![Big Relief To Mohan Babu In Supreme Court](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/Mohan-Babu.jpg.webp?itok=W5mqjvPj)
జర్నలిస్ట్‌పై దాడి కేసులో టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్‌బాబుకు సుప్రీం కోర్టు(preme Court)లో భారీ ఊరట లభించింది.ఈ కేసులో మోహన్‌బాబు(Mohan Babu)కి ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. గురువారం ఉదయం ఈ కేసు విచారణ చేపట్టిన జస్టిస్ సుదాంత్ దులియా ధర్మాసనం.. మోహన్‌బాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
అసలేం జరిగింది?
మోహన్ బాబు కుటుంబంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. మోహన్ బాబు, ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేశారు. హైదరాబాద్ జల్ పల్లిలోని నివాసం వద్ద 2024 డిసెంబర్ 10న జర్నలిస్టుపై మోహన్ బాబు మైక్ తో దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి మోహన్ బాబుపై పహాడిషరీఫ్ పోలీసులకు బాధిత జర్నలిస్టు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే మోహన్ బాబు తనపై నమోదైన ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ముందుగా హైకోర్టును ఆశ్రయించారు. కానీ 2024 డిసెంబరు 23న హైకోర్టు రిజెక్ట్ చేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరగగా.. ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
కేసు విచారణ సందర్భంగా కావాలని తాను జర్నలిస్టుపై దాడి చేయలేదని సుప్రీంకోర్టుకు మోహన్ బాబు తెలిపారు. కుటుంబ గొడవల నేపథ్యంలో ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నామని చెప్పారు. బాధిత జర్నలిస్టుకు నష్టపరిహారం ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment