించారో స్పష్టత లేకపోగా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ గతంలో ఇచ్చిన ఓ నివేదికలో మాత్రం హెచ్‌సీయూ 1800 ఎకరాల్లో విస్తరించి ఉందని పేర్కొంది. తాజా వివాదం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా భూముల అలినేషన్‌పై వివరణ ఇచ్చింది. ఇప్పటివరకు వర్సిటీకి భూముల బదలాయింపు జరగలేదని, వర్సిటీ భూములు అన్యాక్రాంతం కాకూడదనేదే ప్రభుత్వ ఉద్దేశమని, వర్సిటీ యంత్రాంగం ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే ఆ భూములను వర్సిటీ పేరిట బదలాయిస్తామని ఇటీవల విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. మరోవైపు భూముల బదలాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నట్టుగా ఈ వివాదం తలెత్తిన తర్వాతే యూనివర్సిటీ వర్గాలు కూడా బహిర్గతం చేశాయి. 400 ఎకరాలతో ‘రుణా’నుబంధం ప్రస్తుతం టీజీఐఐసీ అదీనంలో ఉన్నట్టుగా చెబుతున్న సుమారు 400 ఎకరాలకు పైగా భూమిని వేలం వేయడం ద్వారా రూ.25 వేల కోట్ల మేర రాబడి సమకూర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. వాస్తవానికి ఈ 400 ఎకరాల భూమిని గ్యారంటీగా చూపి 9.6 శాతం వడ్డీపై ఐసీఐసీఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది రూ.10 వేల కోట్ల రుణం తీసుకుంది. అయితే రూ.20 వేల కోట్లకు పైగా విలువ కలిగిన ఈ భూములను సెక్యూరిటీగా పెట్టి కేవలం రూ.10 వేల కోట్ల రుణమే తీసుకోవడంపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. వీటి వేలం ద్వారా రూ.25 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశముండటంతో అభివృద్ధి పనులు ప్రారంభించింది. అయితే తమకు సెక్యూరిటీగా పెట్టిన భూముల వేలం ఆలోచనపై ఐసీఐసీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ రూ.10 వేల కోట్ల రుణానికి గాను ప్రభుత్వం ప్రతి నెలా రూ.100 కోట్ల కిస్తీ (ఈఎంఐ)చెల్లిస్తున్న నేపథ్యంలో వచ్చే రెండేళ్ల పాటు చెల్లించాల్సిన కిస్తీల మొత్తం సుమారు రూ.2,500 కోట్లు ముందస్తుగా చెల్లిస్తే బాండ్లు తిరిగి ఇస్తామని చెప్పింది. ఇందుకు అంగీకరించిన ప్రభుత్వం భూమిని చదును చేసే ప్రక్రియను చేపట్టింది. ఆ 397 ఎకరాలకూ పొజిషన్ ఇవ్వలేదా? ఐఎంజీ భారత్‌కు కేటాయించిన 400 ఎకరాల స్థానంలో 397 ఎకరాలు గోపన్‌పల్లి రెవెన్యూ పరిధిలో వర్సిటీకికేటాయించారు. కానీ ఆ భూముల పొజిషన్ ప్రభుత్వం ఇప్పటివరకు ఇవ్వకపోవడం గమనార్హం. కాగా అసలుఆ ప్రత్యామ్నాయ భూములు ఎక్కడ ఉన్నాయో కూడా వర్సిటీ యంత్రాంగం గుర్తించలేని పరిస్థితుల్లో ఉండడం విశేషం. ఈ భూములు ఎందుకు ప్రత్యేకం? ఎందుకీ నిరసనలు?విద్యార్థులకు తాము చదువుకునే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలన్నా, వాటికి చెందినభూములన్నా సాధారణంగా మక్కువ ఉంటుంది. తాము చదువుకునే సంస్థ భూముల జోలికి వెళితే విద్యార్థి లోకం అస్సలు సహించదు. ఇక ఆహ్లాదకర వాతావరణం ఉట్టిపడే విశ్వవిద్యాలయాల్లో ప్రకృతికి మరింత ప్రాధాన్యత ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీలోని ల్యాండ్‌స్కేప్ ఇందుకు ఉదాహరణ. ఇప్పుడు హెచ్‌సీయూ విషయంలోనూ అదే జరిగింది. జీవ వైవిధ్యం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం వర్సిటీ ఆధ్వర్యంలో ఉన్న భూమిలో 455 జాతుల వృక్ష, జంతుజాలాలున్నాయని అంటున్నారు. నెమళ్లు, జింకలు, పెద్ద పెద్ద చెరువులు, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన రాళ్ల అమరికలతో రమణీయంగా కనిపించే ఈ భూములు ఎక్కడ ప్రైవేటు వ్యక్తులు, సంస్థల పాలవుతాయోనన్న ఆందోళన విద్యార్థులతో పాటు సామాన్య ప్రజల్లో కూడా కలగడంతోనే ఈ భూముల విషయంలో ఇంతటి అలజడి కనిపిస్తోంది. మరి ఈ కంచ గచి్చ»ౌలి భూముల కథ ఏ కంచకు చేరుతుందో వేచి చూడాల్సిందే. -
నిజాయితీపరులకు న్యాయమెలా?
షడ్రసోపేత విందు సాగుతుండగా హఠాత్తుగా ఎవరోవచ్చి పంక్తి నుంచి అమర్యాదగా మెడపట్టి గెంటేస్తే? కాళ్లకింది నేల ఒక్కసారిగా బద్దలై మింగేస్తే? పశ్చిమబెంగాల్లో పదేళ్లుగా కొలువులు చేస్తున్న వేలాది ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది స్థితి అలాంటిదే. 2016లో స్కూల్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) ద్వారా ఎంపికైన మొత్తం 25,752 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలు చెల్లబోవని, వారిని తక్షణం తొలగించాలని గత వారం సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో వారంతా రోడ్డున పడ్డారు. కేన్సర్ బారినపడిన ఒకే ఒక్క ఉపాధ్యాయురాలిని మాత్రం ధర్మాసనం మినహాయించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మొదలుకొని అందరూ ఉద్యోగాలు కోల్పోయినవారిపై సానుభూతి ప్రకటిస్తున్నారు. మమత అయితే తీర్పును తప్పుబట్టారు. ఉద్యోగాలు కోల్పోయినవారు ఎప్పటిలాగే విధి నిర్వహణ చేయొచ్చని, వేరే ప్రభుత్వ ఉద్యోగాల్లో సర్దుతామని బింకంగా ప్రకటించారు. వారికోసం జైలుకు పోవటానికీ సిద్ధమేనన్నారు. రేపటి సమాజం తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందంటారు. సగటు విద్యార్థులను సమున్నతంగా తీర్చిదిద్దటం, వారి సృజనాత్మకతను వెలికితీసి మెరికల్లా మార్చటం, పటుతర శక్తిగా మల చటం ఉపాధ్యాయులు చేసే పని. ఇంతటి మహత్కార్యాన్ని నిర్వర్తించాల్సినవారు కాస్తా ముడుపులు సమర్పించుకుని దొడ్డిదారిన వచ్చిచేరారంటే అంతకన్నా దారుణం మరొకటుండదు. ఈ రిక్రూట్ మెంట్‌పై ఆ రోజుల్లోనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. అభ్యర్థుల ర్యాంకులు తలకిందులు చేశారని, అధిక మార్కులు వచ్చినవారికి అన్యాయం జరిగిందని, అసలు మెరిట్ లిస్టులోగానీ, వెయిటింగ్ లిస్ట్‌లోగానీ లేనివారు చివరిలో విజేతల జాబితాకెక్కారని, మెరుగైన మార్కులతో ఉత్తీర్ణులై ఇంటర్వ్యూలో సైతం నెగ్గినవారికి ఉద్యోగాలు నిరాకరించారని ఆ ఆరోపణల సారాంశం. అయినా ప్రభుత్వం కిమ్మనలేదు. దీనిపై హైకోర్టు నియమించిన విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలోని నలుగురు సభ్యుల కమిటీ 2021లో ఎన్నో అవకతవకలు బయటపెట్టింది. అభ్యర్థుల ఓఎంఆర్ షీట్ల మూల్యాంకనానికి నియమించిన సంస్థ దాన్ని మరో సంస్థకు అప్పగించటమూ వెల్లడైంది. సీబీఐ దర్యాప్తులో కీలక సాక్ష్యాధారాలున్న మూడు హార్డ్ డిస్క్‌లు స్వాధీనమయ్యాయి. అయిదుగురు అరెస్టయ్యారు. అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు గల్లంతయినట్టు కనుక్కుంది. తమ అవకతవకలు కప్పి పుచ్చేందుకు నిబంధనల సాకుచూపి 2019లోనే వాటిని ధ్వంసం చేసినట్టు నిర్ధారణైంది. ఆ సంస్థ నివేదిక ఆధారంగా మొత్తం రిక్రూట్మెంట్ ప్రక్రియను రద్దుచేస్తూ, తిరిగి నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలు చేయాలని ఆదేశిస్తూ నిరుడు ఏప్రిల్‌లో కలకత్తా హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై మొదట్లో సుప్రీంకోర్టు స్టే ఇచ్చినా హైకోర్టు తీర్పునే సమర్థిస్తూ ఈ నెల 3న తీర్పునిచ్చింది. మొత్తం రిక్రూట్మెంట్ రద్దు చేయటం భావ్యంకాదని, ఇందులో నిజాయితీగా ఎంపికైనవారూ ఉన్నారని ప్రభుత్వం చేసిన వాదనతో సుప్రీం ఏకీభవించలేదు. ఓఎంఆర్ షీట్లు లేకుండా ఆ సంగతెలా నిర్ధారిస్తామంది.హఠాత్తుగా ఉద్యోగాల నుంచి గెంటేయటం బాధాకరమనటంలో సందేహం లేదు. ఎందుకంటే ఎంపికైన వారంతా అవినీతిపరులు కాదు. వారి సంఖ్య 5,300 మించివుండదంటున్నారు. ఇలాంటి ఎంపికల్లో మొత్తం ప్రక్రియను భ్రష్టుపట్టించటం ఎంతటి అవినీతిపరులకైనా అసాధ్యం. కానీ సరైన మార్గంలో వచ్చినవారెవరో తెలిసేదెలా? ఇందుకు ప్రధానంగా నిందించాల్సింది ప్రభుత్వాన్నే. ఈ రిక్రూట్‌మెంట్‌ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన సీపీఎం నేత, న్యాయవాది వికాస్‌రంజన్ భట్టాచార్యకు నోబెల్ బహుమతి ఇవ్వాలని మమత వ్యంగ్యంగా వ్యాఖ్యానించటం సరేగానీ... తన వంతు ఆమె చేసిందేమిటి? ఒకపక్క ఆరోపణలొస్తున్నప్పుడు ఓఎంఆర్ షీట్లు భద్రపరచటం వంటి కనీస చర్యనైనా ఎందుకు తీసుకోలేకపోయారు? ఉపద్రవం ముంచుకొస్తున్నదని తెలిసినా నిమ్మకు నీరెత్తినట్టు ఎలావున్నారు? ఓఎంఆర్ షీట్లుంటే అక్రమార్కుల నిర్ధారణ సులభమయ్యేది. నిజాయితీ పరులకు రక్షణ దొరికేది. అయినా తమ వద్ద కచ్చితంగా నిర్ధారించగల ఇతరేతర సాక్ష్యాలున్నాయని ఉన్నతాధికారులంటున్నారు.ఉద్యోగాలు కోల్పోయిన టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ఆగ్రహం అర్థం చేసుకోదగిందే. వారు ఇప్పటికే తమకంటూ గూడు నిర్మించుకుని వుంటారు. నెలవారీ వాయిదాల్లో చెల్లించేలా రుణాలు తీసుకుంటారు. అనారోగ్యం వల్లనో, మరే ఇతర కారణంతోనో దొరికినచోట అప్పుచేస్తారు. ఈ రుణవలయం నుంచి బయటపడేదెలా? అందరూ దొంగలు కాదు. అయినా కొలువు పోయింది... జీవనాధారం మాయమైంది, కానీ అదొక్కటే సమస్య కాదు తమ శిష్యుల ముందు చులకనై పోయారు. అవినీతిపరులన్న ముద్రపడింది. దీన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. విద్యా ర్థులది మరో సమస్య. వార్షిక పరీక్షలు దగ్గర పడుతుండగా గురువులు లేకపోవటం, కొన్నిచోట్ల సిబ్బంది కొరతతో యూనిట్ పరీక్షలు వాయిదా పడటం వారిని కలచి వేస్తోంది. అస్తవ్యస్త పాలనకు బెంగాల్ చిరునామాగా మారింది. నిరుడు ఆగస్టులో ఆర్జీ కార్ ఆస్పత్రిలో ఒక మహిళా వైద్యు రాలిపై అత్యాచార ఉదంతంలో సైతం స్పందన అంతంతమాత్రం. చివరకు సుప్రీంకోర్టు జోక్యం తప్పలేదు. ఇప్పుడు ఎస్ఎస్సీ స్కాంలోనూ అదే నిర్వాకం. ప్రస్తుతం నిజంగా అర్హులైన ఉపాధ్యాయులను గుర్తించి వారికి న్యాయం చేసేందుకు ఏయే అవకాశాలున్నాయో చూడటం, తమ దగ్గరున్న సాక్ష్యాధారాలివ్వటం తప్ప మరే మార్గమూ లేదు. దానికి బదులు కోర్టుల్ని నిందించి, మరొకరిని తప్పు బట్టి ప్రయోజనం లేదని మమతా బెనర్జీ గ్రహించాలి. -
ఇది తీవ్రమైన ఉల్లంఘనే.. కేంద్రానికి ‘సుప్రీం’ చీవాట్లు
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స (Cashless Treatment) అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వ అలసత్వాన్ని సుప్రీం కోర్టు మందలించింది. ఈ విషయాన్ని తీవ్ర ఉల్లంఘనగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ బుధవారం సంబంధిత అధికారులకు సమన్లు జారీ చేసింది.ప్రమాదం జరిగిన వెంటనే సమీప ఆసుపత్రిలో ఉచిత వైద్య సాయం కల్పించడమే క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ స్కీమ్ ఉద్దేశం. ప్రత్యేకించి గోల్డెన్ అవర్ (ప్రమాదం జరిగిన గంటలోపే)తో సహా రోడ్డు ప్రమాద బాధితులందరికీ దీన్ని వర్తింపజేయాల్సి ఉంటుంది. దీని అమలుకుగానూ కేంద్రానికి సుప్రీం కోర్టు మార్చి 14వ తేదీని గడువుగా ప్రకటించింది. అయితే గడువు దాటినా కేంద్రం ఇంతదాకా దీనిని అమలు చేయలేదు.‘‘ప్రభుత్వానికి ఇచ్చిన గడువు ముగిసిపోయింది. దీనిని తీవ్రమైన కోర్టు ఆదేశాల ఉల్లంఘనగా పరిగణిస్తున్నాం’’ అని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం బుధవారం వ్యాఖ్యానించింది. ఈ అలసత్వానికి సంబంధించి రోడ్డు రవాణా & జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, సీనియర్ అధికారులకు కోర్టు సమన్లు జారీ చేసింది. ‘‘అధికారులు కోర్టులకు హాజరైతేనే మా ఆదేశాలను తీవ్రంగా పరిగణిస్తారు. ఈ విషయాన్ని మా సుదీర్ఘ అనుభవం ద్వారా మేం తెలుసుకున్నాం. ఏప్రిల్ 28వ తేదీన సమన్లు అందుకున్నవాళ్లు కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలి. సకాలంలో చికిత్స అందకపోవడంతో రోడ్డు ప్రమాదాల్లో దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక్కడ.. ఒక్క విషయాన్ని మేం స్పష్టంగా చెప్పదల్చుకున్నాం. ఎటువంటి పురోగతి సాధించలేదని మేం గనుక గుర్తిస్తే కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేస్తాం అని జస్టిస్ ఓకా సంబంధిత అధికారులను హెచ్చరించారు.రోడ్డుప్రమాదాల సమయంలో ఆ దారిన వెళ్లేవాళ్లు, పోలీసులు,కొన్నిసార్లు ఆస్పత్రులు కూడా ఎవరైనా ముందుకు వస్తారేమో అని ఎదురు చూస్తున్నాయి. ఇది ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తోంది అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.ఇదిలా ఉంటే.. 2023 డిసెంబర్లో నగదు రహిత చికిత్స (Cashless Treatment) అందించే విషయంలో కేంద్రం తొలి అడుగు వేసింది. ప్రమాదాల్లో (Road Accidents) గాయపడిన బాధితులకు ఉచిత, నగదు రహిత వైద్య చికిత్స అందించడం ఎంవీఏ యాక్టు 2019లో భాగం. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు దీన్ని అమలు చేస్తున్నాయి. అయితే.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహకారంతో రోడ్డు రవాణా, హైవే మంత్రిత్వశాఖ దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకుంది.రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రాణాంతకంగా ఉన్న సమయంలో.. ప్రత్యేకించి గోల్డెన్ అవర్ టైంలో రోడ్డు ప్రమాద బాధితుడి ప్రాణాలు రక్షించే చికిత్స కోసం నగదు చెల్లింపులు చేయడానికి ఎవరూ లేనప్పుడు ఈ పథకం వర్తిస్తుంది. క్యాష్‌లెస్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ స్కీమ్ కింద.. రోడ్డు ప్రమాదాలకు గురైన వాళ్ల చికిత్స కోసం ఏడు రోజులకుగానూ లక్షా 5 వేల రూపాయల ఖర్చు భరిస్తుంది. అయితే ఇది ప్రమాదం జరిగిన 24 గంటలలోపు పోలీసులకు తెలియజేస్తేనే!. ఇక..ఆస్పత్రులు మోటార్ వెహికిల్స్ యాక్ట్ ఫండ్ నుంచి ట్రీట్మెంట్ సొమ్మును రీయింబర్స్మెంట్ ద్వారా పొందుతాయి. ఇదికాక.. అదనంగా హిట్ అండ్ రన్ కేసుల్లో మరణించిన వాళ్ల కుటుంబాలకు ప్రభుత్వం రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా అందిస్తుంది. అయితే.. ఏడాదిన్నరగా ఈ పథకాన్ని ఆచరణలో పెట్టాలనే ప్రయత్నాలు మాత్రం ముందుకు సాగడం లేదు. ఈ ఏడాది జనవరి 8వ తేదీన సరైన విధివిధానాలతో ఓ పథకం రూపొందించాలంటూ కేంద్రానికి సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇదే కాకుండా.. మోటార్ వెహికిల్స్ యాక్ట్(సవరణ చట్టం)లోని సెక్షన్ 162(2) ప్రకారం.. ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా బాధితుల చికిత్సకు అయ్యే ఖర్చును భరించాల్సి ఉంటుంది. కానీ, ఇది కూడా అమలు కావడం లేదని సర్వోన్నత న్యాయస్థానం గుర్తించింది. -
గవర్నర్లు ఈసారైనా గ్రహిస్తారా?
ఎన్నికైన ప్రభుత్వాలను బేఖాతరు చేస్తూ తరచు ఇబ్బందులు సృష్టించే గవర్నర్లకిది శరాఘాతం. శాసనసభ ఆమోదించిన పది బిల్లులపై ఆమోదముద్ర వేయకుండా, రాష్ట్రపతి పరిశీలనకు పంపకుండా దీర్ఘకాలం పెండింగ్‌లో పెట్టిన తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తీరును తప్పుబట్టడమేకాక ఆ బిల్లులన్నీ ఆమోదించినట్టుగా భావిస్తూ సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం వెలువరించిన తీర్పు అసాధారణమైనది. రాజ్యాంగంలోని 142వ అధికరణ కింద తనకు దఖలు పడిన విశేషాధి కారాలను వినియోగించుకుని సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. తాము ఎన్నికైన ప్రభుత్వాల కన్నా అధికులమని భావించటం, వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రభుత్వాలను ఇరకాటంలో పెట్టడం చాన్నాళ్లుగా కొందరు గవర్నర్లలో కనిపిస్తున్న ధోరణి. తనముందుకొచ్చే ఈ మాదిరి కేసులపై విచారిస్తున్నప్పుడూ లేదా తీర్పు వెలువరించినప్పుడూ ఈ ప్రవర్తన సరికాదని సుప్రీంకోర్టు చెబుతూనే వచ్చింది. వేరే రాష్ట్రాలకు సంబంధించి తీర్పు వచ్చినప్పుడైనా తమ అధికారాలేమిటో, పరిమితు లేమిటో తెలుసుకుని మెలగటం, ప్రవర్తనను సవరించుకోవటం విజ్ఞత అనిపించుకుంటుంది. కానీ అదెక్కడా కనబడటం లేదు. అలాగని గవర్నర్లంతా ఈమాదిరిగానే ఉంటున్నారని అనుకోనవసరం లేదు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో వున్నచోట ఎలాంటి సమస్యలూ కన బడవు. వ్యక్తులుగా హుందాతనాన్ని ప్రదర్శించే గవర్నర్లు విపక్ష ప్రభుత్వాల ఏలుబడిలోని రాష్ట్రాల్లో సాఫీగా పనిచేసుకుపోతున్నారు. ఎటొచ్చీ కొందరు గవర్నర్లు మాత్రం వింత పోకడలు పోతున్నారు.తమిళనాడు శాసనసభ ఆమోదించి గవర్నర్ రవి వద్ద పెండింగ్‌లో వున్న పది బిల్లుల్లో జనవరి 2020 నాటిది కూడా ఉందంటే ఆశ్చర్యం కలుగుతుంది. అంతేకాదు... ఈ బిల్లుల్లో చాలాభాగం ఒకసారి అసెంబ్లీలో ఆమోదం పొంది గవర్నర్ తిరస్కారానికి గురై రెండోసారి అసెంబ్లీ ఆమోదం పొంది వచ్చినవి. రాజ్యాంగ నిబంధన ప్రకారం ఒక బిల్లు తన సంతకం కోసం వచ్చినప్పుడు గవర్నర్ దాన్ని ఆమోదించటమో, తిరస్కరించటమో, రాష్ట్రపతి పరిశీలనకు పంపడమో చేయాలి. అంతేతప్ప నెలల తరబడి తొక్కిపెట్టి వుంచ కూడదు. ఈ సంగతిని రెండేళ్లనాడు పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు వెలువరిస్తూ సుప్రీంకోర్టు తెలియజేసింది. అక్కడి గవర్నర్ ఏకంగా 12 బిల్లుల్ని దీర్ఘకాలం పెండింగ్‌లో ఉంచారు. తన ఆమోదముద్ర కోసం వచ్చిన బిల్లుపై ‘సాధ్యమైనంత త్వరగా’ గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని, పునఃపరిశీలన అవసరమని భావిస్తే ఆ సంగతి తెలియజేయాలని అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 200వ అధికరణ సైతం ఈ సంగతే చెబుతోంది. బిల్లు సక్రమంగా లేదని, స్పష్టత కొరవడిందని లేదా రాజ్యాంగ నిబంధనలను అతిక్రమిస్తోందని గవర్నర్ భావిస్తే దాన్ని తిప్పిపంపొచ్చు. గవర్నర్ ఇచ్చిన సలహాను అంగీకరించి బిల్లుకు సవరణలు చేయటమా లేక య«థాతథంగా దాన్నే మరోసారి ఆమోదించి పంపటమా అనేది శాసనసభ ఇష్టమని ఆ అధికరణ తేటతెల్లం చేస్తోంది. రెండోసారి వచ్చిన బిల్లును గవర్నర్ ఆమోదించి తీరాలని లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని చెబుతోంది. నిబంధనలుఇంత స్పష్టంగా ఉన్నప్పుడు రవి ఇష్టానుసారం ప్రవర్తించటం అనుచితం. పంజాబ్ కేసులో ఇచ్చిన తీర్పును గవర్నర్లు బేఖాతరు చేస్తున్నారని గమనించటం వల్లే... ఆమోదం కోరుతూ తమ వద్దకొచ్చిన బిల్లు విషయంలో గవర్నర్లు ఎలా మెలగాలో తాజా తీర్పులో సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్దేశించాల్సి వచ్చింది. రాష్ట్రపతి పరిశీలనకు పంపదల్చుకున్న బిల్లుల్ని గరిష్ఠంగా మూడు నెలలు మించి తమవద్ద ఉంచుకోరాదని, పునఃపరిశీలనకొచ్చిన బిల్లునైతే వెంటనే ఆమోదించాలని లేదా గరిష్ఠంగా నెల రోజుల్లోపల సమ్మతి తెలపాలని ధర్మాసనం తెలిపింది. తొలిసారి వచ్చిన బిల్లుకూ, రెండోసారి పంపిన బిల్లుకూ వ్యత్యాసం ఉన్నపక్షంలో మాత్రమే ఇందుకు మినహాయింపు వుంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలకు అధికారాలుండాలి. కానీ ఆ ప్రభుత్వాలపట్ల ఏర్పర్చుకున్న అభిప్రాయంతో ఈ అధికారాలకు అవరోధాలు కల్పించాలని చూడటం రాజ్యాంగ ధిక్కరణ అవుతుందని గవర్నర్లు గ్రహించటం లేదు. అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ కేసులో 2016లో ఇచ్చిన తీర్పులో ఈ సంగతిని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.తన ఆమోదం కోసం వచ్చిన బిల్లులపై ‘సాధ్యమైనంత త్వరగా’ నిర్ణయం తీసుకోవాలని పంజాబ్ కేసు విషయంలో సుప్రీంకోర్టు చెప్పినప్పుడే రవి అప్రమత్తమై తన పరిమితులను గుర్తెరిగి వుంటే తాజా తీర్పులో నిర్దిష్ట గడువు నిర్దేశించాల్సిన అవసరం ఉండేది కాదు. తమ ప్రవర్తనవల్ల రాజ్యాంగ పదవికుండే ఔన్నత్యాన్ని పలచన చేస్తున్నామని గవర్నర్లు ఇకనైనా గుర్తెరగాలి. కేంద్రంలో రాష్ట్రపతి మాదిరే రాష్ట్రాల్లో గవర్నర్లు కూడా రాజ్యాంగానికి అనుగుణంగా కొన్ని అధికారాలు, బాధ్య తలు కలిగివుంటారు. కానీ రాష్ట్రపతి తరహాలో వారు ఎన్నిక కారు. కేంద్ర కేబినెట్ సలహా మేరకు రాష్ట్రపతి వారిని నియమిస్తారు. రాజకీయ నాయకులు గవర్నర్లు కావటంవల్లే సమస్యలొస్తున్నాయని సుప్రీంకోర్టు భావించి భిన్నరంగాల్లో నిపుణులైనవారిని ఈ పదవికి ఎంపిక చేయాలని గతంలో సూచించింది. కానీ కేంద్రంలోని పాలకులకు నచ్చినవారే ఈ కోటాలో ఎంపికవుతారు గనుక ఆ నిపు ణులు రాజకీయాలకు అతీతంగా ఏమీవుండరు. రాజకీయంగా గవర్నర్లకు ఎలాంటి అభిప్రాయా లున్నా రాజ్యాంగ పదవిలో ఉంటున్నవారిగా అందుకు అనుగుణంగా మెలగటం నేర్చుకోవాలి. పదే పదే న్యాయస్థానాలతో చెప్పించుకోవటం మర్యాద కాదని తెలుసుకోవాలి. -
మీది కడుపుకోతా?.. మరి అసలైన తల్లిదండ్రులది?
సాక్షి, న్యూఢిల్లీ: ‘మీరు పిల్లలను కొన్నారు.. వారు మీ పిల్లలే అనే ఆలోచనతో మీకు ఆ బాధ ఉంటుంది. అందుకే మీపై మేము కేవలం సానుభూతి చూపించగలం. అంతకుమించి మీకు న్యాయమైతే చేయలేం కదా?’అంటూ.. 2024లో హైదరాబాద్‌లో పసికందులను దత్తతకు తీసుకున్న తల్లిదండ్రులను ఉద్దేశించి దేశ సర్వోన్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. మీరు చెప్పినదానిని బట్టి చూస్తే మీదేనా కడుపు కోతా? మీది కడుపుకోత అయినప్పుడు అసలైన తల్లిదండ్రులది ఏమనాలి? అంటూ ప్రశ్నలు సంధించింది. ఢిల్లీ, పుణే నగరాల్లోని ఆసుపత్రుల్లో ఒకరోజు, రెండు రోజుల పసికందులను దొంగలించి హైదరాబాద్‌కు తీసుకొచి్చ.. పిల్లలు లేని వారికి దత్తత పేరుతో అమ్మకాలు చేపట్టారు. మే 22న ఫీర్జాదిగూడలో ఓ పసికందును విక్రయిస్తుండగా మేడిపల్లి పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టు కుని కేసు నమోదు చేయడంతో.. అసలు విషయాలు బయటకు వచ్చాయి. తమ పిల్లల్ని తమకు ఇవ్వాలని కొనుగోలు చేసిన తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించగా.. కొనుగోలు చేసిన వారికి అనుకూలంగా సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిoది. శిశు సంక్షేమ కమిటీ ఈ తీర్పును ద్విసభ్య ధర్మాసనం వద్ద సవాల్ చేయగా.. ప్రభుత్వానికి సానుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. ఈ డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ గత ఫిబ్రవరిలో పిల్లలను కొనుగోలు చేసిన తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై మంగళవారం జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ కె వినోద్ చంద్రన్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిల్లలు లేరు అందుకే దత్తత తీసుకున్నాం పిల్లలు లేని కారణంగానే.. ఆ పసికందులను దత్తత తీసుకున్నట్లు పిటిషనర్ల తరపు న్యాయవాది శ్రీనివాస్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆ పిల్లలతో తమకెంతో భావోద్వేగం ఉన్నట్లు తెలిపారు. తమ నుంచి పిల్లలను స్వాధీనం చేసుకున్న నాటి నుంచి తాము విలవిలలాడుతున్నామని, వారిని తిరిగి తమకు అప్పగించాలని కోరారు. చట్టపరమని మేము ఎలా చెబుతాం? ‘మీరు తీసుకున్నదే ఇల్లీగల్ (చట్టవిరుద్ధం)గా.. మమ్మల్ని న్యాయం చేయమంటే మేం లీగల్ (చట్టపరం) అని ఎలా చెబుతాం? కొనుగోలు చేసిన వారిలో రెండు రోజుల పసికందులున్న విషయం గమనించారా? కన్న ఆ తల్లి క్షోభ మీకు ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదా? మీరు చేస్తున్నదితప్పు అని మీ మనస్సాక్షికి అనిపించలేదా’అంటూ నిలదీసింది. ఈ విషయంలో మేం కేవలం మీపై సానుభూతి మాత్రమే చూపించగలం. కన్న తల్లిదండ్రుల నుంచి చిన్నారులను దత్తత తీసుకున్న వాళ్లు కాదు మీరు, పర్చేజ్ చేసిన వాళ్లు అని ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. విచారణను వచ్చే నెల 7కు వాయిదా వేసింది. -
Waqf Act : అమల్లోకి వక్ఫ్ చట్టం.. విచారణపై తొందరెందుకన్న ‘సుప్రీం’
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లు.. చట్ట రూపం దాల్చింది. ఇవాళ్టి నుంచే(ఏప్రిల్ 8వ తేదీ) అమల్లోకి వచ్చినట్లు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గత శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. మరోవైపు..సుప్రీంకోర్టులో వక్ఫ్ బిల్లును సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తమ వాదనలు వినాలంటూ కేంద్రం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో 15, 16వ తేదీల్లో దేశ సర్వోన్నత న్యాయస్థానంలో జరగబోయే విచారణపై ఉత్కంఠ నెలకొంది. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుమారు 16 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటితో పాటు కేంద్రం వేసిన కేవియట్‌ను కలిపి విచారించాలని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం నిర్ణయించింది. సిస్టమ్ ప్రకారమే వెళదాం.. తొందరెందుకు?ఇదిలా ఉంటే.. వక్ఫ్ సవరణ బిల్లును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టడానికి నిరాకరించింది. జమైత్ ఉలేమా హై హింద్ ప్రెసిడెంట్ మౌలానా అర్షద్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. ఈ సవరణ బిల్లుపై దాఖలైన పిటిషన్లను త్వరగా విచారించాలని ఆయన కోరారు. అయితే ఈ విజ్ఞప్తిపై చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.‘ఎందుకు త్వరగా అని మెన్షన్ చేస్తున్నారు. మనకో సిస్టం ఉంది కదా. వాటిని తప్పకుండా సమీక్షిస్తాం. అవసరమైన వాటిని సూచిస్తాం’ అని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా పేర్కొన్నారు. దీంతో వచ్చే మంగళ, బుధవారాల్లో విచారణ జరపనున్నట్లు పేర్కొంది. -
మీరూ టీచరేగా.. దయచేసి జోక్యం చేసుకోండి
న్యూఢిల్లీ: బెంగాల్ టీచర్ల తొలగింపు వ్యవహారంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓ లేఖ రాశారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని.. ఏ తప్పూ చేయని టీచర్లకు న్యాయం జరిగేలా చూడాలని కోరారాయన. 2016 టీచర్ రిక్రూట్మెంట్లో భారీ మోసం జరిగిందంటూ 25 వేల నియామకాలను ఇటు కలకత్తా హైకోర్టు రద్దు చేయగా.. అటు సుప్రీం కోర్టు ఆ తీర్పును సమర్థించింది. అయితే.. నియామకాల సమయంలో జరిగిన నేరాలు ఖండించదగ్గవే అయినప్పటికీ.. ఏ తప్పూ చేయనివాళ్ల ఉద్యోగాలు పోవడం తీవ్ర అన్యాయం కిందకు వస్తుందని రాహుల్ గాంధీ అంటున్నారు. ఏ తప్పు చేయకుండా చట్టపరంగా ఉద్యోగాలు పొందిన వాళ్లు సైతం నష్టపోవడం ఇక్కడ బాధాకరం. దాదాపుగా దశాబ్దంపాటుగా విధులు నిర్వహిస్తున్న ఈ కళంకం లేని టీచర్లను తొలగించడం.. విద్యా వ్యవస్థకు ఆటంకం కలిగించడమే అవుతుంది. అంతేకాదు.. వాళ్ల కుటుంబాలూ ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతాయి.గతంలో మీరూ ఓ టీచరే కదా. కాబట్టి.. ఈ మానవతప్పిదం కారణంగా జరుగుతున్న అన్యాయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. ఏ మోసానికి, తప్పునకు పాల్పడకుండా ఉద్యోగాలు సాధించిన వాళ్లను.. తిరిగి కొనసాగించేలా ప్రభుత్వాన్ని కొరతారని మీకు విజ్ఞప్తి చేస్తున్నా అని లేఖలో రాష్ట్రపతి ముర్మును రాహుల్ గాంధీ కోరారు. ఈ లేఖను తన ఎక్స్ ఖాతాలోనూ పోస్ట్ చేశారాయన. I have written to the Honourable President of India, Smt. Droupadi Murmu ji, seeking her kind intervention in the matter of thousands of qualified school teachers in West Bengal who have lost their jobs following the judiciary's cancellation of the teacher recruitment process.I… pic.twitter.com/VEbf6jbY2F— Rahul Gandhi (@RahulGandhi) April 8, 2025 -
బెయిల్ నియమం! జైలు మినహాయింపు!!
తీవ్రత లేని కేసుల్లో కూడా బెయిల్‌ని ట్రయల్ కోర్టు తిరస్కరించే ధోరణి పెరుగుతున్నందుకు సుప్రీంకోర్టు ఈమధ్య తీవ్ర ఆందోళన వ్యక్తపరిచింది. ప్రజాస్వామ్య రాజ్యం పోలీసు రాజ్యంగా మార కూడదని న్యాయమూర్తులు అభయ్ ఎస్. ఓకా, ఉజ్జల్ భూయాన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. బెయిల్ దరఖాస్తులను ట్రయల్ కోర్టులు అనవసరంగా తిరస్కరించడం వల్ల సుప్రీంకోర్టు మీద అనవసర భారం పడుతోందని, ట్రయల్ కోర్టు స్థాయిలో పరిష్కరించాల్సిన కేసులకు సంబంధించిన బెయిల్ పిటీషన్లను సుప్రీంకోర్టు పరిష్కరించవలసి రావడం మీద జస్టిస్ ఓకా దిగ్భ్రాంతిని వ్యక్త పరిచారు. దర్యాప్తు పూర్తి అయిపోయి చార్జిషీట్ దాఖలైన కేసుల్లో ముద్దాయి రెండు సంవత్సరాలకు పైగా నిర్బంధంలో ఉన్నప్పటికీ ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేయకపోవడాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది. అది ఓ చీటింగ్ కేసు. ఆ కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. 20 సంవత్స రాల క్రితం ఇలాంటి కేసుల్లో బెయిల్ పిటిషన్లు హైకోర్టులకు కూడా చేరేవి కావనీ, కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అలాంటి పిటీషన్లతో నిండి పోతోందనీ అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం పేర్కొంది.ప్రజాస్వామ్య దేశంలో దర్యాప్తు సంస్థలు అనవసరంగా అరెస్టు చేయడానికి వీల్లేదనీ, పోలీసు రాజ్యంగా మార్చకూడదనీ సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర పదజాలంతో తన ఉత్తర్వులలో పేర్కొంది. కస్టడీ అవసరం లేని కేసుల్లో వ్యక్తులను అరెస్టు చేయకుండా సుప్రీంకోర్టు 2022లో జారీ చేసిన ఉత్తర్వులను కూడా ధర్మాసనం గుర్తు చేసింది. ప్రజల స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత కోర్టుల మీద ఉంది. అందుకని బెయిల్ మంజూరు చేసే విషయంలో కోర్టులు ఉదారంగా ఉండాలి.‘బెయిల్ అనేది నియమం. జైలు అనేది దానికి మినహాయింపు’. ఈ ప్రాథమిక చట్టపరమైన సూత్రాన్ని కోర్టులు పదేపదే విస్మరిస్తున్నాయి. దీనికి ఉదాహరణగా సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన ఈ కేసుని పేర్కొనవచ్చు. ఈ కేసులో ముద్దాయి మోసం కేసులో నిందితుడు. రెండు సంవత్సరాలకు పైబడి కస్టడీలో ఉన్నాడు. పోలీసులు తమ దర్యాప్తును పూర్తి చేశారు. చార్జిషీట్‌ను కూడా దాఖలు చేశారు. అయినప్పటికీ అతని బెయిల్ పిటీషన్‌ను ట్రయల్ కోర్టు – గుజరాత్ హైకోర్టులు తిరస్కరించాయి. చివరికి అతనికి బెయిల్‌ని సుప్రీంకోర్టు ఇవ్వాల్సి వచ్చింది.బెయిల్ మంజూరు చేయడం గతంలో సరళంగా ఉండేది. ఇప్పుడు సంక్లిష్టంగా మారిపోయింది. జవాబు, రిజాయిండర్ (ప్రతి జవాబు); సర్రిజాయిండర్ లాంటి సంస్కృతి పెరిగిపోతోంది. ఎన్.డి. పి.ఎస్., మనీలాండ రింగ్ లాంటి చట్టాలు నిరూపణా భారాన్ని ముద్దాయిపైనే మోపుతున్నాయి. దీనివల్ల రెగ్యులర్ బెయిల్ దరఖాస్తులు వెనకబడి పోతున్నాయి.క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 437(4) ప్రకారం, అదే విధంగా భారతీయ నాగరిక్ సురక్షా సంహితలోని సెక్షన్ 480(4) ప్రకారం... బెయిల్ మంజూరు చేసినప్పుడు తగు కారణాలను రాయాల్సి ఉంటుంది. బెయిల్ తిరస్కరించినప్పుడు ఎలాంటి కార ణాలూ రాయాలని చట్టం నిర్దేశించలేదు. ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చాయి. ఈ చట్టాల ప్రకారం తగు కారణాలు మాత్రమే కాదు, ఎందుకు బెయిల్ మంజూరు చేయాల్సి వస్తుందో కూడా వివరంగా రాయాల్సి ఉంటుంది. ఇది రాయడం కొంత కష్టమైన పని. తగు సమయం అవసర మవుతుంది. ఐ.పి.సి. కేసుల్లో అంత వివరమైన కారణాలు అవసరం లేదు. అయినా కోర్టులు బెయిళ్లను తిరస్కరించ డానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. బెయిల్ అనేది నియమం– జైలు అనేది మినహాయింపు అనే సూత్రాన్నే కోర్టులు పాటించాలి. మనీ లాండరింగ్, ‘ఉపా’ లాంటి కేసుల్లో ఈ సూత్రాన్ని కొన్ని మార్పులతో వర్తింప చేయాల్సి ఉంటుంది.గత సంవత్సరం ప్రతి సుప్రీంకోర్టు బెంచ్ ప్రతిరోజూ కనీసం 15 నుంచి 20 బెయిల్ దరఖాస్తులను విచారిస్తోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి గవాయ్ అన్నారు. సుప్రీంకోర్టు గత నాలుగైదు సంవత్సరాల నుంచి బెయిల్ దర ఖాస్తుల పరిష్కారానికే ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వచ్చింది. దీనివల్ల రాజ్యాంగపరమైన వివాదాలను పరిష్కరించాల్సిన సమయాన్ని సుప్రీంకోర్టు ఈ కేసుల వివాదాలను పరిష్కరించడానికి వినియోగించాల్సి వస్తోంది. చాలా బెయిల్ దరఖాస్తులను జిల్లా న్యాయ వ్యవస్థ పరిష్కరించవచ్చు. బెయిల్ అనేది ఒక నియమం అన్న విషయం జిల్లా న్యాయవ్యవస్థకు తెలియని విషయం కాదు. కానీ వారు రకరకాల కారణాల వల్ల బెయిల్స్‌ను మంజూరు చేయడానికి వెనకాడుతున్నారు. అందులో ముఖ్యమైనది – బెయిల్ మంజూరు చేస్తే మోటివ్స్ని న్యాయమూర్తులకు అంటగడుతారనీ, అదే విధంగా హైకోర్టు పాలనాపరమైన చర్యలు తీసుకుంటుందన్న భయం కూడా న్యాయమూర్తులను వెంటాడుతోంది. హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా బెయిల్స్ విషయంలో రకరకాలైన అభిప్రాయాలు, ఉత్తర్వులను జారీ చేశాయి. అది కూడా మరో కారణం. అందుచేత ఈ మధ్యన బెయిల్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పులు నిలకడగా ఉన్నాయి. ‘బెయిల్ అనేది నియమం. తిరస్కరించడమ నేది మినహాయింపు’ అనే సూత్రానికి అనుగుణంగానే సుప్రీంకోర్టులు తీర్పులు ఉన్నాయి. జిల్లా న్యాయ వ్యవస్థ ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని బెయిల్స్‌ను ఉదారంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాజకీయ ప్రేరేపిత కేసుల సంఖ్య పెరుగుతున్న కాలంలో సుప్రీంకోర్టు, హైకోర్టులపై పని భారం పెంచకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా న్యాయ వ్యవస్థపై ఉంది.డా‘‘ మంగారి రాజేందర్ వ్యాసకర్త తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ అకాడమీ మాజీ డైరెక్టర్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు -
యూపీలో ఏం జరుగుతోంది?: సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్ పోలీసుల తీరుపై దేశ అత్యున్నత న్యాయం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సివిల్ కేసుల్ని క్రిమినల్ కేసులుగా నమోదు చేయడంపై సుప్రీంకోర్టు మండిపడింది. యూపీలో చట్టాన్ని అతిక్రమించే చర్యలే ప్రతిరోజూ కనిపిస్తున్నాయంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఓ వ్యక్తి తాను తిరిగి తీసుకున్న నగదును ఇవ్వకపోవడంతో అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు యూపీ పోలీసులు. ఈ కేసులో సుప్రీంకోర్టులో విచారణకు రావడంతో అసలు యూపీలో ఏం జరుగుతుందని సూటిగా ప్రశ్నించింది సీజేఐ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్శనాథన్‌లతో కూడిన ధర్మాసనం.‘ఇదొక సివిల్ కేసు.. దీన్ని క్రిమినల్ కేసు కింద ఎందుకు ఫైల్ చేశారు. యూపీ పోలీసుల తీరు ఎంతమాత్రం సహేతుకం కాదు. సివిల్ నేపథ్యం ఉన్న కేసుల్ని క్రిమినల్ కేసుగా ఎందుకు మార్చి రాశారు. చట్ట ప్రకారం ఇది సరైనది కాదు. ఒక మనిషి దగ్గర తీసుకున్న డబ్బును తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వలేని పక్షంలో అది క్రిమినల్ కేసులోకి రాదు యూపీలో ప్రతీరోజూ చాలా వరకూ ఈ తరహా కేసులే కనిపిస్తున్నాయి. సివిల్ కేసుల్ని తీసుకొచ్చి క్రిమినల్ కేసుల కింద ఎలా ఫైల్ చేస్తారు. ఇది కంప్లీట్ గా చట్టాన్ని అతిక్రమించడమే’ అని ధర్మాసనం చురకలు అంటించింది. ఇదీ చదవండి: మీ తీరు అమానవీయం’.. సీఎం యోగి సర్కార్‌పై సుప్రీం కోర్టు -
నీట్‌ను ఎందుకు రద్దు చేయలేదు?.. సుప్రీం కోర్టుకు దీదీ సూటి ప్రశ్న
‘‘మా గుండె బండరాయేం కాదు. ఈ నిర్ణయాన్ని మేం అంగీకరిస్తున్నామని మీరు భావించొద్దు. ఇలా మాట్లాడుతున్నందుకు నేను జైలుకు వెళ్లాల్సి వస్తుందని నాకు తెలుసు. కానీ అదేం పట్టించుకోను. కొందరు చేసిన తప్పులకు మీ జీవితాలను బలికానివ్వం. నాలో ఊపిరి ఉన్నంత వరకు మిమ్మల్ని రోడ్డున పడనివ్వను’’ అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భావోద్వేగంగా ప్రసంగించారు.కోల్‌కతా: సుప్రీం కోర్టు తీర్పుతో ఉద్యోగాలు పోగొట్టుకున్న ఉపాధ్యాయులతో సోమవారం నేతాజీ ఇండోర్ స్టేడియంలో మమతా బెనర్జీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నీట్ ప్రవేశ పరీక్ష మీద సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన తీర్పుపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘విద్యా వ్యవస్థను ఉల్లంఘించే హక్కు ఎవరికీ లేదు. ఒకవేళ అలా ఉంటే ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉండదు? అనే విషయంపై సుప్రీం కోర్టు స్పష్టత ఇవ్వాలి. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో వ్యాపం కేసులో పలువురి ప్రాణం పోయింది. వాళ్లకు ఇప్పటిదాకా న్యాయం జరగలేదు. .. నీట్ ప్రవేశ పరీక్షపైనా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కానీ ఆ పరీక్షను సుప్రీం కోర్టు రద్దు చేయలేదు. అలాంటప్పుడు బెంగాల్‌నే లక్క్ష్యంగా చేసుకోవడం ఎందుకు?. ఇక్కడి మేధస్సును భయపెట్టాలనుకుంటున్నారా? దీనికి సమాధానం కావాలి’’ అని మమత అన్నారు.ఈ విషయాలపై సుప్రీం కోర్టు ఒక స్పష్టత ఇస్తే.. మేం రుణపడి ఉంటాం. ఒకవేళ ఇవ్వకుంటే.. మీకు అండగా ఎలా నిలబడాలో మేం దారి కనిపెడతాం. రెండు నెలలుగా మీరు ఇబ్బంది పడుతున్నారని తెలుసు. అలాగని మిమ్మల్ని 20 ఏళ్లు బాధపెట్టే ఉద్దేశం మాకు లేదు. ఈ రెండు నెలలకు కూడా మీకు పరిహారం చెల్లిస్తాం.మూడు నెలల్లో నియామక ప్రక్రియ తిరిగి చేపట్టాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాలకు మేం కట్టుబడి ఉన్నాం. కానీ, ఈ వ్యవహారంపై స్పష్టత కోరాం. ఆ స్పష్టత రాగానే తీర్పుపై రివ్యూ పిటిషన్ కూడా వేస్తాం. మీకింకా ఉద్యోగాల నుంచి తొలగించినట్లు లేఖలు రాలేదు. కాబట్టి మీ పని మీరు చేసుకోండి. మీ ఉద్యోగాలకు మాది భరోసా. నా శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు రోడ్డున పడే దుస్థితి మీకు రానివ్వను అని అన్నారామె. అంతకు ముందు.. సుప్రీం కోర్టు తీర్పుకు ప్రభుత్వ పరంగా కట్టుబడి ఉంటామన్న ఆమె, వ్యక్తిగతంగా మాత్రం అంగీకరించబోనంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.ఇదే సమయంలో.. విపక్ష బీజేపీ, సీపీఎంలపైనా ఆమె విరుచుకుపడ్డారు. ఇది తమ ప్రభుత్వంపై దాడేనని అంటున్నారామె. నన్ను టార్గెట్ చేసి.. ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో టీచర్ల ఉద్యోగాలను లాక్కోవాలని చూడకండి. గాయపడిన పులి మరింత ప్రమాదకరమైంది. గుర్తుంచుకోండి అని విపక్షాలకు హెచ్చరిక జారీ చేశారు.అంతకు ముందు కోర్టు తీర్పులతో ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లు మాట్లాడుతూ.. తాము రివ్యూ పిటిషన్ వేయబోతున్నామని, ఈ విషయంలో బెంగాల్ ప్రభుత్వం.. స్కూల్ సర్వీస్ కమిషన్ తమతో కలిసి రావాలని కోరారు.2016లో జరిగిన 25 వేల టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు గతంలో కొందరు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కలకత్తా హైకోర్టు ఈ నియామకాలను రద్దు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈక్రమంలో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకునేందుకు సరైన కారణాలు లేవని పేర్కొంది. కలకత్తా హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఏప్రిల్ 3వ తేదీన మూడు నెలల్లో కొత్తగా టీచర్ల నియామకాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ‘‘ఈ నియామకాల ప్రక్రియ మొత్తం మోసపూరితంగా జరిగినట్లు స్పష్టమవుతోంది. తిరిగి సరిదిద్దుకోలేని కళంకం ఇది. ఎలాంటి మోసానికి పాల్పడకుండా ఎంపికైన అభ్యర్థులు కూడా బాధపడాల్సి వస్తోంది. ఈ విషయంలో హైకోర్టు తీర్పు విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోబోం’’ :::చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ ఖన్నా నేతృత్వంలోని బెంచ్ తీర్పు అయితే సుప్రీం కోర్టు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ‘‘కొందరి కారణంగా.. అంతమందిని శిక్షించడం ఏంటి? అని మమతా బెనర్జీ తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. -
సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డికి ఊరట.. పోలీసులకు నోటీసులు
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మద్యం అమ్మకాల విషయంలో ముందస్తు బెయిల్ పిటిషన్లో భాగంగా తదుపరి విచారణ వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని ధర్మాసనం ఆదేశించింది.మద్యం అమ్మకాలపై సీఐడీ కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ముందస్తు బెయిల్ కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ధర్మాసనం ముందస్తు బెయిల్‌పై జస్టిస్ జేబీ. పార్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్ విచారణ జరిపింది. ఈ క్రమంలో మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, తదుపరి విచారణ వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. ఇదే సమయంలో, మద్యం అమ్మకాల విషయంలో ముందస్తు బెయిల్ పిటిషన్ కేసులో ఏపీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఇక, పిటిషన్‌పై మిథున్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు.ఇదిలా ఉండగా, అంతకుముందు.. మద్యం విధానంపై దర్యాప్తు తొలిదశలోనే ఉందని ఏపీ సీఐడీ.. ఇటీవలే హైకోర్టుకు చెప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డిని నిందితుడిగా తాము పేర్కొనలేదని కోర్టుకు ఏపీ సీఐడీ తెలిపింది. దీంతో, మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇది జరిగిన మరుసటి రోజునే ఏపీ సీఐడీ బృందాలు ఢిల్లీకి చేరుకున్నాయి. మిథున్ రెడ్డి అరెస్ట్ కోసం ప్లాన్ చేస్తున్నాయి. దీంతో, మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఇక, మద్యం వ్యవహారంలో ఆది నుంచీ ఏపీ సీఐడీ పోలీసుల తీరు వివాదాస్పదంగానే ఉంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రాజకీయ వేధింపులు, కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వ్యక్తులను బెదిరించి సీఐడీ తప్పుడు వాంగ్మూలాలు తీసుకుంది. తప్పుడు వాంగ్మూలాల్లో తమకు కావాల్సిన వారి పేర్లను చెప్పించారు సీఐడీ అధికారులు. ఈ క్రమంలో తప్పుడు వాంగ్మూలాల ఆధారంగా వారి అరెస్టుకు ముందడుగులు వేస్తున్నారు. అలాగే, తప్పుడు వాంగ్మూలాల్లో పేర్కొన్న వ్యక్తుల ఇళ్లలో సీఐడీ సోదాలు చేసింది. నిన్న హైదరాబాద్‌లో పలువురి ఇళ్లల్లో సోదాలు కొనసాగాయి. ఈ సోదాల సందర్భంగా ఇళ్లల్లో ఉన్న మహిళలను బెదిరింపులకు గురిచేసినట్టు సమాచారం. పోలీస్ స్టేషన్లకు రప్పిస్తామంటూ మహిళలకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. -
నేడు సుప్రీంకోర్టులో ఎంపీ మిథున్‌రెడ్డి పిటిషన్‌పై విచారణ
ఢిల్లీ : వైఎస్సార్సీపీ రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఎంపీ మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్ ధర్మాసనం విచారణ జరపనుంది.మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో సీఐడీ నమోదుచేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఎంపీ మిథున్‌రెడ్డి గత నెలలో ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఆ పిటిషన్‌పై విచారణ జరిగే సమయంలో ఏపీ సీఐడీ తరుఫు న్యాయవాది మద్యం విధానంపై దర్యాప్తు తొలిదశలోనే ఉందని ఏపీ హైకోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఎంపీ మిథున్‌రెడ్డిని నిందితుడిగా తాము పేర్కొనలేదని చెప్పారు. దీంతో, మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇది జరిగిన మరుసటి రోజునే ఏపీ సీఐడీ బృందాలు ఢిల్లీకి చేరుకున్నాయి. ఈ తరుణంలో ఎంపీ మిథున్‌రెడ్డి సుప్రీం కోర్టులో ముందుస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది. -
ఆ టీచర్ల కుటుంబాల్లో అంతా కన్నీటి వరదే
ఇది ఏ ఒక్కరి పరిస్థితో కాదు.. సుమారు 25 వేల మందికిపైగా ఉద్యోగస్తుల పరిస్థితి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే టాపిక్. 2016 టీచర్ల నియమాకాల రద్దు టాపిక్.. ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. ఎంతో హాయిగా తమ జీవితాల్లోకి వెలుగొచ్చిందని అనుకుంటుండగానే వారి జీవితాల్లో చీకటి అలుముకుంది. టీచర్లగా ఉద్యోగాలు చేస్తూ సంఘంలో ఎంతో గౌరవంగా బతుకుతున్న వారి జీవితాలను కారు మబ్బు అలుముకుంది. తమ నియామకాలు చెల్లవని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో టీచర్ల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. దేశ అత్యున్నత ధర్మాసనం తీర్పు ఇలా ఉంటే ఇక ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ టీచర్ల కుటుంబాల్లో కన్నీటి వరదలే తారసపడుతున్నాయి.పశ్చిమ బెంగాల్లో 2016 నుంచి పనిచేస్తున్న 25 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేస్తూ రెండు రోజుల క్రితం తీర్పు ఇవ్వడంపై ఆ టీచర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ నియమాకాలు కలిపి 25 వేల 753 పోస్టులను చెల్లవంటూ సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చిన నేపథ్యంలో వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తమ జీవితాలు ఇంతేనా.. అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎందుకిలా జరిగింది.. మాకే ఎందుకు ఇలా జరిగింది అంటూ మౌనంగా రోదిస్తున్నారు.2016లో టీచర్ గా నియమించబడ్డ రజత్ హల్దార్ మాట్లాడుతూ.. ‘ మాకు మాటలు రావడం లేదు. మేము అర్హత సాధించిన టీచర్లం. మాకు ఎటువంటి ఆరోపణలు లేవు. సుమారు 19 వేల మంది టీచింగ్ స్టాఫ్ పై ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ మమ్మల్ని వారు అనర్హులు అంటూ సుప్రీంకోర్టు ప్రకటించడంతో మాకు ఏమీ చెప్పుకోవాలో.. ఎవరి చెప్పుకోవాలో తెలయని స్థితిలో ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పుతో మాకు అన్యాయం జరిగింది. ఇది న్యాయబద్ధమైన తీర్పు కాదు. ఏ దర్యాప్తు సంస్థలు కూడా మా నియామకం చట్టబద్ధతలో జరగలేదని చెప్పలేదు. మేము ఎటువంటి తప్పు చేయలేదు’ అంటూ గద్గద స్వరంతో చెప్పుకొచ్చాడు.కాగా, వెస్ట్ బెంగాల్లో 2016 నుంచి పనిచేస్తున్న 25 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు 2024లో కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. నియామకాల్లో భారీ అక్రమాలు, అవకతవకలకు పాల్పడిన పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్(డబ్ల్యూబీఎస్ఎస్సీ)కు అత్యున్నత న్యాయస్థానం తలంటింది. మొత్తం 25,753 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాల్లో అవకతవకలను, లోపాలను ఉద్దేశపూర్వకంగానే కప్పిపుచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ..మొత్తం నియామకాలు చెల్లవని తీర్పు వెలువరించింది. మళ్లీ నియామకాలు చేపట్టాలని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం గురువారం ఆదేశించింది. మరికొద్ది నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా చోటుచేసుకున్న ఈ పరిణామం మమతా సర్కారు గట్టి ఎదురుదెబ్బగా విశ్లేషకులు చెబుతున్నారు. -
మా చేతుల్లో ఏం లేదు.. పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్పై సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, సాక్షి: భారత్‌లో చిన్నారులు సోషల్ మీడియా(Social Media) వాడకుండా నిషేధించాలన్న ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆ నిర్ణయం తమ చేతుల్లో లేదన్న సర్వోన్నత న్యాయస్థానం.. కేంద్ర ప్రభుత్వాన్ని, సంబంధిత అధికార యంత్రాగాన్ని సంప్రదించాలని పిటిషనర్‌కు సూచించింది.సోషల్ మీడియా వాడకం వల్ల చిన్నారులపై శారీరకంగా, మానసికంగా, ప్రభావం పడుతోందని, కాబట్టి 13 ఏళ్లలోపు పిల్లలు వాడకుండా చట్టబద్ధమైన నిషేధం విధించాలని ఓ పిల్(PIL) దాఖలైంది. అంతేకాదు 13-18 ఏళ్ల లోపు పిల్లల సోషల్ మీడియా అకౌంట్ల పర్యవేక్షణ తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండేలా చూడాలని జెప్ ఫౌండేషన్ ఈ పిల్లో కోరింది. దీనిని పరిశీలించిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం.. అది తమ పరిధిలోని అంశం కాదని, విధానపరమైన నిర్ణయమని చెబుతూ పిల్‌ను తిరస్కరించింది.పిల్లో ఏముందంటే.. 13 ఏళ్లలోపు వయసున్నవాళ్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను వాడకూడదంటూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ నామమాత్రంగా నిబంధనను పెట్టాయి. కేవలం యూజర్లు రిపోర్ట్ చేసినప్పుడు మాత్రమే అలాంటి అకౌంట్ల వివరాలు బయటకు వస్తున్నాయి. ఇదీ ఆందోళన కలిగించే అంశమే.మైనర్ల సోషల్ మీడియా అకౌంట్లకు కూడా అనియంత్రిత యాక్సెస్unrestricted access ఉంటోంది. దీని మూలంగా వాళ్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది.మైనర్లు సోషల్ మీడియా వాడకుండా నియంత్రించని ఈ వ్యవహారం.. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే ప్రాథమిక హక్కును తీవ్రంగా ఉల్లంఘించడమే అవుతుంది. కాబట్టి, కఠిన జరిమానాలు, ఇతర చర్యల ద్వారా పిల్లల చేతికి సోషల్ మీడియా వెళ్లకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.భారత్‌లో యువత సగటున ప్రతీరోజు ఐదు గంటలపాటు సోషల్ మీడియాలో గడుపుతున్నారు. ఈ సమయం గణనీయంగా పెరుగుతూ పోతుండడం ఆందోళన కలిగించే అంశం. అందుకు తగ్గట్లే దేశంలో సైబర్ నేరాలు.. మైనర్లకు సైబర్ వేధింపులు పెరిగిపోతున్నాయి.ఉదాహరణకు.. మహారాష్ట్రలో 9-17 ఏళ్లలోపు పిల్లలు 17 శాతం ఆరు గంటలకు పైగా సోషల్ మీడియా, గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో గడుపుతున్నారు. ఇది వాళ్ల చదువులపై, జీవన శైలిపై తీవ్ర ప్రభావం చూపెడుతోందని ఓ అధ్యయనం వెల్లడించింది. ఆస్ట్రేలియా, యూకే, అమెరికాలో పలు రాష్ట్రాలు మైనర్లు సోషల్ మీడియా ఉపయోగించకుండా కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి.భారతదేశ జనాభాలో దాదాపు 30% మంది 4-18 సంవత్సరాల వయస్సు మధ్యే ఉంది. కాబట్టి 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై చట్టబద్ధమైన నిషేధాన్ని అమలు చేయడం అత్యవసరం.అయితే పైన పేర్కొన్న దేశాలు మైనర్లకు సోషల్ మీడియా కట్టడిని కేవలం ప్రత్యేక చట్టాల ద్వారా మాత్రమే చేయగలిగాయి. ఏ సందర్భంలోనూ న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోలేదు. కాబట్టి భారత్‌లోనూ చట్ట ప్రక్రియ ద్వారా మాత్రమే కట్టడి చేయాల్సిన అవసరం ఉంటుందనేది నిపుణుల మాట. -
వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: కాంగ్రెస్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లును(waqf amendment bill) సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అంటోంది. వీలైనంత త్వరలోనే ఇది ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ప్రకటించారు. రాజ్యాంగ సూత్రాలు, నిబంధనలపై దాడి చేస్తున్న మోదీ ప్రభుత్వాన్ని ప్రతిఘటిస్తూనే ఉంటామన్న ఆయన.. గతంలో సీఏఏ, ఆర్టీఐ, ఎన్నికల నియమాలపై పోరాటాలు చేశామని జైరాం రమేశ్(Jairam Ramesh) తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ ద్వారా తెలియజేశారు. The INC's challenge of the CAA, 2019 is being heard in the Supreme Court.The INC's challenge of the 2019 amendments to the RTI Act, 2005 is being heard in the Supreme Court.The INC’s challenge to the validity of the amendments to the Conduct of Election Rules (2024) is being…— Jairam Ramesh (@Jairam_Ramesh) April 4, 2025 ఇదిలా ఉంటే.. రాజ్యసభ(Rajya Sabha)లో గురువారం మధ్యాహ్నాం నుంచి సుమారు 13 గంటలపాటు వక్ఫ్ బిల్లుపై చర్చ జరిగింది. ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటేశారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. దీంతో శుక్రవారం ఉదయం బిల్లును ఆమోదించినట్లు పార్లమెంట్ అధికారికంగా ప్రకటించింది. బిల్లుపై చర్చ సందర్భంగా.. ఇది మైనారిటీలకు వ్యతిరేకంగా.. రాజ్యాంగవిరుద్ధంగా ఉందంటూ పలు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అదే సమయంలో ఇది చారిత్రక సంస్కరణగా అభివర్ణించిన కేంద్రం ఈ బిల్లు ముస్లింలకు లబ్ధి చేకూరుస్తుందని అంటోంది. అంతకు ముందు..సుదీర్ఘ సంవాదాల అనంతరం వక్ఫ్ (సవరణ) బిల్లు-2025కు లోక్‌సభ(Lok Sabha) ఆమోదం తెలిపింది. చర్చ సమయంలో అధికార, విపక్ష సభ్యుల వాద ప్రతివాదాలతో సభ ప్రతిధ్వనించింది. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం తెల్లవారుజాము 2.15 గం.లు దాటే వరకూ చర్చ, ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు వేశారు. దీంతో.. 56 ఓట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంతరాలు వీగిపోయాయి. -
ఆన్లైన్లో సుప్రీం జడ్జీల ఆస్తుల వివరాలు
న్యూఢిల్లీ: పారదర్శకతను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థిర, చరాస్తుల వివరాలను సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్నారు. గురువారం జరిగిన ఫుల్ కోర్టు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా సహా సుప్రీంకోర్టులోని 30 మంది జడ్జీలు ఆస్తులను ప్రకటించనున్నారు. అయితే, ఇది న్యాయమూర్తుల ఐచ్ఛికం మాత్రమేనని వెబ్సైట్ తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి సహా అందరు న్యాయమూర్తులు పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గానీ, ఏదైనా గణనీయ స్థాయిలో ఆస్తి సముపార్జన జరిగినప్పుడు గానీ ఆ వివరాలను బహిర్గతం తెలియజేయాలని ఫుల్‌కోర్టు నిర్ణయించిందని వెబ్సైట్ తెలిపింది. -
రణరంగంగా హెచ్‌సీయూ
గచ్చిబౌలి : కంచ గచ్చిబౌలిలోని భూములకు సంబంధించిన వివాదం నేపథ్యంలో గురువారం ఉదయం ఏబీవీపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ముట్టడికి ప్రయత్నించారు. ఉస్మానియా యూనివర్సిటీ, నగరం నుంచి ఆటోలు, బస్సుల్లో కార్యకర్తలు హెచ్‌సీయూ వద్దకు చేరుకున్నారు. పోలీసుల దృష్టి మరల్చి పదుల సంఖ్యలో నిరసనకారులు పలుమార్లు వర్సిటీ సర్వీస్ గేట్ నుంచి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం జరిగింది. ఏబీవీపీ కార్యకర్తలను అరెస్టు చేసే క్రమంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో 108 మంది ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. వాహనాల్లో మొయినాబాద్, రాజేంద్రనగర్, నార్సింగి పోలీస్ స్టేషన్లకు తరలించారు. హెచ్‌సీయూ కేంద్రంగా ఆందోళనలు రోజురోజుకూ తీవ్రమవుతుండటంతో గచ్చిబౌలి పోలీసులు బందోబస్తు ముమ్మరం చేశారు. గురువారం హెచ్‌సీయూ ప్రధాన ద్వారంతో పాటు ప్రధాన రహదారి, గోపన్‌పల్లి గేట్, 400 ఎకరాలు ఉన్న వైపు, క్యాంపస్ లోపల పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు 400 ఎకరాల భూముల విష యంలో సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారని అరుణ్‌రాజ్ అనే వ్యక్తి ఫిర్యాదు నేపథ్యంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి కొణతం దిలీప్,తో పాటు డాక్టర్ క్రిషాంక్ తదితరులపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 353 (1)(బి), 353 (1)సి, 353(2), 192, 196(1), 61(1)(ఏ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. లాఠీఛార్జి చేయలేదు: డీసీపీ హెచ్‌సీయూలో విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేశారని మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. బారికేడ్లను దాటుకొని వస్తున్న విద్యార్థులను కేవలం తాళ్లతో అడ్డుకున్నామని చెప్పారు. అయితే కొందరు విద్యార్థులు పోలీసు సిబ్బందిని నెట్టేసి, హోల్డింగ్ తాడును లాక్కోవడానికి ప్రయత్నించారని, దీంతో లాఠీలను నేలపై, తాళ్లపై కొడుతూ విద్యార్థులను అక్కడి నుంచి పంపించామని వివరించారు. వర్షంలోనే పాటలు.. డ్యాన్స్‌లు కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో హెచ్‌సీయూ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం వర్షం కురుస్తున్నా.. డ్యాన్స్‌లు చేస్తూ, పాటలు పాడుతూ ఆనందం వ్యక్తం చేశారు. -
పనులు ఆపేయండి.. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు స్టే
సాక్షి, న్యూఢిల్లీ: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో స్పందించింది. తమ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆ భూముల్లో చేపట్టిన అన్ని రకాల అభివృద్ధి పనులను నిలిపివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. చట్టాన్ని ఎలా మీ చేతుల్లోకి తీసుకుంటారంటూ ప్రశ్నించింది. కేవలం మూడ్రోజుల వ్యవధిలో వంద ఎకరాల్లో చెట్లను కొట్టేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన ధర్మాసనం.. ఇది చాలా తీవ్రమైన విషయమని, అంత అత్యవసరం ఏమొచ్చిందంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి తీసుకున్నారా? అని ప్రశ్నించింది. భూముల్లో ఎలాంటి పనులు చేపట్టకుండా స్టే విధించింది. తమ ఆదేశాల విషయంలో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కంచ గచ్చిబౌలి భూముల అంశాన్ని అమికస్ క్యూరీ పరమేశ్వర్ గురువారం ఉదయం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జి మసీలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కేసును సుమోటోగా తీసుకున్న ధర్మాసనం.. వారాంతం సెలవులను సద్విని యోగం చేసుకుని అధికారులు చెట్లను నరికివేయడంలో తొందరపడ్డారని అభిప్రాయపడింది. తక్షణమే ఆ భూములను సందర్శించి మధ్యాహ్నం 3:30 లోపు మధ్యంతర నివేదిక సమర్పించాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. తాము తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు, కంచ గచ్చిబౌలిలో చెట్ల నరికివేతను అనుమతించకూడదని సీఎస్‌ను ఆదేశించింది. హైకోర్టు రిజిస్ట్రార్ నివేదిక అందిన అనంతరం 3.45 గంటలకు విచారణ ప్రారంభించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది గౌరవ్ అగర్వాల్, భూముల విషయంలో ఆందోళన చేస్తున్న వారి తరఫున సీనియర్ అడ్వకేట్ గోపాల్ శంకరనారాయణ్ వాదనలు వినిపించారు. అటవీ ప్రాంతం కాదు: ప్రభుత్వ న్యాయవాది కంచ గచ్చిబౌలిలో ప్రస్తుతం పనులు జరుగుతున్న ప్రదేశం అటవీ ప్రాంతం కాదని, 30 సంవత్సరాలుగా ఆ భూమి వివాదంలో ఉందని గౌరవ్ అగర్వాల్ చెప్పారు. అటవీ భూమి అని చెప్పేందుకు ఆధారాలు లేవని అన్నారు. దీంతో.. ‘ఒకవేళ అటవీ ప్రాంతం కాకపోయినా చెట్లను నరికేందుకు అనుమతి తీసుకున్నారా? కేవలం 2, 3 రోజుల్లో 100 ఎకరాల్లో చెట్ల నరికివేత తీవ్రమైన అంశం. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా చట్టానికి అతీతం కాదు.’ అని జస్టిస్ గవాయి వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో చెట్ల నరికివేతపై దాఖలైన పిటిషన్‌పై ఇప్పటికీ విచారణ జరుగుతోందన్నారు. కాగా.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారని గోపాల్ శంకర నారాయణ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నెలరోజుల్లో నిపుణుల కమిటీ వేయాలి చెట్ల నరికివేతపై హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) సమర్పించిన నివేదికలోని అంశాలపై ధర్మాసనం ది్రగ్బాంతి వ్యక్తం చేసిసింది. ‘పెద్ద సంఖ్యలో చెట్లను నరికివేసి, భారీ యంత్రాలను ఉపయోగించి వందలాది ఎకరాలను అస్తవ్యస్తం చేశారు. ఈ విధ్వంసకాండ వల్ల నెమళ్లు, జింకలు ఈ ప్రాంతం నుంచి పారిపోయినట్లు చూపించే చిత్రాలు నివేదికలో ఉన్నాయి. దీనికి తోడు అక్కడ ఒక చెరువు కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రిపోర్టులో పొందుపర్చిన చిత్రాలను ప్రాథమికంగా పరిశీలిస్తే.. ఈ ప్రాంతం అడవి జంతువుల నివాసానికి అనువుగా ఉంది..’ అని ధర్మాసనం పేర్కొంది. అటవీ భూములు గుర్తించడానికి చట్టబద్ధమైన కమిటీలను ఏర్పాటు చేయకపోతే.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా బాధ్యత తీసుకోవాల్సివస్తుందంటూ..ఓ కేసులో మార్చి 4న ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నామని ధర్మాసనం గుర్తుచేసింది. అటవీ భూములను గుర్తించే చట్టబద్ధమైన కసరత్తు ఇంకా ప్రారంభం కానప్పుడు, చెట్లను నరికివేసేందుకు ఉన్న ‘అంత ఆందోళనకరమైన ఆవశ్యకత’ ఏంటి? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో నెలరోజుల్లో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించిన ధర్మాసనం.. ఆ కమిటీ ఆరు నెలలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అలాగే.. కంచ గచ్చిబౌలి ప్రాంతాన్ని సందర్శించి ఈ నెల 16 లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ‘ఆ ప్రాంతంలో చెట్లను తొలగించడం వంటి కార్యకలాపాలను చేట్టపట్టాల్సిన అవసరం ఏంటి? చెట్ల నరికి వేత కోసం అటవీ అధికారుల నుంచి కానీ మరేదైనా స్థానిక చట్టాల కింద కానీ అనుమతులు తీసుకున్నారా? నరికివేసిన చెట్లతో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది?..’ తదితర ప్రశ్నలకు జవాబులివ్వాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. -
సుప్రీం తీర్పుపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఏమన్నారంటే..
ఢిల్లీ: హెచ్‌సీయూ భూముల (HCU Land Issue) విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నడుచుకుంటామన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ఢిల్లీలో ఉన్న అద్దంకి దయాకర్ మీడియాతో మాట్లాడుతూ..‘ లగచర్లలో ఒత్తిడి వస్తే దాన్ని మేము విత్ డ్రా చేసుకున్నాం. మా విషయంలో ఏదైనా పొరపాటు జరిగితే దాన్ని సరిదిద్దుకోవడానికి సిద్ధం. హెచ్ సీయూ భూములను మేము తీసుకోలేదు. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూనే అభివృద్ధి చేస్తాం. నెమలి, జింకలు ఉన్నాయని ఏఐ గ్రాఫిక్స్ ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో వేలాది ఎకరాలను కొంతమంది దోచుకున్నారు. 111 జీవో ఎత్తివేసి పెద్ద ఎత్తున వ్యాపారం చేయాలని బీఆర్ఎస్ ప్రయత్నించింది’ అని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు.కాగా, హెచ్‌సీయూ భూముల వివాదంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గురువారం హెచ్ సీయూ భూముల వివాదంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. పర్యావరణ విధ్వంసాన్ని చాలా తీవ్రమైన విషయంగా పరిగణించాలని స్పష్టం చేసింది. కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్లు నరికివేత సహా అన్ని పనులను తక్షణమే నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.వరుసగా మూడు రోజులు సెలవు రావడంతో పోలీసుల సాయంతో హెచ్‌సీయూ భూముల్లో పెద్ద ఎత్తున చెట్లు నరికేశారని ఫిర్యాదు సుప్రీం కోర్టుకు చేరింది. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నాం తర్వాత జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
సుప్రీం కోర్టు తీర్పును అంగీకరించబోను: మమతా బెనర్జీ
న్యూఢిల్లీ, సాక్షి: పశ్చిమ బెంగాల్లో 25 వేల మంది టీచర్ల నియామకాలను రద్దుచేస్తూ సుప్రీం కోర్టు(Supreme Court) ఇచ్చిన తీర్పుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. న్యాయ వ్యవస్థపై తమ ప్రభుత్వానికి అపారమైన గౌరవం ఉందని.. అయినప్పటికీ ఈ తీర్పును అంగీకరించబోమని అన్నారామె.ఈ దేశ పౌరురాలిగా నాకు ప్రతీ హక్కు ఉంటుంది. అలా.. మానవతా ధృక్పథంతో నా అభిప్రాయం తెలియజేస్తున్నా. న్యాయమూర్తులపై అపారమైన గౌరవం ఉన్నప్పటికీ ఈ తీర్పును నేను అంగీకరించబోను. అయినప్పటికీ ప్రభుత్వపరంగా కోర్టు చెప్పినట్లు నడుచుకుంటాం. స్కూల్ సర్వీస్ కమిషన్‌ను రిక్రూట్మెంట్ ప్రాసెస్ తిరిగి ప్రారంభించాలని కోరినట్లు తెలిపారామె. ఈ క్రమంలోనే ఢిల్లీ నోట్ల కట్టల జడ్జి(Delhi Notes Judge) అంశాన్ని ఆమె ప్రస్తావించారు.ఒక సిట్టింగ్ జడ్జి నివాసంలో నోట్ల కట్టలు దొరికితే కేవలం ట్రాన్స్ఫర్తో సరిపెడతారా?. అదే నియామకాల్లో మోసం జరిగిందని మొత్తం ప్రక్రియనే రద్దు చేస్తారా?. అలాంటప్పుడు వీళ్లను(అభ్యర్థులను) ఎందుకు బదిలీతో సరిపెట్టకూడదు అని మమతా అన్నారు. అలాగే.. నియామకాల రద్దుకు సంబంధించి ఆదేశాలు ఇచ్చిన తొలి జడ్జి ఇప్పుడు బీజేపీ ఎంపీగా(అభిజిత్ గంగోపాధ్యాయను ఉద్దేశించి..) ఉన్నారని, ఈ తీర్పు వెనుక బీజేపీ, సీపీఎంల కుట్ర దాగుంది అని అన్నారామె. బెంగాల్ విద్యా వ్యవస్థ కుప్పకూల్చాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోందని మండిపడ్డారామె. బెంగాల్లో 25 వేల మంది టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ నియమకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు(Calcutta High Court) తీర్పు ఇచ్చింది. ఇవాళ సుప్రీం కోర్టు ఆ తీర్పును సమర్థించింది. ఈ నియామకాల ప్రక్రియ మొత్తం మోసపూరితంగా జరిగినట్లు స్పష్టమవుతోంది. తిరిగి సరిదిద్దుకోలేని కళంకం ఇది. ఎలాంటి మోసానికి పాల్పడకుండా ఎంపికైన అభ్యర్థులు కూడా బాధపడాల్సి వస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు తీర్పు విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోబోమని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ ఖన్నా నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది.అయితే సుప్రీం కోర్టు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరి కారణంగా.. అంతమందిని శిక్షించడం ఏంటని ప్రశ్నించారామె. ఇది కేవలం 25 వేల మంది అభ్యర్థులకు మాత్రమే సంబంధించిన విషయం కాదని.. వాళ్ల కుటుంబాలకు సంబంధించిన అంశమని అన్నారామె. 2016లో జరిగిన 25 వేల టీచర్ల నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు గతంలో పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కలకత్తా హైకోర్టు ఈ నియామకాలను రద్దు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈక్రమంలో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకునేందుకు సరైన కారణాలు లేవని పేర్కొంది. మూడు నెలల్లో కొత్తగా టీచర్ల నియామకాలు చేపట్టాలని ఆదేశించింది. -
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కీలక నిర్ణయం
న్యూఢిల్లీ, సాక్షి: భారత ప్రధాన న్యాయమూర్తితో సహా సుప్రీం కోర్టు న్యాయమూర్తులంతా కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ ఆస్తులను ప్రకటించడానికి ఏకగ్రీవంగా అంగీకారం తెలిపారు. తద్వారా జడ్జీలు ఆస్తులు వెల్లడించాల్సిందేననే సంకేతాలిచ్చారు. న్యాయ వ్యవస్థపై విశ్వాసం కలిగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఆ వివరాలను సుప్రీం కోర్టు వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు.ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసే జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక బంగ్లాలో నోట్ల కట్టలు బయటపడిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారానికి సంబంధించిన ఒకవైపు ప్రత్యేక కమిటీ విచారణ కొనసాగుతుండగా.. మరోవైపు ఆ వివరాలను సర్వోన్నత న్యాయస్థానం వెబ్సైట్లో ఉంచి ఆశ్చర్యపరిచింది కూడా.ఈ నేపథ్యంతో.. ఏప్రిల్ 1వ తేదీన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో న్యాయమూర్తులంతా ప్రత్యేక సమావేశం నిర్వహించుకున్నారు. తమ ఆస్తుల్ని బహిర్గతపరిచేందుకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటిదాకా ఉన్న నిబంధనల ప్రకారం.. విధులు స్వీకరించే సమయంలో తమ ఆస్తుల వివరాలను న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు తెలియజేయాల్సి వచ్చేది. ఆపై ఆ వివరాలను సుప్రీం కోర్టు తన వెబ్సైట్లో అప్లోడ్ చేస్తూ వచ్చింది. కొంత మంది న్యాయమూర్తుల ఆస్తుల చిట్టా ఆ వెబ్సైట్లో ఉంది కూడా.అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆ వివరాలేవీ అప్డేట్ కావడం లేదు. అందుకు కారణం.. ఆ వివరాలను తప్పనిసరిగా ప్రజలకు బహిర్గత పర్చాలనే నిబంధనేదీ లేకపోవడం లేకపోవడమే. ఈ క్రమంలో ఇప్పుడు జస్టిస్ వర్మ వ్యవహారం చర్చనీయాంశం కావడంతో.. తమ ఆస్తుల్ని బహిర్గత పర్చాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తులంతా నిర్ణయించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.#BREAKING All Supreme Court Judges unanimously agree in a full court meeting to declare their assets to the Chief Justice of India.The declaration of the Judges' assets will be uploaded on the Supreme Court's website.#SupremeCourt pic.twitter.com/XT9OvDaNmo— Live Law (@LiveLawIndia) April 3, 2025 -
మమతా బెనర్జీ సర్కార్‌కు బిగ్ షాక్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో మమత బెనర్జీ ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. బెంగాల్లో 25వేల మంది టీచర్ల నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సమర్ధిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పుతో మమత సర్కార్‌ను భారీ ఎదురుదెబ్బ తగిలింది.వివరాల ప్రకారం.. బెంగాల్లో 2016లో జరిగిన 25వేల టీచర్ల నియామకాలను కలకత్తా హైకోర్టు గతంలో రద్దు చేసింది. టీచర్ నియామకాల కుంభకోణంపై గతేడాది ఏప్రిల్‌లో కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. 2016 నాటి స్టేట్ లెవల్ సెలక్షన్ టెస్ట్ (SLST) టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామక ప్రక్రియ చెల్లదని స్పష్టంచేసింది. ఆ పరీక్షతో జరిపిన నియామకాలను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది. అంతేగాక, దీనికింద ఉద్యోగాలు సాధించిన టీచర్లు తమ వేతనాన్ని తిరిగి ఇచ్చేయాలని వెల్లడించింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.ఈ క్రమంలో పలు పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా.. హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకునేందుకు సరైన కారణాలు లేవని ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి పీవీ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అవకతవకల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ 25వేల టీచర్ల నియామకాలు చెల్లవని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది.The Supreme Court upholds the Calcutta High Court’s decision to cancel the recruitment of more than 25,000 teachers and non-teaching staff by the SSC in 2016 for state-run and state-aided schools.“We find no valid ground or reason to interfere with the decision of the High… pic.twitter.com/6KHK5XX0G3— ANI (@ANI) April 3, 2025అలాగే, టీచర్ నియామకాలు చెల్లవని స్పష్టం చేసింది. అయితే, ప్రభావిత ఉపాధ్యాయులకు కాస్త ఊరట కల్పించింది. ఈ నియామక ప్రక్రియ కింద ఉద్యోగాలు సాధించిన టీచర్లు అప్పటివరకు అందుకున్న వేతనాలు, ఇతర భత్యాలను తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని వెల్లడించింది. దివ్యాంగ ఉపాధ్యాయులకు మానవతా కోణంలో ఊరట కల్పించింది. వారు విధుల్లో కొనసాగొచ్చని స్పష్టం చేసింది. ఇదే సమయంలో మూడు నెలల్లో కొత్తగా టీచర్ల నియామకాలు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఇదిలా ఉండగా.. 2016లో బెంగాల్ సర్కారు రాష్ట్ర స్థాయి టీచర్ సెలక్షన్ పరీక్ష నిర్వహించింది. 24,650 ఖాళీల భర్తీ కోసం చేపట్టిన ఈ రిక్రూట్మెంట్ పరీక్షకు 23 లక్షల మందికి పైగా హాజరయ్యారు. అనంతరం ఇందులో ఎంపిక ప్రక్రియ చేపట్టి 25,753 మందికి అపాయింట్మెంట్ లెటర్లు అందజేశారు. ఈ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. -
సీఎం రేవంత్‌రెడ్డిపై సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, సాక్షి: పార్టీ మారినా ఉప ఎన్నికలు రావంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సీఎం కొంతమేర సంయమనం పాటించాలని.. ఇలాంటి వ్యాఖ్యలు కోర్టు ధిక్కారంగా పరిగణించాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై గురువారం విచారణ జరిగింది. అసెంబ్లీ కార్యదర్శి తరఫున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ సందర్భంలో.. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ తరఫు న్యాయవాది ఆర్యమా సుందరం మరోసారి బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. ఉప ఎన్నికలు రావని అసెంబ్లీలో సీఎం ప్రకటించారు. స్పీకర్ తరఫునే ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని ఆయన చెప్పారు. స్పీకర్ తరఫున సీఎం ఎలా కామెంట్ చేస్తారు?. సీఎం ఉప ఎన్నికలు రావని అసెంబ్లీలో చెప్పాక.. పిటిషన్లపై విచారణ జరుగుతుందని మేమెలా నమ్మాలి అని లాయర్ ఆర్యమ వాదించారు.దీంతో అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘సీఎం కొంత మేర సంయమనం పాటించాలి. గతంలో కూడా ఇలాగే వ్యవహరించారు. ఇలాంటివాటిని కోర్టు ధిక్కారంగా పరిగణించాల్సి వస్తుంది. మేము సంయమనం పాటిస్తున్నాం. మిగిలిన రెండు వ్యవస్థలు కూడా అదే గౌరవంతో ఉండాలి. అసెంబ్లీలో జరిగిన పూర్తి చర్చను మేము పరిశీలిస్తాం.. .. గత అనుభవం ఉన్న వ్యక్తిగా, ముఖ్యమంత్రి కనీసం కొంత నియంత్రణ పాటించాలి కదా?. ఆ సమయంలో మేము చర్యలు తీసుకోకుండా, సరియైన తీర్పును (contempt) ఇవ్వకుండా తప్పు చేశామా?. మేము రాజకీయ నేతలు ఏం చెబుతున్నారనే దానితో పట్టించుకోము. కానీ ఇదే పరిస్థితిని ఇంతకుముందు ఎదుర్కొన్న వ్యక్తి ఉన్నప్పుడు ఎలా ఉండాలి?..’’ అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి జస్టిస్ బీఆర్ గవాయి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ టైంలో న్యాయవాది సింఘ్వీ కలుగజేసుకుని ప్రతిపక్షం నుంచి అంతకుమించిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇప్పుడు అవన్నీ అప్రస్తుతమని ధర్మాసనం వాటిని పక్కన పెట్టింది. రేవంత్ ఏమన్నారంటే..మార్చి 26వ తేదీన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం రేవంత్ ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని, పార్టీ మారిన ఎమ్మెల్యేలెవరూ ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ‘‘వచ్చే వారమే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్ఎస్ నేతలు ఊదరగొడుతున్నారు. కానీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ రావు. గత బీఆర్ఎస్ హయాంలో ఉన్న రాజ్యాంగమే ఇప్పుడు కూడా ఉంది. స్పీకర్ వ్యవస్థ, చట్టం అవే ఉన్నాయి. ఏవీ మారలేదు. అలాంటప్పుడు అప్పుడు పార్టీలు మారిన నేతల విషయంలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయని వ్యాఖ్యానించారు. -
HCU: ఇది చాలా సీరియస్ విషయం.. తెలంగాణ సర్కార్‌పై ‘సుప్రీం’ ఆగ్రహం
న్యూఢిల్లీ, సాక్షి: హెచ్‌సీయూ భూముల వివాదం(HCU Land Issue)పై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పర్యావరణ విధ్వంసం చాలా తీవ్రమైన విషయమన్న సుప్రీం కోర్టు.. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా? అని తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేత సహా అన్ని పనులను తక్షణమే నిలిపివేయాలంటూ గురువారం స్టే ఆదేశాలు జారీ చేసింది.వరుసగా మూడు రోజులు సెలవు రావడంతో పోలీసుల సాయంతో హెచ్‌సీయూ భూముల్లో పెద్ద ఎత్తున చెట్లు నరికేశారని ఫిర్యాదు సుప్రీం కోర్టుకు చేరింది. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నాం తర్వాత జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.‘‘అంత అత్యవసరంగా చెట్లను నరకాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?. సీఎస్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఏం చేస్తున్నారు?. పర్యావరణ విధ్వంసంపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఇలా ఎలా చేస్తారు?. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా?. ఇది చాలా తీవ్రమైన విషయం. అవసరమైతే సీఎస్‌పై తీవ్ర చర్యలు తీసుకుంటాం’’ అంటూ తదుపరి ఆదేశాలిచ్చేదాకా అన్ని పనులు నిలిపివేయాలని ఆదేశించింది. ఒకవేళ ఉల్లంఘనలు గనుక జరిగితే సీఎస్‌దే బాధ్యత అని జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు.ఇక.. హెచ్‌సీయూ భూములపై తెలంగాణ ప్రభుత్వం వేసిన కమిటీ నుంచి జీహెచ్ఎంసీ కమిషనర్‌తో పాటు పలువురు అధికారులను తొలగించింది. ఈ నెల 16వ తేదీకల్లా పర్యావరణ కమిషన్ (Commission for Environmental Cooperation) పర్యటించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అమికస్ క్యూరీని రిట్ పిటిషన్‌తయారు చేయాలని సూచించింది. తెలంగాణ సీఎస్‌ను ప్రతివాదిగా చేర్చిన సుప్రీం కోర్టు.. అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.అంతకు ముందు.. ఈ ఉదయం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ప్రభుత్వం విక్రయించాలనుకున్న కంచ గచ్చిబౌలి భూముల్ని వెంటనే సందర్శించాలని, ఇవాళ మధ్యాహ్నాం 3.30గం. లోపు నివేదిక ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ఆ సమయంలో.. 30 ఏళ్లుగా భూమి వివాదంలో ఉందని, అటవీ భూమి అని ఆధారాలు లేవని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అయినప్పటికీ పర్యావరణ విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోబోమని సుప్రీం కోర్టు తాజా విచారణతో ఉద్ఘాటించింది. -
ఇప్పటికే 14 నెలలు వృథా.. ఇంకా టైం ఎలా అడుగుతారు?: సుప్రీం కోర్టు అసహనం
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీం కోర్టు(Supreme Court)లో విచారణ ముగిసింది. అన్నివైపులా వాదనలు పూర్తి కావడంతో జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. అయితే.. 8 వారాల్లోగా తీర్పు వెల్లడించాలని బీఆర్ఎస్ తరఫు న్యాయవాది ఆర్యమా సుందరం విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఇవాళ ఫిరాయింపుల కేసు(Defections Case)లో వాదనలు వినిపించారు. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవని సింఘ్వీ బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో రీజనబుల్ టైం ఏంటో చెప్పాలని స్పీకర్‌ను కోరుతూ.. మరోసారి ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మీ అభిప్రాయం ప్రకారం సమంజసమైన కాల వ్యవధి(Reasonable Time) అంటే ఎంత?. 2028 జనవరి-ఫిబ్రవరి వరకు ఎదురు చూసేలా.. వ్యవస్థను మార్చేందుకు అనుమతించాలా?. మేము కొంత న్యాయసమ్మతమైన ధోరణిని ఆశిస్తున్నాం అని సింఘ్వీని ఉద్దేశించి జస్టిస్ గవాయి వ్యాఖ్యానించారు. న్యాయవాదులు ఇలాంటి కేసుల విషయంలో వ్యవహరించే విధానం చాలా ఇబ్బందికరంగా ఉందని.. సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత వారి తీరు పూర్తిగా మారిపోతోందని వ్యాఖ్యానించారు. అనర్హత పిటిషన్లపై విచారణకు మీకు ఎంత సమయం కావాలి? అని ప్రశ్నించగా.. ఒక్క మాటలో చెప్పాలంటే ఆరు నెలల సమయం కావాలి అని న్యాయవాది సింఘ్వీ అన్నారు. దీంతో జస్టిస్ గవాయ్ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే 14 నెలల సమయం వృథా అయ్యింది. మరో ఆరు నెలలు ఎలా అడుగుతారు?. ఇన్ని నెలలు గడిచాక కూడా కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన సమయం రాలేదా? అని ప్రశ్నించారు. అయితే.. స్పీకర్‌కు తుపాకీ గురిపెట్టి నిర్ణయం తీసుకోమని ఒత్తిడి చేస్తున్నారని లాయర్ సింఘ్వీ అన్నారు. ఈ క్రమంలో.. బీఆర్ఎస్ తరఫు న్యాయవాది ఆర్యమా సుందరం కలుగజేసుకుని సీఎం రేవంత్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఉప ఎన్నికలు రావని అసెంబ్లీలో సీఎం ప్రకటించారు. స్పీకర్ తరఫునే ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని ఆయన చెప్పారు. స్పీకర్ తరఫున సీఎం ఎలా కామెంట్ చేస్తారు?. అసెంబ్లీలో మాట్లాడితే ఏ కోర్టు నుంచి అయినా రక్షణ ఉంటుందని అన్నారు. సీఎం ఉప ఎన్నికలు రావని అసెంబ్లీలో చెప్పాక.. పిటిషన్లపై విచారణ జరుగుతుందని మేమెలా నమ్మాలి అని లాయర్ సుందరం అన్నారు. దీనిపై జస్టిస్ గవాయ్(Justice Gavai) స్పందిస్తూ ‘‘సీఎం కనీసం స్వీయ నియంత్రణ పాటించలేరా? గతంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఆ తర్వాత కూడా ఇలాగే వ్యవహరిస్తే ఎలా?’’ అని ప్రశ్నించారు. మరోవైపు అభిషేక్ మనుసింఘ్వీ కలుగజేసుకుని ప్రతిపక్షం నుంచి అంతకుమించిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు అవన్నీ అప్రస్తుతమని ధర్మాసనం వాటిని పక్కన పెట్టింది. అయితే.. సీఎం మాటలు కోర్టు ధిక్కారం కింద తీసుకోవాల్సి ఉంటుందని జస్టిస్ గవాయ్ హెచ్చరించారు. ‘‘మేం సంయమనం పాటిస్తున్నాం.. మిగతా రెండు వ్యవస్థలు అదే గౌరవంతో ఉండాలి’’ అని వ్యాఖ్యానించారు. స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత కోర్టులో కేసులతో తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని చూశారని సింఘ్వీ పేర్కొనగా.. సింగిల్ జడ్జి ఇచ్చిన సూచనలను సానుకూలంగా తీసుకుని ఉంటే కేసు ఇక్కడి వరకు వచ్చేది కాదని జస్టిస్ గవాయ్ అన్నారు. అన్నివైపులా వాదనలు పూర్తి కావడంతో కేసు విచారణ ముగిస్తున్నట్లు.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు జస్టిస్ గవాయ్ తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ కారు పార్టీ గుర్తు మీద గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని, ఉన్నత న్యాయస్థానం చెప్పినా వాళ్లపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని.. అనర్హత వేటు కోరుతూ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ కొనసాగింది. బీఆర్ఎస్ తరఫున ఆర్యమా సుందరం, తెలంగాణ స్పీకర్ తరఫున ముకుల్ రోహత్గీ, అసెంబ్లీ కార్యదర్శి తరఫున న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. -
పరిధి దాటొద్దు.. పోలీసులను హెచ్చరించిన సుప్రీంకోర్టు
వ్యక్తులు, సమాజం నమ్మకాన్ని చూరగొనేలా నడుచుకోవడం పోలీసుల అత్యంత ముఖ్యమైన కర్తవ్యం. పౌరులు పరిధి దాటవచ్చేమో కానీ.. పోలీసులు దాటడానికి వీల్లేదు. పోలీసులు పరిధులు దాటుతున్నట్లు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవు. మేజి్రస్టేట్లు కూడా తగిన నిర్ణయం వెలువరించే ముందు జాగ్రత్తగా తమ మెదడు ఉపయోగించాలి. రొటీన్‌గా వ్యవహరించవద్దు. సాక్షి, అమరావతి: పౌరుల అరెస్ట్ విషయంలో పోలీసులు పరిధులు దాటి వ్యవహరిస్తుండటంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. పౌరులు పరిధి దాటవచ్చునేమో గానీ, పోలీసులు మాత్రం పరిధులు దాటడానికి ఎంత మాత్రం వీల్లేదని హెచ్చరించింది. ‘రాష్ట్ర యంత్రాంగంలో పోలీసు వ్యవస్థ చాలా కీలకం. సమాజం.. ముఖ్యంగా వ్యక్తుల రక్షణ, భద్రతపై పోలీసు వ్యవస్థ ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల వ్యక్తులు, సమాజం నమ్మకాన్ని చూరగొనేలా నడుచుకోవడం పోలీసుల అత్యంత ముఖ్యమైన కర్తవ్యం’ అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పోలీసులు పరిధులు దాటుతున్నట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. మేజిస్ట్రేట్లు కూడా తగిన నిర్ణయం వెలువరించే ముందు జాగ్రత్తగా తమ మెదడు ఉపయోగించాలని, రొటీన్‌గా వ్యవహరించవద్దని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల కాపీని దేశంలోని డీజీపీలందరికీ పంపాలని సుప్రీంకోర్టు తన రిజిస్ట్రీని ఆదేశించింది. కస్టడీ విషయంలో వ్యక్తుల హక్కులను పరిరక్షించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఈ ఆదేశాల ద్వారా డీజీపీలకు గుర్తు చేస్తున్నామని చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరించారంటూ పిటిషన్హరియాణాకు చెందిన విజయ్ పాల్‌కు తన పొరుగు వారైన మమతా సింగ్ తదితరులతో వివాదం ఏర్పడింది. దీంతో పోలీసులు విజయ్ పాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు పేరుతో పోలీసులు తన పట్ల చట్ట విరుద్ధంగా వ్యవహరించడంతో పాటు తనను కొట్టారంటూ విజయ్‌పాల్ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని ఆయన హైకోర్టుకు నివేదించారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు 2023లో కొట్టేసింది. దీనిపై విజయ్‌పాల్ అదే ఏడాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఘటనా స్థలంతో పాటు అటు తర్వాత పోలీస్‌స్టేషన్‌లో కూడా పోలీసులు తనపై దాడి చేశారని విజయ్‌పాల్ సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. తన అరెస్ట్ గురించి తన సోదరుడు జిల్లా ఎస్పీకి ఈ–మెయిల్ పంపారని, దీంతో పోలీసులు మరింత రెచ్చిపోయారన్నారు. తనను కస్టడీలోకి తీసుకున్న రెండు గంటల తర్వాత తనపై కేసు నమోదు చేశారని తెలిపారు. దీంతో సుప్రీంకోర్టు హర్యానా డీజీపీ వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిచ్చింది. దీంతో డీజీపీ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు స్వయంగా హాజరయ్యారు. ఆ తర్వాత పలు విచారణల అనంతరం గత వారం ఈ వ్యాజ్యంపై జస్టిస్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఇరుపక్షాలు కోర్టు ముందుంచిన రికార్డులను పరిశీలించిన ధర్మాసనం, విజయ్‌పాల్ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని తేల్చింది. ఓ వ్యక్తి క్రిమినల్ అయినప్పటికీ, అతని విషయంలో కూడా చట్ట ప్రకారం వ్యవహరించాలని చట్టం చెబుతోందని ధర్మాసనం గుర్తు చేసింది. విజయ్‌పాల్‌పై నమోదైన కేసులో కింది కోర్టు విచారణ జరుపుతున్న నేపథ్యంలో తమ ముందున్న వ్యాజ్యాన్ని మూసి వేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తగా ఉండాలని పోలీసులను హెచ్చరించింది. తన కింది అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేదే లేదన్న రీతిలో చర్యలు తీసుకోవాలని డీజీపీకి స్పష్టం చేసింది. ఓ వ్యక్తి అరెస్ట్ విషయంలో పోలీసులకు అధికారాలు కల్పిస్తున్న సీఆర్పీసీ సెక్షన్ 41(1)(బీ)(2)లో నిర్ధేశించిన చెక్‌లిస్ట్ పట్ల తాము ఎంత మాత్రం సంతృప్తికరంగా లేమంది. హర్యానా రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది తమ ముందు ఉంచిన ఈ చెక్లిస్ట్ను ఓ ఫార్మాలిటీగానే భావిస్తున్నామంది. ఈ చెక్లిస్ట్ను అనుమతించే విషయంలో మేజిస్ట్రేట్ సైతం మెదడు ఉపయోగించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
స్పీకర్ చర్యలు తీసుకోకున్నా చేతులు కట్టుకొని చూస్తుండాలా?: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఓ పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిన స్పీకర్ చర్యలు తీసుకోకపోతే మేం (కోర్టులు) చేతులు కట్టుకొని కూర్చోవాలా?’ అంటూ సుప్రీంకోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు తమ ముందుకు వచ్చే దాకా పార్టీ మారిన ఎమ్మె ల్యేలకు స్పీకర్ ఎందుకు నోటీ సులు జారీ చేయలేదని ప్రశ్నించింది. తొలి నోటీసు ఇచ్చేందుకు స్పీకర్‌కు 11 నెలలు ఎందుకు పట్టిందని నిలదీసింది. ‘ఒకవేళ కేసు మా ముందుకు రాకపోయి ఉండి ఉంటే మీరు (స్పీకర్) నాలుగేళ్లు కాలయాపన చేసేవాళ్లేమో?’ అంటూ చురకలు అంటించింది. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్లపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)తోపాటు మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డి, అరికెపూడి గాందీలపై దాఖలైన రిట్ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జి మసీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఎస్ఎల్పీపై సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరం, రిట్ పిటిషన్‌పై దామ శేషాద్రి నాయుడు, పి.మోహిత్‌రావు వాదనలు వినిపించగా స్పీకర్ కార్యాలయం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, అభిషేక్ మనుసింఘ్వీ వాదించారు. స్పీకర్ స్వతంత్రుడు... తొలుత ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ ‘స్పీకర్ స్వతంత్రుడు, కోర్టులు ఆదేశాలు ఇవ్వజాలదు. స్పీకర్‌కు రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలను కోర్టులు హరించలేవు. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాతే న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టుకు హైకోర్టులపై నియంత్రణ అధికారం లేదు. స్పీకర్ తన విధానాలకు స్వతంత్రుడు. కాబట్టి కోర్టు ఆదేశాలు ఇవ్వజాలదు’ అని పేర్కొన్నారు. ఈ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. ఇది రాజ్యాంగ తీర్పులకు వ్యతిరేకమని వ్యాఖ్యానించింది. సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని తాము స్పీకర్‌కు చెప్పలేమా? అంటూ ముకుల్ రోహత్గీని జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. ‘మేం అలా చేయకపోతే రాజ్యాంగ నిబంధనలను నిరాశ పరిచినవారమవుతాం. 2, 3, 4 ఏళ్లు నిర్ణయం తీసుకోకపోయినా ఆర్టికల్ 226 కింద ఆదేశాలు జారీ చేయడానికి కోర్టుకు అధికారం లేదని మీరెలా అంటారు?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. అనర్హత పిటిషన్లను నిర్దిష్ట కాలపరిమితిలో నిర్ణయించాలని తాము స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై రోహత్గీ స్పందిస్తూ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వారంలోనే హైకోర్టులో పిటిషనర్లు పిటిషన్ వేశారన్నారు. ఒకదాని తర్వాత మరొక రిట్ పిటిషన్లు వేస్తూ వచ్చారని.. కనీసం స్పీకర్‌కు ఫిర్యాదును పరిశీలించే అవకాశం కూడా లేకుండా పిటిషన్లు వేశారని తెలిపారు. చర్యలకు ఉపక్రమించొచ్చు ముకుల్ రోహత్గీ వాదనలపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘న్యాయస్థానాలు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయి. 11 నెలలుగా స్పీకర్ ఫిరాయింపులపై స్పందించలేదు. మేం జోక్యం చేసుకున్న తర్వాతే కదా వాళ్లకు మీరు నోటీసులు ఇచ్చింది. మేం స్పందించకపోతే ఇలాగే మరో నాలుగేళ్లు వేచి చూసేవాళ్లేమో?, స్పీకర్ జోక్యం చేసుకోకుంటే మేం ఇలాగే చేతులు కట్టుకొని కూర్చోవాలా? ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచనట్లే. రాజ్యాంగ సంరక్షకుడిగా వ్యవహరించాల్సిన బాధ్యత మాపై ఉంది. ‘సింగిల్ బెంచ్ కేవలం స్పీకర్‌ను నాలుగు వారాల్లో షెడ్యూల్‌ను నిర్ణయించాలని మాత్రమే అడిగింది. అలాంటప్పుడు అందులో జోక్యం చేసుకోవడానికి ఎటువంటి కారణం లేదు. కానీ రాజ్యంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టు ఆదేశాలు, అభ్యర్థనలను రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి అయినా పాటించనప్పుడు.. వారిపై చర్యలు తీసుకొనే అధికారం ఉంటుంది. మా నిర్ణయాన్ని స్పీకర్‌కు అభ్యర్థన రూపంలో తెలియపరుస్తాం. అప్పటికీ స్పీకర్ స్పందించకపోతే ఆర్టికల్ 142 ప్రకారం మా అధికారాలు ఉపయోగించి చర్యలకు ఉపక్రమిస్తాం. గతంలో మాకున్న అధికారాలతో ఓ స్పీకర్‌ను కోర్టుకు పిలిపించిన విషయాన్ని మర్చిపోవద్దు’ అంటూ ధర్మాసనం గుర్తుచేసింది. ముకుల్ రోహత్గీ వాదనల అనంతరం స్పీకర్ కార్యదర్శి తరఫున అభిషేక్ మనుసింఘ్వీ, ఎమ్మెల్యేల తరఫున రవిశంకర్ జంధ్యాల, ఎమెల్యేల తరఫున గౌరవ్ అగర్వాల్‌లు వాదనలను వినిపించారు. స్పీకర్, స్పీకర్ కార్యదర్శి తరఫున ముగ్గురు వాదనలను వినిపిస్తారా? ఏం చెప్పినా ఒకటే కదా మీ అందరూ చెప్పేది అంటూ జస్టిస్ గవాయి వారిని ఉద్దేశించి వ్యంగ్రా్రస్తాలు సంధించారు. సీఎం రేవంత్‌పై సుప్రీం ఆగ్రహం ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ‘రాష్ట్రంలో ఉపఎన్నికలు రావు’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను విచారణ సందర్భంగా బీఆర్ఎస్ తరఫు న్యాయవాది ఆర్యమా సుందరం సుప్రీం ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డిపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘స్పీకర్ సమక్షంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అది రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను అపహస్యం చేసినట్లే’ అని ధర్మాసనం మండిపడింది. అయితే తాను సీఎం తరఫున వాదనలను వినిపించట్లేదని.. అందువల్ల ఆ వ్యాఖ్యల గురించి వివరించలేకపోతున్నానని ముకుల్ రోహత్గీ బదులిచ్చారు. దీనిపై జస్టిస్ గవాయ్ స్పందిస్తూ గతంలో అదే సీఎం తరఫున ఒక కేసులో హాజరైన విషయం మర్చిపోవద్దంటూ గుర్తుచేశారు. ‘రాజకీయ నాయకులు అసెంబ్లీలో ఏదైనా చెప్పినప్పుడు దానికి కొంత పవిత్రత ఉంటుంది, ప్రజలు ఆ మాటలను విశ్వసిస్తారు. మేము కోర్టు ధిక్కారణ నోటీసులు జారీ చేయడంలో నెమ్మదిగా ఉండొచ్చు.. కానీ శక్తిలేనివారమైతే కాదు. కాబట్టి ఇకపై ఇటువంటి వ్యాఖ్యలను పునరావృతం చేయొద్దని సీఎంకు చెప్పి హెచ్చరించండి’ అని ధర్మాసనం రోహత్గీకి సూచించింది. అనంతరం ఈ కేసును గురువారానికి వాయిదా వేసింది. గురువారం స్పీకర్ కార్యదర్శి తరఫున అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించనున్నారు. అనంతరం ఆర్యమా సుందరం రోహత్గీ, సింఘ్వీల వాదనలపై రిప్లై ఇవ్వనున్నారు. ఆర్టికల్ 142 ఏం చెబుతోందంటే... రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 సుప్రీంకోర్టుకు విస్తృతాధికారాలు కల్పిస్తోంది. పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌పై అవసరమైన ఉత్తర్వులు జారీ చేసేందుకు అవకాశమిస్తుంది. ఈ ఉత్తర్వులను దేశంలోని ఏ ప్రాంతంలోనైనా అమలు చేసి తీరాల్సిందే. గతంలో ఈ ఆర్టికల్ మేరకు అధికారాలను వినియోగించి భోపాల్ గ్యాస్ లీక్ కేసులో పరిహారం అందించాలని, జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్లలోపు వైన్ షాపులు ఏర్పాటు చేయవద్దని.. ఇలా పలు కేసుల్లో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. -
ఎంత ‘నిర్మల’మైన న్యాయం?!
ఇంట్లో గోనె సంచుల్లో నోట్ల కట్టలు తగులబడిన జస్టిస్ యశ్వంత్ వర్మ కథ ఇంకా మరిచిపోక ముందే, దాని అడుగుజాడల్లోనే, థ్రిల్లర్ సినిమాను మైమరపింపజేసే మరొక న్యాయమూర్తి రసవత్తరమైన కథ గురించి చెప్పుకోవ లసి వస్తున్నది. ‘తీగలాగితే డొంక కదిలింది’ అనే సామెతను అక్షరాలా నిజం చేసే వాస్తవ కథనం ఇది. సినిమా కథలు తిరిగినన్ని మలుపులు, అనూహ్య సంఘ టనలు, తారుమారు పరిణామాలు ఎన్నో ఉన్న ఈ అవినీతి కథ ఒక తారుమారు తమాషాతో మొదలయింది. పంజాబ్– హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ నిర్మల్జిత్ కౌర్ 2008 జూలై 10న పదవి స్వీకరించారు. తర్వాత నెల రోజు లకు, 2008 ఆగస్ట్ 13న ఆమె ఇంటికి ఒక వ్యక్తి వచ్చి ‘నిర్మల్ జీకి ఇమ్మని ఢిల్లీ నుంచి ఈ పార్సెల్ వచ్చింది’ అని ఒక ప్లాస్టిక్ కవర్ ఇచ్చాడు. అమ్రిక్ సింగ్ అనే వాచ్‌మన్ ఆ పార్సెల్ లోపలికి తీసుకొచ్చి న్యాయమూర్తి ముందు విప్పితే, అందులో నుంచి అక్షరాలా పదిహేను లక్షల రూపాయలు బైటపడ్డాయి. ఆ పార్సెల్ తెచ్చిన ప్రకాష్ అనే వ్యక్తిని పోలీసులకు అప్పగించి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విషయం తెలియజేశారు. పోలీసులు ప్రకాష్‌ను ప్రశ్నించగా, అతను పంజాబ్ హైకోర్టులో అడ్వకేట్ జనరల్‌గా ఉన్న సంజీవ్ బన్సాల్ దగ్గర గుమాస్తా అని తేలింది. పోలీసులు బన్సాల్‌ను ప్రశ్నించగా, అవి తన డబ్బులు కావని, ఢిల్లీకి చెందిన హోటల్ యజమాని రవీందర్ సింగ్ తనకు పంపి, జస్టిస్ నిర్మల్ యాదవ్‌కు అంద జేయమని చెప్పాడని, తన గుమాస్తాకు ‘జస్టిస్ నిర్మల్ జీకి ఇవ్వు’ అని పంపిస్తే, పొరపాటున జస్టిస్ నిర్మల్జిత్ జీకి ఇచ్చా డని చెప్పాడు. అంటే ఆ సొమ్ము వాస్తవంగా చేరవలసింది జస్టిస్ నిర్మల్ యాదవ్ అనే మరొక న్యాయమూర్తికన్నమాట. గుమాస్తా చేసిన చిన్న పొరపాటువల్ల, ఇద్దరు న్యాయమూర్తుల పేర్లలో నిర్మల్ ఉండడం వల్ల ఈ అవినీతి బయటపడింది. జస్టిస్ నిర్మల్జిత్ కౌర్ ఇచ్చిన ఫిర్యాదుతో, రెడ్ హ్యాండెడ్‌గా పదిహేను లక్షల రూపాయలు, అది పట్టుకొచ్చి ఇచ్చిన వారు, పంపించినవారు దొరికారు గనుక పోలీసు కేసు నమోదయింది. కాని, న్యాయమూర్తి, అడ్వకేట్ జనరల్‌లకు ఇందులో భాగం ఉంది గనుక పది రోజుల్లో ఈ కేసును పోలీ సుల నుంచి సీబీఐకి బదిలీ చేశారు. తర్వాత సీబీఐ చేసిన దర్యాప్తులో సంజీవ్ బన్సాల్, రాజీవ్ గుప్తా కలిసి హరియాణా లోని పంచ్ కులాలో కొన్న ఒక భూమి కేసులో, జస్టిస్ నిర్మల్ యాదవ్ వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, అందుకు ప్రతిఫలంగా ఈ లంచం పంపించారని తేలింది. అది మాత్రమే కాక, జస్టిస్ నిర్మల్ యాదవ్ విదేశీ ప్రయాణపు టికెట్లు, విదే శాలలో ఆమె వాడిన మొబైల్ ఫోన్ కార్డ్ కూడా సంజీవ్ బన్సాల్ కొనిపెట్టాడని సీబీఐ సాక్ష్యాధారాలు సేకరించింది. నిందితులకు, న్యాయమూర్తికి మధ్య జరిగిన సంభాషణల ఫోన్ రికార్డులను కూడా సీబీఐ సేకరించింది. చివరికి అవినీతి నిరోధక చట్టం కింద, భారత శిక్షా స్మృతి కింద జస్టిస్ నిర్మల్ యాదవ్ మీద, మిగిలిన నిందితుల మీద కేసు పెట్టవచ్చునని సీబీఐ నిర్ధారించింది. ఇక్కడిదాకా సాఫీగా సాగిన కథ తర్వాత ఎన్నో ఉత్కంఠ భరితమైన మలుపులు తిరిగింది. న్యాయమూర్తి మీద ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇమ్మని కోరుతూ సీబీఐ స్థానిక అధికా రులు ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఆ నివేదికకు జవాబిస్తూ సీబీఐ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ నిందితుల మీద కేసు నడపడానికి తగిన ఆధారాలు లేవని అన్నారు. కాని ఆ సమయంలో సీబీఐకి డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తి ఇది తప్పకుండా ప్రాసిక్యూట్ చేయవలసిన అవినీతి నేరమే అన్నారు. సీబీఐ ఉన్నతాధికారులిద్దరు ఇలా భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, మూడో అభిప్రాయం కోసం అప్పటి అటార్నీ జనర ల్కు పంపారు. అదే ప్రతిని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌కు కూడా పంపారు. అటార్నీ జనరల్ కూడా ఈ కేసులో పస లేదు అన్నారు. ఈ వ్యవహారం బయటకు పొక్కి, ‘హైకోర్టు న్యాయమూర్తి మీద కేసు నడపడానికి తిరస్కరించిన సీబీఐ’ అని హిందుస్థాన్ టైమ్స్ 2009 జూన్ 6న ఒక వార్త రాసింది. అది చూసిన అప్పటి న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ, ఇంత తీవ్రమైన వ్యవహారంలో కేసు నడపకపోవడం తప్పు అనీ, అలా చేస్తే న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోతుందనీ తీవ్ర పదజాలంతో న్యాయశాఖ కార్యదర్శికి నోట్ పెట్టి, దర్యాప్తు చేసి నివేదిక ఇమ్మన్నారు. అప్పుడు సీబీఐ మళ్లీ కొత్తగా వచ్చిన అటార్నీ జనరల్ సలహా కోసం వెళ్లింది. కొత్త అటార్నీ జనరల్ కూడా కేసు అవసరం లేదు అంటూ పాత అటార్నీ జనరల్ అభిప్రాయాన్నే ప్రకటించారు. దానితో తర్వాత సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో కేసును ఉపసంహరించుకుంటున్నానని (క్లోజర్ రిపోర్ట్) సీబీఐ తెలిపింది. ఇక్కడ కథ మరొక మలుపు తిరిగి, సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి క్లోజర్ రిపోర్ట్‌ను తిరస్కరించి, కేసు నడపవల సిందే అన్నారు. అప్పుడు సీబీఐ మరొకసారి అనుమతి కోసం దరఖాస్తు... పైకి పంపించింది. దాన్ని పరిశీలించిన న్యాయ శాఖ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలని నిర్ణయించగా, రాష్ట్రపతి 2011 మార్చ్‌లో అనుమతి ఇచ్చారు. అంటే రెడ్ హ్యాండెడ్‌గా అవినీతి పట్టు బడినా కేసు ప్రారంభించడానికే మూడు సంవత్సరాలు పట్టిందన్న మాట. అప్పుడు సీబీఐ చార్జిషీట్ వేసింది. అప్పటికే ఈ కేసు నడపడానికి వీలులేదని ఎన్నో పిటిషన్లు దాఖలు చేసిన జస్టిస్ నిర్మల్ యాదవ్ ఇప్పుడు ఈ అనుమతి చెల్లదని హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు అనుమతి చెల్లుతుందని తేల్చి చెప్పింది. ఆ తీర్పును నిర్మల్ యాదవ్ సుప్రీం కోర్టులో సవాలు చేయగా, అక్కడ కూడా ఆమెకు చుక్కెదురయింది. కేసును తాత్సారం చేయడానికి ఆమె వేసిన మరెన్నో పిటిషన్లు కూడా గడిచిన తర్వాత, చివరికి 2013 మేలో నెల లోపు దర్యాప్తు, చార్జెస్ ఫ్రేమ్ ప్రక్రియలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. అలా అవినీతి సొమ్ము దొరికిన ఐదు సంవత్సరాల తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టులో కేసు మొదలయింది. ఏడున్నర సంవ త్సరాల తర్వాత చార్జెస్ ఫ్రేమ్ అయి విచారణ మొదలయింది. ఈలోగా జస్టిస్ నిర్మల్ యాదవ్ పదవీ విరమణ జరిగింది. సంజీవ్ బన్సాల్ మరణించాడు. డబ్బు పట్టుకొచ్చిన గుమాస్తా మరణించాడు. నలుగురు కీలక సాక్షులు అడ్డం తిరిగారు. న్యాయస్థానం దాదాపు 70 మంది సాక్షులను విచారించింది. ఇలా ఎన్నెన్నో అవరోధాలు దాటి, ఘటన జరిగిన 17 సంవత్సరాల తర్వాత, కేసు మొదలైన 14 సంవత్సరాల తర్వాత... ఎట్టకేలకు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అల్కా మాలిక్ సరిపోయినన్ని సాక్ష్యాధారాలు లేవని, సాక్షుల వాఙ్మూలాల్లో వైరుద్ధ్యాలున్నాయని కేసు కొట్టేశారు. ఎంత నిర్మలమైన న్యాయం!!ఎన్. వేణుగోపాల్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఇకనైనా అరాచకం ఆగేనా!
రాచరికాల్లో అధికారానికీ, దర్పానికీ, దానిద్వారా లభించే న్యాయానికీ రాజదండం చిహ్నం. ఈమధ్యకాలంలో బుల్డోజర్ అలాంటి పాత్ర పోషిస్తున్న వైనం కనబడుతోంది. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ పాలన మొదలయ్యాక బుల్డోజర్ అర్థం, దాని పరమార్థం మారిపోయాయి. ఆ రాష్ట్రాన్ని చూసి మరికొన్ని రాష్ట్రాలు వాతలు పెట్టుకోవటం కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో 2021 మార్చిలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అమానవీయంగా, చట్టవిరుద్ధంగా ఆవాసాలను కూల్చేసిన అధికారగణంపై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయటంతోపాటు, ఇళ్లు కోల్పోయిన ఆరుగురు పిటిషనర్లకూ ఆరువారాల్లో రూ. 10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు... ఈ ఉదంతం తమ అంతరాత్మను తీవ్రంగా కలవరపరిచిందని ధర్మాసనం తెలియజేసింది. అధికారమంటే ఇష్టానుసారం ఏదైనా చేయడానికి దొరికిన లైసెన్స్‌గా భావించే సంస్కృతి దేశంలో ముదిరిపోయింది. ఒక్క యూపీలోనేకాదు... మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ వగైరాల్లో ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకున్న తీరు గమనిస్తే ఇదో అంటువ్యాధిగా మారిందన్న అభిప్రాయం కలుగుతుంది. ఏదైనా కేసులో నిందితులుగా ఉన్నా లేదా శిక్షపడినా... అధికార పక్షానికి అనుకూలంగా లేకపోయినా అలాంటివారి ఇళ్లూ, దుకాణాలూ కూల్చేయడానికి బుల్డోజర్లు అత్యుత్సాహంతో ఉరుకుతున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది. నిర్మాణ నిబంధనల్ని తీవ్రంగా ఉల్లంఘించారని తేలినా, ప్రభుత్వ భూమినో, మరొకరి భూమినో దురా క్రమించి కట్టారని తేలినా అలాంటివాటిని కూల్చేయటాన్ని ఎవరూ తప్పుబట్టరు. కానీ అందుకొక విధానం ఉండాలి. చట్ట నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి. తప్పు చేశారని ఆరోపణ లొచ్చినవారికి తగిన నోటీసులిచ్చి వారి సంజాయిషీ కోరాలి. సంతృప్తి చెందనట్టయితే ఆక్రమణ దారులకు హేతుబద్ధమైన వ్యవధినిచ్చి కూల్చివేత ప్రక్రియ ప్రారంభించాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు విచారిస్తున్న కేసు సంగతే తీసుకుంటే 2021 మార్చి 1న మొదటిసారి అక్కడ నివాసముంటున్నవారికి నోటీసులు వచ్చాయి. వారికి అంతకు దాదాపు మూణ్ణెల్ల ముందే... అంటే జనవరి 8న నోటీసులిచ్చినట్టు, అందులో ఆ నెల 27లోగా ఎవరికివారు సొంత ఖర్చులతో ఇళ్లు కూల్చేయాలని ఆదేశించినట్టు ఉంది. దానికి స్పందన రాకపోవటంతో తాజాగా నోటీసులు జారీచేశామని అందులో పేర్కొన్నారు. మరో ఆరు రోజుల్లో బుల్డోజర్లతో వచ్చి ఇళ్లు కూల్చేశారు. తొలుత నోటీసులు వ్యక్తిగతంగా ఇవ్వటానికి చేసిన ప్రయత్నం విఫలం కావటంతో ఇళ్ల దగ్గర అతికించామన్న ప్రభుత్వ వాదనను న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ లతో కూడిన బెంచ్ విశ్వసించలేదు. పిటిషనర్లకు సహేతుకమైన వ్యవధినిచ్చిన దాఖలా కనబడటం లేదని, ఇది పౌరులకు రాజ్యాంగంలోని 21వ అధికరణ ద్వారా సమకూరిన ఆవాస హక్కును ఉల్లంఘించటమేనని తేల్చిచెప్పింది. ఈ తీర్పు అనేకవిధాల ఎన్నదగినది. పిటిషనర్లకు ఆ స్థలంపై చట్టబద్ధమైన హక్కుందా లేదా అన్న అంశంలోకి ధర్మాసనం పోలేదు. దానిపై వారు విడిగా న్యాయస్థానాల్లో తేల్చుకోవాల్సిందే! 2023 ఏప్రిల్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన రాజకీయ నాయకుడు, పలు కేసుల్లో నింది తుడైన అతీఖ్ అహ్మద్ అక్రమంగా ఆక్రమించుకున్న భూమిలో ఈ ఇళ్లున్నాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఎన్నడో 1906లో అప్పటి అలహాబాద్ జిల్లా కలెక్టర్ షకీర్ అహ్మద్ అనే వ్యక్తికి 30 ఏళ్లకు లీజుకిచ్చి మరో రెండు దఫాలు పొడిగించుకునే వీలు కల్పించారని రికార్డులు చెబు తున్నాయి. 1960లో జిల్లా మేజిస్ట్రేట్ అనుమతితో షకీర్ దాని హక్కుల్ని వేరేవారికి బదలాయించాడు. ఆ తర్వాత క్రమంలో అది మరికొందరి చేతులు మారింది. చివరకు ప్రస్తుత పిటిషనర్లు దాన్ని కొనుగోలు చేశారు. ప్రభుత్వం వాదిస్తున్నట్టు ఆ కొనుగోలు చెల్లకపోవచ్చు. అది ప్రజా ప్రయోజనం కోసం వినియోగించాల్సిన భూమే కావొచ్చు. అంతమాత్రాన నిబంధనలకు తిలోదకాలిచ్చి ఇళ్లు కూల్చటం సరైన చర్య కాదు. సుప్రీంకోర్టు తీర్పు దీన్ని తేటతెల్లం చేసింది.ఈ సందర్భంగా వేరేచోట బుల్డోజర్ కూల్చివేతలు సాగిస్తుండగా ఒకటో తరగతి బాలిక అనన్యా యాదవ్ తన స్కూల్ బ్యాగ్‌ను రక్షించుకోవటానికి మంటలంటుకున్న షెడ్ సమీపానికి వెళ్లిన వీడియోను న్యాయమూర్తులు ప్రస్తావించటం గమనార్హం. అలాంటి ఉదంతాలు అందరినీ దిగ్భ్రాంతిపరుస్తాయన్న వారి వ్యాఖ్యలతో ఏకీభవించని వారుండరు. గత నవంబర్‌లో జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సైతం ఇటువంటి వ్యాఖ్యలే చేసింది. ‘ఇళ్లు కూల్చినప్పుడల్లా నిశిరాత్రిలో నడిరోడ్లపై చిన్నారులూ, మహిళలూ విలపిస్తున్న దృశ్యాలు అరాచకానికి ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి’ అని ధర్మాసనం గుర్తు చేసింది. ఇలాంటి సంద ర్భాల్లో కూల్చివేతలకు పాల్పడిన అధికారుల నుంచి ఇళ్ల, దుకాణాల పునర్నిర్మాణానికి అయ్యే వ్యయం వసూలు చేయాలని కూడా చెప్పింది. ఇతర మార్గదర్శకాలు కూడా రూపొందించింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలైనా ప్రభుత్వాల కళ్లు తెరిపించాలి. కేవలం అయిదేళ్ల కోసం ఎన్నికై అధి కారంలోకొచ్చిన ప్రభుత్వాలు శాశ్వతంగా నిలిచే రాజ్యాంగ విలువలను కాలరాయటం, ఇష్టాను సారం ప్రవర్తించటం తప్పుడు సంకేతాలిస్తుంది. సాధారణ పౌరుల్ని కూడా చట్ట ఉల్లంఘనలకు ప్రోత్సహిస్తుంది. అందుకే ప్రభుత్వాలు ఎంత త్వరగా మేల్కొంటే అంత మంచిది. నాలుగేళ్లు ఆలస్యమైనా సర్వోన్నత న్యాయస్థానంలో బాధితులకు సరైన న్యాయం దక్కటం హర్షించదగ్గది. -
సీఎం రేవంత్ వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ, సాక్షి: ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీలు మారినా ఉప ఎన్నికలు రావు అని రేవంత్ చేసిన వ్యాఖ్యలను బుధవారం విచారణలో ప్రత్యేకంగా ప్రస్తావించిన జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలే చేసింది.పవిత్రమైన చట్టసభలో ఈ వ్యాఖ్యలు చేయడం... రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అపహాస్యం చేయడం కిందకే వస్తుంది. ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయకుండా సీఎంకు హితవు చెప్పండి. ఎట్టిపరిస్థితుల్లో ఈ తరహా వ్యాఖ్యలను ఉపేక్షించబోం. అవసరమైతే కోర్టు ధిక్కారంగా భావించాల్సి వస్తుంది’’ అని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని ఉద్దేశించి జస్టిస్ గవాయ్ అన్నారు.మేం అన్నీ ఆలోచించే కోర్టు ధిక్కార నోటీసులు ఇస్తున్నాం. అంతమాత్రాన మాకు అధికారాలు లేవని కాదు. అసెంబ్లీలో నాయకులు చేసే ప్రకటనలకు ఒక విలువ ఉంటుంది. అసెంబ్లీలో మాట్లాడే అంశాలను కోర్టులు కూడా తీసుకుంటాయి అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. గత బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం రేవంత్ ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని, పార్టీ మారిన ఎమ్మెల్యేలెవరూ ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ‘‘వచ్చే వారమే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్ఎస్ నేతలు ఊదరగొడుతున్నారు. కానీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ రావు. గత బీఆర్ఎస్ హయాంలో ఉన్న రాజ్యాంగమే ఇప్పుడు కూడా ఉంది. స్పీకర్ వ్యవస్థ, చట్టం అవే ఉన్నాయి. ఏవీ మారలేదు. అలాంటప్పుడు అప్పుడు పార్టీలు మారిన నేతల విషయంలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయని వ్యాఖ్యానించారు. -
స్పీకర్‌ను కోర్టుకు పిలిచామన్న సంగతి మరవొద్దు: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీంకోర్టు(Supreme Court)లో ఇవాళ విచారణ జరిగింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తరఫున ముకుల్ రోహత్గీ బుధవారం వాదనలు వినిపించారు. స్పీకర్‌కు కోర్టులు గడువు విధించడం సరికాదని ఆయన వాదించారు. ఈ క్రమంలో.. ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగేళ్లు స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా? అని జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘స్పీకర్‌కు రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలను కోర్టులు హరించలేవు. ఒకసారి ఆయన నిర్ణయం తీసుకున్నాకే జ్యుడీషియల్ సమీక్షకు అవకాశముంటుంది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ స్పీకర్‌కు గడువు విధించడం సరికాదు. సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేసిన డివిజన్ బెంచ్ తీర్పు సరైందే. స్పీకర్ కాలపరిమితితో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు చెప్పడం భావ్యం కాదు. ఒకవేళ సూచనలు చేస్తే స్వీకరించాలా? లేదా? అనేది స్పీకర్ నిర్ణయమే. ఒక రాజ్యాంగ వ్యవస్థపై మరో రాజ్యాంగ వ్యవస్థ పెత్తనం చేయలేదు’’ అని ముకుల్ రోహత్గీ వాదించారు.ముకుల్ రోహత్గీ వాదనల్లో జస్టిస్ బీఆర్ గవాయ్ జోక్యం చేసుకున్నారు. హైకోర్టు జోక్యం చేసుకోవద్దా?. రాజ్యాంగ పరిరక్షకులుగా న్యాయస్థానాలు వ్యవహరిస్తాయి. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంటే సుప్రీం కోర్టు కూడా చేతులు కట్టుకుని చూస్తుండాలా?. నాలుగేళ్లు స్పీకర్ చర్యలు తీసుకోకపోతే కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా?. గతంలో కోర్టు ధిక్కరణ కేసులో స్పీకర్‌ను కోర్టుకు పిలిచామన్న విషయం మరిచిపోవద్దు. సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు చెప్పలేమా? ఆయనకు విజ్ఞప్తి చేయడమో.. ఆదేశించడమో చేయలేమా? అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. అయితే అది ప్రత్యేక సందర్భమన్న రోహత్గి.. సుప్రీం కోర్టుకు న్యాయసమీక్ష చేసే అధికారం ఉందని, నిర్ణయాలపై న్యాయసమీక్ష చేయొచ్చని తెలియజేశారు.. ఫిరాయింపులపై పిటిషనర్ల ఇష్టానుసారం స్పీకర్ వ్యవహరించలేరని వాదించారు. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వారంలోనే పిటిషన్ వేశారన్నారు. ఒకదాని తర్వాత మరొక రిట్ పిటిషన్లు దాఖలు చేస్తూ వచ్చారని.. కనీసం ఆలోచించే అవకాశం కూడా లేకుండా పిటిషన్లు వేశారని కోర్టుకు తెలియజేశారు.2024 మార్చి 18న పిటిషనర్లు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. 2025 జనవరి 16న 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. స్పీకర్ తన విధులు నిర్వర్తిస్తున్నారు అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తరఫున ఇవాళ ముకుల్ రోహత్గీ వాదనలు ముగిశాయి. ఇక అసెంబ్లీ కార్యదర్శి తరపున రేపు(గురువారం) వాదనలు వినిపిస్తానన్న సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ బెంచ్ సమ్మతి తెలిపి విచారణ వాయిదా వేసింది. తెలంగాణలో కారు పార్టీ గుర్తు మీద గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని, ఉన్నత న్యాయస్థానం చెప్పినా వాళ్లపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని.. అనర్హత వేటు కోరుతూ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డి, ఇతరులు పిటిషన్లు వేశారు. అయితే మొదటి నుంచి ఈ కేసు విచారణలో తెలంగాణ స్పీకర్ తీరుపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేస్తూనే వస్తోంది. గత విచారణలో.. బీఆర్ఎస్ తరఫున ఆర్యమా సుందరం వాదనలు పూర్తి చేశారు. ఆ వాదనల సమయంలో.. సుప్రీం కోర్టు ఫిరాయింపులపై కీలక వ్యాఖ్యలే చేసింది. ఆయారాం, గయారాంలను నిరోధించేందుకే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ఉందని, అలాంటప్పుడు ఫిరాయింపులపై ఏ నిర్ణయం అనేది తీసుకోకపోతే ఆ షెడ్యూల్‌ను అపహాస్యం చేయడం కిందకే వస్తుందని వ్యాఖ్యానించింది. -
‘మీ తీరు అమానవీయం’.. సీఎం యోగి సర్కార్‌పై సుప్రీం కోర్టు
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి సర్కార్‌పై సుప్రీం కోర్టు (Supreme Court) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ తీరు రాజ్యాంగ విరుద్ధం. అమానవీయం. మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేస్తోందని వ్యాఖ్యానించింది. 2023లో యూపీకి చెందిన గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ హత్య గురయ్యాడు. హత్యకు గురైన అతిక్ చెందిన స్థిరాస్థుల్ని అధికారులు కూల్చివేశారు. వాస్తవానికి బుల్డోజర్తో కూల్చేసిన నిర్మాణాలతో అతిక్‌కు సంబంధం లేదు. ఆ ఇళ్లు లాయర్లు, ప్రొఫెసర్లతో పాటు ఇతర రంగాల్లో విధులు నిర్వహిస్తున్నవారివి. ఎప్పటిలాగే సంఘ విద్రోహ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపే సీఎం యోగి ప్రభుత్వం (Yogi Adityanath) పొరపాటున బాధితుల ఇళ్లను బుల్డోజర్లతో (Bulldozer justice) కూల్చేసింది. దీంతో బాధితులు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.రూ.10లక్షల నష్టపరిహారం ఆ పిటిషన్లపై మంగళవారం సుప్రీం కోర్టు జస్టిస్ ఎస్ ఓకా,జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా బూల్డోజర్ చర్యలపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి సర్కార్‌తో పాటు ప్రయాగ్‌రాజ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీ తీరు రాజ్యాంగ విరుద్ధం. అమానవీయం. మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేస్తోంది. తక్షణమే ఒక్కో బాధిత కుటుంబానికి రూ.10లక్షల నష్టపరిహారం అందించాలని సూచించింది.అది మా పొరపాటేఅంతకుముందు అడ్వకేట్, ప్రొఫెసర్ మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్ల గురించి అత్యున్నత న్యాయస్థానం యూపీ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. నిబంధనలకు విరుద్ధంగా బుల్డోజర్లతో ఇళ్లను ఎలా కూల్చేస్తారు? కూల్చేవేతకు ఓ రోజు ముందు నోటీసులు ఎలా అంటిస్తారని ప్రశ్నించింది. అయితే, సుప్రీం ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు యూపీ అధికారులు బదులిచ్చారు. మేం కూల్చేసిన ఇళ్లు గ్యాంగ్‌స్టర్ అతిక్ నిర్మించుకున్నాడేమోనని పొరపాటున బుల్డోజర్ చర్యలకు దిగినట్లు వివరణ ఇచ్చారు.రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా నోటీసులు ఎందుకు పంపలేదుకూల్చివేత నోటీసులు అందజేసిన తీరుపై అధికారులను కోర్టు మందలించింది. కూల్చేసిన ఇళ్లనకు నోటీసులు అతికించామని రాష్ట్ర న్యాయవాది చెప్పగా, రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా నోటీసులు ఎందుకు పంపలేదని అడిగింది. అదే సమయంలో ఈ తరహా చర్యల్ని వెంటనే ఆపాలి. బాధితులు ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. వారికి నష్టపరిహారం కింద రూ.10 లక్షల పరిహారం చెల్లించండి. పరిహారం ఇస్తే వారికి న్యాయం జరిగినట్లవుతుందని జస్టిస్ ఎస్.ఓకా అభిప్రాయం వ్యక్తం చేశారు.మా మనస్సాక్షిని షాక్‌కు గురిచేస్తున్నాయిఈ కేసులు మా మనస్సాక్షిని షాక్‌కు గురిచేస్తున్నాయి. పిటిషనర్ల ఇళ్లను నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేశారని కోర్టు అభిప్రాయ పడినట్లు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇళ్లు కూల్చేస్తున్నట్లు నోటీసులు గాని, నోటీసులు తీసుకున్న వారికి వివరణ ఇచ్చేందుకు తగిన అవకాశం ఇవ్వలేదని ప్రస్తావించింది. అందరూ కలత చెందుతున్నారుఅదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్లో బుల్డోజర్ కూల్చివేతల సమయంలో వైరలైన ఓ వీడియో గురించి కోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించింది. అధికారులు బుల్డోజర్లతో ఇళ్లను కూల్చే సమయంలో సదరు ఓ ఇంటికి చెందిన బాలిక తన పుస్తకాల్ని చేతపట్టుకుని ఉండడాన్ని చూడొచ్చు. ఇలాంటి దృశ్యాలతో అందరూ కలత చెందుతున్నారు’ అని జస్టిస్ భుయాన్ అన్నారు. -
దుష్టసంస్కృతిపై కొరడా!
‘భావప్రకటన స్వేచ్ఛను అణచివేయడం ఒకటి కాదు... రెండు తప్పులతో సమానం. ఎందుకంటే అది చెప్పేవారి హక్కుతోపాటు వినేవారి హక్కునూ ఉల్లంఘిస్తుంది’ అంటాడు అమెరికా సంఘ సంస్కర్త, పౌరహక్కుల నేత ఫ్రెడరిక్ డగ్లస్. ఈ రెండింతల తప్పు చేయటం మన ప్రభుత్వాలు దిన చర్యగా మార్చుకున్నాయి. ఈ నేపథ్యంలో పౌరుల భావప్రకటన స్వేచ్ఛ అత్యంత కీలక మైనదని, వ్యక్తులు లేదా వ్యక్తుల సమూహం తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయటం నాగరిక సమాజంలో అంతర్భాగమని సుప్రీంకోర్టు ధర్మాసనం మొన్న శుక్రవారం తేల్చిచెప్పింది. ‘ఆ అభిప్రాయాలతో లేదా ఆలోచనలతో విభేదించవచ్చు. ఆ అభిప్రాయాలకు భిన్నంగా మరో అభిప్రాయాన్ని ప్రకటించటం ద్వారా దాన్ని ఎదుర్కొనాలి తప్ప అణిచేస్తామనటం రాజ్యాంగాన్ని ఉల్లంఘించటమే అవుతుంది’ అని తెలియజేసింది. ఇన్‌స్టాలో, ఎక్స్‌లో గుజరాత్ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ పెట్టిన కవిత వల్ల సమాజంలో విద్వేషాలు రగులుతాయని ఆరోపిస్తూ అక్కడి పోలీసులు కేసుపెట్టారు. దీన్ని తప్పుబడుతూ, కేసును కొట్టివేస్తూ ఇచ్చిన ఈ తీర్పు అనేక విధాల ఎన్నదగినది. రాజ్యాంగ విలువల పట్లా, పౌరుల హక్కులపట్లా వీసవెత్తు గౌరవం లేని అనైతిక పాలకులు ఇష్టా రాజ్యంగా రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెట్టడం ఈమధ్య బాగా ముదిరింది. పాలకులు చెప్పిందే తడవుగా తప్పుడు కేసులు పెట్టే పోలీసులు కొందరైతే... వారి మెప్పు కోసం అనవసర ఉత్సాహాన్ని ప్రదర్శించే బాపతు మరికొందరు. ఆంధ్రప్రదేశ్ మొదలుకొని ఎక్కడ చూసినా ఇలాంటివారి హవా నడుస్తోంది. రాజ్యాంగాన్ని బేఖాతరు చేయటమంటే... దాని ప్రసక్తి లేకుండా పాలించాలనుకోవటమంటే హక్కులు లేని అధికారాన్ని చలాయించాలని చూడటమే. గుజరాత్ పోలీసులకు అభ్యంతరకరంగా అనిపించిన కవిత చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.అందులో ఒక మతాన్ని, వ్యవస్థనూ లేదా వ్యక్తిని కించపరిచింది లేదు. దేశద్రోహం పోకడలు రవ్వంతయినా లేవు. ‘ఓ రక్త పిపాసులారా వినండి...’ అంటూ మొదలయ్యే ఆ కవితలో అలాంటివారికి ప్రేమను పంచుతామన్న సందేశమే ఉంటుంది. అన్యాయానికి ఒడిగట్టినా దాన్ని న్యాయంతోనే ఎదుర్కొంటామంటుంది. ఇందులో పోలీసులకు ఏది అభ్యంతరమనిపించిందో గానీ... వెనకా ముందూ చూడకుండా కేసు పెట్టారు. విచారణ సందర్భంలో గుజరాత్ ప్రభుత్వం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ‘ఒక్కొక్కరు దీన్ని ఒక్కోవిధంగా విశ్లేషించుకుంటారు’ అని పోలీసులను సమర్థిస్తుండగా సృజనాత్మకతను గౌరవించే సంస్కృతి లేకపోవటాన్ని ధర్మాసనం ఎత్తిచూపింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సైతం దాదాపు ఇదే స్వరంతో పోలీసులను తప్పు బట్టింది. రహదారుల బాగుకు నిధుల కోసం ఊరూరా టోల్గేట్లు పెడతామని ముఖ్యమంత్రి చంద్ర బాబు చేసిన ప్రకటనపై వ్యంగ్యంగా, ప్రతీకాత్మకంగా రూపకం తయారుచేయడాన్ని నేరంగా పరిగ ణిస్తూ కేసు పెట్టడాన్ని నిలదీసింది. అవసరాన్నిబట్టి కేసులు పెట్టడం కాక, ఏదో ఒక కేసు పెట్టాలి, ఎవరో ఒకర్ని అరెస్టు చేయాలని చూడటం సరికాదని హెచ్చరించింది. ఇదొక్కటే కాదు... ఇలాంటి కేసులు కూటమి ప్రభుత్వం లెక్కకు మిక్కిలి బనాయిస్తోంది. ఈమధ్యకాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులనూ, కార్యకర్తలనూ అరెస్టు చేయని రోజంటూ లేదు. ఎప్పుడో మూడు నాలుగేళ్లక్రితం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఏదో పోస్టు కారణంగా ఇప్పుడు మనోవ్యాధి పట్టుకుందని కూటమి లోని మూడు పార్టీల నాయకులూ పోలీస్స్టేషన్లకు పోతున్నారు. అధికారంలో ఊరేగుతున్నవాళ్లు ఫిర్యాదు చేసినంతమాత్రాన కేసులు పెట్టడం సబబా అన్న విచక్షణ కూడా పోలీసులకు ఉండటం లేదు. అధికారపక్షం కేసులు పెట్టడంలోని ఉద్దేశం, దాన్నుంచి ఆశిస్తున్న ప్రయోజనం వారికి తెలియందేమీ కాదు. అయినా ఈ నాటకం యథావిధిగా సాగిపోతోంది. అసమ్మతి గొంతు నొక్కడానికి నిరంతరం ప్రయత్నిస్తూనేవున్నారు. ‘ఒక చిన్న కవిత వల్లనో, ఒక స్టాండప్ కామెడీ వల్లనో సమాజంలో భిన్న వర్గాల మధ్య విద్వేషాలు రగులుతాయని ఎలా అనుకుంటున్నారు...మన రాజ్యాంగ మౌలిక సిద్ధాంతాలు అంత బలహీనమైనవనుకుంటున్నారా?’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం గుజరాత్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. ఇదే మాదిరి సంస్కృతిని అమలు చేస్తున్న అన్ని ప్రభుత్వాలకూ ఈ ప్రశ్న చెంపపెట్టు. నిరంతరం అభద్రతాభావంతో బతు కీడ్చే వ్యక్తులనూ లేదా విమర్శ వల్ల తమ అధికారానికీ, పదవికీ ముప్పుకలుగుతుందనుకునే వారినీ ప్రమాణంగా తీసుకుని దేనిపైనా నిర్ణయానికి రావొద్దని ధర్మాసనం పోలీసులకు హితవు చెప్పింది. కింది స్థాయి కోర్టులు సక్రమంగా వ్యవహరించలేదని గమనించినప్పుడు దాన్ని సరిదిద్దాల్సిన హైకోర్టులు సైతం అదే బాటలో పోతుండటాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. రాజ్యాంగ ఆదర్శాలను ప్రభుత్వాలు అణిచివేయకుండా చూడటం రాజ్యాంగ న్యాయస్థానాలుగా హైకోర్టులతోపాటు సుప్రీంకోర్టు కర్తవ్యం. కానీ ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ కేసులో గుజరాత్ హైకోర్టు ఆ విషయంలో పూర్తిగా విఫలమైందన్నది సుప్రీం అభిప్రాయం. ఈమాదిరి కేసుల విషయంలో పోలీసులు ఎలా వ్యవహరించాలో ఈ సందర్భంగా ధర్మాసనం సూచించింది. ఫిర్యాదు అందిందే తడవుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయటం కాక, ముందు పోలీసు అధికారి ప్రాథమిక విచారణ జరపాలని ఆదేశించింది. సరైందను కుంటేనే కేసు నమోదు చేయాలని, లేనిపక్షంలో ఫిర్యాదీదారుకు ఆ సంగతి చెప్పాలని తెలిపింది. సుప్రీంకోర్టు తాజా తీర్పయినా అకారణంగా, అన్యాయంగా కేసులు బనాయించే పాలకుల దుష్ట సంస్కృతికి కళ్లెం వేయగలిగితే ప్రజాస్వామ్యం సురక్షితంగా మనుగడ సాగించగలుగుతుంది. -
వైఫల్యాల వెనుక వ్యవస్థ లోపాలు!
జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో పెద్ద మొత్తంలో అక్రమ నగదు కనిపించినట్లు గత వారం ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ బయట పెట్టింది. అంతకు మునుపు, జస్టిస్ శేఖర్ యాదవ్ న్యాయవ్యవస్థ గౌరవప్రతిష్ఠలకు భంగం కలిగిస్తూ మాట్లాడారు. భారతదేశం మెజారిటీ ప్రజల ఆకాంక్షల మేరకు పని చేస్తోందని జస్టిస్ శేఖర్ యాదవ్ గత డిసెంబరులో ఒక ప్రైవేటు కార్యక్రమంలో అనడం వివాదాస్పదమయింది. అప్పుడు ఆయనపై సరైన చర్యలు తీసుకోలేదు. ఇప్పుడీ రెండో కేసులో అంతటా నిరసన పెల్లుబుకటంతో ఆలస్యంగా చర్యలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న ఉత్పన్నమవుతోంది. న్యాయవ్యవస్థ స్పందనలు అర్థవంతంగా, బాధ్యతాయుతంగా ఉంటున్నాయా? లేవని సమా ధానం చెప్పుకునేటట్లయితే, జ్యుడీషియరీ జవాబుదారీతనం కోసం పనిచేయాల్సిన అంతర్గత విచారణ యంత్రాంగం ఏం చేస్తున్నట్లు? ఇక న్యాయమూర్తుల ఎంపిక విధానం ఈ పరిస్థితికి దారి తీసిన రెండో సమస్య. హైకోర్టు స్థాయిలో జరిగే నియామకాల తీరు మరీ ఆందోళన కలిగిస్తోంది.న్యాయవ్యవస్థ జవాబుదారీతనాన్ని కాపాడవలసిన అంతర్గత యంత్రాంగం (ఇన్–హౌస్ మెకానిజం) గుణదోషాల్ని జస్టిస్ అజిత్ ప్రకాష్ షా ‘రోసలిండ్ విల్సన్ స్మారక ఉపన్యాసం’లో తీవ్రాతి తీవ్రంగా విమర్శించారు. ఇది 2019 నాటిదైనా నేటి సందర్భానికి అతికినట్లు సరిపోతుంది. మొట్టమొదటగా అంతర్గత వ్యవస్థ స్వభావం మీద ఆయన అస్త్రం ఎక్కుపెట్టారు. అది అనుసరించే పద్ధతులు ఎప్పటికప్పుడు తాత్కాలికంగా, ఇష్టాగోష్ఠిలా ఉంటాయి. ‘‘ఈ ప్రొసీజర్‌కు ఎలాంటి చట్టబద్ధ ప్రాతిపదిక లేదు’’. ‘‘ న్యాయ వ్యవస్థ లోపల దానికి ఉన్న మన్నన పరిమితం’’. ‘‘ఇందుకు నిదర్శనం – కమిటీ నివేదిక వ్యతి రేకంగా వచ్చిందని చెప్పి రాజీనామాకు సిద్ధపడిన న్యాయమూర్తి ఒక్క రంటే ఒక్కరూ లేకపోవటం...’’ అని ఆయన అంటారు. ‘‘న్యాయవ్యవస్థ దానికదే ఒక చట్టం, ఒక ప్రపంచం’’ అన్నట్లు అంతర్గత యంత్రాంగం పరిగణిస్తుందని జస్టిస్ షా మరీ ముఖ్యంగా ప్రస్తావించారు. వారిని వారే నియమించుకుంటారు. తమ ప్రవర్త నను నియంత్రించే విధివిధానాలను వారే అంతర్గతంగా రూపొందించుకుంటారు. ఇది ‘‘ఒక తరహా స్వీయపాలన’’ అంటూ, ‘‘ఏలాగైతే ఉండాలో కచ్చితంగా అందుకు భిన్నంగా ఉంది..’’ అని విమర్శించారు. అంతర్గత యంత్రాంగం వాస్తవ పనితీరు ఎలా ఉంటుందో తెలిపేందుకు పలు విమర్శలు ఉన్నాయి. న్యాయమూర్తుల నడత గురించి బహిరంగంగా చెప్పుకున్న సందర్భాలు చాలానే ఉన్నా, వారిపై ఇన్–హౌస్ విచారణలు ఏనాడూ జరగలేదు. అలాగే, జడ్జీల మీద నిర్దిష్ట ఆరోపణలు చేసిన కేసుల్లోనూ అంతర్గత విచారణకు ఆదేశాలు లేవు. న్యాయవ్యవస్థ జవాబుదారీతనం కోసం తటస్థమైన, అధికా రికమైన, చట్టబద్ధ యంత్రాంగం ఒకటి ఎందుకు ఉండాలో జస్టిస్ షా తీవ్ర పదజాలంతో వివరించారు. ‘‘న్యాయపీఠం మీద కూర్చున్న క్షణం నుంచీ వారి ప్రవర్తన ఎలా ఉండాలో నిర్దేశించే నైతిక వర్తన నియమావళి న్యాయమూర్తులకు మనసుల్లో పాతుకుపోయి ఉండాలి. కాని అలా ఉండదు. కచ్చితంగా చెప్పాలంటే, వారు తమ ముందుండే లాయర్లు, వాదులు, ప్రతివాదులు, నేరస్థులు, సాక్షులు, పోలీసుల మాదిరిగానే ఫక్తు సాధారణ మానవులు. వారు నిర్వహించే పదవుల స్వభావాన్ని బట్టి వారికి నైతికతను ఆపాదిస్తే అది మోసం, ప్రమాదకరం...’’ అన్నారు.న్యాయమూర్తుల నడత, ప్రవర్తన గురించి మాట్లాడుకుంటు న్నాం కాబట్టి, వారి ఎంపిక విధానం గురించిన ప్రశ్న తలెత్తక మానదు. కొలీజియం వ్యవస్థ పరిపూర్ణంగా పనిచేయడం లేదన డంలో సందేహం లేదు. మనకు వేరొక విధానం కావాలి. దాని గురించి మాట్లాడుకునే ముందు, ప్రస్తుత కొలీజియం వ్యవస్థ ఎక్కడ విఫలమైందో చూద్దాం.జస్టిస్ షాతో నేను ఈ విషయం మాట్లాడినప్పుడు, ఆయన పలు అంశాలు చెప్పారు. మొదటిది – జడ్జీలను ఎంపిక చేయడానికి ఇవీ అంటూ చెప్పగలిగిన ఆమోదిత ప్రమాణాలేవీ లేవు. అంతా ‘‘అడ్ హాక్’’గా ఉన్నట్లు ఉంటుంది. నోటిమాట చెల్లుబాటు అవుతుంది. తరచూ ఇష్టులకే పెద్దపీట వేస్తారు.ఎంపికల్లో అత్యుత్తములను నిర్లక్ష్యం చేయడం కూడా పరిపాటి. ఇది మరీ ఆందోళనకరం. కొట్టొచ్చినట్లు కనబడే రెండు ఉదాహ రణలు జస్టిస్ షా చెప్పారు. జస్టిస్ అకిల్ ఖురేషీ, జస్టిస్ మురళీధర్‌లు సుప్రీం కోర్టులో స్థానం పొందలేకపోయారని, సుప్రీంలో ప్రవేశించ డానికి వారు పూర్తిగా అర్హులని ఆయన విశ్వసిస్తారు. ఎంపిక ప్రక్రియ నుంచి ప్రభుత్వాన్ని దూరం పెట్టడానికి కొలీజియం వ్యవస్థ రూపొందింది. అయినప్పటికీ ప్రభుత్వం తాను చేయగలిగినంతా చేయగలదు. పార్లమెంటులో మంచి మెజారిటీ ఉన్న ప్రభుత్వం కొలీజియం సిఫారసులను తొక్కిపట్టగలదు. అంటే ఏదైతే జరగకూడదన్న భావనతో కొలీజియం ఏర్పడిందో దొడ్డిదారిన అదే జరుగుతోంది. ఏమైనప్పటికీ, హైకోర్టు జడ్జీల నియామక స్థాయిలో కొలీజియం వ్యవస్థ అత్యంత బలహీనమైనదని భావించాలి. ఇది ఆందోళనకర పరిస్థితి. ఎందుకంటే, సుప్రీంకోర్టులో బహుశా 95 శాతం మంది న్యాయమూర్తులు హైకోర్టు జ్యుడీషియరీ నుంచే ఎంపిక అవుతారు. హైకోర్టు జడ్జీల నియామకాలు లోపభూయిష్ఠంగా ఉన్నప్పుడు ఆ ప్రభావం సుప్రీం కోర్టు మీదా పడుతుంది. చివరగా, మనం చర్చించిన రెండు సమస్యలూ... అంతర్గత యంత్రాంగం, నియామక విధానం... ఏమాత్రం అలక్ష్యం చేయదగి నవి కావు. ఈ అలక్ష్యం మన న్యాయవ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుంది. వాస్తవానికి వీటికి దేనికదిగా కాకుండా, రెంటికీ కలిపి పరిష్కారం ఆలోచించాలి. పాలక, న్యాయ వ్యవస్థల పరస్పర సహకారంతోనే ఇది సాధ్యమవుతుంది. మరి ఇందుకు అవి సిద్ధంగా ఉన్నాయా?కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
పిల్లలు ఆరుబయట ఆడాలంటే మాస్క్ ధరించాల్సిరావడం దారుణం
న్యూఢిల్లీ: బహిరంగ ప్రదేశాల్లో చిన్నారులు ఆడుకోవాలంటే మాస్క్ ధరించాల్సిన దుస్థితి దాపురించొద్దని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్‌నాథ్ ఆవేదన వ్యక్తంచేశారు. కాలుష్య ఉద్గారాల ఉధృతికి అడ్డుకట్టవేయాలని, కాలుష్యం కట్టడి కోసం తగు ‘స్వచ్ఛ’సాంకేతికతలపై పెట్టుబడులు పెరగాలని ఆయన అభిలíÙంచారు. శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మొదలైన వాతావరణ జాతీయ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘‘దేశ రాజధాని గత కొంతకాలంగా కాలుష్య రాజధానిలా తయారైంది. కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. పిల్లలు ఆరుబయట ఆడుకోవాలంటే మాస్క్ ధరించాల్సిన దారుణ పరిస్థితులు రావడం శోచనీయం. ఇంత తక్కువ వయసులో కాలుష్యమయ గాలి పీల్చడం వల్ల ఎన్నో శ్వాససంబంధ వ్యాధులు చుట్టుముడతాయి. కాలుష్య ఉద్గారాల వెల్లువకు అడ్డుకట్టపడాల్సిందే. ఇందుకోసం మనందరం సమైక్యంగా నిలబడి తక్షణ కార్యాచరణతో రంగంలోకి దిగాలి. ఆర్థికాభివృద్ధికి, పర్యావరణహిత విధానానికి సమతూకం సాధించాలి. శుద్ధ సాంకేతికతల అభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు విధాన నిర్ణయాలు తీసుకోవాలి. పర్యావరణానికి హాని కల్గించని టెక్నాలజీలపై దృష్టిసారించాలి. తక్కువ ఉద్గారాలను వెదజల్లే రవాణా విధానాలను అవలంభించాలి. అలాంటప్పుడు మనం పీల్చే గాలి గరళంగా మారకుండా ఉంటుంది. నీటి కాలుష్యం సైతం మరో తీవ్ర సమస్యగా తయారైంది. శుద్ధికి నోచుకోని వ్యర్థాలు నేరుగా నదీజలాల్లో కలిసిపోతున్నాయి. పారిశ్రామిక వ్యర్థాలు నదీజలాల్లో కలవకుండా అడ్డుకోవాలి. మురుగునీటిని శుద్ధిచేశాకే నదీజలాల్లోకి వదలాలి. నదీతీరాల్లోని స్థానిక ప్రజానీకం సైతం వ్యర్థాలను నేరుగా నదుల్లో పడేయకుండా తమ వంతు బాధ్యతగా మెలగాలి’’అని జడ్జి అన్నారు. కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఛైర్పర్సన్, అటార్నీ జనరల్, తదితరులు ఈ సదస్సుకు హాజరయ్యారు. -
ఎర్రబుక్కు తెల్లమొహం!
ఎర్ర పుస్తకం తెల్లమొహం వేసినట్లయింది. రాజ్యాంగ విధి విధానాలను కూడా ప్రైవేటీకరించబోయిన తెంపరితనానికి చెంపలు వాయించినట్లయింది. ఇష్టారీతిన పోలీసు రాజ్యాన్ని నడుపుతామంటే, పౌరహక్కుల్ని చిదిమేస్తామంటే అంగీకరించేది లేదని ఇప్పటికే పలుమార్లు ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయ స్థానం ప్రభుత్వ యంత్రాంగాన్ని హెచ్చరించింది. ఇప్పుడదే హెచ్చరికను జనతా న్యాయస్థానం కూడా జారీ చేసినట్లయింది. రాష్ట్రంలో 56 మండల పరిషత్తు అధ్యక్ష ఉపాధ్యక్ష స్థానాలకు, కడప జిల్లా పరిషత్తు అధ్యక్ష స్థానానికి మొన్న ఉపఎన్నికలు జరిగాయి. ఓట్లు వేసింది ఎంపీటీసీలు, జడ్పీటీసీలే. వీరు క్షేత్రస్థాయి ప్రజా ప్రతినిధులు. జనం గుండె చప్పుళ్లను నిరంతరం వినగలిగేవాళ్లు. ప్రజల నాడీ స్పందనను ముందుగా పసిగట్టగలిగేవాళ్లు.ఉపఎన్నికల్లో అధికార కూటమి పన్నిన వ్యూహం ఫలించ లేదు. విపక్షమైన వైసీపీ ఘనవిజయాన్ని నమోదు చేసింది. కడప జడ్పీతో సహా 40 స్థానాలను ఆ పార్టీ అవలీలగా గెలవగలిగింది. కూటమికి 10 స్థానాలు దక్కాయి. మిగిలినచోట్ల ఎన్నిక వాయిదా పడింది. వైసీపీ టిక్కెట్‌పై గెలుపొందిన స్థానిక ప్రతినిధులు ఆ పార్టీ పక్షాన్నే నిలవడంలో వింతేముందని ఇప్పుడు కూటమి చిలుకలు పలుకుతుండవచ్చు. కానీ ఏపీలో ఈ తొమ్మిది నెలల పూర్వరంగం అర్థమైన వారికి వైసీపీ గెలుపులో వింతే కాదు, అద్భుతం కూడా కనిపిస్తుంది.ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో బలంగా వేళ్లూనుకున్న పార్టీ వైసీపీ. ఆ సంగతి కూటమి నేతలకు స్పష్టంగా తెలుసు. అందుకే కూటమి కట్టుకున్నారు. కుయుక్తులను ఆశ్రయించారు. ఎన్నికల్లో ఈ కూటమి చేసిన దుష్ప్రచారం, వెదజల్లిన విషం, పలికిన అసత్యాలు, చేసిన బూటకపు బాసలు అనే నిచ్చెనమెట్ల మీదుగా చేరుకున్న అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రతిపక్ష పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయాలనే సంకల్పానికి అధికార కూటమి వచ్చినట్టు దాని చర్యలు నిరూపిస్తున్నాయి. ఇటువంటి ప్రయ త్నాలు సత్ఫలితాలనివ్వవని గతంలో అనేక గుణపాఠాలు న్నాయి. అయినా అధికార మత్తులో ఉన్నప్పుడు అవి స్ఫురించక పోవచ్చు. ‘తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు.... ... కానీ మూర్ఖుని మనసును సమాధానపరచడం మాత్రం సాధ్యంకాద’ని భర్తృహరి చెప్పిన సుభాషితం మనకు ఉండనే ఉన్నది.ప్రభుత్వ వైఖరిని విమర్శించిన వారి మీద, ఎన్నికల హామీలను అమలు చేయలేదేమని అడిగిన వారి మీద వందలాది కేసులు నమోదయ్యాయి. టెర్రరిస్టుల మీద పెట్టాల్సిన కేసులను సోషల్ మీడియా విమర్శకుల మీద ఎందుకు పెడు తున్నారని హైకోర్టు ప్రశ్నిస్తున్నా పోలీసు యంత్రాంగం ఖాతరు చేయడం లేదు. రక్షక భటులే అర్ధరాత్రి పూట సివిల్ డ్రెస్సుల్లో ఇళ్లలోకి చొరబడి విమర్శకులను బరబరా లాక్కొని వెళ్తున్నారని, రాష్ట్రమంతటా తిప్పుతున్నారనీ, కుటుంబ సభ్యులకు సమా చారం కూడా ఇవ్వడం లేదనే ఆరోపణలు తరచుగా వినిపి స్తున్నాయి. పోసాని కృష్ణమురళి పదేళ్ల కింద ప్రెస్మీట్లో చేసిన విమర్శలపై టెర్రరిస్టు కేసు పెట్టి జైల్లోకి నెట్టారు. నడివీధుల్లో విపక్ష కార్యకర్తలను విచ్చుకత్తులతో నరుకుతున్న దృశ్యాల వీడియోలను చూడవలసి వచ్చింది. ప్రైవేట్ ఆస్తుల మీద దాడులు జరిగాయి. పార్టీ ఆఫీసులను కూల్చేశారు. పంట చేల విధ్వంసం జరిగింది. పండిన తోటలను నరికేశారు. మీడియా మీద అప్రకటిత సెన్సార్షిప్ అమలైంది. తమకు గిట్టని వార్తా చానెళ్ల ప్రసారాలను నిలిపివేసేలా కేబుల్ ఆపరేటర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చారు.ఈ నేపథ్యంలో వచ్చిన స్థానిక ఉపఎన్నికల సందర్భంగా కూటమి నాయకత్వం మరింత రెచ్చిపోయింది. స్థానిక ప్రతి నిధులను లొంగదీసుకోవడానికి సామ దాన భేద దండో పాయాలను ప్రయోగించారు. ప్రలోభాల ఎరలు వేశారు. కేసులు పెడతామని బెదిరించారు. ఉపాధిని దెబ్బతీస్తామని హెచ్చరించారు. పోలీసు యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకొని స్వయంగా ప్రభుత్వమే అధికార జులుమ్కు దిగినప్పుడు స్థానిక ప్రతినిధులను లొంగదీసుకోవడం పెద్ద విశేషమేమీ కాదు. పైగా రాజ్యసభల్లో, శాసన మండళ్లలో అధికార హోదాలు వెలగబెట్టిన బడాబడా ఆసాములే సర్కార్ కొరడా ముందు సాగిలపడి పోయిన ఉదంతాలు కళ్లముందటే కనిపిస్తున్నాయి. స్థానిక పదవులను గెలుచుకోవడానికి అధికార పార్టీ బరి తెగించిందనీ, పలుచోట్ల ప్రతినిధులను అడ్డుకున్నారనీ, ప్రలోభపెట్టారనీ ‘సాక్షి’ మీడియానే కాదు, ‘ప్రజాశక్తి’ పత్రిక కూడా రాసింది. ఇలా అధికార యంత్రాంగం బరితెగించి ప్రవర్తించినప్పుడు స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ స్వీప్ చేయడం కష్టం కాదనే అభిప్రాయం చాలామందికి ఉంటుంది. కానీ, వైసీపీ స్థానిక ప్రతినిధులు అరుదైన ప్రజాస్వామిక చైతన్యాన్ని ప్రదర్శించారు. పరిశీలకులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. నిర్బంధాలను ధిక్క రించి తమను నమ్మి గెలిపించిన పార్టీ పక్షానే దృఢంగా నిలబడ్డారు. తమ పదవులేమీ ప్రభావం చూపగలిగేంత పెద్దవి కాదు. అయినా సరే విశ్వసనీయతకే వారు పట్టం కట్టారు. గోడ దూకిన బడా ఆసాములు ఈ పరిణామం తర్వాత ఎలా తలెత్తుకుంటారో చూడాలి. ‘స్టేట్ టెర్రరిజమ్’ అనదగ్గ స్థాయిలో నిర్బంధకాండను ప్రయోగించినా ఈ క్షేత్రస్థాయి ప్రతినిధులు దృఢంగా నిలవడానికి రెండు ముఖ్యమైన కారణాలు కనిపి స్తున్నాయి. మొదటిది – రెండు నెలల క్రితం పార్టీ కార్య కర్తలనుద్దేశించి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి చేసిన ప్రసంగం. కార్యకర్తలెవరూ అధైర్యపడవలసిన అవసరం లేదనీ, వారికి తాను అండగా నిలబడతాననీ ప్రకటించారు. జగనన్న 2.0 కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తాడో చేసి చూపెడతానని భరోసా ఇచ్చారు.జగన్ ప్రకటన తర్వాత గ్రామస్థాయి నుంచి పార్టీ కార్యకర్తలకు మంచి ప్రేరణ లభించిందనీ, వారు ధైర్యంగా నిలబడుతున్నారనీ వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక రెండో ప్రధాన కారణం – క్షేత్రస్థాయి వాస్తవికత. ఎన్నికలకు ముందు చంద్రబాబు కూటమి చేసిన బూటకపు హామీల బండారం ప్రజ లందరికీ అర్థమైంది. వైసీపీ సర్కార్ మీదా, జగన్మోహన్రెడ్డిపై వ్యక్తిగతంగా కూటమి చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలేనని ప్రజాశ్రేణులు ఇప్పుడు భావిస్తున్నాయి. మోసపోయామన్న భావన వారిని వెంటాడుతున్నది. ప్రభుత్వంపై వ్యతిరేకత క్రమంగా పెరుగుతున్నది. వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి భయపడటం లేదు. బహిరంగంగానే కూటమి సర్కార్‌ను విమర్శిస్తున్నారు. ఈ పరిణామం కూడా వైసీపీ కార్యకర్తలు ఎదురొడ్డి నిలబడేందుకు దోహదపడింది.జనంలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నా కూటమి సర్కార్ తన ధోరణిని మార్చుకోకపోగా అదే అసత్య ప్రచారాన్ని మరింత ఎక్కువగా ఆశ్రయిస్తున్నది. తేలిపోయిన ఆరోపణల్నే మళ్లీ మళ్లీ ఎక్కుపెడుతున్నారు. చంద్రబాబు చెబుతున్న అప్పుల లెక్కల్ని గుర్తు చేసుకుంటూ జనం నవ్వుకుంటున్నారు. సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. శనివారం నాడు జరిగిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా అలవాటు ప్రకారం అప్పుల కథను మరోసారి వినిపించారు. ఎన్నికల ప్రచారంలో 14 లక్షల కోట్లున్న అప్పు, గవర్నర్ ప్రసంగంలో 10 లక్షల కోట్లుగా మారి, బడ్జెట్ ప్రసంగంలో ఏడు లక్షల కోట్లుగా రూపాంతరం చెంది, ఆవిర్భావ సభలో తొమ్మిదిన్నర లక్షల కోట్లుగా పరిణామం చెందింది.అప్పుల కథతోపాటు అసలు విషయాన్ని కూడా ఆయన కుండబద్దలు కొట్టి చెప్పారు. ‘‘బయట నుండి (ప్రభుత్వంలోకి రాకముందు) చూసినప్పుడు ‘సూపర్ సిక్స్’ హామీలను అమలు చేయవచ్చని అనుకున్నా, ఇప్పుడు చూస్తే తొమ్మిదిన్నర లక్షల కోట్ల అప్పుంది. దీనిపై వడ్డీ కట్టాలి. ఇప్పుడు సంక్షేమాన్ని అమలుచేస్తే మధ్యలోనే ఆగిపోతుంది. కనుక ముందుగా అభివృద్ధి చేసి, వచ్చే ఆదాయంతో సంక్షేమం చేద్దా’’మని ఈ సభలో చెప్పుకొచ్చారు.ఈ తూచ్ మంత్రాన్ని ఆయన ఆవిర్భావ సభలో మాత్రమే చెప్పలేదు. ఈ వార్షిక బడ్జెట్లో కూడా ఆయన దీన్ని పొందు పరిచారు. కాకపోతే అంకెల్లో చెప్పడం వల్ల సరిగ్గా అర్థం కాలేదు. ‘సూపర్ సిక్స్’గా పేర్కొన్న ఆరు అంశాలను ఆయన చెప్పి నట్టుగా అమలు చేస్తే 70 వేల కోట్ల పైచిలుకు నిధులు అవసరమవుతాయని అంచనా. అయితే బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం 17 వేల కోట్లు మాత్రమే చూపెట్టారు. కేటాయింపు చూపినంత మాత్రాన అమలు చేస్తారని అర్థం కాదు. గత బడ్జెట్లో కూడా ‘తల్లికి వందనం’, ‘అన్నదాతా సుఖీభవ’ పథకాలకు అరకొర కేటాయింపులు చూపెట్టారు. కానీ,అందులో అణా పైసలు కూడా ఖర్చుపెట్టలేదన్నది జనం అనుభవంలోకి వచ్చిన సత్యం.మొన్నటి మంగళవారం జోలెతో పాడుకున్న వేలంతో కలిపి తొమ్మిదిన్నర మాసాల్లో బాబు సర్కార్ ఒక లక్షా 52 వేల కోట్ల పైచిలుకు అప్పులు చేసి జాతీయ రికార్డును నెలకొల్పింది. ప్రభుత్వం నేరుగా చేసిన అప్పు 98,088 కోట్లయితే, ష్యూరిటీ సంతకం పెట్టి కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పు 23,700 కోట్లు, ఇక రాజధాని పేరుతో ఇప్పటివరకు చేసిన అప్పు 31,000 కోట్లు. వెరసి 1,52,788 కోట్లు. ఇంతటి జగదేక అప్పారావు ప్రభుత్వం జగన్ సర్కార్‌ను అప్పులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రచారం చేయబూనడాన్ని దాష్టీకం అనాలో, దగుల్బాజీతనం అనాలో తెలుసుకోవాలి. ఈ అప్పుల చిట్టా వ్యవహారం ఇక ఎంతమాత్రమూ దాచేస్తే దాగేది కాదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఇస్తున్న సమాచారాన్ని బట్టి, కాగ్ రిపోర్టుల ఆధారంగా, బడ్జెట్ పత్రాల సాక్షిగా జనంలోకి వాస్తవాలు వస్తున్నాయి. రాష్ట్రాన్ని జగన్ ప్రభుత్వం అప్పుల కుప్ప చేసిందన్న ప్రచారాన్ని ఇప్పుడెవ్వరూ నమ్మడం లేదు.జగన్ ప్రభుత్వ హయాంలో విధ్వంసం జరిగిందనే మాట చంద్రబాబుకు ఊతపదంగా మారింది. చివరికి కలెక్టర్ల సమా వేశంలో కూడా ‘గత ప్రభుత్వం విధ్వంసం చేసింద’ని మాట్లా డారు. ఇలా కలెక్టర్ల సమావేశాన్ని రాజకీయాలకు వాడుకున్న ముఖ్యమంత్రి ఈయన తప్ప మరొకరు ఉండకపోవచ్చు. తాను చెప్పిందే వేదం, తన పచ్చ కోడి కూస్తేనే సమాచారం తెలిసేది అనే భ్రమల్లోంచి ఆయనింకా బయటపడలేదు. పదేపదే అబద్ధాన్ని వల్లెవేస్తే అది నిజమైపోతుందనే పాతకాలపు గోబెల్స్ థియరీని పట్టుకొని వేళ్లాడుతున్నారు. ఇప్పుడు విధ్వంసం గురించి ఎక్కువ మాట్లాడితే జనం రికార్డుల్ని తిరగేస్తారు.విధ్వంసం ఎవరిదో వికాసం ఎవరి వల్ల జరిగిందో తెలుసుకుంటారు. సమాచారం ఇప్పుడు ఎవరి ప్రైవేట్ ప్రాపర్టీ కాదు. అది ప్రజల హక్కు.పౌరుల భావప్రకటనా స్వేచ్ఛపై శుక్రవారం నాడు సర్వో న్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అధికార మత్తులో జోగుతున్న మన వ్యవస్థలకు కనువిప్పు కావాలి. భావ ప్రకటనా స్వాతంత్య్రం లేనినాడు రాజ్యాంగం హామీ పడిన గౌరవ ప్రదమైన జీవన హక్కు సాధ్యం కాదని సుప్రీంకోర్టు తేటతెల్లం చేసింది. ఈ హక్కును రక్షించడంలో పోలీసులు విఫలమైతే ఆ బాధ్యతను కోర్టులు తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు హితవు చెప్పింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ అనే కాంగ్రెస్ ఎంపీ పెట్టిన పోస్టుపై గుజరాత్ పోలీసులు పెట్టిన కేసును సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఈ తీర్పుపై సంపాదకీయం రాసిన ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ‘కేసును కొట్టివేయడంలో ఆశ్చర్యం లేదు. అసలు సుప్రీంకోర్టు దాకా ఈ కేసు రావడమే దిగ్భ్రాంతిని కలిగిస్తు న్నద’ని వ్యాఖ్యానించింది. ప్రతాప్‌గఢీ పెట్టిన పోస్టుకూ,ఆంధ్రాలో ప్రేమ్ కుమార్ అనే దళిత యువకుడి సోషల్ మీడియా పోస్టుకూ సారూప్యతలున్నాయి. కానీ ఆ యువకుడిని మన పోలీసు యంత్రాంగం ఎంతగా వేధించిందో తెలిసిందే. ఇప్పటి కైనా పోలీస్ యంత్రాంగం జీ హుజూర్ పద్ధతుల్ని విడిచి పెట్టక పోతే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవని గ్రహిస్తే మంచిది. పోలీసు యంత్రాంగానికే కాదు... రెడ్‌బుక్ వంటి గ్రంథాల రచయితలకు కూడా సుప్రీం వ్యాఖ్యలు వాతలు పెట్టినట్టే!వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
అసలైన రైతు నేత దలీవాల్: సుప్రీం
న్యూఢిల్లీ: రైతు సంఘం నాయకుడు జగ్జీత్ సింగ్ దలీవాల్ అసలు సిసలైన రైతు నాయకుడని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆయనకు రాజకీయ అజెండా లేదని వెల్లడించింది. రైతుల సమస్యల పరిష్కారం కోసం దలీవాల్ నాలుగు నెలలపాటు నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన దీక్ష విరమించారు. ఎలాంటి రాజకీయ అజెండా లేకుండా రైతుల సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్న నిజమైన నేత దలీవాల్ అని సుప్రీంకోర్టు ప్రశంసించింది. పంజాబ్– హరియాణా సరిహద్దులోని ఖానౌరీ, శంభులో రైతుల నిరనసన శిబిరాలు ఇటీవల మూతపడ్డాయి. రహదారులపై రాకపోకలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పంజాబ్ అడ్వొకేట్ జనరల్ గుర్మీందర్సింగ్ శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో దలీవాల్పై న్యాయస్థానం ప్రశంసల వర్షం కురిపించింది. రైతు సమస్యల పరిష్కారానికి ఆయన నిజాయతీగా కృషి చేస్తున్నారని, మరికొందరు నాయకులు మాత్రం సమస్యలు పరిష్కారం కావొద్దని కోరుకుంటున్నారని ఆక్షేపించింది. ఈ నెల 19వ తేదీన అరెస్టయిన రైతు సంఘం నేతలు పాంధర్, కోహర్, కోట్రాతోపాటు ఇతర నాయకులు శుక్రవారం జైళ్ల నుంచి విడుదలయ్యారు. -
పౌర హక్కుల బాధ్యత కోర్టులు, పోలీసులదే
సాక్షి, అమరావతి: పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో సుప్రీం కోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే విషయంలో పౌరుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత కోర్టులు, పోలీసులపై ఉందని స్పష్టం చేసింది. వ్యక్తులు లేదా వ్యక్తుల సమూహం తమ ఆలోచనలను, అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయడమనేది ఆరోగ్యకరమైన, నాగరిక సమాజంలో అంతర్భాగమని పేర్కొంది. స్వేచ్ఛగా ఆలోచనలు, అభిప్రాయాలను వ్యక్తం చేయలేకపోతే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గౌరవప్రదమైన జీవితం గడపడం అసాధ్యమవుతుందని తేల్చి చెప్పింది. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో వ్యక్తులు లేదా వ్యక్తుల సమూహాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, ఆలోచనలను మరో అభిప్రాయంతో విబేధించాలేగానీ వాటిని అణచి వేయకూడదని పేర్కొంది.పోలీసులు విఫలమైతే కోర్టులు బాధ్యత తీసుకోవాలి...‘‘పోలీసులు లేదా కార్యనిర్వాహక సంస్థలు రాజ్యాంగం నిర్దేశించిన ప్రాథమిక హక్కులను గౌరవించడం, పరిరక్షించడంలో విఫలమైతే న్యాయస్థానాలు ముందుకు వచ్చి ఆ బాధ్యతను తీసుకోవాలి. ఎందుకంటే పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించగలిగే సంస్థ మరొకటి ఏదీ లేదు. మనది గణతంత్ర రాజ్యంగా అవతరించి 75 సంవత్సరాలు పూర్తయిన తరువాత కూడా మౌలిక సూత్రాలలో మనం ఇలా అస్థిరంగా ఉండకూడదు. కేవలం ఒక కవిత పఠనం, వినోద రూపంలో కళా ప్రదర్శన చేయడం లాంటివి సమూహాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆరోపించడం ఎంత మాత్రం సరైంది కాదు. ఇలాంటి దృక్పథాన్ని అంగీకరించడమంటే అది ప్రజాస్వామ్యంలో న్యాయసమ్మతమైన అన్ని అభిప్రాయాలను అణిచివేయడమే అవుతుంది. పోలీసులు రాజ్యాంగాన్ని గౌరవించాలి. అలాగే అందులోని ఆదర్శాలకు కట్టుబడి ఉండాలి’’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని విమర్శించినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు అడ్డగోలుగా కేసులు బనాయిస్తూ రాజ్యాంగ విరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తున్న నేపథ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పునకు ప్రాధాన్యత ఏర్పడింది.ఇమ్రాన్ ప్రతాప్‌గ్రాహిపై కేసు కొట్టివేత...ఇన్‌స్ట్రాగామ్‌లో అభ్యంతరకర పోస్టు పెట్టారంటూ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గ్రాహిపై గుజరాత్ పోలీసులు నమోదు చేసిన కేసును సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టేసింది. ఇమ్రాన్‌పై మోపిన నేరం ఏదీ ఆయనకు వర్తించదని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల భుయాన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛ గురించి తీర్పులో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.విభేదించవచ్చు.. కానీ గౌరవించాలి!ఓ వ్యక్తి వ్యక్తం చేసే అభిప్రాయాలతో ఎంతోమంది విబేధించవచ్చునని, అయితే ఆ వ్యక్తి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కును అందరూ గౌరవించడంతో పాటు ఆ హక్కును పరిరక్షించాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. సాహిత్యం, కవిత్వం, నాటకాలు, సినిమాలు, వ్యంగ్య రచనలు, కళలు మానవ జీవితాన్ని మరింత అర్థవంతంగా మారుస్తాయని, వాటిని విద్వేషాలను రెచ్చగొట్టేవిగా పరిగణించరాదని సూచించింది. పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను పరిరక్షించడంతో పాటు అవి అమలయ్యేలా చూడటం న్యాయస్థానాల ప్రధాన కర్తవ్యమని సుప్రీంకోర్టు తెలిపింది. కొన్నిసార్లు తమకు వినబడిన, రాయబడిన మాటలను న్యాయమూర్తులుగా తాము ఇష్టపడకపోవచ్చునని, అయినప్పటికీ పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అలాగే న్యాయమూర్తులుగా రాజ్యాంగాన్ని, అందులోని ఆదర్శాలను పరిరక్షించాల్సిన బాధ్యత కూడా తమపై ఉందంది. పౌరుల హక్కులను రక్షించే విషయంలో సదా ముందు ఉండటం న్యాయస్థానాల బాధ్యతని వ్యాఖ్యానించింది. ప్రాథమిక హక్కులను కోర్టులు పరిరక్షించాలి...ప్రధానంగా రాజ్యాంగ న్యాయస్థానాలు పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించేందుకు అగ్రభాగంలో ఉండాలని సుప్రీం సూచించింది. రాజ్యాంగం, ఆదర్శాలను అణిచివేయకుండా చూడాల్సిన ఉత్కృష్ట బాధ్యత న్యాయస్థానాలపై ఉందని పేర్కొంది. న్యాయస్థానాలు ఎప్పుడూ పౌరుల ప్రాథమిక హక్కులను ముఖ్యంగా భావ ప్రకటన స్వేచ్ఛను పరిరక్షించి, దానిని ప్రోత్సహించే వైపే ఉండాలని తెలిపింది. ఇది స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యంలో పౌరులకు ఉండే అత్యంత కీలకమైన హక్కు అని తేల్చి చెప్పింది. పౌరుల స్వేచ్ఛాయుత ఆలోచన, భావప్రకటన స్వేచ్ఛ మన రాజ్యాంగంలోని ప్రధానమైన ఆదర్శాలలో ఒకటని తెలిపింది. పోలీసులు కూడా ఈ దేశ పౌరులేనని, అందువల్ల రాజ్యాంగాన్ని అనుసరించడం, పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛను పరిరక్షించడం వారి బాధ్యతని తెలిపింది. విచారణకు స్వీకరించదగ్గ నేరం చేశారన్న సమాచారం అందినప్పుడు సదరు పోలీసు అధికారి మొదట ప్రాథమిక విచారణ చేపట్టాలంది. ప్రాథమిక విచారణ తరువాత ఆ నేరం విచారణకు స్వీకరించదగ్గదని తేలితే, అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని పేర్కొంది. విచారణకు స్వీకరించదగ్గ నేరం కాదని ప్రాథమిక విచారణలో తేలితే ఆ విషయాన్ని పోలీసులు సదరు ఫిర్యాదుదారుడికి తెలియచేయాలంది. తద్వారా ఫిర్యాదుదారు తనకున్న ఇతర ప్రత్యామ్నాయాలను చూసుకుంటారని తెలిపింది.» స్వేచ్ఛగా ఆలోచనలు, అభిప్రాయాలను వ్యక్తం చేయలేకపోతే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గౌరవప్రదమైన జీవితం గడపడం అసాధ్యమవుతుంది» విచారణకు స్వీకరించదగ్గ నేరం కాదని ప్రాథమిక విచారణలో తేలితే ఆ విషయాన్ని పోలీసులు సదరు ఫిర్యాదుదారుడికి తెలియచేయాలి. తద్వారా ఫిర్యాదుదారు తనకున్న ఇతర ప్రత్యామ్నాయాలను చూసుకుంటారు.» ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో వ్యక్తులు లేదా వ్యక్తుల సమూహాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, ఆలోచనలను మరో అభిప్రాయంతో విబేధించాలేగానీ వాటిని అణచి వేయకూడదు.» స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యంలో పౌరులకు ఉండే అత్యంత కీలకమైన హక్కు.. పౌరుల స్వేచ్ఛాయుత ఆలోచన, భావప్రకటన స్వేచ్ఛ మన రాజ్యాంగంలోని ప్రధానమైన ఆదర్శాలలో ఒకటి. -
జస్టిస్ యశ్వంత్‌కు ఏ పనీ ఇవ్వొద్దు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలతో చిక్కుల్లో పడ్డ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాసేపటికి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ యశ్వంత్ వర్మ కేవలం బదిలీపై మాత్రమే అలహాబాద్ హైకోర్టుకు వస్తున్నారని, ఆయనకు ప్రస్తుతానికి ఏ విధమైన జ్యుడిషియల్ వర్క్ అప్పచెప్పవద్దని సీజేఐ సంజీవ్ ఖన్నా కోరారు. ఈ మేరకు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జస్టిస్ యశ్వంత్ పై విచారణ పెండింగ్ లో ఉన్న క్రమంలోనే ఆయనకు ఏ పనీ అప్పచెప్పవద్దని సీజేఐ సూచించారు. అంతకుముందు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా ఈ తరహా ఆదేశాలనే జారీ చేశారు సీజేఐ.కేంద్రానికి సిఫార్సు.. గ్రీన్ సిగ్నల్జస్టిస్ యశ్వంత్ వర్మ బదిలీ అంశానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసే క్రమంలో కేంద్రానికి ప్రతిపాదన పంపింది సీజేఐ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం. దీనికి ఈరోజు(శుక్రవారం) గ్రీన్ సిగ్నల్ లభించడంతో యశ్వంత్ వర్మ.. అలహాబాద్ హైకోర్టుకు వెళ్లనున్నారు. 2021లో అలహాబాద్ హైకోర్టు నుంచి బదిలీపై ఢిల్లీ హైకోర్టుకు వచ్చిన యశ్వంత్ మళ్లీ అక్కడికే వెళ్లనున్నారు.ఆరు రాష్ట్రాల బార్ అసోసియేన్స్ తో సీజేఐ భేటీఅయితే యశ్వంత్ వర్మ సచ్ఛీలురుగా బయటకొచ్చేవరకూ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయొద్దంటూ అక్కడ బార్ అసోసియేషన్ తో పలు రాష్ట్రాల బార్ అసోయేషన్స్ కూడా కోరాయి. గుజరాత్ హైకోర్టు బార్ అసోసియేషన్, కేరళ హైకోర్టు బార్ అసోసియేషన్, కర్ణాటక హైకోర్టు బార్ అసోసియేషన్, లక్నో బార్ అసోసియేషన్స్ డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై సీజేఐ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే పలు బార్ అసోసియేషన్ హెడ్స్ తో సీజేఐ సంజీవ్ ఖన్నా నిన్న(గురువారం)ఢిల్లీలో సమావేశమయ్యారు. ప్రస్తుతానికి జస్టిస్ యశ్వంత్ బదిలీని నిలుపుదల చేయాలని సదరు బార్ అసోసియేషన్స్ కోరిన తరుణంలో వారితో సీజేఐ భేటీ అయ్యారు. ఆయా రాష్ట్రాల బార్ అసోసియేషన్ అధ్యక్షులతో సీజేఐ సమావేశమై వారితో చర్చించారు. వారి డిమాండ్ ను పరిగణలోకి తీసుకుంటామని సీజేఐ సంజీవ్ ఖన్నా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇంట్లో నోట్ల కట్టలు..!కాగా, ఇటీవల జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. దాని విలువ సుమారు రూ. 15 కోట్లు ఉంటుందని అంచనాలు కూడా వేశారు. ఒక న్యాయమూర్తి వద్ద అంత డబ్బు ఎలా వచ్చిందంటూ చర్చ మొదలైంది. అదే సమయంలో ఇది కచ్చితంగా అవినీతి చేసే కూడపెట్టిందని వాదన బలంగా వినిపించింది.ఈ క్రమంలోనే ఆరు రాష్ట్రాలకు చెందిన బార్ అసోసియేషన్ అధ్యక్షులతో సీజేఐ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జస్టిస్ యశ్వంత్ వర్మ బదిలీని కొన్నాళ్లపాటు నిలుపుదల చేయడమే సమంజసమా?, బదిలీ చేసి అక్కడ జ్యుడిషియల్ వ్యవహారాలు అప్పగించకుండా ఉండేలా చేయడమే కరెక్టా అనే కోణంలో వీరు చర్చించినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే జస్టిస్ యశ్వంత్ పై విచారణ పూర్తయ్యేవరకూ ఎటువంటి బాధ్యతలు కేటాయించవద్దని అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సూచించినట్లు సమాచారం. -
సుప్రీం కోర్టు తీర్పు.. కూటమి సర్కార్‌కు చెంపపెట్టు
హైదరాబాద్, సాక్షి: భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఏపీలోని కూటమి ప్రభుత్వానికి (Kutami Prabhutvam) చెంపపెట్టులాంటిదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్య హక్కును గౌరవించాలని.. పోలీసులు రాజ్యాంగ ఆదర్శాలకు కట్టుబడి ఉండాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కానీ, ఏపీలో జరుగుతోంది ఏంటి?.. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ రాజకీయ ప్రత్యర్థులపై పోలీసు వ్యవస్థను అడ్డగోలుగా ఉపయోగిస్తోంది. ఈ 9 నెలల కాలంలో వందలాది మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించింది. కూటమి నేతలను గతంలో విమర్శించారని.. ఇప్పుడేమో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని.. కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఏపీలో ఈ పర్వం ఇంకా కొనసాగుతోంది. సంబంధిత వార్త: అణచివేతతో కాదు.. భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీం కోర్టుప్రెస్మీట్ పెట్టినందుకు పోసానిలాంటి వాళ్లను జైళ్లకు పంపి ఇబ్బందులకు గురి చేసింది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరికొందరిని పీఎస్‌ల చుట్టూ తిప్పుతూ వేధింపులకు గురి చేస్తోంది కూడా. అయితే.. ఇప్పటికే కూటమి పాలనలో నమోదు అవుతున్న అక్రమ కేసులను ఏపీ హైకోర్టు తప్పుబట్టింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని భూతద్దంలో చూడడం ఆపాలని ఏపీ పోలీసులకు(AP Police) హితవు పలికింది. ప్రభుత్వ పెద్దల కోసం పని చేయొద్దంటూ పోలీసులనూ తీవ్రంగా మందలించింది. ఇది ఇలాగే కొనసాగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. తాజాగా సుప్రీం కోర్టు కూడా గుజరాత్ పోలీసులపై ఇదే తరహాలో ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. -
భావ ప్రకటన స్వేచ్ఛ.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: వాక్ స్వాతంత్ర్యం.. భావ ప్రకటన స్వేచ్ఛపై దేశ సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court Of India) కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యంలో.. అందునా ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో అవి భాగమని.. ప్రాథమిక హక్కులను పరిరక్షించడం న్యాయస్థానాల విధి అని స్పష్టం చేస్తూ శుక్రవారం సంచలన తీర్పు వెల్లడించింది.రెచ్చగొట్టేలా పద్యాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్గర్హీపై గుజరాత్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం.. సమాజంలో భావ ప్రకటన స్వేచ్ఛ(Freedom of Expression) అంతర్భాగమని, ఆ హక్కును గౌరవించాల్సిన అవసరం కచ్చితంగా ఉందని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో గుజరాత్ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ.. ఈ కేసులో ఎలాంటి నేరం లేకపోయినా అత్యుత్సాహం ప్రదర్శించారని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంలోనే ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.సినిమాలు, కవిత్వం.. సాహిత్యం, వ్యంగ్యం.. మనుషుల జీవితాన్ని మరింత అర్థవంతం చేస్తాయి. ఆలోచనలు, అభిప్రాయాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ లేనప్పుడు.. ఆర్టికల్ 21 ప్రకారం గౌరవప్రదమైన జీవితాన్ని గడపడం ఎలా సాధ్యమవుతుంది?. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో.. విభిన్న అభిప్రాయాలను.. ప్రతివాదనలతో ఎదుర్కోవాలే తప్ప అణచివేతతో కాదు. ఒకవేళ ఆ వ్యాఖ్యలపై ఆంక్షలు విధించాల్సివస్తే.. అవి సహేతుకంగా ఉండాలే గానీ.. ఊహాజనితంగా కాదు. ఓ వ్యక్తి అభిప్రాయాలను ఎక్కువమంది వ్యతిరేకించినా సరే.. ఆ వ్యక్తి భావ ప్రకటనా హక్కును తప్పనిసరిగా గౌరవించాల్సిందే. భావ స్వేచ్ఛ ప్రకటన, వాక్ స్వాతంత్య్రం(Freedom of Speech) అనేవి ప్రజాస్వామ్యంలో అంతర్భాగం. ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడటం న్యాయస్థానాల విధి. పోలీసులు రాజ్యాంగ ఆదర్శాలకు కట్టుబడి ఉండాలి. అంతిమంగా.. ఆర్టికల్ 19(1)ను కాపాడాల్సిన బాధ్యత న్యాయమూర్తులదే’’ అని ధర్మాసనం స్పష్టం చేస్తూ.. గుజరాత్ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేసింది. జరిగింది ఇదే..గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి(Imran Pratapgarhi) గతేడాది డిసెంబరులో 46 సెకన్ల నిడివి ఉన్న వీడియో ఒకటి పోస్ట్ చేశారు. ఓ పెళ్లి వేడుక మధ్యలో ఆయన నడిచివస్తుండగా పూలవర్షం కురిపిస్తూ.. బ్యాక్‌గ్రౌండ్ ఓ పద్యం వినిపించారు. అయితే, ఆ పద్యంలో పదాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, అవి మత విశ్వాసాలు, సామరస్యాన్ని, జాతి ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయన్న ఫిర్యాదుతో గుజరాత్ పోలీసులు కేసు నమోదు చేశారు. గుజరాత్ హైకోర్టులో ఇమ్రాన్‌కు ఊరట లభించలేదు. దీంతో హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం.. ఎఫ్ఐఆర్ను కొట్టేస్తూ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్‌కు ఊరట ఇచ్చింది. -
వసుధైక కుటుంబం ఎక్కడ: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: దేశంలో కుటుంబ వ్యవస్థ క్రమంగా విచ్చిన్నమై పోతోందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. ప్రపంచమంతా ఒక్కటే కుటుంబం (వసుధైక కుటుంబం) అని భావించడం భారతీయ సంప్రదాయమని పేర్కొంది. ప్రస్తుతం ఆ భావన ఎక్కడా కనిపించడం లేదని, ఒక్కరే ఒక కుటుంబం అనే పరిస్థితి వచ్చిందని వెల్లడించింది. దగ్గరి కుటుంబ సభ్యులను సైతం కలిపి ఉంచలేకపోతున్నామని తెలియజేసింది. తమ ఇంటిని, ఆస్తులను ఆక్రమించుకొని, తమను వేధిస్తున్న కుమారుడిని అక్కడి నుంచి ఖాళీ చేయించాలంటూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఎస్.వి.ఎన్.భట్టితో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. కుటుంబం అనే భావన కనుమరుగైపోతోందని విచారం వ్యక్తంచేసింది. తల్లిదండ్రులతో పిల్లలను ఒక్కటిగా కలిపి ఉంచడం అసాధ్యంగా మారుతోందని తెలియజేసింది. ఈ కేసులో కుమారుడిని ఇంటి నుంచి బయటకు పంపించాల్సిన అవసరం లేదని భావిస్తున్నామని స్పష్టం చేసింది. తల్లిదండ్రుల జీవనానికి అవసరమైన ఖర్చులు ఇవ్వాలని కుమారుడిని ధర్మాసనం ఆదేశించింది. -
న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు.. కదిలిన డొంక
తీగలాగితే డొంక కదిలింది అన్నట్టుగా ఒక న్యాయమూర్తి ఇంట్లో దొరికిన నోట్ల కట్టలు మొత్తం న్యాయవ్యవస్థను కుదిపేస్తున్నవి. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yashwant Varma) ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. న్యాయమూర్తి ఇంటికి పరుగున వచ్చిన అగ్నిమాపక సిబ్బందికి దగ్ధమవుతున్నవి భిన్నంగా కనిపించాయి. తమ బాధ్యతగా మంటలు ఆపి పై అధికారులకు ఎటువంటి సమాచారం ఇచ్చారో తెలియదు! కానీ మూడు రోజుల తర్వాత గానీ మీడియాలో ఈ వార్త రాలేదు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉపాధ్యాయ దగ్గరకు చేరిన వీడియోలు సుప్రీంకోర్టు వెబ్ సైట్లో అప్లోడ్ కాకపోయి వుంటే కరెన్సీ తగలబడటం అనేది బయటకు వచ్చేది కాదు. తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా... జస్టిస్ యశ్వంత్ వర్మపై చర్యలు ప్రకటించారు. అయితే ఆ చర్యలే ఇప్పుడు ప్రశ్నలు ఎదుర్కొంటున్నాయి. న్యాయమూర్తులకు భిన్న న్యాయమా?ఒక సాదాసీదా ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో లక్ష కరెన్సీ దొరికితే ఆ వివరాలను మీడియాకి ఇచ్చి, ఆ ఉద్యోగి ఫొటోలు విడుదల చేసే పోలీసులు జస్టిస్ యశ్వంత్ వర్మ పట్ల ఎందుకు ఉదాసీనంగా వ్యవహ రించారు? దాదాపు 15 కోట్ల విలువ ఉన్న కరెన్సీ ఒక న్యాయమూర్తి ఇంట్లో లభిస్తే న్యాయవ్యవస్థ తీసుకున్న చర్య ఆ న్యాయమూర్తిని మరో హైకోర్టుకు బదిలీ చేయడమా? ఒక కేసులో విచారణ సక్రమంగా జరగదని న్యాయస్థానాలు భావించినప్పుడు నిష్పక్ష విచారణకు సీబీఐకి కేసును బదిలీ చేస్తాయి కదా. మరి ఆ కరెన్సీ విషయం నిగ్గు తేల్చమని సీబీఐని ఎందుకు ఆదేశించలేదు? కరెన్సీతో కూడిన కేసు కాబట్టి ఈడీను ఆ కేసు తీసుకోమని ఎందుకు అడగలేదు? స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థతో దర్యాప్తు చేస్తే గాని నిజాలు బయటకు రావని పలు సందర్భాలలో వ్యాఖ్యానించిన న్యాయవ్యవస్థ ఈ విషయంలో అంతర్గత విచారణకు ఆదేశించడం ఏమిటి? ఒక న్యాయమూర్తి మీద ఆరోపణలు వస్తే మరో ముగ్గురు న్యాయమూర్తుల కమిటీ వేయడం సబబా? ఆ న్యాయమూర్తి మీడియా ముందుకు వచ్చి ‘ఆ కరెన్సీ నోట్లు నావి కావు, అక్కడికి ఎలా వచ్చాయో నాకు తెలియదు’ అనీ నోట్ల కట్టలను చూపుతుంటే ఆయన మీద ఆంక్ష విధించలేదు. కేసు గురించి బహిరంగంగా మాట్లాడటానికి వీలు లేదనే నిబంధన సామాన్య నిందితుడి మీద విధించడం న్యాయస్థానాలు చేస్తుంటాయి. కానీ అది ఢిల్లీ న్యాయమూర్తికి వర్తింప చేయలేదు. ‘నా పరువుకు భంగం కలిగించే కుట్రలో భాగంగా ఎవరో ఆ కరెన్సీ నోట్లు (Currency Notes) తెచ్చి నా ఇంట్లో పెట్టారు’ అని సదరు న్యాయమూర్తి అంటున్నారు.మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ ఇటీవల చెన్నైలో చేసిన ప్రసంగంలో ‘న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం సడలుతోంది’ అన్నారు. మరో సమావేశంలో మరో మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ కూడా ‘న్యాయవ్యవస్థలో అంతా సక్రమంగా ఉందనలేం’ అన్నారు. ఆ ఇద్దరు న్యాయమూర్తుల నోటి వెంట వచ్చిన మరో పదం భారతీయ న్యాయ వ్యవస్థలో ‘అంకుల్ జడ్జి సిండ్రోమ్’ నెలకొన్నది అనేది. న్యాయవ్యవస్థలో బంధుప్రీతి పెరిగిందని, వారసులు జడ్జిలు అవుతున్నారనే విషయం ముంబైకి చెందిన న్యాయవాది మాథ్యూస్ నెడుంపర సాక్ష్యాలతో సహా ఒక నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించారు. ఆయన పరిశోధనలో హైకోర్టు స్థాయిలో 50 శాతం న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు స్థాయిలో 33 శాతం న్యాయమూర్తులు గతంలో న్యాయమూర్తులుగా పనిచేసిన వారికి దగ్గర బంధువులు. కొలీజియం ఉండటం సబబా?న్యాయవ్యవస్థలో బంధు ప్రీతి పెరగడానికి కారణం ప్రపంచంలో మరే దేశంలో లేనటువంటి కొలీజియం వ్యవస్థ. ప్రజాస్వామ్య దేశాలన్నింటిలో న్యాయమూర్తులు నియామకం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు చేస్తాయి. మనదేశంలో కూడా రాజ్యాంగం ఆ విధానాన్ని అనుసరించింది. అయితే మధ్యలో న్యాయమూర్తులు ఆ విధానాన్ని హైజాక్ చేశారు. కొలీజియం వ్యవస్థను స్థాపించారు. ఈ కొలీజీయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా మరో నలుగురు న్యాయమూర్తులు సభ్యులు. హైకోర్టు స్థాయిలోనూ అటువంటి కొలీజియం ఉంటుంది. ఈ కొలీజియం న్యాయమూర్తుల నియామకాలను చేపడుతుంది. వారు సిఫార్సు చేసిన వారిని కేంద్ర ప్రభుత్వం నియమించాలి.ఎన్డీయే ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయ వ్యవస్థ సంస్కరణ కోసం రాజ్యాంగాన్ని సవరించి ‘నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్ కమిషన్’ (ఎన్‌జేఏసీ) చట్టం చేసింది. దీని ద్వారా న్యాయమూర్తుల నియామకం ప్రభుత్వం ద్వారా జరిగేందుకు వీలు కల్పించింది. అయితే ఈ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసి, కొలీజియం (Collegium) ద్వారానే నియామకాల విధానం కొనసాగిస్తామన్నది. న్యాయమూర్తులు న్యాయమూర్తులను నియమించే విధానం మరెక్కడా లేదు. ఆ హక్కును ఐఏఎస్ అధికారులు, సీనియర్ ఐఏఎస్ అధికారులకు కోర్టు ఇస్తుందా? ప్రతి వ్యవస్థలో సీనియర్స్ తమ తర్వాతి స్థానాల వారిని నియమించడం సబబా! న్యాయస్థానాల మీద నోరెత్తడానికి ప్రజలు భయపడే పరిస్థితి కల్పిస్తే దిక్కెవరు?గతంలో కొలీజియం వ్యవస్థను సవాలు చేసిన న్యాయవాది మాథ్యూస్ నెడుంపర. ఆయన తన పిటీషన్లో వేసిన ప్రశ్నలు – ఇంతవరకు ఆ కరెన్సీని ఎందుకు భద్రపరచి, తగలబడిన వస్తువుల జాబితా తయారు చేయలేదు? ఎవరిని అరెస్టు ఎందుకు చేయలేదు? క్రిమినల్ చట్టాలను ఎందుకు అమలు చేయడం లేదు? ఈ కేసు వివరాలను ఎందుకు బయటకు రానివ్వడం లేదు? ఉపరాష్ట్రపతి జగదీశ్ ధన్కడ్ ఎన్‌జేఏసీ చట్టాన్ని తిరిగి తీసుకురావాల్సిన అవసరం గురించి ప్రతిపక్ష నేతలతో చర్చించారు. ఇకముందైనా కొలీజియం వ్యవస్థలోని లోపాలను సుప్రీంకోర్టు వదులుకుంటుందా? పారదర్శకత, జవాబుదారీతనం న్యాయవ్యవస్థ ప్రదర్శిస్తుందా?- పి. వేణుగోపాల్ రెడ్డి ఏకలవ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు pvg2020@gmail.com -
ఎన్నాళ్లీ ఆగడాలు!
సందేహం లేదు... న్యాయస్థానాలతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆటలాడుతున్నారు. పరిధులు గుర్తెరిగి విధినిర్వహణ చేయాలని పదిరోజులనాడు చెప్పినా తమ వెనకటి గుణం మానుకోవటానికి ససేమిరా అంటున్నారు. అందుకే ఏపీ హైకోర్టు మంగళవారం మరోసారి చీవాట్లు పెట్టవలసి వచ్చింది. హైకోర్టు ధర్మాసనం ముందు ప్రస్తావనకొచ్చిన ప్రేమ్‌కుమార్ కేసు విచిత్రమైనది. మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడైన ప్రేమ్‌కుమార్ రహదారుల బాగుకు నిధుల కోసం ఊరూరా టోల్గేట్లు పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనపై వ్యంగ్యంగా, ప్రతీకాత్మకంగా ఒక చిన్న రూపకాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దానిపై ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. తాము కట్టే పన్నుల్లో రోడ్ సెస్ వంటివి ఉండగా ఇలా ప్రత్యేకించి మళ్లీ వసూలు చేయడమేమిటన్న చర్చ మొదలైంది. అందుకే సర్కారువారికి కంటగింపైంది. ఆయన్ను ముప్పుతిప్పలు పెట్టడమే ధ్యేయంగా తప్పుడు కేసు సృష్టించారు. ‘మనోభావాలు’ దెబ్బతిన్నాయని ఒక వ్యక్తి ద్వారా ఫిర్యాదు చేయించి కర్నూలునుంచి గుంటూరుకు ఆగమేఘాలమీద వచ్చి అర్ధరాత్రి అరెస్టుకు పూనుకున్నారు. ఇంగితం మరిచి ఆయన భార్య, కుమార్తెలపై దౌర్జన్యం కూడా చేశారు. ఇదొక్కటే కాదు... నిరుడు డిసెంబర్నుంచి ఇలాంటి కేసులెన్నో ఉన్నత న్యాయస్థానం దృష్టికి వస్తూనేవున్నాయి. ఆ పిటిషన్లపై విచారించిన న్యాయమూర్తులు హెచ్చరిస్తూనే వున్నారు. కానీ పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. బహుశా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఏలినవారే చూసుకుంటారన్న ధైర్యమేమో! హైకోర్టుతో చీవాట్లు తిన్న మరునాడే శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిలో పోలీసుల తీరు ఈ సందేహాన్నే కలిగిస్తోంది. ఎంపీపీ ఎన్నికల్లో విప్ జారీ చేయటానికి అధికారులను కలవడానికెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులపై తెలుగుదేశం నేతలు దౌర్జన్యానికి దిగితే అడ్డుకోవాల్సిన పోలీసులు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపైనే తప్పుడు కేసు బనాయించి నిర్బంధంలోకి తీసుకున్నారు.నిద్రపోయేవారిని లేపవచ్చు... నిద్ర నటిస్తున్నవారిని తెలివిలోకి తీసుకురావటం సాధ్యమేనా? వీళ్లంతా కొత్తగా విధి నిర్వహణలో చేరినవారు కాదు. ‘జీ హుజూర్’ అంటే తప్ప జీతంరాళ్లు రాని వారు కాదు. ప్రజలు చెల్లిస్తున్న పన్నులద్వారా వచ్చే ఆదాయంతో నెలనెలా జీతభత్యాలు పొందు తున్నవారు. అంచెలంచెలుగా పదోన్నతులు పొందినవారు. కానీ పాలకులు మారేసరికి వీరిలో అపరిచితుడు బయటికొచ్చినట్టుంది. తప్పుడు వాగ్దానాలతో, ప్రత్యర్థులపై దుష్ప్రచారంతో, చడీ చప్పుడూ కాకుండా సాగించిన అక్రమాలతో అందలం ఎక్కిన పాలకులు ఎంతకాలం ఊరేగుతారు? వారిని నమ్ముకుని ఇష్టారాజ్యం చేయొచ్చనుకోవటం, తమకేమీ కాదనుకోవటం మంచిదికాదని అధికారులు గ్రహించాలి. ఈ పాలన కొడిగట్టి కొండెక్కాక తమ పరిస్థితేమిటన్న స్పృహ కలగాలి. అసలు దేశానికి రాజ్యాంగం ఉన్నదని, పౌరులకు దానిద్వారా హక్కులు సమకూరాయని, తమతో సహా అన్ని వ్యవస్థలూ వాటికి అనుగుణంగానే ప్రవర్తించాలని, ఉల్లంఘనలకు పాల్పడితే న్యాయ స్థానాలు చూస్తూ ఊరుకోవని తెలుసుకోవాలి. ఈ దేశంలో న్యాయస్థానాలు ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో సైతం నిర్భయంగా తీర్పులిచ్చిన ఉదంతాలున్నాయి. ఆ సంగతిని ప్రభుత్వమూ, పోలీసులూ కూడా తెలుసుకోవాలి.విధినిర్వహణ తీరుతెన్నులెలా వుండాలో తెలిపే మాన్యువల్ గురించి ధర్మాసనం పోలీసులకు గుర్తు చేయక తప్పలేదు. సాధారణ స్థాయి కానిస్టేబుల్ మొదలుకొని డీజీపీ వరకూ విధినిర్వహణ ఎలా వుండాలో, బాధ్యతలేమిటో తెలిపే మాన్యువల్ అది. ఎఫ్ఐఆర్ల నమోదు, దర్యాప్తు విధి విధా నాలూ, అధికారాల వినియోగంలో పాటించాల్సిన పద్ధతులు, పరిమితులు వగైరాలన్నీ అందులో నిర్దేశించివుంటాయి. పౌరులకుండే హక్కులేమిటో, విధినిర్వహణలో వాటిని పాటించాల్సిన అవసర మేమిటో మాన్యువల్ చెబుతుంది. హైకోర్టు భిన్న సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు గమనిస్తే ఈ మాన్యువల్‌ను పోలీసులు పట్టించుకోవటం మానేశారని అర్థమవుతుంది. కనీసం గుర్తు చేస్తున్నా దున్నపోతు మీద వానపడిన చందాన ప్రవర్తిస్తున్నారు. వర్రా రవీంద్రరెడ్డి, అవుతు శ్రీధర్‌రెడ్డి, పప్పుల వెంకటరమణారెడ్డి, బొసా రమణ వగైరాల అరెస్టుల విషయంలో పదే పదే చెబుతున్నా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే పోలీసుల తీరు చూస్తే మాకు బీపీ పెరిగిపోతున్నదని ధర్మా సనం వ్యాఖ్యానించింది. అవసరాన్నిబట్టి కేసులు కాక, ఏదోవిధంగా కేసులు పెట్టాలి... ఎవరో ఒకర్ని అరెస్టు చేయాలని చూడటం సరికాదని హెచ్చరించింది. తమ ముందు దాఖలైన పత్రాలను పూర్తిగా పరిశీలించకుండానే మేజిస్ట్రేట్లు రిమాండ్ విధిస్తు న్నారని కూడా ఈ సందర్భంగా ధర్మాసనం అనటం గమనించదగ్గది. ప్రేమ్‌కుమార్ కేసు సంగతే తీసుకుంటే ఆయన అక్రమార్జనకు పూనుకున్నాడంటూ రూ. 300 స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు ఎఫ్ఐఆర్లో తెలిపారు. ఇంత హాస్యాస్పదంగా పెట్టే కేసుల్ని మేజిస్ట్రేట్లే తమ స్థాయిలో అడ్డు కోవచ్చు. అది లేకపోవటంవల్ల ఉన్నత న్యాయస్థానంలో కేసుల సంఖ్య పెరుగుతోంది. జిల్లా స్థాయిలో న్యాయవ్యవస్థ సక్రమంగా పనిచేయక పోవటంవల్ల బెయిల్ దరఖాస్తులు తమవద్దకు వెల్లువలా వచ్చిపడుతున్నాయని నిరుడు జూలైలో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆందోళన వ్యక్తం చేశారు. గత సోమవారం కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్ దరఖాస్తులపై కిందిస్థాయి కోర్టుల తీరును తప్పుబట్టింది. హైకోర్టు ధర్మాసనం తాజా వ్యాఖ్యల్ని తేలిగ్గా తీసుకుంటే చిక్కులు తప్పవని తెలుసుకోవాలి. నిబంధనలు గుర్తెరిగి మసులుకోవాలి. -
ఆ తీర్పు అమానుషం.. సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు(Supreme Court) తీవ్రంగా తప్పుబట్టింది. తీర్పులోని కొన్ని విషయాలు తమనెంతో బాధించాయన్న ద్విసభ్య ధర్మాసనం.. ఈ వ్యవహారానికి సంబంధించి కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాల నుంచి వివరణ కోరుతూ బుధవారం నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో తీర్పు ఇచ్చిన జడ్జి రామ్ మనోహర్ నారాయణపైనా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.దుస్తులను పట్టుకుని లాగటం, వక్షోజాలను తాకడం లాంటి చేష్టలు అత్యాచార నేరం కిందకు రావని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి రామ్ మనోహర్ నారాయణ(Ram Manohar Narayan Mishra) అభిప్రాయపడ్డారు. అయితే మైనర్ బాలిక లైంగిక వేధింపుల కేసులో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ తీర్పును సుమోటోగా సర్వోన్నత న్యాయస్థానం విచారణకు చేపట్టింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం ఈ కేసును విచారణ చేపట్టింది.ఈ నెల 17న ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు జడ్జి జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ చేసిన వ్యాఖ్యలు న్యాయస్థానాల పట్ల గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయంటూ మేధావుల దగ్గరి నుంచి సామాన్యుల దాకా ఆందోళన వ్యక్తం చేశారు.‘‘అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court) తీర్పు కాపీ చదువుతుంటే బాధేస్తోంది. ఇదొక సున్నితమైన అంశం అనే పట్టింపులేకుండా తీర్పు ఇచ్చారు. ఇదేదో క్షణికావేశంలో చేసింది కూడా కాదు. తీర్పును నాలుగు నెలలపాటు రిజర్వ్ చేసి మరీ వెల్లడించారు. అంతే.. సరైన స్పృహతోనే ఈ తీర్పు వెల్లడించినట్లు స్పష్టమవుతోంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో తీర్పుపై స్టే విధించేందుకు మేం బాగా ఆలోచిస్తుంటాం. కానీ, తీర్పు కాపీలోని 21, 24, 26 పేరాలు చదివాక.. అమానుషంగా అనిపించింది. అందుకే స్టే విధిస్తున్నాం’’ అని సుప్రీం కోర్టు వెల్లడించింది.ధర్మాసనం వ్యాఖ్యలతో సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సైతం ఏకీభవించారు. ఈ తరుణంలో జస్టిస్ గవాయ్ కలుగజేసుకుని ఇది తీవ్రమైన అంశం. సున్నితమైన అంశంగా భావించకుండా సదరు జడ్జి తీర్పు ఇచ్చారు. న్యాయమూర్తి వ్యాఖ్యలు అమానవీయంగా ఉన్నాయి. ఆయన గురించి ఇలా మాట్లాడుతున్నందుకు క్షమించాలి’’ అని తుషార్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.వీ ద విమెన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఆందోళనలు.. బాధితురాలి తల్లి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా కేసు దర్యాప్తు చేపట్టింది. అయితే ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో ఇంతకు ముందే ఓ పిటిషన్ దాఖలైంది. అయితే జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ ప్రసన్న బీ వరాలే దానిని విచారణకు స్వీకరించలేదు.కేసు నేపథ్యం ఇదే..2021 నవంబరులో.. ఉత్తరప్రదేశ్‌లోని కసగంజ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ, తన 11 ఏళ్ల కుమార్తెతో కలిసి బంధువుల ఇంటి నుంచి తిరిగివస్తోంది. అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు లిఫ్ట్ పేరిట ఆ బాలికను తమతో బైక్‌లపై తీసుకొచ్చారు. మార్గమధ్యంలో ఆమెను అసభ్యంగా తాకుతూ వేధింపులకు గురిచేశారు. ఆపై అత్యాచారానికి యత్నించారు. బాలిక అరుపులు విని అటుగా వెళ్తున్నవారు రావడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో నిందితులపై కేసు నమోదు చేశారు.అనంతరం ఈ కేసు అలహాబాద్ హైకోర్టుకు చేరింది. ఇటీవల దీనిపై విచారణ జరిపిన జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళ ఛాతీని తాకినంత మాత్రాన.. పైజామా తాడు తెంపినంత మాత్రాన అత్యాచార యత్నం కిందకు రాదంటూ పేర్కొన్నారు. తద్వారా నిందితులు చేసిన నేరాలు పోక్సో చట్టంలోని సెక్షన్ 18, సెక్షన్ 376 కిందకు రావని చెబుతూనే.. అదే చట్టంలోని సెక్షన్ 9/10 (తీవ్రమైన లైంగిక వేధింపులు), సెక్షన్ 354-బి (మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో దాడి) కింద కేసులు నమోదు చేసి విచారించాలని ఆదేశించారాయన. -
అది మనుషుల్ని చంపడం కన్నా ఘోరం: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: పర్యావరణాన్ని తమ కళ్లెదుటే నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని.. ఇలాంటి చర్యలను అడ్డుకట్ట ఎలా వేయాలో తమకు బాగా తెలుసని దేశ సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) అంటోంది. చెట్లను నరికిన వ్యవహారంలో ఓ వ్యక్తికి భారీ జరిమానా విధించిన కోర్టు.. ఇలాంటి చర్యలు మనుషుల్ని చంపడం కన్నా ఘోరం అంటూ వ్యాఖ్యానించింది. తాజ్ ట్రాపిజెమ్ జోన్ పరిధిలోని మధుర-బృందావన్‌లో దాల్మియా ఫార్మ్స్ నిర్వాహకుడు శివ్ శంకర్ అగర్వాల్.. చెట్లు నరికిన కేసులో ఊరట కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. అయితే ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజల్ భుయాన్ ధర్మాసనం అక్రమంగా నరికిన ప్రతీ చెట్టుకు లక్ష రూపాయాల జరిమానా చెల్లించాలని తీర్పు ఇచ్చింది.అనుమతి లేకుండా అన్నేసి చెట్లు నరకడం అన్నింటికంటే ఘోరం. అంత వృక్షసంపదతో పచ్చదనం మళ్లీ కావాలంటే కనీసం వందేళ్లైనా పట్టొచ్చు. ఇది మనుషుల్ని చంపడం కంటే పెద్ద నేరం. ఇలాంటి చర్యలను చూస్తూ ఊరుకోలేం. కాలుష్య ప్రభావం రాబోయే తరాల మీద పడకుండా చూడాలంటే చెట్లు అవసరం.వాటిని పరిరక్షించడం మన అందరి బాధ్యత అని అభిప్రాయపడింది. ఇక.. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ కోర్టుకు ఓ నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగానే కోర్టు చెట్టుకు లక్ష చొప్పున .. రూ.4 కోట్ల 54 లక్షల జరిమానా కట్టాలని ఆదేశించింది. అయితే.. అగర్వాల్ తరఫున వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గీ.. తన క్లయింట్ తప్పును ఒప్పుకుని క్షమాపణలు చెప్పాడని, అందుకు సంబంధించి అఫిడవిట్ కూడా కోర్టుకు సమర్పించామని తెలియజేశారు. అయినప్పటికీ జరిమానా విషయంలో ధర్మాసనం అస్సలు తగ్గలేదు.మరోవైపు సమీపంలోని స్థలంలో తోటలు వేసుకునేందుకు అగర్వాల్ అనుమతి కోరగా.. అతనిపై దాఖలైన ధిక్కార పిటిషన్‌ను విచారణ తర్వాతే ఆ అంశంపై నిర్ణయం ప్రకటిస్తామని తెలిపింది. ఈ సందర్భంగా.. జోన్‌లోని అటవీయేతర, ప్రైవేట్ భూములలోని చెట్లను నరికివేయడానికి ముందస్తు అనుమతి పొందాలనే నిబంధనను తొలగిస్తూ 2019లో ఇచ్చిన ఉత్తర్వులను కూడా సుప్రీంకోర్టు గుర్తుచేసుకుంది.తాజ్ ట్రాపిజెమ్ జోన్‌ను కేంద్రం 1986లో పర్యావరణ పరిరక్షణ చట్టం కింద ఏర్పాటు చేసింది. కాలుష్య కోరల్లోంచి తాజ్ మహల్‌తో పాటు ఇతర వారసత్వ సంపదలను పరిరక్షించే ఉద్దేశంతో ఈ జోన్‌ను తీసుకొచ్చారు. మొత్తం 10,400 స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతం ఇది. ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్‌లో కొంత భాగం కూడా ఉంది. అత్యంత సున్నిత ప్రాంతంగా పేరున్న టీటీజెడ్ పర్యవేక్షణ కోసం ప్రత్యేక కాలుష్య నియంత్రణ మండలి కూడా ఉంది. అయితే..2019లో సుప్రీం కోర్టు టీటీజెడ్‌లో చెట్లను తొలగించడం కోసం ముందస్తు అనుమతి తీసుకోవాలన్న నిబంధనను ఎత్తేసింది. వ్యవసాయ, పశుపోషణ సంబంధిత కార్యకలాపాల కోసం చెట్లను తొలగిండచంలో తప్పేమీ లేదని అభిప్రాయపడింది. అయితే తర్వాతి రోజుల్లో ఆ ఉత్తర్వులను సమీక్షించిన సర్వోన్నత న్యాయస్థానం 2019 నాటి ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు స్పష్టం చేసింది. -
వార్షికోత్సవం చేసుకుంటున్నారా?: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఫిరాయింపులపై చర్యలు తీసుకునేందుకు ఇంకెంత సమయం కావాలి? ఎమ్మెల్యేల పదవీకాలం పూర్తి అయ్యేవరకు వేచి చూడటం రీజనబుల్ టైం (తగిన సమయం) అవుతుందా? న్యాయపరంగా చర్యలు తీసుకోవడానికి ఒక గడువు అనేది ఉండాలి కదా? పార్టీ ఫిరాయింపులపై మొదటి ఫిర్యాదు అందినప్పటి నుంచి ఇప్పటివరకు ఎంత సమయం అవుతోంది? ఏడాది అవుతోందని వార్షికోత్సవం జరుపుకుంటున్నారా?..’ అంటూ స్పీకర్ కార్యాలయాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మీరు అడిగే సమయానికి ఒక నిర్దేశిత గడువు అనేది ఉండదా? అని ప్రశ్నిస్తూనే.. మరోపక్క ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వొచ్చా లేదా? అనే అంశంపై మాత్రమే తాము వాదనలు వింటున్నట్లు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేసింది. అదేరోజు స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శుల వాదనలను వింటామని తెలిపింది. బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్లపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద్ల పేర్లతో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ).. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాందీలపై బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావు, తదితరులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జి మైస్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. స్పీకర్ కార్యాలయం తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మనుసింఘ్వీ, ముకుల్ రోహత్గిలు హాజరయ్యారు. ఎస్ఎల్పీపై సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరం, రిట్ పిటిషన్‌పై దామ శేషాద్రినాయుడు, పి.మోహిత్‌రావు వాదనలు వినిపించారు. ఆ తీర్పుల ఆధారంగా చర్యలకు అవకాశం: ఆర్యమా సుందరం పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందిగా గతేడాది మార్చి 15న తొలిసారి స్పీకర్‌కు తాము ఫిర్యాదు చేశామని ఆర్యమా సుందరం ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆ తర్వాత ఏప్రిల్‌లో ఫిరాయింపులపై తొలిసారి కోర్టును ఆశ్రయించామని, జూన్‌లో రిట్ పిటిషన్ వేశామని చెప్పారు. దానం నాగేందర్ కాంగ్రెస్ బీ ఫామ్‌పై ఎంపీ ఎన్నికలకు పోటీ చేశారని, మరో ఎమ్మెల్యే తన కుమార్తె కోసం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని ప్రచారం చేశారని, తెల్లం వెంకట్రావ్ సైతం పార్టీ ఫిరాయించారని పేర్కొన్నారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై వేర్వేరుగా ఫిర్యాదు చేసినా స్పీకర్ స్పందించలేదని, కనీసం నోటీసులు ఇవ్వలేదని వివరించారు. దీనిపై రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా ఈ వ్యవహారంపై విచారణ సమయాన్ని ఖరారు చేయాలన్న సింగిల్ బెంచ్ నాలుగు వారాలు గడువు ఇచ్చిందని గుర్తు చేశారు. దీనిపై స్పీకర్ కార్యాలయం అప్పీల్ కు వెళ్లగా.. స్పీకర్‌కు తగినంత సమయం ఇవ్వాలన్న గ్రౌండ్స్‌పై ఈ ఉత్తర్వులను డివిజన్ బెంచ్ పక్కన పెట్టిందని తెలిపారు. కానీ ఇప్పటివరకు ఆ తగినంత సమయం అంటే ఎంతో చెప్పలేదన్నారు. స్పీకర్ తీసుకోవాల్సిన సమయంపై సుభాష్ దేశాయ్, కేశం మేఘాచంద్, రాజేంద్ర సింగ్ రాణా కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందన్నారు. ఈ తీర్పుల ఆధారంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉందని విన్నవించారు. స్పీకర్ రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉండాలి సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాతే.. ఈ ఏడాది ఫిబ్రవరి 13న మూడు వారాల్లో రిప్లై ఇవ్వాలని స్పీకర్‌కు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చిందని ఆర్యమా సుందరం గుర్తు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ గవాయి జోక్యం చేసుకున్నారు. ‘ఇప్పటికి ఏడాది అంటే...పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయ్యిందా? వార్షికోత్సం జరుపుకుంటున్నారా?’ అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. కేసు విషయంలో డిలే ట్యాక్టిక్స్ (ఆలస్యం చేసే చిట్కాలు) ఉపయోగించొద్దని అన్నారు. సుందరం తన వాదనలు కొనసాగిస్తూ.. ‘స్పీకర్ క్వాషి జ్యుడీషియరీ అధికారాలతో ఉన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉండాలి. రాజ్యాంగం కల్పించిన హక్కులు, అధికారాలను పరిరక్షించాల్సిన బాధ్యత స్పీకర్‌పై కూడా ఉంది. ఒకవేళ అది జరగడం లేదు అని భావిస్తే హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి కూడా రాజ్యాంగం అవకాశం కల్పించింది. స్పీకర్ క్వాషి జ్యుడీషియరీ అధికారాలతో ఒక ట్రిబ్యునల్‌గా వ్యవహరించాలి. స్పీకర్ అధికారాల్లోకి వెళ్లాలని, ఆయన విధుల్లో జోక్యం చేసుకోవాలని కోరడం లేదు కానీ, రాజ్యాంగ విధులు నిర్వర్తించాలని మాత్రమే మేము కోరుతున్నాం’ అని అన్నారు. ఆ ధర్మాసనాలు స్పష్టంగా చెప్పలేదు: జస్టిస్ గవాయి గతంలో ఇలాంటి కేసులు విచారించిన రాజ్యాంగ ధర్మాసనాలు స్పీకర్‌కు సమయంపై స్పష్టత ఇవ్వలేదని, ఉన్నత ధర్మాసనాల తీర్పులను తాము తిరిగి ఎలా రాయగలమని జస్టిస్ గవాయి వ్యాఖ్యానించారు. దీంతో ‘తగినంత సమయం’ అనే విషయంలో ఒక్కో కేసులో ఒక్కో విధంగా నిర్ణయాలు జరిగాయని సుందరం చెప్పారు. వారంలోపే హైకోర్టును ఆశ్రయించారు: సింఘ్వీ ఫిరాయింపులపై గతేడాది జూలై మొదటి వారంలో స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తే, 9వ తేదీ నాటికే హైకోర్టులో పిటిషన్ వేశారని సింఘ్వీ చెప్పారు. నారిమన్ కేసులో ఫిర్యాదుకు, పిటిషన్‌కు మధ్య నిర్దిష్ట గడువు ఉండాలని కోర్టు తీర్పునిచ్చిందని చెప్పారు. ఇక్కడ ఫిరాయింపులపై ఫిర్యాదు అందగానే స్పీకర్ స్పందించి నోటీసులు ఇచ్చారని చెబుతుండగా జస్టిస్ గవాయి జోక్యం చేసుకుని.. గత విచారణ సందర్భంగా స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీ, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన విషయం గుర్తు చేశారు. వారిపై చర్యలు తీసుకోండి: బీజేఎల్పీ నేత పిటిషన్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కూడా మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన తరఫు న్యాయవాది మిథున్ శశాంక్ జోక్యం చేసుకుని.. ఫిరాయింపులకు సంబంధించి రాజ్యాంగంలోని అంశాలను ప్రస్తావించబోతుండగా.. జస్టిస్ గవాయి ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ‘తాము ఈ కేసు మెరిట్స్‌లోకి వెళ్లడం లేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చాం. ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంలో స్పీకర్‌కి ఆదేశాలు జారీ చేయవచ్చా లేదా అన్న అంశాన్ని మాత్రమే పరిశీలిస్తున్నాం..’ అని చెప్పారు. కాగా ఈ వ్యవహారంలో తాము వాదనలు వినిపించేందుకు సుదీర్ఘ సమయం కావాలని రోహత్గి కోరారు. ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణ వాయిదా వేసింది. -
జడ్జి ఇంట్లో నోట్ల కట్టల కేసు : జస్టిస్ వర్మ ఇంటికి ‘సుప్రీం’ కమిటీ
ఢిల్లీ: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగిన సందర్భంలో నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నియమించిన ముగ్గురు ప్రధాన న్యాయమూర్తుల కమిటీ ఇవాళ జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటికి వెళ్లింది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో బయపడ్డ నోట్ల కట్టల గురించి దర్యాప్తు చేపట్టనుంది.మార్చి 14న ఢిల్లీలోని జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది. రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం తర్వాత భారీ మొత్తంలో కాలిన నోట్ల కట్టలు వెలుగులోకి వచ్చాయి. దీంతో జస్టిస్ యశ్వంత్ వర్మపై ఆరోపణలు వెల్లువెత్తాయి.#WATCH | Delhi | Three-member Judge committee to probe allegations against Justice Yashwant Varma leaves from his residence pic.twitter.com/A3Fw8N12X9— ANI (@ANI) March 25, 2025 ఇదే అంశంపై విచారణ చేపట్టాలని సుప్రీం కోర్టు..పలు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో కమిటీని నియమించింది. ఆ కమిటీలో పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి షీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీఎస్ సందవాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి అను శివరామన్‌లను సభ్యులుగా చేర్చింది. కాలిన నోట్ల కట్టల విలువ రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా అంటూ పలు రిపోర్టులు వెలుగులోకి వచ్చింది. దీంతో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, మరో నలుగురు సీనియర్ న్యాయమూర్తుల కొలీజియం జస్టిస్ యశ్వంత్ వర్మను ఢిల్లీ హైకోర్టు నుంచి అల్హదాబాద్ హైకోర్టుకు ట్రాన్స్ఫర్ చేసింది.నోట్ల కట్టల విషయంలో స్పష్టత వచ్చే వరకు న్యాయపరమైన పనులు కేటాయించవద్దని సుప్రీం కోర్టు.. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర ఉపాధ్యాయకు ఆదేశాలు జారీ చేసింది. -
అదృష్టవశాత్తూ ఎమ్మెల్యేలు 4 ఏళ్లు ఆగలేదు: సుప్రీం కోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లపై సుప్రీం కోర్టు(Supreme Court)లో మంగళవారం విచారణ జరిగింది. ఈ క్రమంలో పార్టీ ఫిరాయింపులపై సర్వోన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆయారాం, గయారాంలను నిరోధించేందుకే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ఉందని, అలాంటప్పుడు ఫిరాయింపులపై ఏ నిర్ణయం అనేది తీసుకోకపోతే ఆ షెడ్యూల్‌ను అపహాస్యం చేయడం కిందకే వస్తుందని స్పష్టం చేసింది.కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించారని.. ఆ 10 మందిపై అనర్హత వేటు విషయంలో తెలంగాణ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని, కాబట్టి అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్(BRS) తరఫున ఈ జనవరిలో వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయ్, ఆగస్టీన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం వాదనలు వింటోంది. మంగళవారం వాదనలు మొదలవ్వగానే.. అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ సంగతిని స్పీకర్ తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలు ప్రస్తావించారు. ఈ వ్యవహారంలో స్పీకర్‌ను ఆదేశించే అధికారం న్యాయస్థానానికి ఉంటుందా? లేదంటే రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలా? అని కోరారు. బీఆర్ఎస్ తరఫున న్యాయవాది ఆర్యమా సుందరం వాదనలు వినిపిస్తూ.. ‘‘ఫిర్యాదులపై ఏం చేస్తారో.. 4 వారాల్లో షెడ్యూల్ చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయినా పార్టీ మారిన వారికి స్పీకర్ నోటీసులు ఇవ్వలేదు. ధర్మాసనం కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాతే నోటీసు ఇచ్చారు. 3 వారాల్లో రిప్లై ఇవ్వాలని.. ఫిబ్రవరి 13న స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఇప్పటికి 3 వారాలైంది.. నోటీసులు ఎటు వెళ్లాయో తెలియదు. మేము ఫిర్యాదు చేసి ఏడాదైనా స్పీకర్ షెడ్యూల్ కూడా చేయలేదు’’ అని సుందరం వాదించారు. బీఆర్ఎస్ వాదనలు.. కీ పాయింట్స్ 2024 మార్చి 18న మొదట ఫిరాయింపులపై శాసనసభ స్పీకర్ ఫిర్యాదు చేశాంమొదటి ఫిర్యాదు చేసినా నోటీసులు ఇవ్వలేదుహైకోర్టుకు వెళ్లేంత వరకు కూడా నోటీసులు ఇవ్వలేదురీజనబుల్ టైంలోనే చర్యలు తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ చెప్పిందిహైకోర్టు చెప్పినా ఎలాంటి చర్యలు లేవుదానం నాగేందర్‌పై ఫిర్యాదు చేసినా.. ఆయనకు నోటీసులు ఇవ్వలేదుదానం ఎంపీగా పోటీ చేసినా చర్యల్లేవ్‌కడియంకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నా.. చర్యలు లేవ్‌అనర్హత పిటిషన్ విచారణపై షెడ్యూల్ చేయాలని.. హైకోర్టు నాలుగు వారాల గడువు ఇచ్చిందిస్పీకర్ 7 రోజుల సమయం ఇస్తూ నోటీసులు ఇచ్చారుముగ్గురు ఎమ్మెల్యేలు ఒకేరకంగా సమాధానం ఇచ్చారుపార్టీ మారినవాళ్లు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారుముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు ప్రచారం చేశారునోటీసులు ఇచ్చామని స్పీకర్ అంటున్నారు.. కానీ, ఆ కాపీలు మాకు అందజేయలేదుస్పీకర్ అధికారాలు సైతం న్యాయసమీక్ష పరిధిలోనే ఉంటాయిన్యాయ సమీక్షకు స్పీకర్ అతీతులు కాదుఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయంపై నిర్దిష్టమైన గడువు విధించాలినాలుగు వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలిఈక్రమంలో స్పందించిన జస్టిస్ గవాయ్.. పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయిందా? అని వ్యాఖ్యానించారు. అయితే ఇలాంటి వ్యవహారాల్లో గతంలో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పులు ఉన్నప్పటికీ.. ఎప్పటిలోగా తేల్చాలనే విషయంపైనే స్పష్టత కొరవడిందని జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాంటప్పుడు ఆ తీర్పును కాదని ఎలా ముందుకు వెళ్లగలమని చెప్పింది. ఉన్నత ధర్మాసనాల తీర్పులను ఎలా తిరిగి రాయగలమని ప్రశ్నించింది.ధర్మాసనం ఇంకా ఏమందంటే..ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడానికి ఇంకా ఎంత కాలం పడుతుంది?: ధర్మాసనంఆలస్యం చేసే ఎత్తుగడలు అనుసరించొద్దుఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఫిర్యాదు వచ్చి ఎంతకాలమైంది?రీజనబుల్ టైం అంటే గడువు ముగిసేవరకా?మొదటి ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంత టైం గడిచింది.నాలుగు వారాలైనా షెడ్యూల్ ఫిక్స్ చేయలేదా?అదృష్టవశాత్తూ.. ఎమ్మెల్యేలు 4 ఏళ్లు ఆగలేదుమూడు వారాల సమయం విషయంలో మాత్రం స్పీకర్ రీజనబుల్‌గా ఉన్నారుతెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పులో డివిజన్ బెంచ్ జోక్యం సరైందో కాదో చూస్తాం?కౌంటర్ దాఖలుకు ప్రతివాదులు మరింత సమయం కోరగా.. కాలయాపన చేసే విధానాలు మానుకోవాలి బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ బీఆర్ఎస్ తరఫున వాదనలు ముగియడంతో తదుపరి విచారణను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేసింది. ఆరోజు స్పీకర్ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించనున్నారు. మరోవైపు.. స్పీకర్ తరఫున సోమవారం(మార్చి 24వ తేదీన) అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన కౌంటర్లో.. ‘‘రీజనబుల్ టైం అంటే గరిష్టంగా మూడు నెలలే అని అర్థం కాదు. ఒక్కో కేసు విచారణకు ఒక్కో రకమైన సమయం అవసరం. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చాం. కానీ, స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వెంటనే కోర్టుకు వెళ్లారు. స్పీకర్ ఈ అంశంపై నిర్ణయం తీసుకున్న తర్వాతే.. న్యాయపరమైన పరిష్కారం కోసం ప్రయత్నించాలి. అప్పటిదాకా న్యాయస్థానాల జోక్యం కుదరదు. .. అనర్హత పిటిషన్ లను విచారించి నిర్ణయం తీసుకునే అధికారం కేవలం స్పీకర్ కే ఉంది. గత సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఇదే అంశాన్ని చెబుతున్నాయి. స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వెంటనే....పిటీషనర్లే దురుద్దేశపూర్వకంగా కోర్టును ఆశ్రయించారు. ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదన్నది సరికాదని.. చట్ట ప్రకారమే నడుచుకుంటున్నామని.. కాబట్టి ఈ పిటిషన్లను డిస్మిస్ చేయాలి’’ అని కోరారు. 👉కారు గుర్తుపై గెలిచి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు చేపట్టేలా స్పీకర్‌కు ఆదేశాలివ్వాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ(BRS Party) జనవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్లపై స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు అయ్యింది. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీలపై రిట్ పిటిషన్ దాఖలైంది. వీటిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపింది సుప్రీం కోర్టు(Supreme Court). కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నేతలు ఈ పిటిషన్లు వేశారు. అయితే.. 👉ఈ పిటిషన్లకు సంబంధించి.. కొద్దిరోజుల క్రితం మహిపాల్‌రెడ్డి, తాజాగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సుప్రీం కోర్టులో అఫిడవిట్లు దాఖలు చేశారు. తాము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని, పార్టీ ఫిరాయింపు ఆరోపణల్లో వాస్తవం లేదని అందులో పేర్కొన్నారు. కేవలం ఎమ్మెల్యే హోదాలోనే సీఎంను కలిశామని తెలిపారు. అందువల్ల తమపై దాఖలైన కేసులను కొట్టివేయాలని అభ్యర్థించారు. బీఆర్ఎస్కు తాము రాజీనామా చేయలేదని.. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ చేరలేదని.. మీడియాలో వచ్చిన వార్తలలో నిజం లేదని.. కాబట్టి ఈ అనర్హత పిటీషన్లకు విచారణ అర్హత లేదని వాటిల్లో పేర్కొన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఉన్న ఫొటోలు, పోస్టర్లను, తమ ఫొటోలతో కూడిన పార్టీ ఫ్లెక్సీల ఫొటోలనూ అఫిడవిట్లో జత చేశారు. ఇప్పటికే ఈ కేసు విచారణలో సర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది. గతంలో తెలంగాణ స్పీకర్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తగినంత సమయం అంటే ఎంతో చెప్పాలని కోరింది. గత విచారణలో.. ఆపరేషన్ సక్సెస్ , పేషంట్ డెడ్ అనే తీరు సరికాదన్న పేర్కొంది. -
నోటీసిచ్చి.. 24 గంటల్లో కూల్చేస్తారా?
న్యూఢిల్లీ: ఇంటిని కూల్చేస్తామంటూ నోటీసు ఇచ్చి 24 గంటల్లోపే బుల్డోజర్తో ఇంటిని కూల్చేస్తున్న ఘటనలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు (Supreme Court) మరోసారి మండిపడింది. నిబంధనలను పాటిస్తూనే ఇళ్ల కూలి్చవేత ప్రక్రియను యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కొనసాగిస్తోందని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి చేసిన వాదనలను జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాల సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుబట్టింది. 2023లో పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోయిన గ్యాంగ్‌స్టర్ పొలిటీషియన్ అతీఖ్ అహ్మద్‌కు చెందినదిగా భావిస్తున్న ప్రయాగ్‌రాజ్ నగరంలోని భవనాలను అధికారులు కూల్చేశారు(Prayagraj Demolitions). దీనిపై జులి్ఫకర్ హైదర్ అనే న్యాయవాది, ప్రొఫెసర్ అలీ అహ్మద్, ఇద్దరు వితంతువులు, మరో వ్యక్తి అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. గ్యాంగ్స్టర్విగా భావించి మా ఇళ్లను కూల్చేశారని బాధితులు కేసు వేశారు. అయితే ఈ కేసును అలహాబాద్ హైకోర్టు కొట్టేయడంతో వాళ్లంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ‘‘ఇళ్లను నిర్దయగా కూల్చేయడం చూస్తుంటే మాకే షాకింగ్‌గా ఉంది. కూలి్చవేతకు అనుసరించిన విధానం సైతం షాకింగ్‌కు గురిచేస్తోంది. మార్చి ఆరో తేదీ రాత్రి నోటీసులు ఇచ్చి మరుసటి రోజే కూల్చేస్తారా?. ఇలాంటి పద్ధతిని న్యాయస్థానాలు ఏమాత్రం అంగీకరించవు. ఒక్క కేసులో వీటిని పట్టించుకోకుండా ఉన్నామంటే ఇక ఇదే కూలి్చవేతల ధోరణి కొనసాగుతుంది. నోటీసులు అందుకున్నాక బాధితులు వాటిపై అప్పీల్ చేసుకునే అవకాశం కూడా అధికారులు ఇవ్వలేదు. 24 గంటల్లోపు భవనాలను కూల్చేశారు. ఈ కేసులో తిరిగి ఇంటిని నిర్మించుకుంటామని బాధితులు కోరితే అందుకు మేం అనుమతిస్తాం. అయితే కేసు తుదితీర్పు వాళ్లకు వ్యతిరేకంగా వస్తే బాధితులే ఆ కొత్త ఇళ్లను నేలమట్టం చేయాల్సి ఉంటుంది’’అని న్యాయస్థానం వ్యాఖ్యానించడం గమనార్హం. దీనిపై ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్(Attorney General) వాదించారు. ‘‘లీజు గడువు దాటాక అక్రమంగా ఆ నివాసస్థలాల్లో పిటిషనర్లు ఉంటున్నారు. వాస్తవానికి 2020 డిసెంబర్లో తొలిసారి, 2021 జనవరి, మార్చి నెల ఆరో తేదీన నోటీసులు ఇచ్చారు. తర్వాతే కూల్చారు’’అని వాదించారు. దీనిపై జడ్జి అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘‘గతంలో సాధారణ రీతిలో నోటీసులు ఇచ్చారు. చట్టప్రకారం రిజిస్టర్ పోస్ట్‌లో పంపాలి. అలాకాకుండా మామూలుగా పంపేసి, చివరి నోటీసు మాత్రం రిజిస్టర్ పోస్ట్ లో పంపించి వెంటనే కూల్చేస్తారా?’’అని ధర్మాసనం నిలదీసింది. మళ్లీ ఇంటి నిర్మాణాల విషయంలో అఫిడవిట్ సమర్పించేందుకు పిటిషనర్లను అనుమతిస్తూ కేసు విచారణను న్యాయస్థానం వాయిదావేసింది. ‘క్రికెట్’ నినాదాలతో కూల్చేశారు గత నెల ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ ఆట సందర్భంగా భారతవ్యతిరేక నినాదాలు చేశారంటూ ఎఫ్ఐఆర్ నమోదుచేసి తమ ఇల్లు కూల్చారంటూ కితాబుల్లా హమీదుల్లా ఖాన్ వేసిన పిటిషన్‌పై స్పందన తెలపాలని మహారాష్ట్ర సర్కార్‌ను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ల సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం ఆదేశించింది. ఆస్తుల కూలి్చవేతకు సంబంధించి గతేడాది నవంబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని, ఈ అంశంలో సర్కార్‌పై, మాలాŠవ్న్ మున్సిపల్ కౌన్సిల్ అడ్మినిస్ట్రేటర్లపై ఉల్లంఘన కేసు నమోదుచేయాలని బాధితుడు సుప్రీంకోర్టును కోరాడు. అయితే ఎఫ్ఐఆర్ నమోదుచేసి సింధుదుర్గ్ జిల్లాలో పాతసామాను దుకాణం, ఇల్లు రెండూ అక్రమ నిర్మాణాలని పేర్కొంటూ అధికారులు ఫిబ్ర వరి 24న వాటిని కూల్చేశారు. భారతవ్యతిరేక నినాదాలు చేశాడంటూ తొలుత పిటిషనర్‌తోపాటు అతని 14ఏళ్ల కుమారుడిని అరెస్ట్‌చేసి తర్వాత కుమారుడిని వదిలేశారు. తర్వాత భార్యాభర్తలను అరెస్ట్‌చేసి జైలుకు పంపారు. ఈ సమయంలోనే ఇల్లు, దుకాణం కూల్చేశారు. -
విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు టాస్క్‌ఫోర్స్
న్యూఢిల్లీ: ఐఐటీల వంటి ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటం వంటి ఘటనల నేపథ్యంలో ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానం ప్రధానంగా దృష్టిపెట్టింది. రెండేళ్ల క్రితం ఐఐటీ(ఢిల్లీ)లో విద్యనభ్యసిస్తూ ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు విద్యార్థుల విషయంలో ఎఫ్ఐఆర్లు నమోదుచేయాలంటూ సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్‌ల ధర్మాసనం సోమవారం ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ఆత్మహత్యల అంశంలో దర్యాప్తు చేయాలని సూచిస్తూ పలు వ్యాఖ్యలు చేసింది. ‘‘ వేర్వేరు ఉన్నతవిద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు కలచివేస్తున్నాయి. విద్యార్థులు తనవు చాలిస్తూ తమ జీవితాలను అర్థంతరంగా ముగిస్తున్న ఉదంతాలకు చరమగీతం పాడాల్సిందే. విద్యార్థులు ఆత్మహ త్యలు చేసుకోకుండా నివారించే సమగ్ర, విస్తృతస్థాయి, స్పందనా వ్యవస్థలను బలోపేతం చేయాలి. ప్రైవేట్ కాలేజీలు సహా ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిస్థితిని పట్టించుకునే చట్టపరమైన, సంస్థాగతమైన వ్యవస్థ సమర్థంగా లేదు. ఒకవేళ ఉన్నా అందులో అసమానతలు ఎక్కువయ్యాయి. విద్యార్థులు తీవ్రమైన నిర్ణయాలు తీసుకోకుండా నివారించే నివారణ వ్యవస్థ కావాలి. అందుకే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్.రవీంద్రభట్ సారథ్యంలో నేషనల్ టాస్క్‌ఫోర్స్ (ఎన్టీఎఫ్)ను ఏర్పాటుచేస్తున్నాం. ఇందులో రాష్ట్రాల ఉన్నతవిద్య, సామాజిక న్యాయం, సాధికారత, న్యాయ, మహిళ, చిన్నారుల అభివృద్ధి మంత్రిత్వ శాఖల కార్యదర్శులు ఎక్స్అఫీషియో సభ్యులుగా కొనసాగుతారు. ఆత్మహత్యలకు దారితీస్తున్న కారణాల గుర్తింపు, ఆత్మహత్యల నివారణకు సంబంధించి నియమనిబంధనల పటిష్ట అమలుపై ఎన్టీఎఫ్ ఒక సమగ్ర నివేదికను రూపొందించనుంది. ఈ నివేదిక తుది రూపు కోసం ఎన్టీఎఫ్ దేశంలోని ఎలాంటి ఉన్నత విద్యాసంస్థలోనైనా ఆకస్మిక తనిఖీలు చేస్తుంది. ప్రస్తుత నిబంధనలకు తోడు అదనపు సిఫార్సులు చేసే అధికారమూ ఎన్‌టీఎఫ్‌కు ఉంది’’అని సుప్రీంకోర్టు పేర్కొంది.4 నెలల్లో మధ్యంతర నివేదికఎన్టీఎఫ్ తమ మధ్యంతర నివేదికను నాలుగు నెలల్లోపు సమర్పించాల్సి ఉంటుంది. 8 నెలల్లోపు సమగ్ర నివేదికను సమర్పించాలి. 2023లో ఢిల్లీ ఐఐటీలో ఇద్దరు విద్యార్థులు మరణిస్తే ఎఫ్ఐఆర్ నమోదుకు ఢిల్లీ హైకోర్టు గతేదాడి జనవరిలో నిరాకరించిన నేపథ్యంలో ఆ విద్యార్థుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టు ఆదేశించడంతో తాజాగా సుప్రీంకోర్టు పై విధంగా స్పందించింది. 2018 నుంచి 2023 ఏడాది వరకు ఉన్నతవిద్యాసంస్థల్లో 98 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు రాజ్యసభలో కేంద్ర విద్యాశాఖ సహాయక మంత్రి 2023లో ప్రకటించడం తెల్సిందే. ఈకాలంలో ఐఐటీల్లో 39, ఎన్ఐటీల్లో 25, కేంద్రీయ వర్సిటీల్లో 25, ఐఐఎంలలో నలుగురు, ఐఐఎస్ఈఆర్లలో ముగ్గురు, ఐఐఐటీల్లో ఇద్దరు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. -
ఇంతకూ ఆ కరెన్సీ ఎక్కడ?
దేశంలో అవినీతి సర్వాంతర్యామి అని, ఏ వ్యవస్థా అందుకు అతీతం కాదని గ్రహించినవారిని సైతం దిగ్భ్రాంతిపరిచేలా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో జరిగిన అగ్ని ప్రమాదం ఉదంతం రకరకాల మలుపులు తిరుగుతోంది. ఆ ఘటనలో భారీ మొత్తంలో కాలిన కరెన్సీ నోట్ల కట్టలున్న సంచులు బయటపడ్డాయని గుప్పుమంది. సుప్రీంకోర్టు వెబ్సైట్లో సైతం అందుకు సంబంధించిన వీడియో ఉంది. కానీ నోట్ల కట్టల సంగతి అబద్ధమని, కుట్రపూరితమని అంటున్నారు న్యాయమూర్తి. పైగా తానుంటున్న నివాసానికి విడిగా, అందరూ వచ్చిపోగలిగేలా ఉండే ఆ స్టోర్ రూమ్‌కు తాళం కూడా ఉండదని, అలాంటిచోట అంత డబ్బు ఎవరైనా దాస్తారా అన్నది ఆయన ప్రశ్న. కానీ, సామాన్యుల్లో తలెత్తుతున్న ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయి. ఆయ నొక్కరే కాదు... బాధ్యతాయుత స్థానాల్లోవున్న చాలామంది సంజాయిషీ ఇవ్వకతప్పని ప్రశ్నలవి. ఈ నెల 14 అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగితే 21వ తేదీన మీడియా బయటపెట్టేవరకూ అధికారికంగా ఎందుకు వెల్లడించలేదు? న్యాయవ్యవస్థ, పోలీస్, అగ్నిమాపక విభాగాలు మౌనంగా ఎందుకు ఉండిపోయాయి? న్యాయమూర్తిపై అంతర్గత విచారణ నిర్వహిస్తున్నామని ఈ ఉదంతం వెల్లడైన వెంటనే సుప్రీంకోర్టు తెలిపింది. కానీ ఆయన విధులకు దూరంగా వుంటారని ఆ మర్నాడు ప్రకటించింది. బదిలీ చేశామని తాజాగా చెబుతోంది. మంచిదే. కానీ ఘటన తర్వాత వారంపాటు ఆయన విధులు ఎలా నిర్వర్తించగలిగారు? స్టోర్‌రూమ్‌కు తాళం లేదని జస్టిస్ వర్మ చెబుతున్నారు. ఘటన సంగతి తెలిశాక తానిచ్చిన ఆదేశాలతో అక్కడికెళ్లిన హైకోర్టు రిజిస్ట్రార్ సైతం ఆ మాటే అన్నారని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ అంటున్నారు. మరి తాళంవున్న గదిలోనే మంటలు రేగాయని పోలీసులు ఎలా చెబుతున్నారు? అసలు అగ్నిమాపక విభాగం తనకున్న నిబంధనల మేరకు నిర్వహించాల్సిన పంచనామా పూర్తిచేసిందా? అక్కడ గుర్తించదగిన లేదా సగం కాలిన సరుకు గురించిన వివరాలు నమోదు చేసిందా? ఇద్దరు సాక్షులతో ఆ పంచ నామాపై సంతకం చేయించిందా? మంటలు ఆర్పిన సందర్భంలో తమకు నోట్ల కట్టలున్న సంచు లేమీ కనబడలేదని ఢిల్లీ అగ్నిమాపక విభాగం చీఫ్ అతుల్ గార్గ్ శనివారం చెప్పారు. అలాంటి ప్రకటనేమీ తానీయలేదని ఆ మర్నాడు ఖండించారు. మళ్లీ గొంతు సవరించుకుని కరెన్సీ నోట్లు దొరకలేదని ఇప్పుడంటున్నారు. సుప్రీంకోర్టు వెబ్సైట్లో పెట్టిన వీడియోలో కాలిపోయిన, సగంకాలిన నోట్లు స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ ఆశ్చర్యకరంగా ఇప్పుడా నోట్లు మాయమ య్యాయి. పోలీస్ కమిషనర్ సైతం తన ప్రెస్‌నోట్‌లో పనికిరాని స్టేషనరీ సామాను కాలిపోయిందని తెలియజేశారు తప్ప కరెన్సీ నోట్ల సంగతి ప్రస్తావించలేదు. 14వ తేదీ రాత్రి జరిగిన ప్రమాదంలో కాలిబూడిదైన సామానంతా ఆ మర్నాడు ఉదయం అక్కడి నుంచి తొలగించారు. ఈ పనంతా చేసిందెవరన్న ప్రశ్నకు సమాధానం లేదు. న్యాయమూర్తితోపాటు అగ్నిమాపక విభాగం, పోలీసులు కరెన్సీ లేదని చెబుతుండగా, ఆ నివాసానికి సమీపంలోనే పారిశుద్ధ్య సిబ్బందికి ఒకటి రెండు కాలిన నోట్లు కంటబడ్డాయి. అంటే... ఇందులో నిగూఢంగా ఏదో జరుగుతున్నట్టే కదా!ఈ ఉదంతంలో పారదర్శకంగా వ్యవహరించటానికి సర్వోన్నత న్యాయస్థానం ప్రయత్నించటం అసాధారణమైంది, అభినందించదగ్గది కూడా. మంటల్లో బుగ్గి అయిన కరెన్సీ నోట్ల వీడియోనూ, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన ప్రాథమిక నివేదికనూ తన వెబ్ సైట్లో ఉంచింది. గతంలో న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలు వచ్చిన సందర్భాలున్నా ఎన్నడూ ఇలా జరగ లేదు. అంతేగాక పంజాబ్, హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శీల్ నాగూ, హిమా చల్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సంథావాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనూ శివరామ న్లతో ఈ వ్యవహారంపై విచారణకు సుప్రీంకోర్టు ఒక కమిటీని కూడా ఏర్పాటుచేసింది. అయితే అంతమాత్రాన అంతా సక్రమంగా సాగుతోందని భావించనక్కరలేదు. కాలిబుగ్గయిన కరెన్సీ నోట్ల సంచులు మాయమవటం, ఎవరూ నోట్ల సంగతి ధ్రువీకరించకపోవటం సందేహాలకు తావిస్తోంది. రాజ్యానికి సంబంధించిన మూడు ప్రధాన అంగాల్లో ఒక్క న్యాయవ్యవస్థకు మాత్రమే ఆ మూడింటి పరిధులనూ నిర్ణయించగల గొప్ప అధికారాన్ని రాజ్యాంగం ఇచ్చింది. కానీ ఆ బరువు బాధ్యతలకు తగ్గట్టుగా న్యాయవ్యవస్థ జవాబుదారీతనంతో ఉంటున్నదా? గత అనుభవాలు గమనిస్తే లేదన్న సమాధానమే వస్తుంది. కొలీజియం వ్యవస్థను మార్చాలని నిశ్చయించుకుని ఎన్డీయే సర్కారు బిల్లు తెచ్చినప్పుడు పార్లమెంటులో అనేకులు న్యాయవ్యవస్థ తీరుతెన్నులపై తీవ్ర విమర్శలు చేశారు. ఒకరిద్దరు న్యాయమూర్తులపై అభిశంసన వరకూ వెళ్లింది. కానీ విధాన సంబంధమైన సంక్లిష్టత వల్ల అవి వీగిపోయాయి. కొందరు రాజీనామా చేశారు. మరికొందరిపై చేసిన దర్యాప్తు అతీగతీ లేదు. న్యాయాన్యాయాలను విశ్లేషించి తీర్పులివ్వాల్సిన స్థానంలో ఉన్నందువల్ల న్యాయమూర్తులకు పటిష్ఠమైన రక్షణ కవచం ఉండాల్సిందే. దురుద్దేశంతో, కుయుక్తులతో వారిపై నీలాపనిందలు వేసే ధోరణులను అడ్డుకోవాల్సిందే. కానీ అది అవినీతి మకిలి అంటినవారికి ఆలంబన కారాదు. ఈ రెండింటి మధ్యా సమతౌల్యం సాధించటానికి ఇంతవరకూ ఎలాంటి ప్రయ త్నమూ జరగకపోవటమే సమస్యకు మూలం. ఇప్పుడున్న కొలీజియం బదులు మరొకటి వస్తే అంతా మారిపోతుందనుకోవటానికి లేదు. స్వయంప్రక్షాళనకు నడుంబిగించి జవాబుదారీతనం పెంపొందించే పకడ్బందీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనంతవరకూ ఈ పరిస్థితి మారదు. -
ఎమ్మెల్యేల అనర్హతపై రేపు విచారణ.. సుప్రీంకోర్టు తీర్పుపై టెన్షన్
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఇక, గత విచారణలో ఆపరేషన్ సక్సెస్..పేషంట్ డెడ్ అనే తీరు సరికాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు అనర్హత పిటిషన్ల పెండింగ్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.అలాగే, ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, సెక్రటరీ, ఎన్నికల సంఘం, ప్రభుత్వానికి, హైకోర్టు రిజిస్టార్కు నోటీసులు ఇచ్చింది. మార్చి 25లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే, ఇప్పటి వరకు స్పీకర్, ఎమ్మెల్యేలు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. దీంతో, విచారణపై ఉత్కంఠ నెలకొంది.ఇదిలా ఉండగా.. సుప్రీంకోర్టులో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి అఫిడవిట్లు ఉన్నాయి. ఈ సందర్బంగా అఫిడవిట్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి..‘నేను ఎన్నడూ బీఆర్ఎస్ పార్టీ వీడలేదు. బీఆర్ఎస్కు నేను రాజీనామా చేయలేదు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ చేరలేదు. మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదు. అనర్హత పిటిషన విచారణకు అర్హత లేదు. నాకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను డిస్మిస్ చేయాలని కోరారు. అలాగే, కేటీఆర్ ఉన్న ఫొటోలు, పోస్టర్లను అఫిడవిట్లో జత చేశారు. కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలో తన ఫొటో ఉంచడంపై ఫిర్యాదు కాపీని కూడా జత చేశారు.మరోవైపు.. గూడెం మహిపాల్ రెడ్డి అఫిడవిట్ ఇలా ఉంది. అఫిడవిట్ ప్రకారం.. నేను మర్యాదపూర్వకంగానే సీఎం రేవంత్‌ను కలిశాను. వ్యక్తిగత హోదాలోనే ఆయనను కలిశాను. ఆ మీటింగ్‌కు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదు. నాకు పార్టీ మారే ఆలోచనే లేదు. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు హాజరవుతూనే ఉన్నాను. నేను బీఆర్ఎస్ పార్టీ సభ్యుడిగానే కొనసాగుతున్నాను. ఏ దశలోనూ బీఆర్ఎస్ను వీడలేదు. మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేశారు. నాపై అనర్హత అనే ప్రశ్న తలెత్తదు. నేను స్వచ్ఛందంగా బీఆర్ఎస్ నుంచి తప్పుకున్నట్లుగా నా చర్యలను భావించవద్దు అని తెలిపారు. -
న్యాయ వ్యవస్థపై... నమ్మకం పోతోంది
న్యూఢిల్లీ: దేశ వ్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం తగ్గుతోందంటూ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయమూర్తుల నియామకం వంటి అంశాలు పద్ధతి ప్రకారం జరగడం లేదన్నారు. ఈ వాస్తవాన్ని న్యాయ వ్యవస్థతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించినప్పుడే మెరుగైన ప్రత్యామ్నాయం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా అయిన సిబల్ శనివారం పీటీఐకి ఇచి్చన ఇంటర్వ్యూలో పలు అంశాలపై తన మనోగతాన్ని వెల్లడించారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో భారీగా నగదు దొరికిందన్న వార్తలపై స్పందించేందుకు నిరాకరించారు. ‘‘దీనిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతోంది. ఇలాంటప్పుడు వాస్తవాలు తెలియకుండా మాట్లాడటం బాధ్యతాయుత పౌరుని లక్షణం కాదు’’ అన్నారు. సిబల్ ఇంకా ఏం చెప్పారంటే...ఈసీ ఓ విఫల వ్యవస్థ కేంద్ర ఎన్నికల కమిషన్ ఓ విఫల వ్యవస్థ. రాజ్యాంగ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేని ఈసీపై ప్రజలకు విశ్వాసం లేదు. వారి నమ్మకాన్ని తిరిగి ఎంత త్వరగా పొందగలిగితే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు అంతే అవకాశముంటుంది. ఈవీఎంలతోపాటు ఎన్నికల ప్రక్రియ కలుషితమైందని ప్రతిపక్షాలకు చెప్పాలనుకుంటున్నా. ఈసీ వెలువరించే ఫలితాలు అనేక దశల్లో ఎన్నికల ఫలితాలను తారుమారు చేశాక విడుదల చేసేవి అయి ఉండొచ్చు. ఇలాంటి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాలి. విపక్ష ఇండియా కూటమి పార్టీలు కూటమిగా ఒకే అజెండాతో సాగాలి. సైద్ధాంతిక ప్రాతిపదిక, విధానాలు రూపొందించుకోవాలి. కూటమి అభిప్రాయాల వ్యక్తీకరణకు సమర్థుడైన ప్రతినిధి ఉండాలి. అప్పుడే కూటమి ప్రభావం చూపే అవకాశముంటుంది. న్యాయవ్యవస్థలో అవినీతి మూడు రకాలు మన న్యాయవ్యవస్థ పనితీరుపై ఏళ్లుగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అందులో ఒకటి అవినీతి. ఈ అవినీతికి అనేక కోణాలున్నాయి. వీటిలో ఒకటి న్యాయమూర్తి ప్రతిఫలం ఆశించి తీర్పులివ్వడం. రెండోది భయం, స్వార్థం లేకుండా తీర్పులిస్తామన్న ప్రమాణానికి భిన్నంగా తీర్పులివ్వడం. దీనికో ఉదాహరణ చెబుతాను. ప్రస్తుతం జిల్లా కోర్టు, సెషన్స్ కోర్టులు 95 శాతం కేసుల్లో బెయిల్‌ను తిరస్కరిస్తున్నాయి. ఇక్కడే తేడా జరుగుతోంది. బెయిలిస్తే అది వారి కెరీర్‌పై ప్రభావం చూపుతుందని భయపడుతున్నారేమో! మూడో రకం అవినీతి న్యాయమూర్తులు మెజారిటీ సంస్కృతిని బాహాటంగా ఆమోదిస్తుండటం, రాజకీయపరమైన వైఖరిని వ్యక్తం చేస్తుండటం. పశ్చిమ బెంగాల్లో ఓ న్యాయమూర్తి ఒక రాజకీయ పార్టీకి అనుకూల వైఖరిని వ్యక్తపరిచారు. తర్వాత రాజీనామా చేసి అదే పార్టీలో చేరిపోయారు. మరో జడ్జి తాను ఆర్ఎస్ఎస్ మద్దతుదారునంటూ బహిరంగంగానే ప్రకటించేశారు. భారత్‌లో మెజారిటీ సంస్కృతిదే పైచేయిగా ఉండాలని అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ శేఖర్ యాదవ్ వీహెచ్‌పీకి సంబంధించిన కార్యక్రమంలోనే వ్యాఖ్య లు చేశారు. హిందువులు మాత్రమే ఈ దేశాన్ని విశ్వగురువుగా మార్చగలరనడమే గాక మైనారిటీ సమాజాన్ని అవమానించేలా మాట్లాడారు. ఆయనపై జరిపిన రహస్య విచారణ ఫలితం ఏమైందో ఎవరికీ తెలియదు. ఇలాంటి వ్యవహారాలను సరైన గాడిలో పెట్టాలి. ఇలాంటి వివాదాంశాలపై సుప్రీంకోర్టు తక్షణం స్పందించి ఎందుకు పరిష్కరించలేకపోతోందో అర్థం కావడం లేదు!ప్రత్యామ్నాయమే లేదు! అవినీతికి పాల్పడిన న్యాయమూర్తులపై రాజ్యాంగంలోని 124వ అధికరణం కింద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు 50 మందికి మించిన రాజ్యసభ సభ్యుల సంతకాలతో పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రవేశపెడతారు. ఇదంత త్వరగా తెమిలేది కాదు. గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై పెట్టిన తీర్మానం వీగిపోయింది. న్యాయమూర్తులపై రాజ్యాంగ ప్రక్రియ ద్వారా ముందుకు వెళ్లలేనప్పుడు ఇతర ప్రభావవంతమైన ప్రత్యామ్నాయ మార్గాలు లేనే లేవు. ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఈ ప్రశ్న న్యాయవ్యవస్థ తనకు తాను వేసుకోవాలి. ఇక్కడే న్యాయ వ్యవస్థపై నమ్మకం క్షీణిస్తున్నట్టు కనిపిస్తోంది. ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తులను నియమించే కొలీజియం వ్యవస్థపై విమర్శలు పోవాలంటే ప్రభుత్వం, న్యాయవ్యవస్థ కలిసి ప్రత్యామ్నాయం ఆలోచించాలి. కొలీజియం ఆశించినట్టుగా పనిచేయడం లేదని సుప్రీంకోర్టు గ్రహించాలి. కేవలం నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ (ఎన్‌జేఏసీ)తో సమస్య పరిష్కారం కాదని కేంద్రం కూడా అర్థం చేసుకోవాలి. అప్పుడే ఇది సాధ్యం. -
న్యాయవ్యవస్థలో అవినీతికి అడ్డుకట్ట ఎలా?
హోళీ ముందురోజు హోళీ కా దహన్ ఉంటుంది. హోళికా అన్న రాక్షసిని చంపడాన్ని భారత ప్రజలు పండు గగా జరుపు కొంటారు. విష్ణు భక్తుడైన ప్రహ్లాదుని చంపే ప్రయత్నం చేసిన రాక్షసి హోళికా. చెడు మీద మంచి గెలుపునకు ప్రతీకాత్మకంగా హోళీ దహ నాన్ని చూస్తారు.చెడు పెరిగి పోతున్నప్పుడు ప్రకృతి తన చర్యలని చేపడుతుందని అంటూ ఉంటారు. కొన్నిసార్లు ఇది నిజమేనని అనిపిస్తుంది. నిప్పు కూడా ప్రకృతిలో భాగమే. అది ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటి మీద తన ప్రతాపాన్ని ఈ నెల 14వ తేదీన చూపించింది. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటిలో చెలరేగిన మంటల వల్ల ఆయన ఇంట్లో భారీ నగదు ఉన్నట్టుగా పోలీసు, అగ్నిమాపక అధికారులు కను గొన్నారు. ఆ మంటలు దేశంలోని న్యాయ వ్యవస్థని మండించాయి.మంటలు చెలరేగినప్పుడు జస్టిస్ వర్మ ఇంట్లో లేరు. ఆయన కుటుంబ సభ్యులు అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. మంటలు ఆర్పుతున్నప్పుడు ఒక గదిలో లెక్కల్లో చూపని భారీ మొత్తంలో నగదుని అధికారులు కనుగొన్నారు. స్థానిక పోలీసులు ఈ విషయాన్ని సీనియర్ అధికారులకి తెలియజేశారు. ఫలితంగా విషయం సుప్రీంకోర్టు దాకా చేరింది. ఈ అంశాన్ని చర్చించడానికి భారత ప్రధాన న్యాయ మూర్తి సంజీవ్ ఖన్నా అత్యవసరంగా కొలీజియం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జస్టిస్ వర్మను తిరిగి అలహాబాద్‌కు బదిలీ చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఐదుగురు న్యాయమూర్తుల కొలీజియంలోని సభ్యులు ఈ నేరానికి అంత ర్గత విచారణ అవసరమని అభిప్రాయపడినారని వార్తలు. కేవలం బదిలీతో ఆయనను వదిలేస్తే న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకం పూర్తిగా పోతుందని కొంతమంది న్యాయమూర్తులు భావించినారు.న్యాయమూర్తి యశ్వంత్ వర్మ నివాసం నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్న తరువాత సుప్రీంకోర్టు శుక్రవారం అంతర్గత విచారణను ప్రారంభించింది. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ నుంచి కూడా సుప్రీంకోర్టు నివేదికను కోరింది. శుక్రవారం ఉదయం జరిగిన న్యాయమూర్తుల ఫుల్ కోర్టు సమావేశంలో శిక్షాత్మక బదిలీ సరిపోదని, న్యాయమూర్తిపై కొంత నిర్దిష్ట చర్య తీసుకోవాలని అభిప్రాయపడినట్టుగా చెబుతున్నారు. అంతర్గత విచారణకి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అంగీకరిస్తూ బదిలీని మొదటి అడుగుగా భావించినారు. బదిలీ ప్రక్రియ తక్షణమే అమల్లోకి రాదు. దీనికి ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంటుంది. జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణలపై విచారణ కోసం తాజాగా ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన త్రిసభ్య కమిటీని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేశారు.జస్టిస్ వర్మ 1969 జనవరి 6న అలహాబాద్‌లో జన్మించి నారు. 2014 అక్టోబర్ 13న అలహాబాద్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులైనారు. 2016 ఫిబ్రవరి 1న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆ తరువాత 2021 అక్టోబర్ 11న ఢిల్లీ హైకోర్టుకి బదిలీ అయ్యారు. న్యాయ వాద వృత్తిలో ఉన్నప్పుడు జస్టిస్ వర్మ రాజ్యాంగ, కార్మిక పారిశ్రామిక చట్టాలలో ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేశారు. అలహాబాద్ హైకోర్టుకి న్యాయవాదిగా 2006 నుంచి న్యాయమూర్తి అయ్యే వరకు పని చేశారు.హైకోర్టు న్యాయమూర్తిని ఎలా తొలగిస్తారు?న్యాయమూర్తులపై అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆరోపణలను పరిష్కరించడానికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను నిర్దేశించింది. ఈ మార్గదర్శకాల ప్రకారం, న్యాయమూర్తులపై ఫిర్యాదు అందిన తరువాత ప్రధాన న్యాయమూర్తి ఆ సంబంధిత న్యాయమూర్తి నుంచి వివరణ అడుగుతారు. ఆ వివరణకు ప్రధాన న్యాయమూర్తి సంతృప్తి చెందనప్పుడు, లేదా ఆ విషయంపట్ల మరింత దర్యాప్తు అవసర మని భావించినప్పుడు అంతర్గత కమిటీని ఏర్పాటు చేస్తారు.ఆ కమిటీ తన నివేదికను సమర్పించిన తరువాత సంబంధిత న్యాయమూర్తి చేసిన దుష్ప్రవర్తన తీవ్రమైనదని, అతన్ని తొలగించాల్సిన అవసరం ఉందని ప్రధాన న్యాయమూర్తి భావిస్తే రాజీనామా చేయమని ఆ న్యాయమూర్తిని అడుగు తారు. ఆ న్యాయమూర్తి అందుకు నిరాకరిస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(4) ప్రకారం పార్లమెంట్ ద్వారా ఆయన తొలగింపునకు చర్యలు ప్రారంభించాలని ప్రధాన న్యాయమూర్తి ప్రభు త్వానికి లేఖ రాస్తారు.జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసం నుండి లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్న తరువాత సుప్రీంకోర్టు కొలీజియమ్ ఆయన్ని అలహాబాద్‌కి బదిలీ చేయాలని సిఫారస్ చేయాలని వార్తలు వచ్చాయి. ఈ సిఫారస్పై అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘అలహాబాద్ హైకోర్టు చెత్తబుట్ట కాదు. అతణ్ణి ఇక్కడికి పంపించడానికి వీల్లేదు. అవినీతిపరులను మేం అంగీకరించం. అవస రమైతే కోర్టు పనిని మానివేస్తాం’ అని అలహాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ తివారీ అన్నారు. జస్టిస్ వర్మ ఇంటి నుండి 15 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు బార్ అసోసియేషన్ తన ప్రెస్ నోట్లో పేర్కొంది.కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేష్ శుక్రవారం ఉదయం రాజ్యసభలో జస్టిస్ వర్మ అంశాన్ని లేవనెత్తారు. ఈ షాకింగ్ కేసుతో దేశం మేల్కొందని ఆయన అన్నారు. ఈ సంద ర్భాన్ని పురస్కరించుకుని జైరాం రమేష్... ప్రయాగరాజ్‌లో విశ్వహిందూ పరిషత్ కార్యక్రమంలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి శేఖర్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకి వ్యతిరేకంగా గత డిసెంబర్లో 50 మంది పార్లమెంట్ సభ్యులు ఛైర్మన్‌కి పంపిన అభిశంసన నోటీసుని గుర్తు చేశారు. న్యాయమూర్తుల నియామకంలో న్యాయపరమైన జవాబుదారీతనం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వంతో చర్చించాలని ఛైర్మన్‌ని కోరారు.సుప్రీంకోర్టు ఏం చేయాలి?సుప్రీంకోర్టు కోరిన తరువాత కూడా ఆరోపణలు ఎదు ర్కొంటున్న న్యాయమూర్తి రాజీనామా చేయనపుడు, ఇతర హైకోర్టులు బార్ అసోసియేషన్లు అతని బదిలీని అంగీకరించ నప్పుడు సుప్రీంకోర్టు ఏం చేయాలి? ఇదీ ప్రశ్న.అభిశంసన అనేది కార్యరూపం దాల్చ డానికి చాలా సమయం పడుతుంది. అందు కని ఆ న్యాయమూర్తికి ఎలాంటి పని అప్ప గించకుండా చర్యలు తీసుకోవాలి. ఆ అవ మాన భారంతో ఆ న్యాయమూర్తి రాజీ నామా చేసే అవకాశం ఉంది.ఇది ఇలా ఉంటే సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించే అధికారం తమకు ఉందని లోక్‌పాల్ అభిప్రా యపడింది. ఇది చాలా కలవరపెట్టే విషయమని సుప్రీంకోర్టు అభిప్రాయపడి ఆ ఉత్తర్వులని స్టే చేసింది. అది సుప్రీంకోర్టు ముందుకు త్వరలో రానున్నది. సుప్రీంకోర్టు ఏం చేస్తుందో చూడాలి.న్యాయ వ్యవస్థలో అవినీతిని ఎవరూ సహించరు. ఇది చాలా తీవ్రమైన విషయం. న్యాయ వ్యవస్థలోనే కాకుండా సమాజంలో అవినీతి అనేది ఒక పెద్ద సమస్యగా మిగిలిపోయింది. ఈ విషయంపై సుప్రీంకోర్టు తన దృష్టిని సారించా ల్సిన సమయం ఆసన్నమైంది.డా‘‘ మంగారి రాజేందర్ వ్యాసకర్త తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ అకాడమీ మాజీ డైరెక్టర్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు -
వేల కన్నీళ్లను మేం తుడవలేకపోవచ్చు, కానీ.. : సుప్రీం కోర్టు
‘‘ఏ సంస్థను మేం ఇక్కడ నిందించడం లేదు. అలాగే వాటి పని తీరును మేం తప్పుబట్టడం లేదు. దేశంలో వేల మంది కన్నీళ్లు పెడుతున్నారు. అంతమంది కన్నీళ్లను మేం తుడవలేకపోవచ్చు. కానీ, వాళ్ల సమస్యలను మేం ప్రస్తావిస్తాం. కచ్చితంగా సీబీఐ విచారణ జరిపిస్తాం. ఇది మాత్రం స్పష్టం’’ అంటూ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. న్యూఢిల్లీ: బ్యాంకులకు, బిల్డర్లు.. డెవలపర్లు మధ్య నలిగిపోతూ ఏళ్ల తరబడి సొంతింటి కల కోసం ఆశగా ఎదురు చూస్తున్న కొందరు సుప్రీం కోర్టు తలుపు తట్టారు. ఈ పిటిషన్లను ఒక్కటిగా విచారణ జరిపిన జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం.. వాళ్లకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చింది. బిల్డర్లు, డెవలపర్లు తమ చేతికి ఇంటి తాళాలు ఇవ్వకపోయినా.. ఇంకోవైపు నుంచి బ్యాంకులు ఈఎంలు కట్టాలని వేధిస్తున్నాయని పలువురు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో హోంబయ్యర్లను లోన్లకు మాధ్యమంగా ఉపయోగించుకుంటున్నారని.. ఒకవేళ బయ్యర్లు గనుక అభ్యంతరాలు వ్యక్తం చేస్తే బ్యాంకులు వాళ్లపై చర్యలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ తరుణంలో ఈ వ్యవహారంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. కాలపరిమితితో కూడిన సీబీఐ దర్యాప్తునకు కచ్చితంగా ఆదేశిస్తామని తెలిపింది. అలాగే.. ఈ పనిని ఎలా చేపట్టాలనే దానిపై ఒక ప్రణాళికను దాఖలు చేయాలని కేంద్ర దర్యాప్తు సంస్థను కోరింది. ఈ క్రమంలో ఫైనాన్షియర్ల తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీపై జస్టిస్ సూర్యకాంత్ మండిపడ్డారు.బ్యాంకులు ఎలా పనిచేస్తాయో మాకు తెలుసు. సైట్లో ఒక్క ఇటుక కూడా పెట్టలేదని మీకు తెలుసు. అయినా కూడా 60 శాతం పేమెంట్ చేసేశారు. సైట్లో ఏం జరుగుతోందో తెలుసుకోకుండా ఇలా ఏలా చేశారు? అని ప్రశ్నించారు. ఇది ఇది లక్షల మంది జీవితాలకు సంబంధించిన అంశమని, అవసరమైతే మూలాల్లోకి వెళ్లి పరిశీలిస్తామని, సహాయం కోసం అమీకస్ క్యూరీని నియమించుకునే అవకాశాలు కూడా పరిశీలిస్తామని పేర్కొంటూ తదుపురి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. సాధారణంగా కేసులు ఎక్కువగా ఉన్నప్పుడే అమీకస్ క్యూరీని కోర్టు నియమించుకుంటుంది.ఇదిలా ఉంటే.. నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లోని హోంబయ్యర్లకు కిందటి ఏడాది జులైలో తన ఆదేశాల ద్వారా భారీ ఊరట ఇచ్చింది సుప్రీం కోర్టు. ఇంటి తాళాలు అందుకోని యాజమానులపై ఈఎంఐ రికవరీ సహా బలవంతపు చర్యలు ఉండకూడదని స్పష్టం చేసింది. అయితే ఆ దేశాల ఆచరణకు నోచుకోవడం లేదు. పైగా ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్న సందర్భాలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. -
పూజా ఖేద్కర్ కేసు జాప్యం దేనికి?
న్యూఢిల్లీ: మాజీ ఐఏఎస్ శిక్షణా అధికారిణి పూజా ఖేద్కర్‌కు సుప్రీం కోర్టు(Supreme Court)లో మరోసారి ఊరట లభించింది. ఆమెను అరెస్ట్ చేయొద్దంటూ గతంలో జారీ చేసిన ఆదేశాలను మంగళవారం మరోసారి కోర్టు పొడిగించింది. ఈ క్రమంలో.. దర్యాప్తు ఆలస్యంపైనా సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.తనంతట తానుగా విచారణకు సహకరిస్తానని ఆమె చెప్పారు. అయినా కూడా ఇంత ఆలస్యం దేనికి? అంటూ ఢిల్లీ పోలీసులపై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వెల్లగక్కింది. ఈ కేసులో త్వరగతిన దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.2022 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) పరీక్షలో ఫోర్జరీ డాక్యుమెంట్లను సమర్పించారని పూజా ఖేద్కర్‌పై అభియోగాలు నమోదు అయ్యాయి. ఈ కేసుకు సంబంధించి.. విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని పేర్కొంటూ ముందస్తు బెయిల్ కోరుతూ ఆమె తొలుత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే కోర్టు దానిని తిరస్కరించడంతో.. ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయతే ముందస్తు బెయిల్‌పై విచారణ జరుగుతుండగానే.. ఈ ఏడాది జనవరిలో ఆమెను అరెస్ట్ చేయొద్దంటూ సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఆ ఆదేశాలను పొడిగించింది. పూజా ఖేద్కర్(Puja Khedkar) వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేశారు ఢిల్లీ పోలీసుల తరఫు వాదనలు వినిపించిన అదనపు సాలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు. కానీ, పరీక్ష రాసే సమయం నాటికి ఆమెకు కంటి చూపు సరిగా లేదని, ఆమె ఫోర్జరీకి పాల్పడిందన్న అభియోగంలోనూ నిజం లేదని పూజా తరఫు న్యాయవాది వాదించారు. అయితే ఆ వాదనను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని కోర్టు ఆమె లాయర్‌కు తేల్చి చెప్పింది.ఈ పిటిషన్‌పై ఇప్పటివరకు ఇరువైపులా వాదనలు విన్న కోర్టు.. ఫోర్జరీ వ్యవహారంపై విచారణకు ఆమెను కస్టడీలోకి తీసుకునే విచారించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఈ క్రమంలో విచారణ త్వరగతిన పూర్తయ్యేలా చూడాలని ఢిల్లీ పోలీసులను ఆదేశిస్తూ పూజా పిటిషన్ విచారణను ఏప్రిల్ 15కి వాయిదా వేసింది. -
సుప్రీం జడ్జిగా బాగ్చీ ప్రమాణం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమి తులైన కలకత్తా హైకోర్టు సీనియర్ జడ్జి జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సంజీవ్ ఖన్నా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇతర న్యాయమూర్తుల సమక్షంలో సుప్రీంకోర్టు ఆవరణలో ఈ కార్యక్రమం జరిగింది. జస్టిస్ బాగ్చీ అత్యున్నత న్యాయస్థానంలో ఆరేళ్లకు పైగా ఉంటారు. బాగ్చీ ప్రమాణ స్వీకారంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరింది. మరో పోస్టు ఖాళీగా ఉంది. బాగ్చీ 2031 మే 25న సీజేఐగా బాధ్యతలు చేపడతారు. అక్టోబర్ 2న ఆయన పదవీ విరమణ వరకూ కొనసాగుతారు. 1966 అక్టోబర్ 3న జన్మించిన జస్టిస్ బాగ్చీ.. 2011 జూన్27న కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2021 జనవరి 4న ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. అప్పటినుంచి అక్కడే విధులు నిర్వహించారు. 13 ఏళ్లకు పైగా హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన ఆయన ప్రధాన న్యాయమూర్తుల తో సహా హైకోర్టు న్యాయమూర్తుల ఉమ్మడి అఖిల భారత సీనియారిటీలో 11వ స్థానంలో ఉన్నారు. సీజేఐ ఖన్నా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం మార్చి 6న జస్టిస్ బాగ్చీ పేరును సిఫారసు చేసింది. -
ఉద్యోగాల కంటే నిరుద్యోగులు ఎన్నో రెట్లు ఎక్కువ
న్యూఢిల్లీ: దేశంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల కంటే వాటిని ఆశించే నిరుద్యోగులు ఎన్నో రెట్ల ఎక్కువగా ఉన్నారని సుప్రీంకోర్టు వెల్లడించింది. వాస్తవ పరిస్థితి ఇదేనని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో పూర్తి పారదర్శకత పాటించాలని, ఆయా ఉద్యోగాలు కచ్చితంగా అర్హులకే దక్కేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెరగాలంటే ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో అవకతవకలకు చోటు లేకుండా జాగ్రత్త వహించాలని స్పష్టంచేసింది. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలను సంబంధిత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారానే భర్తీ చేయాలని, అక్రమ మార్గాలు అనుసరించకూడదని తేల్చిచెప్పింది. పరీక్షల్లో అక్రమాలను అరికట్టాలని పేర్కొంది. రాజస్తాన్‌లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో నిబంధనలు పాటించకుండా రాజీపడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు వ్యక్తులకు కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. రాజస్తాన్‌లో 2022లో అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) పోస్టుల భర్తీ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో ఓ సెంటర్లో ఒక అభ్యర్థి బదులు మరో అభ్యర్థి(డమ్మీ) హాజరైనట్లు తేలింది. ఇద్దరు అధికారుల ప్రోద్బలంతోనే ఇదంతా జరిగినట్లు విచారణలో గుర్తించారు. ఆ ఇద్దరు అధికారులు రాజస్తాన్ హైకోర్టును ఆశ్రయించడంతో బెయిల్ మంజూరయ్యింది. హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్‌ను సవాలు చేస్తూ రాజస్తాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కింది కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వును తోసిపుచ్చింది. రెండు వారాల్లోగా లొంగిపోవాలని ఈ నెల 7వ తేదీన నిందితులను ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేలాది మంది అభ్యర్థులు పోటీ పడుతుంటారని, వారికి అన్యాయం జరిగేలా ఎవరూ ప్రవర్తించకూడదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. కొందరు స్వలాభం కోసం ఉద్దేశపూర్వకంగా చేసే తప్పులతో ఇతరులు నష్టపోవడానికి వీల్లేదని ఉద్ఘాటించింది. పోటీ పరీక్షల పారదర్శకతను దెబ్బతీయొద్దని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. -
అనుమానాస్పద మరణ వాంగ్మూలంతో... నేర నిర్ధారణ తగదు: సుప్రీం
న్యూఢిల్లీ: అనుమానాస్పద మరణవాంగ్మూలం ఆధారంగా నేర నిర్ధారణ సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇతరత్రా గట్టి సాక్ష్యాధారాలు లేనప్పుడు కేవలం అలాంటి వాంగ్మూలాన్ని ఆధారంగా తీసుకోజాలమని స్పష్టం చేసింది. భార్యకు నిప్పంటించి హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తిని నిరపరాధిగా తేలు స్తూ న్యాయమూర్తులు సుధాన్షు ధూలియా, ఎ.అమానతుల్లా ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. అతనికి దిగువ కోర్టు విధించిన జీవితఖైదును సమర్థిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘మరణ వాంగ్మూలం కీలక సాక్ష్యమన్నది నిస్సందేహం. దాని ఆధారణంగా నేర నిర్ధారణ చేయడమూ సబబే. కానీ ఆ వాంగ్మూలమే అనుమానాస్పదమైన సందర్భాల్లో దాని ఆధారంగా నిందితున్ని దోషిగా నిర్ధారించడం సరికాదు. ప్రస్తుత కేసులో భార్య పరస్పరం పూర్తి విరుద్ధమైన వాంగ్మూలాలిచ్చింది. పైగా వరకట్న వేధింపులు జరగలేదని దర్యాప్తులో స్పష్టంగా తేలింది. ఇలాంటి సందర్భాల్లో కోర్టులు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇతర సాక్ష్యాలనూ పరిగణనలోకి తీసుకున్నాకే నిర్ణయానికి రావాలి’’ అని సూచించింది. -
సుప్రీం జడ్జిగా బాగ్చీ నియామకం
న్యూఢిల్లీ: కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈయన పేరును సుప్రీంకోర్టు జడ్జిగా సిఫార్సుచేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం మార్చి ఆరో తేదీన నిర్ణయించడం తెల్సిందే. జస్టిస్ బాగ్చీని సుప్రీంకోర్టు జడ్జిగా నియమిస్తున్నట్లు న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ తన సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్’లో సోమవారం ఒక పోస్ట్‌చేశారు. 1966 అక్టోబర్ మూడున జన్మించిన ఈయన సుప్రీంకోర్టులో ఆరేళ్లపాటు జడ్జిగా కొనసాగనున్నారు. ఈ కాలంలోనే పదోన్నతి పొంది సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తిగానూ సేవలందించే అవకాశముంది. జస్టిస్ కేవీ విశ్వనాథన్ 2031 మే 25వ తేదీన రిటైర్ అయ్యాక జస్టిస్ బాగ్చీ సీజేఐగా సేవలందించే వీలుంది. ఈయన 2031 అక్టోబర్ రెండోతేదీన పదవీవిరమణ చేస్తారు. హైకోర్టు జడ్జీలు 62 ఏళ్లకు, సుప్రీంకోర్టు జడ్జీలు 65 ఏళ్లకు రిటైరవుతారు. 2011 జూన్ 27వ తేదీన ఈయన కలకత్తా హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. తర్వాత 2021 జనవరి నాలుగోతేదీన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీఅయ్యారు. అదే ఏడాది నవంబర్ 8న తిరిగి కలకత్తా హైకోర్టుకు బదిలీఅయ్యారు. అప్పట్నుంచీ అదే హైకోర్టులో సేవలందిస్తున్నారు. కలకత్తా హైకోర్టులో మొత్తంగా 13 ఏళ్లు పలు రకాల కేసులకు సంబంధించిన కీలక తీర్పులు వెలువర్చారు. సుప్రీంకోర్టులో జడ్జిగా ప్రమాణస్వీకారం చేశాక కోర్టులో జడ్జీల సంఖ్య 33కు పెరుగుతుంది. రాజ్యాంగం నిర్దేశించిన పరిమితి ప్రకారం సుప్రీంకోర్టులో గరిష్టంగా 34 మంది జడ్జీలు ఉండొచ్చు. -
సుపరిపాలనకు దోవ
‘సివిల్ సర్వీసు అధికారికి ఎంత తెలుసనేది కాదు... ఆ అధికారి ఎంత జాగ్రత్తగా విధి నిర్వహణ చేస్తారన్నదే అసలైన పరీక్ష’ అన్నారు ప్రథమ భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. అఖిల భారత సర్వీసుల రూపశిల్పి, దేశ తొలి ఉపప్రధాని సర్దార్ పటేల్ సైతం ఈ అధికారుల గురించి చెప్పిన మాటలు వారి బాధ్యతను గుర్తుచేస్తాయి. సివిల్ సర్వీసులకు ఎంపికైనవారు స్వతంత్రంగా, నిజా యితీగా, నిర్భీతితో వ్యవహరించగలిగితేనే పటిష్టమైన దేశ నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన అభిలషించారు. కానీ ఇప్పటికీ ఆచరణలో సమస్యలు తప్పడం లేదు.ఈమధ్య తమ ముందు కొచ్చిన ఒక పిటిషన్‌పై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఐఏఎస్‌ల తీరుపై కటువుగా వ్యాఖ్యానించింది. ఐఏఎస్‌లు తరచు తాము ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకన్నా అధికులమని భావిస్తారనీ, అది సరికాదనీ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జి మాసిలతో కూడిన ధర్మా సనం తెలిపింది. సివిల్ సర్వీసుల రూపకర్తలు ఇలాంటి అంతరాలను చూడలేదు. విధి నిర్వహణకు సంబంధించినంత వరకూ ఈ సర్వీసుల్లోని వారు దేశాభివృద్ధినీ, భద్రతనూ కాంక్షించి అందుకు అనువైన నిర్ణయాలు తీసుకుంటూ తమ విధులు నిర్వర్తించాలని కోరుకుంది. స్వభావరీత్యా విధి నిర్వహణ భిన్నంగా ఉండొచ్చు. ఇందులో ఎక్కువ, తక్కువ అనే సమస్యే రాకూడదు. సాధారణంగా సివిల్ సర్వీస్ వైపు వచ్చే యువతీయువకులకు సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపైనా, వాటివల్ల కలుగుతున్న అనర్థాలపైనా ఆగ్రహం ఉంటుంది. వాటి పరిష్కారం తమవల్ల సాధ్యమేనన్న విశ్వాసం ఉంటుంది. సంపాదనే ప్రధానమనుకుంటే ఏ బహుళజాతిసంస్థకో మేనేజర్‌గా లేదా సీఈవోగా వెళ్లవచ్చు. సివిల్ సర్వీసుల్లోకన్నా అత్యధిక జీతం, ఇతర సదు పాయాలూ, ఆస్తుల సంపాదన ఉంటాయి. పైగా అక్కడ అధిక శ్రమ, పని ఒత్తిడి ఉండవు. కానీ సివిల్ సర్వీస్‌లు అలా కాదు. ప్రభుత్వంలో ఎక్కడో కిందిస్థాయి అధికారి తీసుకునే పొరపాటు నిర్ణయం ఆ ప్రాంతంలోనో, ఆ జిల్లాలోనో, కొన్ని సందర్భాల్లో రాష్ట్రంలోనో కల్లోలానికి దారి తీయొచ్చు. ప్రభుత్వ పథకాల అమలులో చోటుచేసుకునే చిన్న లోపం కూడా సాధారణ పౌరులను కలవరపరిచి వారు ప్రాణం తీసుకునే ప్రమాదం కూడా ఉండొచ్చు. లేదా అధికారిపై దౌర్జన్యానికి దిగొచ్చు. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవటం, అనుకోని సమస్య ఎదురైతే సమయస్ఫూర్తితో వ్యవహరించటం తప్పనిసరి. అలాగని ఈ అంతరాలు లేవని కాదు. ప్రాధాన్యత క్రమంలో ఐఏఎస్‌లు మొదటి స్థానంలో ఉంటారు. ఆ తర్వాత ఐపీఎస్‌లు వస్తారు. ఇది పాలనా సౌలభ్యం కోసం చేసిన ఏర్పాటు. స్వల్ప వ్యత్యాసంతో ఇద్దరి ప్రారంభ వేతనాలూ... ఆరోగ్యం, ఆవాసం, సెలవులు, ఇతర సదుపాయాలూ ఒకేలావుంటాయి. మొదటి మూడు నాలుగు నెలలు ఉమ్మడిగా శిక్షణనిచ్చినా బాధ్యతలరీత్యా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లకు వేర్వేరుచోట్ల ప్రత్యేక శిక్షణనిస్తారు. ఒక జిల్లాకో, ఒక ప్రాంతానికో బాధ్యత వహించే ఐఏఎస్ అధికారి అక్కడి పాలనా వ్యవస్థను పటిష్టపరచటానికి నిర్ణయాలు తీసుకోవాల్సి వుంటుంది. ఎవరిని ఏ స్థానంలో పనిచేయించాలో, అందుబాటులో ఉన్న వనరుల ఆధారంగా అక్కడి ప్రజల అభ్యున్నతికి ఏమేం చేయవచ్చునో అధ్యయనం చేయటం, దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకోవటం కూడా ఐఏఎస్ అధికారుల బాధ్యత. ఐఏఎస్‌లకు భిన్న శాఖల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది. ఐపీఎస్లకుశాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. దానికి అనుగుణంగా వారికి ప్రత్యేక శిక్షణ అవసరమవుతుంది. అలాగే ఐఎఫ్ఎస్లు అడవుల పరిరక్షణలో, భద్రతలో, వాటి నిర్వహణలో అవగాహన పెంచుకుంటారు. పర్యావరణం, వాతావరణ మార్పులు, సహజ వనరుల సంరక్షణ వారి ప్రధానాంశాలు. అందరి అంతిమ ధ్యేయమూ మెరుగైన పాలనా వ్యవస్థను ప్రజల అందుబాటులోకి తీసుకు రావటమే అయినప్పుడు ఎవరికీ ఆధిక్యతా భావన ఉండకూడదు. అటువంటి మనస్తత్వం పాలనపై దుష్ప్రభావం కలిగిస్తుంది. ప్రభుత్వ తీరుతెన్నులపై విమర్శలకు తావిస్తుంది. కానీ దురదృష్టమేమంటే, ధర్మాసనం చెప్పినట్టు చాలాచోట్ల ఇలాంటి పోకడలు కనిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం కర్ణాటకలో ఐఏఎస్, ఐపీఎస్ బాధ్యతల్లోవున్న ఇద్దరు మహిళా అధికారులు సామాజిక మాధ్యమాల్లో ఎలా దూషించుకున్నారో ఎవరూ మరిచిపోరు. అప్పట్లో ప్రధాని కార్యాలయం ఆనాటి ముఖ్యమంత్రిని వివరణ కోరింది. సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తరాఖండ్‌లో అడవుల సంరక్షణ, అభివృద్ధి అవసరాలు సమతౌల్యం చేయటానికి ఉద్దేశించిన నిధులు దుర్వినియోగం కావటానికి సంబంధించి దాఖలైన కేసులో ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంలో ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులిద్దరి మధ్య తలెత్తిన వివాదం ప్రస్తావనకొచ్చినప్పుడు న్యాయమూర్తులు ఐఏఎస్‌ల తీరును నిశితంగా విమర్శించారు. ఒకచోట పనిచేయాల్సి వచ్చినప్పుడు వివాదాలు తలెత్తటం అసాధారణమేమీ కాదు. కానీ వ్యక్తిగత స్థాయికి వివాదాల్ని దిగజార్చటంవల్ల వ్యవస్థ దెబ్బతింటుంది.చాలా రాష్ట్రాల్లో ఇలాంటి సమస్యలుంటున్నాయి. వీటికి ఎక్కడో ఒకచోట బ్రేక్ పడాలి. తాత్కాలిక సర్దుబాట్లుకాక మరోసారి సమస్య తలెత్తకుండా ఏం చేయవచ్చునో ఆలోచించాలి. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పరిచిన అధి కార యంత్రాంగం కాస్తా అంతర్గత కలహాల్లో మునిగితే వ్యవస్థ నష్టపోతుంది. అంకితభావంతో, కర్తవ్యనిష్టతో పనిచేసిన ఎస్.ఆర్. శంకరన్, బి.డి. శర్మవంటివారు ఇవాళ్టికీ చిరస్మరణీయులు. అధికారులకు వారు ఆదర్శం కావాలి. అప్పుడు అహంభావానికి తావుండదు. -
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జైమాల్యా బాగ్చీ
న్యూఢిల్లీ: కలకత్తా హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ జైమాల్యా బాగ్చీని సుప్రీంకోర్టు న్యాయ మూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం గురు వారం కేంద్ర ప్రభు త్వానికి సిఫార్సు చేసింది. 2013 జూలై 18న జస్టిస్ అల్తమస్ కబీర్ పదవీ విరమణ చేసిన చేసిన తర్వాత కలకత్తా హైకోర్టు నుంచి ఏ న్యాయమూర్తి కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందలేదు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం ప్రత్యేకంగా ప్రస్తావించింది. కొలీజియం సిఫా ర్సును కేంద్రం ఆమోదిస్తే జస్టిస్ జైమాల్యా బాగ్చీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితు లవుతారు. ఆయన పదవీకాలం ఆరేళ్లకుపైగా ఉన్నందున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందే అవకాశం ఉంది. -
16 ఏళ్లు రిలేషన్లో ఉండి రేప్ అంటే ఎలా?
న్యూఢిల్లీ: ఏకంగా 16 సంవత్సరాలు ఒక వ్యక్తితో సంబంధం నెరిపి ఇప్పుడు రేప్ కేసు పెడితే ఎలా? అని సుప్రీంకోర్టు ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై అభ్యంతరం వ్యక్తంచేసింది. పెళ్లిచేసుకుంటానని నమ్మించి రేప్ చేశాడని ఒక మహిళ దాఖలుచేసిన పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది. మహిళ చేసిన ఆరోపణల్లో నిజం లేదని కోర్టు అభిప్రాయపడింది.‘‘ పెళ్లిచేసుకుంటానని చెప్పి మోసం చేసి సంబంధం పెట్టుకుంటే దానిని రేప్‌గా భావించలేం. మహిళ సమ్మతి లేదని నిరూపణ అయితేనే రేప్‌గా పరిగణిస్తాం. ఈ కేసులో సమ్మతి లేదు అని చెప్పలేం. ఎందుకంటే ఉన్నత విద్యార్హతలున్న, పరిణతి సాధించిన చదువుకున్న మహిళ.. ఒక వ్యక్తి పెళ్లిచేసుకుంటానని నమ్మిస్తే 16 ఏళ్లపాటు అతడిని అలాగే నమ్మడం అనేది అసంభవం. 16 ఏళ్లపాటు తనపై లైంగికదాడిని ఆ మహిళ భరించిందంటే నమ్మశక్యంగా లేదు. సుదీర్ఘకాలాన్ని చూస్తుంటే లైంగిక సంబంధం అనేది పరస్పర సమ్మతితో కొనసాగినట్లు స్పష్టమవుతోంది. ఇన్నేళ్ల శారీరక సంబంధం తర్వాత ఇప్పుడొచ్చి అత్యాచారం చేశాడంటూ కేసు పెట్టడం సరికాదు. 16 ఏళ్ల కాలం అనేది ‘బలవంతంగా లైంగిక దోపిడీచేశాడు. శారీరక సంబంధం కోసం వంచించాడు’ అనే వాదనలను బలం చేకూర్చడంలేదు. పెళ్లిచేసుకుంటానని అతను మాటిస్తే ఇన్నేళ్లలో ఆమెకు ఒక్కసారైనా అనుమానంరాకపోవడం విచిత్రం. అతను వేరే మహిళను పెళ్లిచేసుకున్న తర్వాతే ఈ మహిళ తొలిసారిగా పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఈ 16 సంవత్సరాల్లో వీళ్లు ఒకే చోట సహజీవనం చేశారు. ఈ కేసు పూర్తిగా ప్రేమ/సహజీవనానికి సంబంధించిన అంశం. ఇందులో అత్యాచారం అనే కోణానికి తావులేదు. మహిళ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చే సాక్ష్యాధారాలు లేవు. ఇలాంటి సందర్భంలో ఇంకా అతనిపై నేర విచారణ కొనసాగించడం చట్టప్రకారం సబబు కాదు’’ అంటూ సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టేసింది. 2006లో ఒకరోజు రాత్రి ఇంట్లో చొరబడి రేప్ చేశాడని, తర్వాత పెళ్లిచేసుకుంటానని ఇన్నేళ్లు మోసంచేశాడని సంబంధిత మహిళ 16 సంవత్సరాల తర్వాత 2022లో ఫిర్యాదుచేసింది. దీంతో అదే ఏడాది ఎఫ్ఐఆర్ నమోదుచేసి కేసు విచారణ ప్రారంభించారు. ఈ కేసులో హైకోర్టులోనూ తనకు వ్యతిరేకంగా తీర్పురావడంతో ఆ వ్యక్తి చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించగా చిట్టచివరకు అతనికి అనుకూలంగా తీర్పు వచ్చింది. మార్చి మూడో తేదీనాటి ఈ కేసు తీర్పు వివరాలు గురువారం బహిర్గతమయ్యాయి. -
ఐఏఎస్‌లది ఆధిపత్య ధోరణి
సాక్షి, న్యూఢిల్లీ: ఐఏఎస్ అధికారులు ఎప్పుడూ ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తారని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. అందుకే ఐఏఎస్‌ల మాట మేం ఎందుకు వినాలనే అసహనం, అసంతృప్తి ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల్లో గూడుకట్టుకుపోయిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఒక కేసును జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్‌ల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. అటవీ అధికారులు తమ ఆదేశాలను పాటించాలని ఐఏఎస్ అధికారులు కోరడంపై ధర్మాసనం విస్త్రృతంగా చర్చించింది. ఇండియన్ అడ్మిస్ట్రేటివ్ సర్వీసెస్, ఇండియన్ పోలీస్ సర్వీసెస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారుల మధ్య జరుగుతున్న ఈర‡్ష్య యుద్దాన్ని ప్రస్తావిస్తూ జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్‌లకు ఐపీఎస్, ఐఎఫ్ఎస్లకు మధ్య బేదాభిప్రాయాలు లేవని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన వాదనను జడ్జి తప్పుబట్టారు. ‘‘నేను ప్రభుత్వ న్యాయవాదిగా మూడేళ్లు పనిచేశా. న్యాయమూర్తిగా 22 ఏళ్లుగా సేవలందిస్తున్నా. ఇన్నేళ్లలో నేను గమనించింది ఏంటంటే ఐఏఎస్‌లు ఎçప్పుడూ ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లపై ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చూస్తుంటారు. ఈ వివాదం అన్ని రాష్ట్రాల్లో ఉంది. అందరూ ఒకే అఖిల భారత సర్వీస్‌లకు సంబంధించిన ఉన్నతాధికారులమే అయినప్పుడు ఐఎఎస్‌ల మాటే ఎందుకు వినాలి? అనే అసంతృప్తి ఐపీఎస్, ఐఎఫ్ఎస్లలో ఉంది. ఈ విధానం మారాలి. ఈ విషయంలో అందర్నీ సమానంగా చూడాలని భావన ఐఏఎస్‌లలో కల్పించండి’’ అని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు జస్టిస్ గవాయ్ సూచించారు. అధికారుల మధ్య ఉన్న అంతర్గత వివాదాలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని కేంద్రం తరఫున తుషార్ కోర్టుకు తెలిపారు. జడ్జీలు కేసు తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదావేశారు. -
నిర్ణయం ఇంకెప్పుడు?
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ప్రతిసారీ ‘‘స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటారు’’ అంటున్నారు. తగినంత సమయం అంటే ఎంత? ఐదేళ్ల పదవీ కాలం పూర్తయ్యే వరకా?. తగినంత సమయాన్ని కోర్టు ఫిక్స్ చేయాలా? వద్దా?. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. చట్ట సభల గడువు ముగిసే వరకు నిర్ణయం తీసుకోకపోతే ఎలా? ప్రజాస్వామ్యానికి అర్థం ఏం ఉంటుంది? ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ అనే విధంగా వ్యవహరించడం ఎంతమాత్రం సరికాదు..’ అంటూ సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ఎమ్మెల్యేల వ్యవహారంలో స్పీకర్ కార్యాలయం ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి, స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు హైకోర్టు రిజిస్ట్రార్ ద్వారా అందజేయాలని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జ్ల ధర్మాసనం ఆదేశించింది. ఈ నోటీసులపై వీరంతా ఈనెల 22లోపు వివరణ ఇవ్వాలని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. ఓ ఎస్ఎల్పీ, మరో రిట్ పిటిషన్‌పై విచారణ కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్‌లపై ఎస్ఎల్పీ, మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహీపాల్ రెడ్డి, అరెకపూడి గాందీలపై రిట్ పిటిషన్ దాఖలు అయిన విషయం తెలిసిందే. కాగా ఈ రెండు పిటిషన్లపై తాజాగా మంగళవారం సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఆర్యమ సుందరం, దామ శేషాద్రినాయుడు, పి.మోహిత్‌రావు, స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మనుసింఘ్వీ, ముకుల్ రోహత్గీ తదితరులు వాదనలు వినిపించారు. ఏడాది కావొస్తున్నా చర్యలు లేవు ‘గతేడాది మార్చి, ఏప్రిల్‌లో పార్టీ ఫిరాయింపులపై తొలిసారి కోర్టును ఆశ్రయించాం. అనంతరం జూన్‌లో రిట్ పిటిషన్ దాఖలు చేశాం. ఏడాది అవుతున్నా ఇప్పటివరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. ఆర్టికల్ 32, 226 ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి సమయం అవసరం లేదు. ప్రధానంగా పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ బీ ఫాంపై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. మరో ఎమ్మెల్యే ఏకంగా కాంగ్రెస్ పార్టీ కోసం లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేశారు. మిగిలిన ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు వాళ్లు పార్టీ ఫిరాయించినట్టే. దీనిపై తొలుత రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా..విచారణకు సమయాన్ని ఖరారు చేయాలంటూ సింగిల్ బెంచ్ నాలుగు వారాలు గడువు ఇచ్చింది. దీనిపై స్పీకర్ కార్యాలయం అప్పీల్‌కు వెళ్లింది. అయితే స్పీకర్‌కు తగినంత సమయం ఇవ్వాలన్న భావనతో ఈ ఉత్తర్వులను డివిజన్ బెంచ్ పక్కన పెట్టింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంను ఆశ్రయించాం. కానీ స్పీకర్ కార్యాలయం ఇప్పటివరకు ఆ తగినంత సమయం అంటే ఎంతో చెప్పనేలేదు. స్పీకర్ సమయం తీసుకునే విషయంలో సుభాష్ దేశాయ్, కేశం మేఘాచంద్, రాజేంద్ర సింగ్ రాణా కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ తీర్పుల ఆధారంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంది..’ అని అని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అయితే సుభాష్ దేశాయ్ కేసులో స్పీకర్ నిర్ణయంపై ఎలాంటి గడువు ఫిక్స్ చేయలేదని జస్టిస్ బీఆర్ గవాయి అన్నారు. రాణా కేసులో మూడు నెలల సమయం ఇవ్వాలని చెప్పిందని తెలిపారు. ఫిరాయింపులపై కాంగ్రెస్ అధికారం ఉన్నచోట ఒకలా... లేనిచోట మరోలా వ్యవహరిస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది అర్యమ సుందరం వాదించారు.స్పీకర్‌కు కోర్టు ఆదేశాలివ్వడానికి అవకాశం లేదుస్పీకర్ కార్యదర్శి తరఫు న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ వాదిస్తూ.. ‘ఫిరాయింపులపై గతేడాది జూలై మొదటి వారంలో స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తే 9వ తేదీ నాటికే కోర్టులో పిటిషన్ వేశారు. మరోవైపు ఫిరాయింపులపై ఫిర్యాదు అందగానే స్పీకర్ స్పందించారు.. నోటీసులు ఇచ్చారు. వారి నుంచి రిప్లై రాగానే నిర్ణయం తీసుకుంటారు. అసలు స్పీకర్ నిర్దిష్ట సమయంలో నిర్ణయం తీసుకోవాలని లేదు. రాజ్యాంగబద్ధంగా అత్యంత ఉన్నతమైన పదవుల్లో స్పీకర్ పదవి ఒకటి. ఈ పదవిలో ఉన్న స్పీకర్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేయడానికి అవకాశం లేదు..’ అని చెప్పారు. దీంతో ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ‘స్పీకర్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేయడానికి అవకాశం లేదూ అంటే.. న్యాయమే డిసైడ్ చేస్తుంది ఆగండి..’ అంటూ వ్యాఖ్యానించింది. నోటీసుల జారీకి ఆదేశాలిచ్చింది. ప్రతివాదుల తరఫు న్యాయవాదులు కూడా వీరికి నేరుగా నోటీసులు ఇవ్వొచ్చని తెలిపింది. ఈనెల 25న ఐటెం నంబర్–1గా కేసును విచారిస్తామని స్పష్టం చేసింది. -
పాకిస్థానీ అనడం నేరమేమీ కాదు: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: వ్యక్తిగత దూషణకు సంబంధించిన ఓ కేసులో దేశ సర్వోన్నత న్యాయం మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మియాన్-టియాన్, పాకిస్థానీ అనడం నేరమేమీ కాదని, అలా అనడం వల్ల మతపరమైన మనోభావాలు దెబ్బ తిన్నాయన్న వాదన అర్ధరహితమని వ్యాఖ్యానించింది.జార్ఖండ్‌లో పని చేసే ఓ ప్రభుత్వ ఉద్యోగి.. ఆర్టీఐ దరఖాస్తు వెరిఫికేషన్‌లో భాగంగా ఓ వ్యక్తిని సంప్రదించారు. అయితే ఆ టైంలో మతం ప్రస్తావన తెచ్చి ఆ వ్యక్తి.. సదరు ఉద్యోగిని దుర్భాషలాడాడు. దీంతో తన విధులకు ఆటంకం కలిగించాడంటూ ఆ ఉద్యోగి పోలీసులను ఆశ్రయించాడంతో కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో నిందితుడికి జార్ఖండ్ హైకోర్టులో ఊరట దక్కలేదు. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. మియాన్-టియాన్, పాకిస్థానీ అని సంబోధించడం ద్వారా తన మనోభావాలు దెబ్బన్నాయని ఫిర్యాదుదారు అంటున్నారు. ముమ్మాటికీ అలాంటి వ్యాఖ్యలు అప్రస్తుతం. అయినప్పటికీ.. అది మతపరమైన మనోభావాలు దెబ్బతీయడం ఏమాత్రం కాదని స్పష్టం చేస్తూ ఆ వ్యక్తికి ఊరట కలిగించింది. -
ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు.. ప్రభుత్వానికి,ఈసీకి.. సుప్రీం నోటీసులు
సాక్షి, ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ జరిగింది. బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ, ఎన్నికల సంఘం, ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపుల అంశంపై మార్చి 22 లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 25 కి వాయిదా వేసింది. మంగళవారం మధ్యాహ్నం జరిగిన విచారణలో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు రీజనబుల్ టైమ్ అంటే ఎంతో చెప్పాలని ప్రశ్నించింది. రీజనబుల్ టైమ్ అంటే గడువు ముగిసే వరకా ?. ప్రజాస్వామ్య విధానాలు ఏం కావాలి. ఎంత సమయం కావాలో చెప్పండి. ఆపరేషన్ సక్సెస్ , పేషంట్ డెడ్ అనే తీరు సరికాదు’అని బీఆర్ గవాయి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది అర్యమ సుందరం తన వాదనలు వినిపించారు. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేసే ఎత్తుగడలు అనుసరిస్తున్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడమంటే రాజ్యంగమిచ్చిన విధులను నిర్వహించడంలో విఫలమైనట్లేనని అన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు విచారణను వాయిదా వేసింది. గత విచారణలోగత విచారణ సందర్బంగా అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు రీజనబుల్ టైమ్ అంటే ఎంతో చెప్పాలని సుప్రీంకోర్టు కోరింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు గత తీర్పుల ప్రకారం రీజనబుల్ టైమ్ అంటే మూడు నెలలు మాత్రమేనని బీఆర్ఎస్ వాదనలు వినిపించింది. ఈ నేపథ్యంలో రీజనబుల్ టైం ఎంతో చెప్పాలంటూ కోర్టు తెలంగాణ స్పీకర్‌ను ప్రశ్నించింది.ఇక, తెలంగాణలో పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత చర్యలు తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇటీవలే స్పీకర్ నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం బాలరాజు సహా పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు.మరోవైపు.. గత వాదనల్లో.. తెలంగాణ స్పీకర్ (Telangana Speaker) తీరుపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తగిన సమయం.. సరైన సమయం.. అంటూ స్పీకర్ చెబుతూ కాలయాపన చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర తరహాలో ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసేదాకా ఆగుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్లపై పూర్తి వాదనలు విన్నాకే ‘ఆ సరైన సమయం’పై తామే ఓ నిర్ణయం తీసుకుంటామని, అవసరమైతే స్పీకర్‌కు సూచనలు చేయడానికి ఉన్న అవకాశాలను కూడా పరిశీలిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడనుందా అనే ఆసక్తి నెలకొంది.ఇంతకు ముందు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపులపై లిఖిత పూర్వక సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. -
లోక్‌పాల్ వర్సెస్ న్యాయమూర్తులు
ఉన్నత స్థాయిలోని అవినీతిని నిరోధించడానికి ‘లోక్‌పాల్’ను ఏర్పాటు చేశారు. సిట్టింగ్ హైకోర్టు న్యాయ మూర్తులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించే అధికారం తమకు ఉందని లోక్‌పాల్ అభిప్రాయపడింది. దీంతో లోక్‌పాల్ అధికారాల పరిధి, న్యాయ మూర్తులకు లభించే రక్షణల గురించిన ప్రశ్నలు చర్చనీయాంశాలయి నాయి. అంతేకాదు, న్యాయవ్యవస్థ స్వతంత్రత మీద నీలినీడలు ఏర్పడినాయి.2025 ఫిబ్రవరి 20న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, సూర్యకాంత్, ఏఎస్ ఓకాలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం లోక్‌పాల్ జారీ చేసిన ఎంక్వైరీ ఉత్తర్వుల మీద చర్చించడానికి ప్రత్యేకంగా సమావేశమయ్యింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏఎం ఖన్విల్కర్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల లోక్‌పాల్ బెంచ్... ‘హైకోర్టు న్యాయమూర్తులు లోక్‌పాల్, లోకాయుక్త చట్టం–2013’ పరిధిలోకి వస్తారని అభిప్రాయపడింది. పార్లమెంట్ తయారు చేసిన చట్టం ద్వారా ఏర్పాటైన హైకోర్టులలోని న్యాయ మూర్తులు కాబట్టి వారు ఈ చట్టాల పరిధిలోకి వస్తారని లోక్‌పాల్ బెంచ్ అభిప్రాయపడింది.‘ఇది చాలా కలవరపెట్టే విషయం’ అని జస్టిస్ గవాయ్ విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు. అంతకు ముందు రోజు ఈ అంశాన్ని సుప్రీంకోర్టు తనకు తానుగా స్వీకరించి విచారణ చేపట్టింది. ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలు జరుగకుండా ఉండటానికి సుప్రీంకోర్టు తన అధి కారాన్ని వినియోగించుకొని ఈ విషయంలో జోక్యం చేసుకుంది. లోక్‌పాల్ జారీ చేసిన ఉత్తర్వులపై స్టేని మంజూరు చేసింది.అంతేకాదు లోక్‌పాల్ విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తుల పేర్లు బహిర్గతం చేయకూడదని కూడా ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తులపై విచారణ చేపట్టే ముందు లోక్‌పాల్ 1991వ సంవత్సరంలో న్యాయమూర్తి కె. వీరాస్వామి కేసుని కూడా ఉదహ రించింది. ఉన్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తిని పబ్లిక్ సర్వెంట్స్ నిర్వచనం నుండి మినహాయించలేరు. అందుకని హైకోర్టు న్యాయమూర్తుల మీద తాము విచారణని చేపట్టినామని లోక్‌పాల్ తన ఉత్తర్వులలో పేర్కొంది.1991వ సంవత్సరంలో ‘కె. వీరాస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ప్రకారం – న్యాయ మూర్తులందరూ ‘అవినీతి నిరోధక చట్టం–1988’ ప్రకారం పబ్లిక్ సర్వెంట్స్ అని పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తి లేదా ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ఫిర్యాదు దాఖలైనప్పుడు కేసు నమోదు చేయడానికన్నా ముందు భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాలని కూడా ఆ తీర్పులో పేర్కొన్నారు.న్యాయమూర్తులను – అవసరం లేని ప్రాసిక్యూషన్ నుంచి, అనవసర వేధింపుల నుండి రక్షించడానికి రాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాలి. ప్రధాన న్యాయమూర్తి తన ముందు ఉంచిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని, ఆ విషయంలో సంతృప్తి చెందిన తరువాత సంబంధిత న్యాయ మూర్తిపై ప్రాసిక్యూషన్ ప్రారంభించడానికి లేదా ఎఫ్ఐఆర్ని విడుదల చేయడానికి రాష్ట్రపతికి తగు సలహాని ఇవ్వాలి. ఈ తీర్పుని ఆధారం చేసుకొని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, లోక్‌పాల్ ఖన్విల్కర్ నేతృత్వంలోని బెంచ్ న్యాయమూర్తులపై వచ్చిన ఫిర్యాదులను భారత ప్రధాన న్యాయమూర్తి పరిశీలనకి పంపింది. 2013వ చట్టంలోని సెక్షన్ 20(4) ప్రకారం ఫిర్యాదును పరిష్కరించడానికి అవసరమైన కాలపరిమితిని దృష్టిలో పెట్టుకొని కేసుని నాలుగు వారాల పాటు వాయిదా వేయాలని ఆదేశించింది.హైకోర్టు న్యాయమూర్తులు లోక్‌పాల్ అనుకున్నట్టు చట్ట బద్ధమైన అధికారులు మాత్రమే కాదని, వాళ్ళు రాజ్యాంగ బద్దమైన న్యాయమూర్తులని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గవాయ్, జస్టిస్ ఏఎస్ ఓకా విచారణ సందర్భంలో అన్నారు. సుప్రీంకోర్టు వెలి బుచ్చిన ఆందోళనలో భారత సొలిసి టర్ జనరల్ తుషార్ మెహతా, న్యాయవాది కపిల్ సిబాల్ కూడా పాలుపంచుకున్నారు. లోక్‌పాల్, లోకాయుక్త చట్టంలోని సెక్షన్ 14 పరిధిలోకి వస్తాయని లోక్‌పాల్ అభిప్రాయపడింది కానీ దాని యోగ్యతలను లోక్‌పాల్ ఇంకా పరిశీలించలేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే లోక్‌పాల్ అభిప్రాయం తప్పని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 214(1)ను లోక్‌పాల్ విస్మరించిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ అధికరణం ప్రకారం హైకోర్టులను ఏర్పాటు చేస్తారు.రాజ్యాంగం కొన్ని వ్యవస్థలకు రక్షణలను కల్పించింది.అందులో రాష్ట్రపతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఎలక్షన్ కమిషనర్లు వస్తారు. వీళ్ళే కాదు హైకోర్టు న్యాయమూర్తులూ వస్తారు. లోక్‌పాల్ అభిప్రాయం న్యాయవ్యవస్థ స్వతంత్రతకు సవాలు విసురుతుంది. న్యాయ వ్యవస్థ స్వతంత్రత మీద నీలి నీడలు కమ్ముకుంటాయి. ఈ జోక్యం వల్ల అత్యున్నత న్యాయ వ్యవస్థ బలహీనపడుతుంది. న్యాయ వ్యవస్థలో పరోక్ష జోక్యాలు, ఒత్తిళ్లు పెరిగిపోతాయి. ప్రేరేపిత ఆరోపణల నుంచి రక్షణ లేకుండా పోతుంది. అయితే వారి మీద ఎలాంటి విచారణ లేకపోతే జవాబుదారీ తనం లేకుండా పోతుంది. హైకోర్టు న్యాయ మూర్తుల మీద వచ్చిన ఆరోపణలను విచారించడానికి, తగు చర్యలు తీసుకోవడానికి సరైన యంత్రాంగం లేదు. దీనివల్ల అవినీతికి స్థానం దొరికేలా ఉంటుంది. సుప్రీంకోర్టు ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంది. ప్రస్తుతం ఉన్న విధానం మెరుగు పడాల్సిన అవసరం ఉందని దేశ అత్యున్నత న్యాయస్థానం భావించింది. ఇటీవలి కాలంలో తమ పరిధికి మించి ఉత్తర్వులను, బెయిల్ షరతులను విధిస్తున్న హైకోర్టు న్యాయమూర్తులను చూస్తున్నాం. అదే విధంగా కేసు విచారణ సందర్భంలో, బయట సమావేశాల్లో రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకున్న సందర్భాలు లేవు. వారి పరిధి నుంచి కేసుల ఉపసంహరణ లాంటి చర్యలను కూడా సుప్రీంకోర్టు తీసుకోవడం లేదు. న్యాయవ్యవస్థ స్వతంత్రత ఎంత ముఖ్యమో... జవాబు దారీ తనం కూడా అంతే ముఖ్యం. లోక్‌పాల్ అభిప్రాయం సరైంది రాకపోవచ్చు. కానీ చాలా అంశాలు సుప్రీం తీర్పు ముందుకు వస్తున్నాయి. సుప్రీం కోర్టు ఏం చేస్తుందో చూడాలి మరి!మంగారి రాజేందర్ వ్యాసకర్త తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ అకాడమీ మాజీ డైరెక్టర్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు -
దృష్టి లోపమున్నా...న్యాయ నియామకాలకు అర్హులే
న్యూఢిల్లీ: దృష్టి లోపం ఉన్నంత మాత్రాన జ్యుడీషియల్ సర్వీస్‌లో ఉద్యోగావకాశాలను నిరాకరించడం కూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ ఉద్యోగాలకు వాళ్లు అనర్హులని పేర్కొంటున్న మధ్యప్రదేశ్ జ్యుడీషియల్ సర్వీస్ (ఎంపీజేఎస్) నిబంధనలను కొట్టేసింది. న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్ ధర్మాసనం సోమవారం ఈ మేరకు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. దృష్టి లోపమున్న వారికి పలు రాష్ట్రాలు జ్యుడీషియల్ సర్వీస్ ఉద్యోగాల్లో ప్రత్యేక కోటా కల్పించకపోవడం తదితరాలపై దాఖలైన కేసులను ధర్మాసనం విచారించింది. ‘‘వైకల్యం ఆధారంగా వివక్ష చూపరాదన్నది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. దివ్యాంగుల హక్కుల చట్టం, 2016 కూడా అదే చెబుతోంది’’ అని పేర్కొంది. ‘‘దృష్టి లోపమున్న అభ్యర్థులకు జ్యుడీషియల్ పోస్టుల్లోనూ సముచిత ప్రాతినిధ్యం దక్కాలి. ఎంపిక ప్రక్రియలో ప్రతి దశలోనూ ఇందుకు అవసరమైన అన్ని చర్యలనూ ప్రభుత్వాలు చేపట్టాలి. వారికి కటాఫ్ మార్కులను విడిగా నిర్ణయించాలి. మెరిట్ లిస్టునూ విడిగానే సిద్ధం చేయాలి. దాని ఆధారంగానే ఎంపిక జరగాలి’’ అని ఆదేశించింది. దృష్టి లోపం కేటగిరీలో తగినంత మంది అభ్యర్థులు లేకపోతే కటాఫ్ మార్కులను తగ్గించేందుకు కూడా ధర్మాసనం ఈ సందర్భంగా అనుమతించింది. న్యాయ వ్యవస్థలో ఇప్పటికే చేపట్టిన, ఇకపై చేపట్టబోయే భర్తీ ప్రక్రియలన్నింటికీ ఈ తీర్పును ప్రాతిపదికగా తీసుకోవాలని స్పష్టం చేసింది.రాజ్యాంగ స్ఫూర్తీ అదేజ్యుడీషియల్ సర్వీసులకు పోటీ పడేందుకు దృష్టి లో పమున్న వాళ్లు పూర్తిగా అర్హులేనని జస్టిస్ మహదేవన్ స్పష్టం చేశారు. ధర్మాసనం తరఫున ఈ మేరకు 122 పేజీల తీర్పు ఆయనే రాశారు. ‘‘ఈ విషయంలో ఎంపీజేఎస్లో పొందుపరిచిన నిబంధనలు రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వపు హక్కు తదితరాలకు పూర్తిగా విరుద్ధం. నిజానికి ఇలాంటి విషయాల్లో సముచిత ప్రాతినిధ్య సూత్రాలను పాటించాలి. అంతే తప్ప కాఠిన్యం కూడదు. కఠినమైన కటాఫ్ నిబంధనలు తదితర పరోక్ష అడ్డంకుల ద్వారా దివ్యాంగులను ఉద్యోగావకాశాలకు దూరం చేయకూడదు. పలు అంతర్జాతీయ సూత్రాలు, ఒప్పందాలు కూడా అదే చెబుతున్నాయి’’ అన్నారు. ‘‘పౌరులందరినీ కలుపుకుని ముందుకు సాగాలన్న సూత్రమే మన రాజ్యాంగానికి పునాది. రాజ్యాంగపు మౌలిక స్వరూపంలో విడదీయలేని భాగం. సమానత్వం తదితర ప్రాథమిక హక్కులన్నింటికీ మూలాధారం. ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఆర్టికల్స్ 14, 15, 16ల్లో దీన్ని విస్పష్టంగా పేర్కొన్నారు’’ అని న్యాయమూర్తి గుర్తు చేశారు. ‘‘సముచిత ప్రాతినిధ్యం పౌరుల ప్రాథమిక హక్కే తప్ప విచక్షణాత్మక చర్య కాదు. దివ్యాంగులకు సమానత్వం కూడా అందులో అంతర్భాగమే’’ అని సుప్రీంకోర్టు గత తీర్పులను ఉటంకిస్తూ స్పష్టం చేశారు. ‘‘సమాజంలోని బలహీన వర్గాల ప్రయోజనాల పరిరక్షణను 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా ప్రభుత్వాల తప్పనిసరి బాధ్యతగా మార్చుకున్నాం. ఈ నిర్వచనం పరిధిలోకి శారీరక, మానసిక వికలాంగులు కూడా వస్తారు’’ అని వివరించారు. -
విద్యార్థుల మరణాలు దురదృష్టకరం: సుప్రీం
న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీలు), ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెట్(ఐఐఎంల)లో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటం అత్యంత దురదృష్టకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇటువంటి ఘటనల నివారణకు బలమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరముందని నొక్కిచెప్పింది. ఐఐటీలు, ఐఐఎంల్లో గడిచిన 14 నెలల్లో 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు సీనియర్ లాయర్ ఇందిరా జైసింగ్ తెలపడంతో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్‌ల ధర్మాసనం పైవిధంగా వ్యాఖ్యానించింది. ఈ అంశానికి న్యాయపరమైన ముగింపు ఇస్తామని పేర్కొంది. హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల 2017లో, మహారాష్ట్రలోని టీఎన్ టోపీవాలా మెడికల్ కాలేజీ విద్యార్థిని పాయల్ తాడ్వి 2019లో బలవన్మరణం చెందారు. తమ విద్యాసంస్థల్లో కులపరమైన వివక్షను భరించలేకే ప్రాణాలు తీసుకున్నారంటూ వీరి తల్లులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇటువంటి ఘటనల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, కోర్టు ఆదేశాలున్నా విద్యార్థుల ఆత్మహత్యల ఘటనల వివరాలను ఇచ్చేందుకు విద్యాసంస్థలు ససేమిరా అంటున్నాయని లాయర్ జైసింగ్ శుక్రవారం ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. -
చట్టసభలకూ పరిమితులు!
నిబద్ధత, సచ్ఛీలత, నిబంధనలపట్ల సంపూర్ణ అవగాహన కలిగినవారి సారథ్యంలో చట్టసభలుంటే అలాంటిచోట ఆరోగ్యవంతమైన చర్చలు జరుగుతాయి. ప్రజాస్వామ్యానికి ఆ సభ తలమానికమవు తుంది. కానీ అధికార పక్షానికి వంతపాడేవారు, వారి ఇష్టారాజ్యానికి పక్కతాళం వేసేవారు అధ్యక్ష స్థానాల్లో కూర్చుంటున్నారు. తాము ఎవరికీ జవాబుదారీ కాదన్నట్టు ప్రవర్తిస్తున్నారు. అలాంటి బాపతు నేతలకు ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టు. తనను బిహార్ శాసనమండలి నుంచి బహిష్కరించటాన్ని సవాలుచేస్తూ ఆర్జేడీ సభ్యుడు సునీల్ కుమార్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను అంగీకరిస్తూ ఆయన్ను తక్షణం సభలోకి అనుమతించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. సభ్యుల అనుచిత ప్రవర్తనకు తగిన శిక్ష ఉండాలితప్ప మితిమీరకూడదని తేల్చిచెప్పింది. నిరుడు మార్చిలో గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలోనూ, ఆ తర్వాత ఆ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంలోనూ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై సునీల్ కుమార్ సింగ్ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారన్నది అభియోగం. పాము కుబుసం విడిచినట్టు తరచు రాజకీయ అభిప్రాయాలు మార్చుకోవటం నితీశ్‌కు అలవాటని, ఇప్పటికి తొమ్మిదిసార్లు ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యేగా ప్రజలనుంచి ఎన్నిక కాలేదని సునీల్‌కుమార్ సింగ్ విమర్శించారు. అధికారమే పరమావధిగా ఒకసారి యూపీఏ, మరోసారి ఎన్డీయే కూటములతో చెలిమి చేయటాన్ని ఎద్దేవా చేస్తూ ఆయన్ను ‘పాల్తూరామ్’ అని హేళన చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలను ఎథిక్స్ కమిటీకి నివేదించారు. సునీల్ తప్పు చేశారని ఎథిక్స్ కమిటీ నిర్ధారించి సభా బహిష్కారానికి సిఫార్సుచేసింది. శాసనమండలి దీన్ని ఆమోదించి ఆయన్ను బహిష్కరిస్తూ తీర్మానించింది. మన రాజ్యాంగం కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయవ్యవస్థల మధ్య అధికారాల విభజన చేసింది. చట్టసభలకు ప్రత్యేక హక్కులుంటాయని, వాటి కార్యకలాపాల్లో లేదా నిర్ణయాల్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోరాదని సభాధ్యక్షులు భావిస్తుంటారు. ముఖ్యంగా ఫిరాయింపులపై వచ్చే ఫిర్యాదుల్ని ఎటూ తేల్చకుండా వదిలేస్తూ తమను ప్రశ్నించరాదంటున్నారు. చిన్న చిన్న కారణాలకు కూడా విపక్ష ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయటం, బహిష్కరణ వేటు వేయటం వంటివి రివాజయ్యాయి. కేవలం పాలకపక్ష ప్రయోజనాలను నెరవేర్చటం కోసమే స్పీకర్లు ఇలా ఇష్టాను సారం ప్రవర్తిస్తున్నారు. నిజమే... రాజ్యాంగంలోని 212(1) అధికరణ ప్రకారం చట్టసభల కార్యకలా పాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణతో ఆ కార్యకలాపాల చెల్లుబాటును న్యాయ స్థానాల్లో సవాలు చేయటానికి వీల్లేదు. నిర్వహణ సంబంధమైన అంశాల్లో న్యాయస్థానాల జోక్యంనుంచి చట్టసభలకు ఇది రక్షణనిస్తుంది. అయితే ఆ కార్యకలాపాల్లో భాగంగా తీసుకునే నిర్ణయాల్లో రాజ్యాంగ విరుద్ధత కనబడినప్పుడు వాటిని సమీక్షించే అధికారం న్యాయస్థానాలకు ఉంటుందన్నది నిపుణుల వాదన. తాజా కేసులో జరిగింది ఇదే. సునీల్ కుమార్ సింగ్ పిటిషన్‌కు అసలు విచార ణార్హత లేదని, 212(1) అధికరణ న్యాయవ్యవస్థ జోక్యాన్నుంచి తమకు రక్షణనిస్తున్నదని శాసన మండలి తరఫు న్యాయవాది వాదించారు. సర్వోన్నత న్యాయస్థానం దీన్ని అంగీకరించలేదు. చట్ట సభల కార్యకలాపాలు వేరు, అందులో తీసుకునే నిర్ణయాలు వేరు అని స్పష్టం చేసింది. చట్టసభల నిర్ణయాలు వ్యక్తుల ప్రాథమిక హక్కుల్ని ప్రభావితం చేసినప్పుడు వాటిని సమీక్షించే అధికారం న్యాయస్థానాలకు ఉంటుందని తెలిపింది. అంతేకాదు... సునీల్‌కుమార్ సింగ్‌ను బహిష్కరిస్తూ తీసు కున్న ఎథిక్స్ కమిటీ నిర్ణయం పాలనాపరమైన చర్యే తప్ప శాసనవ్యవస్థ కార్యకలాపంగా పరిగణించలేమని తేల్చింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కూడిన చట్టసభ నియంత పోకడలు పోకూడదు. మెజారిటీ ఉందన్న సాకుతో విపక్ష సభ్యుల గొంతు నొక్కడానికీ, వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించటానికీ ప్రయత్నించకూడదు. ఆ పరిస్థితులు తలెత్తితే న్యాయస్థానాలుమౌనంగా ఊరుకోబోవని తాజా తీర్పు తేటతెల్లం చేసింది. చట్టసభ కార్యకలాపాలు సాఫీగా సాగటానికి అనువైన నిబంధనలు రూపొందించుకొనేందుకు రాజ్యాంగంలోని 208వ అధికరణ అధికారమిస్తోంది. సభ క్రమశిక్షణగా నడవటానికి ఎలాంటి నిబంధనలుండాలో, వాటిని ఉల్లంఘించినప్పుడు ఏయే చర్యలు తీసుకోవాలో ఈ నిబంధనలు నిర్దే శిస్తాయి. అయితే నిబంధనల అమలు పర్యవేక్షణకు ఏర్పడిన కమిటీలు తీసుకునే నిర్ణయాలు పాలనాసంబంధ పరిధిలోకి వస్తాయని గుర్తించటం తప్పనిసరని తాజా తీర్పు చెబుతోంది. ఆ నిర్ణయాలకు మెజారిటీ ఆమోదం ఉందా లేదా అనే అంశంతో దీనికి సంబంధం లేదు. ఒక చర్యకు ప్రతిగా తీసుకునే ఏ నిర్ణయమైనా హేతుబద్ధతకూ, తార్కికతకూ లోబడివుండటం అవసరం. పిచ్చు కపై బ్రహ్మాస్త్రం తరహాలో అధికారం ఉంది కదా అని ఏమైనా చేస్తామంటే ప్రజాస్వామ్యంలో చెల్లదు. చట్టసభలు ఇష్టానుసారం వ్యవహరించే రోజులు పోయాయి. సభానిర్వహణ సవ్యంగా జర గటం, క్రమశిక్షణ కట్టుతప్పకుండా చూడటం అవసరమే. కానీ అందుకోసం అమలుచేసే చర్యలు అతిగా ఉండకూడదు. సభ్యులు పరిధి మీరారని భావించినప్పుడు అభిశంసించడం, మందలించడం, నిర్దిష్ట కాలానికి సభనుంచి సస్పెండ్ చేయడంవంటి అవకాశాలున్నాయి. కానీ విచక్షణ మరిచి నేరుగా బహిష్కరణ వేటు వేయటం అతిగా వ్యవహరించటమే అవుతుంది. ఎథిక్స్ కమిటీల నిర్ణ యాలు పాలనానిర్వహణ కిందికే వస్తాయని, వాటిపై న్యాయసమీక్ష తప్పదని సుప్రీంకోర్టు నిర్ణయించటం హర్షించదగ్గది. నియంతృత్వ పోకడలు పోయే పాలకపక్షాలకు ఈ తీర్పు చెంపపెట్టు. -
లక్ష్యసేన్‌కు ఊరట
న్యూఢిల్లీ: నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలు సమర్పించారనే ఆరోపణలకు చెందిన అంశంలో... భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులు, కోచ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. తప్పుడు సమాచారంతో లక్ష్యసేన్ ఏజ్ గ్రూప్ టోర్నీల్లో పాల్గొన్నాడనే ఫిర్యాదుపై కర్ణాటక హైకోర్టు విచారణకు ఆదేశించగా... ఈ అంశంలో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం... లక్ష్యసేన్ కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేసిన ఎంజీ నాగరాజ్‌తో పాటు కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. లక్ష్యసేన్ తరఫున న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్లను కర్ణాటక హైకోర్టు ఈ నెల 19న తిరస్కరించింది. దీన్ని సవాలు చేస్తూ లక్ష్యసేన్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దేశ అత్యున్నత న్యాయస్థానం విచారిస్తోంది. అంతకుముందు ఈ కేసు దర్యాప్తునకు అవసరమైన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చింది. లక్ష్యసేన్ తల్లిదండ్రులు నిర్మల, ధీరేంద్రతో పాటు అతడి సోదరుడు చిరాగ్ సేన్, కోచ్ విమల్ కుమార్... కర్ణాటక బ్యాడ్మింటన్ సంఘం ఉద్యోగితో కలిసి జనన ధ్రువీకరణ రికార్డులను తప్పుగా మార్పించారని పిటిషనర్ ఫిర్యాదు చేశారు. ఈ కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి... » ఏజ్ గ్రూప్ టోర్నీల్లో ఆడేందుకు వీలుగా లక్ష్యసేన్‌తో పాటు అతడి సోదరుడు చిరాగ్ సేన్ వయసును రెండున్నరేళ్లు తక్కువగా నమోదు చేసినట్లు నాగరాజ్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. » లక్ష్యసేన్ కుటుంబ సభ్యులతో పాటు కోచ్ విమల్ కుమార్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదులో పేర్కొన్నారు. » తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించారంటూ లక్ష్యసేన్ కుటుంబంపై 2022 డిసెంబర్లో నాగరాజ్ కర్ణాటక పోలీసులను ఆశ్రయించగా... వారు క్రిమినల్ కేసు నమోదు చేశారు. » కేసును విచారించిన మెట్రోపాలిటన్ న్యాయస్థానం ఆధారాలు లేవని కొట్టి వేసింది. జస్టిస్ ఉమ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు వెల్లడించారు. » దీంతో పిటిషన్ వేసిన నాగరాజ్ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా వివరాలు సేకరించి వాటిని న్యాయస్థానానికి అందజేశారు. దీంతో పాటు కేంద్ర యువజన సర్వీసుల మంత్రిత్వ శాఖ ఎంక్వైరీ రిపోర్టును కూడా జత చేశారు. అందులో రికార్డుల తారుమారు అంశంలో లక్ష్యసేన తండ్రి ధీరేంద్ర సేన్ తప్పు అంగీకరించిన వివరాలు ఉన్నాయి. » మరోవైపు ఆరోపణలు నిరాధారమని లక్ష్యసేన్ తరఫు న్యాయవాది వాదిస్తున్నారు.2018లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ఈ అంశాన్ని విచారించి ఎలాంటి అవకతవకలు లేవని ముగించిందని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న ప్లేయర్‌ను మానసికంగా ఇబ్బంది పెట్టేందుకే నాగారాజ్ ఈ పిటిషన్ వేసినట్లు పేర్కొన్నారు. » పిటిషన్ వేసిన నాగరాజ్ 2020లో కుమార్తెను ప్రకాశ్ పదుకొనె బ్యాడ్మింటన్ అకాడమీలో చేర్పించాలని ప్రయత్నించగా... ఆ బాలిక ఎంపిక కాలేదు. దీంతో నిరాశలో ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు లక్ష్యసేన్ తరఫు న్యాయవాది వాదిస్తున్నారు. » లక్ష్యసేన్ సోదరుడు చిరాగ్ సేన్... గతంలో తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలు అందించినట్లు నిర్ధారణ అయింది. దీంతో 2016లో భారత బ్యాడ్మింటన్ సంఘం అతడిపై నిషేధం కూడా విధించింది. -
‘పోరాడేందుకు వైఎస్ జగన్ స్ఫూర్తినిచ్చారు’
ఢిల్లీ: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేష్, దేవినేని అవినాష్ సహా 24 మందికి సుప్రీంకోర్టులో ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఈరోజు(మంగళవారం) విచారణలో భాగంగా పలువురు వైఎస్సార్ సీపీ నాయకులకు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. విచారణ జరిపిన జస్టిస్ సుధాంశు దులియా ధర్మాసనం.. షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.అనంతరం వైఎస్సార్ సీపీ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ తన కార్యకర్తలని, నాయకుల్ని కాపాడుకుంటున్నారు. టీడీపీ గెలిచిన నాటి నుంచి ఫ్రధాన ప్రతిపక్షానికి చెందిన నాయకులను వెంటాడి వేటాడి హింసిస్తున్నారు. మూడేళ్ల క్రితం జరిగిన దాడి.. ఇప్పుడు కొత్త కేసులు పెట్టి 128 మందిని ముద్దాయిలను చేసి హింసిస్తున్నారు. టిడిపి కార్యాలయం, చంద్రబాబు నివాసం పై దాడి కేసుల్లో సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ప్రతి ఒక్కరిని కాపాడుకుంటాం, ఏ ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదు. దేవినేని అవినాష్, జోగి రమేష్ లతో పాటు పలువురికి ముందస్తు బెయిల్ వచ్చింది. మన కార్యకర్తలు, నాయకులు కోసం పోరాడాలని వైఎస్ జగన్ ఆదేశించారు. పోరాడేందుకు వైఎస్ జగన్ స్ఫూర్తినిచ్చారు. ఇందుకు ప్రతీ వైఎస్సార్సీపీ కార్యకర్త, నాయకులు గర్వించాలి. ఎవరికి బెయిల్ రాకుండా, ప్రభుత్వం తరఫున న్యాయవాదులు చివరి వరకు ప్రయత్నం చేశారు. పోలీసుల విచారణకు మా నాయకులు హాజరై సహకరిస్తారు’ అని పొన్నవోలు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ నేతలకు ఊరట -
రీజనబుల్ టైం అంటే మూడు నెలలే..! సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ వాదన
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల(Telangana Defected MLAs) వ్యవహారంపై సుప్రీం కోర్టు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన తమ పది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ బీఆర్ఎస్ పార్టీ వేర్వేరుగా రెండు పిటిషన్లను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా.. రీజనబుల్ టైం అంటే ఎంతో కచ్చితంగా చెప్పాలంటూ తెలంగాణ స్పీకర్‌ను కోరింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యల కోసం రీజనబుల్ టైం కోసం స్పీకర్ ఎదురు చూస్తున్నారని అసెంబ్లీ కార్యదర్శి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి మరోసారి సుప్రీం కోర్టుకు తెలిపారు. అయితే.. సుప్రీంకోర్టు గత తీర్పుల ప్రకారం రీజనబుల్ టైమ్ అంటే మూడు నెలలు మాత్రమేనని బీఆర్ఎస్ వాదించింది. ఈ నేపథ్యంలో ఆ రీజనబుల్ టైం ఎంతో చెప్పాలంటూ కోర్టు తెలంగాణ స్పీకర్‌ను ప్రశ్నిస్తూ.. విచారణ వాయిదా వేసింది. మార్చి 4వ తేదీన బీఆర్ఎస్ పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం మరోసారి విచారించనుంది.ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు సహా 10 మంది విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయడం లేదంటూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పిటిషన్ వేశారు. అలాగే.. ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అమలు చేయడం లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరో పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లను కలిపి ద్విసభ్య ధర్మాసనం విచారిస్తోంది.ఆ పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా తెలంగాణ స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్ఎస్ సుప్రీం కోర్టును అభ్యర్థిస్తోంది. ఈ క్రమంలో గత వాదనల్లో.. తెలంగాణ స్పీకర్(Telangana Speaker) తీరుపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తగిన సమయం.. సరైన సమయం.. అంటూ స్పీకర్ చెబుతూ కాలయాపన చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర తరహాలో ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసేదాకా ఆగుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్లపై పూర్తి వాదనలు విన్నాకే ‘ఆ సరైన సమయం’పై తామే ఓ నిర్ణయం తీసుకుంటామని, అవసరమైతే స్పీకర్‌కు సూచనలు చేయడానికి ఉన్న అవకాశాలను కూడా పరిశీలిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడనుందా అనే ఆసక్తి నెలకొంది.నిబంధనల ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారని గత విచారణలో అసెంబ్లీ కార్యదర్శి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు తెలిపారు. అయితే సుప్రీం కోర్టు జోక్యం తర్వాతే స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు జారీ అయ్యాయని బీఆర్ఎస్ అంటోంది. -
ప్రభాస్ సినిమా.. సుప్రీకోర్టులో నిర్మాతకు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కాపీరైట్ వివాదానికి సంబంధించి దిల్ రాజుపై చర్యలు తీసుకోవాలంటూ సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు రెండు వారాల పాటు స్టే విధించింది. అంతేకాక తదుపరి విచారణ వరకు దిల్ రాజుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ‘నా మనసు నిన్ను కోరే నవల‘ఆధారంగా ‘మిస్టర్ పర్ఫెక్ట్‘అనే సినిమా తీశారంటూ రచయిత్రి ముమ్ముడి శ్యామలాదేవి 2017లో దిల్ రాజుపై కేసు పెట్టారు. దీంతో మాదాపూర్ పోలీసులు నిర్మాత దిల్ రాజుపై కాపీ రైట్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసు విచారణ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో జరిగింది. విచారణ సందర్భంగా ఇరు పక్షాల వాదనలు విన్న సిటీ సివిల్ కో ర్టు.. సాక్ష్యాలను పరిశీలించి 2019లో దిల్ రాజుపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే ఈ ఉత్తర్వులను కొట్టివేయాలంటూ దిల్ రాజు సుప్రీంకోర్టును ఆశ్రయించగా జస్టిస్ జె.బి. పార్ధీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌ల తో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. వాద నలు విన్న ధర్మాసనం తదుపరి విచార ణను రెండు వారాలపాటు వాయిదా వేసింది. అప్పటి వరకు సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా విషయానికొస్తే.. ప్రభాస్, కాజల్ అగర్వాల్, తాప్సీ, ప్రకాశ్‌రాజ్ ప్రధానపాత్రల్లో నటించిన ఈ చిత్రం 2011లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దశరథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. -
న్యాయ వ్యవస్థకు తాడు మీద నడక
రణవీర్ అలహాబాదియా కేసు ఎంత సంక్లిష్టమో సుప్రీంకోర్టు దాన్ని డీల్ చేసిన తీరు తేటతెల్లం చేస్తోంది. ఈ విచారణ... నైతిక ఆగ్రహానికీ, రాజ్యాంగ ఔచిత్యానికీ నడుమ తాడు మీద చేసిన నడకను తలపిస్తోంది. వాదప్రతివాదాలు విన్న తర్వాత యూ ట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ రణవీర్‌కు ఊరట కల్పిస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్త ర్వులు జారీ చేసింది. రణవీర్ సామాజిక మాధ్యమాల్లో ప్రముఖ వ్యక్తి. ‘ఇండియా గాట్ లేటెంట్’ అనే వెబ్ టాలెంట్ షోలో అతను చేసిన వ్యాఖ్యలపై అనేక ఎఫ్ఐఆర్లు దాఖలు అయ్యాయి. ఆ వ్యాఖ్యలు సరదా కోసమే చేసినప్పటికీ వాటిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికింది. మీడియా సంస్థలు, రాజకీయ నేతలు గగ్గోలు పెట్టడం అగ్నికి ఆజ్యం పోసి నట్లయింది. రణవీర్ భాష ఎంత అసహ్యకరంగా ఉంది అన్నది న్యాయపరంగా ప్రధాన ప్రశ్న కాదు, అది భారతీయ చట్టాల ప్రకారం నేరపూరిత అపరాధం అవుతుందా అవ్వదా అన్నదే ముఖ్యం. ఆయన న్యాయవాది అభినవ్ చంద్రచూడ్ న్యాయస్థానంలో చేసిన ఈ వాదన ఎంతైనా సమంజసం. వారికీ రాజ్యాంగ రక్షణ అవసరంకానీ కోర్టు ఇలాంటి సూక్ష్మ అంశాలను పట్టించుకునే మూడ్‌లో లేదు. భాష ‘డర్టీ’గా, ‘పర్వర్టెడ్’గా ఉందంటూ విచారణ ఆసాంతం ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై తన ఏహ్యభావం వ్యక్తం చేసింది. ఒక దశలో న్యాయమూర్తి కల్పించుకుని, ‘‘ఇలాంటి భాషను మీరు సమర్థిస్తున్నారా?’’ అని చంద్రచూడ్‌ను ప్రశ్నించారు. నిజానికి డిఫెన్స్ లాయర్ పాత్ర... అత్యంత తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్ననిందితుడికి సైతం న్యాయవ్యవస్థ ద్వారా చట్టపరమైన రక్షణ లభించేట్లు చూడటమే!సుప్రీంకోర్టు సమాజ నైతికతకు సంరక్షకురాలు కాదు. భావ ప్రకటన స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి రాజ్యాంగ హక్కులను కాపాడటమే దాని ప్రాథమిక విధి. భావప్రకటన స్వేచ్ఛను పరిరక్షించడం అంటే జనామోదం పొందిన భావప్రకటనను పరిరక్షించడం అనుకోకూడదు. అప్రియమైన, జనాదరణ లేని భావప్రకటన చేసి నప్పుడు అలాంటి వారికి రాజ్యాంగపరమైన రక్షణ అవసరం అవుతుంది.అభినవ్ చంద్రచూడ్ ఈ విచారణ సందర్భంగా న్యాయ సూత్రాల మీదకు కోర్టు దృష్టిని మరల్చారు. అపూర్వ అరోరా వెబ్ సిరీస్ (కాలేజ్ రొమాన్స్) కేసును ఉదహరిస్తూ, అసభ్యత మాత్రమే అశ్లీలత అవ్వదన్న సుప్రీం తీర్పును ఆయన ప్రస్తావించారు. ఒకరి భావప్రకటన ఇతరుల లైంగిక వాంఛలను ప్రేరేపించడానికి ఉద్దేశించి నదా, హద్దులు దాటి నేరపూరితమైన అశ్లీలతకు అది కారణమైందా అనే అంశాల ప్రాతిపదికగా దాన్ని పరీక్షకు పెట్టాలని ఈ తీర్పు చెబుతోంది. న్యాయస్థానం దీన్ని పట్టించుకున్నట్లు లేదు. ‘‘ఇది అశ్లీలత కాకుంటే, మరేది అశ్లీలత అవుతుంది?’’ అని ప్రశ్నించింది. కోర్టులు నైతిక శూన్యంలో పని చేయాలని అనడం లేదు. అలా అని వాటి నైతిక పరమైన ఏహ్యత... న్యాయ తర్కాన్ని కప్పివేయకూడదు. అరోరా కేసు ‘‘మీరు ఏదనుకుంటే అది మాట్లాడేందుకు లైసెన్స్ ఇచ్చిందా?’’ అని కోర్టు ప్రశ్నించడం గమనార్హం. తన వ్యక్తిగత మర్యాద భావన నుంచి వాక్ స్వాతంత్య్ర సంరక్షణను వేరు చేయడానికి కోర్టు విముఖంగా ఉన్నట్లు ఈ ప్రశ్న సంకేతాలు ఇచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యలతో కేసు ఎదుర్కొంటున్న ‘యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్’ రణవీర్ అలహాబాదియా పితృస్వామ్య కథనంరణవీర్ను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నట్లు ఆయన న్యాయవాది చంద్రచూడ్ కోర్టు దృష్టికి తీసుకురాగా, జస్టిస్ సూర్య కాంత్ చేసిన వ్యాఖ్య ప్రస్తుత హియరింగ్‌లో అత్యంత కలవరం కలిగించిన అంశం! ఈ తరహాలో చౌకబారు ప్రచారం పొందాలని మీరు ప్రయత్నించినట్లే, బెదిరింపుల ద్వరా చౌకబారు ప్రచారం సంపాదించాలని ప్రయత్నించే వారు కూడా ఉంటారు అని ఆయన వ్యాఖ్యానించారు. రణవీర్ మాటలు ఎంత అభ్యంతర కరమైనవి అన్నది పక్కనపెడితే, చంపేస్తామనే బెదిరింపులు వాటికి పర్యవ సానం కారాదు. రణవీర్ వ్యాఖ్యలు తన తల్లిదండ్రులకు అవమానం కలిగించా యని విచారణలో కోర్టు పదేపదే ప్రస్తావించింది. భారతీయ సాంస్కృతిక నియమాలను ఈ పితృస్వామ్య నెరేటివ్ ప్రతిఫలిస్తుంది. రాజ్యాంగంలో దీనికి చోటు లేదు. న్యాయస్థానాలు నైతికతకు పున రావాస కేంద్రాలు కావు. రణవీర్ నేరం చేశాడా లేదా అన్నదానికి... అతడు తన కుటుంబాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేశాడన్నది సంబంధం లేని విషయం. సామాజిక తిరస్కారాన్ని చట్టపరమైన నేరారోపణతో ముడిపెట్టడం అనేది కోర్టులు దాటకూడని ప్రమాదకమైన రేఖ. కోర్టు చిట్టచివరకు రణవీర్‌కు మధ్యంతర ఉపశమనం మంజూరు చేసింది. ప్రతివాదులకు నోటీసు జారీచేసి వారి సమాధానం కోరింది. ఇది సరైన నిర్ణయం. రణవీర్ వ్యాఖ్యలకు అభ్యంతరకర స్వభావం ఉన్నప్పటికీ, వాటిని నేరంగా గుర్తించడానికి అది చాలదు.‘ఇండియా గాట్ లేటెంట్’ వెబ్ షో వివాదం, పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన ఈ కార్యక్రమ స్వభావం సందర్భపరమైన ఒక ముఖ్యమైన అంశం లేవనెత్తింది. రణవీర్ వ్యాఖ్యల క్లిప్ అసందర్భంగా లీక్ అయ్యింది. ఆ విషయం కోర్టుకూ తెలిసినట్లే ఉంది. అయినా విచారణలో ఈ ఎరుక ప్రభావం కనిపించలేదు. భావప్రకటన స్వేచ్ఛ కేసుల్లో సంద ర్భానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. మూక ప్రేరేపిత నైతిక భయాందోళనల నుంచి కోర్టులు వాక్ స్వేచ్ఛను పరిరక్షించాలి. న్యాయస్థానాలు తమ విచారణలో ఎంత సంయమనం పాటించాల్సి ఉంటుందో గుర్తు చేసేందుకు రణవీర్ కేసు చక్కటి ఉదా హరణగా నిలుస్తుంది. న్యాయమూర్తులు కూడా మనుషులే. అందరి లానే వారికీ అసహ్యం, కోపం, అనైతికత పట్ల ఏహ్యభావం ఉంటాయి. కాని వారి వృత్తి... భావోద్వేగాలకు లోనై తీర్పులు చెప్పేది కాదు. రాగద్వేషాలకు అతీతంగా నిష్పక్షపాతంగా న్యాయాన్ని పరిరక్షించాలి. జనాభిప్రాయం వేరేలా ఉన్నప్పుడు ఈ విధి కష్టతరంగానే ఉంటుంది. కత్తి మీద సాములా వారు తమ విద్యుక్త ధర్మం నిర్వర్తించాల్సి వస్తుంది. విచారణ జరగాల్సిన తీరువ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించడానికి రాజ్యాంగానికి లోబడి అంతిమంగా తాను ఏం చేయాలో అదే మన సర్వోన్నత న్యాయ స్థానం చేసింది. మధ్యంతర ఉపశమనం మంజూరు చేస్తూ ఉత్తర్వు జారీ చేసింది. అయితే, ఈ క్రమంలో అది వ్యవహరించిన తీరు ప్రజలకు అస్పష్ట సంకేతాలు పంపింది. న్యాయవ్యవస్థ నిన్ను కాపాడు తుంది... కానీ ఆ పని నిన్ను అవమానానికి గురి చేసిన తర్వాతే,అసంతృప్తితోనే నీ హక్కులను గౌరవిస్తున్నట్లు నీకు స్పష్టం చేసిన తర్వాతే, నీ మీద తన నైతిక ఆధిక్యతను రుజువు చేసుకున్న తర్వాత మాత్రమే జరుగుతుందని చెప్పకనే చెప్పింది. రాజ్యాంగబద్ధ న్యాయస్థానాలు పని చేయాల్సిన తీరు ఇది కాదు. జనామోదం కొరవడిన వారికీ, అభ్యంతకరమైన వారికీ, ఆఖరుకు పెర్వర్ట్ అయిన వారికీ ప్రజాస్వామ్యంలో భావప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. దాన్ని కాపాడేందుకే సుప్రీం కోర్టు ఉన్నది. అసభ్యత నుంచి సమాజాన్ని శుద్ధి చేయడం తన బాధ్యత కాదనీ, తనకు దీపస్తంభంలా నిలవాల్సింది చట్టమే కాని నైతికత కానేకాదనీ న్యాయ స్థానం గుర్తు పెట్టుకోవాలి. అలా గుర్తు పెట్టుకుంటూ ఈ కేసు విచా రణ కొనసాగిస్తుందని ఆశిద్దాం.సంజయ్ హెగ్డే వ్యాసకర్త సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
కట్నం డిమాండ్ చేయడం క్రూరత్వం కాదు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: భార్య నుంచి భర్త కట్నం డిమాండ్ చేయడాన్ని క్రూరత్వంగా పరిగణించలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. భర్త, అత్తమామల నుంచి వివాహిత మహిళలకు రక్షణ కల్పించేందుకు 1983లో ప్రవేశపెట్టిన ఐపీసీ సెక్షన్ 498ఏ ప్రకారం.. కట్నం డిమాండ్ చేయడాన్ని క్రూరమైన నేరంగా భావించలేమని వెల్లడించింది. సెక్షన్ ప్రకారం 498ఏ ప్రకారం క్రూరత్వం అనేపదానికి విస్తృతమైన అర్థం ఉంది. కట్నం కింద ఆస్తులు గానీ, విలువైన వస్తువులు గానీ ఇవ్వాలని డిమాండ్ చేయడం చట్టవిరుద్ధమే. అయితే, కట్నం కోసం మహిళను శారీరకంగా, మానసికంగా వేధించడం క్రూరత్వం అవుతుంది. కేవలం కట్నం డిమాండ్ చేశారని 498ఏ సెక్షన్ కింద కేసు పెట్టకూడదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ ప్రసన్న బి.వరాలీతో కూడిన ధర్మాసనం గత ఏడాది డిసెంబర్ 12న ఆదేశాలు జారీ చేసింది. -
పాస్‌పోర్టు కోర్టులో ఉన్నా అమెరికా ఎలా వెళ్లాడు?
న్యూఢిల్లీ: పాస్‌పోర్టు కోర్టు అధీనంలోనే ఉన్నప్పటికీ ధిక్కారం ఆరోపణలను ఎదుర్కొంటున్న వ్యక్తి అమెరికాకు వెలా వెళ్లిపోయాడని సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇది చాలా తీవ్రమైన అంశమని జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ మన్మోహన్‌ల ధర్మాసనం పేర్కొంది. దీనిపై తక్షణమే దర్యాప్తు చేపట్టాలని, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సీబీఐని ఆదేశించింది. అమెరికాలో భర్త వద్ద ఉన్న తన బిడ్డను అప్పగించాలంటూ ఓ మహిళ పెట్టుకున్న పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జనవరి 29వ తేదీన ఆ వ్యక్తిపై నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. అతడిని అరెస్ట్ చేసేలా అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని, చట్టం ముందు అతడిని నిలబెట్టాలని హోం శాఖను సైతం ఆదేశించింది. అయినప్పటికీ, అతడు తప్పించుకుపోవడంపై విస్మయం చెందింది. ఆ వ్యక్తి ఫోర్జరీ పత్రాలతో అమెరికా వెళ్లిపోయి ఉంటాడని పిటిషనర్ తెలిపారు. అమెరికా హోం శాఖకు విషయం తెలిపి, తప్పించుకున్న వ్యక్తిని అక్కడి అధికారుల సాయంతో వెనక్కి తీసుకువచ్చేందుకు అవకాశముందని అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ ధర్మాసనానికి నివేదించారు. ఆ వ్యక్తి ఎయిర్ పోర్టులో వీల్ చైర్లో వెళ్తున్న దృశ్యాలతో కూడిన వీడియోను అందజేశారు. అయితే, చిన్నారిని తల్లి చెంతకు చేర్చడం ముఖ్యమైన అంశమని పేర్కొన్న ధర్మాసనం..చిన్నారి వెంటనే అమెరికా నుంచి తీసుకువచ్చి తల్లికి అప్పగించాలని ప్రతివాది తరఫు లాయర్‌కు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. -
ఖైదీలపై ఇంత వివక్షా!
జైలుశిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు శిక్షనుంచి మినహాయింపు (రెమిషన్) ఇవ్వడానికి సంబంధించిన విధానం ఉన్నప్పుడు దాన్ని అమలు చేయటం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతనీ, ఖైదీలు అడగటం లేదు గనుక ఆ మినహాయింపుపై ఆలోచించాల్సిన అవసరం లేదని భావించటం సరికాదనీ సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం ఇచ్చిన తీర్పు కీలకమైనది. ఒక చట్టం రూపొందటం వెనక ఎంతో కృషి ఉంటుంది. దాని అవసరాన్ని గుర్తించటం తొలి మెట్టయితే ఆ తర్వాత జరిగే ప్రక్రియ ఎంతో సుదీర్ఘమైనది. తొలుత చట్టం పూర్వరూపమైన బిల్లు ముసాయిదా రూపురేఖలపైనా, ఆ తర్వాత దాన్లో ఉండాల్సిన నిబంధనలపైనా, పరిహరించవలసినవాటిపైనా లోతైన చర్చలుంటాయి. చట్ట సభలోనూ, పౌర సమాజంలోనూ దాని మంచిచెడ్డలపై నిశిత పరిశీలన ఉంటుంది. తీరా చట్టం అయ్యాక ప్రభుత్వాలు దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఈ కృషి మొత్తం వృథా అవుతుంది. కొన్ని ప్రభుత్వాల ధోరణి మరీ అన్యాయం. ఖైదీల శిక్ష మినహాయింపుపై వాటికంటూ విధానమే ఉండదు. ఆ బాపతు రాష్ట్రాలకు కూడా సుప్రీంకోర్టు చురకలంటించింది. ఇంతవరకూ శిక్ష మినహాయింపుపై విధానం లేని రాష్ట్రాలు రెండు నెలల్లో ఆ పని చేయాలనీ, అది వాటి బాధ్యతనీ ధర్మాసనం తేల్చిచెప్పింది. ఖైదీలు అడగలేదన్న సాకు చెల్లదన్నది తీర్పు సారాంశం.నిన్న మొన్నటివరకూ నూటయాభైయ్యేళ్ల నాటి నేర శిక్షాస్మృతి(సీఆర్పీసీ) ఉండేది. దానిస్థానంలో నిరుడు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) అమల్లోకొచ్చింది. సీఆర్పీసీ లోని చాలా నిబంధనలు బీఎన్ఎస్ఎస్లోకి కూడా వచ్చాయి. కాకపోతే ఆ సెక్షన్ల క్రమసంఖ్యలు మారాయి. ఖైదీలకు శిక్షాకాలం నుంచి మినహాయింపునిచ్చేందుకు, ఆ శిక్షను తాత్కాలికంగా నిలిపి వుంచేందుకూ ప్రభుత్వానికి సీఆర్పీసీలోని సెక్షన్ 432 అధికారం ఇవ్వగా... బీఎన్ఎస్ఎస్లోని 473వ సెక్షన్ ఆ పని చేస్తోంది. చట్టం ఇంత స్పష్టంగావున్నా రాష్ట్ర ప్రభుత్వాలు దానిపై శ్రద్ధ పెట్టడం లేదు. ఈ సెక్షన్లకు అనుగుణంగా విధాన రూపకల్పన చేసిన ప్రభుత్వాలూ, అసలు దాని జోలికేపోని ప్రభుత్వాలూ కూడా శిక్ష మినహాయింపు ఇవ్వొచ్చన్న సంగతే తెలియనట్టు వ్యవహరిస్తున్నాయి.జైళ్లంటే చాలామందికి చిన్నచూపు ఉంటుంది. అక్కడ నిర్బంధంలో ఉన్నవారంతా ఏదో తప్పు చేసేవుంటారన్న భావనలోనే చాలామంది ఉంటారు. జైళ్లలో ఉన్నవారంతా నేరస్తులు కాదు. నేరం రుజువై శిక్ష అనుభవిస్తున్నవారిలో కూడా చాలామందికి జరిగిన నేరంతో నిజంగా ప్రమేయం లేకపోవచ్చు. సకాలంలో తగిన న్యాయసహాయం అందకపోవటం వల్ల కావొచ్చు... ఆర్థిక స్థోమత లేకపోవటంవల్ల కావొచ్చు వారు ఈ ఉచ్చులో చిక్కుకుని ఉండొచ్చు. పలుకుబడి ఉన్నవారు తమ నేరాన్ని వేరేవారిపైకి నెట్టి వారు జైలుకు పోయేలా చేసిన సందర్భాలూ అప్పుడప్పుడు బయట పడు తుంటాయి. ఒకవేళ నిజంగా నేరంతో ప్రమేయం ఉన్న వ్యక్తికి సైతం అతడి హక్కులన్నీ హరించుకు పోవు. శిక్ష కారణంగా కొన్ని హక్కులు తాత్కాలికంగా నిలిచిపోతాయి. శిక్ష మినహాయింపు అర్హత పొందిన ఖైదీలకు ఆ వెసులుబాటును కల్పించకపోవటం అంటే ప్రభుత్వాలు వివక్ష ప్రదర్శించటమే, ఏకపక్షంగా వ్యవహరించటమే అవుతుంది. చట్టం ముందు పౌరులందరూ సమానులేనని, ఎవరి పట్లా వివక్ష ప్రదర్శించరాదని ప్రాథమిక హక్కుల్ని ప్రసాదించే రాజ్యాంగంలోని 14వ అధికరణ స్పష్టం చేస్తోంది. శిక్షలో మినహాయింపునకు అర్హత పొందినవారికి దాన్ని నిరాకరించటం అంటే ఈ అధికరణాన్ని ఉల్లంఘించటమే అవుతుంది. శిక్షకాలంలో మినహాయింపునివ్వటం కూడా విచక్షణా రహితంగా ఉండకూడదు. శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి నేర స్వభావంలో మార్పు వచ్చిందో లేదో గమ నించటం, సమాజంలో సాధారణ మనిషిగా జీవించ గలుగుతాడా అని చూడటం జైలు అధికారుల బాధ్యత.వారినుంచి నివేదికలు తెప్పించుకుంటూ తగిన నిర్ణయానికి రావాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానికుంటుంది. ఈ తీర్పులో సుప్రీంకోర్టు మరో కీలకమైన అంశాన్ని గుర్తుచేసింది. శిక్ష మినహాయింపునకు రూపొందించే నిబంధనలు ఖైదీలు వినియోగించుకోవటం అసాధ్యమైన రీతిలో కఠినంగా ఉండరాదని... అవి అస్పష్టంగా కూడా ఉండకూడదని సూచించింది. ఒకవేళ మినహా యింపునకు అర్హత లేనట్టయితే అందుకు గల కారణాలేమిటో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీకి జైలు అధికారులు వివరించాల్సి వుంటుంది. అదే సమయంలో తన అనర్హతకు చూపిన కారణాలను సవాలు చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని ఖైదీకి చెప్పాల్సిన బాధ్యత కూడా వారిదే. ఒకవేళ బయటి కెళ్లాక ఖైదీ ప్రవర్తన సమాజానికి హాని కలిగే రీతిలో ఉన్నదని భావిస్తే శిక్ష మినహాయింపును రద్దు చేసే అధికారం ప్రభుత్వానికుంటుంది. అందుకుగల కారణాలను ఆ ఖైదీకి వివరించాలి.చట్టాలు చేయగానే సరికాదు. వాటిని వినియోగించటానికి అవసరమైన విధానాలను కూడా రూపొందించాలి. చిత్తశుద్ధితో వాటిని అనుసరించాలి. ఆచరణకు అనువైన విధానం లేనట్టయితే చట్టాల ఉద్దేశమే నీరుగారుతుంది. 2022 నాటి నేషనల్ క్రైం రికార్డుల బ్యూరో గణాంకాల ప్రకారం దేశంలోని 1,300కు పైగా జైళ్లలో 5,73,200 మంది ఖైదీలున్నారు. ఈ జైళ్లలో వాస్తవానికి 4,36,266 మందికి సరిపడా వసతులు మాత్రమే ఉన్నాయి. జైళ్లు ఇలా కిక్కిరిసి ఉండటంవల్ల అవి సకల రుగ్మతలకూ నిలయాలవుతున్నాయి. నిస్సహాయుల పాలిట నరకాలవుతున్నాయి. చాలీచాలని సిబ్బందితో పర్యవేక్షణ అసాధ్యమై నిజంగా నేరం చేసినవారిని సంస్కరించటం మాట అటుంచి, అకారణంగా జైలుపాలైనవారు సైతం నేరగాళ్లుగా మారే ప్రమాదం పొంచివుంటోంది. తాజా తీర్పు ప్రభుత్వాల మొద్దునిద్ర వదిలించాలి. -
అంత మాత్రానికే జీవితం ముగిసినట్లు కాదు
న్యూఢిల్లీ: వివాహ బంధం ముగిసినంత మాత్రాన జీవితమే అయిపోయినట్లు కాదని, ముందున్న భవిష్యత్తు గురించి ఆలోచించాలని విడాకుల జంటను ఉద్దేశించి దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఓ విడాకుల కేసు విచారణ సందర్భంగా జంటను ఉద్దేశించి జస్టిస్ పీబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ నేతృత్వంలోని బెంచ్(SC Bench) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.‘‘ఈ కేసులో విడాకులు తీసుకోవాలనుకుంటున్న జంటది(Divorce Couple) చిన్నవయసే. ఇలాంటి వాళ్లకు బోలెడంత భవిష్యత్తు ఉంటుంది. ఆ భవిష్యత్గు గురించి వాళ్లు ఆలోచించుకోవాలి. వివాహ బంధం ముగిసినంత మాత్రాన..వాళ్ల జీవితాలు అయిపోయినట్లు కాదు. వాళ్లు కొత్త జీవితాలను ప్రారంభిస్తూ ముందుకు సాగాలి’’అని న్యాయమూర్తులు సూచించారు .ఈ కేసులో వివాహం జరిగినా ఏడాదిలోపే ఆమె తిరిగి పుట్టింటికి పెళ్లడం దురదృష్టకరం. విడాకుల తర్వాతైనా ప్రశాతంగా జీవించండి అని ఆ జంటకు సూచించింది ధర్మాసనం.కేసు నేపథ్యం..2020 మే నెలలో మహారాష్ట్ర(Maharashtra)కు చెందిన యువకుడికి, మధ్యప్రదేశ్‌కు చెందిన యువతికి వివాహం జరిగింది. అయితే అత్తింటి వేధింపులతో కొన్ని నెలలకే తిరగకముందే ఆమె పుట్టింటికి చేరింది. భర్త, అతని కుటుంబ సభ్యులపై ఆమె ఫిర్యాదు చేసింది. బదులుగా ఆ భర్త కూడా ఆమెపై ఫిర్యాదు చేశాడు. అలా.. మొత్తం 17 కేసులు నమోదు అయ్యాయి.అలా చేస్తే సాగదీయడమే!వీళ్ల విడాకుల వ్యవహారం సుప్రీం కోర్టు(Supreme Court)కు చేరింది. అయితే ఇలా పోటాపోటీగా కేసులు వేయడం.. విడాకుల వ్యవహారాన్ని సాగదీయడమే అవుతుందని ఇరుపక్షాల లాయర్లతో ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో కేసులు ఉపసంహరించుకుంటామని వాళ్లు తెలిపారు. అదే సమయంలో ఆ జంట కలిసి జీవించే పరిస్థితులు లేవని.. ఆర్టికల్ 142 ప్రకారం విస్తృత అధికారాన్ని ఉపయోగించి విడాకులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో కోర్టు విడాకులు మంజూరు చేసింది.వివాహ బందం కోలుకోలేని విధంగా విచ్ఛినమైతే.. ఆరు నెలలు కూడా ఆగాల్సిన అవసరం లేదు. కొన్ని షరతులతో ఆ నిరీక్షణ గడువును ఎత్తేయొచ్చు. ఈ కారణం కింద వారి ఆ పెళ్లి రద్దు చేసి విడాకులు మంజూరు చేయడం సుప్రీం కోర్టుకు సాధ్యమే. ఇందుకు ఆర్టికల్ 142 కింద కోర్టుకు అధికారం ఉంటుంది::: జనవరి 06 2025 రాజ్యాంగ ధర్మాసనం తీర్పు -
పాలిచ్చే తల్లులకు ప్రైవసీ కల్పించండి
న్యూఢిల్లీ: పాలిచ్చే తల్లులకు ప్రైవసీని కల్పించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. పాలిచ్చే తల్లులకోసం బహిరంగ ప్రదేశాల్లో, ప్రత్యేకించి ప్రభుత్వ భవనాల్లో ప్రత్యేక గదులు ఏర్పాటు చేసేలా రాష్ట్రాలకు సూచించాలని కేంద్రాన్ని ఆదేశించిందచి. బహిరంగ ప్రదేశాల్లో ఫీడింగ్ కోసం గదులు, పిల్లల సంరక్షణ కోసం సౌకర్యం కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ప్రసన్నలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. పిల్లలు, మహిళలకు రాజ్యాంగం కల్పించిన ఆ హక్కులను కాపాడాలని గుర్తు చేసింది. ఇది పాలిచ్చే తల్లులకు సౌకర్యాన్ని, రక్షణను ఇస్తుందని పేర్కొంది. రాష్ట్రాలు ఈ ఆదేశాలను అమలు చేసేలా, ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ప్రభుత్వ భవనాల్లో ఈ సౌకర్యానికి రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత స్థలం కేటాయించేలా చూడాలని, ఇప్పటికే ఉన్న బహిరంగ ప్రదేశాల్లో గదులను కేటాయించాలని కోర్టు అభిప్రాయపడింది. -
అన్ని అంశాలను ఇక్కడ విచారించలేం
న్యూఢిల్లీ: స్థిరాస్తుల కూల్చివేత విషయంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఉల్లంఘించారంటూ మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సంబంధిత అధికారులపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు చేపట్టాలని కోరుతూ దాఖలైన ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషన్ గురువారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జి మాసీ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వచ్చింది. దీనిపై తాము విచారణ చేపట్టలేమని, హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది. అన్ని అంశాలనూ తాము ఇక్కడ విచారించలేమని స్పష్టంచేసింది. ముందస్తుగా నోటీసు ఇవ్వకుండా ఆస్తులను కూల్చడానికి వీల్లేదని, కనీసం 15 రోజుల సమయం ఇవ్వాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు 2024 నవంబర్ 13న తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో అధికారులు తగిన సమయం ఇవ్వకుండానే ఆస్తులు కూల్చేశారని ఆరోపిస్తూ బాధితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టుకు వెళ్లాలని -
హైకోర్టు జడ్జిపై లోక్‌పాల్ విచారణా?
న్యూఢిల్లీ: ఒక హైకోర్టు సిట్టింగ్ అడిషనల్ జడ్జిపై లోక్‌పాల్ విచారణ చేపడుతూ ఉత్తర్వులు జారీచేయడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. ఈ ధోరణి ఏమాత్రం ఆమోదనీయం కాదని పేర్కొంది. ఈ మేరకు లోక్‌పాల్ జారీచేసిన ఉత్తర్వుల అమలుపై స్టే విధిస్తూ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకాల సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఒక హైకోర్టు జడ్జిపై నమోదైన రెండు ఫిర్యాదులను విచారిస్తూ లోక్‌పాల్ జనవరి 27వ తేదీన ఉత్తర్వులు ఇచ్చిన అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి గురువారం విచారించింది. న్యాయవ్యవస్థ స్వతంత్రకు భంగం కల్గించేలా లోక్‌పాల్ వ్యవహరిస్తోందని కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. హైకోర్టు జడ్జి ఉదంతంలో స్పందన తెలపాలని కేంద్ర ప్రభుత్వం, లోక్‌పాల్ రిజిస్ట్రార్‌తోపాటు హైకోర్టు జడ్జిపై ఫిర్యాదుచేసిన వ్యక్తికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. సుప్రీంకోర్టు అభిప్రాయంతో కేంద్రప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఏకీభవించారు. హైకోర్టు జడ్జి ఎప్పుడూ కూడా లోక్‌పాల్, లోకాయుక్త చట్టం,2013 పరిధిలోకి రారని మెహతా వాదించారు. ఈ కేసులో హైకోర్టు జడ్జి పేరు బహిర్గతం కాకుండా చూడాలని, ఆ ఫిర్యాదుదారు పేరు, అతను ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను రహస్యంగా ఉంచాలని లోక్‌పాల్ రిజిస్ట్రార్ జనరల్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘‘ఈ అంశంలో కోర్టుకు సాయపడతా. హైకోర్టు జడ్జీల విషయంలో ఇలాంటివి పునరావృతంకాకుండా ఒక చట్టం ఉంటే మంచిది’’ అని ఈ అంశంలో కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అన్నారు. కేసు తదుపరి విచారణను మార్చి 18వ తేదీకి వాయిదావేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. లోక్‌పాల్‌లో ఫిర్యాదుచేసిన వ్యక్తికి వ్యతిరేకంగా ఒక ప్రైవేట్ కంపెనీ ఒక కేసును నమోదుచేసింది. ఈ కేసులో తమకు అనుకూలంగా వ్యవహరించాలని ఈ హైకోర్టు సిట్టింగ్ అడిషనల్ జడ్జిని ఈ ప్రైవేట్ సంస్థ కోరింది. ఈ జడ్జి గతంలో లాయర్‌గా ఉన్న కాలంలో ఇదే సంస్థకు చెందిన కేసును వాదించారు. ఇప్పుడు ఆయన జడ్జీ అయ్యాక ఈ కేసులో హైకోర్టులో మరో జడ్జి, అదనపు జిల్లా జడ్జీలను ఈయన ప్రభావితం చేశారని ఫిర్యాదుదారు లోక్‌పాల్‌లో కేసు వేశారు. దీంతో లోక్‌పాల్ జనవరి 27వ తేదీన హైకోర్టు జడ్జిపై ఉత్తర్వులు జారీచేసింది. లోక్‌పాల్, లోకాయుక్త చట్టం, 2013లోని సెక్షన్ 20(4) ప్రకారం హైకోర్టు జడ్జిపై విచారణ చేపట్టే హక్కు తమకు ఉందని జస్టిస్ ఏఎం ఖన్వీల్కర్ సారథ్యంలోని లోక్‌పాల్ బెంచ్ పేర్కొనడంతో సుప్రీంకోర్టు చివరకు ఇలా కలగజేసుకుంది. -
పబ్లిక్ స్థలాల్లో మహిళలు, శిశువులకు వసతులు కల్పించాలి
న్యూఢిల్లీ: పబ్లిక్ స్థలాల్లో నిర్మించిన భవనాలు, నిర్మించబోయే భవనాల్లో శిశువుల సంరక్షణకు, వారికి తల్లులు స్తన్యం ఇచ్చేందుకు ప్రత్యేక వసతులు కల్పించాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలని సూచించింది. ప్రత్యేక గదుల్లాంటివి నిర్మిస్తే తల్లుల గోప్యతకు భంగం వాటిల్లకుండా ఉంటుందని, పిల్లలకు సైతం మేలు జరుగుతుందని వెల్లడించింది. పబ్లిక్ స్థలాల్లో ఫీడింగ్ రూమ్‌లు, చైల్డ్‌కేర్ గదులు నిర్మించేలా ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ప్రసన్న బి.వరాలీతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. తల్లులు, బిడ్డల కోసం భవనాల్లో తగినంత స్థలం కేటాయించి, వసతులు కల్పించాలని పేర్కొంది. సుప్రీంకోర్టు విచారణకు కేంద్ర ప్రభుత్వం తరఫు హాజరైన న్యాయవాది స్పందిస్తూ... పబ్లిక్ స్థలాల్లో తల్లులు, శిశువులకు వసతులు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సూచిస్తూ 2024 ఫిబ్రవరి 27న కేంద్ర మహిళ, శిశు అభివృద్ది శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. ఈ ఆదేశాలపై ధర్మాసనం సంతృప్తి వ్యక్తంచేసింది. ఆదేశాలను రాష్ట్రాలకు మరోసారి గుర్తుచేయాలని పేర్కొంది. -
ఉచితమా? అనుచితమా?
ఉచిత పథకాల గురించి సుప్రీం కోర్టు ఈనెల 12న వ్యాఖ్యానించటంతో ఈ విషయం మరొకమారు చర్చలోకి వచ్చింది. ఈ ధోరణులకు మూలం ఎక్కడున్న దనేది ఒక ప్రశ్న అయితే, అందుకు అసలు పరిష్కారం ఉందా అన్నది రెండవ ప్రశ్న. ఇండియా మధ్యయుగాల కాలం నుంచి ఫ్యూడల్ వ్యవస్థలలో, తర్వాత దానితో పాటు కొన్ని వందల సంవత్సరాలపాటు వలస పాలనలో మగ్గిపోయి అన్ని విధాలుగా వెనుకబడింది. అట్లాగని దేశంలో సహజ వనరులకు, కష్టించి పనిచేసే మానవ సంపదకు కొరత లేదు. ఏవో కొన్నిచోట్ల తప్ప, గ్రామీణ ఆర్థికతపై, అవసరాలపై ఆధారపడి సాగే సకల వృత్తుల వారున్నారు. అయినప్పటికీ, 1947లో దేశానికి స్వాతంత్య్రం సాధించుకునే నాటికి, అత్యధిక శాతం ప్రజలు దయనీయంగా వెనుకబడి ఉన్నారు. తమ స్థితిగతుల పట్ల, అందుకు కారణాలపట్ల, ప్రజలలో చైతన్యానికి ఎంత మాత్రం కొరత లేదు. వాస్తవానికి అటువంటి చైతన్యాలు గలవారు అనేక రూపాలలో సాగించిన ఉద్యమాలూ, తిరుగుబాట్లూ, 1857 నాటి ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామానికీ, 1885 నుంచి కాంగ్రెస్ నాయకత్వాన స్వాతంత్య్రోద్యమానికీ భూమికగా పనిచేశాయి.ప్రణాళికలు సరిగ్గా అమలైవుంటే...ఈ నేపథ్యాన్నంతా ఇంతగా చెప్పుకోవటానికి కారణాలున్నాయి. వనరులు, ప్రజల చైతన్యాలు గల దేశంలో గత 75 సంవత్సరాల స్వాతంత్య్ర కాలంలో తగిన విధానాలు, వాటి అమలు ఉండిన పక్షంలో ఈరోజు అసలు ఉచితాల అవసరమే ఏర్పడేది కాదు. ఎన్నిక లకు ముందు ఎందుకీ ఉచితాలని, అందువల్ల ప్రజలు పనిచేసేందుకు ఇష్టపడటం లేదని, ఆ విధంగా పరాన్నజీవుల తరగతి ఒకటి సృష్టి అవుతున్నదని సాక్షాత్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యా నించవలసిన పరిస్థితి వచ్చేది కాదు. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకోవాలి. దేశం పేదరికం నుంచి బయటపడి అభివృద్ధి సాధించేందుకు చేయవలసిందేమిటన్న అవగా హన స్వాతంత్య్రోద్యమ నాయకులకు 1947 కన్న ముందే స్పష్టంగా ఉంది. వ్యవసాయిక, పారిశ్రామిక, వాణిజ్య రంగాలన్నింటికి సంబంధించి వారంతా బాగా చదివి అనేక దేశాలను, అక్కడి ఆలోచనా విధానాలను, అభివృద్ధి విధానాల తీరుతెన్నులను గమనించినవారు. వాటిని భారతదేశ పరిస్థితులకు ఏ విధంగా అన్వయించాలో అర్థం చేసుకున్నవారు. ఇటువంటి నేపథ్యాల వల్లనే వారి మేధస్సుల నుంచి, సుదీర్ఘ చర్చల నుండి, అప్పటికే చిరకాలంగా ప్రజాస్వామికంగా ఉండిన దేశాలకు మించి, ప్రపంచంలోనే ఎక్కడా లేనంత గొప్ప రాజ్యాంగం రూపుదిద్దుకున్నది. దేశ స్వాతంత్య్రోద్యమం వలెనే రాజ్యాంగం కూడా ఆసియా, ఆఫ్రికాలలోని ఇతర వలస వ్యతిరేక ఉద్యమాలకు ఆదర్శప్రాయమైంది. ఆ రాజ్యాంగానికి అనుగుణంగా తర్వాత కాలంలో చట్టాలు, ప్రణాళికలు, సంక్షేమ పథకాలు రూపు తీసుకున్నాయి. అవి సక్రమంగా అమలై ఉండినట్లయితే ఈ చర్చలకు ఆస్కారమే ఏర్పడేది కాదు.స్వాతంత్య్రం వచ్చిన నాటి పేద స్థితిగతులను బట్టి సంక్షేమం తప్పనిసరి. దేశం, దానితోపాటు వారూ అభివృద్ధి చెందటం రాత్రికి రాత్రి జరిగేది కాదు. సంక్షేమ దృక్పథం పారిశ్రామిక విప్లవం నుంచి యూరప్‌లో, ఇంకా చెప్పాలంటే మన దేశంలోనూ మొదటి నుంచి ధార్మిక భావనలలో భాగంగా ఉన్నదే. అయితే, ఆధునిక ప్రజా స్వామిక, ఆర్థిక వ్యవస్థలు ఏర్పడిన తర్వాత, సకల జనుల అభివృద్ధి క్రమంలో, ఆ పని సవ్యంగా జరిగినట్లయితే, సంక్షేమ చర్యల అవసరం క్రమంగా తగ్గిపోవాలి. పేదలు తమ కాళ్లపై తాము నిలబడ గలగాలి. అదే ప్రభుత్వం లక్ష్యమై, దాని విధానాలు, ఆచరణలు అందుకు దోహదం చేయాలి. ఆ పని జరగనపుడు అంతా అస్తవ్యస్త మవుతుంది. ఈ పరిస్థితుల నుంచి పుట్టుకు వచ్చేదే పాప్యులిజం.సంక్షేమం కాస్తా పాప్యులిజంగా లేదా జంక్ వెల్ఫేర్‌గా మారటం. అభివృద్ధి మార్గంస్వాతంత్య్ర సమయానికి దేశ పరిస్థితులు ఏమిటో స్పష్టంగా తెలిసిన నాయకులు అందుకు పరిష్కార మార్గాలను కూడా అన్వేషించినట్లు పైన చెప్పుకున్నాము. వారి అవగాహనలు, అన్వేషణలు అంతకుముందే ఉండినట్లు 1947కు ముందు కాంగ్రెస్ మహాసభల ఆర్థిక సంబంధ తీర్మానాలను, 1935 నాటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాల చర్యలను పరిశీలించినట్లయితే అర్థమవుతుంది. అటువంటపుడు 1947 తర్వాత, 1951–52 నాటి మొదటి ఎన్నికల వెనుక జరిగిందేమిటి? పరిస్థితులను మార్చేందుకు నెహ్రూ ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన చట్టాలు చేసింది. వాటిలో భూసంస్కరణలు, గ్రామ పంచాయితీ వ్యవస్థ, సహకార సంఘాల ఏర్పాటు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు మొదలైనవి ఉన్నాయి. ఇవి అమలైనట్లయితే గ్రామీణ భారతంలో పేదలకు భూములు లభించటం, పంచాయితీలలో, సహకార సంఘాల ద్వారా లభించే వాటిలో వారికి అవకాశాలు, రిజర్వేషన్ల ద్వారా విద్యా – ఉద్యోగాలు, అంతిమంగా ఫ్యూడల్ శక్తుల పట్టు క్రమంగా సడలి పేద ప్రజల అభ్యున్నతి వంటివి జరుగుతాయి. పలు దేశాలలో భూసంస్కరణలు ఇటువంటి ఫలితాలను ఇవ్వటమే గాక, వ్యవసాయ రంగంలో సంపదల సృష్టి జరిగి అది పారిశ్రామికాభివృద్ధికి పెట్టుబడిగా ఉపయోగ పడింది. భారతదేశంలో అటు వంటి క్రమం మొదలై సాగి ఉంటే, సంక్షేమం ఉచితాలుగా, ఉచితాలు ఊబిగా మారి ఉండేవి కావు. నిజానికి చాలా కాలం వరకు సంక్షేమం కూడా సరిగా అమలు కాలేదు. కనుక ఇదంతా కేవలం స్వయంకృతం.ప్రహసన ప్రాయంగా...అదట్లుంచితే, తొలి దశలో రూపొందిన ఈ గొప్ప ప్రణాళికలు ఎందువల్ల విఫలమైనట్లు? సూటిగా చెప్పాలంటే, కాంగ్రెస్‌లో స్వాతంత్య్రోద్యోమ కాలం నుంచే బలంగా ఉండిన ఫ్యూడల్ వర్గాలు, తర్వాత ఆ పార్టీలో చేరిన మాజీ రాజసంస్థానాలవారు, గొప్పగా కాకున్నా ఒక మేరకు ఉండిన పారిశ్రామిక వర్గాలు కలిసి, అధికార యంత్రాంగాన్ని తమకు విధేయులుగా మార్చుకుని, తమ ప్రయో జనాల కోసం అన్నింటినీ కుంటుపరిచారు. నెహ్రూ నిస్సహాయునిగా మిగిలారు. అందుకే ఏ ఒక్కటీ సవ్యంగా అమలుకాక, స్వాతంత్య్ర ఫలితాల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తుండిన పేదలు, మధ్య తరగతి వర్గాలను తీవ్రంగా నిరాశపరచింది. దాని పర్యవసానంగానే 1957 ఎన్నికలలో కాంగ్రెస్ కొన్ని ముఖ్యమైన రాష్ట్రాలలో ఓడటం, 1960ల మధ్యకు వచ్చేసరికి వివిధ తరగతుల ఆందోళనలు, 1967లో కాంగ్రెస్‌ను 9 రాష్ట్రాలలో ఓడించి సంయుక్త విధాయక్ దళ్ ప్రభు త్వాల ఏర్పాటు, 1969 నుంచి నక్సలైట్ ఉద్యమం వంటివి వరుసగా జరుగుతూ వచ్చాయి. భూసంస్కరణలు, పంచాయితీరాజ్ వ్యవస్థ, సహకార సంఘాలు, రిజర్వేషన్ల అమలు ప్రహసనంగా మిగిలాయి. ఇందుకు ప్రజలను నిందించటంగానీ, వారు ఉచితాల కారణంగా పనులకు వెళ్లటం లేదనటంగాని పూర్తిగా నిర్హేతుకమైనది. మారుతున్న పరిస్థితులలో వారికి నిత్య జీవిత వ్యయం, ఇతర అవస రాల ఖర్చు చాలా పెరుగుతున్నాయి. కేవలం ఉచితాలు ఎంత మాత్రం సరిపోవు. ఉచితాల ఊబికి ఏకైక పరిష్కారం ప్రభుత్వాలు, పార్టీలు తామే చేసిన రాజ్యాంగాన్ని, చట్టాలను నిజాయితీగా అమలు పరచటం. పేదలు పెట్టుబడిదారీ వ్యవస్థ కోసం సరిగా పని చేయా లన్నా, తిరుగుబాట్లు చేయవద్దనుకున్నా వారికి సంక్షేమ పథకాలు అవసరమని సిద్ధాంతీకరించి సవ్యంగా అమలు చేసిన బ్రిటిష్ వ్యవస్థను, జర్మన్ నియంత బిస్మార్క్‌ను మనం ఒకసారి చదువుకుంటే ఉపయోగపడుతుంది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
CEC appointment hearing: వాయిదా కోరిన కేంద్రం.. సరికాదన్న పిటిషనర్ లాయర్
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్‌పై విచారణను వాయిదా వేయాలని కేంద్రం కోరింది. అయితే దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అభ్యంతరం వ్యక్తం చేయగా.. ధర్మాసనం జోక్యం చేసుకుంది. ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించడం, ఆ స్థానంలో ప్రత్యేక చట్టం ద్వారా కేంద్ర మంత్రిని కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిని జస్టిస్ సూర్యకాంత్,ఎన్ కోటీశ్వర్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం అత్యవసర విచారణ చేపట్టింది.అయితే విచారణ ప్రారంభమైన కాసేపటికే.. రాజ్యాంగ ధర్మాసనం ముందు తాను హాజరు కావాల్సి ఉందని చెబుతూ సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విచారణ వాయిదా వేయాలని కోరారు. అయితే ప్రతీ కేసు విచారణ వాయిదా కోరడం సరికాదని పిటిషనర్ అసోషియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎస్జీ కాకుంటే.. 17 మంది లా ఆఫీసర్లు ఉంటారని, అలాంటప్పుడు వాయిదా కోరడం సరికాదని అన్నారు. ఈ తరుణంలో ధర్మాసనం జోక్యం చేసుకుంది. సోలిసిటర్ జనరల్ ఎప్పుడు అందుబాటులో ఉంటారో చెప్పాలని ధర్మాసనం కోరింది.ఇదిలా ఉంటే.. ప్రతిపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న వేళ.. కొత్త సీఈసీగా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి(Chief Election Commissioner)గా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. జాతి నిర్మాణానికి తొలి అడుగు ఓటు అని, ఎన్నికల సంఘం ఎప్పుడూ ఓటర్లకు మద్ధతుగా నిలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. నూతన సీఈసీగా జ్ఞానేశ్వర్ ఎంపికపై విపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సీఈసీ ఎంపికపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుండగానే.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా లు అర్ధరాత్రి వేళ నిర్ణయం తీసుకోవడం సరికాదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించడం తెలిసిందే.వివాదం ఏంటంటే..2023లో సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం కేంద్ర ఎన్నికల సంఘం నియామకాలపై స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అందులో సీఈసీ, ఈసీల ఎంపిక కోసం ఏర్పాటు చేసే ప్యానెల్లో భారత ప్రధాన న్యాయమూర్తిని చేర్చాలని పేర్కొంది. అంటే.. ప్రధానితో పాటు ప్రతిపక్ష నేత, సీజేఐ ఆ ప్యానెల్లో ఉండాలి. కేంద్రం కొత్త చట్టం చేసేంత వరకు ఈ విధానం పాటించాలని స్పష్టం చేసింది. అయితే కేంద్రం ఆ తీర్పును పట్టించుకోకుండా సీజేఐని మినహాయించింది. సీజేఐ బదులుగా కేంద్ర మంత్రిని చేర్చింది. ఈ మేరకు 2023లోనే ఓ కొత్త చట్టం(Chief Election Commissioner and Other Election Commissioners Act, 2023) తీసుకొచ్చింది. అయితే కొత్త చట్టం ప్రకారం నియామకాలు చేపడుతున్నట్లు కేంద్రం చెబుతున్నప్పటికీ.. ఈ చట్టం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందని, ఈసీ నియామకాల్లో ప్రభుత్వ జోక్యం ఎక్కువయ్యేలా ఉందని, అన్నింటికి మంచి అది ప్రజా స్వామ్యానికి ప్రమాదమని చెబుతూ పలువురు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాబట్టి సీజేఐనే కొనసాగించాలని కోరుతున్నారు. దీంతో సుప్రీం కోర్టు ఇవాళ ఈ అంశంపై అత్యవసర విచారణ జరపనుంది. ఇదిలా ఉంటే.. మార్చి 15, 2024 కొత్త చట్టం ప్రకారం కేంద్రం చేపట్టిన ఈసీ నియామకాలపై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించడం విశేషం. అయినప్పటికీ ప్రతిపక్షాలు సహా కొన్ని సంస్థలు న్యాయ స్థానాలను ఆశ్రయిస్తూనే ఉన్నాయి. -
మీ బుర్రలో ఇంత చెత్త ఉందా?.. యూట్యూబర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: పబ్లిక్‌గా అశ్లీల వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియాపై సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. పాపులారిటీ కోసం అంత అసభ్య భాష మాట్లాడతారా? అంటూ మండిపడింది. ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ షోలో అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలు అతని వికృతమైన, చెత్త మనస్తత్వానికి నిదర్శనమని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. అసలు అలాంటి భాష ఎవరైనా మాట్లాడతారా అని కోర్టు అసహనం వ్యక్తం చేసింది.‘ఇండియాస్ గాట్ లేటెంట్’ షోలో తాను చేసిన వ్యాఖ్యలపై వేరు వేరు ప్రాంతాల్లో నమోదైన కేసులను కలిపి విచారించేలా ఆదేశాలివ్వాలని అల్హాబాదియా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌ను మంగళవారం(ఫిబ్రవరి 18) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటిశ్వర్‌సింగ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ బుర్రలో ఇంత చెత్త ఉందా అని తీవ్రంగా మందలించారు. కొంత కాలం పాటు ఎలాంటి షోలలో పాల్గొనరాదని అల్హాబాదియాను ఆదేశించారు. అయితే వ్యాఖ్యలకుగాను నమోదైన కేసుల్లో అల్హాబాదియాకు సుప్రీంకోర్టు ధర్మాసనం ఊరటనిచ్చింది. ఈ కేసుల్లో అతడిని అరెస్టు చేయకుండా స్టే విధించింది. బీర్‌బైసెప్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా పాలపులర్ అయిన అల్హాబాదియా అతని స్నేహితుడు సమయ్ రైనాషోలో పాల్గొన్నప్పుడు నోరు జారారు. అతని అశ్లీల వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికింది. పలు చోట్ల కేసులు నమోదయ్యాయి.ఏకంగా మహారాషష్ట్ర,అస్సాం సీఎంలు ఈ విషయమై స్పందించారంటే పరిస్థితి ఎక్కడిదాకా వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. యూట్యూబ్‌లో అశ్లీల కంటెంట్‌పై కేంద్రానికి నోటీసులు..యూట్యూబ్‌లో అశ్లీల కంటెంట్‌ను నియంత్రించేందుకు నిబంధనలు రూపొందించాల్సి ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రణ్వీర్ అల్హాబాదియా కేసు విచారణ సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అలాంటి నిబంధనలేవైనా రూపొందిస్తే తాము సంతోషిస్తామని ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. -
‘కొత్త ‘సీఈసీ’ నియామకం రాజ్యాంగ విరుద్ధం’
న్యూఢిల్లీ:నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ నియామక ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు పార్టీ ముఖ్య నేత ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు పెట్టారు. ‘సీఈసీగా జ్ఞానేష్‌కుమార్ నియామక నిర్ణయం తొందరపడి చేశారు. సీఈసీ నియామక ప్యానెల్లో సుప్రీంకోర్టు ప్రాతినిథ్యం లేకుండా ఉండేందుకే కేంద్ర ప్రభుత్వం తొందరపడి ఈ నియామకం చేపట్టింది.ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. సీఈసీ నియామక ప్యానెల్ నుంచి సీజేఐని తొలగించడంపై బుధవారం(ఫిబ్రవరి)19 సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈలోపే కొత్త సీఈసీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. సుప్రీంకోర్టు పరిశీలన లేకుండా సీఈసీని నియమించాలనే తొందరపాటు కేంద్ర ప్రభుత్వ చర్యలో కనిపిస్తోంది.ఎన్నికల ప్రక్రియను బీజేపీ ఎంత నాశనం చేస్తోందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి చర్యల వల్ల నకిలీ ఓటర్ల జాబితా, బీజేపీ అనుకూల ఎన్నికల షెడ్యూల్,ఈవీఎంల ట్యాంపరింగ్‌పై అనుమానాలు బలపడతాయి’అని కేసీ వేణుగోపాల్ తన పోస్టులో పేర్కొన్నారు. కాగా, కొత్త సీఈసీగా జ్ఞానేష్‌కుమార్ సోమవారమే నియమితులైన విషయం తెలిసిందే. -
ఇంకెన్ని పిటిషన్లు వేస్తారు?.. ప్రార్థనా స్థలాల అంశంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ : ప్రార్థన స్థలాలకు సంబంధించిన అంశంలో కొత్త పిటిషన్లు దాఖలు చేయడంపై సుప్రీంకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. సోమవారం ప్రార్థనా స్థలాల చట్టం 1991 కింద దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టే సమయంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇలాంటి పిటిషన్లకు ఒక ముగింపు ఉండాలి’ అని వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై దాఖలైన కొత్త పిటిషన్లను విచారణ చేపట్టదని స్పష్టం చేశారు.అయితే అదనపు అంశాలను జతచేస్తూ కొత్తగా పిటిషన్ దాఖలు చేయడం అనుమతించింది. కానీ ఇప్పటివరకు దాఖలు చేసిన కొత్త పిటిషన్లపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కాంగ్రెస్, మజ్లిస్‌తో పాటు ఇతర రాజకీయ పార్టీలు 1991 ప్రార్థనా స్థలాల చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. పిటిషన్ల తరుఫున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ తన వాదనల్ని వినిపిస్తున్నారు.ఇక విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో కొత్త పిటిషన్లు దాఖలు చేయడానికి అనుమతించామని, కానీ ఇలాంటి వ్యాజ్యాలకు ఒక పరిమితి ఉండాలని గుర్తు చేసింది. ప్రార్థన స్థలాలకు సంబంధించిన కొత్త పిటిషన్లు దాఖలు చేస్తే.. అందులో కొత్త అంశాలను జోడించాలని, అలా అయితేనే వాటిని విచారణ చేపడతామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేసింది. -
ఆ అసత్యాలపై బదులేది బాబూ?
సాక్షి, న్యూఢిల్లీ: తిరుపతి లడ్డూ విషయంలో అసత్యాలు చెప్పినందుకు అత్యున్నత న్యాయస్థానం మందలించడంపై ఏపీ సీఎం చంద్రబాబు నుంచి ఇంతవరకూ సమాధానమే లేదని బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ సుబ్రమణియన్ స్వామి మండిపడ్డారు. ఈమేరకు తిరుపతి లడ్డూ కల్తీ కేసు విచారణ సందర్భంగా గతేడాది సెప్టెంబర్ 30న సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ స్వామి ఆదివారం తన ఎక్స్ ఖాతాలో మూడు పోస్టులు చేశారు. తిరుపతి లడ్డూ వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబును కోర్టు తీవ్రంగా మందలించిందని, కల్తీ నెయ్యిని వాడారనేందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ‘ఆ అసత్యాలపై ఇప్పటికీ చంద్రబాబు నుంచి సమాధానం లేదు. ఆయన నిర్లక్ష్యంపై మోదీ ఎందుకు చర్యలు తీసుకోరు? బాబు ఎప్పడు బీజేపీని వదిలేస్తారు?’ అని ఎక్స్‌లో స్వామి ప్రశ్నలు సంధించారు.సుప్రీంలో పిల్ దాఖలు చేసిన స్వామి..: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వులను కలిపారన్న ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ఓ కమిటీని నియమించాలని కోరుతూ సుబ్రమణియన్ స్వామి గతేడాది సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడం తెలిసిందే. ల్యాబ్ నివేదికపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్ధించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి, టీటీడీ ఈవోలను ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ కేసులో సుబ్రమణియన్ స్వామి స్వయంగా (పార్టీ ఇన్ పర్సన్) వాదనలు వినిపించారు. ఏ నివేదిక ఆధారంగా రాద్ధాంతం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారో.. దాన్ని రూపొందించేందుకు ఉపయోగించిన నెయ్యి ఎక్కడిది? టీటీడీ తిరస్కరించిన నెయ్యిలో అది ఉందా? నివేదిక వెనుక రాజకీయ పార్టీల దురుద్దేశాలున్నాయా? అనే విషయాలను తేల్చాలని స్వామి తన పిటిషన్లో సుప్రీంకోర్టును అభ్యర్థించారు.దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలన్న కోర్టు..లడ్డూ తయారీకి జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యిని వాడారంటూ దాఖలైన పిటిషన్‌పై సెప్టెంబర్ 30న విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. తిరుపతి లడ్డూ తయారీకి జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యిని వాడారంటూ ప్రభుత్వం చేసిన వాదనను నిరూపించేందుకు ఖచ్చితమైన ఆధారాలు లేవంటూ.. ఆ ఆరోపణలను తీవ్రంగా తప్పుబట్టింది. ఏపీ ప్రభుత్వం సమర్పించిన ల్యాబ్ నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు.. పరీక్ష కోసం పంపిన నెయ్యిని తిరస్కరించారని, లడ్డూల తయారీకి దాన్ని ఉపయోగించలేదని పేర్కొంది. -
రఘురామ ‘క్వాష్’ విచారణ వాయిదా
న్యూఢిల్లీ, సాక్షి: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ, ఆయన మనుషులు గతంలో ఇంటెలిజెన్స్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడినందుకు కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రఘురామ వేసిన క్వాష్ పిటిషన్‌పై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.శుక్రవారం(ఫిబ్రవరి 14) జస్టిస్ జెకె మహేశ్వరి, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. అయితే బాధితుడు ఫరూక్ భాషా తరఫున వకాలత్ దాఖలు చేయడానికి ఆయన లాయర్ సమయం కోరారు. దీంతో.. అందుకు రెండు వారాల గడువు ఇచ్చింది కోర్టు. అలాగే.. ఈ పిటిషన్‌పై విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.నరసాపురం ఎంపీగా ఉన్న టైంలో.. విధుల్లో ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్ పోలీస్ ఫరూక్ భాషపై రఘురామ, ఆయన తనయుడు భరత్ కలిసి దాడి చేశారనే అభియోగాలు ఉన్నాయి. 2022 జులైలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో.. విధి నిర్వహణలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన కానిస్టేబుల్ ఫరూక్‌ను బలవంతంగా ఎత్తుకెళ్లి రఘురామ మనుషులు ఆయన నివాసంలోనే చితకబాదారు. ఆపై అనుమానితుడిగా పోలీసులకు అప్పగించారు. అయితే..రఘురామ, ఆయన మనుషులు తనను చిత్రహింసలకు గురి చేశారని ఫరూక్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో జులై 4వ తేదీన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో రఘురామ, ఆయన తనయుడు, రఘురామ పీఏ, సీఆర్పీఎఫ్ సిబ్బంది తదితరులపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో ఊరట కోసం తెలంగాణ హైకోర్టులో రఘురామ క్వాష్ వేయగా చుక్కెదురైంది. ఆ వెంటనే ఆయన సుప్రీంను ఆశ్రయించారు. -
అనుచిత వ్యాఖ్యల దుమారం.. యూట్యూబర్‌కు దక్కని ఊరట
న్యూఢిల్లీ: ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ సహా తన పిటిషన్లను అత్యవసరంగా విచారించాలన్న విజ్ఞప్తిని సీజేఐ బెంచ్ తిరస్కరించింది. ఇండియాస్ గాట్ లాటెంట్ వేదికగా ఓ కంటెస్టెంట్‌ను ఉద్దేశించి రణవీర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో అతనిపై కేసులు నమోదు అయ్యాయి. అయితే..ఆ ఎఫ్ఐఆర్లు అన్నింటిని ఒకే దగ్గరికి చేర్చేలా ఆదేశాలివ్వాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాడతను. అలాగే.. గువాహతి పోలీసులు ఈ వ్యవహారంలో ఇప్పటికే అతనికి సమన్లు జారీ చేశారు. దీంతో అరెస్ట్ చేస్తారనే భయంతో అతను ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా వేశాడు. ఈ పిటిషన్లన్నీ ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వెళ్లాయి. దీంతో ఆయన విచారణకు తేదీని నిర్ణయించారు. అయితే.. ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారించాలన్న రణవీర్ తరఫు లాయర్ విజ్ఞప్తిని సీజేఐ బెంచ్ తోసిపుచ్చింది. ఈ విషయంలో కోర్టు రిజిస్ట్రీని సంప్రదించాలని సూచించింది.బీర్‌బైసెప్స్ యూట్యూబ్ ఛానెల్‌తో రణవీర్ అల్హాబాదియాకు మంచి ఫాలోయింగ్ ఉండేది. అయితే స్టాండప్ కమెడియన్ సమయ్ రైనా నిర్వహిస్తున్న ఇండియాస్ గాట్ లాటెంట్ షోలో పాల్గొన్న రణవీర్.. ఓ అభ్యర్థిని ఉద్దేశించి దారుణమైన కామెంట్లు చేశాడు. అతని తల్లిదండ్రుల శృంగారం గురించి ప్రస్తావించడంతో పెను దుమారం రేగింది.మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో పాటు పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, తోటి యూట్యూబర్లు సైతం రణవీర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. వాక్ స్వతంత్రం పేరిట అతను సమాజం అంగీకరించని వ్యాఖ్యలు చేశాడంటూ మండిపడ్డారు. ఈ క్రమంలో చివరకు అతను క్షమాపణలు చెప్పాడు. అయినప్పటికీ ఈ వ్యవహారం మాత్రం చల్లారడం లేదు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నోటీసులు ఇవ్వడంతో యూట్యూబ్ అతని వ్యాఖ్యలు ఉన్న వీడియోను తొలగించింది. అయినప్పటికీ అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ వ్యాఖ్యల ఎఫెక్ట్‌తో.. అతనికున్న 16 మిలియన్ల ఫాలోవర్ల(అన్ని ప్లాట్‌ఫారమ్‌లు కలిపి) సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇప్పటికే అతనిపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. మరోవైపు.. ఈ వ్యవహారం పార్లమెంట్‌కు సైతం చేరింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా.. కంటెంట్ నియంత్రణపై ప్రభుత్వం దృష్టిసారించాలని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి చెందిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ లేఖ రాయబోతోంది. మరోవైపు సమయ్ రైనా, ఇండియాస్ గాట్ లాటెంట్ నిర్వాహకులందరి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మహారాష్ట్ర సైబర్ విభాగం ఈ షో సభ్యులపై కేసు నమోదు చేసింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన జాతీయ మహిళా కమిషన్.. ఈ నెల 17వ తేదీన తమ ఎదుట హాజరు కావాల్సిందిగా రణవీర్ అల్హాబాదియా, సమయ్ రైనాలకు నోటీసులు జారీ చేసింది. -
‘సుప్రీం’ బోనులో ఈసీ
ఎన్నికల షెడ్యూల్ ప్రకటన సందర్భాల్లో తప్ప వినబడని ఎన్నికల సంఘం(ఈసీ) పేరు ఇటీవలి కాలంలో తరచు వార్తల్లోకెక్కుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ మొదలుకొని ప్రచారం వరకూ... ఆ తర్వాత ఎన్నికల్లో పోలైన వోట్ల శాతం, వాటి లెక్కింపు, ఫలితాల ప్రకటన వరకూ అన్ని దశల్లోనూ ఈసీపై నిందలు తప్పటం లేదు. తాజాగా ప్రజాతంత్ర సంస్కరణల సంఘం (ఏడీఆర్) దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం విచారిస్తున్న సందర్భంగా ఈవీఎంల పరిశీలన ప్రక్రియ అమల వుతుండగా వాటి డేటాను తొలగించవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించాల్సి వచ్చింది. నిరుడు ఏప్రిల్‌లో ఈ విషయమై ఇచ్చిన ఆదేశాలను సరిగా అర్థం చేసుకుని, సక్రమంగా పాటిస్తే ఇలా చెప్పించుకోవాల్సిన స్థితి ఈసీకి ఉండేది కాదు. ఈవీఎంలనూ, దానికి అనుసంధానించి వుండే ఇతర యూనిట్లనూ భద్రపరిచే విషయమై సుప్రీంకోర్టు అప్పట్లో కీలక ఆదేశాలిచ్చింది. అవి సరిగా పాటించటం లేదని ఏడీఆర్ మరోసారి కోర్టును ఆశ్రయించింది. ఎన్నికల్లో పరాజితులై 2, 3 స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు కనుక ఆ ఎన్నికను సవాలు చేసిన సందర్భాల్లో తనిఖీ చేయడానికి అనువుగా ఈవీఎంలతోపాటు, వాటిలో పార్టీల గుర్తులను లోడ్ చేయటానికి ఉపయోగించే సింబల్ లోడింగ్ యూనిట్ (ఎస్ఎల్యూ)లను సైతం 45 రోజులపాటు భద్రపరచాలని సుప్రీంకోర్టు ఈసీని ఆదేశించింది. ఎన్నికల ఫలితంపై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయటానికి పరాజిత అభ్యర్థులకుండే 45 రోజుల వ్యవధిని దృష్టిలో పెట్టుకుని ధర్మాసనం ఇలా ఆదేశించింది. అసెంబ్లీ నియో జకవర్గ పరిధిలోని 5 శాతం ఈవీఎంలు, ఎస్‌ఎల్‌యూలను ఇంజనీర్ల, ఉత్పత్తిదారుల సమక్షంలో తనిఖీకి అనుమతించవచ్చని సూచించింది. వీవీ ప్యాట్ స్లిప్‌లను లెక్కించే యంత్రాలు సమకూర్చు కునే ఆలోచన చేయాలని కూడా ఆ సందర్భంగా కోరింది. ఈ ఆదేశాల ఆంతర్యమేమిటో సుస్పష్టం. ఎన్నికలు న్యాయబద్ధంగా జరగడమే కాదు... అలా జరిగినట్టు కనబడాలంటే అంతా పారదర్శకంగా ఉండాలన్నది ధర్మాసనం ఉద్దేశం. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల అనంతరం ఈవీఎంలూ, వీవీప్యాట్‌లూ, ఎస్ఎల్యూల పరిశీలన విషయంలో ఈసీ కొన్ని నియమ నిబంధనలు విడుదల చేసింది. న్యాయస్థానం ఆదేశాలకూ, ఆ నియమ నిబంధనలకూ ఎక్కడా పొంతన లేదు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనూ 5 శాతం ఈవీఎంలు తనిఖీ చేయాలని ధర్మాసనం ఇచ్చిన ఆదేశానికి ఈసీ వేరే రకమైన భాష్యం చెప్పింది. వినియోగించిన ఈవీఎంలలో ఏ పార్టీకి ఎన్ని వోట్లు లభించాయో చూసి, వీవీ ప్యాట్ స్లిప్‌లు దానికి అనుగుణమైన సంఖ్యలో ఉన్నాయా లేదా అన్నది తేలిస్తే వేరే రకంగా ఉండేది. కానీ ఈసీ చేసిందల్లా ఇతరత్రా గుర్తులతో మళ్లీ నమూనా పోలింగ్ నిర్వహించి ఈవీఎంల డేటాకూ, వీవీప్యాట్ స్లిప్‌ల సంఖ్యకూ మధ్య తేడా లేదని నిరూపిస్తే చాలని భావించింది. అంతేకాదు... ఆ నమూనా పోలింగ్ కోసం ఈవీఎంలలోని డేటాను ఖాళీ చేసింది! ఈవీఎంలు సరిచూడాలని అభ్య ర్థులు కోరటం అంటే తమ సమక్షంలో ఈవీఎంలలో ఉన్న సాఫ్ట్‌వేర్‌నూ, హార్డ్వేర్నూ ఇంజనీర్లు పరిశీలించాలని... వీవీ ప్యాట్ స్లిప్‌ల సంఖ్య ఈవీఎంల డేటాతో సరిపోయిందో లేదో చూడాలని అడగటం. ఈసీ అనుసరించిన ప్రక్రియకూ, అభ్యర్థులు కోరుకునేదానికీ పొంతన ఎక్కడైనా ఉందా? ఈ మాత్రానికే అభ్యర్థులనుంచి ఈవీఎంకు రూ. 40,000 చొప్పున వసూలు చేయటం సిగ్గనిపించ లేదా? చిత్రమేమంటే... ఒక్కో ఈవీఎం తయారీకి ఖర్చయ్యేది కేవలం రూ. 30,000! గత లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, ఒడిశాల నుంచి 11 మంది అభ్యర్థులు ఈవీఎంలూ, వీవీప్యాట్ స్లిప్‌ల పరిశీలన కావాలన్నారని, అంతా పూర్తయ్యాక ఎక్కడా తేడా కనబడలేదని ఈసీ తేల్చింది. దేశవ్యాప్తంగా చూస్తే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇటువంటి అభ్యర్థనలే 83 వరకూ రాగా, అంతా సవ్యంగానే ఉన్నదని నిర్ధారణ అయిందని వివరించింది. ఆంధ్రప్రదేశ్‌లో 45 రోజులలోపు ఈవీఎంల డేటా తొలగించరాదన్న నిబంధనను సైతం ఈసీ ఉల్లంఘించింది. ఒకపక్క ఈవీఎంల పనితీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతుండగా ఇలా చేయటం అనుమానాలను మరింత పెంచుతుందన్న ఇంగితజ్ఞానం దానికి లేకపోయింది.మేమిచ్చిన ఆదేశాలేమిటో, మీరు అనుసరించిన ప్రక్రియేమిటో వివరిస్తూ వచ్చే నెల 3లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఈసీని ఆదేశించటం హర్షించదగ్గది. అసలు 45 రోజుల్లోపే డేటాను ఎందుకు తొలగించాల్సివచ్చిందో కూడా ఈసీనుంచి సంజాయిషీ కోరాలి. ఇక పోలింగ్ శాతంపై ఈసీ విడుదల చేసిన ప్రకటనలు మరింత చిత్రంగా ఉన్నాయి. ఏడు దశల్లో జరిగిన పోలింగ్‌లో 3.2 శాతం నుంచి 6.32 శాతం వరకూ వోట్లు పెరిగినట్టు ఈసీ తేల్చింది. ఈ పెరిగిన వోట్ల శాతం ఆంధ్రప్రదేశ్‌లో 12.54 శాతం, ఒడిశాలో 12.48 శాతం ఉంది. పోలింగ్ ముగిసిన రాత్రి ఏపీలో 68 శాతం వోట్లు పోలయ్యాయని ప్రకటించగా, తుది ప్రకటనలో అది కాస్తా 81 శాతానికి ఎగబాకింది. ఈవీఎంల చార్జింగ్ పెరగటం మరో కథ! ఈ మార్పుల వెనకున్న మంత్రమేమిటో చెప్తే అందరూ విని తరిస్తారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ ఎంతో నిష్ఠగా నిర్వహించాల్సిన క్రతువు. ఒక రాజ్యాంగ సంస్థ అయివుండి, నిష్పక్షపాతంగా, నిక్కచ్చిగా వ్యవహరించాల్సిన ఈసీ అందుకు భిన్నమైన పోకడలను ప్రదర్శించటం దానికి ఎంతమాత్రమూ గౌరవప్రదం కాదు. ఈసీ తీరు గమనించాక చాలామంది మళ్లీ బ్యాలెట్ పత్రాలకు మళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. ఈసీ బాణీ మారకపోతే చివరకు బ్యాలెట్ పత్రం విధానం కోసం జనం ఎలుగెత్తే రోజులు రావటం ఖాయం. -
Supreme Court: నిందితుల్ని జైల్లోనే ఉంచడానికి పీఎంఎల్ఏ కేసులా?
న్యూఢిల్లీ: నిందితులను జైలులో ఉంచడానికి మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ)ను ఉపయోగిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వరకట్న చట్టం మాదిరిగా పీఎంఎల్ఏ నిబంధనలను కూడా దుర్వినియోగం చేస్తున్నారంటూ మండిపడింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మాజీ ఎక్సైజ్ అధికారి అరుణ్ పతి త్రిపాఠీకి బుధవారం బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. త్రిపాఠీపై చేసిన ఆరోపణలను ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కొట్టివేసిన తర్వాత కూడా జైలులోనే ఉంచడంపై విస్మయం వ్యక్తం చేసింది. ‘ఓ వ్యక్తిని జైలులో ఉంచేందుకు పీఎంఎల్ఏను వాడుకోరాదు. ఆరోపణలను కోర్టు కొట్టివేసిన తర్వాత కూడా ఆయన్ను విడుదల చేయకుండా జైలులో ఉంచడాన్ని ఏమనాలి?. సెక్షన్ 498ఏ కింద పెళ్లయిన మహిళలు భర్త, అతడి కుటుంబీకులపై కట్నం వేధింపుల కేసులు ఎడాపెడా పెట్టినట్లే పీఎంఎల్ఏను కూడా దుర్వినియోగం చేయాలనుకుంటున్నారా?’అంటూ తలంటింది. ఇందుకు కారణమైన అధికారులకు సమన్లు జారీ చేస్తామంది. అయితే, సాంకేతికపరమైన కారణాలతో నేరగాళ్లకు బెయిలివ్వడం సరికాదని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు ఈడీ తరఫున వాదించారు. -
సుప్రీం కోర్టులో మోహన్ బాబుకు భారీ ఊరట
జర్నలిస్ట్‌పై దాడి కేసులో టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్‌బాబుకు సుప్రీం కోర్టు(preme Court)లో భారీ ఊరట లభించింది.ఈ కేసులో మోహన్‌బాబు(Mohan Babu)కి ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. గురువారం ఉదయం ఈ కేసు విచారణ చేపట్టిన జస్టిస్ సుదాంత్ దులియా ధర్మాసనం.. మోహన్‌బాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.అసలేం జరిగింది?మోహన్ బాబు కుటుంబంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. మోహన్ బాబు, ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేశారు. హైదరాబాద్ జల్ పల్లిలోని నివాసం వద్ద 2024 డిసెంబర్ 10న జర్నలిస్టుపై మోహన్ బాబు మైక్ తో దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి మోహన్ బాబుపై పహాడిషరీఫ్ పోలీసులకు బాధిత జర్నలిస్టు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.అయితే మోహన్ బాబు తనపై నమోదైన ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ముందుగా హైకోర్టును ఆశ్రయించారు. కానీ 2024 డిసెంబరు 23న హైకోర్టు రిజెక్ట్ చేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరగగా.. ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.కేసు విచారణ సందర్భంగా కావాలని తాను జర్నలిస్టుపై దాడి చేయలేదని సుప్రీంకోర్టుకు మోహన్ బాబు తెలిపారు. కుటుంబ గొడవల నేపథ్యంలో ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నామని చెప్పారు. బాధిత జర్నలిస్టుకు నష్టపరిహారం ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. -
ఉచితాలపై సుప్రీం కోర్టు సీరియస్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, సాక్షి:ఉచితాలపై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల సమయంలో ఉచితాలను ప్రకటించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. రాజకీయ పార్టీలు ప్రజలను పరాన్న జీవులుగా మార్చేస్తున్నాయని మండిపడింది.పట్టణాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన ఓ పిటిషన్‌ను జస్టిస్ గవాయ్, జస్టిస్ ఆగష్టీన్ జార్జ్ మసీహ్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఉచితాలపై వ్యాఖ్యానించింది. ఉచితంగా రేషన్, ఉచితంగా నగదు అందుతున్నందున ప్రజలు పని చేయడానికి ఇష్టపడం లేదని వ్యాఖ్యానించింది. ఉచితాలతో ఏ పని చేయకుండా ప్రజలు ఆహారం, డబ్బు సంపాదిస్తున్నారని పేర్కొంది.‘‘ఇలా అంటున్నందుకు క్షమించాలి. ఇలాంటి వ్యక్తులను(ఉచితాలను అందుకుంటున్న వాళ్లను) సమాజ పురోగతిలో భాగం చేయకుండా.. పరాన్నజీవుల తరగతిని మనం సృష్టించడం లేదా?. ఎన్నికల సమయంలో ఉచితాలను ప్రకటించడం వల్ల.. పని చేసేందుకు జనం ఇష్టపడడం లేదు. ఎలాంటి పనులు చేయకుండానే ఉచితంగా రేషన్ వాళ్లకు అందజేస్తున్నారు’’ అని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు.అయితే పట్టణాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కలిపించే అంశం కేంద్రం పరిశీలనలో ఉందని అటార్నీ జనరల్ వెంకటరమణి కోర్టుకు తెలిపారు. ఈ అంశం పరిశీలనకు కేంద్రం ఎంత సమయం తీసుకుంటుందో వివరణ ఇవ్వాలని ఆటార్నీ జనరల్‌ను ఆదేశించిన బెంచ్.. పిటిషన్ విచారణను ఆరువారాల పాటు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. ఉచితాల(freebies)పై దేశ సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేయడం ఇదేం కొత్త కాదు. కిందటి ఏడాది డిసెంబర్‌లోనూ ఇదే తరహాలో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దేశంలో 81 కోట్ల మంది ఉచితంగా రేషన్, సబ్సిడీల కింద రేషన్ అందుకుంటున్నారనే విషయం కోర్టు దృష్టికి వెళ్లింది. ‘‘ఇలా ఎంత కాలం ఉచితాలు ఇస్తూ పోతారు? వాళ్లకు ఉపాధి కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేమా?’’ అని జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఆనాడు వ్యాఖ్యానించింది. ‘సుప్రీం’కే వెళ్లండి: ఢిల్లీ హైకోర్టుఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. ఆప్, బీజేపీ, కాంగ్రెస్‌లు పోటాపోటీగా ఉచితాల హామీలు ఓటర్లపై గుప్పించాయి. అయితే ఇది అవినీతి చర్యల కిందకే వస్తుందని మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎన్ ధింగ్రా ఢిల్లీ హైకోర్టు(Delhi High Court)లో ఓ పిటిషన్ వేశారు. అయితే బుధవారం ఈ పిటిషన్‌ను పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం.. సుప్రీం కోర్టుకు వెళ్లాలని పిటిషనర్‌కు సూచించింది.ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం.. ఉచితాలు ప్రకటించడం అవినీతి కిందకే వస్తుందని మాజీ న్యాయమూర్తి ధింగ్రా తన పిటిషన్లో పేర్కొన్నారు. మూడు పార్టీలు పోటాపోటీగా ప్రజలకు లంచం ఎర వేశాయి. ఈ వ్యవహారంపై ఈసీని దర్యాప్తునకు ఆదేశించాలని, అలాగే అలాంటి ప్రకటనలు చేసిన వాళ్లు రాజ్యాంగం ప్రకారం అనర్హులుగా ప్రకటించాలని ఆయన కోరారు. అదేవిధంగా.. ఓటర్ల వివరాలను సేకరించడం, వాటిని థర్డ్ పార్టీకి ఇవ్వడం అడ్డుకోవాలని ఆయన తన పిటిషన్లో ప్రస్తావించారు. అయితే.. పిటిషన్‌ను పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు.. సుప్రీం కోర్టులో ఇదే తరహా పిటిషన్‌పై విచారణ జరుగుతున్నందున అక్కడికే వెళ్లాలని ఆయనకు సూచించింది. -
షీనా బోరా కేసు.. ఇంద్రాణీ ముఖర్జీకి చుక్కెదురు
న్యూఢిల్లీ: షీనా బోరా కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జీకి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. విదేశాలకు వెళ్లే విషయంలో ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం కోర్టు కొట్టిపారేసింది. అదే సమయంలో ఈ కేసు విచారణ ఆలస్యం అవుతుండడంతో ట్రయల్ కోర్టుపై అసహనం వ్యక్తం చేసింది.ఇంద్రాణీ ముఖర్జీ విదేశాలకు వెళ్లకుండా.. గతంలో బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలను కిందటి ఏడాది నవంబర్‌లో సుప్రీం కోర్టులో ఇంద్రాణీ ముఖర్జీ సవాల్ చేశారు. ఆ పిటిషన్‌ను విచారణ జరిపిన జస్టిస్ ఎంఎం సుందరేష్, రాజేష్ బిందాల్ ధర్మాసనం.. ఇవాళ కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. అదే సమయంలో.. కేసు విచారణ జాప్యం అవుతుండడం దృష్టికి రావడంతో ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఏడాదిలోపు ఈ కేసుకు సంబంధించిన విచారణను పూర్తి చేయాలని ట్రయల్ కోర్టుకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.సీబీఐ వాదనఇది ఎంతో సున్నితమైన కేసుప్రస్తుతం ఈ కేసు విచారణ మధ్యలో ఉందిఇప్పటికే 96 మంది సాక్ష్యులను విచారించాం ఇలాంటి సమయంలో ఆమెకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతులు ఇవ్వడం సరికాదు. ఇంద్రాణీ తరఫు వాదనలు ఈ కేసులో సుప్రీం కోర్టు ఆమె బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇంకా 96 మంది సాక్ష్యులను విచారించాల్సిన అవసరం ఉంది. ట్రయల్ కోర్టులో విచారణ జరపాల్సిన బెంచ్ నాలుగు నెలల కూడా ఖాళీగానే ఉందికాబట్టి ఈ కేసు విచారణ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలే ఉన్నాయి కాబట్టి మా క్లయింట్‌కు విదేశాలకు వెళ్లేందుకు ఊరట ఇవ్వాలి సీబీఐ వాదనలతో ఏకీభవించిన ద్విసభ్య ధర్మాసనం.. ఇంద్రాణీ ముఖర్జీ పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది. షీనా బోరా కేసు: ట్విస్టుల మీద ట్విస్టులు, పోలీస్ డైరీలో ఏముందంటే..ముంబై మెట్రో వన్ అనే కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున షీనా బోరా(22) 2012, ఏప్రిల్ 24న అదృశ్యమైంది. మళ్లీ ఆమె కనిపించనే లేదు. శవంగా తేలడంతో పోలీస్ దర్యాప్తు మొదలైంది. షీనా బోరా హత్యకేసులో కీలకసూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటోంది ఆమె కన్నతల్లి ఇంద్రాణీ ముఖర్జీ. తన రెండో భర్త సంజీవ్‌ఖన్నాతో కలిసి ఇంద్రాణీ ఈ హత్యకు కుట్రపన్నినట్లు ఇప్పటివరకు జరిగిన పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో అరెస్టైన ఆమె.. సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆరేళ్ల తర్వాత బయటకు వచ్చారు. అయితే తన బిడ్డను తాను చంపుకోలేదని, ఆమె ఇంకా బతికే ఉందంటూ ఇంద్రాణీ మొదటి నుంచి వాదిస్తూ వస్తుండడం గమనార్హం.షీనా బోరా కేసు టైం లైన్ఏప్రిల్ 24, 2012: షీనా బోరా కనిపించకుండా పోయింది2015, ఆగష్టు 21: ఇంద్రాణీ ముఖర్జీ డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ అరెస్ట్.. నేరం ఒప్పుకోలు2015, ఆగష్టు 25: షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణీ ముఖర్జీ అరెస్ట్ఆగష్టు 26, 2015: షీనా మాజీ భర్త సంజీవ్ ఖన్నా కోల్‌కతాలో అరెస్ట్2015, సెప్టెంబర్ 1: షీనా అసలు తండ్రిని తననేంటూ సిద్ధార్థ్ దాస్ ప్రకటన2015, సెప్టెంబర్ 18: షీనా బోరా కేసు సీబీఐకి అప్పగింత2015, నవంబర్ 19: పీటర్ ముఖర్జీ అరెస్ట్.. ఇంద్రాణీ, సంజీవ్, శ్యామ్వర్ మీద ఛార్జ్‌షీట్ దాఖలుఫిబ్రవరి 16, 2016: ఛార్జ్ షీట్లో పీటర్ ముఖర్జీ పేరు నమోదుజనవరి-ఫిబ్రవరి 2017: ఈ కేసులో విచారణ ప్రారంభంఅక్టోబర్ 2019: ఇంద్రాణీ, పీటర్ ముఖర్జీలకు విడాకులు మంజూరుమార్చి 2020: పీటర్ ముఖర్జీకి బెయిల్ మంజూరుమే 18, 2022: ఇంద్రాణీ ముఖర్జీకి బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు.. ఆరేళ్ల తర్వాత బయటకుఫ్రిబవరి 12, 2025: విదేశీ పర్యటనకు తనను అనుమతించాలని ఇంద్రాణీ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత.. ట్రయల్ ఏడాదిలోపు పూర్తి చేయాలని కింది కోర్టుకు సుప్రీం కోర్టు ఆదేశం -
ఈవీఎంల డేటా డిలీట్ చేయొద్దు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రక్రియ ముగిసి ఫలితాలు వచ్చిన తర్వాత ఈవీఎం(Electronic Voting Machines)ల్లో నిక్షిప్తమై ఉన్న డేటాను డిలీట్ చేయవద్దని ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈవీఎంల్లో నిక్షిప్తమైన డేటాపై అనుమానాలు వ్యక్తం చేస్తూ హరియాణా రాష్ట్ర అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్(ADR), కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. డేటా డిలీట్ చేసే ప్రక్రియను చేపట్టవద్దని ఎన్నికల కమిషన్‌కు ఆదేశించింది. అదే సమయంలో ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈవీఎంలకు సంబంధించి ఎలాంటి నిర్ణీత ప్రమాణాలు పాటిస్తున్నారో చెప్పాలని ఈసీకి స్పష్టం చేసింది.‘ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిపోయిందని భావించి ఈవీఎంల్లో ఉన్న డేటా తొలగించకండి. ఏవిధమైన డేటాను ఈవీఎంల నుంచి తొలగించవద్దు. అదే సమయంలో ఏ తరహా డేటాను అందులో రీలోడ్ చేయవద్దు’ అని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈవీఎంల డేటా అవసరమైన పక్షంలో ఎన్నికల కమిషన్ కోర్టుకు సమర్పించాల్సి ఉండటంతో డేటా తొలిగిస్తే సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.ఒకవేళ ఓటమి పాలైన అభ్యర్థి వివరణ కోరిన పక్షంలో ఈవీఎంల్లో ఎటువంటి ట్యాంపరింగ్ జరగలేదనే విషయాన్ని ఒక ఇంజనీర్ సాయంతో ధృవీకరించాల్సి ఉంటుందన్నారు చీప్ జస్టిస్ సంజీవ్ ఖన్నా. ఈవీఎంల్లోని మైక్రో కంట్రోలర్, మెమొరీల్లో ఉన్న డేటాను తొలగించేందుకు ఏ విధానం అమలు చేస్తున్నారో 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. -
మేం చూస్తూ ఊరుకోం!.. సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకునేందుకు ఎంత సమయం కావాలి? తగినంత టైం అంటే ఎంత? అసెంబ్లీ గడువు ముగిసేంత సమయం కావాలా? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల హక్కులకు సంబంధించిన అంశం ఇది. రాజకీయ పార్టీల హక్కులకు ఇబ్బంది కలుగుతుంటే మేం చూస్తూ ఊరుకోం.’’ – తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శి తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీతో సుప్రీంకోర్టు ధర్మాసనం సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో చర్యలు తీసుకోవడానికి మీకెంత సమయం కావాలో చెప్పండి. ఇంకా తగినంత సమయం కావాలని అడుగుతున్నారు. తగినంత సమయం అంటే ఎంత? ఆ సమయానికి ఏదైనా గడువు అనేది ఉండాలి కదా? ఇలా సమయాన్ని పెంచుకుంటూ వెళితే ఎలా? రాజకీయ పార్టీల హక్కులకు ఇబ్బంది కలుగుతుంటే.. మేం చూస్తూ ఊరుకోబోం’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. కావాల్సిన సమయం ఎంత అనేది చెప్పకపోతే.. తామే గడువు పెడతామని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తరఫు న్యాయవాదికి స్పష్టం చేసింది. రెండు పిటిషన్లపై విచారణ.. బీఆర్ఎస్ కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రా వ్, దానం నాగేందర్లపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ), మరో ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీని వాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డి, అరెకపూడి గాంధీలపై బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావు తదితరులు రిట్ పిటిషన్ దాఖలు చేసిన విష యం తెలిసిందే. ఈ రెండు పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ల ధర్మాసనం విచా రణ చేపట్టింది. స్పీకర్ తరపున సీనియర్ న్యాయ వాది ముకుల్ రోహత్గీ వాదనలు విని పించగా.. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు ఆర్యామ సుందరం, దామ శేషాద్రినాయుడు, పి.మోహిత్‌రావు వాదనలు వినిపించారు. ఇంకా ఎంత సమయం కావాలి? తొలుత పిటిషనర్ల తరపు న్యాయవాది శేషాద్రినాయుడు వాదనలు వినిపిస్తూ.. ‘‘బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిరాయించిన ఓ ఎమ్మెల్యే ఏకంగా కాంగ్రెస్ తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు. మరో ఎమ్మెల్యే ఆయన కుమార్తె కోసం ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కండువా కప్పుకుని ప్రచారం చేశారు’’ అని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. తాము విచారణ జరుపుతున్నది ఎన్నికల ప్రచారంపై కాదని, అనర్హత పిటిషన్‌పై మాత్రమేనని, అందువల్ల పిటిషన్లో ఉన్న అంశాలను ప్రస్తావించాలని సూచించింది. పిటిషన్‌పై స్పందించేందుకు మీకెంత సమయం కావాలని స్పీకర్ కార్యదర్శి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని జస్టిస్ బీఆర్ గవాయి ప్రశ్నించారు. తమకు ఇంకా తగినంత సమయం కావాలని రోహత్గీ బదులిచ్చారు. ఈ సమయంలో పిటిషనర్ల తరపు మరో న్యాయవాది ఆర్యామ సుందరం జోక్యం చేసుకుంటూ.. ‘‘ఇప్పటికే పది నెలలు గడిచింది, మొదట్లోనే దీనిపై స్పీకర్ స్పందించి ఉంటే.. మిగతా ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేవారు కాదు’’ అని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. హక్కులకు సంబంధించిన అంశం ఇది అయితే తమకు ఇంకా సమయం కావాలని రోహత్గీ ఈ సందర్భంగా అభ్యర్ధించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘తగినంత టైం అంటే ఎంత? అసెంబ్లీ గడువు ముగిసేంత సమయం కావాలా? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల హక్కులకు సంబంధించిన అంశం ఇది. రాజకీయ పార్టీల హక్కులకు ఇబ్బంది కలుగుతుంటే మేం చూస్తూ ఊరుకోం’’ అని స్పష్టం చేసింది. సంపత్‌కుమార్, సుభాష్ దేశాయ్ కేసులో స్పీకర్ కోరిన ‘తగినంత సమయం’ అంశంలో సుప్రీంకోర్టు గతంలో ఇచి్చన తీర్పును రోహత్గీ ప్రస్తావించారు. దీనితో ‘తగినంత సమయం’ అంటే ఎంత అని రోహత్గీని జస్టిస్ బీఆర్ గవాయి ప్రశ్నించారు. ‘‘తగినంత సమయం అంటే రెండు నెలలు, మూడు నెలలు అని ఏదీ కూడా ఆ తీర్పులో ధర్మాసనం చెప్పలేదని రోహత్గీ బదులిచ్చారు. డిక్షనరీ ప్రకారం ‘తగినంత సమయం’ అంటే ఎంత? రోహత్గీ సమాధానంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ‘‘డిక్షనరీ ప్రకారం ‘తగినంత సమయం (రీజనబుల్ టైం) అంటే ఎంత? పది నెలలు రీజనబుల్ టైం కాదా? అయితే మీ దృష్టిలో రీజనబుల్ టైం అంటే ఎంతో చెప్పండి? మీరు చెప్పే రీజనబుల్ టైమ్‌కు గడువు అనేది ఉందా, లేదా? పోనీ మీరు రీజనబుల్ టైం చెప్పకపోతే.. మేమే ఓ గడువు విధిస్తాం. ఆ గడువులోపు దానిని పూర్తి చేయండి’’ అని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్‌చంద్రన్‌ల ధర్మాసనం పేర్కొంది. అయితే ‘రీజనబుల్ వ్యక్తికి రీజనబుల్ టైం ఇవ్వాల’ని రోహత్గీ తిరిగి అభ్యర్ధించారు. ‘‘రీజనబుల్ వ్యక్తి దృష్టిలో రీజనబుల్ టైం అంటే ఏంటీ, అసలు ఎంత సమయం కావాలి?’’ అని ధర్మాసనం ఆగ్రహంగా స్పందించింది. దీనికి బదులు ఇచ్చేందుకు రెండు, మూడు రోజులు సమయం కావాలని రోహత్గీ విజ్ఞప్తి చేయగా.. ధర్మాసనం అంగీకరించి తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది. ధర్మాసనానికి అన్ని ఆధారాలు సమర్పించాం: మోహిత్‌రావు తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్ఎస్ తరపు న్యాయవాది పి.మోహిత్‌రావు పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన అన్ని ఆధారాలను ధర్మాసనానికి సమర్పించామని చెప్పారు. గతంలోని సుప్రీంకోర్టు తీర్పులు, హైకోర్టు సూచనలను స్పీకర్ పట్టించుకోకపోవడాన్ని వివరించామన్నారు. -
గౌనును బట్టి గౌరవం లభించదు
న్యూఢిల్లీ: ధరించిన గౌనును బట్టి లాయర్లకు గౌరవం లభించదని సుప్రీంకోర్టు పేర్కొంది. 70 మంది లాయర్లకు ఢిల్లీ హైకోర్టు సీనియర్ హోదాను ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్ల ధర్మాసనం ఈ వ్యాఖ్య చేసింది. గౌనును బట్టి వేరుగా గౌరవం దక్కుతుందని తాము భావించడం లేదని పేర్కొంది. పిటిషన్ వేసిన నెడుంపర అనే లాయర్ వాదనను తోసిపుచ్చుతూ, ‘‘జడ్జిలు కూడా అవసరాన్ని బట్టి రాత్రి దాకా కేసుల విచారణలోనే ఉంటున్నారు. వాళ్లూ మనుషులే. శాయశక్తులా చేయగలిగిందంతా చేస్తున్నారు’’ అని పేర్కొంది. కేసుల సత్వర విచారణకు మరింతమంది జడ్జీల అవసరముందని నెడుంపర తెలపగా ఎక్కువ మంది జడ్జీలను నియమించడం తమ చేతుల్లో లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. -
అభిప్రాయం చెప్పకుండా గవర్నర్ బిల్లుల్ని ఆపరాదు
న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తొక్కిపెట్టడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి సందర్భాల్లో ప్రతిష్టంభన ఎలా తొలుగుతుందని ప్రశ్నించింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై ఆమోద ముద్ర వేయడంలో గవర్నర్ ఆర్ఎన్ రవి జాప్యం చేస్తున్నారంటూ తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘ఏదైనా బిల్లు కేంద్ర చట్టానికి విఘాతం కలిగిస్తుందని మీరు భావిస్తే, ఆ మేరకు మీరు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి. ఆ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపుతున్నట్లు గవర్నర్ చెప్పాలి. లేకపోతే ప్రతిష్టంభన తలెత్తుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టంభనను ఎలా అధిగమిస్తుందని మీరు భావిస్తున్నారు? ఇటువంటి ప్రతిష్టంభనను మీరే తొలగించాలి. ఈ విషయం గమనించండి’అని గవర్నర్ తరఫున వాదించిన అటార్నీ జనరల్ వెంకటరమణికి సూచించింది. అటార్నీ జనరల్ వినతి మేరకు తదుపరి విచారణను 10వ తేదీకి వాయిదా వేసింది. -
కాలయాపన సరికాదు
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి ఫైనాన్సియర్స్ భారీ ఆర్థిక అవకతవకలపై కౌంటర్లు దాఖలు చేయడంలో కాలయాపన సరికాదని తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అందరి వాదనలు విని వీలైనంత త్వరగా తీర్పు వెల్లడించాలని సుప్రీంకోర్టు(Supreme Court) సూచించిన విషయాన్ని గుర్తు చేసింది. అదనపు కౌంటర్ అఫిడవిట్(Counter Affidavit) దాఖలుకు రెండు వారాలు గడువు కావాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కోరడం సరికాదంది. అంత సమయం ఇవ్వలేమని, వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇకపై ప్రతి శుక్రవారం విచారణ చేపడతామని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో తను పేరును కాజ్ లిస్టులో చేర్చాలని అక్టోబర్‌లో రిజిస్ట్రీని ఆదేశించినా అది అమలు కావడం లేదని కోర్టు సహాయకుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్(Undavalli Arunkumar) ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీంతో మరోసారి ధర్మాసనం రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ చట్ట నిబంధనలను ఉల్లంఘించినందుకు మార్గదర్శి, దాని కర్త రామోజీరావుపై డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కేసులో అధీకృత నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018 డిసెంబర్ 31న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశాయి. అలాగే తీర్పులోని కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2024 ఏప్రిల్ 9న హైకోర్టు తీర్పును కొట్టివేసింది. ఆ తీర్పును తప్పుబడుతూ.. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. ఉండవల్లి, ఏపీ సర్కార్ సహా అందరి వాదనలు వినాలని చెప్పింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ శ్యామ్ కోషి, జస్టిస్ కె.సుజన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థలూథ్రా, కోర్టు సహాయకుడిగా మాజీ ఎంపీ అరుణ్‌కుమార్, ఆర్బీఐ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వర్చువల్‌గా.. ఏపీ స్పెషల్ జీపీ రాజేశ్వర్‌రెడ్డి, తెలంగాణ పీపీ పల్లె నాగేశ్వర్రావు నేరుగా విచారణకు హాజరయ్యారు. కౌంటర్ దాఖలు చేయడానికి రెండు వారాలు గడువు కావాలని ఆర్బీఐ కోరిందని ఎల్.రవిచందర్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అంత గడువు ఇవ్వలేమని, వారంలో దాఖలు చేయాలని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణ 14కు వాయిదా వేసింది. విచారణ 18 సార్లు వాయిదా సుప్రీంకోర్టు ఆదేశాలతో గత జూన్ 25న తెలంగాణ హైకోర్టు విచారణ ప్రారంభించింది. తొలుత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. వీలైనంత త్వరగా వాదనలు వినిపించాలని, వాయిదాలు కోరవద్దని పలుమార్లు ధర్మాసనం న్యాయవాదులకు సూచించింది. అయినా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేయడంతో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించాయి. ఎట్టకేలకు గత నెలలో కౌంటర్లు దాఖలు చేశాయి. ఇదే క్రమంలో తీరా వాదనలు ప్రారంభమయ్యే సమయంలో రామోజీరావు మరణించినందున కేసు కొట్టివేయాలంటూ మార్గదర్శి అఫిడవిట్ వేసింది. దీనిపై కూడా వాదనలు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ సుజోయ్‌పాల్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి బాధ్యతల్లో ఉండటంతో విచారణ జస్టిస్ శ్యామ్‌కోషి ధర్మాసనానికి బదిలీ అయ్యింది. జనవరి 31న కేసు లిస్టయినా.. విచారణ నుంచి జస్టిస్ నందికొండ నర్సింగ్‌రావు తప్పుకుంటున్నారు. శుక్రవారం జస్టిస్ శ్యామ్ కోషి నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఆర్బీఐ అదనపు కౌంటర్ దాఖలుకు సమయం కోరడంతో వాయిదా పడింది. ఇలా దాదాపు ఏడున్నర నెలల్లో ఇప్పటి వరకు 18 సార్లు విచారణ వాయిదా పడింది. -
‘కారుణ్యం’ శాపం కారాదు!
వైద్య కారణాల రీత్యా ఎప్పటికీ కోలుకోలేని అచేతన స్థితికి చేరుకుని, మరణం తప్ప మరో దారిలేని రోగులకు ‘కారుణ్య మరణం’ ప్రసాదించే నిబంధనలు దేశంలోనే తొలిసారి కర్ణాటకలో అమల్లో కొచ్చాయి. వాస్తవానికి కేరళ, గోవా, మహారాష్ట్రలు ఇప్పటికే ఇందుకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నాయి. అయితే కర్ణాటక మరో అడుగు ముందుకేసి సవివరమైన న్యాయ నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఈ విషయంలో 2018లోనూ, 2023లోనూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీచేసింది. ప్రభుత్వాలు తగిన చట్టాలు చేసేవరకూ ఇవి అమల్లో వుంటాయని ప్రకటించింది. ప్రపంచంలో ఇప్పటికే చాలా దేశాలు ఇందుకు సంబంధించిన చట్టాలు తీసుకొచ్చాయి. సమస్య చాలా జటిలమైనది. మంచానికి పరిమితమైపోయిన రోగులు లోలోపల ఎంత నరకం చవి చూస్తున్నారో బయటి ప్రపంచానికి తెలియదు. నిత్యం సేవలందించే వైద్య సిబ్బందికి, నిరంతరం కనిపెట్టుకుని వుండే కుటుంబ సభ్యులకు సైతం ఆ రోగుల అంతరంగం, వారు పడుతున్న యాతనలు అర్థంకావు. వ్యాధి నయమయ్యే అవకాశం ఎంతమాత్రం లేదని, వైద్య ఉపకరణాల సాయంతో కోమాలో మంచంపై వెళ్లదీయటం తప్ప మరో మార్గం లేదని తెలిశాక వారిని ఆ స్థితి లోనే ఉంచటం సరికాదన్న వాదనలు ఎప్పటినుంచో ఉన్నాయి. అందుకు విరుద్ధంగా ప్రాణం పోసే శక్తిలేని మనిషికి ప్రాణం తీసే హక్కు ఎక్కడిదన్న వాదనలూ ఉన్నాయి. ఒక మానవ మృగం సాగించిన లైంగిక హింస పర్యవసానంగా కోమాలోకి వెళ్లి ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ (కేఈఎం) ఆసుపత్రి బెడ్‌పై దాదాపు 42 ఏళ్లపాటు జీవచ్ఛవంలా బతికి 2015లో కన్నుమూసిన అరుణా రామచంద్ర శాన్‌బాగ్ కేసు ఉదంతంలో తొలిసారి ఈ కారుణ్య మరణం అంశం చర్చ కొచ్చింది. ఆమె దశాబ్దాల తరబడి జీవచ్ఛవంలా రోజులు వెళ్లదీయటం చూడలేకపోతున్నానని,ఇంకా ఎన్నాళ్లపాటు ఆమె ఇలా కొనసాగాల్సి వస్తుందో వైద్యులు కూడా చెప్పలేకపోతున్నారని జర్న లిస్టు పింకీ విరానీ సుప్రీంకోర్టు ముందు 2009లో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె ప్రశాంత మరణా నికి అవసరమైన ఆదేశాలివ్వాలని విరానీ విన్నవించుకున్నారు. కానీ ఆమె శాన్‌బాగ్ కుటుంబ సభ్యు రాలు కాకపోవటంతో సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఇలాంటి స్థితికి చేరుకున్న రోగుల కారుణ్య మరణానికి చట్టబద్ధతను కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించింది. అయితే ఆ తీర్పు అరుణకు ‘పునర్జన్మ’నిచ్చిందంటూ ఆమెకు సేవలు చేస్తున్న నర్సులంతా మిఠాయిలు పంచుకుని పండుగ చేసుకున్నారు. రిటైరవుతున్నవారి స్థానంలో వచ్చే కొత్త నర్సులు సైతం ఆమెను కంటికి రెప్పలా చూసుకునేవారు. కారుణ్య మరణంపైనే కామన్ కాజ్ దాఖలు చేసిన మరో పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పునిస్తూ 2018లో తొలిసారి మార్గదర్శకాలు రూపొందించింది. ఆ మార్గదర్శకాలను మరింత సరళం చేస్తూ 2023లో మరో తీర్పునిచ్చింది. హుందాగా జీవించటం మాత్రమే కాదు... హుందాగా మరణించటం కూడా రాజ్యాంగంలోని 21వ అధికరణం పరిధిలోకి వస్తుందని చెప్పింది. అయితే కారుణ్య మరణం కేసుల్లో ఇమిడివుండే జటిల సమస్యలేమిటో, వాటిని స్వప్రయోజన పరులు ఎలా ఉపయోగించుకునే ప్రమాదమున్నదో న్యాయమూర్తులు గుర్తించే వుంటారు. అందుకే ఆ మార్గదర్శకాలు అత్యంత జాగ్రత్తగా రూపొందించారు. తిరిగి కోలుకునే అవకాశం లేదని, కేవలం వైద్య సాయంతో జీవచ్ఛవాల్లా బతుకీడ్చక తప్పదని గుర్తించిన రోగులకు ఇది వర్తిస్తుందని ధర్మా సనం తెలిపింది. అలాగే చికిత్స తీసుకునేముందే రోగి ఆ ప్రక్రియలో ఎదురుకాగల ప్రమాదాన్ని గుర్తించి, ఆ పరిస్థితి ఏర్పడిన పక్షంలో వైద్యాన్ని నిలిపేయటానికి అంగీకారం తెలిపే ముందస్తు ఆదేశం(ఏఎండీ)పై సంతకం చేసి ఇవ్వొచ్చు. దాన్ని ‘లివింగ్ విల్’గా పరిగణించాల్సి వుంటుంది. ఒకవేళ అది రోగి ఇవ్వలేని పక్షంలో వైద్యానికి ముందు ఆయన తరఫున కుటుంబంలోని పెద్ద ఎవరైనా ఏఎండీని అందజేయొచ్చు. దాని ఆధారంగా రోగికి అమర్చే ఆక్సిజన్ మాస్క్, వెంటిలేటర్, ఇతరేతర ఉపకరణాల వంటి ప్రాణావసర వ్యవస్థల్ని తొలగిస్తారు. అయితే ఈ ప్రక్రియ సవ్యంగా సాగడానికీ, ఎలాంటి లొసుగులకూ ఆస్కారం లేకుండా ఉండటానికీ ప్రతి ఆసుపత్రిలోనూ ముగ్గు రేసి సీనియర్ డాక్టర్లతో రెండు బోర్డులు ఏర్పాటుచేయాలి. ప్రాథమిక స్థాయి బోర్డు తన అభిప్రాయం చెప్పాక, సెకండరీ బోర్డు మరోసారి పరిశీలించాలి. జిల్లా వైద్యాధికారి ఈ నిర్ణయ ప్రక్రియలో పాలుపంచుకోవాలి. దీన్ని ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పరిశీలించాలి. ఆమోదించిన పక్షంలో ఆ సంగతిని హైకోర్టు రిజిస్ట్రార్‌కి తెలపాలి. ఇలాంటి అంశాల్లో కుటుంబ సభ్యుల మధ్యే ఏకాభిప్రాయం కుదరక పోవచ్చు. అందుకే విడివిడిగా అందరితో మాట్లాడటం, వారిఅంగీకారం విషయంలో ఇమిడి వున్న సమస్యలేమిటో చెప్పటం ఎంతో అవసరం.ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ ప్రక్రియ దుర్వినియోగమయ్యే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. డబ్బు కోసం, ఆస్తుల కోసం ఆరాటపడుతూ ఎంతకైనా తెగించే లోకంలో స్వపరభేదాలుండవు. ఇది గాక వైద్యానికి తడిసి మోపెడవుతుందన్న భయంవల్ల లేదా త్వరగా ‘వదుల్చుకోవాలన్న’ తొందర వల్ల వైద్యులను పక్కదోవ పట్టించే ప్రబుద్ధులుంటారు. కనుక ఈ సమస్య చుట్టూ అల్లుకుని వుండే చట్టపరమైన అంశాలు సరే... నైతిక, సామాజిక, ఆర్థిక అంశాలను సైతం తరచి చూడక తప్పదు. సమాజ పోకడలు ఎలా వుంటున్నాయో గమనించుకోక తప్పదు. ‘హుందాగా మరణించటం’ హక్కే కావొచ్చు... కానీ అది ‘మరణించటానికి గల హక్కు’గా పరిణమించకూడదు. ఈ ‘హక్కు’ నిస్సహాయ రోగుల పాలిట శాపంగా మారకూడదు. -
తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపుల ఎపిసోడ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ మంగళవారం నోటీసులు జారీ చేశారు. ఫిరాయింపుల ఫిర్యాదుపై.. లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని కోరారు. అయితే వివరణ ఇవ్వడానికి వాళ్లు గడువు కోరినట్లు సమాచారం. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి.. పది మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్‌లోకి వెళ్లారు. అయితే ఈ ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ న్యాయస్థానాలను ఆశ్రయించింది. కిందటి ఏడాది.. నాలుగు నెలల్లోగా ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయినా ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీంతో సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఇంకా ఎంత సమయం తీసుకుంటారని న్యాయస్థానం నిలదీసింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేలకు కనీసం నోటీసులు జారీ చేయించాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఇవాళ అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు పంపించారు. మరోవైపు.. ఫిరాయింపుల అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్లను కలిపి ఫిబ్రవరి 10వ తేదీన సుప్రీం కోర్టు విచారణ జరపనుంది.ధృవీకరించిన ఎమ్మెల్యేలుతమకు అసెంబ్లీ సెక్రెటరీ నుంచి నోటీసులు అందిన మాట వాస్తవమేనని పార్టీ మారిన ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, తెల్లం వెంకట్రావులు అన్నారు. ‘‘అసెంబ్లీ స్పీకర్ కార్యాలయ నుండి నోటీసులు ఇచ్చింది వాస్తవమే. న్యాయ నిపుణులను సంప్రదించి తగు నిర్ణయం చెప్పుతాం’’ అని మీడియాకు తెలిపారు.స్పీకర్‌తో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు అందిన వేళ.. ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిశారు. భేటీలో ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్ తదితరులు ఉన్నారు. అసెంబ్లీ సెక్రెటరీ నోటీసుల కారణంగా ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. -
‘ఎమ్మెల్యేల అనర్హత’పై 10న తదుపరి విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ చర్యలు తీసుకునేలా శాసనసభ స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై.. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహీపాల్‌రెడ్డి, అరికెపూడి గాందీలపై కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యే హరీశ్‌రావు తదితరులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్య రామసుందరం వాదనలు వినిపించగా.. ఏడుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలన్న ఈ పిటిషన్ ప్రతిని, ప్రతివాది అయిన తెలంగాణ స్పీకర్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీకి అందజేయాలని ధర్మాసనం ఆదేశించింది. బీఆర్ఎస్ను వీడిన మరో ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి గతంలో దాఖలైన పిటిషన్‌తో కేటీఆర్ పిటిషన్‌ను జత చేసింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్ పై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద్ పిటిషన్ వేశారు. దీనిపై గత శుక్రవారం విచారణ జరిపిన జస్టిస్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జి మాసి ధర్మాసనం..తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీపై అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేయడాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు.. ‘తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామంటే ఎంత కాలం? అసెంబ్లీ గడువు ముగిసే దశలో నిర్ణయం తీసుకుంటారా?’అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. -
TG: గ్రూప్-1 ఫలితాల వెల్లడికి ‘సుప్రీం’ గ్రీన్ సిగ్నల్
సాక్షి,న్యూఢిల్లీ:తెలంగాణ గ్రూప్-1 పరీక్ష ఫలితాల విడుదలకు లైన్ క్లియరైంది. గ్రూప్-1పై దాఖలైన రెండు పిటిషన్లను సోమవారం(ఫిబ్రవరి3) సుప్రీంకోర్టు కొట్టేసింది. గ్రూప్-1 నియామకాలపై వివిధ రకాల అభ్యంతరాలతో పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లన్నింటినీ సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఫలితాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అంతకముందు రాష్ట్ర హైకోర్టు తమ పిటిషన్లను కొట్టేయడంతో అభ్యర్థులు సుప్రీంను ఆశ్రయించారు.ఫలితాలు వెల్లడించడంపై తెలంగాణ ప్రభుత్వ వాదనతో సుప్రీంకోర్టు అంగీకరించింది. కేసుల అడ్డంకులు తొలగిపోవడంతో,త్వరలో టీజీపీఎస్సీ గ్రూప్-1 ఫలితాలు విడుదల చేయనుంది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 11 సంవత్సరాల తర్వాత గ్రూప్-1 పరీక్ష తొలిసారిగా జరగడం గమనార్హం.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 పరీక్ష ప్రశ్నాపత్రం లీకవడంతో రద్దయింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్-1 పరీక్షను మళ్లీ నిర్వహించింది. అయితే పరీక్షను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా పరీక్ష నిర్వహించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఫలితాలు వెల్లడించనున్నారు. -
ఫిరాయిపులపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఫిరాయింపు రాజకీయాలపై కేరళ ఉన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒక పార్టీపై గెలిచి.. మరో పార్టీలోకి వెళ్లాలనుకుంటే గనుక ముందుగా తమ పదవులకు రాజీనామా చేయాలని రాజకీయ నేతలకు సూచించింది.కూథట్టుకులమ్ మున్సిపల్ కౌన్సిలర్ కళా రాజును అపహరించి, దాడి చేసిన కేసులో ఐదుగురికి ఆ రాష్ట్ర హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా.. జస్టిస్ పివి కున్హికృష్ణన్ ఫిరాయింపులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రతినిధులు వారిని ఎన్నుకున్న ప్రజల అభీష్టానికి కట్టుబడి ఉండాల్సిందేనని వ్యాఖ్యానించారాయన.‘‘ఒక ప్రతినిధి రాజకీయ విధేయతను మార్చుకోవాలనుకుంటే(పార్టీ మారాలనుకుంటే).. ఆ వ్యక్తి మొదట రాజీనామా చేయాలి. ఇది ప్రజాస్వామ్యంలో నైతిక కోణం. అప్పుడే ఓటర్ల నమ్మకాన్ని ఏకపక్షంగా విచ్ఛిన్నం చేయకుండా ఉంటారు. అలా జరగకుంటే.. ప్రజల ప్రజల అభీష్టాన్ని అవమానించడమే అవుతుంది. అలాంటి ప్రజాప్రతినిధిని తర్వాతి ఎన్నికల్లో ఓడించం ద్వారా ప్రజలు తమ సత్తా చాటగలరు. ప్రజాస్వామ్యానికి ఉన్న అందం అదే కూడా’’ అని న్యాయమూర్తి అన్నారు.ప్రస్తుత కేసులో.. ప్రజాస్వామ్యబద్ధంగా సమస్యను పరిష్కరించుకోకుండా ఇరు వర్గాలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రజాప్రతినిధిని ఓడించాలంటే అది ఎన్నికల ద్వారానే.. హింస ద్వారా కాదు అని కోర్టు వ్యాఖ్యానించింది.తెలంగాణలో బీఆర్ఎస్ మీద నెగ్గిన ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన వ్యహారం సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగిన సంగతి తెలిసిందే. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలకు ఇంకెంత టైం కావాలంటూ తెలంగాణ స్పీకర్‌పై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. అదే సమయంలో ఇటు.. కేరళ హైకోర్టు కూడా ఫిరాయింపులపై ఈ తరహా వ్యాఖ్యలు చేయడం విశేషం.కేసు ఏంటంటే..సీపీఎం కౌన్సిలర్‌గా నెగ్గిన కళా రాజు ఆ తర్వాత యూడీఎఫ్‌లో చేరారు. అయితే అవిశ్వాస తీర్మానం వేళ.. ఓటేయకుండా తనను అడ్డుకున్నారని, బలవంతంగా ఎత్తుకెళ్లి మరీ దాడికి పాల్పడ్డారని సీపీఎం నేతల మీద ఆరోపణలకు దిగారామె. ఆ ఆరోపణలను సీపీఎం ఖండించింది కూడా. అయితే ఈ ఘటనపై కళా రాజు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో 45 మందిపై కేసు నమోదు చేశారు. వాళ్లలో ఐదుగురు ముందస్తు బెయిల్ కోరగా.. షరతులతో మంజూరు చేసింది కేరళ హైకోర్టు. -
రామోజీపై ‘రాజ’భక్తి!
సాక్షి, అమరావతి: తన రాజగురువు రామోజీరావు పట్ల టీడీపీ అధ్యక్షుడు, సీఎం నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) మరోసారి భక్తిని చాటుకున్నారు. సాక్షాత్తూ సుప్రీం కోర్టు స్వయంగా జోక్యం చేసుకుని.. మార్గదర్శి, రామోజీ ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేశారా? లేదా? అనే అంశాన్ని తేల్చాలని హైకోర్టును ఆదేశించగా.. చంద్రబాబు సర్కార్ దాన్ని పూర్తిగా విస్మరిస్తూ అక్రమాలకు పాల్పడ్డ రామోజీ కుటుంబాన్ని రక్షించడమే ఏకైక లక్ష్యంగా వ్యవహరించింది. తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్లో మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని యజమాని రామోజీరావు ప్రజల నుంచి చట్ట విరుద్ధంగా వసూలు చేసిన రూ.2,610 కోట్ల డిపాజిట్లు గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. ఆ అక్రమ డిపాజిట్ల గురించి వాస్తవాలను కోర్టుకు వెల్లడిస్తే మార్గదర్శి(Margadarsi), రామోజీ కుటుంబానికి ఇబ్బందులు తప్పవని గుర్తించడంతో చంద్రబాబు ప్రభుత్వం ఆ విషయం జోలికే వెళ్లలేదు. పైగా ప్రజల నుంచి డిపాజిట్ల రూపంలో అక్రమంగా వసూలు చేసిన రూ.వేల కోట్లను తిరిగి వారికి చెల్లించేశామని, అందువల్ల తమను వదిలేయాలంటూ మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని యజమాని రామోజీరావు(Ramoji Rao) ఇన్నేళ్లుగా కోర్టుల్లో చేస్తూ వస్తున్న వాదననే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం సైతం అందుకుంది. ప్రజల నుంచి వసూలు చేసిన డిపాజిట్ల మొత్తంలో రూ.5.15 కోట్లు మినహా అత్యధిక భాగాన్ని తిరిగి చెల్లించేసిందని ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. రూ.5.15 కోట్ల డబ్బు 1,270 మంది డిపాజిటర్లకు సంబంధించిందని, అయితే వారెవరూ ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేయడం లేదని ఏపీ ప్రభుత్వం తన కౌంటర్ ద్వారా హైకోర్టుకు తెలిపింది. ఎస్క్రో ఖాతాలో ఉన్న ఈ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు గానీ ఆర్బీఐకి గానీ బదలాయించాలంటూ వింత అభ్యర్థనను హైకోర్టు ముందుంచింది. ఎవరైనా డిపాజిటర్లు వస్తే వారికి ఆ మొత్తాలను తామే చెల్లిస్తామని ప్రతిపాదించింది. తద్వారా అక్రమ డిపాజిట్ల వ్యవహారం నుంచి రామోజీ కుటుంబాన్ని బయటపడేసేందుకు మార్గాన్ని సుగమం చేసేందుకు యత్నించింది. రామోజీరావు గత ఏడాది జూన్ 8న చనిపోయారంటూ ఆయన మరణాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. అసలు మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను కొనసాగించాల్సిన అవసరం ఉందా? అన్న దానిపై కూడా విచారణ జరపాలని కౌంటర్లో హైకోర్టుని కోరింది. దాటవేత ధోరణే... రామోజీరావు భారీ ఆర్థిక అవకతవకలపై చంద్రబాబు ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లో పూర్తి దాటవేత ధోరణిని ప్రదర్శించింది. ఈ కౌంటర్లో ఎక్కడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టంలోని సెక్షన్ 45ఎస్‌ను మార్గదర్శి, రామోజీరావు ఉల్లంఘించిన విషయం గురించి ప్రస్తావించనే లేదు. చట్ట విరుద్ధంగా రూ.వేల కోట్లను ప్రజల నుంచి డిపాజిట్లు రూపంలో మార్గదర్శి వసూలు చేసిందని స్వయంగా రిజర్వ్ బ్యాంకే చెప్పినా చంద్రబాబు సర్కారు ఆ అంశం జోలికి వెళ్లలేదు. డిపాజిట్లను వెనక్కి ఇచ్చేసిందని మాత్రమే చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. రామోజీరావు చట్ట విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేశారన్న విషయాన్ని మాత్రం చెప్పడం లేదు. మార్గదర్శిపై నాంపల్లి కోర్టులో ఎవరు ఫిర్యాదు చేశారు? ఆ తరువాత కోర్టుల్లో ఏమైంది? తిరిగి తెలంగాణ హైకోర్టు ఎందుకు విచారణ జరుపుతోంది? లాంటి అందరికీ తెలిసిన విషయాలనే కౌంటర్లో పొందుపరిచింది. అంతేకాక రామోజీ, మార్గదర్శి ఆర్థిక అవకతకవలపై అ«దీకృత అధికారిగా వ్యవహరిస్తున్న కృష్ణరాజు విచారణ జరపవచ్చో లేదో తేల్చాలని హైకోర్టును కోరింది. మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను కొనసాగించాల్సిన అవసరంపై కూడా విచారణ జరపాలని కౌంటర్లో కోరింది. చనిపోయారు కాబట్టి కేసు కొట్టేయండి... ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45 ఎస్కి విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేసినట్లు రుజువులు కూడా ఉండటం, విచారణ జరిగితే శిక్ష, భారీ జరిమానా ఖాయం కావడంతో రామోజీ మరణాన్ని అడ్డం పెట్టుకుని ఈ గండం నుంచి బయటపడాలని మార్గదర్శి ప్రస్తుత యాజమాన్యం భావిస్తోంది. అందులో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వం చేత తమకు కావాల్సిన విధంగా కౌంటర్ దాఖలు చేయించింది. రామోజీ మరణించారని ఏపీ ప్రభుత్వం చేత ప్రత్యేకంగా చెప్పించడమే కాకుండా ఇక ఈ కేసు విచారణను కొనసాగించాల్సిన అవసరం లేదన్న రీతిలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ పెద్దలు కౌంటర్లో రాయించారు. మరోవైపు మార్గదర్శి ఫైనానియర్స్ యాజమాన్యం కూడా ఇదే వాదనతో హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. రామోజీ మరణంతో ఇక ఈ కేసులో విచారించడానికి ఏమీ లేదని అందులో పేర్కొంది. ఈ కేసుపై విచారణ జరపడం నిష్ప్రయోజనమని పేర్కొంది. పూర్తిస్థాయి వాదనలకు ముందే ఈ విషయాన్ని తేల్చాలని తెలంగాణ హైకోర్టును కోరింది. హెచ్‌యూఎఫ్ కర్తగా ఉన్న రామోజీ మరణించడంతో ఆ హెచ్‌యూఎఫ్‌లో సభ్యులుగా ఉన్న వారికి నేరాన్ని ఆపాదించడాన్ని వీల్లేదని నివేదించింది. వసూలు చేశాం... వెనక్కి ఇచ్చేశాం ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా తాము ప్రజల నుంచి రూ.2,596.98 కోట్లు అక్రమంగా వసూలు చేసిన మాట వాస్తవమేనని మార్గదర్శి ఫైనాన్షియర్స్ హైకోర్టు ముందు అంగీకరించింది. వసూలు చేసిన డిపాజిట్లలో అత్యధిక మొత్తాన్ని తిరిగి చెల్లించేశామని, మిగిలి ఉన్న మొత్తాన్ని ఎస్క్రో ఖాతాలో ఉంచామంది. ఈమేరకు ఆర్బీఐ కౌంటర్‌కు మార్గదర్శి ఫైనాన్షియర్స్ తిరుగు సమాధానం ఇచి్చంది. విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ నర్సింగ్‌రావు మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్థిక అవకతవకలకు సంబంధించి జరుగుతున్న విచారణ నుంచి న్యాయమూర్తి జస్టిస్ నర్సింగ్‌రావు తప్పుకున్నారు. గతంలో తాను మార్గదర్శి తరఫున దాఖలైన కేసుల్లో న్యాయవాదిగా ఉన్నానని, అందువల్ల ఈ వ్యాజ్యంపై విచారణ జరపలేనని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యాజ్యాలను తగిన ధర్మాసనం ముందుంచేందుకు వీలుగా ప్రధాన న్యాయమూర్తి (సీజే) ముందుంచాలని జస్టిస్ శ్యాంకోషి, జస్టిస్ నర్సింగరావు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణ తేదీని, విచారణ ధర్మాసనాన్ని ప్రధాన న్యాయమూర్తి నిర్ణయించనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మార్గదర్శి అక్రమ డిపాజిట్ల సేకరణపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలు శుక్రవారం జస్టిస్ శ్యామ్ కోషి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. మార్గదర్శి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ లూద్రా, కోర్టు సహాయకుడిగా మాజీ ఎంపీ అరుణ్‌కుమార్, ఏపీ స్పెషల్ జీపీ రాజేశ్వర్‌రెడ్డి, తెలంగాణ పీపీ పల్లె నాగేశ్వర్రావు విచారణకు హాజరయ్యారు. రామోజీ మరణించిన నేపథ్యంలో ఈ కేసును కొట్టేయాలని, దీనిపై అనుబంధ పిటిషన్ దాఖలు చేశామని రోహత్గీ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ముకుల్ రోహత్గీ చేసిన ఈ అభ్యర్థన పెద్ద చర్చనీయాంశంగా మారింది. భారీ ఆరి్థక నేరానికి పాల్పడిన వ్యక్తి చనిపోయినంత మాత్రాన అతను నేరం చేయనట్లుగా భావించాల్సిన అవసరం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కాగా హైకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్ కౌంటర్ దాఖలు చేయగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఐడీ, ఆర్థిక నేరాల విభాగం ఎస్పీ కొల్లి వెంకట లక్ష్మీ కౌంటర్ దాఖలు చేశారు. బాబు బాటలోనే రేవంత్...ప్రజల నుంచి మార్గదర్శి చట్టవిరుద్ధంగా రూ.2,610 కోట్లు వసూలు చేసిన వ్యవహారంలో రేవంత్‌రెడ్డి సర్కార్ సైతం చంద్రబాబు బాటనే ఎంచుకుంది. రామోజీరావు, మార్గదర్శి అక్రమ డిపాజిట్ల గురించి తెలంగాణ ప్రభుత్వం కూడా నోరు మెదప లేదు. రూ.2610 కోట్లను మార్గదర్శి వసూలు చేయడం చట్ట విరుద్ధమా? కాదా? అన్న విషయం గురించి కనీస స్థాయిలో కూడా మాట్లాడలేదు. చట్టవిరుద్ధ డిపాజిట్ల గురించి మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని యజమానికి ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు కలగకుండా అటు చంద్రబాబు ప్రభుత్వం, ఇటు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చాలా లౌక్యంగా, వాస్తవాల జోలికి వెళ్లకుండా కౌంటర్లు దాఖలు చేశాయి. అందరికీ తెలిసిన, కోర్టుల్లో ఇప్పటి వరకు జరిగిన విషయాలనే తెలంగాణ ప్రభుత్వం తన కౌంటర్లో వివరించింది. వాస్తవానికి మార్గదర్శిపై నాంపల్లి కోర్టులో అ«దీకృత అధికారి కృష్ణరాజు ఫిర్యాదు ఎందుకు దాఖలు చేశారు? మార్గదర్శి, రామోజీపై ఉన్న ఆరోపణలు ఏంటి? ఆర్బీఐ ఏం చెప్పింది? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? తెలంగాణ హైకోర్టు ఏం చెప్పింది? తదితర వివరాలను తమ కౌంటర్లలో పూర్తిస్థాయిలో పొందుపరిచే అవకాశం ఉన్నప్పటికీ గురుశిష్యుల ప్రభుత్వాలు రామోజీపై తమ భక్తిని చాటుకుంటూ కౌంటర్లు దాఖలు చేశాయి. ‘‘45 ఎస్’’ ఏం చెబుతోందంటే..?నిర్దిష్ట వ్యక్తులు, సంస్థలు, ఇన్కార్పొరేటెడ్ సంఘాలు తమ వ్యాపార కార్యకలాపాల నిమిత్తం ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934లోని సెక్షన్ 45 ఎస్ నిషేధిస్తుంది. -
ఆలయాల్లో వీఐపీ సంస్కృతిని అరికట్టేలా మార్గదర్శకాలు జారీ చేయలేం
న్యూఢిల్లీ: దేవాలయాల్లో చాలా ముఖ్యమైన వ్యక్తులకు(వీఐపీలు) అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ రాచమర్యాదలు చేస్తూ ప్రత్యేక దర్శనాలు కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) సుప్రీంకోర్టు తిరస్కరించింది. బృందావన్‌లోని శ్రీరాధా మదన్మోహన్ ఆలయంలో సేవాయత్‌గా పని చేస్తున్న విజయ్‌కిశోర్ గోస్వామి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆలయాల్లో వీఐపీలకు ప్రత్యేక మర్యాదలు చేయడం, సామాన్యులు ప్రత్యేక దర్శనం చేసుకోవాలంటే అదనంగా రుసుము వసూలు చేయడాన్ని ఆయన సవాలు చేశారు. 12 జ్యోతిర్లాంగాల్లో వీఐపీ దర్శనాల సంస్కృతి విపరీతంగా ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆలయాల్లో వీఐపీ సంస్కృతిని అరికట్టేలా ప్రభుత్వాలను ఆదేశించాలని కోరారు. పౌరులంతా సమానమేనని రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 సూచిస్తున్నట్లు గుర్తుచేశారు. దర్శనాలకు అదనంగా రుసుము వసూలు చేయడం సమానత్వ హక్కులను, మత స్వేచ్ఛను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. విజయ్‌కిశోర్ గోస్వామి పిటిషన్ శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వచ్చింది. దేవాలయాల్లో వీఐపీ సంస్కృతిని అరికట్టేలా ప్రభుత్వాలను ఆదేశిస్తూ తాము మార్గదర్శకాలు జారీ చేయలేమని ధర్మాసనం తేల్చిచెప్పింది. సమస్యను పరిష్కరించడానికి సమాజం, ఆలయ మేనేజ్మెంట్ కమిటీలే చొరవ తీసుకోవాలని సూచించింది. ఆలయాల్లో ప్రముఖులకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదని, భక్తులందరినీ సమానంగా చూడాలన్న అభిప్రాయం తమకు కూడా ఉందని పేర్కొంది. కానీ, మార్గదర్శకాలు మాత్రం జారీ చేయలేమని వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 పరిధిలోకి ఈ కేసు వస్తుందని తాము భావించడం స్పష్టంచేసింది. పిటిషన్‌ను విచారించలేం కాబట్టి తిరస్కరిస్తున్నామని తెలియజేసింది. అయితే, పిటిషన్‌ను కోర్టు తిరస్కరించడం అనేది వీఐపీ సంస్కృతిని అరికట్టే సంబంధిత అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోకుండా అడ్డుకోలేదని ఉద్ఘాటించింది. ఆలయాల్లో వీఐపీలకు ప్రత్యేక మర్యాదలు చేయకుండా స్థానికంగా చర్యలు తీసుకోవచ్చని పరోక్షంగా తేల్చిచెప్పింది. -
రఘురామ కృష్ణంరాజు కేసులో డాక్టర్ ప్రభావతికి ఊరట
ఢిల్లీ : సీఐడీ కస్టడీలో తనను తీవ్రంగా వేధించారంటూ రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేసిన కేసుకు సంబంధించి డాక్టర్ ప్రభావతికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. డాక్టర్ ప్రభావతి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే సమయంలో తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.ఈ కేసులో ముందస్తు బెయిల్‌పై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభావతి సుప్రీంలో పిటిషన్ వేశారు. ఈరోజు (శుక్రవారం) ప్రభావతి దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ చేపట్టింది. ముందస్తు బెయిల్‌పై హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. విచారణకు సహకరించాలని డాక్టర్ ప్రభావతికి ఆదేశించింది. డాక్టర్ ప్రభావతి పిటీషన్‌పై రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశిస్తూ.. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.సీఐడీ కస్టడీలో తనను తీవ్రంగా వేధించారంటూ గుంటూరులోని నగరంపాలెం పోలీసులకు గతంలో రఘురామ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రభావతిని ఏ5గా పేర్కొన్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా ఆమె తప్పుడు నివేదిక ఇచ్చారంటూ రఘురామ ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. -
ఆర్జీకర్ కేసులో కీలక మలుపు
కోల్‌కతా ఆర్జీకర్ హత్యాచార కేసులో న్యాయ పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో దోషి సంజయ్‌కు సీల్దా కోర్టు జీవితఖైదు విధించిన సంగతి తెలిసిందే. అయితే నిందితుడికి ఈ శిక్ష సరిపోదని, మరణశిక్ష విధించాలనే అభ్యర్థన ఉన్నతన్యాయస్థానం ఎదుటకు చేరింది. అయితే సంజయ్‌కు ఉరిశిక్ష పడడం తమకు ముఖ్యం కాదని, ఈ నేరంలో భాగమైన వాళ్లందరి పేర్లు బయటకు రావాలని అభయ(బాధితురాలి) తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.అభయ తల్లిదండ్రులు గురువారం పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్‌ను కలిశారు. తమ ఆవేదనను(ఫిర్యాదును) రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అందుకు అంగీకరించిన ఆయన.. అవసరమైతే వాళ్ల అప్పాయింట్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేస్తానని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ సైతం అభయం తల్లిదండ్రుల్ని కలిసి.. వాళ్ల పోరాటానికి మద్దతుగా నిలుస్తానని ప్రకటించారు.అభ్యంతరాలు దేనికి?..ఈ కేసులో దర్యాప్తు జరిగిన తీరుపై అభయ తల్లిదండ్రులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అటు.. ఈ కేసులో ఆధారాలను కోల్‌కతా పోలీసులు నాశనం చేశారని ఆరోపించారు. ఇటు.. సీబీఐ జరిపిన దర్యాప్తుపైనా తీవ్ర అసంతృప్తి ప్రకటించారు. ఈ నేరంలో సంజయ్ ఒక్కడే భాగం కాదని, ఇంకా బయటకు రావాల్సిన పేర్లు ఉన్నాయని వాళ్లు చెబుతున్నారు. కోల్‌కతా పోలీసులు ఆస్పత్రి నిర్వాహకులతో కలిసి కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేశారని ఆరోపిస్తున్నారు. కేసు విచారణలో భాగంగా.. తొలి ఐదురోజులు దర్యాప్తు జరిగిన తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయంలోనే ఈ కేసుకు సంబంధించిన కీలకమైన ఆధారాలను ఉద్దేశపూర్వకంగానే నాశనం చేశారని అంటున్నారు.సుప్రీంలో పిటిషన్ వెనక్కిఆర్జీకర్ కేసులో మళ్లీ విచారణ జరిపించాలని అభయ తల్లిదండ్రులు సర్వోన్నత న్యాయస్థానంలో ఓ పిటిషన్ చేశారు. అయితే బుధవారం ఈ పిటిషన్‌ను వాళ్లు వెనక్కి తీసుకున్నారు. కిందటి ఏడాది ఆగష్టులో సుప్రీం కోర్టు ఈ ఘటనను సుమోటోగా విచారణకు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ విచారణలో తమను భాగం చేయాలని Intervention Application ద్వారా అభయ తల్లిదండ్రులు అభ్యర్థించారు. కానీ, ఈ కేసులో సంజయ్‌కు శిక్షపడక ముందే కలకత్తా హైకోర్టులో ‘ఫ్రెష్ విచారణ’ కోరుతూ ఓ పిటిషన్ వేశారు. ఇప్పుడు ఈ విషయం తమ పరిశీలనలో గుర్తించిన సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం.. పిటిషనర్ తరఫు మహిళా న్యాయవాదిని హెచ్చరించింది. సత్వరమే పిటిషన్ వెనక్కి తీసుకుని.. కావాలనుకుంటే కొత్తగా పిటిషన్ వేయాలని సూచించింది. దీంతో.. అభయ తల్లిదండ్రులు ఆ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.ఇక ఆర్జీకర్ కేసులో.. సంజయ్ రాయ్‌కు మరణశిక్ష విధించాలంటూ బెంగాల్ ప్రభుత్వం, సీబీఐలు వేర్వేరుగా పిటిషన్లు వేశాయి. అయితే ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో పిటిషన్ల విచారణకు స్వీకరించే అంశంపై విచారణ జరిపి.. తీర్పును కలకత్తా హైకోర్టు రిజర్వ్ చేసింది. -
తాత్కాలిక జడ్జీలను నియమించుకోండి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా హైకోర్టులో 18 లక్షలకుపైగా క్రిమినల్ కేసులు పోగుబడటంతో ఆ కేసుల కొండ కరిగించేందుకు హైకోర్టులకు సుప్రీంకోర్టు అదనపు అధికారాలిచ్చింది. సొంతంగా తాత్కాలిక ప్రాతిపదికన న్యాయమూర్తులను నియమించుకునేందుకు హైకోర్టులకు సర్వోన్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. రెండు లేదా మూడేళ్ల కాలానికి జడ్జీల నియామకానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ల ధర్మాసనం గురువారం ఉత్తర్వులిచ్చింది. హైకోర్టుల్లో ఇలా అదనపు జడ్జీల నియాకంపై 2021 ఏప్రిల్ 20వ తేదీన విధించిన షరతుల అమలును తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ‘‘హైకోర్టుల వారీగా ఆ కోర్టులో అనుమ తించిన సామర్థ్యంలో 10 శాతానికి మించి తా త్కాలిక జడ్జీలను తీసుకోవద్దు. ఇద్దరు లేదా ఐదుగురు జడ్జీలను తీసుకోండి. సిట్టింగ్ జడ్జి సూ చించిన ధర్మాసనంలో కొత్త జడ్జీలు కూర్చోవాలి. పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులను మాత్రమే వినాలి. డివిజన్ బెంచ్‌లో భాగ స్వాములుగా ఉన్నాసరే శాశ్వత జడ్జీలతోపాటు కాకుండా విడిగా కూర్చుని కేసులను పరిష్కరించాలి’’ అని సుప్రీంకోర్టు గురువారం స్పష్టంచేసింది. షరతులను విధిస్తూ గతంలో నాటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్ఏ బోబ్డే ఆ తీర్పు చెప్పారు. రిటైర్ అయిన హైకోర్టు జడ్జీలను కేవలం ఒక్కసారి మాత్రమే రెండు లేదా మూడేళ్ల కాలానికి తాత్కాలిక జడ్జీగా నియమించుకోవచ్చని ఆయన తీర్పు చెప్పడం తెల్సిందే. నేషనల్ జుడీషియల్ డేటా ప్రకారం దేశవ్యాప్తంగా హైకోర్టులో 62 లక్షల కుపైగా కేసులు పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాయి. వీటిలో 18 లక్షలకు పైగా క్రిమినల్ కేసులున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 224ఏ ప్రకారం గతంలో హైకోర్టులో జడ్జిగా చేసి రిటైర్ అయిన వాళ్లను అవసరమైతే తిరిగి తాత్కాలిక జడ్జీలుగా నియమించవచ్చు. అయితే ఈ నిబంధనను కేంద్రప్రభుత్వం అత్యంత అరుదుగా వినియోగించుకుందని ఇటీవల సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.