ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నా : మంచు మనోజ్‌ | Manchu Manoj Says I Am Fighting For Self Respect | Sakshi
Sakshi News home page

ఆస్తుల కోసం కాదు.. ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నా : మంచు మనోజ్‌

Published Tue, Dec 10 2024 12:02 PM | Last Updated on Tue, Dec 10 2024 1:20 PM

Manchu Manoj Says I Am Fighting For Self Respect

టాలీవుడ్‌ సీనియర్‌ హీరో మంచు మోహన్‌ బాబు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. తనపై దాడి చేశారని మంచు మనోజ్‌.. చిన్న కొడుకు మనోజ్‌తో ప్రాణ హానీ ఉందని మోహన్‌ బాబు ఒకరిపై ఒకరు పోలీసుకు ఫిర్యాదు చేసుకున్నారు. మరోవైపు హైదరాబాద్‌ శివార్లలోని జల్‌పల్లిలో ఉన్న మోహన్‌ బాబు ఫామ్‌హౌస్‌ ‘మంచు టౌన్‌’కి మనోజ్‌తో పాటు మంచు విష్ణు కూడా బౌన్సర్లను పంపించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వచ్చి బౌన్సర్లను బయటకు పంపించారు.

(చదవండి: చిన్న తగాదా ఇది.. పరిష్కరించుకుంటాం: మోహన్‌ బాబు)

 అయితే తన అనుచరులను మాత్రమే పోలీసులు బెదిరిస్తున్నాడని మంచు మనోజ్‌ ఆరోపించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తన అనుచరుల పేర్లు రాసుకొని మరీ బయటకు పంపిస్తున్నారని, వాళ్ల(మోహన్‌ బాబు, విష్ణు) బౌన్సర్లను మాత్రం లోపలికి పంపిస్తున్నారని ఆరోపించారు. ‘నేను డబ్బు కోసమో, ఆస్తుల కోసమో పోరాటం చేయడం లేదు.. ఆత్మ గౌరవం కోసం పోరాడుతున్నాను. నా బిడ్డలు ఇంట్లో ఉండగా ఇలా చేయడం సరికాదు. న్యాయం కోసం అందరిని కలుస్తాను’ అని మంచు మనోజ్‌ మీడియాతో తెలిపారు. అనంతరం భార్యతో కలిసి మోహన్‌బాబు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. 

Manchu Manoj: ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement